దాతృత్వాన్ని పెంపొందించుకోవాలి: జవహర్‌రెడ్డి | Jawahar Reddy Said All People Should Be Fight Against Corona | Sakshi
Sakshi News home page

దాతృత్వాన్ని పెంపొందించుకోవాలి: జవహర్‌రెడ్డి

Published Fri, May 1 2020 5:37 PM | Last Updated on Fri, May 1 2020 5:42 PM

Jawahar Reddy Said All People Should Be Fight Against Corona - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో పోరాడుతున్న నర్సులు కోసం 10 వేల సర్జికల్‌, 2500 ఎన్‌-95 మాస్కుల్ని టీఎన్‌ఏఐ ఏపీ ప్రతినిధులు అందించారు. శుక్రవారం ట్రైన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఎన్‌ఏఐ) ఏపీ బ్రాంచ్‌ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డిని కలిసి మాస్క్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. టీఎన్‌ఎఐ ప్రతినిధుల సామాజిక బాధ్యతను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో అందరి భాగస్వామ్యం కావాలని.. దాతృత్వాన్ని పెంపొందించుకోవాలని జవహర్‌రెడ్డి కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement