Himalayan Tour
-
Mahima Mehra: స్వచ్ఛందాల మహిమాలయం
హిమాలయాలు అంటే మంచు అందాలు గుర్తు రావచ్చు. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియవచ్చు. మరోవైపు చూస్తే... అందమైన హిమాలయప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో పేదరికరం ఉంది. నిరక్షరాస్యత ఉంది. నిరుద్యోగం ఉంది. వ్యసనాలు ఉన్నాయి. చుట్టపు చూపుగా హిమాలయాలకు వెళ్లాలనుకోలేదు మహిమ మెహ్ర.వారిలో ఒకరిగా బతకాలనుకుంది. వారి బతుకు బండికి కొత్త దారి చూపాలనుకుంది.పుణె, దుబాయ్‌లలో బోధన రంగంలో దశాబ్దకాలం పనిచేసింది మహిమ మెహ్ర. పుణెలోని ‘స్పెక్ట్రమ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, నిరుపేద ప్రజల కోసం పనిచేసిన మహిమ తన సేవాకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, పర్యావరణ స్పృహకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భిన్నమైన సంస్కృతి, భిన్నమైన వాతావరణం మధ్య పనిచేయాలనే ఆసక్తి మహిమను లద్దాఖ్‌కు తీసుకువెళ్లింది. ఈ హిమాలయప్రాంతానికి రావడంతో ఆమె జీవితమే మారి΄ోయింది.‘ఇది నా జీవితాన్ని మార్చిన ప్రయాణం. ఇక్కడ నేను అవసరమైన వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాను’ అంటుంది మహిమ. సేవాకార్యక్రమాలు చేయడానికి పట్టణాలు లేదా పల్లెలను ఎంపిక చేసుకుంటారు. హిమాలయప్రాంతం మారుమూలలో నివసిస్తున్న వారిపై తక్కువమంది దృష్టి పడుతుంది. వీరి గురించి తెలుసుకున్న తరువాత మార్పు తీసుకురావాలనే తపన మహిమలో మొదలైంది. ఆ తపనే వందలాది మంది జీవితాల్లో వెలుగు తీసుకువచ్చింది.‘నగరానికి చెందిన వారు గ్రామీణ్రపాంత ప్రజలతో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటారు. గ్రామీణ ప్రజలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించడం ఆ మార్పులో ఒకటి’ అంటుంది మహిమ మెహ్ర.హిమాలయప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో పనిచేయాలనుకున్నప్పుడు వారి గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంది మహిమ. ఒక ఆన్లైన్ సెషన్లో మహిమకు పంకీ సూద్ పరిచయం అయ్యాడు. సూద్ ద్వారా హిమాలయప్రాంత ప్రజల గురించి మహిమకు కొంత అవగాహన వచ్చింది.‘కులు లోయలోని పిల్లల కోసం మీరు కొన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తే బాగుంటుంది’ అని సూచించాడు సూద్. వెంటనే అక్కడికి వెళ్లి వర్క్‌షాప్‌లు మొదలు పెట్టింది. ఈ వర్క్‌షాప్‌లకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వచ్చేవాళ్లు. ఆ తరువాత ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ను మొదలుపెట్టింది. ఈ సెంటర్ కోసం ఉపాధ్యాయుల సహకారం అవసరం కావడంతో ఫేస్బుక్ పేజీ ్రపారంభించింది.వాలంటీర్లను ఆహ్వానించింది. మొదట్లో 10 ఆ తరువాత... 15...ఆ తరువాత 50 నుంచి 500 వరకు వాలెంటీర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ‘సన్‌షైన్ లెర్నింగ్’ తరఫున పనిచేయడానికి 24,500 పైగా వాలెంటీర్లు ఉన్నారు.ఈ అనూహ్యమైన స్పందనే ‘హిమాలయన్ వాలంటీర్ టూరిజం’ ఏర్పాటుకు దారి తీసింది. హిమాలయప్రాంతంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేవి హిమాలయన్ వాలంటీర్ టూరిజం(హెచ్విటీ) లక్ష్యాలు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ‘హెచ్విటీ’ మొదటి ్రపాజెక్ట్ మొదలైంది. నాలుగు గ్రామాల నుంచి ఎంతోమంది ‘హెచ్విటీ’ వర్క్‌షాప్‌లకు హాజరయ్యారు. లెర్నింగ్ యాక్టివిటీస్‌లో భాగం అయ్యారు.డిగ్రీ చేసిన అమ్మాయిలు ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ ద్వారా ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకొని నామమాత్రం వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ‘హెచ్విటీ’ హిమాలయాలలోని ఎన్నోప్రాంతాలలో స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 50 పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది. పది టాయ్ లైబ్రరీలను, 35కి పైగా పుస్తక లైబ్రరీలను ఏర్పాటు చేసింది. విద్యకు సంబంధించిన వర్క్‌షాప్‌లు మాత్రమే కాకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి, వృత్తి విద్యకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు హిమాలయప్రాంతంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి.అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారు. చదువుపైనే కాదు రివర్స్ మైగ్రేషన్, ఆర్థిక స్థిరత్వం, రెవెన్యూ జెనరేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. హిమాలయప్రాంతాల్లో పనిచేయాలనే తన ఆలోచన విన్న కొందరు.... ‘అంత దూరం వెళతావా!’ అని ఆశ్చర్య΄ోయారు. అలా ఆశ్చర్య΄ోయిన వారే ఇప్పుడు ‘ఇంత మార్పు తీసుకువచ్చావా’ అని మహిమ మెహ్రను అభినందిస్తున్నారు. -
‘ప్రతి ఏడాది అడవిలో 5 రోజులుండేవాడిని’
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్నప్పుడు వంట చేయడమే కాక పాత్రలను కూడా శుభ్రం చేసివాడినంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను యువకుడిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. మోదీ మాట్లాడుతూ.. ‘పదిహేడేళ్ల వయసులో హిమాలయాలకు వెళ్లి దాదాపు రెండేళ్లపాటు అక్కడే గడిపాను. ఈ పర్యట వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. మోదీ మాట్లాడుతూ.. ‘ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అహ్మదాబాద్ వెళ్లాను. అంత పెద్ద నగరంలో జీవించడం అదే మొదటిసారి. అక్కడ ఉన్న మా బంధువుల క్యాంటీన్లో కొన్ని రోజులు పనిచేశాను. అదే సమయంలో ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారాను. అప్పుడే ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఇతరులతో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని శుభ్రం చేయడం.. టీ,ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి పనులన్ని చేసేవాడిన’న్నారు. అయితే రోజువారి కార్యక్రమాలలో పడిపోయి జీవితంలో సంపాదించుకున్న ప్రశాంతతను కోల్పోకూడదని భావించేవాడిని. అందుకే కొన్ని రోజుల పాటు అడవిలోకి వెళ్లి ఒంటరిగా గడిపేవాడనని తెలిపారు మోదీ. ఈ విషయం గురించి మోదీ మాట్లాడుతూ.. ‘యువకుడిగా ఉన్నప్పుడు ఏటా దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లిపోయి, ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడిని. దీనికోసం స్వచ్ఛమైన నీరు ఉన్న చోటును ఎంచుకునేవాడిని. అంతేకాక 5 రోజులకు సరిపడా ఆహారం వెంట తీసుకెళ్లేవాడిని. ఈ ఐదు రోజులు రేడియో, దినపత్రికలు ఏమీ లేకుండా గడిపేవాడినని తెలిపారు మోదీ. ఇలా చేయడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు మోదీ. అయితే కొద్ది రోజుల తర్వాత తాను అడవికి వెళ్తున్నానే విషయం మిగతా వారికి తెలిసి పోయిందన్నారు. దాంతో వారు నన్ను ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని అడిగేవారు. అందుకు నేను ‘నన్ను నేను తెలుసుకునేందుకు వెళ్తున్నాను’ అని చెప్పేవాడినని తెలిపారు మోదీ. యువతకు కూడా ఇదే సలహా ఇచ్చారు మోదీ. రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం మీతో మీరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందంటూ మోదీ యువతకు సలహా ఇచ్చారు. అప్పుడే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారన్నారు. అప్పడు మీపై మీకు నమ్మకం పెరుగుతుందని, ఇతరులు మీ గురించి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలుగుతారని సూచించారు. మీకు మీరే ప్రత్యేకమని, ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడొద్దని మోదీ పేర్కొన్నారు. -
ఆ ప్రశ్నలకు జవాబు చెప్పను!: రజనీ
సాక్షి, శ్రీనగర్: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించినా.. పార్టీ పేరు గానీ, విధి విధానాలు గానీ ఖరారు చేయలేదు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు హిమాలయాలకు పర్యటనకు వెళ్లారు రజనీ. అందులో భాగంగా ముందుగా హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలను రజనీ దర్శించుకుంటున్నారు. శివ్ఖోరి, రియాసిలో కొందరు మీడియా ప్రతినిధులు రజనీని కలిసి రాజకీయాలపై ప్రశ్నించారు. ఎంతో చిర్రెత్తుకొచ్చినా రజనీ చాలా ప్రశాంతంగా బదులిచ్చారు. ‘నేను ఆధ్యాత్మిక వ్యక్తిని. జమ్ముకశ్మీర్ నుంచి తర్వాత రిషికేష్ వెళ్తాను. నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానో.. ఆ రోజు మీరు అడిగిన రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను. అప్పటివరకూ నేను ఏ రాజకీయ ప్రశ్నలు, పరిస్థితులపై స్పందిచాలని భావించడం లేదని’ రజనీ స్పష్టం చేశారు. కాగా, తాను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హిమాలయాలకు వెళ్లి బాబా ఆశీస్సులు పొందే రజనీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో హిమాలయ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా సిమ్లా, ధర్మశాలను సందర్శించుకున్న రజనీ తర్వాత రిషికేశ్కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక రాజకీయ పార్టీ పేరు, సిద్ధాంతాలు ప్రకటిస్తారని తమిళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
హిమాలయాలకు రజనీకాంత్!
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈయన ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఒక్క సినిమాల విషయంలోనే కాదు.. ఆయన వ్యకిగత జీవితానికి కూడా వర్తిస్తుంది. మనసు బాగోలేకపోతే అందరూ గుడికి వెళతారు కానీ రజనీ మాత్రం హిమాలయాలకు వెళతారు. రోజుల కొద్ది అక్కడే ధ్యానం చేస్తూ గడుపుతారు. ఇప్పుడు కూడా హిమాలయాలకు ప్రయాణమవుతున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవలే ఆయన ప్రకటించారు. ఇంత వరకు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించని రజనీ తన రాజకీయ ప్రయాణానికి ముందు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకుంటున్నారు. కొద్ది రోజులు హిమాలయాల్లోని బాబా గుహల్లో గడపనున్నారు. చెన్నై నుంచి సిమ్లాకు, అక్కడి నుంచి కేదారినాధ్ మీదుగా హిమాలయాల్లోని బాబా గుహలకు చేరుకుంటారు. -
నా చిత్రాన్ని అడ్డుకునే కుట్ర
నా చిత్ర విడుదలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని నటుడు శింబు ఆరోపించారు. ఈయన నటించిన ఇదు నమ్మ ఆళు, వాలు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణంలో జాప్యం జరిగిన ఈ చిత్రాల్లో ఒకటైన వాలు చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వలన ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు మేలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ విషయం తెలిసిన ఆ చిత్ర హీరో శింబు ఆవేదనకు గురయ్యారు. ఆయన మాట్లాడుతూ తాము చేసే వృత్తిపై ఇతరులకు నమ్మకం ఉంటుందో లేదో తెలియదు గానీ తనకు మాత్రం పూర్తి నమ్మకం ఉందన్నారు. తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయినా దీనిపై తాను భయపడనన్నారు. శింబు చిత్రం విడుదలై చాలా కాలమైంది. దీంతో మనస్థాపానికి గురైన శింబు వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం పుట్టిస్తున్నాయి. ఆ మధ్య వివాదాలకు గురైన శింబు మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల అలాంటి సంఘటనలకు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ ఆయన కుట్ర లాంటి వ్యాఖ్యలతో వార్తల్లోకి రావడం విశేషం.