
సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్ విరమణకు సంసిద్ధమవుతున్న వేళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1993 తాజా కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,043కు ఎగబాకగా ఇప్పటివరకూ 8889 మంది డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1147కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
వ్యాధి నుంచి కోలుకుని ఈరోజు 554 మంది డిశ్చార్జి అయ్యారని, రికవరీ రేటు 25.37 శాతానికి పెరిగిందని ప్రకటించడం ఊరట కల్పిస్తోంది. ఇక నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేదని, సరుకు రవాణా ట్రక్కులను అనుమతించాలని రాష్ట్రాలకు సూచించామని కేంద్రం వెల్లడించింది. 62 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించాయని, సరుకు రవాణాకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరింది. విద్యార్ధులు, వలస కూలీలను స్వస్ధలాలకు వెళ్లేందుకు అనుమతించామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment