Lav Agarwal
-
ఓమిక్రాన్ పై రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలి
-
రోజుకు 5 లక్షల కరోనా కేసులు వచ్చినా సిద్ధం
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 5 లక్షల కోవిడ్ కేసులు నమోదైనా వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. అయితే మున్ముందు కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఆక్సిజన్, ఐసీయూ పడకలు సిద్ధం కోవిడ్ -19 రోగుల కోసం 8.36 లక్షల హాస్పిటల్ పడకలు అందుబాటులో ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు మిలియన్ (9,69,885) అదనపు ఐసోలేషన్ పడకలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వీటితో పాటు 4.86 లక్షల ఆక్సిజన్ పడకలు, 1.35 లక్షల ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సన్నద్దతలో ముందున్నాం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉన్నప్పటికీ.. వైద్య ఏర్పాట్లలో తాము తక్కువగా లేమని అన్నారు. కరోనా వైరస్ ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియదని, ముందు జాగ్రత్తగా భారీ స్థాయిలో సన్నద్దమవుతున్నామని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేట్ రంగం ఇందులో పాలుపంచుకుంటోందన్నారు. దేశంలో దాదాపు 1,200 ప్రెజర్ స్వింగ్ అడ్జార్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని వెల్లడించారు. మున్ముందు ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం మరో 4 వేల పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వీకే పాల్ చెప్పారు. దేశంలో ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్ కొరత లేదని, ప్రజలు రెండో డోస్ టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ‘ఒకవేళ మళ్లీ కరోనా కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రోజుకు నాలుగున్నర నుంచి 5 లక్షల కోవిడ్ కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామ’ని అన్నారు. ఈ మూడు నెలలు కీలకం: లవ్ అగర్వాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారిపై పోరాటంలో రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ మూడు నెలలు కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. -
కొన్ని చోట్ల కరోనా థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి..
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3.9 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని, దీన్ని బట్టి చూస్తే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న విషయం స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి భారత్‌లో థర్డ్ వేవ్ సూచనలు కనబడడం లేదని, మున్ముందు ఇది మన దేశాన్ని తాకకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో సెకండ్ వేవ్ ప్రారంభమైన తొలినాళ్లలో ప్రపంచ వ్యాప్తంగా రోజు వారీ కేసుల సంఖ్య దాదాపుగా 9 లక్షల వరకు ఉండిందని ఆయన తెలిపారు. థర్డ్ వేవ్ రాకుండా నివారించాలని, కొత్త వేరియంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఆంక్షలు ఎత్తివేసినంత మాత్రాన వైరస్ కథ ముగిసిందని భావించరాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలో పలు చోట్ల ప్రజలు మళ్ళీ పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారని, భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా పోటెత్తడం ప్రభుత్వం గమనిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. మరోవైపు వ్యాక్సినేషన్ కొరత నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని స్పష్టం చేశారు. -
జికా ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి
కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. మొదట ఒక 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా తేలింది. జికా ఇన్ఫెక్షన్ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కానీ కొన్నేళ్లుగా మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిస రని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ జికా ఏంటి? లక్షణాలు, ప్రమాదాలేమిటి తెలుసుకుందామా? మెదడు, నాడీ మండలంపై ఎఫెక్ట్ జికా వైరస్ లక్షణాలు మరీ ఇబ్బందిపెట్టే స్థాయిలో ఉండవు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పులు ఉంటాయి. కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. బయటికి వైరస్ లక్షణాలు కనబడకున్నా ‘గిల్లేన్ బారే సిండ్రోమ్ (నాడులు దెబ్బతిని చేతులు, కాళ్లపై నియంత్రణ దెబ్బతినడం, వణికిపోవడం)’ తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఉగాండాలో మొదలై.. 1947లో ఉగాండాలోని జికా అడవిలో ఉండే కోతుల్లో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. దోమల ద్వా రా వ్యాపిస్తుందని గుర్తించారు. ఆ అడవి పేరుతోనే జికా వైరస్‌గా పేరుపెట్టారు. 1952లో తొలిసారిగా ఉగాండా, టాంజానియాల్లో మనుషులకు జికా వైరస్ సోకింది. మెల్లగా ఇతర దేశాలకు విస్తరించింది. 2007లో, 2013లోనూ పలు దేశాల్లో కొన్ని కేసులు బయటపడ్డాయి. తర్వాత వైరస్ మ్యుటేట్ అయి కొత్త వేరియంట్లు వచ్చాయి. 2015–16లో జికా మహమ్మారి గా మారింది. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల్లో ప్రతాపం చూపింది. –సాక్షి సెంట్రల్‌డెస్క్ ఎలా వ్యాపిస్తుంది? ►డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులను వ్యాప్తి చెందించే ఎడిస్ రకానికి చెందిన దోమల ద్వారానే జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇవి పగలు మాత్రమే కుడతాయి. ►లైంగిక ప్రక్రియ ద్వారా, రక్తం ద్వారా కూడా వ్యాపిస్తుంది. గాలి, నీళ్లు, బాధితులను తాకడం వంటి వాటి ద్వారా ఇది సోకే అవకాశం లేదు. రక్త పరీక్ష ద్వారా ఈ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ►ఈ వైరస్ సోకినా కూడా.. ప్రతి పది మందికిగాను ఇద్దరిలో మాత్రమే లక్షణాలు ఉంటాయి. ►వ్యక్తులను బట్టి శరీరంలో 3 రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ వైరస్ సంఖ్యను పెంచుకుని, లక్షణాలు బయటపడతాయి. వారం రోజుల్లోగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ►జికాకు సంబంధించి ప్రత్యేకంగా చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ ప్రస్తుతం అందుబాటులో లేవు. లక్షణాలను బట్టి సాధారణ మందులనే ఇస్తారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. గర్భస్థ శిశువులకు ప్రమాదం గర్భిణులకు సంబంధించి మిగతా చాలా రకాల వైరస్‌లతో పోలిస్తే జికా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఇది గర్భం లోని శిశువులకు కూడా వ్యాపించి మైక్రోసెఫలీ (మెదడు సరిగా ఎదగదు. తల పైభాగం కుచించుకుపోతుంది), ఇతర సమస్యలకు కారణం అవుతుంది. గర్భిణులు, పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు, రెండేళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ‘జికా’పై కేంద్రం అప్రమత్తం కేరళకు ఆరుగురు నిపుణుల బృందం న్యూఢిల్లీ: కేరళలో జికా వైరస్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించింది. ఈ బృందం కేరళలో పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందజేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. కేంద్ర బృందంలో సీనియర్ వైద్యులతోపాటు అంటువ్యాధుల నిపుణులు ఉన్నారని.. కేరళలో పరిస్థితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించిన తిరువనంతపురం జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేపట్టింది. -
అలా చేస్తేనే మూడో వేవ్ వచ్చినా.. ప్రభావం ఉండదు
న్యూఢిల్లీ: ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా మూడో వేవ్ ప్రభావం పెద్దగా ఉండబోదని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. అప్రమత్తతో ఉండడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతుందని, తద్వారా దేశ వైద్య రంగంపై ఒత్తిడి పెద్దగా ఉండదన్నారు. ఇప్పటివరకు దేశ జనాభాలో 2.2% మంది కరోనా బారిన పడ్డారన్నారు. ‘జాగ్రత్తలు మరవద్దు. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అలా చేస్తే, ఒకవేళ మూడో వేవ్ వచ్చినా, పెద్ద ప్రభావం చూపబోదు. అలాగే, వైద్య వ్యవస్థను ఒత్తిడిలోకి తీసుకువెళ్లే స్థాయిలో కేసుల సంఖ్య ఉండదు’ అన్నారు. వివిధ అపోహల కారణంగా ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇంకా టీకా పట్ల వ్యతిరేకత కనిపిస్తోందని, కోవిడ్‌పై పోరులో అదే పెద్ద సవాలని అగర్వాల్ పేరొన్నారు. సోషల్ మీడియాతో కూడా వ్యాక్సిన్ల విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందన్నారు. కరోనా జాగ్రత్తలను ప్రచారం చేయడంతో పాటు, టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అపార్ధాలను తొలగించడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందన్నారు. యూనిసెఫ్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఒక మీడియా వర్క్‌షాప్‌లో అగర్వాల్ మాట్లాడారు. రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను వేసుకోవడంపై మీడియా ప్రశ్నకు మరో అధికారి వీణా ధావన్ సమాధానమిచ్చారు. ప్రస్తుతమున్న డేటా ప్రకారం వేర్వేరు డోసులకు వేర్వేరు టీకాలను వేసుకోవడం సరికాదన్నారు. టీకాకు తీవ్రమైన దుష్ప్రభావాలేమైనా ఉంటే.. టీకా తీసుకున్న మొదటి అరగంటలోనే తెలుస్తుందని, అందువల్లనే అరగంట అబ్జర్వేషన్‌ను తప్పనిసరి చేశామన్నారు. -
ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల భద్రత, సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అంటువ్యాధుల చట్టాన్ని(సవరణ) కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. కరోనా కాలంలో ప్రజారోగ్య పరిరక్షణలో హెల్త్‌కేర్ వర్కర్స్ పాత్ర విస్మరించలేనిదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ప్రశంసించారు. వారి భద్రత, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అదనపు చీఫ్ సెక్రెటరీలకు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు, హెల్త్ సెక్రెటరీలకు లేఖ రాశారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పనిచేసే చోట, నివాసం ఉండే చోట వారికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో ఇటీవల వైద్యులు, నర్సులపై భౌతిక దాడులు జరిగాయని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలు ఆరోగ్య కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలపై దాడికి దిగేవారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలంటూ అంటువ్యాధుల చట్టం–1897లో సవరణ చేస్తూ గత ఏడాది ఏప్రిల్ 22న ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, దీన్ని ఒక చట్టంగా సెప్టెంబర్ 29న నోటిఫై చేశామని లవ్ అగర్వాల్ గుర్తుచేశారు. ఈ చట్టం కింద హెల్త్ కేర్ సిబ్బందికి, వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. చదవండి: సీఎం కుమారుడిపై చర్యలు తీసుకోండి -
దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 6.37 శాతంగా ఉందని వెల్లడించారు. 8 రోజులుగా 2 లక్షలలోపు కరోనా కేసులు నమోదవుతున్నాయని, 5 రాష్ట్రాల్లోనే 66శాతం కేసులున్నాయని అన్నారు. కాగా, దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల.. పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌లో తెలిపింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2713. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,07,071 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,65,97,655 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా కేసులు 16,35,993 ఉన్నాయి. 24 గంటల్లో20,75,428 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,74,33,846. -
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంది: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా బలహీన పడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 20 రోజులుగా నమోదవుతున్న రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. గత రెండు వారాలుగా రోజువారీ రికవరీల సంఖ్య తాజా ఇన్ఫెక్షన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని, అలాగే దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసులు కూడా స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. మే 7న గరిష్ట స్థాయి(4,14,188 పాజిటివ్ కేసులు) తరువాత, దేశంలో రోజువారీ కేసులు మే 12న 3,48,421 కు తగ్గాయని, ఆ సంఖ్య మే 17 నాటికి మూడు లక్షల లోపుకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత నేటి వరకు కేసుల సంఖ్య 3,00,000 మార్కును దాటలేదని, ఇది శుభపరిణామంగా పరిగణించవచ్చని తెలిపారు. ఇక దేశవ్యాప్త రికవరీ రేటు విషయానికొస్తే.. మే 3న 81.8 శాతంగాఉన్న రికవరీ రేటు, మే 18న 85.6 శాతానికి పెరిగిందని, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 90 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా సుమారు 2, 11,000 కొత్త కేసులు నమోదైనట్లు ప్రకటించారు. చదవండి: లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది.. -
Lav Agarwal: బెంగళూరు, చెన్నైలలో పరిస్థితి దారుణం
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణపై లవ్ అగర్వాల్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..'' నిన్నటి కంటే ఈరోజు 2.4 శాతం కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి. అసోం, గోవా, మణిపూర్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. బెంగళూరులో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్, బిహార్, హర్యానా రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్న రాష్ర్టాలు 17 ఉన్నాయి'' అంటూ తెలిపారు. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నరకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. తమిళనాడులో 38 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. చదవండి: కరోనా థర్డ్ వేవ్ తప్పదు: సంచలన హెచ్చరికలు చైనా నిర్వాకం: ప్రపంచం నెత్తిన మరో ప్రమాదం... -
Corona Cases in India: నిన్నటి కంటే ఇవాళ ఎక్కువ కేసులు
-
ఇంట్లోనూ మాస్క్ ధరించండి..ఎందుకంటే ?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలకు పారదోలేందుకు, అప్రమత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇళ్లలోనే ఉండి, ఇంట్లోనూ మాస్క్ ధరించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలను కోరింది. కేసుల తీవ్రత గురించి ఎలాంటి భయానికి గురి కావద్దని తెలిపింది అనవసర ఆందోళనతో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో అవసరానికి సరిపోను ఆక్సిజన్ నిల్వలున్నాయని, రవాణాలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ బాధితుల్లో అత్యధికులు ఇంట్లో ఉండే చికిత్స పొందవచ్చనీ, డాక్టర్లు సూచిస్తేనే ఆస్పత్రుల్లో చేరాలంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, హోం శాఖ అదనపు కార్యదర్శి పియూష్ గోయెల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పరిస్థితుల తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ప్రజల్లో తలెత్తుతున్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో రెమిడెసివిర్, తోసిలిజుమాబ్ వంటి ముఖ్యమైన ఔషధాల వినియోగానికి సరైన ప్రిస్క్రిప్షన్ అవసరమని ఆరోగ్య శాఖ తెలిపింది. రెమిడెసివిర్, తోసిలిజుమాబ్ మాదిరిగా ప్రభావం చూపే చౌకైన, తేలిగ్గా అందుబాటులో మందులు చాలానే ఉన్నాయి. వాటిని వాడటం మంచిది. మెడికల్∙ఆక్సిజన్ దేశంలో వైద్య వినియోగానికి తగినంత ఉన్నప్పటికీ, దానిని ఆసుపత్రులకు రవాణా చేయడం సవాలుగా మారిందని పేర్కొంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు, ఆక్సిజన్ డిమాండ్ ఉన్న ప్రాంతాలకు దూరం ఎక్కువగా ఉందని వివరించింది. న్యాయమైన పద్ధతిలో ఆక్సిజన్ వాడాలని, దాని వృథాను ఆపాలని కేంద్రం రాష్ట్రాలు, ఆసుపత్రుల యాజమాన్యాలను కోరింది.వైద్యేతర అవసరాలకు లిక్విడ్ ఆక్సిజన్‌ను వాడరాదంటూ ఆదివారం కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధం నుంచి యాంపుల్స్, వయెల్స్, ఫార్మాస్యూటికల్, రక్షణ బలగాలు అనే మూడు రంగాలను మినహాయిస్తూ సోమవారం మరో ఉత్తర్వు వెలువరించింది. ఒక్కో వ్యక్తి నుంచి 406 మందికి.. గత ఏడాది మొదటి వేవ్‌తో పోలిస్తే ఈసారి వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది కంటే 2.25 రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో, కర్ణాటకలో 3.3 రెట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5 రెట్లు ఎక్కువగా కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దూరం పాటించకుంటే ఒక్కో బాధితుడి ద్వారా 30 రోజుల్లో 406 మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందని డాక్టర్ పాల్ తెలిపారు. భౌతికదూరం 50% పాటించినట్లయితే, ఒక్కో వ్యక్తి ద్వారా 15 మందికి మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు రుజువైంది. భౌతిక దూరాన్ని 75% పాటించిన బాధితుడి ద్వారా 30 రోజుల్లో 2.5 మందికే వైరస్ సోకుతుంది. వ్యాక్సినేషన్‌కు, మహిళల పీరియడ్స్‌కు సంబంధంలేదని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌కు కొత్త విధానం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉందంటూ ఎక్కువ మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో 90 శాతం మందికి జ్వరం, ఒళ్లునొప్పుల వంటి వాటితో స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. వీరికి జ్వరానికి ఇచ్చే మందులు, ఆవిరి పట్టడంతో వ్యాధిని తగ్గించవచ్చు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత ఆక్సిజన్ సంతృప్తికర స్థాయిలో ఉండి, స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో జాయినవ్వాలని కోరుకుంటున్నారు. మధ్యస్త, తీవ్ర స్థాయి కేసుల్లో 5వ రోజు నుంచి 7వ రోజు తర్వాత మాత్రమే ఆక్సిజన్‌తో అవసరం ఉంటుంది. అంతకంటే ముందుగా ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మొదటి, రెండో రోజే చికిత్స సమయంలో ఆక్సిజన్ అందిస్తే సైడ్ ఎఫెక్ట్సు తలెత్తే ప్రమాదం ఉంది. కోవిడ్ బాధితులకు అందజేసే రెమిడెసివిర్, టొసిలిజుమాబ్ వంటి ఔషధాలను హేతుబద్ధంగా ఆస్పత్రులు వాడాలి. పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లపై రెమిడెసివిర్ ప్రభావం ఇంకా నిర్థారణ కానందున, బదులుగా వేరే మందులను వాడుకోవచ్చు. ఆక్సిజన్ ట్యాంకులకు జీపీఎస్ దేశంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు చాలినన్ని ఉన్నాయని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే, ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాల నుంచి తక్షణం అవసరం ఉన్న చోటికి ఆక్సిజన్ తరలింపు సమస్యగా మారింది. భారత వైమానిక దళ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించడం ద్వారా రవాణా సమయం తగ్గింది. కేసులు ఒక్కసారిగా పెరగడంతో దేశంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ల కదలికలను జీపీఎస్ ద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కొరత తీరుస్తున్నాం. స్థానిక కంటెయిన్మెంట్ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు గుర్తించిన జిల్లాలు, ప్రాంతాల్లో స్థానిక ప్రాతిపదికన కంటెయిన్మెంట్ ప్రణాళికలను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. దీనికి సంబంధించి ఈ నెల 25న కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ వెలువరించిన మార్గదర్శకాలను పాటించాలంది. కంటెయిన్మెంట్ వ్యూహాలకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి స్వేచ్ఛ కల్పించి, పక్కాగా అమలయ్యేలా చూడాలి. ప్రస్తుత వేవ్‌ను ఒక స్థాయికి నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం లకి‡్ష్యత కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం, గత వారం రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం, అంతకంటే ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాలను, కోవిడ్ బాధితుల్లో 60 శాతం కంటే మించి ఆక్సిజన్ అవసరమయ్యే లేదా ఐసీయూలో చేరిన వారున్న ప్రాంతాలను గుర్తించాలని కోరింది. ఈ రెండు అంశాల్లో ఏ ఒక్కటి సరిపోలినా సంబంధిత జిల్లాలో కంటెయిన్మెంట్ చర్యలను తక్షణం తీసుకోవాలని తెలిపింది. ఆ ప్రాంతంలోని ప్రజలు 14 రోజులపాటు కలుసుకోకుండా చూడటం ద్వారా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చంది. కాగా, కోవిడ్ తీవ్రత కట్టడి వ్యూహాలను సమన్వయం చేసుకునేందుకు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆధ్వర్యంలో ఎంపవర్డ్ గ్రూప్–3 సోమవారం లక్షమందికి పైగా పౌర సంస్థల సభ్యులతో సమావేశమైంది. ఇంట్లోనూ మాస్క్ ఎందుకు? ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్‌లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలని చెప్పాం. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలని కోరుతున్నాం. ఇంట్లో ఇతరులతో కలిసి కూర్చున్నప్పుడు మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తి చెందదు. ఇంటికి అతిథులను ఆహ్వానించవద్దు. పాజిటివ్‌గా తేలిన వారు ఆస్పత్రుల్లోనే చేరాల్సిన అవసరం లేదు. వారిని వేరుగా గదిలో ఉంచవచ్చు. వారి ద్వారా ఇతర కుటుంబసభ్యులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వసతులు లేకుంటే ఐసోలేషన్ కేం ద్రాలకు వెళ్లవచ్చు. -
ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాల్సిందే
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మరీ విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా ఇంట్లోనూ మాస్క్‌లు పెట్టుకోవాల్సిన సమయం అసన్నమైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై విలేకరుల సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె పాల్ మాట్లాడుతూ.. "కుటుంబంలో ఎవరికైనా కోవిడ్ -19 పాజిటివ్ వస్తే, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే వైరస్ ఇంట్లో ఇతరులకు వ్యాపిస్తుంది. అసలు నా అభిప్రాయం ప్రకారం అందరూ ఇంట్లోనూ మాస్కులు పెట్టుకుంటే మంచిది అని" డాక్టర్ వి.కె పాల్ అన్నారు. ఇప్పటి వరకు మనం మాస్క్ బయట ధరించడం గురించి మాట్లాడుతున్నాం.. అయితే ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తునందున ప్రజలు ఇంట్లో కూడా ముసుగు ధరించాలని ఆయన అన్నారు. వ్యాధి సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలి అని డాక్టర్ పాల్ చెప్పారు. మీ ఇంటి దగ్గరకు ఎవరిని రానివ్వద్దు అని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు అని సూచించారు. ఏ మాత్రం లక్షణాలు ఉన్నా రిపోర్ట్ వచ్చే వరకూ వేచి చూడకుండా ఐసోలేషన్లోకి వెళ్లిపోవాలని సూచించారు. లక్షణాలు ఉంటే పాజిటివ్‌గానే భావించి ఆర్టీ-పీసీఆర్ లో నెగటివ్ వచ్చే అంతవరకూ అందరికీ దూరంగా ఉంటే మంచిదని చెప్పారు.ఇక కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా మాస్కులు లేకపోవడం వల్ల ఉన్న ముప్పు గురించివివరించారు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకపోతే ఇన్ఫెక్షన్ సోకే ముప్పు 90 శాతం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చదవండి: మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలా? -
కోవిడ్ లెక్కలు చెప్పే అగర్వాల్‌కు కరోనా
న్యూఢిల్లీ: కోవిడ్ నేషనల్ హెల్త్ బులెటిన్ వివరాలను వెల్లడించే కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వైరస్ బారిన పడ్డారు. తాజా పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈమేరకు ఆయన ట్విటర్లో వెల్లడించారు. పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. తనతోపాటు విధుల్లో పాల్గొన్న సహోద్యోగులు, ఇటీవల తను కలిసిన స్నేహితులు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. వారందరినీ ఆరోగ్య విభాగం బృందం త్వరలోనే కాంటాక్ట్ ట్రేసింగ్ చేయనుందని తెలిపారు. కరోనా నుంచి కోలుకుని త్వరలోనే అందుబాటులోకి వస్తానని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు మొదలైన గత ఆరు నెలల నుంచి కరోనా లెక్కలను మీడియాకు తెలుపుతూ ఆయన సుపరిచతమయ్యారు. కేంద్ర మీడియా సెంటర్లో ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. (నెలసరి సెలవు తీసుకున్నందుకు.. ఎన్నేసి మాటలు అన్నారో!) -
ఇండియాలో 1,45,380 కరోనా కేసులు
-
కరోనా: మనదేశానికి ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచంలోని మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే లక్ష జనాభాకు 62 మంది కోవిడ్ బారిన పడ్డారని, మనదేశంలో లక్ష జనాభాకు 7.9 మంది మాత్రమే కరోనాకు చిక్కారని వెల్లడించారు. ఇక కోవిడ్-19 మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా లక్ష జనాభాకు 4.2 మంది మరణించగా, మనదేశంలో లక్ష జనాభాకు 0.2 మరణాలు మాత్రమే సంభవించాయని ప్రకటించారు. ఇప్పటివరకు 3303 మంది కరోనా సోకి చనిపోయారు. కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. మొదటి లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు రికవరీ రేటు 7.1 శాతం ఉండగా, రెండవ లాక్డౌన్ సమయంలో రికవరీ రేటు 11.42 శాతం, తర్వాత అది 26.5 9శాతానికి పెరిగి.. ప్రస్తుతం 39.62 శాతానికి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 61,149 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని, 42,298 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని లవ్ అగర్వాల్ ప్రకటించారు. కాగా, గత 24 గంటల్లో 1,07,609 కరోనా నిర్థారిత పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తెలిపింది. (గుర్రాల నుంచే కోవిడ్ వ్యాక్సిన్) ఇక రాష్ట్రాల వారిగా చూసుకుంటే 37136 కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ (12140), తమిళనాడు (12448), ఢిల్లీ(10554) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో మొత్తం ఇప్పటివరకు 1,06,750 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు..!) -
లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్‌కు సడలింపులు అమల్లోకి వచ్చిన తొలిరోజే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా పాజిటివ్ కొత్త కేసులు వేగంగా ప్రబలితే మరోసారి లాక్డౌన్ తప్పదని స్పష్టం చేసింది. సోమవారం ఒక్కరోజే 2553 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని, 72 మంది మరణించారని పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,000 దాటగా, కోవిడ్ రికవరీ రేటు 27 శాతానికి పెరగడం ఊరట కల్పించింది. ఇక రెడ్జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులూ ఉండవని పేర్కొంది. రాష్ట్రాల మధ్య రాకపోకలను అప్పుడే అనుమతించబోమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. రెడ్ జోన్లలో రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీలు నిషేధమని, స్కూళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, సెలూన్లు, స్పాలను అనుమతించమని స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రార్ధనా స్థలాలను ప్రారంభించరాదని, చిరు వ్యాపారులు ఒకరు నిర్వహించే దుకాణాలను తెరుచుకోవచ్చని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో కఠిన నియంత్రణలు అవసరమని చెప్పారు. ఇక వలస కూలీల తరలింపునకు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక రైళ్లు నడిపారని, వలస కూలీల నుంచి చార్జీలు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. కార్మికుల తరలింపునకు అయిన వ్యయంలో 85 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. చదవండి : లాక్డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం -
24 గంటల్లో 1993 పాజిటివ్ కేసులు..
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ విరమణకు సంసిద్ధమవుతున్న వేళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1993 తాజా కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,043కు ఎగబాకగా ఇప్పటివరకూ 8889 మంది డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1147కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. వ్యాధి నుంచి కోలుకుని ఈరోజు 554 మంది డిశ్చార్జి అయ్యారని, రికవరీ రేటు 25.37 శాతానికి పెరిగిందని ప్రకటించడం ఊరట కల్పిస్తోంది. ఇక నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేదని, సరుకు రవాణా ట్రక్కులను అనుమతించాలని రాష్ట్రాలకు సూచించామని కేంద్రం వెల్లడించింది. 62 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించాయని, సరుకు రవాణాకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరింది. విద్యార్ధులు, వలస కూలీలను స్వస్ధలాలకు వెళ్లేందుకు అనుమతించామని పేర్కొంది. చదవండి : ‘బస్సుల్లో తరలిస్తే మూడేళ్లు పడుతుంది’ -
కరోనా కట్టడి చర్యలపై ఐఎంసీటీ సంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) ఇక్కడి కట్టడి చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ పేర్కొన్నారు. గురువారం కరోనా తాజాస్థితి వివరాలు తెలిపారు. ఇందులో భా గంగా హైదరాబాద్‌లో క్షేత్రస్థాయి పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐఎంసీటీ బృందం ఆస్పత్రులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్, మార్కెట్లను సందర్శించింది. టెస్ట్ కిట్లు, పీపీఈ కిట్లు తగినన్ని ఉన్నాయని ఈ బృందం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డు ద్వారా పేషెంట్ల రాక నుంచి డిశ్చార్జి వరకు పర్యవేక్షిస్తోందని తెలిపింది. స్టేట్ నోడల్ సెంటర్‌గా ఉన్న గాంధీ ఆస్పత్రిని కూడా కేంద్ర బృందం సందర్శించింది. రోజుకు 300 టెస్టులు జరిపే సామర్థ్యం ఈ ఆస్పత్రి లేబొరేటరీకి ఉంది. చికిత్స అందిన తర్వాత పేషెంట్‌ను ఇంటి వద్దకు వాహనంలో పంపిస్తోంది. 