
వాషింగ్టన్: ప్రస్తుతం ఉన్న మాస్కు లు తరచుగా జారిపోవడం లేదా, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కళ్లజోడు ఉన్న వారికి తడిగాలి అద్దాల మీదకు రావడం వంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కు ప్రొటోటైప్‌ను డిజైన్ చేశారు. రోజంతా ధరించేలా, సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని తయారు చేసినట్లు టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జర్నల్ ప్రచురిం చింది. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు దీన్ని తయారు చేశారు. మాస్కు కు ఉన్న పాకెట్ ద్వారా అదనపు లేయర్ ధరించి అదనపు భద్రత పొందే అవకాశం కూడా అందులో ఉందన్నారు. దాదాపు 20 సార్లు ఉతికినప్పటికీ, అది సాగడం గానీ, నాణ్యత తగ్గడంగానీ లేదని చెప్పారు.
గ్రామీణ భారతానికి ముప్పు
దేశంలో కేసుల సంఖ్య 40 లక్షలు దాటుతున్న తరుణంలో కరోనా సమూహ వ్యాప్తిగా మారుతుండడంతో గ్రామీణ భారతంపై భయాందోళనలు నెలకొన్నాయి. ఆస్పత్రి సదుపాయాలు అంతగా లేని గ్రామాల్లో కరోనా ప్రబలితే పరిస్థితులు మరింతగా దిగజారతాయని నిపుణులు చెబుతున్నారు. హౌ ఇండియా లివ్స్ వెబ్ సైట్ పరిశోధన ప్రకారం 714 జిల్లాల్లో కరోనా సోకింది. దీనివల్ల దాదాపు 94.76% మంది ప్రమాదంలో పడ్డారని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment