న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మరీ విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా ఇంట్లోనూ మాస్క్‌లు పెట్టుకోవాల్సిన సమయం అసన్నమైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై విలేకరుల సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె పాల్ మాట్లాడుతూ.. "కుటుంబంలో ఎవరికైనా కోవిడ్ -19 పాజిటివ్ వస్తే, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే వైరస్ ఇంట్లో ఇతరులకు వ్యాపిస్తుంది. అసలు నా అభిప్రాయం ప్రకారం అందరూ ఇంట్లోనూ మాస్కులు పెట్టుకుంటే మంచిది అని" డాక్టర్ వి.కె పాల్ అన్నారు.
ఇప్పటి వరకు మనం మాస్క్ బయట ధరించడం గురించి మాట్లాడుతున్నాం.. అయితే ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తునందున ప్రజలు ఇంట్లో కూడా ముసుగు ధరించాలని ఆయన అన్నారు. వ్యాధి సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలి అని డాక్టర్ పాల్ చెప్పారు. మీ ఇంటి దగ్గరకు ఎవరిని రానివ్వద్దు అని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు అని సూచించారు. ఏ మాత్రం లక్షణాలు ఉన్నా రిపోర్ట్ వచ్చే వరకూ వేచి చూడకుండా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలని సూచించారు. లక్షణాలు ఉంటే పాజిటివ్‌గానే భావించి ఆర్టీ-పీసీఆర్ లో నెగటివ్ వచ్చే అంతవరకూ అందరికీ దూరంగా ఉంటే మంచిదని చెప్పారు.ఇక కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా మాస్కులు లేకపోవడం వల్ల ఉన్న ముప్పు గురించివివరించారు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకపోతే ఇన్ఫెక్షన్ సోకే ముప్పు 90 శాతం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment