హైకోర్టులో శింబుకు చుక్కెదురు | Madras high court rejected simbu's petition | Sakshi
Sakshi News home page

హైకోర్టులో శింబుకు చుక్కెదురు

Published Fri, Jan 8 2016 8:36 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

హైకోర్టులో శింబుకు చుక్కెదురు - Sakshi

హైకోర్టులో శింబుకు చుక్కెదురు

చెన్నై: నటుడు శింబుకు హైకోర్టులో చుక్కెదురైంది. బీప్ సాంగ్ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన నటుడు శింబుకు బెయిల్ రావడం కాస్త ఊరటనిచ్చినా తాజాగా హైకోర్టు షాక్ ఇచ్చింది.

వివరాల్లోకెళ్లితే బీప్‌సాంగ్ వ్యవహారంలో శింబు.. తనపై ఇక కేసులు నమోదు చేయరాదని డీజీపీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు శింబు అభ్యర్థన పిటిషన్‌ను కొట్టివేసింది. శింబు పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సుబ్బయ్య ఇలాంటి పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి చట్టంలో స్థానం లేదంటూ కొట్టివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement