
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంపిణీ చేసే 16 కోట్ల మాస్కులు రాష్ట్రంలోని మహిళలే తయారు చేశారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. కుట్టు మిషన్లను ఆయుధాలుగా చేసి రేయింబవళ్లు కరోనాతో పోరాడుతున్న వారందరికీ ధన్యవాదాలు అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు భారీ ఎత్తున మహిళలు, మాస్కుల ఉత్పత్తి యజ్ఞంలో పాలు పంచుకున్నారని కొనియాడారు. (ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది : విజయసాయిరెడ్డి)
‘ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్ కంటే సగం ధరకే అందజేస్తుండటం వల్ల భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రభుత్వం ఎక్కడా దీనిని ప్రచారం కోసం వాడుకోవడం లేదు. కరోనా నియంత్రణ ఉత్పత్తులకు ఏపీ వాణిజ్య హబ్ అవుతోంది. రైతులు తమ పంటను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వ్యవస్థకు వైఎస్ జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డ్వాక్రా ఉత్పత్తులను వాల్ మార్ట్ ద్వారా ప్రపంచమంతా విక్రయిస్తామని కోతలు కోసిన పెద్ద మనిషి సిగ్గుపడేలా జనతా బజార్లు వస్తున్నాయి. పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగవుతాయి’ అని ట్విటర్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.(ప్రతి ఒక్కరికి మూడు మాస్కుల పంపిణీ: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment