
ముంబై : రాష్ట్రంలో మాస్కుల వినియోగంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు మరో ఆరు నెలల పాటు మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘‘ నివారణ కంటే ముందు జాగ్రత్త ఎంతో ఉత్తమం. పబ్లిక్ ప్రదేశాలలో మాస్కులను ధరించటం అలవాటుగా మారాలి. ప్రజలు తప్పని సరిగా మరో ఆరు నెలల పాటు మాస్కులు పెట్టుకోవాలి. నైట్ కర్ఫ్యూలు విధించాలని, వీలైతే మరో లాక్‌డౌన్ పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ( తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి కానుక )
అయితే నాకది ఇష్టం లేదు. అంతా కాకపోయినా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి’’ అని అన్నారు. కాగా, మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 3,940 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,92,707 చేరింది. గడిచిన 24 గంటల్లో 74 మంది కరోనాతో మృత్యువాతపడగా ఇప్పటి వరకు మొత్తం 48,648 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment