![Health Ministry Says Corona Virus Death Toll In India Rises - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/5/lav-agarwal.jpg.webp?itok=qQ_rGRwm)
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 3900 పాజిటివ్ కేసులు నమోదు కాగా 195 మంది మరణించారు. 1020 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1500కు ఎగబాకింది.
కాగా రాష్ట్రాల నుంచి సమాచారం రావడంలో జాప్యంతోనే తాజా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు వైరస్ బారినుంచి కోలుకునే వారి సంఖ్యను సూచించే రికవరీ రేటు 27.4 శాతానికి పెరగడం ఊరట కల్పిస్తోంది. కేసుల సంఖ్య రెట్టింపయ్యే డబ్లింగ్ రేటు 12 రోజులుగా నమోదైంది. ఇక కేంద్ర బృందాలు ప్రతి జిల్లాలోనూ కోవిడ్-19 పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. పీపీఈ వాడకంపై ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment