సాక్షి, హైదరాబాద్: ప్రపంచం మొత్తమ్మీద ఒక్కరోజులో వాడే మాస్కుల సంఖ్య ఎంతో మీకు తెలుసా? అక్షరాలా 680 కోట్లు.. వీటిల్లో కొన్నింటిని మళ్లీ వాడుకునే అవకాశముంది.. కానీ మిగిలిన కోటానుకోట్ల మాస్కులు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. మరి.. ఈ వ్యర్థానికీ ఒక కొత్త అర్థం కలి్పస్తే ఎలా ఉంటుంది..? ఆ ప్రయత్నమే చేసి విజయం సాధించారు ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ శాస్త్రవేత్తలు.. భవనాల వ్యర్థాలకు మాస్కు ముక్కలను జోడిస్తే మరింత దృఢమైన రహదారిని నిర్మించేందుకు సరికొత్త పదార్థం సిద్ధమవుతుందని వీరు గుర్తించారు. 99 పాళ్ల రీసైకిల్డ్ కాంక్రీట్ అగ్రిగేట్ క్లుప్తంగా ఆర్‌సీఏ అని పిలిచే భవన వ్యర్థానికి ఒక పాలు మాస్కు ముక్కలు జోడించి వీరు ఈ పదార్థాన్ని తయారు చేశారు.
రహదారి నిర్మాణంలోని తొలి మూడు పొరలకు ఈ పదార్థాన్ని వాడవచ్చునని పరీక్షల్లో స్పష్టమైంది. కిలోమీటరు రహదారి నిర్మాణంలో దాదాపు 30 లక్షల మాస్కు వ్యర్థాలను వాడుకోవచ్చునని, తద్వారా 93 టన్నుల వ్యర్థాలు చెత్తకుప్పల్లోకి చేరకుండా నివారించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మహమ్మద్ సాబేరియన్ తెలిపారు. అయితే ఈ మాస్కులను సేకరించి నిర్మాణ స్థలానికి తీసుకురావడం సవాలుగా ఉన్నప్పటికీ కోవిడ్ మో సుకొచి్చన సమస్య పరిష్కారానికి ఇదో కొత్త మార్గం చూపుతుందని వివరించారు. మాసు్కలతోపాటు పీపీఈ కిట్లను కూడా ఇదే పద్ధతిలో సది్వనియోగం చేసుకునేందుకు తాము పరిశోధనలు చేపట్టామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment