Masks
-
అదానీ, మోదీ పాత్రధారులతో... రాహుల్ మాక్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: అదానీ అంశంపై విపక్షాలు సోమవారం పార్లమెంటు మకరద్వారం వద్ద వినూత్నంగా నిరసన తెలిపాయి. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు పారిశ్రామికవేత్త గౌతం అదానీలా మాణిక్కం ఠాగూర్, ప్రధాన నరేంద్ర మోదీలా సప్తగిరి శంకర్ మాస్కులు ధరించారు. వారితో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. పార్లమెంటును ఎందుకు నడవనీకయకుండా చేస్తున్నారని అదానీ (ఠాగూర్)ను ప్రశ్నించారు. ‘‘ఇది అమిత్ భాయ్ (హోం మంత్రి అమిత్ షా)ను అడగాలి. కానీ ఆయన కని్పంచడం లేదుగా’’ అంటూ ఆయన బదులిచ్చారు. మీ మధ్య సంబంధమేమిటని రాహుల్ మరో ప్రశ్నించగా, ‘‘మేమిద్దరం ఒకటే. ఎయిర్పోర్టయినా, మరొకటయినా నేనేది అడిగినా చేస్తారాయన’’ అంటూ ఠాగూర్ మళ్లీ బదులిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ రెట్టించగా, ‘‘ఆయన ఈ మధ్య చాలా టెన్షన్‌గా ఉంటున్నారెందుకో’’ అని సమాధానమిచ్చారు. -
కేరళలో నిపా వైరస్ కలకలం..!
కేరళలో నిపా వైరస్ కలకలంతో ఒక్కసారిగా యావత్తు రాష్ట్రం ఉలిక్కిపడింది. వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆయా ఆరోగ్య కేంద్రాలను అలర్ట్ చేసింది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా బారిన పడ్డాడు. పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్థారించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా తెలిపారు. ప్రస్తుతం అతను ఒక ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అతన్ని అక్కడ నుంచి కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తారని అన్నారు. అతన్ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. హైరిస్క్ కాంటాక్ట్‌లు ఇప్పటికే వేరుచేసి నమునాలను పరీక్ష కోసం పంపినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం చిన్నారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్ల పేర్కొన్నారు వైద్యులు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యలు రాష్ట్రమంతటా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సమీప ఆస్పత్రులన్నింటిలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రజలు మాస్క్ ధరించాలని, రోగులు ఆస్పత్రులను సందర్శించే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. అంతకుమునుపు ఆస్ట్రేలియా నుంచి సేకరించి పూణే ఎన్ఐవీలో నిల్వ ఉంచిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఆదివారం రాష్ట్రానికి చేరుకుంటుందని అన్నారు. ఆ బాధిత చిన్నారి పాండిక్కాడ్ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు కేరళ అధికారులు. అంతేగాదు ఆయా సమీప ప్రాంతాల్లోని ప్రజలు మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమీప మంజేరి వైద్య కళాశాలలో ఆరోగ్య శాఖ 30 ఐసోలేషన్ గదులు, ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసింది. అంతేగాక నిపా వైరస్ సోకిన బాలుడితో పరిచయం ఉన్నవారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. పైగా అంటువ్యాధి నిఘా కార్యకలాపాలను మరింత పటిష్టం చేసేలా ఆరోగ్య కేంద్రాలను కూడా ఆదేశించారు అధికారులు. నిపా వైరస్ లక్షణాలు..తీవ్రమైన తలనొప్పిఅలసటవాంతులుబలహీనత మూర్ఛ, చూపు మందగించడంతో పాటు జ్వరంఈ వ్యాధి శరీర ద్రవాల ద్వారా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా దగ్గు, తుమ్ముల ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది.పాటించాల్సిన జాగ్రత్తలు..సాధ్యమైనంత వరకు చేతులను వీలైనన్ని సార్లు కడుక్కోవాలి. వ్యాధిగ్రస్తులను సందర్శించటం, అంటువ్యాధులు ప్రబలే ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి. పక్షులు లేదా జంతువులు సగం తిన్న లేదా కరిచిన పండ్లను తినకూడదు. అలాగే పండ్లను సరిగ్గా కడిగితినాలి. బహిరంగ కంటైనర్లలో నిల్వ ఉంచిన కల్లు వంటి పానీయాలను తీసుకోకూడదు వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.డాక్టర్ ఎమ్.ఎల్. నీహారిక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ (చదవండి: వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?) -
Celebrities In Face Masks: కరోనా టైమ్‌లో మాస్క్‌లు ధరించిన నటీనటుల ఫోటోలు మళ్లీ వైరల్ (ఫొటోలు)
-
ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే..!
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వైద్య నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అలా అయితే ఫ్లూ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో మార్చి 9 వరకు హెచ్3ఎన్2 సహా మొత్తం 3,038 ఇన్‌ఫ్లూయెంజా ఉపరకాల కేసులు నమోదయ్యాయి. ఇందులో జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చిలో 9 రోజుల్లోనే 486 కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజా బారినపడకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. బస్సులు, రైళ్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, జనం గుంపులుగా ఉన్న చోట్ల కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ ఇన్‌ఫ్లూయెంజా ఎక్కువగా తుంపర్ల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ముక్కు, నోటిని చేతులతో ఎక్కువగా తాకకుండా చూసుకుంటే వైరస్ లోనికి ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబతున్నారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్-19తో పాటు స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1), హెచ్3ఎన్2, సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా- బీ వైరస్ల కాంబినేషన్లు వెలుగుచూస్తున్నాయి. హెచ్3ఎన్2, హెచ్3ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా- ఏ రకాల కిందకు వస్తాయి. వీటినే ఫ్లూగా పిలుస్తారు. లక్షణాలు ఇలా.. ఇన్‌ఫ్లూయెంజా బారినపడేవారిలో జ్వరం ఎక్కువరోజులు ఉండటం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం బాగా క్షీణిస్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల్లో కూడా చాలా రోజుల తర్వాత పెరుగుదల కన్పిస్తోంది. ఆదివారం కొత్తగా 524 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో, జనసమూహాల్లో తిరిగేవారు మాస్కులు ధరించండ చాలా ఉత్తమం అని, లేకపోతే వైరస్ల బారినపడే ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్ -
వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక..!
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్-19 జాగ్రత్తలపై ప్రజలను అలర్ట్ చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్లు పైడినవారు, పిల్లలు, గర్భణీలు గుంపుల్లో తిరగకూడదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ హెచ్చరించారు. వీరు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఏమీ లేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా నిపుణుల కమిటీతో సమావేశమై పరిస్థితిపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం సమీపించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్‌పైనా సమీక్షించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలు రోజుకు రూ.2-3 లీటర్ల నీటిని తీసుకొని హైడ్రేట్‌గా ఉండాలని సూచించారు. నీటితో పాటు మజ్జిక, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలన్నారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గి చాలా రోజులవుతున్నప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పిస్తోంది. మార్చి 5న 281 మంది, మార్చి 4న 324 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) కేసులు వెలుగుచూస్తున్నాయి. అనేక మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తఫ్లూ కరోనా లాంటిది కాకపోయినప్పటికీ జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యమంత్రి కూడా కరోనా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చదవండి: కొత్త ఫ్లూ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్ -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇకపై అక్కడ మాస్క్ తప్పనిసరి!
బెంగళూరు: చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. పండగలు, కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా నాలుగో వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్ వేడుకల్లో పబ్‌లు, రెస్టారెంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. కరోనాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీ మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని కోరారు. యూపీలో అలర్ట్.. ఉన్నావ్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, ప్రస్తుతం ఆ యువకుడు దుబాయ్ వెళ్లాడు. అంతకు ముందే పరీక్షలు చేసుకోగా ప్రస్తుతం పాజిటివ్‌గా తేలింది. అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. చైనా నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలిన మరుసటి రోజునే ఈ విషయం బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్లు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని కోరారు. ఇదీ చదవండి: చైనాలో శవాల గుట్టలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు! -
మాస్కులు త్వరలో పోతాయి
వాషింగ్టన్: అమెరికన్లు మాస్కు ధరించాల్సిన అవసరం లేని రోజులు త్వరలో వస్తాయని ఆ దేశ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి జోస్యం చెప్పారు. అది రెండు నెలల్లో, ఆర్నెల్లలో, లేదా ఓ ఏడాదిలో కావచ్చన్నారు. అలాగని వ్యక్తిగత జాగ్రత్తలను పక్కన పెట్టడం అంత మంచిది కూడా కాదని ఆయన హెచ్చరించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కరోనా వంటి పెను మహమ్మారి రాత్రికి రాత్రే మాయమైపోదన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. పాత, లేదా కొత్త వేరియంట్లు మళ్లీ తెరపైకి రావచ్చు. కానీ దానికి భయపడకుండా మళ్లీ స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కరోనాపై పోరాడేందుకు ఏడాదిగా మనం తయారు చేసుకున్న నాణ్యతతో కూడిన వ్యాక్సిన్లు, బూస్టర్లు అందరికీ సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉండాలి. అప్పుడు కరోనా మరణాలను దాదాపుగా తగ్గించుకోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. యువతపై ప్రభావం యువత మానసిక ఆరోగ్యంపై కరోనా చాలా ప్రభావం చూపుతోందని భారత సంతతికి చెందిన మూర్తి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఇద్దరు పిల్లల తండ్రిగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయమిది. మానసిక ఆరోగ్య నిపుణుల సాయంతో వారికి దన్నుగా నిలవడం చాలా అవసరం’’ అన్నారు. కరోనా తెరపైకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికాలో నల్ల జాతీయులకు, లాటిన్, నేటివ్ అమెరికన్లకు వ్యాక్సిన్ల లభ్యత అంతగా ఉండేది కాదన్నారు. తర్వాత పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్పారు. -
మాస్కు ఆంక్షలను ఎత్తేసిన ఇంగ్లండ్
లండన్: మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్ ఆంక్షలను ఇంగ్లండ్ గురువారం ఎత్తేసింది. బూస్టర్ డోస్ టీకా తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఆస్పత్రుల్లో చేరడాన్ని తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్‌లో ఎవ్వరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఇక నైట్ క్లబ్బులు, ఇతర వేదికలకు కోవిడ్ పాసులు కూడా అవసరం లేదని తెలిపింది. ఇక ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్ మాస్కుల నిబంధనను గత వారమే ప్రభుత్వం ఎత్తివేసింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తిని అడ్డుకోవడానికి, బూస్టర్ డోస్ వేసుకోవడానికి సమయమిస్తూ డిసెంబర్ మొదటివారం నుంచే ‘ప్లాన్ బి’ చర్యలు ప్రారంభించింది. అందరికీ బూస్టర్ డోసు టీకాలు వేయడంతోపాటు, నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్ చికిత్సలను అందించడంలో యూరప్ బలంగా పనిచేసిందని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావీద్ తెలిపారు. వైరస్ పూర్తిగా నిర్మూలనయ్యే అవకాశం లేదని, వైరస్‌తో సహజీవనం నేర్చుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతున్నా.. పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ 84 శాతం పూర్తయ్యిందని, అర్హత ఉన్నవాళ్లంతా రెండో డోసు తీసుకున్నారని, 81 శాతం మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిక, ఐసీయూ చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కొత్త సంవత్సరం సమయంలో రోజుకు రెండులక్షలున్నా ఇప్పుడు లక్షకు పడిపోయాయని తెలిపారు. మరోవైపు గురువారం యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మరణాలు సంభవించాయి. గతవారమే ప్రకటన ఒమిక్రాన్ బారిన పడినవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే ప్రకటించారు. అయితే... తమ వినియోగదారులను ఫేస్ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. ఇక అయితే రాజధానిలోని బస్సులు, సబ్ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు వసరమని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకి వారికి ఐదురోజుల ఐసోలేషన్ సరిపోతుందన్నారు. కోవిడ్ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యాధికారులు తెలిపారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లు సొంత ప్రజారోగ్య నియమాలను రూపొందించుకున్నాయి. అదేవిధంగా వారి వైరస్ నిబంధనలను కొంత సడలించాయి. -
Jawahar Nagar Dumping Yard: వాడిన మాస్కులతో పొంచి ఉన్న ప్రమాదం
ముందు తరాలకు భద్రమైన, ఆరోగ్యకరమైన భూ గ్రహాన్ని ఇవ్వాల్సిన మనం... ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న çసంక్షోభాన్ని మీ దృష్టికి తేవాలను కుంటున్నాను. కోవిడ్–19 వ్యాప్తి సమయంలో మాస్క్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అందుకే మాస్కులను మనం తరచుగా కొంటున్నాం. అయితే ఇలా కొని వాడిపారేస్తున్న అసంఖ్యాక మాస్కులు మొత్తం ప్రపంచ మనుగడకే ప్రమాద కరంగా మారాయి. ఎక్కడ చూసినా వైరస్ వ్యాప్తిని పెంచడానికి ఆస్కారమున్న అసంఖ్యాక మాస్కులు కనిపిస్తున్నాయి. ఇవి నీటివనరులు, నేలలను కలు షితం చేస్తున్నాయి. ఫలితంగా అనేకమంది అనారోగ్యం పాలవు తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పని వారి పాలిట ఈ మాస్కులు ఉరితాళ్లలా తయారౌతున్నాయి. పిల్లల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ జవహర్ నగర్‌ను ఆను కొని ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డు ప్రాంతం ప్రపంచంలోని అణగారిన నిరుపేద పిల్లల జీవితా ల్లోని ఒక అధ్యాయానికి ప్రతిబింబంగా నిలిచింది. సింగిల్ యూజ్ వేరియెంట్లలో ఉండే పాలీ ప్రొపైలీన్లు నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నం అయ్యేవరకు మాస్కులు అలాగే ప్రకృతిలో ఉండిపోయి పర్యా వరణానికి తీవ్రమైన హానిని కలుగజేస్తాయి. ఇవి విచ్ఛిన్నమై భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఫలితంగా çపర్యావరణం తీవ్ర విషా దాన్ని చవిచూడవలసి ఉంటుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని చుట్టుపక్కల 95 మురికివాడలు ఉన్నాయి. ఇందులో 25 చోట్ల ప్రజలు ప్రత్యక్షంగా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గాలి, భూగర్భజలాలు రెండూ విషపూరితం అవుతు న్నాయి. పిల్లలు వైకల్యాలతో జన్మిస్తున్నారు, వృద్ధులు తీవ్రమైన అనారోగ్యం పాలవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ‘సంస్థాగత’ నిర్లక్ష్యమే. డంపింగ్ యార్డ్‌పై ఆధారపడి జీవించే అర్భ కులు చాలామంది ఇక్కడ జీవిస్తున్నారు. ఇందులో చాలామంది యార్డులో డంప్ చేసే (మెడికల్ సబంధ మైనవి కూడా) అనేక వ్యర్థాలను సేకరించి బతుకు తున్నారు. పారిశుద్ధ్య పని ఒక వృత్తిగా జీవించే సామాజికంగా వెనకబడిన వర్గాలవారికి.. నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పారవేసే మాస్కులు పెద్ద ప్రమాదంగా పరిణమించాయి. మిగతా వ్యర్థాలతో పాటూ వాటినీ గ్లౌజులు వంటి ఎటువంటి రక్షణ కలి గించేవి ధరించకుండానే ఉత్త చేతులతో తొలగిం చవలసిన ఉద్యోగం వారి ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రస్తుత మాస్క్ స్థానంలో బయో–డీగ్రేడబుల్ వేరియెంట్లతో తయారైన వాటిని ప్రవేశపెట్టగలిగితే పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశం గరిష్ఠంగా వారానికి 4.64 బిలియన్ మాస్క్ వ్యర్థా లను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే... ఈ మాస్కుల ఉత్పత్తికి వారానికి 12.258 టన్నుల పాలీ ప్రొపైలీన్ని వాడుతూ ప్రపపంచంలోనే మొదటి ర్యాంకులో భారత్ నిలిచింది. శస్త్రచికిత్స సమయంలో వాడే మాస్కుల కంటే ఎన్–95 మాస్కుల్లో పాలీ ప్రొపైలీన్ రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఉపయోగించే పాలీప్రొపైలీన్ డీకంపోజ్ అవ్వడానికి 450 సంవత్సరాలు పడు తుంది. వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఎటువంటి రక్షణ లేని మనుషులకు బదులు యంత్రాలను ఉప యోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మను షులే పనిచేయవలసివస్తే వారికి తగిన రక్షణ సామగ్రిని అందించవలసి ఉంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్నవారిపట్ల మరికొంత దయాశీలంగా ఉండటం మన కర్తవ్యం. మనల్ని నిరంతరం భద్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు రేపటి తరానికి తల్లిదండ్రులే అన్న ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. – జాన్ రాబర్ట్స్ (‘మిలీనియం పోస్ట్’ సౌజన్యంతో) -
MK Stalin: కరోనా ఉగ్రరూపం.. సీఎం స్టాలిన్ నడిరోడ్డుపై కారు ఆపి..
చెన్నై: కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న విషయం తెలిసిందే. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన పంజా విసురుతోంది. భారత్‌లోనూ కరోనా కేసులు ఉదృతంగా నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మాస్క్ ధరించకుండా బయకటు వచ్చిన వారికి పోలీసులు ఫైన్ కూడా విధిస్తున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ మంగళవారం చెన్నై వీధుల్లో మాస్కులు పంపిణీ చేస్తూ కనిపించారు. చదవండి: (28 రోజులుగా కోమాలో.. వయాగ్రా అధిక మొత్తంలో ఇవ్వడంతో..) రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం స్టాలిన్ మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్తుండగా, కొంతమంది బహిరంగంగా మాస్కులు ధరించకపోవడాన్ని గమనించారు. వెంటనే రోడ్ పైనే కారు ఆపిన సీఎం.. స్థానికంగా ఉన్న వారికి స్వయంగా మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా అందరూ మాస్క్‌లు ధరించాలంటూ సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం స్టాలిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో ముఖ్యమంత్రే కొందరికి మాస్క్ పెడుతూ కనపడుతున్నారు. చదవండి: (యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..) தலைமைச் செயலகத்திலிருந்து முகாம் அலுவலகம் திரும்புகையில், சிலர் பொது இடங்களில் முகக்கவசம் அணியாமல் இருப்பதை கவனித்தேன். அவர்களுக்கு முகக்கவசம் வழங்கினேன். அனைவரும் தயவுசெய்து முகக்கவசம் அணியுங்கள்! தடுப்பூசி- முகக்கவசம்- கிருமிநாசினி- தனிமனித இடைவெளி ஆகியவற்றை கடைப்பிடிப்பீர்! pic.twitter.com/Xex4Nk9jh5 — M.K.Stalin (@mkstalin) January 4, 2022 కాగా దేశంలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులోనూ కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అత్యంత కీలకం కావడంతో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం పలు ఆంక్షలను కూడా విధించింది. -
భయం వద్దు.. భద్రత వీడొద్దు
సాక్షి, అమరావతి: ‘ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండటం మాత్రం ముఖ్యం. వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు భద్రత చర్యలు తీసుకోవాలి. అలసత్వం వద్దు’ అని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. భారత దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి: ఒమిక్రాన్ వ్యాప్తి ఏ విధంగా ఉంది? డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి: విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. విదేశాల్లో వాతావరణ పరిస్థితులు, రోగ నిరోధక శక్తి వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపుతాయి. భారత్‌తో పోలిస్తే విదేశాల్లో ప్రజల సగటు వయసు ఎక్కువ. మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య జనాభాలో 6 శాతమే. అదే ఇటలీలో 27 శాతం, అమెరికాలో 16 శాతం. ఇలా చాలా దేశాల్లో మనకన్నా ఎక్కువగా ఉంది. దీనికి తోడు రక్తపోటు, మధుమేహం తరహా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) ప్రభావితులు విదేశాల్లో ఎక్కువగా ఉంటారు. అందువల్లే అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో వాతావరణం, రోగ నిరోధక శక్తి, ఇతరత్రా అంశాల కారణంగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండదు. సాక్షి: కరోనా నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పించినట్టు గతంలో వెల్లడైంది. ఒమిక్రాన్ నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పిస్తాయా? శ్రీనాథ్‌రెడ్డి: యాంటీబాడీలు తగ్గినప్పటికీ టీ లింఫోసైట్స్ ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబాడీలు మూడు నుంచి ఆరు నెలల్లో తగ్గుతున్నాయి. కొందరిలో 9 నెలలు ఉంటున్నాయి. టీకాలు వేసుకున్న వారితో పోలిస్తే గతంలో కరోనా వచ్చి తగ్గిన వారిలో టీ లింఫోసైట్స్ చురుగ్గా పనిచేస్తాయి. ఇవి శరీరంలో పోలీస్‌లా వ్యవహరిస్తాయి. వైరస్లు, బాక్టీరియాలు దాడి చేసినప్పుడు వాటిని నియంత్రిస్తాయి. సాక్షి: యాంటీబాడీలు త్వరగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉందా? శ్రీనాథ్‌రెడ్డి: క్యాన్సర్, ఇతర వ్యాధులకు మందులు వాడే వారు, పౌష్టికాహారం తీసుకోని వారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతాయి. అందువల్లే ప్రభుత్వం 60 ఏళ్లు పైబడి, జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రికాషన్ డోసు టీకా పంపిణీ చేపట్టబోతోంది. వారందరూ ఈ టీకా వేయించుకుంటే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం టీకా పంపిణీ చేయబోతోంది. అపోహలు వీడి అందరూ టీకా తీసుకోవాలి. సాక్షి: ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా? శ్రీనాథ్‌రెడ్డి: ఢిల్లీ, మహారాష్ట్ర, సహా పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించడంలేదు. పెద్దగా ఆసుపత్రులపై ఒత్తిడి లేదు. విదేశాల్లో డెల్టా, ఒమిక్రాన్ కలిసిన కేసులు నమోదవుతుండటంతో అక్కడ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. సాక్షి: ఒమిక్రాన్ నేపథ్యంలో ఎటువంటి మాస్క్‌లు ధరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీనాథ్ రెడ్డి: ఆస్కారం ఉన్న వాళ్లు ఎన్ 95 మాస్క్‌లు వాడితే మంచిది. లేని పక్షంలో డబుల్ లేయర్ మాస్క్‌లు సురక్షితం. గుడ్డ, సర్జికల్ మాస్క్‌లు ఏవైనా సరే డబుల్ లేయర్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే సంక్రాంతి నాటికి కేసుల సంఖ్య పెరుగుతుంది. -
Telangana: మాస్క్ ధరలు.. తగ్గేదే లే!
ఆస్పత్రుల్లో సర్జికల్ మాస్కులుగా మాత్రమే పరిచయం ఉన్నవి కాస్త.. కరోనా టైం నుంచి మన జీవితాల్లో భాగం అయ్యాయి. వేవ్‌లు విరుచుకుపడుతున్నప్పుడల్లా మూతులకు అతుక్కుపోతున్నాయి. ఆంక్షలు, అభ్యంతరాల నేపథ్యంలో అవసరంకొద్దీ అప్పటికప్పుడు ఎంతైనా సరే చెల్లించి కొనేస్తున్నారు జనాలు. అయితే మాస్క్‌ల ఉత్పత్తి పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం ఇంకా దిగిరాకపోవడంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్ సహా ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మూడు పొరల సర్జికల్ మాస్క్ ధర ఒకటి రూ.10 నుంచి 15 రూ. మధ్య ఉంటోంది(డిజైన్లు, ఇతర కంపెనీలవి మినహాయించి). సాధారణ మెడికల్ షాపు ఓనర్ల నుంచి బిజీ ఏరియాల దగ్గర చిరువ్యాపారుల దాకా ఈ ధరకి ఫిక్సయిపోయారు. ఇక మండలాలు, రూరల్ ఏరియాల్లో ఇంతకంటే ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. సాధారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి సర్జికల్ బయటకు వచ్చేది రూపాయిలోపు(ఒక్కోటి) ధరకే!. మరి అన్నేసి రేట్ల రేటుకు అమ్మడం ఎందుకు?. ప్రతీకాత్మక చిత్రం మధ్యవర్తులే కారణం.. హైదరాబాద్ శివారులో దాదాపు పది యూనిట్ల నుంచి నిత్యం మాస్క్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ రోజులో లక్ష నుంచి 4 లక్షల దాకా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అంటే ఒక్క హైదరాబాద్ నుంచే రోజుకి 30 లక్షల సర్జికల్ మాస్కుల ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. ఇవిగాక మరో పది లక్షల మాస్క్‌లను ఢిల్లీ నుంచి దిగుమతి చేస్తున్నారు. మొత్తంగా 40 లక్షల మాస్క్‌లతో భారీ సప్లయి నడుస్తోంది. అయినప్పటికీ ధరలు మాత్రం దిగి రావట్లేదు. అయితే దళారులు, మధ్యవర్తుల కారణంగానే వీటి ధరలు అధికంగా ఉంటున్నాయని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు.. రిటైలర్స్‌కు 90పై. నుంచి 1.రూ.మధ్య అమ్ముతున్నారు. మొదటి వేవ్ నుంచి ఇదే ధర కొనసాగుతోంది కూడా. కానీ, రిటైలర్స్ నుంచి కొందరు దళారులు వీటిని కొనుగోలు చేసి.. మూడు నుంచి ఐదు రూపాయల కమిషన్‌తో కిందిస్థాయికి అమ్మకాలు చేస్తున్నారు. అందుకే తామూ అధిక ధరలకు అమ్ముతున్నామని మెడికల్ షాప్ ఓనర్లు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక మాస్క్ ధరించకపోతే ఫైన్లు విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వీళ్ల వ్యాపారానికి మరింత కలిసొస్తోంది. ప్రతీకాత్మక చిత్రం మాదేం లేదు కరోనా మొదటి, రెండో వేవ్‌ల టైంలో తెలంగాణలో మాస్క్‌ల కొరత నడిచింది. ఉత్పత్తి అస్థిరత వల్ల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు డిమాండ్‌కు మించి సప్లయ్ ఉంటున్నా.. అధిక ధరలకు అమ్ముతుండడం విశేషం. ఫస్ట్ వేవ్ కోనా టైంలో ఒక్కో మాస్క్‌ను 8రూ నుంచి 9రూ. గరిష్ట ధరకు అమ్మేవాళ్లు. అయితే తయారీదారులు ఇప్పుడూ పాత రేట్లకే అమ్ముతున్నా.. కస్టమర్‌కి మాత్రం ఐదు నుంచి పది రేట్లకు చిల్లు పడుతోంది. పైగా ఈ ఏడాది వేసవి తర్వాత ఉత్పత్తి గణనీయంగా పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. తెలంగాణలో సరిపడా యూనిట్లు ఉన్నాయని, ధరల విషయంలో మాదేం లేదంటున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. పైగా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి దందాలను, ధరల నియంత్రణను ప్రభుత్వాలే చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్లు. ప్రస్తుతం స్టాక్ వివరాలు ఎన్ 95 మాస్కులు.. 41 లక్షల కుపైనే 3 పొరల మాస్క్‌లు, కోటి 50 లక్షలకు పైనే పీపీఈ కిట్స్.. 8 లక్షలకుపైనే హోం ట్రీట్మెంట్ కిట్స్.. 8.71 లక్షలు కొసమెరుపు.. బల్క్‌గా త్రీ లేయర్స్ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్న కొందరు.. షాపులు, మెడికల్ స్టోర్లు కాకుండా రోడ్ల మీద, ఫుట్‌పాత్‌లపై రూ. 2 నుంచి 7రూ. మధ్య అమ్మేస్తున్నారు కొందరు. కానీ, వాటి క్వాలిటీపై నమ్మకం లేక చాలామంది దూరంగా ఉంటూ వస్తున్నారు. మాస్క్ మస్ట్.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందే వేరియెంట్. గాలి ద్వారా శరవేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేప్పుడు, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్‌లకు వెళ్లినప్పుడు మాస్క్‌లు(మూడు పొరలున్న ఎలాంటి మాస్క్‌లైనా సరే వాడడం మరీ మంచిది) ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై ఫైనల్ వర్డ్ ఇదే: ఆర్బీఐ -
ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ‘మహా’ టెన్షన్!!
ఇచ్చోడ: జిల్లా ప్రజలను ‘మహా’ టెన్షన్ వెంటాడుతోంది. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో 50 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర నుంచి జిల్లాకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో కొత్త వేరియంట్ ఎప్పుడైనా జిల్లాలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దులో కట్టడికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్, పుణె, ముంబయి లాంటి మహానగరల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాకు నాగ్‌పూర్ పట్టణం 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. నాగ్‌పూర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉండటం, విదేశాల నుంచి రాకపోకాలు సాగుతుండటం అక్కడి నుంచి జిల్లాకు నిత్యం వ్యాపార నిమిత్తం వేలాది మంది బస్సుల్లో ఇతర ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. డెల్టా వేరియంట్ కంటే పది రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడం, వార్తలు వస్తుడడంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలను నియంత్రించకపోతే జిల్లాలోకి కొత్త వేరియంట్ అడుగు పెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డెల్టా వేరియంట్ కూడా మహారాష్ట్ర నుంచి రాకపోకలతోనే జిల్లాలో విస్తరించిందని పేర్కొంటున్నారు. రైళ్లలో రద్దీ.. ఇటీవలే రైల్వే శాఖ పలు రైళ్లను పునరుద్ధరించింది. మహారాష్ట్ర రైళ్లు నిత్యం జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ముంబాయి, నాగ్‌పూర్‌కు ఆదిలాబాద్ మీదుగా రైళ్లు వెళ్తుంటాయి. బస్సు ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుండడం, చార్జీలు ఎక్కువగా ఉండడంతో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య పెరిగింది. నిత్యం రైళ్లు రద్దీగానే వస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి నాగ్‌పూర్, నాందేడ్, చంద్రాపూర్, యావత్మాల్, గడ్చిరోలి, అకోల లాంటి పట్టణలకు, అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు బస్సులు తిరుగుతుంటాయి. రైళ్లలో, బస్సుల్లో భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు కూడా చాలామంది ధరించడం లేదు. జిల్లా చుట్టూ మహారాష్ట్ర సరిహద్దులు... జిల్లా చుట్టూ మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నా యి. ఈ సరిహద్దుల మీదుగా జిల్లాకు నిత్యం వేల మంది వ్యాపారం, వివిధ పనులు నిమి త్తం జిల్లాకు వచ్చిపోతుంటారు. మహారాష్ట్రను ఆనుకుని జిల్లాలోని బోథ్, బజార్హత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, నార్నూర్, బేల, జైనాథ్ మండలాలు ఉన్నాయి. బోథ్ మండలం ఘన్‌పూర్‌కు మహారాష్ట్రలోని నాందేడ్ సరిహద్దు ఉంది. బేల మండలానికి చంద్రపూర్ జిల్లా సరిహద్దుగా ఉంది. తలమడుగు మండలం లక్ష్మీపూర్‌కు మహుర్ సరిహద్దు ఉంది. మహుర్ నుంచి యావత్మాల్, పర్బనీ జిల్లాలకు రాకపోకాలు సాగుతాయి. మహారాష్ట్రలోని గడ్చిరొలి జిల్లా నార్నూర్ మండలానికి పొరుగునే ఉంది. జిల్లాలో పలు మండలాలు మహారాష్ట్రను ఆనుకునే ఉండడంతో అక్కడి నుంచి వచ్చేవారిలో ఎవరికైనా ఒమిక్రాన్ సోకి ఉంటే వారి ద్వారా వైరస్ జిల్లా వాసులకు సోకుతుందని పలువురు పేర్కొంటున్నారు. అప్రమత్తం కాకుంటే ముప్పే.. ముందస్తుగా మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్‌తోపాటు రెండు డోసుల టీకా వేసుకున్నవారిని మాత్రమే జిల్లాలోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయాలని కోరుతున్నారు. రాక పోకలు సాగిస్తున్న వారికి పరీక్షలు నిర్వహించి వివరాలు నమోదు చేయడం ద్వారా ముప్పును నియంత్రించవచ్చని అంటున్నారు. మరోవైపు వైద్యాధికారులు కూడా ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటున్నారు. బయటకు వెళ్లేవారు, ప్రయాణాలు చేసేవారు తరచుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు. మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి ఒమిక్రాన్ వైరస్ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రజలు ముందుస్తు జాగత్రలు పాటించాలి. మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కులు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే టీకాలు తీసుకోవాలి. మొదటి టీకాను తీసుకున్నావారు గడువులోగా రెండో డోస్ తీసుకోవాలి. స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ -
దిగొచ్చిన మాస్కుల ధరలు
సాక్షి, అమరావతి: మాస్క్‌లు, పీపీఈ కిట్ల ధరలు దిగొచ్చాయి. కరోనా వచ్చిన తొలి రోజుల్లో వీటి కోసం నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఒక దశలో సర్జికల్ మాస్క్‌ను రూ.13 పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. ఇప్పుడది అక్షరాలా రూపాయి పావలా కంటే తక్కువకు దిగొచ్చిందంటే.. మాస్క్‌లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏ స్థాయిలో వచ్చాయో అంచనా వేయొచ్చు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో మాస్క్‌లు, పీపీఈ కిట్లు తదితర వాటికి ఏపీఎంఎస్ఐడీసీ(రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో ధరలు భారీగా దిగొచ్చాయి. ఎప్పటికప్పుడు రేట్లు తగ్గుతున్న కొద్దీ కొత్తగా టెండర్లు పిలవడం, తగ్గిన ధరలకు కొనడంతో ప్రభుత్వానికి వ్యయం భారీగా తగ్గుతోంది. పీపీఈ రూ.600 నుంచి రూ.222కు కరోనా మొదటి వేవ్‌లో ఒక్కో పీపీఈ కిట్‌ను రూ.600కు కూడా కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడది కేవలం రూ.222కే దొరుకుతోంది. దీనికంటే ముందు పిలిచిన టెండర్లో రూ.291గా ఉండేది. పీపీఈ కిట్ల టెండర్లో ఏడు సంస్థలు పాల్గొన్నాయి. ఎల్–1(లోయెస్ట్–1) రూ.222 కాగా, ఎల్–7 రూ.261కి వేశారు. అలాగే ఎన్–95 మాస్క్‌లకు ఒకప్పుడు భలే గిరాకీ ఉండేది. ఒక్కో మాస్క్ రూ.140కి కూడా కొనాల్సి వచ్చింది. తాజా టెండర్‌కు ముందు వరకూ ఇదే ఎన్–95 మాస్క్ ధర రూ.19.37గా ఉంది. తాజాగా టెండర్లో మొత్తం 8 సంస్థలు పాల్గొనగా.. ఎల్–1 రూ.5.91కి వేసింది. కోవిడ్ వచ్చిన కొత్తలో మూడు పొరల సర్జికల్ మాస్క్‌ను రూ.13కు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అప్పట్లో తయారీ కంపెనీలు లేకపోవడం, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాజా టెండర్లో 20 కంపెనీలు పాల్గొన్నాయి. వీటిలో ఎల్–1 కేవలం రూ.1.22కే వేసింది. అలాగే రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుండటంతో ఏడీ(ఆటో డిసబుల్) సిరంజిలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తాజాగా కోటి సిరంజిల కోసం టెండర్ పిలవగా ఒక్కో సిరంజి రూ.3.90కే వచ్చింది. -
మాస్కులతోనే మనుగడ!
మనం ఎలాంటి మాస్క్‌లు ధరిస్తున్నామన్నది లెక్కకాదు. దాన్ని సరిగా ధరిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికి రానట్టే... అన్ని చోట్లా ఒకే పద్ధతి కూడా పనిచేయదు. ఎప్పుడూ మూసి ఉండి, గాలి, వెలుతురు అంతగా రాని ప్రదేశంలో మాస్క్ ధారణలో కొంత మార్పు అవసరం. అలాగే ఏసీ గదుల్లో ఇంకోలా ధరిస్తే మరింత ప్రయోజనం. కొంతమంది మాస్కు తీసి జేబుల్లో పెట్టుకుని, బయటకు వెళ్తున్నప్పుడూ లేదా నలుగురూ ఉన్న చోట ధరిస్తూ ఉంటారు. ఇలా జేబులో పెట్టుకోవచ్చా? మూడు పొరల మాస్కుతో ఎందుకు ఎక్కువ ప్రయోజనం, మూసిన గదిలో ఎన్ 95 అవసరమేమిటి, గుడ్డ మాస్కులను ఎందుకు రోజూ వేణ్ణీళ్లలో ఉతకాలి లాంటి సందేహాలకు సమాధానాలతో పాటు... అసలు మాస్కులూ, వాటి నుంచి గరిష్టప్రయోజనం పొందడమెలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మాస్కులూ, అవి ఎలా ధరించాలనే విషయంలో ఇప్పటికీ చాలామందికి అనేక రకాల అనుమానాలున్నాయి. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ఆధారంగా శాస్త్రీయంగా వాటిని ఎలా ఉపయోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం. మాట్లాడినా కరోనా సోకుతుందా... మాస్కుల ఉపయోగం ఏమిటో, అవి ఎందుకు వాడాలో తెలుసుకునే ముందర... కేవలం ఎదురూబొదురుగా ఉంటూ మాట్లాడినా కూడా కరోనా సోకుతుందా అనే విషయం తెలుసుకుందాం. దగ్గడం, తుమ్మడం వల్లనే కాదు... మనం మాట్లాడేటప్పుడు కూడా నోటి నుంచి తుంపర్లు వెలువడతాయి. వీటివల్లే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ తుంపర్లను ఏరోసాల్స్‌గా పిలవవచ్చు. ఇవి రెండు రకాలు. ఒకటి 5 మైక్రో మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండేవి, రెండోది తక్కువ ఉండేవి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు అవి బరువుగా ఉంటాయి. దాంతో ఆ బరువుకు కింద పడిపోతాయి. అదే సన్నటివైతే చాలా దూరం వెళ్తాయి. పాటలు పాడినా (53%), మాట్లాడినా (41%) , శ్వాసలో (6%) ఇలా ప్రతిసారీ సన్నటి ఏరోసాల్స్ వెలువడతాయి. ఆరు అడుగుల దూరముండి... వారు తుమ్మినా, దగ్గినా మనకు కరోనా సోకే అవకాశం తక్కువ. సన్న తుంపర్లు ఎక్కువ దూరం పయనించకుండా నిలువరించడం కోసమే మాస్కు చాలా అవసరం. దాని వల్ల వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. మూసి ఉండే ప్రదేశాల్లో... గదిలాంటి మూసి ఉండే (క్లోజ్డ్) ప్రదేశంలో గాలి బయటకు పోయే అవకాశం లేనప్పుడు / లిఫ్టు వంటి చోట్ల రోగి తుమ్మితే.. వెంటిలేషన్ లేనందువల్ల ఆ తుమ్ము నుంచి వచ్చే కణాలు అక్కడే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. ఇలా తుమ్మాక 1, 2 నిమిషాల తర్వాత లిఫ్టులో ఎవరైనా వెళ్తే, వారు అక్కడి గాలి పీల్చుకున్నప్పుడు వాళ్లకు వ్యాధి సోకవచ్చు. అదే బాగా గాలి, వెలుతురు సోకే గదిలో అయితే ఆ ఇబ్బంది ఉండదు. ఇలాంటి మూసి ఉడే ప్రదేశాల్లో మాస్క్ అవసరం మరింత ఎక్కువ. అందుబాటులో అనేక మాస్కులు ప్రస్తుతం మనకు ఎన్నో రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి.నీలిరంగు సర్జికల్ మాస్కులు, వైద్యులు ధరించే ఎన్–95 మాస్కులు, గుడ్డతో తయారై కుట్టించిన సాధారణ మాస్కులు. కంపెనీల బ్రాండెడ్ మాస్కులు ఇప్పుడు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. కరోనా తొలిదశలో ఒకేసారి అందరూ మాస్కులు వాడటం మొదలుపెట్టగానే... వైద్యరంగంలో ఉపయోగించే మాస్కుల కొరత ఒకింత తీవ్రమైంది. అయితే ఇప్పుడు అనేక రకాల మాస్కులతో పాటు... ఐదుపొరల మాస్కులంటూ టీవీ వంటి ప్రసార సాధనాల్లో ప్రచారం చేస్తున్న అనేక రకాల మాస్కులు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. రెండేసి మాస్కులు అవసరమా? ఎన్ 95 మాస్కు ధరిస్తే.. సాధారణంగా రెండోది అవసరం లేదు. కానీ సర్జికల్ మాస్కు అయితే రెండోది కూడా అవసరం. ఎందుకంటే, అది ధరించినప్పుడు పక్కల నుంచి కొంత గాలి లోపలికి వెళ్తుంది. ఆ గాలిని కూడా నిరోధించడానికి రెండో మాస్కు అవసరం. వస్త్రంతో చేసినదైనా అన్నివైపులా మూసి ఉంటే రెండోదీ అవసరం లేదు. కానీ, కొంత ఖాళీ ఉన్నా, అందులోంచి వైరస్ కణాలు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తపడాలి. ఏది మంచిది...? ఎలా వాడాలి...? సాధారణంగా యువత ఎక్కువగా బయటకు వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో తప్పక మాస్కులు ధరించాలి. వారు మూడు పొరల సర్జికల్ మాస్కు ధరించినా సరిపోతుంది. మొదట్లో ధర ఎక్కువగా ఉండటం, అవగాహన లేకపోవడంతో పేదవర్గాలకు చెందినవారు మాస్కులపై పెద్దగా దృష్టి పెట్టేవారు కారు. ఇలాంటి వారు వస్త్రంతో తయారై, కుట్టిన మాస్కులు ధరించినా పర్వాలేదు. ఇలా బయట తిరిగే యువతకూ, తరచూ బయటకు వెళ్లివచ్చే మధ్య వయసువారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. వాళ్లకు కరోనా సోకినా లక్షణాలు పెద్దగా వ్యక్తంకావు. కాబట్టి వెంటనే తెలియదు. కానీ, వారినుంచి ఇళ్లలో ఉండే పెద్దవారికి త్వరగా సోకుతుంది. అందువల్ల ఇంటి నుంచి కాలు బయటపెడితే నోరు, ముక్కును నాలుగువైపులా పూర్తిగా మూసి ఉంచేలా మాస్కు ధరించాలి. వాడకం ఎలా... వస్త్రాలతో చేసిన మాస్కులను రోజూ వేడినీళ్లలో ఉతికి, ఎండలో ఆరేయడం చాలా ముఖ్యం. వ్యాధి ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, లేదా మాట్లాడినా.. వైరస్ కణాలు మాస్కు బయటివైపు ఉపరితలం మీద పడతాయి. అందువల్ల దాన్ని వేడినీళ్లలో ఉతికి, ఎండలో ఆరబెడితే చాలావరకు రక్షణ ఉంటుంది. ఎన్ 95 అంటే, 95% వరకు రక్షణ కల్పిస్తుంది. చాలామంది ఏదో మొక్కుబడిగా మాస్కు ధరించినప్పటికీ, దాన్ని ఏ గదమ కిందికో లేదా ముక్కు కిందికో ఉండేలా ధరిస్తుంటారు. పేరుకు ధరించినట్లుగా ఉండేలా అమర్చుకుని బయటకు వచ్చేస్తుంటారు. ఏ మాస్కు అయినా దాన్ని ముక్కు కిందకు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఎన్ 95 మాస్కు ఎక్కువసేపు వాడితే ఊపిరి పీల్చడం కష్టం అనిపిస్తున్నా లేదా ఒకింత దుర్వాసన వస్తున్నా, దాంతో ఇబ్బందిగా ఉన్నా, ఆ మాస్కు జీవితకాలం అయిపోయిందని అర్థం. అలాంటి సందర్భాల్లో కొత్తది లేదా ఉతికిన మాస్కు ధరించాలి. జేబులో పెట్టుకోవచ్చా? మాస్కు ముందు భాగాన్ని ఎప్పుడూ చేత్తో ముట్టుకోకూడదు. వైరస్ కణాలు మాస్కు ముందుభాగంలోనే ఉంటాయి. కొందరు కొన్నిసార్లు మాస్కు తీసి జేబులో పెట్టుకుంటారు. అది తప్పు. అప్పుడు మాస్కు ముందుభాగాన్ని చేత్తో ముట్టుకోవాల్సి వస్తుంది. ఆ చేతులతో కళ్లు, ముక్కు, నోరు ముట్టుకుంటే కొవిడ్ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. ఏ మాస్కయినా చెవుల దగ్గర పట్టి తీసి, బయటపెట్టాలి. అలా ఎప్పుడూ చెవుల వద్దే పట్టుకోవాలి. ముందువైపు ముట్టుకున్నట్లు అనుమానం వస్తే వెంటనే చేతులు శానిటైజ్ చేసుకోవాలి. మన దేశంలో మాస్కు తప్పనిసరి ఎందుకంటే... మన దేశంలో అన్నివర్గాల ప్రజలకు, అందరికీ ఇంకా టీకాలు పూర్తిగా అందలేదు. ఇంకా చాలామంది టీకాలంటే కాస్త వెనకడుగు వేస్తున్నవారూ మన సమాజంలో కొంతమంది ఉన్నారు. పైగా మన దేశంలో జనసాంద్రత చాలా ఎక్కువ కావడంతోనూ, అందరూ ఇంకా టీకాలు వేయించుకోకపోడంతో మిగతా రక్షణ చర్యల కంటే మాస్కులు మాత్రమే కరోనా నుంచి మనల్ని రక్షించగలవు. అందుకే మహమ్మారి తీవ్రత తగ్గేవరకూ మనమందరమూ తప్పనిసరిగా విధిగా మాస్కులను ధరించి తీరాల్సిందే. డాక్టర్ సాయి సుధాకర్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ -
ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతి రేఖ
సాక్షి, హైదరాబాద్: కరోనా విసిరిన సవాళ్లకు ఎదుర్కొనేందుకు పలు రూపాల్లోని ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు, సామగ్రి ఎంతో ఉపకరించాయి. ఫ్రంట్‌లైన్ వారియర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఎంతో భద్రత కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం భారీగా పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు మెక్సికోకు చెందిన 21 ఏళ్ల యువ వ్యాపారవేత్త, విద్యార్థిని తమార ఛాయో రీ యూజబుల్ పీపీఈ కిట్లు తయారు చేశారు. దీంతో ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతిరేఖ విరిసినట్లు అయ్యింది. 3 రోజుల పాటు వైరస్ వాడి పారేసిన పీపీఈ కిట్ల ద్వారా ప్లాస్టిక్ కాలుష్యంతో పాటు వాటిపై మూడు రోజుల పాటు సజీవంగా ఉండే వైరస్తోనూ ముప్పేనని నిపుణులు చెబుతున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని తమార ఛాయో గతేడాది సహ స్థాపకురాలిగా ఓ సంస్థ ప్రారంభించి, పీపీఈ కిట్ల కొరత ఏర్పడినప్పుడు ఎంఈడీయూ ప్రొటెక్షన్ అభివృద్ధి చేశారు. వైరల్ రీసెర్చి ల్యాబ్స్‌లో ఉపయోగించే కోటింగ్ త రహాలో ఉన్న వస్త్రంతో ఆమె ఈ దుస్తులు తయారు చేశారు. ఈ కిట్‌ను 50 సార్ల వరకు ఉతికి ఉపయోగించొచ్చని, అయినా తన రక్షణ గుణాలు కోల్పోదని తమారా చెబుతోంది. ఈ దుస్తులకు క్యూఆర్ కోడ్‌ను కూడా అంతర్భాగంగా చేయడం ద్వారా దీన్ని ధరించే వారికి స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దాన్ని ఎన్ని సార్లు ఉపయోగించారన్న సమాచారం వస్తుంది. దానిని 50 సార్లు ఉపయోగించాక ప్యాకేజింగ్ ఉత్పత్తులకు సంచులుగా వాడుకోవచ్చు. ఆస్పత్రి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు భారత్, బ్రిటన్ తదితర దేశాల్లోని వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ పీపీఈ కిట్లు, మాస్కులను ఎలా రీసైకిల్ చేయాలన్న దానిపై నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌లోని వేల్స్లో థర్మల్ కంపాక్షన్ గ్రూప్ (టీసీజీ) హాస్పిటల్ గౌన్లు, మాస్కులు, వార్డు కర్టెన్లు తదితరాలను ప్లాస్టిక్ ఇటుకలుగా తయారు చేసే మెషీన్లను రూపొందించింది. ఇలా ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ద్వారా పాఠశాలల కుర్చీలు, త్రీడీ ప్రింటర్ ఫిలమెంట్లు, దుస్తుల తయారీకి ఉపయోగించే దారంగా కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు. టీసీజీ గ్రూపు కెనడా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాలకు తమ యంత్రాలను ఎగుమతి చేసేందుకు సన్నద్ధమౌతోంది. రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. వాడేసిన పీపీఈ కిట్లతో ఇటుకలు, కన్స్ట్రక్షన్ ప్యానెళ్లు తయారు చేసి తక్కువ ఖర్చులో హౌసింగ్, స్కూళ్ల నిర్మాణానికి భారత్‌లో 27 ఏళ్ల బినిష్ దేశాయ్ అనే వ్యాపారవేత్త దోహదపడుతున్నాడు. యుక్తవయసు నుంచే వ్యర్థాల నుంచి ఇటుకల తయారీ నేర్చుకున్నాడు. డిస్ఇన్ఫెక్ట్ చేసిన, ముక్కలు చేసిన మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను, కాగితం మిల్లు వ్యర్థాలు, బైండర్‌తో మిక్స్ చేసి కొత్త ఇటుకలు తయారు చేయడాన్ని కనుగొన్నాడు. దేశాయ్‌ను ది రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటున్నారు. -
ఏపీ: మాస్క్ లేకుంటే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనల్ని మరింత కఠినం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు లేని వారిని అనుమతిస్తే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జరిమానా మొత్తాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామని, అదే విధంగా 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్‌ను కేటాయించామని ఆయన వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్లు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. అందరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కమిషనర్ హెచ్చరించారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్ఐ ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. -
మెడల్ గెలిస్తే మరో బంపర్ ఆఫర్..
టోక్యో: ఒలింపిక్స్‌లో పతకం సాధించే అథ్లెట్లకు నిర్వహకులు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతకం గెలిచాక అథ్లెట్లు పోడియంపై నిల్చున్న సమయంలో ఫొటోలకు పోజులివ్వడానికి 30 సెకన్ల పాటు మాస్కులు తీసివేసే అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని అథ్లెట్లు దుర్వినియోగం చేయొద్దని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అథ్లెట్లు బరిలో ఉన్నప్పుడు మినహా అన్ని సమయాల్లో మాస్కులు ధరించే ఉండాలని నిబంధనలు జారీ చేశారు. అయితే మాస్కుల విషయంలో తాజాగా లభించిన వెసులుబాటుకు అథ్లెట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
మాస్క్‌లకి పెళ్లి కళ
కరోనా మూలంగా మాస్క్‌లు రోజువారి జీవితాల్లో భాగమైపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్కులు వాడుతున్నారు. వీటిలో ఒకసారి వాడి పడేసేవే ఎక్కువ. దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని గ్రహించిన యూకే వెడ్డింగ్ ప్లానర్స్ వినూత్న ఆలోచనతో మాస్కులతో మంచి డ్రెస్‌ను డిజైన్ చేశారు. వాడి పడేసిన 1500 మాస్కులతో వెడ్డింగ్ గౌనును రూపొందించారు. రీ సైకిల్ చేసిన పీపీఈ కి ట్‌తో గౌనుకు ఆకారాన్ని తీసుకొచ్చి అందమైన తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌ను తయారుచేశారు. వెడ్డింగ్ ప్లానర్ వెబ్సైట్ ‘హిట్చ్‌డ్’ (Hitched) ఈ గౌను రూపకల్పనకు పూనుకోగా, డిజైనర్ సిల్వర్‌వుడ్ గౌనును రూపొందించారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్‌లో కేసులు తగ్గి వివిధ కార్యక్రమాలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో హిట్చ్‌డ్ మాస్కులతో సరికొత్త వెడ్డింగ్ గౌనును రూపొందించి మోడల్‌కు వేసి ఫోటోలు తీయడంతో ఈ గౌను వెలుగులోకి వచ్చింది. ‘‘ఏటా రూపొందించే వెడ్డింగ్ గౌన్లకు భిన్నంగా పర్యావరణ హితంగా సరికొత్త గౌన్లు తయారు చేయాలనుకున్నాం. ఈ క్రమంలోనే మాస్కులను ఈ విధంగా కూడా వాడవచ్చని మెస్సేజ్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే... వాడేసిన మాస్కులను శుభ్రపరిచి వెడ్డింగ్ గౌన్‌ను రూపొందించాం. మాస్కులతో వెడ్డింగ్ గౌన్ మరింత అందంగా వచ్చింది’’అని హిట్చ్‌డ్ ఎడిటర్ సారా అలార్డ్ చెప్పారు. -
ప్రభుత్వానికి కియా 10 లక్షల మాస్క్‌లు
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కరోనా విపత్తుపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా పది లక్షల మాస్క్‌లను అందించింది. దీనికి సంబంధించిన పత్రాన్ని, శ్యాంపిల్ మాస్క్‌లను సోమవారం ఏపీ విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబుకు కియా ఇండియా సీఈవో కబ్ డాంగ్ లీ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా మాస్క్‌లను అందించడం అభినందనీయమన్నారు. ఈ మాస్క్‌లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్ కార్పొరేట్ హెడ్ జూడ్ లీ, ముఖ్య సలహాదారు డాక్టర్ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
జులై 19 తర్వాత అక్కడ మాస్క్‌లు వాడక్కర్లేదు..?
లండన్: కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వల్ల కరోనా రక్కసి ప్రభావాన్ని తగ్గించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి ధాటికి విలవిలలాడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్రిటన్‌లో జులై 19 తరువాత ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్క్ వాడకం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా పలు రకాల నిబంధనలు ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లుగా సండే టైమ్స్ తెలిపింది. అలాగే జిమ్, రెస్టారెంట్స్, మ్యూజియం తదితర వాటిల్లో స్కానింగ్ నిబంధనలను పక్కన పెట్టే అవకాశం ఉందని సండే టైమ్స్ కథనంలో పేర్కొంది. వేగంగా అమలు చేస్తున్న వ్యాక్సిన్ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో, మాస్క్ వాడాలా, వద్దా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నర కాలంగా ఆంక్షలతో మగ్గిపోయిన ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు. -
పసి ముఖానికి ముసుగు తొడగాలా?.. వద్దా? తెలుసుకోండి
విరిసీ విరియని పువ్వుల్లారా.. ఐదారేడుల పిల్లల్లారా... అన్నాడు మహాకవి. పువ్వులు సహజసిద్ధంగా వికసించినట్లే పిల్లల్లో ఇమ్యూనిటీ సహజసిద్ధంగా పెరగాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం కరోనా కట్టడిలో భాగంగా చిన్నారులకు మాస్కులు తొడగాల్సిన పనిలేదంటున్నాయి నూతన అధ్యయనాలు. మాస్కు లేకపోయినా పిల్లలు కరోనా వ్యాప్తి కారకాలు కారంటున్నాయి. ఆ కథేంటో చూద్దాం.. కరోనా కట్టడిలో మాస్కులు, సామాజిక దూరం పాటించడం కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ తాజా అధ్యయనాలు ఈ రెండు అంశాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన నిపుణుల ప్రకారం కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్, మాస్కులు ధరించడం తదితర కారణాలతో ప్రతిఏటా పిల్లలకు సోకే పలు సాధారణ వైరల్ వ్యాధులు దూరంగా ఉన్నాయి. ఉదాహరణకు చాలామంది పిల్లల్లో ప్రతిఏటా ఒక సీజన్లో ఫ్లూ రావడం సాధారణం. కానీ మాస్క్ తదితర ఆంక్షల కారణంగా ఎక్కువమంది పిల్లల్లో గతేడాదిన్నరగా సీజనల్ జలుబు రాలేదు. దీనివల్ల శరీరంలో సాధారణంగా జరిగే ఇమ్యూనిటీ బిల్డింగ్ దూరమైందని నిపుణులు భావిస్తున్నారు. జలుబులాంటివి చేసినప్పుడు పిల్లల శరీరంలోని రక్షణ వ్యవస్థ సదరు వైరస్‌ను మెమరైజ్ చేసుకొని భవిష్యత్‌లో అడ్డుకుంటుంది. కానీ అసలు జలుబే సోకకపోవడంతో చిన్నారుల్లో కరోనా అనంతర దినాల్లో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు సోకే ఆర్ఎస్వీ(రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్)పై వైరాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్‌కు టీకా లేదు. కరోనా ముందు రోజుల్లో పలువురు చిన్నారులు వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరడం అనంతరం క్రమంగా ఈ వైరస్‌కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచుకోవడం జరిగేది. కానీ కరోనా కట్టడికి అవలంబించిన విధానాలతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. అసలైన సమస్య కరోనా అనంతర దినాల్లో కనిపించవచ్చని, అప్పటికి ఈ ఆర్ఎస్వీ డేంజర్‌గా మారవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కరోనా పూర్తిగా కట్టడయ్యాక మాస్కుల్లాంటి విధానాలకు ప్రజలు స్వస్తి పలుకుతారని, ఆ సమయానికి పిల్లలు పలు వైరస్‌లకు ఇమ్యూనిటీ పెంచుకోకపోవడంతో వీటి విజృంభణ అధికంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లపాటు పిల్లలు అతి రక్షణ వలయాల్లో ఉండి హఠాత్తుగా మామూలు వాతావరణంలోకి వస్తే వారిలో మెమరైజ్డ్ ఇమ్యూనిటీ లోపం వల్ల చిన్నపాటి జలుబు కూడా తీవ్ర ఇబ్బంది కల్గించే చాన్సుంది. అందుకే సడలించారా? పిల్లల్లో మాస్కుల వాడకం వల్ల జరిగే మేలు కన్నా జరగబోయే కీడు ఎక్కువని భావించే కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల కీలక నిర్ణయం ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు కరోనా నివారణార్థ్ధం మాస్కు వాడకం అవసరం లేదని ఇటీవలే డీజీహెచ్ఎస్ సూచించింది. అదేవిధంగా 6–11 ఏళ్లలోపు పిల్లలు మాస్కు ధరించవచ్చు కానీ డాక్టర్ కన్సల్టేషన్ అనంతరమే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అదేవిధంగా పిల్లల్లో కరోనా వస్తే రెమ్‌డెసివిర్ వాడవద్దని, సిటీస్కాన్‌ను కూడా పరిమితంగా వాడాలని తెలిపింది. చిన్నారుల్లో కరోనా ముప్పు చాలా తక్కువని, అందువల్ల వీరికి మాస్కు వాడకం అలవాటు చేయకపోవడం తప్పేమీ కాదని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల్లో మాస్కు వాడకం కారణంగా వారు సహజసిద్ధంగా పెంచుకోవాల్సిన ఇమ్యూనిటీ పెరగకుండా పోతుందని నిపుణులు భావిస్తున్నారు. స్కూలుకు పోవచ్చా? చిన్నపిల్లలు స్కూలుకు పోవడం ద్వారా కరోనా ముప్పు అధికం కావచ్చని, వీరివల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాల్లేవని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ అధ్యయనం చెబుతోంది. అయితే టీనేజీ పిల్లలు మాత్రం తప్పక రక్షణ నియమాలు పాటించాలని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్‌లో జరిపిన రిసెర్చ్ ప్రకారం 9ఏళ్లలోపు పిల్లల వల్ల స్కూళ్లలో కరోనా వ్యాప్తి జరుగుతుందనేందుకు ఆధారాలు లేవు. అయితే 10–19 సంవత్సరాల పిల్లల్లో మాత్రం రిస్కు పెరుగుతూ వస్తుంది. అలాగే బడులు తెరవడమనేది కరోనా వ్యాప్తి రేటుపై చూపిన ప్రభావం కూడా తక్కువేనని తేలింది. మూడు అడుగుల దూరం! టీనేజీలోకి రాని పిల్లల్లో మాస్కు వాడకం వల్ల ప్రయోజనం కన్నా భవిష్యత్‌లో ఇబ్బందులకే ఎక్కువ చాన్సులున్నాయన్నది నిపుణుల ఉమ్మడి మాట. చిన్నారుల్లో మాస్కు వాడకం కన్నా ఇతరులతో 3 అడుగుల సామాజిక దూరం పాటించేలా చూస్తే చాలంటున్నారు. అలాగే పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చాక వాటిని అందివ్వడం మంచిదంటున్నారు. చిన్నపిల్లలు బడికి ఎక్కువకాలం దూరం కావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపవచ్చని అందువల్ల టీచర్లు, ఇతర స్టాఫ్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను స్కూలుకు హాజరయ్యేలా చూడడం మంచిదని సూచిస్తున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం రెండేళ్ల పైబడిన పిల్లలకు మాస్కు వాడడమే మంచిదని, భవిష్యత్‌లో ఇమ్యూనిటీ గురించి ఆందోళన పడడం కన్నా ప్రస్తుతం కరోనా బారినుంచి తప్పించుకోవడం కీలకమని వాదిస్తున్నారు. కానీ ఎక్కువమంది మాత్రం పిల్లల్లో మాస్కు వాడకం వారి ఇమ్యూనిటీపై ప్రభావం చూపే అవకాశాలున్నందున వీలయినంత వరకు వాడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
గుడ్‌న్యూస్: ఇక మాస్క్‌లతో పని లేదు
సియోల్: మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ఇకపై మాస్క్‌లు.. శానిటైజర్లు.. భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం అవసరం లేదు. మాస్క్‌లకు బై బై చెప్పేసి శానిటైజర్లను ఇక పక్కన పడేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రస్తుతం దక్షిణ కొరియా దేశంలో సంతరించుకుంటోంది. రెండు నెలల్లో బహిరంగ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం అనవసరమని ఆ దేశం ప్రకటించింది. ఎందుకంటే ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ శరవేవగంగా సాగుతోంది. దక్షిణ కొరియాలో వయోధికులకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించారు. 52 మిలియన్ల మందికి అంటే దాదాపు 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ పూర్తి చేశారు. జూన్‌లోపు ప్రజల్లో ఒక డోసు వ్యాక్సిన్ పొందని వారు ఒక్కరూ కూడా ఉండరని దక్షిణ కొరియా ప్రకటించింది. 60 నుంచి 74 ఏళ్లలోపు ప్రజల్లో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి క్వాన్ డియోక్ చెయొల్ తెలిపారు. దక్షిణ కొరియాలో మంగళవారం కొత్తగా 707 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 1,37,682. నాలుగు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు ఆ దేశంలో వేస్తున్నారు. -
క్రమశిక్షణతో కరోనాకు కళ్లెం
దుగ్గిరాలపాడు (జి.కొండూరు): చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠంలా.. 2017లో డెంగీ జ్వరాలతో అల్లాడిపోయిన దుగ్గిరాలపాడు గ్రామ ప్రజలు నేడు సమష్టి కృషితో స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని తమ గ్రామ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఎదుర్కోగలుగుతున్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండల కేంద్రానికి 15 కిలోమీటర్లు దూరంలో తెలంగాణ సరిహద్దులో దుగ్గిరాలపాడు గ్రామం ఉంది. గ్రామంలో 1,100 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో మరోసారి డెంగీ లాంటి చేదు అనుభవం తలెత్తకూడదని భావించిన గ్రామస్థులు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందని తెలియగానే అంతా ఏకతాటిపైకి వచ్చి స్వీయ నియంత్రణ పాటించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఒక్క కరోనా కేసు కూడా ఇక్కడ నమోదు కాలేదంటే ఆ గ్రామ ప్రజల క్రమశిక్షణ అర్థం చేసుకోవచ్చు. కఠిన నిబంధనలు కరోనా కట్టడికి గ్రామస్తులంతా కలిసి కఠిన నిర్ణయాలు తీసుకొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప గ్రామం దాటి ఎవ్వరూ బయటకు రావడం లేదు. బయటకు వస్తే మాస్క్‌లు తప్పక ధరిస్తున్నారు. గ్రామంలో శుభకార్యాలను సైతం రద్దు చేసుకున్నారు. నిత్యావసరాల కోసం షాపుల వద్దకు ఒక్కొక్కరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో నిబంధనలు పాటిస్తున్నారు. గ్రామంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ గ్రామంలోనే ఉపాధి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు బయటి గ్రామాలలో పనులకు పోకుండా గ్రామ సర్పంచ్ రాంబాబు అధికారులతో కలిసి గ్రామంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విరివిగా పనులు కల్పించేలా చర్యలు చేపట్టారు. నిత్యం మాస్క్‌లు ధరించి గ్రామంలోనే పనులు చేసుకుంటుండటంతో తమకు కరోనా పట్ల ఎలాంటి ఆందోళన లేదని గ్రామస్థులు చెబుతున్నారు. నిత్యం శానిటేషన్ గ్రామంలో నిత్యం పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపడుతున్నాం. డ్రైనేజీల్లో పూడిక తీత, రహదారుల వెంబడి బ్లీచింగ్ చల్లించడం, హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ, వాటర్ ట్యాంకుల క్లీనింగ్ వంటి పనులను ఎప్పటికప్పుడు చేపడుతున్నాం. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పక్కా ప్రణాళికతో కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం. – జడ రాంబాబు, గ్రామ సర్పంచ్ నిత్యం పర్యవేక్షణ నిత్యం గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరిస్తున్నాం. పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేపట్టడంతో పాటు కరోనా నియంత్రణ, నిబంధనలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. – రామకృష్ణ, గ్రామపంచాయతీ కార్యదర్శి -
ఎమ్మెల్యే నిధులతో మాస్కులు
భువనేశ్వర్: కరోనా వ్యతిరేక పోరులో మాస్కు బలమైన ఆయుధం. సమాజంలో బలహీన వర్గాలకు అనుకూలమైన రీతిలో నాణ్యమైన మాసు్కలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టాలి. ఈ కార్యకలాపాల కోసం ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి రూ. 50 లక్షల వరకు వెచ్చించాలని ముఖ్యమంత్రి కోరారు. మిషన్ శక్తి సిబ్బంది ఇస్తామన్న మాసు్కలను సేకరించి సేకరించి బీదలకు పంపిణీ చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణ పరిస్థితులను బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. హెల్ప్‌డెస్క్ సిబ్బంది స్పందించాలి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ రోగుల కుటుంబీకులు, బంధుమిత్రుల ఆవేదన పట్ల మానవీయ దృక్పథంతో మసలుకోవాలి. బాధితుల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని హెల్ప్‌డెస్క్ సిబ్బంది బంధువులకు అందించి ఊరట కలిగించాలని హితవు పలికారు. కోవిడ్ ఆస్పత్రుల్లో లభ్యమవుతున్న సేవలు, చికిత్స, సదుపాయాలు, రోగుల ఆరోగ్య స్థితిగతుల తాజా సమాచారం తెలియజేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్త కుమార్ మహాపాత్రో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అభయ్, ముఖ్యమంత్రి 5టీ కార్యదర్శి వి. కె. పాండ్యన్, కోవిడ్ పర్యవేక్షకులు నికుంజొ బిహారి ధొలొ, సత్యవ్రత సాహు, విష్ణుపద శెట్టి, కెంజొహార్, మయూర్భంజ్ జిల్లాల కలెక్టర్లు, కటక్, భువనేశ్వర్ నగర పాలక సంస్థల కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబీకులకు సమాచారం కోవిడ్ ఆస్పత్రుల్లో చేరిన బాధితుల ఆరోగ్య సమాచారం వారి కుటుంబీకులకు ఎప్పటికప్పుడు చేరాలి. ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది, యంత్రాంగం మానవతా దృక్పథంతో మసలుకోవాలి. కోవిడ్ నిర్వహణ రంగంలో టీకాల ప్రదానం కీలకమైన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీకాల ప్రదాన కేంద్రానికి ప్రజలు సునాయాశంగా చేరి ఇబ్బంది పడకుండా టీకాలు వేసుకునేందుకు సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాంగణాల్లో రద్దీ నివారించి కోవిడ్ – 19 నిబంధన భౌతిక దూరానికి ప్రాధాన్యం కల్పించాలి. టీకాలు వేసే చోటు, వేళల సమాచారం సంబంధిత వ్యక్తులకు ముందస్తుగా తెలియజేయడంతో ఇది సాధ్యమతుందని నవీన్ పట్నాయక్ అభిప్రాయ పడ్డారు. ఇంటింటి సర్వే అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో తెలిపారు. ఇంటింటా కరోనా రోగ లక్షణాలు కలిగిన బాధితుల సర్వే చేపడతారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లు ప్రధానంగా ఆక్సిజన్ సంబంధిత వ్యవహారాలతో హెల్ప్ డెస్కు కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.