14 రోజుల పాటు మొబైల్ ద్వారా వారిని పర్యవేక్షిస్తున్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో కూడా అన్నిరకాల ప్రామాణిక నిబంధనలు పాటిస్తున్నారు. శాంపిల్ సేకరణ వసతి ఉంది. ఆస్పత్రిలో పీపీఈ కిట్ల డానింగ్, డాఫింగ్ ఏరియాలను వేర్వేరుగా దూరంగా ఉంచాలని బృందం ఆస్పత్రికి సూచించింది. పేషెంట్లకు, సిబ్బం దికి వేర్వేరు కారిడార్లు కేటాయించాలని సూచించింది. హుమాయున్‌నగర్ కంటైన్మెంట్ కేంద్రాన్ని కూడా టీం పరిశీలించింది. క్వారంటైన్ కేంద్రాన్ని, సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను కూడా సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది. రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఔషధాల సరఫరా పర్యవేక్షణ ఉన్నట్లు బృందం గ్రహించింది. షెల్టర్ హోంను కూడా సందర్శించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. మొబైల్ క్యాంటీన్లు, నైట్ షెల్టర్లు, అనాథాశ్రమాల ద్వారా భోజన వసతి ఏర్పాట్లు, లాక్డౌన్ నిబంధనలు అమలు, సామాజిక దూరం పాటించడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని భవన నిర్మాణాల వద్ద కార్మికులు మాస్కుల్లేకుండా పనిచేయడం చూసి దానిపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించింది’అని శ్రీవాస్తవ వివరించారు. కాగా, తెలంగాణలో కేసుల రెట్టింపు రేటు 40 రోజులకు పైగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ సంయుక్త శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. -
24 గంటల్లో 1543 పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా పెరుగుతున్నా తాజా కేసుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1543 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 6868 మంది వైరస్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రికవరీ రేటు 23.3 శాతానికి చేరడం, కేసులు రెట్టింపయ్యే డబ్లింగ్ రేటు 10.2 రోజులకు పెరగడం ఊరట కలిగించే పరిణామమని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 934కు పెరిగిందని చెప్పారు. 17 జిల్లాల్లో 28 రోజులుగా ఎలాంటి కేసులూ వెలుగుచూడలేదని అన్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న గుజరాత్‌కు రెండు కేంద్ర బృందాలు చేరుకున్నాయని తెలిపారు. కాగా ప్లాస్మా థెరఫీని ఐసీఎంఆర్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్‌కు చికిత్సగా ప్లాస్మా థెరఫీని వాడవచ్చనేందుకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. ప్లాస్మా థెరఫీని జాగ్రత్తగా చేయకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. చదవండి : న్యూయార్క్‌లో లాక్డౌన్ పొడగింపు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా: భారత్‌లో రికవరీ శాతం 20.57
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 23 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,684 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కు చేరుకుందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. మనదేశంలో కరోనా బాధితుల రికవరీ 20.57 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే రికవరీ విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. గడిచిన 14 రోజుల్లో 80 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. వైరస్ బారినపడి ఇప్పటివరకు 724 మంది మృతి చెందారని, 4,748 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 17,610 యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేశామని లవ్ అగర్వాల్ వివరించారు. కరోనా మూడో దశ నుంచి భారత్ రక్షించబడిందని పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణకు హైదరాబాద్, సూరత్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో మరో 4 ఐఎంసీటీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. (చదవండి: సూర్య కిరణాలకు కరోనా ఖతం!) -
లాక్డౌన్ నుంచి పలు షాపులకు మినహాయింపు
-
లాక్డౌన్ ఎఫెక్ట్: డబ్లింగ్ కాలం పెరిగింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని కేంద్రం సోమవారం వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రతి 3.5 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపయ్యేదని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే, లాక్డౌన్ విధించడంతో కేసుల రెట్టింపు కాలం 7.5 రోజులకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, అన్ని వ్యవస్థలూ స్తంభించడంతో వైరస్ వ్యాప్తి రేటులో తగ్గుదల నమోదైందని అన్నారు. (చదవండి: అనుమతిస్తే ఒత్తిడి తగ్గిస్తాను) ఇక దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు కేసుల రెట్టింపు విషయంలో మెరుగ్గా ఉన్నాయని అగర్వాల్ తెలిపారు. ఇదిలాఉండగా.. లాక్డౌన్ పటిష్ట అమలుతో గోవాలో కొత్త కేసులు నమోదు కాలేదు. పాజిటివ్‌గా తేలిన ఆరుగురు వ్యక్తులు డిశ్చార్చ్ అయ్యారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 59 జిల్లాల్లో 14 రోజుల కాలంలో ఒక్క కొత్త కేసు నమోదు కాలేదు. కర్ణాటకలోని కొడగు, పుదుచ్చేరిలోని మహె, ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్హ్వాల్లో 28 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు నమోదు లేదు. -
దేశవ్యాప్తంగా 24 గంటల్లో 27 మరణాలు
-
ఢిల్లీ వైరస్ మొండిఘటం
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో రెండు రకాల బాధితులు ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వైరస్ బాధితులు ఒక రకంగా.. మరో ప్రాంతం నుంచి వచ్చి వైరస్ సోకిన వారిలో ఇంకో రకంగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్, జర్మనీ తదితర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి వైరస్ సోకిన వారిలో వైరస్ బలం అంతగా కనిపించడం లేదని, ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు వీరు కోలుకోవడంలోనూ జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి సోకిన వైరస్ మ్యుటేషన్ (రూపాంతరం) చెంది బలహీనంగా ఉండి వుండచ్చునని వైద్యులు చెబుతున్నారు. వారు తమ పరిశీలనలో గుర్తించిన అంశాలు.. ► పాశ్చాత్య దేశాల (అమెరికా, ఇటలీ, జర్మనీ తదితర) నుంచి వచ్చి వైరస్ సోకిన వారు త్వరగా కోలుకుంటున్నారు ► 60 ఏళ్లు దాటిన వారు కూడా 14 రోజుల్లోనే కోలుకున్నారు. మృతుల్లోనూ వీరి సంఖ్య తక్కువే. ► ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లి వచ్చి వైరస్ బారిన పడ్డ వారు కోలుకోవడానికి బాగా సమయం పడుతోంది. ► 50 ఏళ్ల లోపు వారు కూడా త్వరగా కోలుకోలేక పోతున్నారు ► ఇండోనేషియా లేదా ఇరాన్ దేశస్థుల నుంచి ఈ వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానం. ► మృతుల్లో ఎక్కువమంది ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి నుంచి సోకిన వారే. ► 15 ఏళ్ల లోపు వారిలోనూ ఎక్కువగా ఢిల్లీ నుంచి వచ్చినవారు, వారి కాంటాక్టుల ద్వారా సోకిన వారే. తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విదేశాలు...ఢిల్లీ ఈ రెండు ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో వైరస్ తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి సోకిన వైరస్ చాలా బలంగా ఉన్నట్టు గుర్తించాం. దీనిపై కారణాలు కనుక్కోవాల్సి ఉంది. – డా.రాంబాబు, నోడల్ అధికారి, కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గడిచిన 14 రోజుల్లో ఒక్క కేసూ లేదు సాక్షి, విశాఖపట్నం, న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నిరోధానికి విశాఖ జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. గత 14 రోజుల్లో ఒక్క కేసూ నమోదవని జిల్లాగా విశాఖ నిలిచింది. ఇలా.. దేశ వ్యాప్తంగా గత 14 రోజులలో 12 రాష్ట్రాలలోని 22 కొత్త జిల్లాలలో ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదని ఒక జాబితా వెలువరించింది. ఈ జాబితాలో ఏపీ నుంచి విశాఖపట్నం కూడా ఉంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రశంసల జల్లు.. విశాఖలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రశంసలు కురిపించింది. దేశ వ్యాప్తంగా 22 జిల్లాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కమిషనర్ లవ్ అగర్వాల్ వెల్లడించారు. అధికారులు తీసుకున్న చర్యల కారణంగానే జిల్లాలో రెండు వారాలుగా ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదని ప్రశంసించారు. జిల్లాలో కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడంతో కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. మిగిలిన జిల్లాలూ ఈ తరహా చర్యలు తీసుకుంటే కరోనాని జయించవచ్చని సూచించారు. జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదుకాగా.. ఇప్పటి వరకూ 16 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. ఆరెంజ్ జోన్లోకి మార్చే అవకాశం ఏప్రిల్ 15న విశాఖపట్నాన్ని రెడ్ జోన్లో ఉన్నట్టు నిర్ధేశించారు. తాజాగా గడిచిన 14రోజుల్లో ఒక్క కేసు నమోదు కాకపోవడంతో విశాఖను ఆరెంజ్ జోన్లోకి మార్చే అంశాన్ని రాష్ట్ర యంత్రాంగం పరిశీలించనుంది. ఇక దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 47 జిల్లాలలో కార్యాచరణ ప్రణాళిక అమలు మంచి ఫలితాలను ఇస్తోందని, గత 28 రోజులలో కరోనా కేసులు నమోదు కాని జిల్లాల జాబితాలో తాజాగా కొడగు (కర్ణాటక), మహే (పుదుచ్చేరి) చేరాయని తెలిపింది. ఏప్రిల్ 15న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం గడిచిన 14 రోజులలో ఒక్క కేసు నమోదు కాకపోతే ఆయా జిల్లాలు ఆరెంజ్ జోన్లోకి వెళతాయని, 28 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకానిపక్షంలో గ్రీన్ జోన్లోకి వెళతాయని నిర్దేశించారు. -
వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడొద్దు