health ministry
-
మరణించినా మరికొందరిలో ప్రభవిస్తున్నారు!
సాక్షి, అమరావతి: మరణించినా అవయవదానం ద్వారా మరికొందరికి ప్రాణం పోస్తున్న వారి సంఖ్య గత మూడేళ్లుగా పెరుగుతోంది. దేశంతో పాటు రాష్ట్రంలోనూ అవయవ దాతల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో 2021 నుంచి 2023 వరకు అవయవదానాల సంఖ్య 42,040కు చేరిందని, అదే సమయంలో రాష్ట్రంలోనూ ఈ సంఖ్య 965కు చేరిందని పేర్కొంది. అవయవదానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. మరణించాక అవయవదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణం పోసినవారవుతారన్న తరహాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవయవదానం నమోదును సులభతరం చేసేందుకు ఆధార్ అనుసంధానంతో డిజిటల్ వెబ్ పోర్టల్‌ను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మరణించాక తమ అవయవాలను దానం చేస్తామంటూ ఇప్పటి వరకూ రెండు లక్షల మంది ఈ పోర్టల్‌లో ప్రతిజ్ఞ చేయడం విశేషం. అవయవదానాలపై అవగాహన కల్పించేందుకు ఏటా భారతీయ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సెమినార్లు, వెబ్నార్లు, వర్క్‌షాప్‌ల వంటి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అవయవాల సేకరణ, మార్పిడి, పంపిణీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సంస్థలతో మూడంచెల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్, ఐదు ప్రాంతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్లు, రాష్ట్ర స్థాయిలో 21 రాష్ట్ర అవయవాలు, టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రస్తుతం 900పైగా ఇనిస్టిట్యూషన్లు, ఆస్పత్రులు అవయవాల మార్పిడి, పునరుద్ధరణ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యాయి.రూ.10 వేల పారితోషికంబ్రెయిన్ డెడ్ అయి అవయవదానాలు చేస్తున్న వారి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అవయవాల సేకరణ అంనతరం భౌతిక కాయాన్ని ఉచిత రవాణా సదుపాయాలతో స్వస్థలాలకు చేర్చడంతో పాటు.. కుటుంబ సభ్యులకు రూ.10 వేల పారితోషికం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను సత్కరించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొంది. -
44 వేలు దాటిన మరణాలు
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్‌తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో సాధారణ పౌరులు ఎంతమంది, హమాస్‌కు చెందిన వారెందరు అనేది గాజా ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా లెక్కించదు. కాకపోతే మృతుల్లో సగం కంటే ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 44,056 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,04,268 గాయపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. వాస్తవ మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని, మెడికోలు చేరుకొలేని ప్రదేశాల్లో శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు 17 వేల మంది పైచిలుకు హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ జరిపిన ఈ మెరుపుదాడిలో 1,200 మరణించగా, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నారు. -
భారత్‌లో అనుమానిత మంకీపాక్స్ కేసు.. కేంద్రం కీలక ఆదేశాలు
ఢిల్లీ: దేశంలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్‌ను తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది.కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) కింద వ్యాధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.మంకీపాక్స్ సాధారణ సంకేతాలు, లక్షణాలు, రోగనిర్ధారణ తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని అన్నీ రాష్ట్రాలకు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచ్చినట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది. -
డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారా? కేంద్రం కీలక సూచనలు
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్యులు రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ రాసిస్తుంటారు. అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాశారు.. ఆవశ్యకత ఏంటన్నది సామాన్యులకు తెలియదు. డాక్టరు చెప్పారు కదా చాలామంది వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్యులకు పలు కీలక సూచనలు చేసింది. కారణం రాయాల్సిందే.. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించడానికి గల కారణాన్ని, ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్‌లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలోని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఫార్మసిస్ట్‌లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయింవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు. వైద్య కళాశాలలు, మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ ఉద్దేశించి రాసిన జనవరి 1 నాటి లేఖలో యాంటీమైక్రోబయాల్స్ దుర్వినియోగం, మితిమీరిన వాడకం డ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ అతుల్ గోయెల్ ఉద్ఘాటించారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. దీనివల్ల 2019లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మరణాలు సంభవించాయన్నారు. ఇవికాక అదనంగా 49.5 లక్షల మరణాలు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు. -
చైనా కొత్త వైరస్ కేసులతో ప్రమాదం లేదు: భారత ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: ఉత్తర చైనాలో నమోదవుతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని తెలిపింది. ఎలాంటి ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉంది. చైనాలో నమోదవుతున్న శ్వాససంబంధ కేసులన్నీ సాధారణమైనవేనని, వాటికి పెద్ద ప్రత్యేకత లేదని తెలిపింది. అయినా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందడానికి అవకాశాలు తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చెప్పిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇంతేగాక ఈ వైరస్ సోకిన వారిలో ఫ్యాటలిటీ రేటు(మరణాల రేటు) తక్కువగా ఉందని వెల్లడించింది. గతంలో చైనా నుంచే పుట్టుకొచ్చిన కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. దీంతో చైనీయుల్లో ఎలాంటి వైరస్ కారక వ్యాధుల కేసులు నమోదైనా ప్రపంచవ్యాప్తంగా దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులపై భారత ఆరోగ్య శాఖ స్పందించింది. ఇటీవల కోయంబత్తూరులో వెలుగు చూసిన వైరస్ కేసులు కూడా కరోనా కేసులు కాదనే విషయం స్పష్టమైంది. ఇదీచదవండి.. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెస్తారు ఇలా... -
కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్!
దేశంలో 75 ఏళ్ల నుంచి భారత ఫార్మసీ కౌన్సిల్ (PCI) కనుమరుగు కాబోతోంది. దీని స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్‌ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫార్మసీ చట్టం-1948 చట్టాన్ని భర్తీ చేసే నేషనల్ ఫార్మసీ కమిషన్ ముసాయిదా బిల్లు-2023 ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. నాణ్యమైన ఫార్మసీ విద్యను ఎక్కువ మందికి అందించడం, దేశవ్యాప్తంగా ఫార్మసీ నిపుణుల లభ్యతను పెంచడం ఈ బిల్లు లక్ష్యం. తాజా పరిశోధనలను ఏకీకృతం చేస్తూ ఫార్మసీ నిపుణులు తమ పరిశోధనలను మరింత మెరుగుపరుచుకునేలా, ఉన్నత నైతిక ప్రమాణాలను నిలబెట్టేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఫార్మసీ సంస్థల క్రమబద్ధమైన, పారదర్శక తనిఖీలు, జాతీయ ఫార్మసీ రిజిస్టర్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. నేషనల్ ఫార్మసీ కమిషన్‌లో చైర్‌పర్సన్‌తోపాటు 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కింద పనిచేసేలా ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు, ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిష్ట్రేషన్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
ప్రభుత్వాసుపత్రుల్లో ఎలా ఉంది?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్లో గర్భిణీ మృతి కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్పత్రుల్లో వసతులపై నివేదిక అందజేయాలని వైద్యారోగ్య శాఖకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బెంచ్.. ‘‘ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు. వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తోన్న బడ్జెట్ ఎంత?’’ అని ప్రశ్నించింది హైకోర్టు. ఈమేరకు సమగ్ర నివేదిక అందజేయాలంటూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇదీ చదవండి: వాతావరణ శాఖ హెచ్చరికలతో కేసీఆర్ పర్యటన వాయిదా -
అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవయవాల మార్పిడి కోసం గత ఏడాది వరకు 56,852 మంది వెయిటింగ్లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం పార్లమెంట్లో వెల్లడించింది. అలాగే గతేడాది 16,041 మందికి అవయవాల మార్పిడి చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా అవయవాల వారీగా రోగులను జాతీయ రిజిస్ట్రీలో నమోదు చేస్తున్నట్లు తెలిపింది. మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు రోగుల నమోదు రుసుము వసూలును నిలుపుదల చేసినట్లు చెప్పింది. గతంలో 65 సంవత్సరాల్లోపు వ్యక్తుల నుంచి మాత్రమే అవయవ దానాలకు అనుమతి ఉండేదని, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా మరణించిన ఏ వయసు వ్యక్తి అయినా అవయవదానం చేయడానికి అనుమతించామని తెలిపింది. ఈ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సమాచారం పంపించినట్లు వెల్లడించింది. అవయవ మార్పిడిని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమావేశం నిర్వహించామని, ఒక దేశం ఒకే విధానం అమలు చేయాల్సిందిగా సూచించినట్లు పేర్కొంది. వెయిటింగ్లో ప్రాధాన్యతను నిర్ణయించడం కోసం ప్రారంభ నమోదును పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దేశ వ్యాప్తంగా అవయవ దానం, మార్పిడిని ప్రోత్సహించడానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఐదు ప్రాంతీయ అవయవాల మార్పిడి సంస్థలను, అలాగే ఆంధ్రప్రదేశ్‌తో సహా 20 రాష్ట్రాల్లో అవయవ మార్పిడి సంస్థలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అత్యధికంగా కిడ్నీల కోసం, తరువాత కాలేయాల కోసం రోగులు ఎదురు చూస్తున్నట్లు వివరించింది. -
డేంజర్ ‘లైఫ్‌స్టైల్’.. 63 శాతం మరణాలకు ఇదే కారణం! షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది. దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం.. జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్‌కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రాజీందర్కే ధనుంజయ పరిశీలనలో తేలింది. అధిక బరువు (ఒబేసిటీ) 2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. మానసిక సమస్యలు దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది. క్యాన్సర్ ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది. పాశ్చాత్య సంస్కృతితో ముప్పు.. మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్‌లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
ఫుడ్ పార్సిళ్లపై ప్యాకింగ్ సమయమూ ఉండాలి
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. -
భయం లేదు... భయం లేదు...
చైనాలో విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు ప్రపంచానికి తంటాగా మారింది. ప్రత్యామ్నాయ వ్యూహ మేదీ లేకుండానే లోపభూయిష్ఠమైన కఠోర జీరో కోవిడ్ విధానాన్ని హఠాత్తుగా చైనా ఎత్తేయడం అందరికీ తలనొప్పి తెచ్చిపెడుతోంది. చైనాలో వేలల్లో వస్తున్న కోవిడ్ కేసుల ఫలితంగా జనవరిలో భారత్‌లో కరోనా విజృంభణ తప్పకపోవచ్చనీ, రానున్న 40 రోజులు మన దేశానికి అత్యంత కీలక మనీ కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొనడాన్ని ఆ దృష్టితో చూడాలి. ఈ ప్రకటన ప్రజలూ, పాలకులూ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తోంది. అయితే, భారీ సంఖ్యలో కేసులు బయటపడ్డా దేశంలో నాలుగోవేవ్ రాకపోవచ్చనీ, వచ్చినా ఆస్పత్రి పాలవడాలు, మరణాలు తక్కువగానే ఉండవచ్చనీ ఆరోగ్య శాఖ చెప్పడం ఒకింత ఊరట. అలాగని చైనాలో పరిస్థితులు, జపాన్‌లో బుధవారం ఒక్కరోజులో 415 మరణాలు మనల్ని అజాగ్రత్త పనికిరాదంటున్నాయి. గత రెండు రోజుల్లో దేశంలోని వివిధ నగరాల్లో ర్యాండమ్ శాంపిల్ టెస్టింగ్‌లోనే 39 మంది అంతర్జాతీయ విమాన ప్రయాణికులు పాజిటివ్‌గా తేలడం లాంటి ఘటనలు పారాహుషార్ చెబుతున్నాయి. ప్రపంచీకరణ వల్ల ఏ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా, ఇతర దేశాలు అప్రమత్తమై, పరిస్థితిని సమీక్షించుకోక తప్పదు. చైనా వార్తలతో మన దేశంలోనూ ఉన్నత స్థాయి సమావేశాలు, అన్ని రాష్ట్రాల్లో ముందుజాగ్రత్తగా మాక్ డ్రిల్స్ చేసింది అందుకే. చైనా, జపాన్ తదితర 6 దేశాలల నుంచి భారత్‌కు వచ్చే యాత్రికులకు 72 గంటల ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీకాకరణ జోరు పెంచాలి. రెండు ప్రాథమిక డోసులే వేసుకున్నవారు మూడోదైన ముందుజాగ్రత్త డోస్ (బూస్టర్ డోస్) వేసుకోవాలని వైద్యుల సూచన. ప్రపంచంలో సగటున ప్రతి 100 మందిలో 30 మందికి పైగా బూస్టర్ వేసుకున్నా, మన దగ్గర ఆ సంఖ్య 16 చిల్లరే కావడం పెరిగిన అలక్ష్యానికి చిహ్నం. కొత్తగా ముక్కులో చుక్కలుగా వేసే టీకా (భారత్ బయోటెక్ వారి ఇన్కోవాక్)కు బూస్టర్‌గా కేంద్రం అత్యవసర అనుమతి నిచ్చింది. జనవరి చివర నుంచి అలా మరో అస్త్రం చేతికి అందినట్టే! ఇప్పటికే దేశంలో అధిక శాతం మందికి గతంలో కరోనా సోకడంతో సహజ వ్యాధినిరోధకత ఉంది. టీకాలు తెచ్చిన వ్యాధినిరోధకత దానికి జత కలసి, హైబ్రిడ్ ఇమ్యూనిటీ వచ్చినట్టయింది. అలాగే, కరోనా మొదటి వేవ్ నాటితో పోలిస్తే ఇప్పుడు చికిత్సలో అనుభవం, కనీసం 7 టీకాలు వచ్చాయి. అప్పట్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నీ కరోనా బహిర్గతం చేయడంతో, ప్రభుత్వాల తప్పనిసరి కృషితో చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య వసతులు, వ్యవస్థ మునుపటి కన్నా గణనీయంగా మెరుగయ్యాయి. అందుకే, ఇప్పుడు అతిగా ఆందోళన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. చైనా దెబ్బకు మళ్ళీ టెస్టులు పెరిగే ప్రస్తుత పరిస్థితుల్లో కేసుల సంఖ్య కన్నా ఆసుపత్రి పాలైన వారి సంఖ్యను కీలకమైన లెక్కగా పరిగణించాలి. అలాగే, పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టి, వైరస్‌లో కొత్త ఉత్పరివర్తనాలు దేశంలోకి వస్తున్నాయేమో ఓ కంట కనిపెట్టడం, వస్తే వాటిని అరికట్టే చర్యలు తీసుకోవడమే అతి ముఖ్యం. కోవిడ్ కథ కంచికి చేరలేదు... ఇప్పుడప్పుడే చేరే అవకాశమూ లేదు. కరోనా వైరస్‌లో ఎప్పుడు ఏ కొత్త వేరియంట్ వస్తుందో ఏ శాస్త్రవేత్తలూ చెప్పలేరు కాబట్టి ఓ మాదిరి నుంచి తీవ్ర ఇన్ఫెక్షన్లు వస్తూ, పోతూ ఉండవచ్చు. కాబట్టి ఉన్నంతలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స చేయించుకుంటూ, ప్రాథమికమైన ముందు జాగ్రత్తలతో కోవిడ్ అనారోగ్యం నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. చైనాలో ఇప్పుడు కాకరేపుతున్న బీఎఫ్.7 ఒమిక్రాన్ ఉప–వేరియంట్ ఉద్ధృతి కొద్దివారాల్లో ముగిసిపోతుందని అంచనా. అలా చైనాలోని తాజా కరోనా వేవ్ ముగిసిపోతే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సామాన్య జలుబు, జ్వరం దశకు వస్తుందని శాస్త్రవేత్తల ఆశాభావం. కరోనాతో సహజీవనం తప్పదన్న మాటలను ఒకప్పుడు వెటకారం చేసినా, అది అనివార్యమని ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ సుదీర్ఘకాల సహజీవనంలో ప్రపంచంలో ఏ మూల ఎప్పు డైనా కొత్త కేసులు వెల్లువెత్తవచ్చు. తాజా వేవ్‌లు విరుచుకుపడవచ్చు. ఆ ముప్పును గమనంలో ఉంచుకొని, ముందుకు సాగాలి. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ తగు సంసిద్ధతతో ఉండడమే ప్రస్తుత కర్తవ్యం. అంతేతప్ప, పొరుగునున్న మరో దేశంలో కరోనా వేవ్ వచ్చిందని వార్త వచ్చినప్పుడల్లా బెంబేలెత్తిపోతే ఉపయోగం లేదు. శాస్త్రీయ ధోరణితో కరోనాపై చర్యలు ముఖ్యం. వెరసి వ్యూహాల పునఃసమీక్షా సమయం ఇది. కేంద్రం ఎప్పటికప్పుడు చైనాలో పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. పుకార్లు వ్యాపించకుండా ప్రజలకు సమాచారం అందిస్తూ, చైతన్యం తేవాలి. ప్రపంచానికి కరోనా పరిచయమై సరిగ్గా మూడేళ్ళయింది. ఇన్నేళ్ళుగా అనుసరిస్తున్న కరోనా వ్యూహాలను ఇప్పుడు ఆగి, పరిశీలించుకోవాలి. గత అనుభవాల ఆధారంగా శాస్త్రీయంగా, సాక్ష్యాధారాలపై ఆధారపడి చర్యలు చేపట్టాలి. తాజా పరిస్థితులకు తగ్గట్టు సాక్ష్యాధారాలపై ఆధారపడ్డ కరోనా పోరాట ప్రణాళిక, వ్యూహం సిద్ధం చేసుకోవాలి. పరిశోధన, అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలిచ్చి టీకాలు సహా ఆరోగ్యరంగంలో బలోపేతం కావాలి. గత మూడేళ్ళుగా పాలకులు పక్కనబెట్టిన టీబీ సహా ఇతర వ్యాధుల నియంత్రణపైనా చర్యలకు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలేమో కరోనాపై స్వీయ నియంత్రణతో మాస్క్ ధారణ సహా జాగ్రత్తలను పాటించాలి. అప్రమత్తత వల్ల ఎప్పుడూ ఎంతో కొంత లాభమే. ఎంతైనా మన జాగ్రత్తే మనకు రక్ష కదా! -
భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త.. ఆ నిబంధన ఎత్తివేత
న్యూఢిల్లీ: ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా మహమ్మారి కట్టడి కోసం తీసుకొచ్చిన ‘ఎయిర్ సువిధ’ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను ఎత్తివేసింది. అయితే, ‘ఎయిర్ సువిధ’ నిబంధనను ఎత్తివేసినప్పటికీ కొన్ని అంశాలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలని కోరింది. ప్రయాణ సమయంలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లు మాస్కు ధరించాలని, మిగతా ప్రయాణికులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలని తెలిపింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతో పాటు ఏ వ్యాక్సిన్, ఎన్ని డోసులు, ఏ సమయంలో తిసుకున్నారనే వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్టు వివరాలనూ ‘ఎయిర్ సువిధ’ పోర్టల్‌లోని సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో పొందుపరచాల్సి ఉండగా.. తాజాగా ఆ నిబంధనను భారత్ ఎత్తివేసింది. ఈ నిబంధన ఎత్తివేసినప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్ టీకా తీసుకున్న తర్వాతే భారత్‌కు రావడం మంచిదని పేర్కొంది. డీ బోర్డింగ్ సమయంలోనూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌కు వెళ్లాలని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇదీ చదవండి: Viral Video: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు -
అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?...
ఖట్మండు: నేపాల్‌లోని ఖాట్మండు వ్యాలీలో పానీ పూరీ అమ్మకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే పానీ పూరీ అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కలరా రోగుల సంఖ్య 12కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ కలరా వ్యాప్తిని అరికట్టేందుకు మహానగరాల్లోనూ, రద్దీ ప్రాంతాలు, కారిడార్ వంటి ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిషేధించారు. అంతేకాదు ఎవరికైన కరోనా లక్షణాలు కనిపించినట్లయితే సమీప ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని ప్రజలను అధికారులు కోరారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో డయేరియా, కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. (చదవండి: ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ) -
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఓ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో.. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఓ రివ్యూ సమావేశం కోసం సెక్రెటేరియట్‌కు వెళ్తున్న మంత్రి విడదల రజిని.. ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి బాధితులకు ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బందితో బాధితులను గుంటూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను మంత్రి విడదల రజిని ఆదేశించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీద మస్తాన్‌రావు -
కరోనా అలర్ట్: నిర్లక్ష్యం వద్దు.. కేంద్రం హెచ్చరిక
దేశంలో కరోనా కథ ముగిసినట్లే కనిపిస్తోంది పరిస్థితి. జన సంచారం మామూలు స్థితికి చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియెంట్ బయటపడడం, చైనాలో ఊహించని స్థాయిలో కరోనా విజృంభణ-లాక్డౌన్, అమెరికాతో పాటు దక్షిణాసియా పరిధిలోని కొన్ని దేశాల్లో(దక్షిణ కొరియా, హాంకాంగ్‌లో పరిస్థితి మరీ దారుణం).. కొన్ని యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మన కేంద్రం..రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జనాలు ఇస్టానుసారం తిరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశాల్లో కేసుల విజృంభణనను ప్రస్తావిస్తూ.. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం ఓ లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్. కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ.. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ పాటించాలంటూ ఆ లేఖలో కేంద్రం సూచించింది. ఐసీఎంఆర్, ఎన్సీడీసీ National Centre for Disease Control (NCDC) ప్రొటోకాల్స్ పాటిస్తూ.. టెస్టులు చేస్తుండాలని తెలిపింది. అంతేకాదు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఇన్ఫెక్షన్ల తీవ్రత సోకకుండా నియంత్రించాలని సూచించారు లేఖలో. కంటోన్మైట్, క్లస్టర్, డేంజర్ జోన్లను అవసరమైతే ఏర్పాటు చేయాలని కోరింది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, శుభ్రతా తదితర సూచనలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసిన గైడ్‌లెన్స్‌ల గురించి ప్రస్తావించిన కేంద్రం.. పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక వ్యవహారాల కొనసాగింపునకు అనుమతులు ఇవ్వాలంటూ మరోసారి గుర్తు చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన మార్చి 16వ తేదీన హై లెవల్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంపై చర్చించారు. ఆపై మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. కరోనాలో కొవిడ్ కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2, 528 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 149గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 29, 181గా ఉంది. దాదాపు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన యాక్టివ్ కేసుల గణాంకం నమోదు అయ్యింది. భారత్‌లో ఇప్పటిదాకా కరోనా కేసులు 4, 30, 04,005 నమోదు కాగా, మరణాల సంఖ్య 5, 16, 281గా ఉంది. -
ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరికలు.. వారం రోజుల్లోనే..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా భావించవద్దని కేంద్రం హెచ్చరించింది. కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, కేవలం వారం రోజుల్లోనే 300 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం దాటిందని స్పష్టం చేసింది. అయితే.. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నా.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అటు.. కరోనా బాధితుల డిశ్చార్జ్ పాలసీని సవరించినట్లు చెప్పిన అగర్వాల్.. కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చి.. స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులను ఏడు రోజుల్లో డిశ్చార్జ్ చేయాలన్నారు. వీరికి మళ్లీ వైరస్ నిర్థారణ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. మరోవైపు థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్‌ను బఫర్ స్టాక్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. మెడికల్ ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను పటిష్ట పర్చాలని సూచించింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్ లభ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాణవాయువు కొరత ఏర్పడితే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. -
Fact Check: కేంద్రం ఒక్కొక్కరికి రూ.5వేల కోవిడ్-19 ఫండ్‌ను అందిస్తుందా?
పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో దేశ ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్రం కోవిడ్ ఫండ్‌ను విడుదల చేస్తుంది. దేశంలో ఉన్న ప్రజలందరికి ఒక్కొక్కరికి కేంద్ర ఆరోగ్య శాఖ రూ.5 వేలు అందిస్తుంది. అందుకే కేంద్రం ఇచ్చే కోవిడ్ ఫండ్ పొందాలనుకుంటే వ్యక్తిగత వివరాలు వెల్లడించాలంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. एक फर्जी मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार के हेल्थ मंत्रालय द्वारा कोरोना फंड के तहत ₹5000 की धनराशि प्रदान की जा रही है।#PIBFactcheck ▶️ ऐसे फर्जी संदेशों को फॉरवर्ड न करें। ▶️ इस तरह की संदिग्ध वेबसाइट पर अपनी किसी भी तरह की निजी जानकारी साझा न करें। pic.twitter.com/qiAbnHlJLi — PIB Fact Check (@PIBFactCheck) January 11, 2022 అయితే దీనిపై కేంద్రప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఇది స్కామ్ అని. అలాంటి ఆఫర్/స్కీమ్ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పీఐబీ అధికారిక ట్విట్టర్ అకౌంట్నుంచి ట్వీట్ చేసింది. ప్రజలు ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని, దాన్ని ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. వైరల్ అవుతున్న లింక్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని పీఐబీ ప్రజలకు సూచించింది. ఇక జనవరి 15, 2022 వరకు మాత్రమే కేంద్రం కోవిడ్ ఫండ్ ఇస్తుందని మెసేజ్‌లో ఉందని, ఇది కూడా ఫేక్ ఇన్మర్మేషన్ అని కొట్టి పారేసింది. ఇలాంటి ప్రమాదకరమైన మెసేజ్‌లను ఎవరూ పట్టించుకోవద్దని,వ్యక్తిగత సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరింది. చదవండి: విమానం విడిచి రైలులో ప్రయాణించిన విజయ్‌మాల్యా? -
15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!
Vaccine Registration For Children న్యూఢిల్లీ: 15 - 18 యేళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి కోవిడ్ - 19 వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేయన్ చేసుకోవల్సిందిగా ప్రభుత్వం సోమవారం తెల్పింది. స్కూల్ ఐడీ కార్డులను ఉపయోగించి కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో మరో స్లాట్ రూపొందించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. కాగా 15-18 మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి తొలి రౌండ్ కోవిడ్ వ్యాక్సిన్లు వేయనున్నారు. అలాగే ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌లు వేయనున్నారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా స్కూళ్లు, విద్యార్ధులు సాధారణ స్థితికి చేరుకుంటారని, ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ప్రక్రియ పూర్తచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్స్ డబుల్ డోస్ కోవాగ్జిన్ లేదా జీడస్ కడిలాస్ థ్రీ డోస్ జికోవ్-డి ఈరెండు వ్యాక్సిన్లలో ఒకటి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు వేయబడతాయి. సిరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ‘నోవావ్యాక్స్'ను 7 - 11 ఏళ్ల మధ్య పిల్లలపై, అలాగే బయోలాజికల్ ఈ కి చెందిన ‘కార్బెవ్యాక్స్'ను ఐదేళ్లు నిండిన పిల్లలపై ట్రయల్స్ పూర్తి చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ ఇప్పటికే ధృవీకరించింది. ఐతే ఈ రెండు వ్యాక్సిన్లు ఉపయోగానికి ఇంకా అనుమతి పొందలేదు. పాఠశాలల్లో కోవిడ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మన దేశంలో ఇప్పటివరకు 141.7 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేసింది. ఐతే 58.1 కోట్ల మందికి మాత్రమే రెండవ డోస్ పూర్తయ్యింది. కాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 6,500 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ సంఖ్య 6.5 శాతం తక్కువ. అలాగే కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు సోమవారం ఉదయం నాటికి 578కి పెరిగాయి. చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు.. -
ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..
న్యూఢిల్లీ, బెంగుళూరు: అందరూ భయపడుతున్నట్టుగానే జరిగింది. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి వచ్చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు, బెంగళూరుకి చెందిన 46 ఏళ్ల వయసున్న వైద్యుడికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్టుగా ఇన్సాకాగ్ నెట్వర్క్ జన్యు విశ్లేషణల్లో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. వారిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని, వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్ని కలుసుకున్న వారిలో ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచారు. కోవిడ్ నిబంధనలు పాటించాలి కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వచ్చేసిందని ప్రజలు ఎలాంటి ఆందోళనలు వద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కోవిడ్ నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలన్నారు. ‘ఒమిక్రాన్‌పై ఎవరూ ఆందోళన చెందవద్దు. కానీ కరోనా నిబంధనలపై కచ్చితంగా అవగాహన ఉండాలి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం వంటివన్నీ చేస్తే ఒమిక్రాన్ సహా ఏ కరోనా వేరియెంట్‌నైనా ఎదుర్కోగలం’ అని లవ్ అగర్వాల్ చెప్పారు. డెల్టా కంటే ఈ వేరియెంట్ ప్రమాదకరమైనదా? కాదా? అన్నది ఇంత త్వరగా చెప్పలేమన్నారు. దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీ– పీసీఆర్ పరీక్షలు నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాతే వారిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ పిలుపునిచ్చారు. మరోవైపు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పకడ్బందీగా స్క్రీనింగ్, కరోనా పరీక్షలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అధికారుల్ని ఆదేశించారు. బూస్టర్ డోస్‌లపై అధ్యయనం ఒమిక్రాన్ రాకతో భారత్‌కు మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ బూస్టర్ డోసులపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ బూస్టర్ డోసులు ఇవ్వడంపై శాస్త్రీయపరమైన కారణాలను విశ్లేషిస్తున్నట్టుగా లవ్ అగర్వాల్ చెప్పారు. ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. కొత్త వేరియెంట్‌ను ఎదుర్కోవడంలోనూ వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని నీతి అయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ చెప్పారు. భారత్ దగ్గర టీకా డోసులు సమృద్ధిగా ఉండడం అదృష్టమని చెప్పారు. అందరూ టీకాలు తీసుకోవడానికి ముందుకు రావాలని చెప్పారు. దేశ జనాభాలోని వయోజనుల్లో 40 శాతం మంది కరోనా టీకాలు రెండు డోసులు తీసుకుంటే, 84.3% మంది ఒక్క డోసు తీసుకున్నారని చెప్పారు. -
ఆర్థిక శాఖతో పాటు హరీష్‌రావుకు మరో కీలక శాఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైద్యారోగ్య శాఖను సీఎం తన వద్దనే అట్టిపెట్టుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఈటల పలు సభల్లో మాట్లాడుతూ ‘మున్ముందు హరీశ్‌రావుకు కూడా నాకు జరిగిన విధంగానే జరుగుతుంది’ అని ప్రచారం చేశారు. కాగా, ఈ ఆరోపణలను అబద్ధం చేస్తూ హరీశ్‌రావుకు కీలకమైన వైద్యారోగ్య శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో వైద్య రంగానికి కొత్తరూపునివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో.. వైద్యారోగ్య శాఖను హరీశ్‌రావుకు అదనపు బాధ్యతగా అప్పగించడం గమనార్హం. చదవండి: (కేసీఆర్‌కు కలిసి రాని ముహూర్తం.. విజయ గర్జన సభ మళ్లీ వాయిదా..) -
92 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య
దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా జరుగుతున్న కోవిడ్–19 టీకా కార్యక్రమం 92 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో ఇచ్చిన 59,48,360 డోసులతో కలిపి, మొత్తం 92,17,65,405 డోస్‌లను ఇప్పటి వరకు ప్రజలకు అందించారు. అంతేగాక గత 24 గంటల్లో 24,770 మంది రోగులు కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,31,75,656 కు పెరిగింది. పెరిగిన రికవరీ.. అదే సమయంలో దేశవ్యాప్త రికవరీ రేటు 97.94 శాతానికి చేరింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన నియంత్రణ చర్యల కారణంగా వరుసగా 101వ రోజు కూడా 50వేల కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,833 కొత్త కేసులను గుర్తించారు. మరోవైపు దేశంలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,46,687కు చేరింది. ఇది 203 రోజుల కనిష్ట స్థాయి అని కేంద్రం ప్రకటించింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని గుర్తించేందుకు నిర్వహించే పరీక్షలను చేపడుతున్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,09,825 పరీక్షలు చేయగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57.68 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించారు. అయితే వారపు పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.34 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 37 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 120 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు: నిర్ధారిత మరణాలకే ధ్రువపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్ధారణ పరీక్షల్లో కరోనాగా తేలి, మరణానికి అదే కారణమైనపుడు మాత్రమే కోవిడ్–19 మరణ ధ్రువపత్రాలు జారీచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కోవిడ్ మరణ ధ్రువపత్రాలు జారీ చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించాయి. కోవిడ్ మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధువ్రపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. జూన్ 30న కోవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యంపై పదిరోజుల కిందట సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో ఓ విధానాన్ని కేంద్రం పొందుపరిచింది. అఫిడవిట్లో పేర్కొన్న ప్రధానాంశాలు: ► ఆర్టీపీసీఆర్ పరీక్ష, మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్–19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధ్రువీకరిస్తేనే... కోవిడ్–19 కేసుగాపరిగణిస్తారు. ► కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర వాటిని కోవిడ్–19 మరణంగా గుర్తించరు. ► ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం మంది సోకిన 25 రోజుల్లోపే మరణించారు. అయినప్పటికీ కరోనా సోకిన తర్వాత 30 రోజుల్లో మృతి చెందిన వారిని కూడా కోవిడ్–19 మృతులుగా గుర్తించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ► మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్–19తో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయిలో రాష్ట్రాలు/ కేంద్ర పాలితప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల మెడిసిన్ హెడ్, విషయ నిపుణుడు ఉండాలి. ► జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు/ బంధువులు వినతి పత్రం ఇవ్వాలి. ► ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధ్రువపత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ► ఆయా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలి. -
కరోనా కొత్త కేసులు 46,164
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో మరో 46,164 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. దీంతో, మొత్తం కేసులు 3,25,58,530కు చేరుకున్నాయని వెల్లడించింది. అదే సమయంలో, 607 మంది కరోనా బాధితులు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 4,36,365కు పెరిగిందని తెలిపింది. యాక్టివ్ కేసులు కూడా 3,33,725కు పెరిగాయని, మొత్తం కేసుల్లో ఇవి 1.03%గా ఉన్నాయని పేర్కొంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 97.63%గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 51,31,29,378 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.58% కాగా, ఇది గడిచిన 31 రోజులుగా మారలేదని వెల్లడించింది. అదేవిధంగా, వీక్లీ పాజిటివిటీ రేటు గత 62 రోజులుగా ఎలాంటి మార్పులేకుండా 2.02%గానే ఉంటోందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 60.38 కోట్ల కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. కేరళలో ప్రమాదఘంటికలు కేరళలో కరోనా తీవ్రత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో బుధవారం 31,445 కేసులు, గురువారం 30,007 కేసులు నిర్ధారణయ్యాయి. దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 66% ఒక్క కేరళ నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో కేరళలోనివే 58.4% ఉన్నాయి. దీంతో, గురువారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆ రాష్ట్ర అధికారులతో మీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. వైరస్ వ్యాప్తి, కరోనా కట్టడికి అమలు చేయాల్సిన వ్యూహం, మౌలిక వసతులపై చర్చించి, అవసరమైన సూచనలు చేసినట్లు హోం శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన కేరళను సందర్శించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రంలో ఆరోగ్య వసతుల మెరుగుకు రూ.267 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో 20 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసుల సరఫరా వచ్చే సెప్టెంబర్‌లో 20 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాలను సరఫరా చేయనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) గురువారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు ఎస్ఐఐ ఆగస్టులో 12 కోట్ల డోసుల కోవిడ్ టీకా అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యంతో సెప్టెంబర్ నెలలో సంస్థ 20 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేయగలదని సంస్థ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. -
దేశంలో కొత్తగా 40,120 కరోనా కేసులు.. మరణాలు 585
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 585 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 3,85,227 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 52.95 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
స్కూళ్లు తెరవడంపై నిర్ణయం రాష్ట్రాలదే: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు మూత పడ్డాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో స్కూళ్లను తెరవాలా వద్దా అనే అంశంపై అన్ని వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. దేశంలో థర్డ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణల హెచ్చరికల నేపథ్యంలో స్కూళ్లు తెరవాలా వద్దా అన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. చాలా మంది ఉపాధ్యాయులు 18-44 సంవత్సరాల వయస్సులో ఉన్నారని..టీకాలు వేగవంతం చేయడం పూర్తిగా రాష్ట్రాలపైనే ఆధారపడి ఉన్నదని కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో ఎక్కువ భాగం ఉపాధ్యాయులు కరోనా టీకాలు పొందనందున స్కూళ్లు తెరువడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు పేర్కొంది. దేశంలోని 94.5 కోట్ల మంది జనాభాలో కేవలం 9.54 కోట్ల మంది టీకా తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్కూళ్ల టీచర్ల టీకా శాతం, ప్రస్తుత పరిస్థితిపై సీబీఎస్ఈ, యూజీసీతో పాటు దేశంలోని ఇతర విద్యా సంస్థలు, విద్యా బోర్డుల నుంచి నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరింది.