
ముందు తరాలకు భద్రమైన, ఆరోగ్యకరమైన భూ గ్రహాన్ని ఇవ్వాల్సిన మనం... ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న çసంక్షోభాన్ని మీ దృష్టికి తేవాలను కుంటున్నాను. కోవిడ్–19 వ్యాప్తి సమయంలో మాస్క్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అందుకే మాస్కులను మనం తరచుగా కొంటున్నాం. అయితే ఇలా కొని వాడిపారేస్తున్న అసంఖ్యాక మాస్కులు మొత్తం ప్రపంచ మనుగడకే ప్రమాద కరంగా మారాయి. ఎక్కడ చూసినా వైరస్ వ్యాప్తిని పెంచడానికి ఆస్కారమున్న అసంఖ్యాక మాస్కులు కనిపిస్తున్నాయి. ఇవి నీటివనరులు, నేలలను కలు షితం చేస్తున్నాయి.
ఫలితంగా అనేకమంది అనారోగ్యం పాలవు తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పని వారి పాలిట ఈ మాస్కులు ఉరితాళ్లలా తయారౌతున్నాయి. పిల్లల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ జవహర్ నగర్‌ను ఆను కొని ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డు ప్రాంతం ప్రపంచంలోని అణగారిన నిరుపేద పిల్లల జీవితా ల్లోని ఒక అధ్యాయానికి ప్రతిబింబంగా నిలిచింది.
సింగిల్ యూజ్ వేరియెంట్లలో ఉండే పాలీ ప్రొపైలీన్లు నానో ప్లాస్టిక్‌లుగా విచ్ఛిన్నం అయ్యేవరకు మాస్కులు అలాగే ప్రకృతిలో ఉండిపోయి పర్యా వరణానికి తీవ్రమైన హానిని కలుగజేస్తాయి. ఇవి విచ్ఛిన్నమై భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఫలితంగా çపర్యావరణం తీవ్ర విషా దాన్ని చవిచూడవలసి ఉంటుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని చుట్టుపక్కల 95 మురికివాడలు ఉన్నాయి. ఇందులో 25 చోట్ల ప్రజలు ప్రత్యక్షంగా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గాలి, భూగర్భజలాలు రెండూ విషపూరితం అవుతు న్నాయి. పిల్లలు వైకల్యాలతో జన్మిస్తున్నారు, వృద్ధులు తీవ్రమైన అనారోగ్యం పాలవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ‘సంస్థాగత’ నిర్లక్ష్యమే.
డంపింగ్ యార్డ్‌పై ఆధారపడి జీవించే అర్భ కులు చాలామంది ఇక్కడ జీవిస్తున్నారు. ఇందులో చాలామంది యార్డులో డంప్ చేసే (మెడికల్ సబంధ మైనవి కూడా) అనేక వ్యర్థాలను సేకరించి బతుకు తున్నారు. పారిశుద్ధ్య పని ఒక వృత్తిగా జీవించే సామాజికంగా వెనకబడిన వర్గాలవారికి.. నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పారవేసే మాస్కులు పెద్ద ప్రమాదంగా పరిణమించాయి. మిగతా వ్యర్థాలతో పాటూ వాటినీ గ్లౌజులు వంటి ఎటువంటి రక్షణ కలి గించేవి ధరించకుండానే ఉత్త చేతులతో తొలగిం చవలసిన ఉద్యోగం వారి ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. ప్రస్తుత మాస్క్ స్థానంలో బయో–డీగ్రేడబుల్ వేరియెంట్లతో తయారైన వాటిని ప్రవేశపెట్టగలిగితే పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.
తాజా అధ్యయనం ప్రకారం, భారతదేశం గరిష్ఠంగా వారానికి 4.64 బిలియన్ మాస్క్ వ్యర్థా లను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే... ఈ మాస్కుల ఉత్పత్తికి వారానికి 12.258 టన్నుల పాలీ ప్రొపైలీన్‌ని వాడుతూ ప్రపపంచంలోనే మొదటి ర్యాంకులో భారత్ నిలిచింది. శస్త్రచికిత్స సమయంలో వాడే మాస్కుల కంటే ఎన్–95 మాస్కుల్లో పాలీ ప్రొపైలీన్ రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఉపయోగించే పాలీప్రొపైలీన్ డీకంపోజ్ అవ్వడానికి 450 సంవత్సరాలు పడు తుంది. వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలో ఎటువంటి రక్షణ లేని మనుషులకు బదులు యంత్రాలను ఉప యోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మను షులే పనిచేయవలసివస్తే వారికి తగిన రక్షణ సామగ్రిని అందించవలసి ఉంది.
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్నవారిపట్ల మరికొంత దయాశీలంగా ఉండటం మన కర్తవ్యం. మనల్ని నిరంతరం భద్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు రేపటి తరానికి తల్లిదండ్రులే అన్న ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
– జాన్ రాబర్ట్స్
(‘మిలీనియం పోస్ట్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment