Ceramic
-
ఆ చిన్న సిరామిక్ మేక బొమ్మ అన్ని లక్షలా..!
ప్రముఖులు, సెలబ్రెటీలు, ముఖ్యంగా రాజుల కాలం నాటి వస్తువులు వేలంలో అత్యంత ధర పలుకుతాయి. వాటికి చారిత్రక నేపథ్యం ఉండటంతో అంతలా కళ్లు చెదిరే రేంజ్లో ధర పలుకుతాయి. కొన్ని అరుదైన వజ్రాలు, నగలు, లేదా హస్త కళా నైపుణ్యానికి సంబంధించిన వస్తువులు అత్యంత ఖరీదు అమ్ముడుపోతాయి. కానీ మట్టితో తయారు చేసిన సాధారణ సిరామిక్ మట్టి బొమ్మ వేలంలో ఎంత పలికిందో వింటే కంగుతింటారు. 55 ఏళ్ల రేమండ్ పాటెన్ అనే వ్యక్తి వద్ద ఏళ్లుగా ఉన్న రాజవంశీకులకు సంబంధించిన సిరామిక్ మట్టి మేక బొమ్మ వేలంలో కనివినీ ఎరుగని రీతీలో రూ. 9 లక్షలకు పలిగింది. జస్ట్ మట్టి బొమ్మే కదా..!అన్ని లక్షలా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ బొమ్మను కింగ్ చార్లెస్ స్వహస్తాలతో తయారు చేసిన మట్టి మేక బొమ్మ అది. ఆ బొమ్మను 21వ పుట్టిన రోజున తన ఆంటీ ఇచ్చిందని చెప్పాడు రేమండ్.ఆమె ఈ బొమ్మను ప్రిన్స్ చార్లెస్ తయారు చేశారని చెప్పడంతో ఇప్పటి వరకు దాన్ని అత్యంత భద్రంగా కాపాడుకుంటూ వచ్చానని అన్నారు. 1960లలో ఆమె క్వీన్స్ కాలేజ్‌లో కుక్‌గా పనిచేస్తుండేదని, ఆ టైంలో ప్రిన్స్ తన కాలేజ్‌కి రావడం తన ఆంటీ ఎంతో గర్వంగా భావించేదని చెప్పకొచ్చాడు రేమాండ్. ఆమె ఆ కేంబ్రిడ్జ్‌లోని 37 నార్ఫోక్ టెర్రేస్‌లో నివశించేది. ఆమె తన తాతయ్య చెల్లెలని, జీవితాంతం పెళ్లే చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆమె తన జీవితమంతా రాజకుటుంబ సభ్యలుకు సేవ చేస్తూ గడిపిందని, ముఖ్యంగా రాణిగారి తల్లికి వంటచేసేదని రేమాండ్ చెప్పారు. ఈ చారిత్రక ప్రాముఖ్యత కలిగన మేక విలువైన ప్రదేశంలో ఉండటం మంచిదని ఇలా వేలంలో ఉంచినట్లు అతను చెప్పుకొచ్చారు. ఇలానే గతేడాది హాన్సన్స్ వేలం పాటలో చార్లెస్ ఐదేళ్ల వయసులో గీసిన తన తల్లిదండ్రులు క్వీన్ ఎలిజబెత్II, ది డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్‌ల చిత్రాలు కూడా ఇలానే ఏకంగా రూ. 63 లక్షలు పలికడం విశేషం.(చదవండి: పోలాండ్లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!) -
రీజెన్సీ సెరామిక్స్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్ టైల్స్ మార్కెట్లోకి రీజెన్సీ సెరామిక్స్ రీఎంట్రీ ఇచ్చింది. చెన్నై విపణిలో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్‌ను గురువారం ప్రవేశపెట్టింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంలో రీజెన్సీ సెరామిక్స్‌కు తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంటు పునరుద్ధరణకు సంస్థ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. 2023 చివరినాటికి ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అలాగే పలు కంపెనీలతో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రిటైల్‌లో విస్తరించాలన్నది కంపెనీ ఆలోచన. దీర్ఘకాలిక చరిత్ర కలిగిన తమ బ్రాండ్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో మంచి పేరుందని రీజెన్సీ హోల్–టైమ్ డైరెక్టర్, సీఎఫ్‌వో సత్యేంద్ర ప్రసాద్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్ల ఆదాయం ఆర్జిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన నగరాల్లో షోరూంలను ఏర్పాటు చేస్తామన్నారు. రీజెన్సీ సెరామిక్స్‌ను 1983లో డాక్టర్ జి.ఎన్.నాయుడు స్థాపించారు. కార్మిక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం చివరకు రక్తసిక్తం కావడంతో 2012లో ప్లాంటు మూతపడింది. -
వేస్ట్ సిరామిక్స్కు దశ ‘దిశ’
పగిలిపోయిన సింక్‌ను ఏం చేస్తాం.. పనికిరాదంటూ పక్కన పడేస్తాం. ఇలాగే, విరిగిన సిరామిక్ వస్తువులను, ఇతర శానిటరీ వ్యర్థాలు దేశమంతటా చాలా చోట్ల పడేసే ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించి, వాడుకలోకి తీసుకువస్తే హస్తకళాభివృద్ధి జరుగుతుందని, పర్యావరణానికి అనర్థం తప్పుతుందని ఆలోచించి, అందుకు ఓ దిశను కనుక్కోవాలని, దేశీయ కⶠకు దశ కల్పించాలనుకుంది దిశారీ మాథుర్. జైపూర్ బ్లూ పాటరీ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన దిశారీ సిరామిక్ వ్యర్థాలలో కొత్త అర్థాలను వెతుకుతూ ‘న్యూ బ్లూ పాటరీ’ పేరు తో ఆర్ట్‌లో ఓ వినూత్న ప్రక్రియను కొనసాగిస్తోంది. మట్టిని ఉపయోగిం^è కుండా చేసే టెక్నిక్స్ లో జైపూర్ బ్లూ పాటరీ ఒకటి. సంప్రదాయ అచ్చులను ఉపయోగించి అనేక సిరామిక్ వస్తువులను తయారు చేస్తారు. ఈ అందమైన హస్తకళను నేర్చుకున్న దిశారీ పనికిరాని సింకులు, టాయిలెట్, శానిటరీ వ్యర్థాలపై దృష్టి సారించింది. వాటిని ఉపయోగించి తిరిగి అందమైన కళాకృతులు తీసుకురావడానికి మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెటీరియల్ రీసెర్చి విభాగంతో కలిసి పనిచేసింది. ‘నా ఈ ప్రయత్నాల ద్వారా చేతివృత్తుల వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు రావాలనుకుంటున్నాను’ అంటారు దిశారీ. ఇన్నోవేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పేపర్‌పై వాస్తవిక ఆలోచనలను రూపుకట్టవచ్చని చిత్రకారిణిగా కళా రంగంలోకి ప్రవేశించిన దిశారీ జార్జియాలోని సవన్నా కాలేజీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా డిగ్రీ పొందింది. అంతర్జాతీయంగా పేరొందిన దేశీ, విదేశీ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంస్థలలో పనిచేసింది. మహమ్మారి సమయంలో లండన్‌లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ ఇంపీరియల్ కాలేజీ నుండి ఇన్నోవేషన్ డిజైన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. సంభాషణలతో కొత్త భవిష్యత్తు ‘ప్రపంచ హస్తకళలో భారతదేశం అతిపెద్దది. కానీ, ప్రపంచ హస్తకళల మార్కెట్ వాటాలో మనదేశ వాటా 2 శాతం మాత్రమే. దీనిని పెంచడానికి జైపూర్ బ్లూ పాటరీ హస్తకళలను అభివృద్ధి చేయడంలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాను’ అంటూ వివరించే దిశారీ న్యూ బ్లూ పాటరీ పేరుతో శానిటరీ వ్యర్థాల నుంచి సృష్టించే కళాకృతులకు మంచి డిమాండ్ ఉంది. వీటి నిర్మాణానికి బయోడిగ్రేడబుల్, సిరామిక్ వ్యర్థాలను ఉపయోగిస్తుంది. ‘నేను జైపూర్ బ్లూ పాటరీ క్రాఫ్ట్‌ను పూర్తిగా అధ్యయనం చేశాను. 300 మంది నవతరం చేతివృత్తుల వారు ఈ రోజుకూ ఈ కళను చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నారు. హస్తకళలు జీవ నోపాధికి ప్రధానమైనవి. చేతివృత్తుల వారితో చేసిన సంభాషణలు కొత్త హస్తకళా భవిష్యత్తు కోసం, కొత్త రూపకల్పన విధానాన్ని తీసుకువచ్చేలా నన్ను ప్రేరేపించాయి’ అంటారీ యంగ్ ఇన్నోవేటర్. సిరామిక్ వ్యర్థాల నుంచి ఇంటి అలంకరణ వస్తువులే కాదు, కొత్తగా సిరామిక్ ఫర్నీచర్ కాన్సెప్ట్‌ను కూడా తీసుకువచ్చారు దిశారీ. ఇది ప్రపంచ మార్కెట్లో మన దేశీయ హస్తకళా నైపుణ్యాన్ని మరింత విస్తృతం చేస్తుందని ధీమాను వ్యక్తం చేస్తారామె. నేడు మనం నేర్చుకున్న విద్య ముందు తరాలకు మరింత మెరుగైన జీవనవిధానాన్ని అందించేలా ఉండాలని చెప్పే దిశారి ప్రతి పని, కళ ద్వారా భవిష్యత్తు పట్ల తన ప్రేమను తెలియజేస్తుంది. -
ఏపీలో సెరామిక్స్ క్లస్టర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సెరామిక్స్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు మోర్బి సెరామిక్స్ అసోసియేషన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో మూడుసార్లు చర్చలు జరిగాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలేష్ జట్‌పరియా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ అధికారుల బృందం సైతం గుజరాత్‌లోని మోర్బి క్లస్టర్‌ను పరిశీలించిందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్ ఏర్పాటు కావాలంటే కనీసం 30 కంపెనీలైనా ముందుకు రావాలి. రాజస్తాన్‌లో ఇటువంటి కేంద్రాన్ని నెలకొల్పాలని గతంలో భావించాం. ఎక్కువ కంపెనీలు ఆసక్తి చూపకపోవడంతో మా ప్రయత్నం విఫలమైంది. సెరామిక్ తయారీ కంపెనీలన్నీ దాదాపుగా మోర్బిలో కేంద్రీకృతమయ్యాయి. ఈ కంపెనీలు దక్షిణాదిలో విస్తరణకు అవకాశం ఉంది. నవంబరులో జరిగే వైబ్రాంట్ సెరామిక్స్ ఎక్స్పో వేదికగా ఏపీ క్లస్టర్‌పై తుది నిర్ణయం వెలువడుతుంది’ అని వెల్లడించారు. ప్రపంచంలో భారీగా.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నవంబరు 16 నుంచి 19 వరకు వైబ్రాంట్ సెరామిక్స్–2017 ఎక్స్పో, సమ్మిట్‌ను జరుగనుంది. చైనా కంటే చౌక, ఇటలీ కంటే మెరుగ్గా అన్న నినాదంతో ప్రపంచంలో తొలిసారిగా 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 400 బ్రాండ్ల ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించనున్నాయి. ఎక్స్పో ద్వారా ఈ ఏడాది రూ.5,000 కోట్ల వ్యాపారం అంచనా వేస్తున్నట్టు వైబ్రాంట్ సెరామిక్స్ ఎక్స్పో సీఈవో సందీప్ పటేల్ వెల్లడించారు. గతేడాది ఎక్స్‌పోలో రూ.1,300 కోట్ల వ్యాపారం నమోదైందని చెప్పారు. -
పింగాణీ కాదు.. పేక ముక్కలు
సాధారణంగా చైనాలో పింగాణీ గిన్నెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న పాత్రలు మాత్రం పింగాణీవే అనుకుంటే పొరపాటే.. ఆ ఫొటోను తీక్షణంగా చూస్తే మీకే అర్థం అవుతుంది.. వీటిని పేక ముక్కలతో తయారు చేశారు. ఇది కొత్తేమీ కాదుకానీ.. మనిషి ఎత్తులో, సహజత్వం ఉట్టిపడేలా పాత్రలను తయారుచేయడం మాత్రం ఇది మొదలు. వీటి రూపకర్త 65 ఏళ్ల జాంగ్ కెహువా. ఈ పాత్రలు అచ్చం పోర్సిలిన్‌తో తయారైన పింగాణీ పాత్రల్లా కనిపించడం అతనికి మరింత పేరు తెచ్చిపెట్టింది. మేస్త్రీ అయిన వాంగ్‌కు కొన్నేళ్ల క్రితం ఒక పాప వీధిలో ప్లేయింగ్ కార్డులను చిన్నచిన్న త్రిభుజాకారంగా చుడుతోంది. అది చూసిన వాంగ్... ఆ టెక్నిక్‌ను ఉపయోగించుకుని వివిధ ఆకారాల్లో వస్తువులను ఎందుకు తయారుచేయకూడదు అని అనుకున్నాడు. దీంతో తొలిసారిగా అతనికి కలిగిన ఆ ఆలోచనతో పింగాణీ పాత్రల ఆకారాలను తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇతను చేసిన ఒక పాత్ర 106 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. అందుకు 5 వేల కార్డులు ఉపయోగించి ఒక వారం రోజుల్లో పూర్తి చేశాడు. -
అందమె ఆనందం
వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే వాటిని భద్రపరిచే చోట కర్పూరం బిళ్ళలు ఉంచాలి. వరిపిండి, శనగపిండి లాంటివి కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. -
ఇంటిప్స్
గుప్పెడు ఉప్పును నీటిలో వేసి ఆ నీటితో గాజు, పింగాణీ పాత్రలను శుభ్రం చేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. లంచ్ బాక్స్ శుభ్రం చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు వాసన వస్తుంటుంది. ప్లాస్టిక్ మూతలపై నూనె మరకలు కూడా పోవు. అలాంటప్పుడు నిమ్మ చెక్కతో పాత్రను రబ్ చేసి మరొకసారి కడగితే ఎలాంటి దుర్వాసన ఉండదు.పొడిబారిపోయి గట్టిపడ్డ గమ్ బాటిల్లో కొంచెం వెనిగర్ వేస్తే ఆ గమ్‌ను మళ్లీ వాడుకోవచ్చు. గడ్డ పెరుగుపై తేలిన నీటితో నల్లబడిన వెండి సామాన్లు కడిగితే కొత్తవాటిలా తయారవుతాయి. ఆపిల్ ముక్కలు కట్ చేయగానే, వాటికి కాస్త నిమ్మరసం రుద్దితే నల్లగా మారకుండా సహజమైన రంగులో ఉంటాయి. టొమాటోలు లేని సీజన్లో ప్రత్యామ్నాయంగా టొమాటో కెచప్గాని, టొమాటో సాస్ని గాని గ్రేవీల్లో వాడితే పెద్దగా తేడా ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూరల్లో వాడేటప్పుడు అల్లం 60 శాతం, వెల్లుల్లి 40 శాతం ఉండేలా పేస్ట్ చేసుకోవాలి. శనగలు, రాజ్మాని ముందు రోజు నానబెట్టడం మరిచిపోతే, అరగంటపాటు వేడినీటిలో నానబెట్టి వండితే సరిపోతుంది. నూడుల్స్‌ని ఉడకబెట్టిన వెంటనే, చన్నీటిలో వేస్తే నూడుల్స్ విడివిడిగా అవుతాయి. -
కాఫీ కప్పులు
విడ్డూరం ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్నవి అచ్చంగా కాఫీ కప్పులు. మాకు తెల్దేంటి అని కోప్పడిపోకండి. వీటిలో కాఫీ మాత్రమే తాగాలనే రూలేమీ లేదు. నిక్షేపంగా టీ కూడా తాగొచ్చు. ఊరకే సోదంతా దేనికి గానీ విషయానికి రమ్మంటారా..? ఆగండాగండి... విషయానికే వచ్చేద్దాం. ఇంతకీ విషయం ఏమిటంటారా? ఇవి పింగాణీ కప్పులో, గాజు కప్పులో కావు. కనీసం మట్టితో తయారు చేసి, రంగు పూసినవి కూడా కాదు. కాఫీతో తయారు చేసిన అచ్చమైన కాఫీ కప్పులు ఇవి. కాఫీ గింజలను మిషన్‌లో వేసి తయారు చేసుకున్నా, ఇంట్లో డికాక్షన్ కాచుకుని ఫిల్టర్ కాఫీ తయారు చేసుకున్నా, అడుగున మిగిలిపోయిన కాఫీ పొడిని సాధారణంగా చెత్తబుట్టలో పారేస్తూ ఉంటాం. కొందరు పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆ పొడిని చెత్తబుట్టలో పడేయకుండా మొక్కలకు గత్తంగా కూడా వాడుతూ ఉంటార్లెండి. అది వేరే విషయం. కాఫీ కాచుకున్నాక మిగిలిపోయిన పొడిని చెత్తబుట్టలో పడేయడమో, గత్తంగా వాడటమో కాకుండా వెరైటీగా ఏదైనా చేయాలని ఆలోచించింది ‘కాఫీ ఫార్మ్’ అనే జర్మన్ కంపెనీ. ఆలోచన వచ్చిందే తడవుగా వృథాగా మిగిలిన కాఫీ పొడితో కప్పుల తయారీకి ప్రయోగాలు చేసింది. ఎట్టకేలకు ప్రయోగాలు విజయవంతమై చూడచక్కని కాఫీ కప్పులు తయారయ్యాయి. అలాగని ఇవి వాడి పారేసే ‘యూజ్ అండ్ త్రో’ కప్పుల్లాంటివి కావు. పింగాణీ, గాజు కప్పుల మాదిరిగానే మన్నికగా ఉంటాయి. -
ఇంటిప్స్
పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి. పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. -
రైస్ భరోసా
ఇంటిప్స్ వెండి వస్తువులు ఎక్కడ పెట్టినా త్వరగా రంగు మారుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఆ వస్తువులు ఉన్న చోట ఒక మూత లేని గిన్నెలో కొన్ని బియ్యం పోసి ఆ వస్తువుల పక్కనే పెట్టండి. గాల్లోని తేమనంతా బియ్యం లాక్కొని వస్తువుల రంగు మారనివ్వవు. గాజు సీసాలు, పింగాణీ కుండీలను శుభ్రం చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు వాటిలో పిడికెడు బియ్యం, కొద్దిగా సబ్బు పొడి, కొన్ని నీళ్లు పోసి జాగ్రత్తగా ఊపండి. అలా చేస్తే అడుగున ఉన్న మట్టి, మురికి శుభ్రమవుతుంది.లోహాలతో చేసిన పరికరాలను ఎక్కువ కాలం బయటపెడితే అవి తుప్పుపడుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే టూల్‌బాక్స్‌లో కొన్ని బియ్యం పోయండి. అవి గాలిలోని తేమను గ్రహించి పరికరాలకు తుప్పు పట్టకుండా చేస్తాయి. అనుకోకుండా మీ ఫోన్ నీళ్లలో కానీ వర్షానికి గానీ తడిసిందా? అయితే వెంటనే బ్యాటరీ లాంటి భాగాలను విడివిడిగా తొలగించి ఓ గిన్నెలో కొన్ని బియ్యం పోసి అందులో పెట్టండి. మీ ఫోన్‌కు ఏ డ్యామేజీ ఉండదు. అలా కాకుండా హెయిర్ డ్రైయర్ వాడితే ఫోన్లోని మెటల్ భాగాలు కరిగిపోయే అవకాశం ఉంటుంది. -
రికార్డులు బ్రే‘కప్’..
సాధారణ పింగాణీ పాత్రలాగ కనిపిస్తున్న ఇది.. చెంగువా చికెన్ కప్. 1465లో అప్పటి చైనాను పాలించిన చెంగువా పాలకుల హయాంలో వీటిని తయారుచేశారు. మ్యూజియంలను మినహాయిస్తే.. ప్రైవేటు వ్యక్తుల వద్ద ప్రస్తుతం ఇలాంటి కప్‌లు నాలుగు మాత్రమే ఉన్నాయి. అంతటి అరుదైనదన్న మాట. వచ్చే నెల 8న దీన్ని హాంకాంగ్‌లో వేలం వేయనున్నారు. అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ.. కనీసం రూ.245 కోట్లు పలుకుతుందని అంచనా.