
సినిమా తారలు బయట కనిపించడం చాలా అరుదు. సినిమా ప్రమోషన్స్ కోసమో లేదా ఏదైనా షాప్ ఓపెనింగ్ సమయంలోనూ వారు బయటకు వస్తారు. అందుకే వాళ్లని ప్రత్యేక్షంగా చూసేందుకు సామాన్య జనం ఆసక్తి చూపిస్తారు. బయట కనిపిస్తే ఫోటోల కోసం ఎగబడతారు. ఇదంతా అభిమానులు, సామాన్యులు చేసే పని. కానీ ఓ హీరోయిన్‌తో ఫోటో దిగేందుకు బాబాలు పోటీ పడ్డారు. ఆమెను సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఈ విచిత్ర ఘటన హీరోయిన్ ఆమీషా పటేల్(Ameesha Patel)కి ఎదురైంది.
శివరాత్రి వేడుకలో..
మహా శివరాత్రి సందర్భంగా బుధవారం సినీ నటి ఆమీషా పటేల్ ముంబై జుహూలోని శివాలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆమె బయటకు వస్తుండగా.. అక్కడి భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సామాన్య భక్తులతో పాటు గుడిలో ఉన్న సాధువులు కూడా ఆమీషాతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఆమె కాసేపు నవ్వుతూ అందరికి సెల్ఫీలు ఇచ్చింది. అయితే బాబాలు పెద్ద ఎత్తున రావడంతో ఆమెకు ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ సిబ్బంది వారందరిని పక్కకి పంపిస్తూ.. ఆమీషాను కారు వద్దకు తీసుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది వద్దని చెప్పినా వినకుండా సాధువులు ఫోటో కోసం ఆమీషా వెంటపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సాధువులు కూడానా?
హీరోయిన్‌తో సెల్ఫీ కోసం సాధువులు ఎగబడడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు వీరంతా నకిలీ బాబాలు అని.. నిజమైన బాబాలకి ఇలాంటి లక్షణాలు ఉండవని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చివరికి సాధువులు కూడా ఇలా తయారయ్యారేంటి అని మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా ఆమీషాకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఎవరీ అమీషా పటేల్?
ముంబైలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ కహో నా.. ప్యార్ హై (2000) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. అదే ఏడాది బద్రి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మరుసటి ఏడాది గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రంతో స్టార్ స్టేటస్ అందుకుంది. దీంతో వరుసగా హిందీలో అవకాశాలు క్యూ కట్టాయి. యే జిందగీ కా సఫర్, క్రాంతి, హమ్రాజ్, ఆప్ ముజే అచ్చే లగ్నే లగ్నే, తథాస్తు, మంగళ్ పాండే, వాదా, భూల్ భులయ్యా, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, రేస్ 2.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది.తెలుగులో మహేశ్‌బాబు సరసన నాని , బాలకృష్ణతో నరసింహుడు పరమవీరచక్ర మూవీస్‌లో నటించింది. 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. గదర్ 2తో 2023లో రీఎంట్రీ ఇచ్చింది.
హీరోయిన్ అమీషా పటేల్‌తో ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలు
మహాశివరాత్రి సందర్భంగా ముంబై - జుహూలో ఓ శివాలయానికి వెళ్లిన హీరోయిన్ అమీషా పటేల్‌ను చుట్టుముట్టి ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలు pic.twitter.com/iLeZJd9OfE— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025
Comments
Please login to add a commentAdd a comment