సాక్షి, హైదరాబాద్: రోజూ పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నా.. గ్రేటర్ హైదరాబాద్ వాసులు మాత్రం మాస్కు ధరించట్లేదు. ఈనెల 7 నుంచి మాస్కు ధరించకపోతే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 51 (బీ) కింద పోలీసు లు కేసులు నమోదు చేస్తున్నారు. సీసీ కె మెరాల ద్వారా మాస్కులు ధ రించని వారి ముఖాలను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు అమల్లోకి తెచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13 నాటికి మాస్కు ధరించని వారి సంఖ్య 4,719కి చేరగా, 19కి 16,264కి చేరింది. ఈ ఉల్లం ఘనలు నగర కమిషనరేట్లలోనే అధికంగా ఉన్నా యి. హైదరాబాద్‌లో మరీ అధికంగా ఉన్నాయి. కేవలం 13 రోజుల్లోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,892 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ (844), రాచకొండ (1,105) కూడా కలిపితే మొత్తం 5,841 కేసులయ్యాయి. వరంగల్ (1,846), రామగుండం (1,461), ఖమ్మం (867) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment