క్రిష్ణగిరి( బెంగళూరు ): సూళగిరి సమీపంలోని గంగసంద్రం గ్రామానికి చెందిన నరసింహన్ మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను పెంచుతున్న ఓ మేక తలలేని మేకపిల్లకు జన్మనిచ్చింది. రెండు చెవులు మాత్రమే బయటకు ఉన్నాయి. తల లేని మేక పుట్టిందని ప్రచారం కావడంతో జనం గుంపులు గుంపులుగా వచ్చి చూశారు. ఆ వింత మేకపిల్ల కొంతసేపు మాత్రమే బతికి ఉంది.
మరో ఘటన..
విద్యుత్ కోతల బెడద
యశవంతపుర: బొగ్గు కొరత విద్యుత్ కోతలకు దారితీస్తోంది. బెంగళూరు నగరంలో ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున లోడ్ షెడ్డింగ్ (కోత)ను విధిస్తున్నారు. రాత్రిపూట కూడా అప్పుడప్పుడు కరెంట్‌ను తీసేస్తున్నారు. భారీ వర్షాలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరగకుండా కరెంట్ కట్‌చేస్తారు. అయితే అనేక ప్రాంతాల్లో వానలు లేకపోయినా కరెంటు పోతోంది. కొన్నిచోట్ల రెండు గంటలకు పైగా కోత పడుతోంది. గురువారం ఆయుధ పూజ పండుగ రోజున విద్యుత్‌లో పదేపదే అంతరాయం కలగటంపై ప్రజలు అసమాధానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంధన మంత్రి సునీల్ కుమార్ ఆకస్మికంగా బెంగళూరులోని బెస్కాం సహాయవాణి ఆఫీసును తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఎలా పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
చదవండి: చాట్ అమ్ముతూ కేజ్రీవాల్ !.. తీరా చూస్తే అసలు కథ వేరే..
Comments
Please login to add a commentAdd a comment