సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 23 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,684 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కు చేరుకుందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. మనదేశంలో కరోనా బాధితుల రికవరీ 20.57 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే రికవరీ విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. గడిచిన 14 రోజుల్లో 80 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
వైరస్ బారినపడి ఇప్పటివరకు 724 మంది మృతి చెందారని, 4,748 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 17,610 యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేశామని లవ్ అగర్వాల్ వివరించారు. కరోనా మూడో దశ నుంచి భారత్ రక్షించబడిందని పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణకు హైదరాబాద్, సూరత్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో మరో 4 ఐఎంసీటీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
(చదవండి: సూర్య కిరణాలకు కరోనా ఖతం!)
Comments
Please login to add a commentAdd a comment