దిశారి మాథుర్
పగిలిపోయిన సింక్‌ను ఏం చేస్తాం.. పనికిరాదంటూ పక్కన పడేస్తాం. ఇలాగే, విరిగిన సిరామిక్ వస్తువులను, ఇతర శానిటరీ వ్యర్థాలు దేశమంతటా చాలా చోట్ల పడేసే ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించి, వాడుకలోకి తీసుకువస్తే హస్తకళాభివృద్ధి జరుగుతుందని, పర్యావరణానికి అనర్థం తప్పుతుందని ఆలోచించి, అందుకు ఓ దిశను కనుక్కోవాలని, దేశీయ కⶠకు దశ కల్పించాలనుకుంది దిశారీ మాథుర్.
జైపూర్ బ్లూ పాటరీ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన దిశారీ సిరామిక్ వ్యర్థాలలో కొత్త అర్థాలను వెతుకుతూ ‘న్యూ బ్లూ పాటరీ’ పేరు తో ఆర్ట్‌లో ఓ వినూత్న ప్రక్రియను కొనసాగిస్తోంది. మట్టిని ఉపయోగిం^è కుండా చేసే టెక్నిక్స్ లో జైపూర్ బ్లూ పాటరీ ఒకటి. సంప్రదాయ అచ్చులను ఉపయోగించి అనేక సిరామిక్ వస్తువులను తయారు చేస్తారు. ఈ అందమైన హస్తకళను నేర్చుకున్న దిశారీ పనికిరాని సింకులు, టాయిలెట్, శానిటరీ వ్యర్థాలపై దృష్టి సారించింది. వాటిని ఉపయోగించి తిరిగి అందమైన కళాకృతులు తీసుకురావడానికి మాల్వియా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెటీరియల్ రీసెర్చి విభాగంతో కలిసి పనిచేసింది. ‘నా ఈ ప్రయత్నాల ద్వారా చేతివృత్తుల వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు రావాలనుకుంటున్నాను’ అంటారు దిశారీ.
ఇన్నోవేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ
పేపర్‌పై వాస్తవిక ఆలోచనలను రూపుకట్టవచ్చని చిత్రకారిణిగా కళా రంగంలోకి ప్రవేశించిన దిశారీ జార్జియాలోని సవన్నా కాలేజీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా డిగ్రీ పొందింది. అంతర్జాతీయంగా పేరొందిన దేశీ, విదేశీ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంస్థలలో పనిచేసింది. మహమ్మారి సమయంలో లండన్‌లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ ఇంపీరియల్ కాలేజీ నుండి ఇన్నోవేషన్ డిజైన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.
సంభాషణలతో కొత్త భవిష్యత్తు
‘ప్రపంచ హస్తకళలో భారతదేశం అతిపెద్దది. కానీ, ప్రపంచ హస్తకళల మార్కెట్ వాటాలో మనదేశ వాటా 2 శాతం మాత్రమే. దీనిని పెంచడానికి జైపూర్ బ్లూ పాటరీ హస్తకళలను అభివృద్ధి చేయడంలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాను’ అంటూ వివరించే దిశారీ న్యూ బ్లూ పాటరీ పేరుతో శానిటరీ వ్యర్థాల నుంచి సృష్టించే కళాకృతులకు మంచి డిమాండ్ ఉంది. వీటి నిర్మాణానికి బయోడిగ్రేడబుల్, సిరామిక్ వ్యర్థాలను ఉపయోగిస్తుంది. ‘నేను జైపూర్ బ్లూ పాటరీ క్రాఫ్ట్‌ను పూర్తిగా అధ్యయనం చేశాను.
300 మంది నవతరం చేతివృత్తుల వారు ఈ రోజుకూ ఈ కళను చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నారు. హస్తకళలు జీవ నోపాధికి ప్రధానమైనవి. చేతివృత్తుల వారితో చేసిన సంభాషణలు కొత్త హస్తకళా భవిష్యత్తు కోసం, కొత్త రూపకల్పన విధానాన్ని తీసుకువచ్చేలా నన్ను ప్రేరేపించాయి’ అంటారీ యంగ్ ఇన్నోవేటర్. సిరామిక్ వ్యర్థాల నుంచి ఇంటి అలంకరణ వస్తువులే కాదు, కొత్తగా సిరామిక్ ఫర్నీచర్ కాన్సెప్ట్‌ను కూడా తీసుకువచ్చారు దిశారీ. ఇది ప్రపంచ మార్కెట్‌లో మన దేశీయ హస్తకళా నైపుణ్యాన్ని మరింత విస్తృతం చేస్తుందని ధీమాను వ్యక్తం చేస్తారామె.
నేడు మనం నేర్చుకున్న విద్య ముందు తరాలకు మరింత మెరుగైన జీవనవిధానాన్ని అందించేలా ఉండాలని చెప్పే దిశారి ప్రతి పని, కళ ద్వారా భవిష్యత్తు పట్ల తన ప్రేమను తెలియజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment