Waste Material
-
వేస్ట్‌తో బెస్ట్
యువత సామాజిక బాధ్యతతో ఓ ముందడుగు వేస్తే వారి వెనుక నడవడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది. ప్రకృతి, అక్షరల ప్రయోగాన్ని విజయవంతం చేసి ఆ విషయాన్ని నిరూపించింది ముంబయి నగరం. టెక్స్టైల్ రంగంలో వచ్చే వేస్ట్ మెటీరియల్‌తో ఫ్యాషన్ మార్కెట్లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్లు తమ జుహూ బీచ్ స్టూడియో బ్రాండ్‌ను సగర్వంగా ప్రకటించు కుంటున్నారు.హ్యాట్ కేక్ముంబయికి చెందిన ప్రకృతి రావు, అక్షర మెహతాలు అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. కోర్సు పూర్తయింది ఇక కెరీర్ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. మార్కెట్లోకి కొత్త ఆలోచనలతో రావాలి. అది పర్యావరణానికి హితంగానూ ఉండాలి... అని ఆలోచించిన మీదట వారికి వచ్చిన ఆలోచన ఇది. చేనేత, వస్త్రాలకు రంగులద్దే కుటుంబ నేపథ్యం వారిది. వస్త్రాల మీద ఒకింత అవగాహన ఎక్కువనే చెప్పాలి. రా మెటీరియల్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలని ఆలోచించారు. వస్త్రాల తయారీ పరిశ్రమల నుంచి తానులోకి రీల్ చుట్టగా మిగిలిన క్లాత్, ఎక్కడో ఓ చోట మిస్ ప్రింట్ కారణంగా పక్కన పడేసిన మీటర్ల కొద్దీ వస్త్రం... ఇలా సేకరించిన క్లాత్‌తో నాలుగేళ్ల కిందట 60 హ్యాట్లు తయారు చేశారు. అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ తర్వాత వంద స్లింగ్ బ్యాగ్‌లు చేశారు. తమ మీద తమకు ధైర్యం వచ్చిన తర్వాత బేబీ ప్రోడక్ట్స్ మీద దృష్టి పెట్టారు. వారి ప్రయోగం పూర్తి స్థాయి వ్యాపార రూపం సంతరించుకుంది. ముంబయిలోని జుహూ బీచ్ స్టూడియో (జేబీఎస్) వారి వర్క్ ప్లేస్. ఇప్పుడు వాళ్లు పదిమంది మహిళలకు హ్యాండ్ క్రాఫ్ట్స్‌లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పించారు. గిఫ్ట్ ఆర్టికల్స్ మార్కెట్లో జేబీఎస్ ఒక బ్రాండ్ ఇప్పుడు. నిరుపయోగం కాకూడదుప్రకృతి రావు... టెక్స్టైల్ రంగం గురించి వివరిస్తూ... వస్త్రం తయారయ్యే క్రమంలో భూగర్భ జలాలు భారీ స్థాయిలో ఖర్చవుతాయి. తయారైన వస్త్రం అంతా ఉపయోగంలోకి రాకపోతే ఎలా? మిల్లులో తయారయ్యే వస్త్రంలో ముప్పావు వంతు మాత్రమే మార్కెట్‌కు వెళ్తోంది. మిగిలినది వృథా అవుతుంటుంది. ఇక ఫ్యాషన్ స్టూడియోల దగ్గరకు చేరిన క్లాత్‌లో డిజైన్ కోసం కొంత వాడేసి మిగిలినదానిని పారేస్తుంటాయి. ఇలా చెత్తకుండీల్లోకి చేరిన క్లాత్ మట్టిలో కలిసేలోపు కాలువల్లోకి చేరి ప్రవాహాలకు అడ్డుపడి వరదలకు కారణమవుతాయి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న వనరులను నూటికి నూరుశాతం ఉపయోగించుకోవాలి. అదే ప్రకృతికి, పర్యావరణానికి మనమిచ్చే గౌరవం అన్నారు ప్రకృతిరావు, అక్షర మెహతా. -
SPACE DEBRIS: అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్!
అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూ వస్తోంది. అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణమూ నానాటికీ పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతోపాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతోంది... 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలుసా? ఏకంగా 2,917! అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుతి్నక్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యే చాలా ఎక్కువట! ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి! ఇవిగాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పని చేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24 వేల పై చిలుకే ఉంటాయట! ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తమ్మీద యాక్టివ్ ఉపగ్రహాలు, వ్యర్థాలూ కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద ‘అంతరిక్ష వస్తువుల’ మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37 వేలు దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి! అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే అయితే లెక్కాపత్రం లేదు. మొత్తమ్మీద అంతరిక్షంలో ఇలాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8 వేల టన్నులు దాటిపోయిందట! వీటితో ప్రమాదాలెన్నో... ► అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు ఇన్నీ అన్నీ కావు... ► భూ కక్ష్యలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఇవి ఢీకొనే ముప్పుంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయప్రయాసలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది. ► 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. ► 1996లో ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహం సెరీస్ను కూడా 1986లో పేలిపోయిన ఏరియన్ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి. ► 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్‌ప్రెస్ కూడా గుర్తు తెలియని శకలం దెబ్బకు శాశ్వతంగా మూగబోయింది. ► 2009లో టెరా, 2010లో ఆరా 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారినపడ్డాయి. ► 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోస్ 2251, 560 కిలోల ఇరీడియం33 ఉపగ్రహాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి. వినువీధిలో రెండు భారీ ఉపగ్రహాలు గుద్దుకోవడం అదే తొలిసారి! ► అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకు భూ దిగువ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారవచ్చు. ఐఎస్‌ఎస్‌కూ ముప్పే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు కూడా ఈ వ్యర్థాలతో పెను ముప్పే పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. 2019 నాటికే ఐఎస్ఎస్ను 1,400కు పైగా బుల్లి వ్యర్థాలు ఢీకొట్టాయట. వీటి బారినుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్ వ్యవస్థ ఐఎస్ఎస్లో ఉంది. కానీ ఐఎస్ఎస్ తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటిని వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువ! వ్యర్థాలు ఢీకొట్టనున్నాయన్న హెచ్చరికలతో ఐఎస్ఎస్ సిబ్బంది ఇప్పటిదాకా మూడుసార్లు సమీపంలోని సూయజ్ క్యాప్సూల్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచి్చంది! రోజుకొకటి చొప్పున భూమిపైకి... ► ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష్య నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తుంటాయి. ► చిన్నవైతే భూమిదాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి. ► పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి. ► అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం మూడు వ్యర్థాలు కక్ష్య కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయట. ► వాటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి! ► ఓజోన్ పొర దెబ్బ తినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. ► పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్ రేడియేషన్ బారినుంచి భూమిని కాపాడే మాగ్నెటోస్పియర్ కూడా దెబ్బ తింటోందని తాజా అధ్యయనంలో తేలింది. ► ఈ అంతరిక్ష వ్యర్థాల కట్టడికి ఇప్పటిదాకానైతే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం గానీ, దేశాల మధ్య ఒప్పందాలు గానీ లేవు. ► అయితే ఈ దిశగా ఐరాస తాలూకు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ కమిటీ 2007లో కొన్ని నిర్దేశాలు రూపొందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యర్థం నుంచి అర్థం.. రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు?
2020లో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేతలో వెలువడిన నిర్మాణ వ్యర్థాలు 1,46,000 మెట్రిక్ టన్నులు. వీటన్నింటినీ ఏం చేయాలి? పెద్ద సమస్య! హైదరాబాద్‌లోనే భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఉండటంతో అక్కడకు తరలించారు. 2022లో నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను కూల్చివేసినప్పుడు వెలువడిన వ్యర్థాలు 30,000 మెట్రిక్‌టన్నులు. వాటినేం చేయాలి ? అక్కడ ఉన్న ప్లాంట్‌కు తరలిస్తూ రీసైక్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయాన్ని కూల్చివేస్తే, నోయిడాలో అక్రమ నిర్మాణం జరిపినందున సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూల్చేశారు. ఇలా పెద్ద పెద్ద భవంతులే కాదు ఏ రకమైన నిర్మాణాలను కూల్చివేసినా, లేదా కొత్తగా నిర్మాణాలు చేపట్టినా నిర్మాణ ప్రక్రియలోను, కూల్చివేతల తర్వాత వ్యర్థాలు వెలువడటం తెలిసిందే. ప్లాస్టిక్ మాదిరిగానే వీటిని కూడా రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించేందుకు సీ అండ్ డీ వేస్ట్ (నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల) రీసైక్లింగ్ ప్లాంట్స్ ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు సీ అండ్ డీ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. దేశవ్యాప్తంగా 250 రీసైక్లింగ్ కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, సూరత్, థానే, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సీ అండ్ డీ వేస్ట్ నిర్వహణకు ఇప్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో రెండు ప్లాంట్లు ఈ సంవత్సరం అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లోని ప్లాంట్లను హైదరాబాద్ సీ అండ్ డీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రాంకీకి చెందిన ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా పేరు మారింది) నిర్వహిస్తుండగా, సోమ శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ (ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్‌గానూ వ్యవహరిస్తున్నారు) నగర శివార్లలోని శామీర్‌పేట దగ్గరి తూముకుంట, శంషాబాద్‌లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. జూన్ నాటికి వీటి పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ సంస్థ సీ అండ్ డీ వ్యర్థాలను సేకరిస్తోంది. రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు? శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. దుమ్మూధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్ వాషింగ్ అండ్ క్రషింగ్‌తో ‘వెట్‌ప్రాసెస్’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రీసైక్లింగ్‌కు పనికిరాని చెక్క, ప్లాస్టిక్ వంటివి వేరు చేశాక ప్రాసెసింగ్‌లో సిల్ట్, ఇసుక, కంకరలు, లోహాలు తదితరమైనవి విడివిడిగా బయటకు వస్తాయి. ఇసుక, మెటల్, కంకరలను యాడ్‌మిక్సర్లు వాడి ఇటుకలు, పేవర్‌బ్లాక్‌లు, కెర్బ్‌స్టోన్, టైల్స్, ప్రీకాస్ట్ వాల్స్ వంటివి తయారు చేస్తారు. క్రషింగ్ ద్వారా కంకరను 20 మిమీ కంటే ఎక్కువ, 20మిమీ కంటే తక్కువ సైజు కంకరగా రెండు మూడు రకాలు, ఇసుకను సన్న ఇసుక, దొడ్డు ఇసుకగా మారుస్తున్నారు. కంకరను రోడ్లకు పై పొరగా కాకుండా లెవెల్ ఫిల్లింగ్‌కు వాడొచ్చు. ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీ గాను, ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వాడవచ్చు. సిల్ట్‌ను ల్యాండ్‌ఫిల్లింగ్‌కు వాడవచ్చు. వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్ అనే రెండు విభాగాలుగా ఈ పనులు చేస్తున్నారు. దేశంలో రీసైక్లింగ్ ఒక్క శాతమే.. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోలిస్తే సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌లో హైదరాబాదే నయం. మన దేశంలో ఏటా వెలువడుతున్న సీ అండ్ డీ వ్యర్థాలు 54.57 మిలియ¯Œ టన్నులు కాగా 1.80 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం సీ అండ్ డీ వ్యర్థాల్లో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో రోజుకు 2200 టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 2200 మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఒక్కోప్లాంట్ సామర్థ్యం రోజుకు 500 మెట్రిక్ టన్నులు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల రీసైక్లింగ్ మొత్తం పూర్తయితే రోజూ వెలువడే వ్యర్థాలను దాదాపుగా ఎప్పటికప్పుడే రీసైకిల్ చేయవచ్చు. ప్రస్తుతం రోజుకు 1200 మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతోంది. గత నవంబర్ వరకు సేకరించిన మొత్తం వ్యర్థాలు 21.30 లక్షల మెట్రిక్ టన్నులు. అందులో 19.20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై కుమ్మరించిందే! మిగతాది నిర్మాణదారులు తరలించింది. జీహెచ్ఎంసీలో ఇలా.. జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లున్నాయి. వీటిల్లో ఒక్కో సంస్థకు 15 సర్కిళ్లలోని వ్యర్థాలను తరలించేలా జీహెచ్ఎంసీ వాటితో ఒప్పందం కుదుర్చుకుంది. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం–పటా¯Œ చెరువు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను జీడిమెట్ల ప్లాంట్‌కు తరలిస్తారు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీ నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సంతోష్‌నగర్, అంబర్‌పేట సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇందుకోసం ప్రజలు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ ఫో¯Œ నంబర్: 18001201159, వాట్సాప్ నంబర్: 9100927073. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలోని వ్యర్థాలను శంషాబాద్ సెంటర్‌కు; కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలోని వ్యర్థాలను శామీర్‌పేట దగ్గరి తూముకుంట సెంటర్‌కు తరలిస్తారు. టోల్‌ఫ్రీ నంబర్ 18002030033కు ఫోన్ చేసి, లేదా వాట్సాప్‌నంబర్ 7330000203 ద్వారా సంప్రదించి తరలించవచ్చు. ఎంత ఫీజు.. వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్‌కు చెల్లించాల్సిన ఫీజులు మెట్రిక్ టన్నుకు ప్లాంట్ల వారీగా ఇలా ఉన్నాయి. జీడిమెట్ల: రూ.399, ఫతుల్లాగూడ:రూ. 389, శామీర్‌పేట:రూ.435, శంషాబాద్:రూ.405. ఈ మేరకు ఆయా సంస్థలు జీహెచ్ఎంసీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ∙ సిహెచ్ వెంకటేశ్ నైపుణ్యంతో నాణ్యమైన ఉత్పత్తులు.. నైపుణ్యాలను పెంచుకుంటూ ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’ సీ అండ్ డీ వ్యర్థాలతో నాణ్యమైన, మన్నిక కలిగిన, విలువైన ఉత్పత్తుల్ని చేస్తోంది. మా కంపెనీకి చెందిన ఆరు కేంద్రాల ద్వారా ఏటా 3,10,985 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 92 శాతం రీసైక్లింగ్ సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మరో రెండు కేంద్రాలు పని ప్రారంభించనున్నాయి. ఈ రంగంలో గడించిన అనుభవంతో వేస్ట్‌ను ఆదాయ వనరుగా మారుస్తున్నాం. గత సంవత్సరం పేవర్బ్లాకులు, కెర్బ్స్టో¯Œ ్స, ఇటుకలతో సహా మొత్తం 1,83,561 యూనిట్లను ఉత్పత్తి చేశాం. నోయిడాలో సూపర్‌టెక్ ట్వి¯Œ టవర్స్ కూల్చివేతలో వెలువడిన 30వేల టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలను రీసైక్లింగ్‌తో నాణ్యమైన నిర్మాణ ఉత్పత్తులుగా మారుస్తున్నాం. రీసైక్లింగ్ ద్వారా మెరుగైన ఉత్పత్తులతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్‌ను అందజేస్తున్నాం. రోజురోజుకూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నాం. – గౌతమ్‌రెడ్డి, ఎండీ, రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్. జాతికి మేలు జరగాలని.. మూడు దశాబ్దాలకుపైగా భవనాలు, బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణరంగంలో ఉన్న మా సంస్థ ద్వారా ప్రజలకు, పర్యావరణానికి మేలు చేయాలనే తలంపుతో ఈ రంగంలోకి ప్రవేశించాం. పునరుత్పత్తులపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఏమైనా చేయవచ్చుననే నమ్మకం ఉంది. వేల టన్నులతో గుట్టలుగా పేరుకుపోతున్న సీ అండ్ డీ వ్యర్థాలతో ఎన్నో అనర్థాలున్నాయి. చెరువుల్లో నింపుతున్నందున చెరువులు కనుమరుగవుతున్నాయి. సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్ ఎందుకు జరగడం లేదా అని ఎన్నో ఏళ్లనుంచి ఆలోచిస్తున్నాం. దేశంలోని వివిధ నగరాల్లో రెండు సంవత్సరాలు పరిశోధన చేశాం. ఆయా నగరాల్లో రీసైక్లింగ్ ప్లాంట్ల పనితీరు పరిశీలించాం. చేయగలమనే నమ్మకంతో ఈ రంగంలోకి దిగాం. ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలకు తగిన అవగాహన కలిగేలా విస్తతంగా ప్రచారం చేయాల్సి ఉంది. ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పునరుత్పత్తులను ప్రోత్సహించాలి. భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలోనే అధికారులు ఈ ఉత్పత్తుల గురించి తెలియజేయాలి. – సోమ శ్రీనివాసరెడ్డి, ఫౌండర్, ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రభుత్వ నిబంధనల మేరకు సీ అండ్ డీ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. దేశవ్యాప్తంగా 250 రీసైక్లింగ్ కేంద్రాలు అవసరం కాగా, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, సూరత్, థానే, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్ల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సీ అండ్ డీ వేస్ట్ నిర్వహణకు ఇప్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో రెండు ప్లాంట్లు ఈ సంవత్సరం అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లోని ప్లాంట్లను హైదరాబాద్ సీ అండ్ డీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రాంకీకి చెందిన ‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా పేరు మారింది) నిర్వహిస్తుండగా, సోమ శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ (ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్‌గానూ వ్యవహరిస్తున్నారు) నగర శివార్లలోని శామీర్‌పేట దగ్గరి తూముకుంట, శంషాబాద్‌లలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. జూన్ నాటికి వీటి పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతానికి ఈ సంస్థ సీ అండ్ డీ వ్యర్థాలను సేకరిస్తోంది. రీసైక్లింగ్‌తో ఏం చేస్తారు? శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. దుమ్మూధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్ వాషింగ్ అండ్ క్రషింగ్‌తో ‘వెట్‌ప్రాసెస్’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రీసైక్లింగ్‌కు పనికిరాని చెక్క, ప్లాస్టిక్ వంటివి వేరు చేశాక ప్రాసెసింగ్‌లో సిల్ట్, ఇసుక, కంకరలు, లోహాలు తదితరమైనవి విడివిడిగా బయటకు వస్తాయి. ఇసుక, మెటల్, కంకరలను యాడ్‌మిక్సర్లు వాడి ఇటుకలు, పేవర్‌బ్లాక్‌లు, కెర్బ్‌స్టోన్, టైల్స్, ప్రీకాస్ట్ వాల్స్ వంటివి తయారు చేస్తారు. క్రషింగ్ ద్వారా కంకరను 20 మిమీ కంటే ఎక్కువ, 20మిమీ కంటే తక్కువ సైజు కంకరగా రెండు మూడు రకాలు, ఇసుకను సన్న ఇసుక, దొడ్డు ఇసుకగా మారుస్తున్నారు. కంకరను రోడ్లకు పై పొరగా కాకుండా లెవెల్ ఫిల్లింగ్‌కు వాడొచ్చు. ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీ గాను, ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వాడవచ్చు. సిల్ట్‌ను ల్యాండ్‌ఫిల్లింగ్‌కు వాడవచ్చు. వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్ష¯Œ అనే రెండు విభాగాలుగా ఈ పనులు చేస్తున్నారు. దేశంలో రీసైక్లింగ్ ఒక్క శాతమే.. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోలిస్తే సీ అండ్ డీ వ్యర్థాల రీసైక్లింగ్‌లో హైదరాబాదే నయం. మన దేశంలో ఏటా వెలువడుతున్న సీ అండ్ డీ వ్యర్థాలు 54.57 మిలియ¯Œ టన్నులు కాగా 1.80 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం సీ అండ్ డీ వ్యర్థాల్లో కేవలం ఒక శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో రోజుకు 2200 టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 2200 మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఒక్కోప్లాంట్ సామర్థ్యం రోజుకు 500 మెట్రిక్ టన్నులు. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన వ్యర్థాల రీసైక్లింగ్ మొత్తం పూర్తయితే రోజూ వెలువడే వ్యర్థాలను దాదాపుగా ఎప్పటికప్పుడే రీసైకిల్ చేయవచ్చు. ప్రస్తుతం రోజుకు 1200 మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతోంది. గత నవంబర్ వరకు సేకరించిన మొత్తం వ్యర్థాలు 21.30 లక్షల మెట్రిక్ టన్నులు. అందులో 19.20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై కుమ్మరించిందే! మిగతాది నిర్మాణదారులు తరలించింది. జీహెచ్ఎంసీలో ఇలా.. జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లున్నాయి. వీటిల్లో ఒక్కో సంస్థకు 15 సర్కిళ్లలోని వ్యర్థాలను తరలించేలా జీహెచ్ఎంసీ వాటితో ఒప్పందం కుదుర్చుకుంది. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం–పటాన్ చెరువు, మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను జీడిమెట్ల ప్లాంట్‌కు తరలిస్తారు. ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీ నగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, సంతోష్‌నగర్, అంబర్‌పేట సర్కిళ్ల పరిధిలోని సీ అండ్ డీ వ్యర్థాలను ఫతుల్లాగూడ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇందుకోసం ప్రజలు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ ఫోన్ నంబర్: 18001201159, వాట్సాప్ నంబర్: 9100927073. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ సర్కిళ్లలోని వ్యర్థాలను శంషాబాద్ సెంటర్‌కు; కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలోని వ్యర్థాలను శామీర్‌పేట దగ్గరి తూముకుంట సెంటర్‌కు తరలిస్తారు. టోల్‌ఫ్రీ నంబర్ 18002030033కు ఫోన్ చేసి, లేదా వాట్సాప్‌నంబర్ 7330000203 ద్వారా సంప్రదించి తరలించవచ్చు. ఎంత ఫీజు.. వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్‌కు చెల్లించాల్సిన ఫీజులు మెట్రిక్ టన్నుకు ప్లాంట్ల వారీగా ఇలా ఉన్నాయి. జీడిమెట్ల: రూ.399, ఫతుల్లాగూడ:రూ. 389, శామీర్‌పేట:రూ.435, శంషాబాద్:రూ.405. ఈ మేరకు ఆయా సంస్థలు జీహెచ్ఎంసీతో పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ∙ సిహెచ్ వెంకటేశ్ -
ఫలిస్తున్న ఆపరేషన్ ‘క్లీన్’
సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సంస్కరణలు ఫలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ ఇప్పటికే మెరుగుపడింది. ఇంటింటికీ మూడు రంగుల చెత్త డబ్బాల పంపిణీతో ప్రజల్లో సైతం మార్పు కనిపిస్తోంది. ఇంటి వద్దకే చెత్త తరలింపు వాహనాలు వస్తుండటంతో ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ జనాభా గల మునిసిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్–1 మునిసిపాలిటీల్లో చెత్త తరలింపునకు ఆధునిక హైడ్రాలిక్ టిప్పర్లను ప్రభుత్వం అందించింది. మొత్తం 42 యూఎల్బీలకు 2,525 హైడ్రాలిక్ టిప్పర్లు అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. వాటిలో 2,465 హైడ్రాలిక్ టిప్పర్లను ఆయా యూఎల్బీలకు అందజేశారు. మరో 60 టిప్పర్లను సంక్రాంతి తర్వాత అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేడ్–2, 3 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం 1,123 ఈ–ఆటోలను అందించనున్నారు. వీటిలో 387 వాహనాలను వచ్చే నెలలో అందించనున్నారు. హైడ్రాలిక్ టిప్పర్ల ద్వారా చెత్తను సేకరించి, ట్రాన్స్‌పోర్టు స్టేషన్లకు తరలించేందుకు వినియోగిస్తున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం తగ్గినట్టు అధికారులు గుర్తించారు. గతంలో వీధుల్లో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను తొలగించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తిరిగి చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు. 137 జీటీఎస్‌ల నిర్మాణానికి ప్రణాళిక ఏరోజుకారోజు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ప్రాధమిక దశలో స్థానికంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పోర్టు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఆయా పట్టణాల్లో ప్రతి 8 నుంచి 10 వార్డుకు ఒకటి చొప్పున చెత్త రవాణా కేంద్రాన్ని (జీటీఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇలా 83 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం రూ.185 కోట్లతో 137 జీటీఎస్‌ల నిర్మాణానికి ప్రణాళిక అమలు చేయగా.. ప్రస్తుతం 100 జీటీఎస్‌ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ జీటీఎస్‌ల నుంచి ప్రాసెస్ చేసిన చెత్తను పునర్ వినియోగానికి ఉపయోగపడే వాటిని వేరు చేసి, మిగిలిన చెత్తను విద్యుత్ తయారీ ప్లాంట్‌కు తరలించనున్నారు. అందుకోసం చెత్తను సమగ్ర పద్ధతిలో నిర్వహించేందుకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలించనున్నారు. అందుకోసం రాష్ట్రంలోని 71 యూఎల్బీల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు (ఐఎస్‌డబ్ల్యూఎం) ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఐదు ప్లాంట్లు నిర్మాణంలో ఉండగా.. వినుకొండ, రాయచోటి యూఎల్బీల్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లలో తడి చెత్తను శుద్ధి చేసే పనులు ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్లలో తడి, పొడి చెత్తను ఒకేసారి ఒకేచోట శుద్ధి చేసేందుకు అవకాశముంటుంది. -
అద్భుత సృష్టి.. ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గామాత విగ్రహం
డిస్పూర్: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు అస్సాంలోని దుబ్రీ జిల్లాకు చెందిన సంజీవ్ బాసక్ అనే వ్యక్తి దుర్గా నవరాత్రులను వేదికగా చేసుకున్నాడు. పరిశ్రమలు, మెడికల్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులతో అవగాహన కల్పిస్తున్నాడు. వ్యర్థాలను తగ్గించాలని చెప్పేందుకు వివిధ ఆకృతులతో దుర్గా మాత విగ్రహాలను తయారు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు బాసక్. 2015 తొలుత థర్మకోల్‌తో 14 అడుగుల దుర్గమాత విగ్రహాన్ని రూపొందించారు బాసక్. అప్పటి నుంచి ప్రతిఏటా ఇలా వివిధ వ్యర్థ పదార్థాలతో విగ్రహాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే ఈఏడాది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశాడు బాసక్. ప్రస్తుతం ఈ దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో అస్సాంలో రూపొందించిన దుర్గామాత విగ్రహం ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్! -
అంతరిక్షంలో చెత్తకు కొత్త విరుగుడు.. అక్కడే మండించేందుకు పరికరం
హూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో తయారయ్యే వ్యర్థాలను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్‌కు చెందిన నానో ర్యాక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. బిషప్స్ ఎయిర్‌లాక్ అనే ఈ పరికరంలో ఒకేసారి 600 పౌండ్లు, సుమారు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్ఎస్లో ఆస్ట్రోనాట్ల వల్ల ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్ కార్గో వెహికల్ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కానీ, బిషప్స్ ఎయిర్ లాక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి, తిరిగి ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానోర్యాక్స్ తెలిపింది. -
వేస్ట్ సిరామిక్స్కు దశ ‘దిశ’
పగిలిపోయిన సింక్‌ను ఏం చేస్తాం.. పనికిరాదంటూ పక్కన పడేస్తాం. ఇలాగే, విరిగిన సిరామిక్ వస్తువులను, ఇతర శానిటరీ వ్యర్థాలు దేశమంతటా చాలా చోట్ల పడేసే ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించి, వాడుకలోకి తీసుకువస్తే హస్తకళాభివృద్ధి జరుగుతుందని, పర్యావరణానికి అనర్థం తప్పుతుందని ఆలోచించి, అందుకు ఓ దిశను కనుక్కోవాలని, దేశీయ కⶠకు దశ కల్పించాలనుకుంది దిశారీ మాథుర్. జైపూర్ బ్లూ పాటరీ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన దిశారీ సిరామిక్ వ్యర్థాలలో కొత్త అర్థాలను వెతుకుతూ ‘న్యూ బ్లూ పాటరీ’ పేరు తో ఆర్ట్‌లో ఓ వినూత్న ప్రక్రియను కొనసాగిస్తోంది. మట్టిని ఉపయోగిం^è కుండా చేసే టెక్నిక్స్ లో జైపూర్ బ్లూ పాటరీ ఒకటి. సంప్రదాయ అచ్చులను ఉపయోగించి అనేక సిరామిక్ వస్తువులను తయారు చేస్తారు. ఈ అందమైన హస్తకళను నేర్చుకున్న దిశారీ పనికిరాని సింకులు, టాయిలెట్, శానిటరీ వ్యర్థాలపై దృష్టి సారించింది. వాటిని ఉపయోగించి తిరిగి అందమైన కళాకృతులు తీసుకురావడానికి మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెటీరియల్ రీసెర్చి విభాగంతో కలిసి పనిచేసింది. ‘నా ఈ ప్రయత్నాల ద్వారా చేతివృత్తుల వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు రావాలనుకుంటున్నాను’ అంటారు దిశారీ. ఇన్నోవేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పేపర్‌పై వాస్తవిక ఆలోచనలను రూపుకట్టవచ్చని చిత్రకారిణిగా కళా రంగంలోకి ప్రవేశించిన దిశారీ జార్జియాలోని సవన్నా కాలేజీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా డిగ్రీ పొందింది. అంతర్జాతీయంగా పేరొందిన దేశీ, విదేశీ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంస్థలలో పనిచేసింది. మహమ్మారి సమయంలో లండన్‌లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ ఇంపీరియల్ కాలేజీ నుండి ఇన్నోవేషన్ డిజైన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. సంభాషణలతో కొత్త భవిష్యత్తు ‘ప్రపంచ హస్తకళలో భారతదేశం అతిపెద్దది. కానీ, ప్రపంచ హస్తకళల మార్కెట్ వాటాలో మనదేశ వాటా 2 శాతం మాత్రమే. దీనిని పెంచడానికి జైపూర్ బ్లూ పాటరీ హస్తకళలను అభివృద్ధి చేయడంలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాను’ అంటూ వివరించే దిశారీ న్యూ బ్లూ పాటరీ పేరుతో శానిటరీ వ్యర్థాల నుంచి సృష్టించే కళాకృతులకు మంచి డిమాండ్ ఉంది. వీటి నిర్మాణానికి బయోడిగ్రేడబుల్, సిరామిక్ వ్యర్థాలను ఉపయోగిస్తుంది. ‘నేను జైపూర్ బ్లూ పాటరీ క్రాఫ్ట్‌ను పూర్తిగా అధ్యయనం చేశాను. 300 మంది నవతరం చేతివృత్తుల వారు ఈ రోజుకూ ఈ కళను చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నారు. హస్తకళలు జీవ నోపాధికి ప్రధానమైనవి. చేతివృత్తుల వారితో చేసిన సంభాషణలు కొత్త హస్తకళా భవిష్యత్తు కోసం, కొత్త రూపకల్పన విధానాన్ని తీసుకువచ్చేలా నన్ను ప్రేరేపించాయి’ అంటారీ యంగ్ ఇన్నోవేటర్. సిరామిక్ వ్యర్థాల నుంచి ఇంటి అలంకరణ వస్తువులే కాదు, కొత్తగా సిరామిక్ ఫర్నీచర్ కాన్సెప్ట్‌ను కూడా తీసుకువచ్చారు దిశారీ. ఇది ప్రపంచ మార్కెట్లో మన దేశీయ హస్తకళా నైపుణ్యాన్ని మరింత విస్తృతం చేస్తుందని ధీమాను వ్యక్తం చేస్తారామె. నేడు మనం నేర్చుకున్న విద్య ముందు తరాలకు మరింత మెరుగైన జీవనవిధానాన్ని అందించేలా ఉండాలని చెప్పే దిశారి ప్రతి పని, కళ ద్వారా భవిష్యత్తు పట్ల తన ప్రేమను తెలియజేస్తుంది. -
వేస్ట్ మాస్కులతో బెస్ట్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం మొత్తమ్మీద ఒక్కరోజులో వాడే మాస్కుల సంఖ్య ఎంతో మీకు తెలుసా? అక్షరాలా 680 కోట్లు.. వీటిల్లో కొన్నింటిని మళ్లీ వాడుకునే అవకాశముంది.. కానీ మిగిలిన కోటానుకోట్ల మాస్కులు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. మరి.. ఈ వ్యర్థానికీ ఒక కొత్త అర్థం కలి్పస్తే ఎలా ఉంటుంది..? ఆ ప్రయత్నమే చేసి విజయం సాధించారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ శాస్త్రవేత్తలు.. భవనాల వ్యర్థాలకు మాస్కు ముక్కలను జోడిస్తే మరింత దృఢమైన రహదారిని నిర్మించేందుకు సరికొత్త పదార్థం సిద్ధమవుతుందని వీరు గుర్తించారు. 99 పాళ్ల రీసైకిల్డ్ కాంక్రీట్ అగ్రిగేట్ క్లుప్తంగా ఆర్సీఏ అని పిలిచే భవన వ్యర్థానికి ఒక పాలు మాస్కు ముక్కలు జోడించి వీరు ఈ పదార్థాన్ని తయారు చేశారు. రహదారి నిర్మాణంలోని తొలి మూడు పొరలకు ఈ పదార్థాన్ని వాడవచ్చునని పరీక్షల్లో స్పష్టమైంది. కిలోమీటరు రహదారి నిర్మాణంలో దాదాపు 30 లక్షల మాస్కు వ్యర్థాలను వాడుకోవచ్చునని, తద్వారా 93 టన్నుల వ్యర్థాలు చెత్తకుప్పల్లోకి చేరకుండా నివారించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మహమ్మద్ సాబేరియన్ తెలిపారు. అయితే ఈ మాస్కులను సేకరించి నిర్మాణ స్థలానికి తీసుకురావడం సవాలుగా ఉన్నప్పటికీ కోవిడ్ మో సుకొచి్చన సమస్య పరిష్కారానికి ఇదో కొత్త మార్గం చూపుతుందని వివరించారు. మాసు్కలతోపాటు పీపీఈ కిట్లను కూడా ఇదే పద్ధతిలో సది్వనియోగం చేసుకునేందుకు తాము పరిశోధనలు చేపట్టామని ఆయన చెప్పారు. -
బూజు దులిపారు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పనికిరాని చెత్తనంతా నాలాల్లో పారబోయడం ఓ అలవాటు. అందుకే వానొచ్చినప్పుడల్లా రోడ్లు చెరువులవుతాయి. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు చేరతాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. నాలా (వరద కాలువ)ల్లోనే వ్యర్థపు సామగ్రి వేస్తుండటం. ఈ పనికి రాని చెత్తలో పరుపులు, దుప్పట్ల నుంచి నిర్మాణ వ్యర్థాల దాకా అనేక రకాలున్నాయి. గ్రేటర్‌వాసులు తమకు పనికి రాదనుకున్న చెత్తనంతా నాలాల్లోనే పారబోస్తున్నారు. ఇక, ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గ్రేటర్’ ఐడియా నగరంలో రోజు రోజుకూ పెరిగిపోతోన్న ఈ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ కొత్త ఆలోచన చేసింది. ప్రజలు వ్యర్థాలను ఎక్కడ వదిలించుకోవాలో తెలియక, పాత సామాన్లు కొనేవారి దాకా వెళ్లలేక, సమీపంలోనే ఉన్న నాలాల్లో వేస్తున్నారని గుర్తించింది. ప్రజల చెంతకే వెళ్లి.. ఈ వ్యర్థాలను సేకరిస్తే..?. ఈ క్రమంలోనే పది రోజుల పాటు రీసైక్లథాన్ పేరిట ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిరుపయోగ వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో వెరసి 360 ప్రాంతాల్లో వీటిని స్వీకరించే కార్యక్రమం చేపట్టారు. ఆసక్తి కలిగిన అధికారులు ప్రజల వద్దకే వాహనాల్లో వెళ్లి.. మైకుల ద్వారా ప్రచారం చేసి ‘మీ ఇంటి దగ్గర్లోనే వాహనం ఉంది. పనికి రాని సామాన్లు తెచ్చి అందులో వేయండి’అంటూ పిలుపునిచ్చారు. పనికొచ్చేవి రీసైక్లింగ్.. మొత్తానికి అధికారుల పిలుపునకు ప్రజలు స్పందించారు. అంతోఇంతో అవగాహన కలిగిన వారు పాత సామాన్ల బూజు దులిపి తెచ్చిచ్చారు. సమీపంలోని సేకరణ కేంద్రాల్లోనూ ఇచ్చారు. పది రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 235 మెట్రిక్ టన్నుల సామగ్రి పోగు పడింది. వీటిని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించారు. ఇందులో పనికొచ్చే వాటిని రీసైక్లింగ్ చేయనున్నారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల నాలాల్లో పడే వ్యర్థాలు తగ్గనున్నాయని భావిస్తున్నారు. ఫర్నిచర్, చిరిగిన దుస్తులు, ప్లాస్టిక్.. సేకరణ కేంద్రాలకు అందిన నిరుపయోగ వస్తువుల్లో ఎక్కువ మొత్తంలో విరిగిన ఫర్నిచరే ఉంది. ఆ తర్వాత పాత, చిరిగిన దుస్తులు, దుప్పట్లు వంటివి ఉన్నాయి. ప్లాస్టిక్ కూడా పెద్ద పరిమాణంలోనే ఉంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సైతం 6 మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నాయి. గ్రేటర్ పరిధి లోని ఆరుజోన్లలో ఎల్బీనగర్ ప్రజలు ఈ కార్యక్రమానికి బాగా స్పందించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ జోన్ నిలిచింది. వ్యర్థాల సేకరణకు స్థానిక జోనల్, డిప్యూటీ కమిషనర్లు సైతం ఎంతో కృషి చేశారు. 3–4 నెలలకోసారి అమలు.. పది రోజుల్లో వెరసి 235 మెట్రిక్ టన్నుల నిరుపయోగ వస్తువులు పోగుపడ్డాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటుపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఇకముందూ కొనసాగిస్తామని, ప్రతి 3–4 నెలలకోసారి నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. త్వరలో నాలాల్లో సమస్యగా మారిన డెబ్రిస్ (నిర్మాణ, కూల్చి వేతల వ్యర్థాల) సేకరణకు 10 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. -
వేస్ట్‌తో... బెస్ట్ షో...