టోక్యో: జపాన్‌లో కరోనా కట్టడి చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శల నడుమ మరో అంశం తెరపైకొచ్చింది. గర్భిణీ మహిళలకు పంపిణీ చేసిన మాస్కులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. దుమ్ము, మరకలతో కూడిన మాస్కులు పంపించారని 80 మున్సిపాలిటీల నుంచి 1900 ఫిర్యాదులు అందినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, దేశంలో మాస్కుల కొరత ఉన్నందున ప్రజందరికీ తలా రెండు పునర్వినియోగ మాస్కులను ఇవ్వాలని ప్రధాని షింజో అబే ఏప్రిల్ 1న ప్రకటించారు.
(చదవండి: ఆగని మరణ మృదంగం)
ఆ మేరకు మొదటి ప్రాధాన్యంగా గర్భిణీ స్త్రీలకు బట్టతో తయారు చేసిన 5 లక్షల మాస్కులు పంపిణీ చేయగా.. వాటిలో నాణత్య లోపించిందని, సైజు కూడా చిన్నగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముక్కు, నోటిని కప్పి ఉంచలేని మాస్కులు చూడండంటూ పలు టీవీ షోలలో ప్రభుత్వం వెనుకబాటుతనాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎత్తిచూపుతున్నాయి. కాగా, పరిశుభ్రమైన మాస్కులు అందించాలని తయారీదారులకు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలకు మాస్కులు పంపిణీ చేసేముందు స్థానిక అధికారులు చెక్ చేసి ఇవ్వాలని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశంలో మాస్కుల కొరత ఉండటం.. బట్ట మాస్కులు అందివ్వడంపై ప్రధానిపై ప్రజలు అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.
(చదవండి: అక్టోబర్ నాటికి వ్యాక్సిన్?)
Comments
Please login to add a commentAdd a comment