Head
-
భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!
కొంతమందికి తలనొప్పి తరచు వేధిస్తు ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. ఎందుకు వస్తుందో తెలియదు సడెన్‌గా వచ్చి ఏ పని చెయ్యనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. దీన్ని నివారించాలంటే కొద్దిపాటి చిట్కాలు ఫాలో అయితే చాలని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో వారి మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.కంప్యూటర్‌పై పనిచేసేవారు కంటిపై ఒత్తిడి పడకుండా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించవచ్చు. అలాగే ప్రతి గంట తర్వాత కంప్యూటర్ తెరపై నుంచి చూపు తప్పించి కాసేపు రిలాక్స్ అవాలి కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన సంక్లిష్టమైన (ఇంట్రికేట్) డిజైన్లు అల్లే సమయంలో అదేపనిగా పనిచేయకుండా తరచూ బ్రేక్ తీసుకుంటుండటం మంచిది తమకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం సరికాదు కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతలపానియాలకు దూరంగా ఉండాలి ఫలానా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అ΄ోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసకోవడం సరికాదు రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల తలనొప్పులు రాకుండా నివారించవచ్చురోజూ కనీసం ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి. కొన్నిసార్లు నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి తమ సౌకర్యం మేరకు నిద్రపోవడం మంచిది. ఒకవేళ ఈ సూచనల తర్వాత కూడా తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. (చదవండి: గాంధీ జయంతి 2024: భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!) -
తల మసాజ్ వల్ల పక్షవాతం
బనశంకరి: కటింగ్ షాపులో తల మసాజ్ చేసుకున్న యువకునికి పక్షవాతం వచ్చింది, చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తరువాత కోలుకున్నాడు. సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వివరాలు.. బెంగళూరులో హౌస్‌కీపింగ్ చేస్తున్న బళ్లారికి చెందిన యువకుడు (30) ఓ కటింగ్ షాపునకు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. తరువాత ఉచితంగా తల మసాజ్ చేస్తానంటే సరే అన్నాడు. ఈ సమయంలో ఆకస్మికంగా గొంతు తిప్పిన సమయంలో నొప్పి కలిగింది. మసాజ్ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కానీ గంట తరువాత దేహం ఎడమవైపు స్వాధీనం కోల్పోయింది. దీంతో భయపడిన కల్లేశ్ సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు. వైద్యనిపుణుడు శ్రీకంఠస్వామి మాట్లాడుతూ బాధితుడు సాధారణ పార్శ్వవాయువు కు భిన్నమైన సమస్యకు గురయ్యాడు. బలవంతంగా గొంతు– మెడను తిప్పడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తల మసాజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాధితుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తరువాత కోలుకుంటున్నాడు. -
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్‌లోని బ్రెయిన్‌బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్‌డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్‌ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!) -
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్‌లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
మా నాయినే! కొబ్బరికాయను తలకేసి కొట్టుకున్నాడు
కొబ్బరికాయను రాయిపై కొడితే పగులుతుంది. నుదుటిపై కొడితే? వైరల్ అవుతుంది! విషయంలోకి వస్తే... తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి కొబ్బరికాయ పట్టుకొని పూజాపీఠం దగ్గర శ్లోకాన్ని జపించాడు. ఆ తరువాత తల పైకి లేపి కొబ్బరికాయను నుదుటి మీద కొట్టుకున్నాడు. ‘యాక్షన్‌కు రియాక్షన్’ అనేది ప్రకృతి ధర్మం కదా! సదరు వ్యక్తి వెంటనే కుప్పకూలి΄ోయాడు. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా వ్యక్తి చర్యను నెటిజనులు ఖండించారు. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్’, ‘గాయపడింది నువ్వు కాదు... కొబ్బరికాయ’లాంటి సరదా కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
ఈ హెడ్‌బ్యాండ్‌తో అల్జీమర్స్‌కు చెక్!
గాగుల్స్, హెడ్‌ఫోన్స్‌తో కూడిన ఈ హెడ్‌బ్యాండ్ అల్జీమర్స్‌కు చెక్‌పెడుతుంది. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ‘కాగ్నిటో థెరప్యూటిక్స్’ ఇటీవల ఈ హెడ్‌బ్యాండ్‌ను రూపొందించింది. దీనిని తలకు పెట్టుకుంటే, ఇది విడుదల చేసే కాంతి, ధ్వని తరంగాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరును మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ బాధితుల్లో మెదడులోని ‘గామా’ తరంగాల పనితీరు బాగా నెమ్మదిస్తుంది. వారు ఈ హెడ్‌బ్యాండ్‌ను ధరించినట్లయితే, స్వల్పకాలంలోనే మెరుగైన ఫలితాలను పొందగలరని ‘కాగ్నిటో’ నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరానికి అమెరికా జాతీయ ‘ఆహార ఔషధ సంస్థ’ (ఎఫ్‌డీఏ) అనుమతి కూడా మంజూరు చేసింది. ఈ హెడ్‌బ్యాండ్ తయారీ బృందానికి ‘కాగ్నిటో థెరప్యూటిక్స్’ వ్యవస్థపాకులు, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) న్యూరోసైంటిస్టులు లీ హ్యూయెయి సాయి, ఎడ్ బోడెన్ నేతృత్వం వహించారు. అల్జీమర్స్ ప్రారంభ దశ నుంచి నడి దశ వరకు గల రోగులకు ఈ పరికరం చక్కగా పనిచేస్తుందని వారు తెలిపారు. దీనిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి ‘కాగ్నిటో’ నిధులు సమకూర్చుకుంటోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. (చదవండి: 'అరుధంతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
విన్‌ఫాస్ట్ ఆసియా హెడ్‌గా జాక్ హోలిస్
స్కోడా ఆటో ఇండియా మాజీ బ్రాండ్ డైరెక్టర్ 'జాక్ హోలిస్' (Zac Hollis) వియత్నామీస్ ఈవీ మేజర్ విన్ఫాస్ట్లో ఆసియా హెడ్‌గా చేరారు. స్కోడా కోసం ఇండియా 2.0 వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హోలిస్, ఇప్పుడు విన్‌ఫాస్ట్ ఇండియా రోల్ అవుట్ ప్లాన్‌ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే వియత్నామీస్ ఈవీ నిపుణులు దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 16,600 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సమయంలోనే హోలిస్ దీని బాధ్యతలు స్వీకరించారు. జరిగిన ఒప్పందం ప్రకారం తమిళనాడులోని తూత్తుకుడిలో విన్‌ఫాస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 3,000 నుంచి 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈ సదుపాయంలో వార్షిక తయారీ సామర్థ్యం 1,50,000 యూనిట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడో రోజు ముందుకు కదలని బంగారం - రూ.500 తగ్గిన వెండి స్కోడా ఇండియాలో జాక్ హోలిస్ 2018లో స్కోడా ఆటోకు సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా నియమితులైన హోలిస్.. భారతదేశంలో కంపెనీ వృద్ధికి నాలుగు సంవత్సరాలు కృషి చేశారు. ఆ తరువాత స్కోడా నుంచి హోలిస్ వెళ్లిపోవడంతో స్కోడా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోయింది. 2018 కంటే ముందు ఈయన చైనాలో స్కోడా చైనా విక్రయాలను వృద్ధి చేయడంలో ఒకరుగా ఉన్నారు. -
మీ తలలో 'గుయ్య్య్' మంటూ సన్నని శబ్దమా.. అయితే జాగ్రత్త!
'చెవి పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టుగా చెవిలోనో లేదా తలలోనో గుయ్య్య్ మంటూ హోరు. ఇలా గుయ్‌మంటూ శబ్దం వినిపించడాన్ని వైద్య పరిభాషలో దీన్ని ‘టినైటస్’ అంటారు. ప్రజల్లో ఇదెంత సాధారణమంటే.. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 16 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలోనూ ‘టినైటస్’ బాధించే జనాల సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని వయసుల వారినీ వేధిస్తూ లక్షలాది మందిని బాధించే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.' టినైటస్తో చెవిలో లేదా తలలో హోరున శబ్దం అదేపనిగా వినిపిస్తున్నప్పుడు నొప్పి కంటే.. దాన్ని విడిపించుకోలేకపోవడంతో విసుగుతో కూడిన నిస్పృహ వేధిస్తుంది. కొందరిలో ఇది గర్జన అంతటి తీవ్రంగా కూడా వినిపిస్తుండవచ్చు. కొందరిలో ఎడతెగకుండా వినిపిస్తున్నప్పటికీ.. మరికొందరిలో మాత్రం వస్తూ, పోతూ ఉండవచ్చు. ఇలా వస్తూపోతూ వినిపిస్తుండే హోరును ‘పల్సేటింగ్ టినైటస్’ అంటారు. దీని వల్ల ప్రాణాపాయం లేకపోయినప్పటికీ.. దేనిమీద ఏకాగ్రతా, దృష్టీ నిలపలేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో నిరాశా నిస్పృహలకూ, తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యే అవకాశముంది. ఎందుకిలా జరుగుతుందంటే.. ఈ కింది అంశాలు టినైటస్కు దోహదపడవచ్చు లేదా అవి ఈ సమస్యను తీవ్రతరం చేసే అవకాశమూ ఉంది. అవి.. చెవిలో పేరుకుపోయే గులివి లేదా చెవిలో ఇన్ఫెక్షన్ దీర్ఘకాలంపాటు బయట ఏదైనా హోరుకు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వినికిడి తగ్గడం / వినికిడి సమస్యలు ఇంకేమైనా మందులు తీసుకుంటూ ఉండటంతో వాటి దుష్ప్రభావంగా తలలో లేదా మెడభాగంలో ఎక్కడైనా గాయాలు కావడం దీర్ఘకాలపు అనీమియా, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ వంటి తలనొప్పులు ముప్పుగా పరిణమించే అంశాలు.. సాధారణంగా టినైటస్ ప్రాణాపాయం కాకపోయినా, కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టే అంశంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఆ ముప్పులేమిటంటే.. నిటారుగా నిల్చోలేక, ఎటో ఓ పక్కకు తూలిపోయే బ్యాలెన్సింగ్ సమస్య రావడం. వినికిడి సమస్యలు వస్తూపోతూ ఉన్నప్పుడు లేదా తీవ్రమైన వినికిడి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో వెంటనే ఈఎన్టీ నిపుణులను కలిసి, తమకు మీనియర్స్ డిసీజ్ (కళ్లు తిరుగుతుండే లక్షణాలతో కూడిన లోపలి చెవిని ప్రభావితం చేసే వర్టిగో లాంటి వైద్య సమస్య), అకాస్టిక్ న్యూరోమా (ఒక రకం నరాల సమస్య) వంటి జబ్బులేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం. నిర్ధారణ.. దీని లక్షణాలు కొన్ని ఇతర సమస్యలతోనూ పోలుతున్నందువల్ల దీన్ని జాగ్రత్తగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయడమన్నది చాలా కీలక అంశం. టినైటస్ నిర్ధారణకు ఈఎన్టీ నిపుణులు రకరకాల పరీక్షలు చేస్తుంటారు. వాటిలో కొన్ని.. బాధితుల వైద్య చరిత్ర: వీరి మెడికల్ హిస్టరీని సునిశితంగా పరిశీలించడం. అంటే వారికి వినిపిస్తున్న శబ్దాలు ఎలాంటివి, మునుపు తల, మెడ వంటి చోట్ల ఏమైనాగాయాలయ్యాయా, ఇతరత్రా ఏమైనా వైద్యసమస్యలున్నాయా వంటి అంశాలని పరిశీలిస్తారు. వినికిడి పరీక్షలు: వినికిడి లోపం ఏదైనా ఉందా, ఉంటే ఏమేరకు వినికిడి కోల్పోయారు వంటి అంశాలు. ఇమేజింగ్ పరీక్షలు: కొన్ని సందర్భాల్లో ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, చెవిలో లేదా మెదడులో ఏమైనా మార్పులు వచ్చాయా అని పరిశీలించడం. చికిత్స / మేనేజ్మెంట్.. అన్ని రకాల వైద్యపరీక్షల తర్వాత.. ఒకవేళ చెవిలో గులివి లేదా చెవి ఇన్ఫెక్షన్తో ఈ సమస్య వచ్చినట్టు గుర్తిస్తే ఆ మేరకు గులివిని క్లీన్ చేయడం లేదా చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు అవసరమైన మందులు వాడాలి. ఎమ్మారై / సీటీ స్కాన్ వంటి పరీక్షల్లో మెదడులోగానీ, చెవిలోగాని గడ్డలు లేవని తేలితే.. అక్కడ టినైటస్కు ఉన్న కారణాలనూ, బాధితులపై ప్రభావాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాధితుల్లో తీవ్రమైన యాంగ్జైటీ ఉన్నప్పుడు టినైటస్ను తగ్గించే మందులతో పాటు, యాంటీ యాంగ్జైటీ మందుల్ని వాడాలి. కొన్నిసార్లు ఓరల్ స్టెరాయిడ్స్ లేదా అవసరాన్ని బట్టి ఇంట్రా టింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లూ, కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్స్ వంటివి వాడాల్సి రావచ్చు. డా. సంపూర్ణ ఘోష్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఇవి చదవండి: ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..! -
ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు కొత్త హెచ్ఆర్ హెడ్
భారతీయ ప్రముఖ వ్యాపార సమ్మేళనం ఆదిత్య బిర్లా గ్రూప్ తమ కొత్త హెచ్ఆర్ హెడ్‌ను ప్రకటించింది. ముందస్తు పదవీ విరమణ తీసుకుంటున్న సంతృప్త్ మిశ్రా స్థానంలో అశోక్ రామ్చంద్రన్ను డైరెక్టర్ (హెచ్ఆర్) గా నియమించింది. నియామక మార్పులు 2024 జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయి. అశోక్ రామ్‌చంద్రన్ ప్రస్తుతం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2015 నుంచి ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కొనసాగుతున్నారు. గ్రూప్‌లో చేరడానికి ముందు వోడాఫోన్ ఇండియాలో హెచ్ఆర్ డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్ఆర్ విభాగంలో అశోక్ రామచంద్రన్‌కు 34 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక డాక్టర్ సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్‌లో 27 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హెచ్ఆర్ గ్లోబల్ డైరెక్టర్, అలాగే బిర్లా కార్బన్ గ్రూప్ డైరెక్టర్, కెమికల్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మిశ్రా 1996లో హిందుస్థాన్ యూనిలీవర్ నుంచి హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా గ్రూప్‌లో చేరారు. -
18 ఏళ్లుగా తలలో బుల్లెట్‌తో జీవిస్తున్న వ్యక్తి..చివరికి..
ఓ వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే పదేళ్ల వయసులో తలలోకి బుల్లెట్ దిగింది. ఆ తర్వాత నుంచి ఆ బాలుడి దుస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. అలా దాదాపు 18 ఏళ్లు గడిపాడు. సంప్రదించని ఆస్పత్రిలేదు. ప్రతి ఒక్కరు బుల్లెట్ తీయడం కష్టమనే చెప్పారు. ఆ బుల్లెట్ కారణంగా విపరీతమైన తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్లతో దుర్భర జీవితాన్ని గడిపాడు. చివరికి బెంగళురు ఆస్పత్రి వైద్యులు అతడు ఎదుర్కొన్న నరకం నుంచి విముక్తి కలిగించారు. ఇంతకీ అతడికి తలలో ఎలా బుల్లెట దిగింది? ఎవరా వ్యక్తి అంటే..! యోమెన్‌కి చెందిన సలేహ్ అనే 29 ఏళ్ల వ్యక్తి తలలో సమారు 3 సెంటీమీటర్ల బుల్లెట్ ఉంది. అతనికి పదేళ్ల ప్రాయంలో ఉండగా.. రెండు ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో ఓ బుల్లెట్ అతడి చెవిలోకి దూసుకుని తలలోని ఎడమవైపు ఎముకలోకి దిగిపోయింది. దీంతో అతనికి విపరీతమైన రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు గానీ ఆ బుల్లెట్‌ని మాత్రం తీయలేకపోయారు వైద్యులు. ఎందుకంటే? అది చెవిలోపలకి వెళ్లడం, పైగా దాని ముందర భాగం తలలోపలకి ఉండటం కారణంగా తీయడం వైద్యులకు కష్టంగా మారింది. దీంతో గాయం తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చి పంపించేశారు సలేహ్ని. అప్పటి నుంచి సుమారు 18 ఏళ్లుదాక ఆ బుల్లెట్‌తోనే జీవించాడు. ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ బుల్లెట్ కారణంగా చెవి వినికిడిని కోల్పోయాడు. పైగా చెవి ఇన్ఫెక్షన్లు, తలనొప్పితో నరకయాతన అనుభవించాడు. అతడికి ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం సలేహ్కి 29 ఏళ్లు. అతడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ బుల్లెట్ అతడి తల నుంచి ఎప్పుడు పోతుందా అనుకునేవాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయిన సలేహ్ స్నేహితుల ద్వారా బెంగళూరులోని ఆస్టర్ ఆస్పత్రి గురించి తెలుసుకుని మరీ ఎంతో ఆశతో వెళ్లాడు. అయితే వైద్యుల పలు టెస్ట్‌లు చేసి అసాధ్యం అని తేల్చేశారు. ఎందుకంటే? బుల్లెట్ సరిగ్గా చెవి లోపల ఎడమవైపు ముఖ్యమైన టెంపోరల్ ఎముక లోపల వాస్కులర్ నిర్మాణాలకు దగ్గరగా ఉంది. ఇది శస్ర చికిత్సకు అది పెద్ద సవాలు. అందువల్లే వైద్యులు రిస్క్ చేసే సాహసం చేయలేకపోయారు. అయితే వైద్యులు ఆ బుల్లెట్ కరెక్ట్‌గా ఏ ప్రదేశంలో ఉందో తెలిస్తే తీయడం ఈజీ అని గుర్తించారు. అందుకోసం కాంట్రాస్ట్ సీటీ యాంజియోగ్రఫీని ఎంచుకుంది. టూ డైమెన్షియల్ ఎక్స్‌రే సాయంతో బుల్లెట్ స్థానాన్నిగుర్తించి విపరీతమైన రక్తస్రావం కాకుండా సులభంగా తొలగించారు వైద్యులు. సర్జరీ చేస్తున్నంత సేపు అనుమానంగానే ఉందని అన్నారు వైద్యులు. ఎట్టకేలకు ఈ శస్త్రచికిత్సతో అతడికి తలనొప్పి తగ్గింది. అలాగే స్పష్టంగా వినిపిస్తోంది కూడా. అంతేగాదు పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే సలేహ్ యెమెన్‌కి తిరిగి వెళ్లిపోయాడు కూడా. (చదవండి: ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా అలా అవుతుంటే అలర్జీ అనుకుంది! కానీ చివరికి..) -
కర్ణాటక కీలక నిర్ణయం: పరీక్షల్లో తలను కవర్ చేయడం నిషేధం..కానీ..!
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షల సమయంలో తలపై ధరించే అన్ని రకాల దుస్తులను నిషేధించింది. దీనికి సంబంధించి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ బోర్డు (KEA) కీలక అదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళన నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే నల్ల పూసల నెక్లెస్‌లు) మెట్టెలకు అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నియామక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. బ్లూటూత్ డివైసెస్ ద్వారా అభ్యర్థుల మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం విధిస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీ ధరించినవారికి పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని కేఈఏ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష హాల్ లోపల ఫోన్లు ,బ్లూటూత్ ఇయర్ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి ఉండదు. దీంతోపాటు మెటల్ ఆభరణాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అయితే వివాహతులైన హిందూ మహిళలు, మంగళ సూత్రాలు, నల్ల పూసలు,మెట్టెలు ధరించవచ్చని ప్రకటించింది. డ్రెస్ కోడ్ నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్‌ను స్పష్టంగా పేర్కొననప్పటికీ తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారనున్నాయి. ఇది ఇలా ఉంటే అక్టోబర్‌లో జరిగిన రిక్రూట్మెంట్ పరీక్షల సందర్భంగా కేఈఏ హిజాబ్‌లను అనుమతించిన సంగతి గమనార్హం. అయితే బ్లూటూత్ పరికరాల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 2023 అక్టోబర్‌లో KEA నిర్వహించిన పరీక్షల్లో కల్బుర్గి, యాద్గిర్ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు బ్లూటూత్ ఉపయోగించారన్న ఆరోపణలపై ప్రభుత్వం నవంబర్ 11న CID విచారణకు ఆదేశించింది. అంతకుముందు 2022లో, రాష్ట్రంలోని తరగతి గదుల్లో హిజాబ్‌ను నిషేధించడంపెద్ద దుమారాన్ని రేపింది. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఉత్తర్వును 10, 12వ తరగతి వంటి ఇతర బోర్డు పరీక్షలతో పాటు KEA నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్షలకు కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. -
అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్‌బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్‌ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్లు పెట్టారు. -
ఒత్తిడితో బాధపడుతున్నారా? దీన్ని తలకు ధరించండి చాలు
మనసు ఆహ్లాదంగా ఉంటేనే మొహం మెరుస్తుంది. అలసట లేని అందం కావాలంటే.. హ్యాండ్స్–ఫ్రీ హెడ్ మసాజర్ మీ ఇంట్లో ఉండాల్సిందే. ఈ ఎలక్ట్రిక్ స్కాల్ప్ మసాజర్.. మొత్తం నాలుగు వైబ్రేషన్ మోడ్స్‌తో పనిచేస్తుంది. దీన్ని తలకు పెట్టుకుంటే.. రక్త ప్రసరణ పెరుగుతుంది. నిద్రలేమి దూరమై.. హాయిగా నిద్రపడుతుంది. అలసట మాయమవుతుంది.ఉద్యోగులు, డ్రైవర్లు, క్రీడాకారులు, వృద్ధులు, అలసటతో ఉన్న వారు, కార్మికులు, తలనొప్పి లేదా ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. యాక్టివ్ మోడ్, రిలాక్స్ మోడ్, బ్యూటీ మోడ్, స్లీప్ మోడ్ ఇలా.. ప్రతి మోడ్ భిన్నంగా ఉంటుంది. కావల్సిన ఆప్షన్‌ను ఈజీగా ఎంచుకోవచ్చు. చూడటానికి సాలెపురుగులా ఉన్న ఈ మసాజర్ పొడవాటి పది ఫ్లెక్సిబుల్ టూల్స్.. చేతి వేళ్ల మాదిరిగా తలను పట్టి ఉంచుతాయి. లోపలి భాగంలో బాల్స్ లాంటి మెత్తటి నాలుగు టూల్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి తలకు మృదువైన వైబ్రేషన్ లభిస్తుంది. సుమారు 15 నిమిషాలు దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అన్ని తెలిసిన స్టార్టర్స్కైనా.. ఆప్షన్స్ పెద్దగా తెలియని పెద్దవాళ్లకైనా దీని వాడడం సులభం. మెషీన్‌ను స్టార్ట్ చేయడానికి లేదా షట్ డౌన్ చేయడానికి పవర్ బటన్ ను 3 సెకన్ల పాటు నొక్కి ఉంచాలి. మోడ్ మారడానికి అదే బటన్ ఉపయోగపడుతుంది. హైక్వాలిటీ సిలికాన్‌తో రూపొందిన ఈ డివైజ్ చాలా తేలికగా.. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుంది. డిజైన్‌ను బట్టి దీని దీని ధర ఉంటుంది. -
సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు?
తలపాగా ధరించే సంప్రదాయం ఈ నాటిది కాదు. చాలా చోట్ల పెళ్లిళ్లలో తలపాగాలు ధరిస్తారు. చరిత్రలో తలపాగా ప్రస్తావన ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు మాత్రమే తలపాగా ధరించేవారు. యోధులు తలపాగాను తమ శక్తికి చిహ్నంగా భావించేవారు. చాలా సినిమాల్లో ఓడిపోయినవారు లేదా బలహీనులు తమ తలపాగాను తీసి కాళ్ల దగ్గర పెట్టడాన్ని చూసేవుంటాం. తలపాగా చూసినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. సిక్కు మతానికి చెందినవారు తప్పని సరిగా తలపాగా ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే సిక్కుమతంలో తలపాగాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? ప్రభువుల హోదాకు చిహ్నం సిక్కులు తలపాగాను తమ గురువు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. 1699లో బైసాఖీ రోజున సిక్కుల పదవ గురువు గురు గురు గోవింద్ సింగ్ తన ఐదుగురు సన్నిహితులకు తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. గురుగోవింద్ సింగ్ కాలంలో తలపాగాను గౌరవ సూచకంగా చూసేవారు. తలపాగా అనేది ప్రభువుల హోదాకు చిహ్నం. ఆ సమయంలో మొఘల్ నవాబులు, హిందూ రాజ్‌పుత్‌లు వారి ప్రత్యేక తలపాగాలతో గుర్తింపు పొందారు. హిందూ రాజ్‌పుత్‌ల తలపాగా భిన్నంగా ఉంటుంది. వారి తలపాగాలో ఆభరణాలు పొదిగేవారు. హిందూ రాజ్‌పుత్‌లు తలపాగాలు ధరించడంతోపాటు ఆయుధాలను కూడా ధరించేవారు. దీనితో పాటు గడ్డం, మీసాలు పెంచేవారు. గురు గోవింద్ సింగ్ అనుమతితో.. ఒకప్పుడు ప్రతి సిక్కు తలపాగా ధరించడం, కత్తిని ఉపయోగించడం, అతని పేరులో సింగ్ లేదా కౌర్ అని రాసేందుకు అనుమతిలేదు. అయితే గురు గోవింద్ సింగ్ సిక్కులందరికీ కత్తి పట్టుకోవడానికి, వారి పేర్లకు సింగ్, కౌర్ అని రాయడానికి, జుట్టును పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఫలితంగా సిక్కు సమాజంలో పెద్ద, చిన్న అనే అంతరం ముగిసింది. పంజాబీ సమాజంలో బలహీన వర్గాలను రక్షించే బాధ్యత ఖల్సా సిక్కుల చేతుల్లో ఉంది. సిక్కు యోధులను ఖల్సా అని అంటారు. వారు తలపాగా ధరిస్తారు. సిక్కు చివరి గురువు గురుగోవింద్ సింగ్ చివరి కోరిక మేరకు వారు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు. తలపాగాను మార్చుకునే ఆచారం గురుగోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారులైన అజిత్ సింగ్, జుజార్ సింగ్ తలలకు తలపాగాలు కట్టి, వారికి ఆయుధాలు ఇచ్చారని సిక్కు చరిత్ర చెబుతోంది. గురుగోవింద్ సింగ్ తన పిల్లలిద్దరినీ పెళ్లికొడుకుగా అలంకరించి యుద్ధభూమికి పంపారు. వీరిద్దరూ యుద్ధరంగంలో వీరమరణం పొందారు. తలపై తలపాగా ధరించడం సిక్కు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. అది వారి సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ధైర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. సిక్కు సంప్రదాయంలో స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయడాన్ని ఘనమైన కార్యంగా గుర్తిస్తారు. తలపాగా మార్చుకునే ఆచారం సిక్కు సంస్కృతిలో కనిపిస్తుంది. తలపాగాను అత్యంత సన్నిహిత మిత్రులు మార్చుకుంటారు. తలపాగా మార్చుకున్న వారు జీవితాంతం స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. తలపాగా బాధ్యతకు చిహ్నంగా కూడా సిక్కులు పరిగణిస్తారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్‌ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. భర్త నోట్ బుక్‌లో ఏముంది?
ఒక వ్యక్తి తన భార్యను 12 ఏళ్ల పాటు గదిలో బంధీగా ఉంచాడు. ఈ సమయంలో ఆమెకు టార్చర్ చూపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకోగా బాధితురాలు సెమీన్యూడ్ స్థితిలో శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. ఆ మహిళ భర్త చేతిలో అత్యంత దయనీయమైన పరిస్థితులను చవిచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఉదంతం జర్మనీలో చోటుచేసుకుంది. ఫోను చేతికి చిక్కడంతో.. 53 ఏళ్ల నిందితుడిని పోలీసులు జర్మనీలోని ఫోర్‌బ్యాక్ పట్టణంలోని ఒక అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం 2011లో భర్త ఆమెను కిడ్నాప్ చేశాడు. రెండు రోజుల క్రితం ఆమెకు ఫోను అందుబాటులోకి రావడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త తనను గత కొన్నేళ్లుగా హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడని అరెస్టు చేశారు. తరువాత అతనిని.. భార్య తెలిపిన చిరునామాకు తీసుకువచ్చారు. అయితే నిందితుడు తన భార్యను దాచివుంచిన టార్చర్ రూం చూపించేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసుల తమదైన శైలిలో అతని చేత టార్చర్ రూమ్ తలుపులు తెరిపించారు. సెమీ న్యూడ్‌గా బాధితురాలు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గదిలో బంధీగా పోలీసులకు కనిపించింది. భర్త ఆమెను ఇనుప తీగలతో కట్టేశాడు. ఆ గదిలోకి వెళ్లిన ముగ్గురు పోలీసులకు బాధితురాలు సెమీ న్యూడ్‌గా గుండుతో కనిపించింది. ఆమె చేతి వేళ్లు, కాలి వేళ్లు పనిచేయని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. అలాగే ఆమెకు కొంతకాలంగా ఆహారం ఇవ్వడం లేదని కూడా పోలీసులు తెలుసుకున్నారు. టార్చర్ రూమ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. నోట్ బుక్‌లో టార్చర్ వివరాలు ఆ ఇంటి ఇరుగుపొరుగువారు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటినుంచి ఒక మహిళ అరుపులు వినిపించేవని, తాము ఆ ఇంటి యజమానిని దీని గురించి అడిగినప్పుడు తన భార్యకు క్యాన్సర్ అని, బాధతో అలా అరుస్తుంటుందని చెప్పేవాడన్నారు. అయితే తాము ఎప్పుడూ ఆ బాధిత మహిళను చూడలేదని వారు తెలిపారు. అయితే పొరుగింటికి చెందిన ఒక వ్యక్తి తాను 10 ఏళ్ల క్రితం ఆ ఇంటిలో ఒక మహిళను చూశానని, ఇన్నాళ్లుగా కనిపించకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని, లేదా వేరే ప్రాంతానికి వెళ్లిందని అనుకున్నానని తెలిపారు. ఫ్రాన్సిసీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం పోలీసులకు ఆ ఫ్లాట్‌లో ఒక నోట్ బుక్ లభ్యమయ్యింది. దానిలో నిందితుడు తన భార్యను టార్చర్ పెట్టిన విధానాలను, ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని సమాచారం. ఇది కూడా చూడండి: చాలామంది డబ్బులు కట్టి మోసపోయారు.. ఆ ట్రాప్‌లో పడితే ... అంతే సంగతులు ! -
ట్రాన్స్జెండర్ల పైశాచికం.. గుండు కొట్టించి.. ఆపై మూత్ర విసర్జన చేసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఐదుగురు ట్రాన్స్‌జండర్లు కలిసి ఓ వ్యక్తికి గుండు కొట్టింటారు. అనంతరం అతనిపై మూత్రం పోశారు. అంతేకాకుండా బాధితుని వద్ద నుంచి రూ.10 వేలు దోచుకెళ్లారు. జులై 26న ఈ ఘటన జరిగింది. కాగా.. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాఫికుల్.. నిందితురాలి ఇంట్లో పనిచేసేవాడు. ఇటీవల అక్కడ పని మానేసి మరో ట్రాన్స్జండర్ ఇంట్లో పనిచేయడం ప్రారంభించాడు. ఈ మార్పుపై కోపాన్ని పెంచుకున్న నిందితురాలు.. రాఫికుల్ని మార్గమధ్యలో పట్టుకుని గుండు కొట్టించింది. అనంతరం అతనిపై మూత్రం పోశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా మూత్రం తాగాలని ఒత్తిడి చేసినట్లు వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
కాలేజీ విద్యార్థి హత్యలో బిగ్ ట్విస్ట్.. మూడు రోజుల ముందే స్కెచ్ వేసి..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థిని(25)ని ఓ యువకుడు ఇనుప రాడ్డుతో బాది హతమార్చాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఢిల్లీ మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో జరిగింది. బాధితురాలిని కమల నెహ్రూ కాలేజీ విద్యార్థినినిగా గుర్తించారు. మూడు రోజుల ముందే పథకం ప్రకారం నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని ఇర్ఫాన్‌గా గుర్తించారు. బాధితురాలు ఇర్పాన్ ప్రేమించుకున్నారు. కానీ ఇర్ఫాన్‌కు సరైన ఉద్యోగం లేని కారణంగా వివాహానికి బాధితురాలు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యువతి ఇర్పాన్‌తో మాట్లాడటం మానేసింది. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే ఇర్ఫాన్.. తన తమ్ముడికి కూడా వివాహం కుదరడంతో అవమానానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పక్కా పథకంతో.. బాధితురాలు మాట్లాడకపోయేసరికి ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్.. ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నాడు. ప్రియురాలు రోజూ స్టెనోగ్రఫీ ట్రైనింగ్‌కు వెళుతుందని ముందే తెలిసి మూడు రోజుల ముందే పథకం పన్నాడు. పార్కుకు పిలిచి ప్రేమ వ్వవహారంపై ప్రశ్నించాడు. కానీ బాధితురాలు ఒప్పుకోకపోయేసరికి విచక్షణ కోల్పోయాడు. బాధితురాలిని ఇనుప రాడ్డుతో తలపై బాది హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసుకుని మాలవీయ నగర్లో స్టెనోగ్రఫీ కోచింగ్‌కి బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. 'మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో ఓ బాలిక మృతదేహం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. బాధితురాలు తన ఫ్రెండ్‌తో కలిసి పార్కుకు వచ్చినట్లు తెలుస్తోంది. యువతి తలకు బలమైన గాయం తగిలింది. ఆమె మృతదేహం పక్కనే ఇనుప రాడ్డు పడి ఉంది.' అని ఢిల్లీ డీసీపీ చందన్ చౌధరి తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్పందించారు. నాగరికత ఉన్న దేశ రాజధానిలో ఓ అమ్మాయిని కొట్టి చంపారు. ఢిల్లీలో రక్షణ కరవైంది. ఇది ఎవరికీ పట్టింపు లేదు. కేవలం వార్తాపేపర్లలో మాత్రం అమ్మాయిల పేర్లు మారుస్తున్నారు. నేరాలు ఆగడం లేదని ట్వీట్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించనట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉరిశిక్ష ఒక్కటే సరైనది.. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు మించి ఏదైనా తక్కువేనని బాధితురాలి తండ్రి అన్నారు. తనకు ఉన్నది ఒక్కతే కూతురని చెప్తూ విలపించారు. #WATCH | Woman murdered in Malviya Nagar | "We need death penalty for the accused, nothing less. I had only one daughter…I won’t leave him”, father of the victim breaks down pic.twitter.com/TEQkhiqRwf — ANI (@ANI) July 28, 2023 ఇదీ చదవండి: ప్రొఫెసర్ ఘాతుకం.. తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు.. -
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
తొమ్మిదేళ్ల చిన్నారి తలలోకి కత్తెర దిగడంతో..
ఇంట్లో చిన్నారులు ఉంటే చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి వారిని. ఎప్పటికప్పుడూ వేయికళ్లతో పర్యవేక్షించాలి. ఏమరుపాటున పదునైన వస్తువులో లేదా ప్రమాదకరమైన పరికరాలో సమీపంలో ఉంచామో ఇక అంతే. ఇక్కడ కూడా ఓ చిన్నారి విషయంలో అలానే జరిగింది. ఆ చిన్నారి తల్లిందండ్రలు కడు పేదవాళ్లు. దీంతో వారి బాధ అంత ఇంత కాదు. ఇంతకీ ఆ చిన్నారికి ఏమైందంటే.. ఈ షాకింగ్ ఘటన ఫిలప్పీన్స్‌లో చోటు చేసుకుంది. 9 ఏళ్ల పాఠశాల విద్యార్థిని నికోల్ తలలో కత్తెర దిగింది. దీంతో ఆ చిన్నారి బాధ అంతా ఇంతా కాదు. అసలేం జరిగిందంటే..ఆ చిన్నారి తన సోదరుడితో పెన్సిల్ విషయమై గొడవపడింది. దీంతో ఆ బాలుడు కోపంతో కత్తెర తీసుకుని ఆ చిన్నారి తల వెనుక దాడి చేశాడు. అది అనుకోకుండా తలలోకి బలంగా దిగింది. ఈ అనూహ్య ఘటనతో కంగుతిన్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆ చిన్నారికి వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. కడు పేదవాళ్లైనా ఆ తల్లిదండ్రుల ఆ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు తట్టుకునే శక్తి లేక విలవిల్లాడింది. దీంతో ఆ చిన్నారి ఆ కత్తెరతోనే వారం పాటు ఆస్పత్రిలో గడపాల్సి వచ్చింది. ఐతే స్థానికులు అతడి పరిస్థితి చూసి.. సాయం చేసేందుకు ముందకు రావడంతో ఆ చిన్నారికి జులై 9న విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ చిన్నారి తండ్రి తమ కూతురు శస్త్ర చికిత్సకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలంటూ భావోద్వేగంగా చెప్పాడు. ఆ చిన్నారి త్వరితగతిన కోలుకుంటుందని, ఆమె మెదడుకు ఎలాంటి నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. అంతేగాదు ఆ చిన్నారి తండ్రి ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు వారి సమీపంలో ఉండకుండా జాగ్రత్త పడతామని అన్నారు. (చదవండి: పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్టు చేయించింది..మళ్లీ భార్యే..) -
ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది.. మహిళా కమిషన్ సీరియస్
పెళ్లిళ్లలో మోటు హాస్యాలు, స్నేహితుల ప్రాంక్‌లు శృతి మించుతున్నాయి. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టే సమయంలో వధూవరుల తలలను మెల్లగా తాడించాలనే సంప్రదాయం కేరళలో రభస సృష్టించింది. అల్లరి బంధువొకరు వధూవరుల తలలను పట్టి ‘ఠాప్పు’మనిపించడంతో వధువు బేర్‌మంది. ఈ వీడియో వైరల్ అయ్యేసరికి బంధువు పరార్ అయ్యాడు. మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. అత్తగారు కళ్లొత్తుకుంటూ ఇదంతా చూస్తూ కోడలితోపాటు నెత్తి కొట్టుకుంది. మొన్నటి శుక్రవారం సాజిలా అనే అమ్మాయికి, సచిన్ అనే అబ్బాయికి పెళ్లి జరిగింది. ఊరు పాలక్కాడ్‌లోని పల్లస్సేనా అనే చిన్న పల్లె. ఇక వరుణ్ణి, వధువును ఇంట్లోకి ఆహ్వానించాలి. మన దగ్గర ఆ సమయంలో కొన్ని హాస్యాలు, పరాచికాలు నడిచినట్టే అక్కడ కూడా ఏవో చిన్న చిన్న సరదాలు ఉంటాయి. గుమ్మం ముందు నిలుచున్న వధువు సాజిలా, వరుడు సచిన్ బంధువులకు నమస్కారాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో చిన్న సాంగెం బాకీ ఉండిపోయింది. అదేంటంటే వధువు, వరుడు ఒకరి తలను ఒకరు మెల్లగా తాడించుకోవాలి. కాని దీనికోసమే వారి వెనుక చేరిన ఒక అల్లరి బంధువు ఇద్దరి తలలూ పుచ్చుకుని ఠపీమనిపించాడు. ఇందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని వధువు ఠారెత్తిపోయింది. కళ్ల ముందు చుక్కలు కనిపించి ఆ తర్వాత కన్నీటి చుక్కలు రాలి పడ్డాయి. శుభమా అంటూ అత్తారింట్లో కాలు పెడుతుంటే ఏమిటిది అని ఆ అమ్మాయి ఆ వీడియోని తన ఇన్‌స్టాలో పెట్టింది. అంతే. క్షణాల్లో 20 లక్షల వ్యూస్ వచ్చాయి. కేరళ అంతా ఈ వీడియో ప్రచారమయ్యి ‘ఇలాంటి సాంగేలు ఇంకా ఉన్నాయా’ అని కొందరు, ‘కుర్రాళ్ల ప్రాంక్‌లు శృతి మించుతున్నాయ’ ని ఒకరు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. గగ్గోలు రేగేసరికి ఆ తలలు కొట్టించిన బంధువు ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. జరిగిందేదో జరిగింది అనుకుందామనుకున్నా ఈ లోపు కేరళ మహిళా కమిషన్ రంగంలో దిగి సుమోటోగా ఈ ఉదంతాన్ని తీసుకుంది. ‘వధువుకు ఎవరు ఇలాంటి బాధ కలిగించారో తేల్చండి’ అని తాకీదులిచ్చింది. యూట్యూబ్ చానెళ్లు వధూవరుల వెంట పడ్డాయి. ప్రచారం కోసమో సానుభూతి కోసమో వధువు విపరీతంగా తల పట్టుకుని ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇవన్నీ చూస్తూ పాపం పెళ్లికొడుకు, పెళ్లికొడుకు తల్లి తల కొట్టుకుంటున్నారు. ఇదొక్కటే కాదు పెళ్లిళ్లలో పిచ్చిపనులు చేయాలనుకునేవారు బాగా తయారయ్యారు. పర్యవసానాలు అర్థం చేసుకుని నవ వధూవరులను సంతోషంగా సౌకర్యంగా ఉంచడమే అందరూ చేయవలసిన పని. -
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్యాడ్తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎక్కడో హత్య చేసి, ఇక్కడ తల తెచ్చి పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమీర్‌పేటలో దారుణం.. భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య -
పాము తల కట్ చేసి..కాసేపు అయ్యాక తాకాడు.. అంతే ఒక్కసారిగా పైకి ఎగిరి
పాములు అంటే చాలామందికి భయం.. కొంతమంది పాము కనపడితే చాలు అరకిలోమీటర్ ఆగకుండా పరుగెత్తుతారు. ఈ విష సర్పాల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా అది మన ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతెందుకు వందల పాములు పట్టిన వ్యక్తులు కూడా చివరికి అదే పాము కాటుకు బలైన ఘటనలు ఇటీవల వింటూనే ఉన్నాం. ఓ పాము శిరచ్చేధనం చేసిన కూడా దాడికి యత్నించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంటర్నట్ వాడకం పెరిగినప్పటి నుంచి ప్రజలకు ఏది కావాలన్నా అన్ని మొబైల్లోనే ప్రత్యక్షమవతున్నాయి. దీంతో ఎక్కడ ఏది జరిగినా వాటిని చిత్రీకరించి నెట్టింట షేర్ చేయడం షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో కొన్ని వీడియోలు నెటిజన్లను నవ్వించగా, మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ, ఇంకొన్ని భయపెడుతుంటాయి. తాజాగా ఓ వీడియోలో.. తల లేని పాము పక్కన ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. తీవ్రంగా గాయపడి ఉండడం, తల లేకుండా కదలకుండా ఉండేసరికి అది చనిపోయి ఉందని నిర్థారించుకుంటాడు. ఇంతలో ఆ వ్యక్తి సడన్‌గా ఆ పాము తోక తాకగానే రెప్పపాటులో అది దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో గతంలో జరిగిన తాజాగా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. -
ఎండలకి ఆ మాత్రం ఉండాల్రా భయ్! బిగ్‌బీని ఆకట్టుకున్న వీడియో
-
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్.. పరాకు వద్దు
తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ కిందికి వస్తాయి. ఈ క్యాన్సర్స్‌లో 90 శాతం వరకు స్క్వామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యుకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, కాలుక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వస్తుంటాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్స్‌ను క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు. ఊపిరితిత్తుల క్యాన్సర్స్‌కు లాగానే ఈ క్యాన్సర్స్కూ ఆల్కహాల్, పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. తల, మెడకు సంబంధించిన క్యాన్సర్స్‌కు 75% కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పాదనలు, గుట్కా, పాన్, జర్దా, నస్యం, వక్క, బీడీ, చుట్ట, తమలపాకులు, సిగార్లు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్కహాల్, పొగాకు... రెండు అలవాట్లూ ఉన్నట్లయితే ముప్పు మరింత ఎక్కువ. నోటిలో తెలుపు ఎరుపు మిళితమైన మచ్చలు (ప్యాచెస్), గొంతు బొంగురుగా ఉండటం, మింగడంలో ఇబ్బంది, దవడల వాపు, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం కష్టం కావడం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గడం, చెవిపోటు... ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సీ, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పరీక్షించి స్టేజ్నూ, గ్రేడింగ్‌లను నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి కొన్ని కాంబినేషన్ థెరపీలూ నిర్ణయిస్తారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ అంటే పెదవులు, నాలుక చిగుర్లు, నోటిలోని కింది భాగం, పైభాగం, జ్ఞానదంతాల వెనుకవైపున ఉండే చిగుర్ల వంటి ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఫ్యారింజియల్ : ముక్కు వెనక కూడా ఆ భాగం 5 అంగుళాల లోతు వరకు ఉంటుంది. లారింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, వోకల్ కార్డ్స్, ఆహారాన్ని శ్వాసనాళాల్లోకి పోకుండా అడ్డుకునే ఎపిగ్లాటిస్. పారానేసల్ సైనసెస్తో పాటు నేసల్ క్యావిటీ : తల మధ్యభాగంలో ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్‌లు. లాలాజల (సెలైవరీ) గ్రంథులు : నోటి లోపల కింది భాగంలో దవడ ఎముకలకు ఇరుపక్కలా ఉండే లాలాజల గ్రంథులు. మన దేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ తరహా క్యాన్సర్లకు సంబంధించినదై ఉంటుంది. లేటు దశలో గుర్తించడం వల్ల లేదా ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) క్యాన్సర్ పాకడం వల్ల ఈ క్యాన్సర్‌కు గురైన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది వరకు ఈ క్యాన్సర్లకు గురవుతున్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ క్యాన్సర్‌కు సంబంధించినవారే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నంతో కలిపి ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లే మనదేశంలో ఈ సంఖ్య ఇంతగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. తొలిదశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లలో కనుగొంటే... కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్‌కు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లలో కీమో, రేడియేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3 డీసీఆర్, వీఎమ్‌ఏటీ, ఐఎమ్ఆర్టీ, ఐజీఆర్టీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక రేడియోథెరపీ పద్ధతులలో చికిత్స విధానాలుంటాయి. సాధారణంగా ఈ క్యాన్సర్‌కు కీమోథెరపీ పాత్ర ఒకింత తక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కీమోను కంబైన్డ్ ట్రీట్మెంట్గా లేదా కొంతవరకు ఉపశమనంగా ఉపయోగిస్తారు. ఈ చికిత్స తర్వాత బాధితులు తమకు ఇంతకుముందు ఉన్న అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నోటి పరిశుభ్రతను పాటించాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, జా–స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ల వంటివాటిని అనుసరించాలి. డాక్టర్లు సూచించిన మేరకు తప్పనిసరిగా ఫాలో–అప్‌లో ఉండాలి. మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపంతో వచ్చే నోటిపొక్కులు, అల్సర్స్ బాధాకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. నొప్పిలేని వాటిని నిర్లక్ష్యం చేస్తాం. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యూకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిథ్రోప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పక పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది డెంటల్ చెకప్స్ లేదా దంత, చిగుర్ల సంబంధిత సమస్యలతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకే తరచూ దంతవైద్యుడిని కలుస్తూ, నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండటం అవసరం. - డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు: 9849022121