ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఈ మహా కుంభమేళ(Mahakumbh Mela 2025)లో రకరకాల బాబాలు దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. పావురం బాబా నుంచి, ఇంజనీర్ బాబాల వరకు అందరిది ఒక్కో నేపథ్యం కానీ వాందర్నీ ఒకచోట చేర్చింది ఈ ఆధ్యాత్మికతే. ఈ కుంభమేళాలో కొందరి బాబాల బ్యాగ్రౌండ్ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఇంకొందరూ అందరి హితం కోరేలా జీవనం సాగిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన మరో బాబా ఈ మహాకుంభమేళలో హైలెట్‌గా నిలిచాడు. పర్యావరణ స్ప్రుహ కలిగించేలా అతడి ఆహార్యం ఎలా ఉందే చూస్తే కంగుతింటారు.
ఈ పర్యావరణ బాబా పేరు అనాజ్ వాలే బాబా(Anaaj Wale Baba). ఈయన ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన బాబా. పర్యావరణం కోసం ఎంతమంది పాటుపడ్డారు. కానీ ఈ బాబా అత్యంత విభిన్నమైన శైలిలో పాటుపడుతూ..అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను పంటలనే(crops) ఏకంగా తన తల(Head)పై పండిస్తున్నాడు. మిల్లెట్‌లు, గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీల(wheat, millet, gram, and peas)తో సహా చాలా రకాల పంటలను తలపై పండించాడట. ఈ అసాధారణ ప్రయత్నాన్ని గత ఐదేళ్లు నుంచి చేస్తున్నట్లు తెలిపాడు ఆ బాబా.
కేవలం అటవీ నిర్మూలనపై అవగాహన పెంచడం, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే తన అసాధారణ ప్రయత్నం వెనుకున్న లక్ష్యమని అన్నారు అనాజ్ వాలే బాబా. చెట్లు నరకడం వల్ల యావత్తు ప్రపంచంపై ఎలాంటి ప్రభావితం చూపుతుందో తెలియడంతో ఇలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తన అసాధారణ విధానమైన పనితో ప్రజలు ప్రభావితమై మరిన్ని మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చేస్తారనేది తన ఆశ అని అన్నారు.
ఈ కారణాల రీత్యా మహా కుంభమేళా కోసం కిలా ఘాట్ సమీపంలో ఉంటున్న ఈ అనాబ్ వాలే బాబా అందరి దృష్టిని ఆకర్షించేలా హైలెట్‌గా నిలిచారు. ఈ కుంభమేళాకి వచ్చే సందర్శకులు అతడి అసాధారణమైన ప్రయత్నానికి ఫిదా అవ్వడమే గాక ఆశ్చర్యపోతున్నారు. అంకితభావంతో తలపై మొక్కలను పెంచుతున్నారు. క్రమతప్పకుండా వాటికి నీళ్లు పోసి వాటి బాగోగులు చూస్తుంటారా బాబా.
ఆయన దీన్ని హఠ యోగతో మిళితమైన పర్యావరణ కార్యకర్తగా చెబుతుంటాడు. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక, పర్యావరణ బాధ్యతల మధ్య సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మేళా ముగినిస తర్వాత కూడా ఈ అనాజ్ వాలే బాబా సోన్‌భద్రకు తిరిగి వచ్చి అటవీకరణ, పర్యావరణంతో ఈ పుడమి కళకళలాడేలా ప్రోత్సహించే లక్ష్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, ఈ మహా కుంభమేళాలో సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించేలా ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా, ఫిబ్రబరి 26,2025తో పూర్తవనుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన ఈ పవిత్ర ప్రదేశంలో సాన్నాలు చేస్తే పాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం.
(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..)
Comments
Please login to add a commentAdd a comment