ప్లే బాయ్ హిట్ కొట్టాడు | Tamil Play Boy simbu Dashing Comeback | Sakshi
Sakshi News home page

ప్లే బాయ్ హిట్ కొట్టాడు

Published Tue, May 31 2016 8:21 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ప్లే బాయ్ హిట్ కొట్టాడు

ప్లే బాయ్ హిట్ కొట్టాడు

కోలీవుడ్ హీరో శింబు టైం ప్రస్తుతం అంతగా బాలేదు. చాలా రోజులుగా సరైన హిట్ లేక కెరీర్ పరంగా కష్టాల్లో ఉన్న ఈ యంగ్ హీరో, ఈ మధ్య కాలంలో వివాదాలతో మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. బీప్ సాంగ్ వివాదంతో కొంత కాలం సినిమాలకు, మీడియాకు దూరమవ్వటంతో అతని సినిమాల రిలీజ్లు కూడా వాయిదా పడ్డాయి. ముఖ్యంగా తన మాజీ ప్రేయసి నయనతారతో కలిసి నటించిన ఇదు నమ్మ ఆలు సినిమాను రిలీజ్ చేయడానికి ఏకంగా మూడేళ్ల సమయం పట్టింది.

అయితే ఈ నెల 20న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఇదు నమ్మ ఆలు శింబు కెరీర్ను గాడిలో పట్టినట్టుగా కనిపిస్తోంది. చాలా కాలం తరువాత శింబు, నయన్లు కలిసి నటించటం, సినిమాలో డైలాగ్స్ వారికి నిజజీవిత రిలేషన్స్పై సెటైర్స్లా అనిపించటం, ఆన్స్క్రీన్ కెమిస్ట్రీతో కూడా అలరించటంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజే 14 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఇదు నమ్మ ఆలు శింబు కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement