నా చిత్రాన్ని అడ్డుకునే కుట్ర | my movie stop Conspiracy says simbu | Sakshi
Sakshi News home page

నా చిత్రాన్ని అడ్డుకునే కుట్ర

Published Wed, Mar 18 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

నా చిత్రాన్ని అడ్డుకునే కుట్ర

నా చిత్రాన్ని అడ్డుకునే కుట్ర

నా చిత్ర విడుదలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని నటుడు శింబు ఆరోపించారు. ఈయన నటించిన ఇదు నమ్మ ఆళు, వాలు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణంలో జాప్యం జరిగిన ఈ చిత్రాల్లో ఒకటైన వాలు చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వలన ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు మేలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
 
 ఈ విషయం తెలిసిన ఆ చిత్ర హీరో శింబు ఆవేదనకు గురయ్యారు. ఆయన మాట్లాడుతూ తాము చేసే వృత్తిపై ఇతరులకు నమ్మకం ఉంటుందో లేదో తెలియదు గానీ తనకు మాత్రం పూర్తి నమ్మకం ఉందన్నారు. తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయినా దీనిపై తాను భయపడనన్నారు. శింబు చిత్రం విడుదలై చాలా కాలమైంది. దీంతో మనస్థాపానికి గురైన శింబు వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం పుట్టిస్తున్నాయి. ఆ మధ్య వివాదాలకు గురైన శింబు మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల అలాంటి సంఘటనలకు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ ఆయన కుట్ర లాంటి వ్యాఖ్యలతో వార్తల్లోకి రావడం విశేషం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement