
బాబా జీవితాన్ని గమనిస్తే గీతాసారం కనిపిస్తుంది. అర్జునుడికి కృష్ణభగవానుడు భగవద్గీత బోధించడం ద్వారా కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినట్లు, తను జీవించే రీతినే అత్యుత్తమ జీవనమార్గంగాఅందరికీ ఆదర్శంగా నిలిపారు బాబా. రాముడు, రహీము ఒక్కడే! ఏ మాత్రం తేడాలేదు. మరిక వారి భక్తులు ఎందుకు విడిపోయి పోట్లాడుకోవటం, అందరూ కలసి జాతీయ సమైక్యతసాధించండి అని చెప్పిన బాబా సామాజిక సమస్యలకు సమాధానం చెప్పారు. అనేకమైన లౌకిక బాధలకు పరిష్కార మార్గం చూపారు. ఒక ఫకీరుగా, పరమయోగిగా, నిరంతరఆత్మానుసంధానంలో మునిగి ఉండే బాబా భక్తుల కోసం – మానవాళికోసం వారిలో ఒకరిగా, వారితో కలసి జీవించారు. ఆడారు, పాడారు, కష్టాలు, కన్నీళ్లలో సహానుభూతిని ప్రదర్శించారు.తనవైన లీలలతో కాపాడారు. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవరూపంలో అవతరించేది మనుష్యులను ఉద్ధరించేందుకే.
ఎన్ని మత సంబంధ విషయాలు విన్నా,ఎన్ని గ్రంథాలు చదివినా కలగని ఆత్మసాక్షాత్కారం సద్గురుసాయి సమక్షంలో సులభంగా లభించేది. మత గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని బాబా ఎంతో సరళంగా భక్తుల మనసులకుపట్టించేవారు. ఆయన జీవనశైలి, ఆయన పలుకులే పరోక్షంగా భక్తుల సందేహాలకు సమాధానాలిచ్చేవి. క్షమ, నెమ్మది, ఫలాపేక్ష లేకపోవటం, దానం, ధర్మం, శరీరాన్ని, మనస్సునుస్వాధీనమందుంచుకోవటం, అహంకారం లేకపోవటం, గురుశుశ్రూష, వినయం వంటి శుభలక్షణాలన్నీ బాబా అనుసరించినవే. మానవాళికి మార్గదర్శకాలుగా నిలిచేవే. అందుకే భగవద్గీతఎలా మార్గదర్శకంగా నిలుస్తోందో, సాయిగీత కూడా చాలామందికి మార్గనిర్దేశం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment