![TS High Court Has Ordered Provide Masks And PPE Kits To Doctors - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/21/Telangana-high-court.jpg.webp?itok=bGTgxzd3)
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న వైద్యులకు తప్పనిసరిగా మాస్క్‌లు, పీపీ కిట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వ చర్యలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య, చిక్కుడు ప్రభాకర్... ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వాదనలు వినిపించారు. జన సమూహాన్ని తగ్గించడానికి ప్రతి కాలనీలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. రాష్ట్రంలో కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
(వైద్యులపై దాడులకు నిరసనగా బ్లాక్ డే)
కరోనా నివారణ కు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా 329 కంటైన్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేశారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై మరోసారి పూర్తి వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 8కి కోర్టు వాయిదా వేసింది.
(హైదరాబాద్‌లో లాక్‌డౌన్ బేఖాతరు)
Comments
Please login to add a commentAdd a comment