ప్రముఖులు, సెలబ్రెటీలు, ముఖ్యంగా రాజుల కాలం నాటి వస్తువులు వేలంలో అత్యంత ధర పలుకుతాయి. వాటికి చారిత్రక నేపథ్యం ఉండటంతో అంతలా కళ్లు చెదిరే రేంజ్‌లో ధర పలుకుతాయి. కొన్ని అరుదైన వజ్రాలు, నగలు, లేదా హస్త కళా నైపుణ్యానికి సంబంధించిన వస్తువులు అత్యంత ఖరీదు అమ్ముడుపోతాయి. కానీ మట్టితో తయారు చేసిన సాధారణ సిరామిక్ మట్టి బొమ్మ వేలంలో ఎంత పలికిందో వింటే కంగుతింటారు.
55 ఏళ్ల రేమండ్ పాటెన్ అనే వ్యక్తి వద్ద ఏళ్లుగా ఉన్న రాజవంశీకులకు సంబంధించిన సిరామిక్ మట్టి మేక బొమ్మ వేలంలో కనివినీ ఎరుగని రీతీలో రూ. 9 లక్షలకు పలిగింది. జస్ట్ మట్టి బొమ్మే కదా..!అన్ని లక్షలా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ బొమ్మను కింగ్ చార్లెస్ స్వహస్తాలతో తయారు చేసిన మట్టి మేక బొమ్మ అది. ఆ బొమ్మను 21వ పుట్టిన రోజున తన ఆంటీ ఇచ్చిందని చెప్పాడు రేమండ్.
ఆమె ఈ బొమ్మను ప్రిన్స్ చార్లెస్ తయారు చేశారని చెప్పడంతో ఇప్పటి వరకు దాన్ని అత్యంత భద్రంగా కాపాడుకుంటూ వచ్చానని అన్నారు. 1960లలో ఆమె క్వీన్స్ కాలేజ్‌లో కుక్‌గా పనిచేస్తుండేదని, ఆ టైంలో ప్రిన్స్ తన కాలేజ్‌కి రావడం తన ఆంటీ ఎంతో గర్వంగా భావించేదని చెప్పకొచ్చాడు రేమాండ్. ఆమె ఆ కేంబ్రిడ్జ్‌లోని 37 నార్‌ఫోక్ టెర్రేస్‌లో నివశించేది. ఆమె తన తాతయ్య చెల్లెలని, జీవితాంతం పెళ్లే చేసుకోలేదని చెప్పుకొచ్చారు.
ఆమె తన జీవితమంతా రాజకుటుంబ సభ్యలుకు సేవ చేస్తూ గడిపిందని, ముఖ్యంగా రాణిగారి తల్లికి వంటచేసేదని రేమాండ్ చెప్పారు. ఈ చారిత్రక ప్రాముఖ్యత కలిగన మేక విలువైన ప్రదేశంలో ఉండటం మంచిదని ఇలా వేలంలో ఉంచినట్లు అతను చెప్పుకొచ్చారు. ఇలానే గతేడాది హాన్సన్స్ వేలం పాటలో చార్లెస్ ఐదేళ్ల వయసులో గీసిన తన తల్లిదండ్రులు క్వీన్ ఎలిజబెత్II, ది డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్‌ల చిత్రాలు కూడా ఇలానే ఏకంగా రూ. 63 లక్షలు పలికడం విశేషం.
(చదవండి: పోలాండ్‌లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment