![South Koreans No Longer Need Masks Outdoors If Vaccinated - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/26/No-Mask.gif.webp?itok=YWx319Oo)
సియోల్: మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ఇకపై మాస్క్‌లు.. శానిటైజర్లు.. భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం అవసరం లేదు. మాస్క్‌లకు బై బై చెప్పేసి శానిటైజర్లను ఇక పక్కన పడేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రస్తుతం దక‌్షిణ కొరియా దేశంలో సంతరించుకుంటోంది. రెండు నెలల్లో బహిరంగ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం అనవసరమని ఆ దేశం ప్రకటించింది. ఎందుకంటే ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ శరవేవగంగా సాగుతోంది.
దక్షిణ కొరియాలో వయోధికులకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించారు. 52 మిలియన్ల మందికి అంటే దాదాపు 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ పూర్తి చేశారు. జూన్‌లోపు ప్రజల్లో ఒక డోసు వ్యాక్సిన్ పొందని వారు ఒక్కరూ కూడా ఉండరని దక్షిణ కొరియా ప్రకటించింది. 60 నుంచి 74 ఏళ్లలోపు ప్రజల్లో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి క్వాన్ డియోక్ చెయొల్ తెలిపారు.
దక్షిణ కొరియాలో మంగళవారం కొత్తగా 707 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 1,37,682. నాలుగు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్‌లు ఆ దేశంలో వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment