Household Survey
-
‘వారి సర్వే ఇంటికే పరిమితమైంది.. బయటకు వివరాలు వెల్లడించలేదు’
సిద్దిపేట జిల్లా గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(Household Survey) ఇంటికే పరిమితమైందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar). కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు బయటకు వెల్లడించలేదన్న పొన్నం.. బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ాకార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ాపాల్గొన్నారు.‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే(Caste Census Survey)లో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు పాల్గొనలేదు. వీళ్లకు కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు, కులగణన సర్వే చేపట్టాలి. మా సర్వేలో బీసీల లెక్క తేలింది.. మా ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్, బీజేపీలు అనవసరమైన విమర్శలు మానుకొని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలి.సర్వేపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం’ అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
Telangana: ‘లెక్క’ తేలింది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక ముఖ చిత్రం విడుదలైంది. రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా జనాభా లెక్క తేలింది. గతేడాది నవంబర్, డిసెంబర్లలో రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)’ గణాంకాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు. సర్వే వివరాలను, సర్వే జరిగిన తీరును వివరించారు. సర్వేలో తేల్చిన అంశాలివే.. రాష్ట్రంలో సుమారు 3.7 కోట్ల మంది జనాభా ఉండగా.. అందులో 3.54 కోట్ల మందికి సంబంధించి సర్వే జరిగింది. వివిధ కారణాలతో మరో 16 లక్షల మంది (3.1%)కి సంబంధించిన వివరాల సేకరణ జరగలేదు. సర్వే చేసిన జనాభాకు సంబంధించి పురుషులు 1.79 కోట్లు, మహిళలు 1.75 కోట్లు, థర్డ్ జెండర్ 13,774 మంది ఉన్నారు. ఈ సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా 46.25 శాతం మంది బీసీలు ఉన్నారు. తర్వాత షెడ్యూల్డ్ కులాల జనాభా 17.43 శాతం, ఓసీలు 13.31 శాతం, ముస్లిం మైనార్టీలు 12.56 శాతం, షెడ్యూల్డ్ తెగలవారు 10.45 శాతం ఉన్నారు. ముస్లిం మైనార్టీలలో 2.48శాతం ఓసీ కేటగిరీకి చెందినవారు. వీరిని కూడా కలిపితే రాష్ట్రంలో ఓసీ కేటగిరీ జనాభా 15.79% అవుతోంది. యాభై రోజుల్లో ‘సమగ్రం’గా.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపర్చేందుకు.. సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు వీలుగా సర్వే చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసింది. గతేడాది అక్టోబర్ 10న రాష్ట్రంలో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)’ చేపడుతున్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 6నలో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. తొలి మూడు రోజుల పాటు ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సర్వే సిబ్బంది.. తొమ్మిదో తేదీ నుంచి వివరాల సేకరణ ప్రారంభించారు. నవంబర్ 31 నాటికే పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా.. కొన్నిచోట్ల వివరాల సేకరణ సుదీర్ఘంగా కొనసాగడం, ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో జాప్యం జరిగింది. డిసెంబర్ మూడో వారం నాటికి సర్వే ప్రక్రియ, డేటా ఎంట్రీ పూర్తయింది. 16 లక్షల మంది దూరం.. రాష్ట్రవ్యాప్తంగా 1,15,17,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. అందులో 1,12,15,134 కుటుంబాల వివరాలను సేకరించారు. సుమారు మూడు లక్షల కుటుంబాలకు సంబంధించిన సమాచారం సేకరించలేదు. ఇందులో 1.03 లక్షల ఇళ్లు తాళం వేసి ఉండగా.. 1.68 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనేందుకు ముందుకురాలేదు. మిగతా కుటుంబాలు రా్రõÙ్టతర వలస కార్మికులు కావడంతో సర్వే చేయలేదు. మొత్తంగా సుమారు 16 లక్షల మందికి సంబంధించిన వివరాల సేకరణ జరగలేదని అంచనా. 96.9 శాతం కచ్చితత్వంతో సర్వే జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ సర్వేలో 94,863 మంది ఎన్యుమరేటర్లు, 9,628 మంది సూపర్వైజర్లు పాల్గొన్నారు. సుమారు 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో 36 రోజుల్లో సర్వే వివరాలను డిజిటలైజ్ చేశారు. -
మీకెందుకు చెప్పాలి?
‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్ నంబర్ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి ఎందుకు? వీటితో మాకొచ్చే ప్రయోజనం ఏంటి? రైతుబంధు రానప్పుడు భూముల వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు?.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో, ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోతపెడతారో, రేషన్‌కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వివరాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి వివరాలు చెప్పడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలివీ..సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల సేకరణ గందరగోళంగా మారింది. పేర్లు, కులం, వృత్తి వంటి కొన్ని సాధారణ వివరాలను వెల్లడిస్తున్న జనం.. ఆర్థికపర అంశాలను వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, కొన్ని అంశాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తుండటం, వారికి సర్దిచెప్పాల్సి రావడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. మరోవైపు పేద వర్గాల నుంచి మాత్రం సర్వేకు మంచి స్పందన కనిపిస్తోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా... ఈ నెల 6వ తేదీ నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఎన్యూమరేటర్లు ఆ ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరించి, సర్వే ఫారాల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కాలమ్ నంబర్ 19 నుంచి తిప్పలు! రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు (56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు) ఉన్నాయి. సర్వే బుక్లెట్ రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలను వెల్లడించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. కాలమ్ నంబర్ 19 నుంచి వస్తున్న పలు ప్రశ్నలు ఆందోళన రేపుతున్నాయి. ప్రధానంగా వ్యాపారం వార్షిక టర్నోవర్, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతా సమాచారం, భూములు, ధరణి పాసు పుస్తకం వివరాలు, భూమి కొనుగోలు కోసం వనరులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను అడిగినప్పుడు.. ఆ వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నలు ఎన్యూమరేటర్లకు ఎదురవుతున్నాయి. ‘ఆర్థిక స్థితిగతుల’పై ఆందోళన సర్వే ప్రశ్నావళి రెండో విభాగం (పార్ట్–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. వాటికి సరైన సమాధానం రావడం లేదని ఎన్యూమరేటర్లు చెప్తు న్నారు. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, వాహనాలు, రేషన్‌కార్డు, నివాస గృహానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన ప్ర శ్నలు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయని వివరిస్తున్నారు. ‘మేం రుణాలు చెల్లించకుంటే ప్రభు త్వం చెల్లిస్తుందా? ఆస్తుల వివరాలు మేమెందుకు చెప్పాలి? మా కున్న అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆదాయం వి వరాలు చెబితే పథకాలు వస్తాయా? ఉన్నవాటికి కోతపెడతారా?’ అని ప్రజలు నిలదీస్తున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. శనివారమూ కొనసాగిన స్టిక్కరింగ్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీనే ప్రారంభమైంది. 6, 7, 8వ తేదీల్లో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లను పరిశీలించి యజమానులు, అద్దెదారుల వివరాలను తెలుసుకుని, స్టిక్కర్లు అంటించాలని, 9వ తేదీ నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు చేపట్టాలని నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా స్టిక్కరింగ్ ప్రక్రియే కొనసాగింది. ఇళ్లకు తాళం ఉండటం, యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇళ్ల విజిటింగ్, స్టిక్కరింగ్ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిందని.. ఆదివారం నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు కొనసాగుతుందని ప్రణాళిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల సేకరణలో తిప్పలు సర్వేలో ఒక్కో ఇంటికి సంబంధించి 75 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, 43 ప్రశ్నలకు బుక్లెట్ చూసుకుని కోడింగ్ వేయడం వేయడం ఎన్యూమరేటర్లకు తలకు మించిన భారమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 150 నుంచి 175 వరకు ఇళ్లను ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు అప్పగించారు. రోజుకు 10 ఇళ్లలో సర్వే చేయాలని ఆదేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో తొలిరోజు ఐదు, ఆరు ఇళ్ల సర్వేనే పూర్తయింది. కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో అయితే గంటకుపైనే సమయం పడుతోందని.. మధ్యాహ్నం నుంచి కాకుండా రోజంతా చేస్తేనే సర్వే పూర్తవుతుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఫామ్ నింపడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులను సహాయకులుగా తీసుకెళుతున్నట్టు చెప్తున్నారు. ఇళ్లకు తాళాలతో ఇబ్బంది పంటల కోతల సమయం కావడంతో ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక రైతులు, కూలీలు పనులకు వెళ్తున్నారు. దీనితో సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటుండటంతో సర్వే ముందుకుసాగుతోంది. తాళాలు వేసిన ఇళ్లను గుర్తుంచుకుని మళ్లీ రావడం ఇబ్బందేనని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు.జిల్లాల వారీగా ‘సర్వే’ తీరును పరిశీలిస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,53,950 ఇళ్లు ఉండగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో శనివారం రాత్రి వరకు స్టిక్కరింగ్ పూర్తి కాలేదు. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడంతో చాలా ఇళ్లకు తాళం వేసి ఉంది. కొందరు ఇళ్ల యజమానులు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. భద్రాద్రి జిల్లాలో సర్వే ఫామ్‌లు ఆలస్యంగా చేరాయి. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదు. గొత్తికోయలకు ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు ఉన్నా కులం సర్టిఫికెట్లు లేక సర్వేలో ఏం రాయాలో స్పష్టత లేకుండా పోయింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పలేదు. ధరణి సమాచారం అడిగిన ఎన్యుమరేటర్లకు ‘మీకెందుకు?’అనే ప్రశ్న ఎదురైంది. రోజువారీ కూలీలు మొదటిరోజు పనులు వదులుకుని ఇంటి వద్దే ఉన్నా ఎన్యుమరేటర్లు రాక విసుగుపడటం కనిపించింది. ఇంటి నిర్మాణం, విస్తీర్ణంపై సమాధానాలు రాలేదు. ఐటీ రిటర్నులు, వడ్డీ వ్యాపారులు, కులాంతర వివాహాల సమాచారం రాబట్టలేకపోతున్నారు. ⇒ కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో శనివారం కూడా స్టిక్కరింగే కొనసాగింది. పలుచోట్ల కొందరు ఇంటికి స్టిక్కర్లు వేయవద్దంటూ నిరాకరించారు. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్రాల కొరతతో సర్వే ఆలస్యంగా మొదలైంది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు పది గృహాలను అప్పగించగా.. సమయం సరిపోక 5, 6 ఇళ్లే సర్వే చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు కూడా స్టిక్కరింగ్ కొనసాగింది. రెండో శనివారం కావడంతో ఆరీ్పలు, ఉపాధ్యాయులు సర్వేకు హాజరుకాలేదు. బోధన్ నియోజకవర్గంలో సర్వే స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెప్పారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,17,467 ఇళ్లు ఉండగా.. 8,231 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల వివరాలను చెప్పడం లేదు. ఆధార్ నంబర్, పాస్‌బుక్ వివరాలు ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. పట్టణాల్లో దాదాపు అన్ని వివరాలు చెబుతున్నా ఉద్యోగం, ఆస్తి వివరాలు దాటవేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆస్తులు, భూములు, ఓపెన్ ప్లాట్ల వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఉద్యోగం చేసే వారి వివరాలు చెప్పడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లోని వారు వేర్వేరుగా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ధరణి పాస్ బుక్ నంబర్, ఆధార్ కార్డులు వెతకడం, పట్టాపాస్ బుక్‌లు బ్యాంకుల్లో ఉండటంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లిలో చాలాచోట్ల వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరినీ ఒకేచోటకు పిలిపించి.. వివరాలు నమోదు చేయించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 9,67,871 కుటుంబాలు ఉన్నాయి. రుణాలు, భూములు, ఆస్తి వివరాలు చెప్పడానికి చాలామంది ముందుకురాలేదు. బీసీ–ఈ, సీ సర్టిఫికెట్లు తీసుకున్న వారు చెప్పడానికి వెనుకంజ వేశారు. కొందరు మహిళా టీచర్లు తమ భర్త, పిల్లలను సహాయకులుగా తెచ్చుకున్నారు.రైతు భరోసా లేదు.. నేనెందుకు చెప్పాలి?వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిరి్నబావి ప్రాంతంలో నరిగె ఐలయ్య ఇంటికి సర్వే కోసం ఎన్యూమరేటర్ వెళ్లారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన ఐలయ్య.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో సరిగా స్పందించలేదు. రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. పింఛన్ ఎప్పుడు ఇస్తారని ఆరా తీశారు. ఎన్యూమరేటర్ సర్దిచెప్పడంతో చివరకు భూమి వివరాలు చెప్పినా.. ఈ కుటుంబం వద్దే రెండు గంటలు గడిచిపోయింది.అరగంట నుంచి గంట వరకు పడుతోంది.. మాకు రోజుకు 20 కుటుంబాల చొప్పున సర్వే చేయాలంటూ బుక్లెట్లు ఇచ్చారు. ప్రశ్నలు అడగడం, వాటి కోడ్ కోసం బుక్లెట్ చూడటం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్‌గా ఫామ్‌లోనే నమోదు చేసేలా ఉంటే బాగుండేది. సర్వేపై ప్రజలకు అవగాహన లేక సమాధానాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది. – ఎన్.పారిజాత, ఎన్యుమరేటర్, నకిరేకల్, నల్లగొండ జిల్లావివరాలు చెప్పేందుకు వెనకాడుతున్నారు ఇంటి యజమానిని ప్రశ్నలన్నీ అడిగి పూర్తి చేయడానికి చా లా సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అవగాహన లేకపోవడంతో ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కొన్ని ఇళ్ల వద్ద గంట దాకా సమయం పడుతోంది. సర్వే కోసం మరికొంత సమయం ఇవ్వాలి. – వేలిశెట్టి నరసింహారావు, ఎన్యుమరేటర్, వైరా, ఖమ్మం జిల్లా -
75 ప్రశ్నలతో కుటుంబ సర్వే
సాక్షి, హైదరాబాద్: ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఈ సర్వేపై రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం.. సర్వే ఉద్దేశం, లక్ష్యం తదితర అంశాలను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగే ఈ సర్వేకు సంబంధించిన పూర్తిస్థాయి సూచనలను అందులో పొందుపర్చింది. సర్వే రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి విభాగం (పార్ట్–1) లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. రెండో విభాగం(పార్ట్–2)లో కుటుంబ వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుంటాయి. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు కాగా.. మిగతా 19 ఉప ప్రశ్నలు.ఎంపిక బాధ్యతలు జిల్లా కలెక్టర్లకుసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం. జిల్లాస్థాయి, మండల స్థాయి నోడల్ అధికారుల నియామకం మొదలు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల గుర్తింపు ప్రక్రియ అంతా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. అదేవిధంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు బ్లాకుల కేటాయింపు బాధ్యత కూడా కలెక్టర్లదే. కిందిస్థాయి అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు సర్వే నిర్వహించాల్సిన తీరు, సమాచార గోప్యత తదితరాలకు సంబంధించిన శిక్షణ కలెక్టర్లే ఇస్తారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లుగా ప్రభుత్వ ఉద్యోగులనే ఎంపిక చేయాలి. అవసరం ఉన్న చోట మాత్రం సీఆర్పీ (కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్), గెస్ట్ టీచర్ల సేవలు వినియోగించుకోవచ్చు. సెన్సెస్ డైరెక్టర్ నుంచి ఎన్యుమరేషన్ బ్యాక్ (ఈబీ) మ్యాపులు తీసుకుని ఆ మేరకు బ్లాకుల విభజన చేయాలి. ఒక ఎన్యుమరేషన్ బ్లాక్‌లో 175 వరకు కుటుంబాలుంటాయి. అంతకంటే ఎక్కువ కుటుంబాలు ఉంటే బ్లాకుల విభజన చేయాలి. ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ సమాచారంలోని 10 శాతం కుటుంబాలను ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేసి వాటిని సూపర్వైజర్లు మరోమారు తనిఖీ చేయాలి. ఎన్యుమరేటర్ పనితీరును ఈ రకంగా అంచనా వేయాలి. జిల్లా నోడల్ అధికారిగా అధనపు కలెక్టర్‌ను నియమించాలి. సర్వే నిర్వహణలో భాగంగా రోజువారీ పురోగతిని ప్రణాళిక శాఖకు ప్రతిరోజు సాయంత్రం 6గంటల లోపు పంపాలి. -
పడుతున్న పొదుపులు.. పెరుగుతున్న అప్పులు
ముంబై: భారత్‌లో వ్యక్తులుసహా చిన్న స్థాయి కుటుంబ సంస్థల (హౌస్‌హోల్డ్ సెక్టార్) ఆర్థిక పరిస్థితులపై ఎస్బీఐ రీసెర్చ్ కీలక అంశాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం కరోనా తర్వాత వీటి పొదుపురేట్లు ఒకవైపు పడిపోతుండగా మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. వీటి నికర ఆర్థిక (ఫైనాన్షియల్) పొదుపు రేటు 2022 ఏప్రిల్– 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.15 శాతానికి పడిపోయింది. గడచిన 50 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఆర్థిక పొదుపురేటు నమోదు ఇదే తొలిసారి. 2020–21లో ఈ రేటు 11.5 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఈ రేటు 7.6 శాతం. అటు ప్రభుత్వం, ఇటు నాన్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఈపీఎఫ్ఓ వంటివి) పొదుపు నిధులే ప్రధాన ఆర్థిక వనరు కావడం గమనార్హం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌస్‌హోల్డ్ సెక్టార్ రుణభారం రూ. 8.2 లక్షల కోట్లు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రాథమికంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తాజా అధికారిక విశ్లేషణ వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైన ఆందోళనలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చడం గమనార్హం. ఫైనాన్షియల్ రంగంలో పొదుపు రేటు తగ్గడంపై ఆందోళన పడాల్సింది ఏమీ లేదని, వివిధ ఇతర భౌతిక పొదుపు ప్రొడక్టుల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారని వివరణ ఇచ్చింది. ఎస్బీఐ రీసెర్చ్ చెబుతున్న అంశాలు క్లుప్తంగా... ► 2022–23లో పెరిగిన హౌస్‌హోల్డ్ సెక్టార్ రుణం రూ.8.2 లక్షల కోట్లలో బ్యాంక్ రుణాలు రూ.7.1 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 55 శాతం భాగం గృహాలు, విద్య, వాహనాల కొనుగోళ్లకు వెళ్లింది. ► ఈ కాలంలో బీమా, ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్ పథకాల్లో రూ. 4.1 లక్షల కోట్ల పెరుగుదల ఉంది. ► హౌస్‌హోల్డ్ రంగం రుణం జీడీపీ నిష్పత్తిలో చూస్తే, 2020 మార్చిలో 40.7 శాతం. 2023 జూన్‌లో ఇది 36.5 శాతానికి పడింది. ► ఫైనాన్షియల్ పొదుపు నుండి తగ్గిన మొత్తంలో ప్రధాన భాగం భౌతిక (పొదుపు) ఆస్తులవైపు మళ్లింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ దీనికి కారణం. ► సంవత్సరాలుగా హౌస్‌హోల్డ్ సెక్టార్లో 80–90 శాతం భౌతిక పొదుపులు (ఫైనాన్షియల్ రంగంలో కాకుండా) నివాసాలు, ఇతర భవనాలు, నిర్మాణాలు, యంత్ర పరికరాల విభాగంలో ఉన్నాయి. ► వాస్తవానికి, 2011–2012లో హౌస్‌హోల్డ్ పొదుపులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ భౌతిక ఆస్తుల వాటా ఉంది. అయితే ఇది 2020–21లో 48 శాతానికి తగ్గింది. 2022–23లో ఈ తరహా పొదుపులు మళ్లీ దాదాపు 70 శాతానికి చేరే అవకాశం కనబడుతోంది. రియల్టీ రంగం పురోగతికి ఇది సంకేతం. నివేదిక పరిధి ఇదీ... పొదుపులు, అప్పులకు సంబంధించి ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ ‘హౌస్‌హోల్డ్ సెక్టార్’ అని పేర్కొంది. అంటే జాతీయ ఖాతా (నేషనల్ అకౌంట్స్)కు సంబంధించి వ్యక్తులతోపాటు, వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలు, ప్రభుత్వేతర, కార్పొరేటేతర చిన్న వ్యాపార సంస్థలు, ఏకైక (ప్రొప్రైటరీ) యాజమాన్యాలు, భాగస్వామ్యాలు, లాభాపేక్షలేని సంస్థలు వంటి అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు ఈ పరిధిలో ఉంటాయి. -
AP: 3.38 కోట్ల హెల్త్ ఐడీలు.. ఇంటింటి సర్వేతో ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఆరోగ్య పరీక్షల్లో భాగంగా గత డిసెంబర్ చివరి నాటికి ఇంటింటి సర్వేతో రాష్ట్ర ప్రభుత్వం 3.38 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేసింది. సాంక్రమిక, జీవనశైలి జబ్బుల నియంత్రణ కోసం 4.66 కోట్ల మంది జనాభాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. హెల్త్ ఐడీలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానించారు. ఇప్పటికే 72% మందికిపైగా పౌరులకు హెల్త్ ఐడీలు జారీ చేసిన నేపథ్యంలో మిగతావారికి కూడా త్వరగా ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసి ఐడీల జారీకి చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో సమీక్ష సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి.. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, రక్తహీనతతో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు ప్రాథమిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తున్నారు. ప్రాథమిక లక్షణాలను బట్టి వైద్యులతో పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారించిన వారందరికీ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. -
8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8% గృహాలకు వారంలో కేవలం ఒక్కరోజు నీరు సరఫరా అవుతుండగా, 74% మందికి వారమంతా అందుతున్నట్లు కేంద్రం జల్‌శక్తి శాఖ అధ్యయనంలో వెల్లడైంది. మరో 4% గృహాలకు వారంలో ఐదారు రోజులు, 14% మందికి కనీసం మూడు, నాలుగు రోజులు నీరు అందుతోందని ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మొత్తమ్మీద సరాసరిన రోజుకు మూడు గంటలు చొప్పున నీరు సరఫరా అవుతున్నట్లు వివరించింది. తమ ఇళ్లలోని కుళాయిల ద్వారా అందే నీటితో రోజువారీ అవసరాల్లో 80% వరకు తీరుతున్నట్లు ప్రతి ఐదుగురిలో నలుగురు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, యూపీల్లో కుళాయి కనెక్షన్లు లేని గృహాలు అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. కనీసం ఆరు రాష్ట్రాల్లోని 30%పైగా గృహాలకు గత వారం రోజులుగా కుళాయి నీరు కాలేదని వెల్లడైంది. ‘హర్ ఘర్ జల్’ పథకం అమలవుతున్న 91% గృహాల్లోని కుళాయిలు సర్వే చేపట్టిన రోజు పనిచేస్తున్నట్లు గుర్తించారు (జాతీయ స్థాయిలో ఇది 86%). 91% గృహాలకు 88% గృహాలకు అవసరాలకు సరిపోను (రోజుకు ప్రతి వ్యక్తికి 55 లీటర్లకు మించి) నీరు అందుతుండగా, 84% ఇళ్లకు రోజూ సరఫరా అవుతోంది. 90% గృహాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందుతోంది. -
Photo Feature: కరోనా కట్టడికి సర్వే.. ఆంక్షలు మామూలే
కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాలు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాయి. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సర్వే చేస్తున్నారు. ఇంటింటి సర్వే కారణంగా కరోనా పాజటివ్ రేట్ తగ్గు ముఖం పడుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా, కోవిడ్ విజృంభణకు అడ్డుకట్టవేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌తో పాటు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ‘టౌటే’ తుపాను ధాటికి కకావికలం అయిన మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
కోవిడ్-19 కట్టడి : కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 3900 పాజిటివ్ కేసులు నమోదు కాగా 195 మంది మరణించారు. 1020 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1500కు ఎగబాకింది. కాగా రాష్ట్రాల నుంచి సమాచారం రావడంలో జాప్యంతోనే తాజా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు వైరస్ బారినుంచి కోలుకునే వారి సంఖ్యను సూచించే రికవరీ రేటు 27.4 శాతానికి పెరగడం ఊరట కల్పిస్తోంది. కేసుల సంఖ్య రెట్టింపయ్యే డబ్లింగ్ రేటు 12 రోజులుగా నమోదైంది. ఇక కేంద్ర బృందాలు ప్రతి జిల్లాలోనూ కోవిడ్-19 పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. పీపీఈ వాడకంపై ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపింది. చదవండి : కసబ్‌ను గుర్తుపట్టిన ఆ హీరోను చేరదీసిన ఎన్జీవో! -
ఇంటింటా సర్వే!
బాధితుల లెక్కింపు పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్‌లు రంగంలోకి 21 జిల్లాల అధికారులు సాక్షి, చెన్నై : వరద బాధితుల్ని లెక్కించేందుకు ఇంటింటా సర్వేకు బుధవారం చర్యలు చేపట్టారు. ఇద్దరు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో మూడు వేల సిబ్బంది రంగంలోకి దిగారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు జిల్లాలు వర్షం కారణంగా తీవ్ర విలయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రజల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఈ ప్రకటన మేరకు వరద బాధితుల్ని లెక్కించేందుకు చర్యలు చేపట్టారు. చెన్నై జిల్లా కలెక్టర్ సుందర వల్లి ఆధ్వర్యంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, 21 జిల్లాల రెవెన్యూ అధికారులు, సబ్ కలెక్టర్లు పర్యవేక్షణలో మూడు వేల మంది సిబ్బందిని ఈ లెక్కింపు ప్రక్రియలోకి దించారు. బృందాలు బృందాలుగా ఈ సిబ్బంది బుధవారం ఉదయం నుంచి లెక్కింపు పర్వానికి శ్రీకారం చుట్టారు. అమైంజికరైలో కలెక్టర్ సుందర వల్లి పర్యటించి, అక్కడి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. తొలి ప్రక్రియగా చెన్నైలోని వరద బాధిత ప్రాంతాల్లో శరవేగంగా లెక్కింపు పర్వం సాగుతున్నది. ఇంటింటా బృందాలు వెళ్లి మరీ బాధితులకు ఎదురైన నష్టాలను, కష్టాలను పరిశీలించడమే కాకుండా, వారి రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌లను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నది. ఈ విషయంగా కలెక్టర్ సుందర వల్లి మీడియాతో మాట్లాడుతూ, ఇంటింటా సర్వే చేస్తున్నామని, బాధితులు అందరికి న్యాయం జరిగే విధంగా లెక్కింపు సాగుతున్నదన్నారు. ఈ బృందాలు అన్ని ఇళ్లకు వస్తాయని, అందరూ వారి వారి రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌ను తప్పని సరిగా అందించాల్సి ఉంటుందన్నారు. ఎవరివైనా రేషన్ కార్డులు, పాస్ బుక్‌లు వరదల్లో కొట్టుకు వెళ్లి ఉంటే, అట్టి వారు ఆ వివరాలను ఈ బృందాలకు తెలియజేయాలని సూచించారు. ఈ బృందాలకు సంపూర్ణ సహకారం అందించాలని , ఎవరైనా ఇళ్లల్లో లేకున్నా, తాళం వేసుకుని వెళ్లి ఉన్నా, అట్టి వారికి సంబంధించి మరో మారు సర్వే ద్వారా వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. అలాగే, వరదల్లో కొట్టుకు వెళ్లిన ఇతర ధృవీకరణ పత్రాల నకల్లను బాధితులకు అందించేందుకు తగ్గ చర్యలు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ కార్డు తప్పని సరేనా: వరద బాధితులకు సంబంధించి రేషన్ కార్డు జిరాక్స్‌లను తప్పని సరిగా అధికారులు స్వీకరిస్తుండడంతో ఆ కార్డులు లేని వారికి సాయం అందడం కష్టంగా మారి ఉన్నది. రాష్ర్టంలో డిఎంకే హయాంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ఆగింది. తదుపరి అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక పాత కార్డులకే అతుకులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. దీంతో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లలోపు కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం వరదల్లో నష్ట పడ్డ వారిలో రేషన్‌కార్డుల లేని కుటుంబాలు వేలల్లో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే,అట్టి కుటుంబాలకు రూ. ఐదు వేలు నష్ట పరిహారం దక్కేది డౌటే. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేషన్‌కార్డులు లేని బాధితులకు ప్రత్యామ్నాయ సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని వేలాది మంది బాధితులు వేడుకుంటున్నారు. -
దిద్దుబాటు
తొలగించిన ఓటర్ల కోసం ఇంటింటి సర్వే బీసీ గణనతోపాటే పొరపాటున తొలగించి ఉంటే తిరిగి చేర్పు... సిటీబ్యూరో: వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల ఆందోళన, విజ్ఞప్తి మేరకు, జీహెచ్ఎంసీ ఎన్నికల తరుణంలో ఓటర్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొరపాటున జాబితాలోంచి తొలగించిన వారి పేర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకుగాను ఇంటింటి సర్వే జరపనున్నారు. ఈనెల 18 వరకు ఈ సర్వే నిర్వహిస్తారు. సర్వేలో భాగంగా బూత్‌లెవెల్ అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు జాబితాలో ఓట్లు తొలగించిన వారు తమ వివరాలను అందజేస్తే తిరిగి నమోదు చేస్తారు. గ్రేటర్లో ఓట్ల తొలగింపుపై పెద్దఎత్తున దుమారం చెలరేగుతుండటం తెలిసిందే. వివిధ రాజకీయపక్షాల ఫిర్యాదుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల కొన్ని బృందాలు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయడంతోపాటు తొలగించిన వారి నుంచి వివరాలు సేకరించారు. రాజకీయపక్షాల నుంచే కాక పత్రికలు, ప్రజల నుంచి కూడా పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తడంతో జాబితాలోంచి తొలగించిన పేర్లను తిరిగి చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. -
జనగణనకు అధికారగణం సన్నాహాలు
65,522 మంది ఎన్యూమరేటర్లు.. రూ.5.97 కోట్ల ఖర్చు హైదరాబాద్: వచ్చే నెలలో చేపట్టే జాతీయ జనాభా లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. గతంలో జనగణన చేపట్టిన తరహాలోనే ఇంటింటి సర్వే నిర్వహించనుంది. జాతీయ జనాభా గణనను అప్డేట్ చేయటంతోపాటు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నందున ఈ సర్వేను సమర్థవంతంగా చేపట్టాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే మార్గదర్శకాలను వివరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేయాలని, ప్రైవేటు ఉద్యోగులను తీసుకోవద్దని ఆదేశించారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15లోగా సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75,776 ఎన్యూమరేషన్ బ్లాకులను గుర్తించి ంది. మొత్తం 65,522 మంది ఎన్యూమరేటర్లను ఈ సర్వేకు వినియోగించనుంది. సర్వే నిర్వహణకు పది జిల్లాల పరిధిలో మొత్తం రూ.5.97 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. పంట కోత ప్రయోగాలు: కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రతి మండలంలో పంట కోత ప్రయోగాలను సక్రమంగా నిర్వహించాలని ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు బీపీ ఆచార్య సూచించారు. జిల్లాకు 30 ఫిల్మ్‌లు: నవంబర్ 14 నుంచి 20 వరకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని బీపీ ఆచార్య కలెక్టర్లను కోరారు. ప్రతి జిల్లాకు 30 ఫిల్మ్‌లు పంపిస్తున్నామని, వీటిని జిల్లా కేంద్రంలో ఉచితం గా ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. -
ఆసరాపై ఆరా
- సామాజిక తనిఖీకి నిర్ణయం.. - గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు - ఇంకా కావాలంటూ రోడ్డెక్కుతున్న జనం - ఆలోచనలో పడిన సర్కారు - లబ్ధిదారుల ఇంటింటి సర్వేకు శ్రీకారం! - మున్సిపాలిటీలు, నగర పంచాయితీలపైనే ప్రధాన దృష్టి - నెలాఖరు నుంచి తనిఖీలు షురూ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బోగస్ ‘ఆసరా’ పింఛన్ల ఏరివేతకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలోగా లబ్ధిదారుల ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తున్నా.. ఇంకా జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల కోసం జనం రోడ్డెక్కుతున్న వైనంతో సర్కారు ఆలోచనలో పడింది. దీంతో సామాజిక సర్వేకు శ్రీకారం చుడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత సర్కారుల హయాంలో కంటే 50 వేల మందికి ఎక్కువగా పింఛన్లు ఇస్తోంది. అయినా, ఇంకా పింఛన్ల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన ప్రభుత్వం వాస్తవ లబ్ధిదారులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేకు ఆదేశించింది. ఇటీవల ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలో మొత్తం ఫించనుదారుల్లో 20 శాతం మంది అనర్హులున్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమై న సర్కారు అన్ని జిల్లాల్లో సర్వేల నిర్వహణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సంకేతాలందాయి. ఆ ఉత్తర్వులే ఆధారంగా.. ఆసరా పింఛన్లకు సంబంధించి జారీ చేసిన జీవోలోనే ప్రభుత్వం సామాజిక తనిఖీ అంశాన్ని పొందుపర్చింది. దీని ఆధారంగానే ఇప్పుడు సామాజిక తనిఖీలకు సిద్ధమైంది. పింఛన్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. సదరమ్ క్యాంపుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ.. వికలత్వం నిర్ధారణలో వైద్యులు అవినీతికి పాల్పడుతున్న దాఖలాలున్నాయి. కల్లు గీత కార్మికుల్లో చోటామోటా రాాజకీయ నాయకులు, వృద్ధాప్య పెన్షన్‌దారుల్లో అనర్హులు ఉ న్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల స్థాయిలోనే ఈ భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉం డటంతో పాటు మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అనర్హులనూ పెన్షనర్ల జాబితాలో చే రుస్తున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. పెరిగిన భారం.... ఆసరా పెన్షన్లకు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి పింఛన్‌దారులు మొత్తం 3,00,482 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 3,47,430కి చేరింది. గత ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు రూ 8.18 కోట్లు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.33.9 కోట్లు చెల్లిస్తోంది. నెలవారీ చెల్లిస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000, వికలాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500కి పెంచారు. పెన్షనర్లలో వికలాంగులు, కల్లుగీత కార్మికులు గతాని కంటే భారీగా పెరిగారు. అయినా ఇంకా పింఛన్లు కావాలని జనం రోడ్డెక్కుతుండటం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేస్తోంది. సమగ్ర సర్వే ప్రామాణికం ఉపాధి హామీ పథకంలో మాదిరిగానే ఆసరా పెన్షన్లలోనూ సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వేర్వేరు బృందాలు పర్యటిస్తాయి. లబ్ధిదారుల జాబితా ఆధారంగా సర్వే జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఆర్థిక, సామాజిక స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తారు. తనిఖీలో అనర్హులు బయటపడితే గ్రామసభలు నిర్వహించి ఆసరా జాబితా నుంచి వారిని తొలగిస్తారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటి వరకు వారికి చెల్లించిన సొమ్మునూ రికవరీ చేస్తారు. -
సర్వర్ బిజీ
అంతటా వెబ్సైట్లు ఓపెన్ చేయడమే కారణం అనుకున్న సమయంలో పూర్తి కాలేకపోతున్న ఆన్లైన్ నమోదు పింఛన్ పంపిణీలో మరింత జాప్యం సర్వర్ బిజీ మోర్తాడ్ : పింఛన్లకు సంబంధించిన ఇంటింటి సర్వే పూర్తి కాగా, ఆన్లైన్ చేయడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అన్ని పనులను పక్కకు పెట్టి ఎంపికైన లబ్ధిదా రుల వివరాలను ఆపరేటర్లు రెవెన్యూ కార్యాలయాలలోని కంప్యూటర్ల ద్వారాఆన్‌లైన్ చేస్తున్నారు. అన్ని కార్యాలయాలలోనూ ఒకేసారి వెబ్సైట్లను ఓపెన్ చేయడం తో సర్వర్ బిజీ అయ్యింది. దీంతో వివరాల నమోదుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ మంది లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ చేయాల్సి రావడంతో సాంకేతిక సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం సీలింగ్‌ను ఎత్తివేయడంతో ఇంకా కొంత మంది లబ్ధిదారు లను ఎంపిక చేయాల్సి ఉంది. సర్వర్ బిజీగా మారడంతో పింఛన్ల పంపిణీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి సం బంధించిన ఇతర వెబ్సైట్లను నిలుపుదల చేసి పింఛన్లకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చినా సాంకేతిక సమస్యలు తలెత్తడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. -
25 శాతం నిధులు మిగిలినట్లే!
‘సర్వే’ సమాచారం ఆధారంగా పలు పథకాల్లో కోత పెట్టనున్న సర్కారు ఆదా అయిన నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లింపు టాస్క్‌ఫోర్స్ కమిటీల సిఫారసుల అనంతరమే బడ్జెట్‌కు తుది రూపు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాల్లో దుర్వినియోగాన్ని తగ్గించడం వల్ల.. వాటికి అవుతున్న వ్యయంలో దాదాపు 25 శాతం నిధులు ఆదా చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సమగ్ర ఇంటింటి సర్వే సమాచారాన్ని వినియోగించుకోనుంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యార్థులకు ఆర్థిక సాయం, ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణ పథకాల్లో నిధుల దుర్వినియోగాన్ని చాలా వరకూ అరికట్టవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనివల్ల ఆదా అయిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించడం వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే డీలర్లు రాష్ట్రవ్యాప్తంగా ఐదున్నర లక్షల రేషన్ కార్డులను సరెండర్ చేయగా... ఆధార్ సీడింగ్‌తో మరో ఐదు లక్షల రేషన్‌కార్డులను తొలగిస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా కోటికిపైగా ఉన్న రేషన్‌కార్డుల్లో ఇప్పటికే పది లక్షల వరకూ తగ్గడంతో... పౌర సరఫరాల శాఖ వ్యయంలో పది శాతం వరకూ నిధులు ఆదా అయినట్లేనని పేర్కొన్నాయి. ఇక పింఛన్లలోనూ ఇదే పద్దతి అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పింఛన్లను ఏకంగా రూ. వెయ్యి, పదిహేను వందలకు పెంచుతుండడంతో... బోగస్ లబ్ధిదారుల తొలగింపు చేపడతారని చెబుతున్నారు. అలాగే అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లించేదిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన బడ్జెట్లకు భిన్నంగా ఈ బడ్జెట్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అధికారవర్గాలు వివ రించాయి. కానీ బడ్జెట్ కోసం వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత అధికారులకు దిమ్మతిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ప్రణాళిక వ్యయం కింద రూ. 60 వేల కోట్ల ప్రతిపాదనలు వస్తే.. తెలంగాణ రాష్ట్ర అధికారులు గత బడ్జెట్ అంచనాలను యథావిధిగా రూపొందించి.. ఏకంగా రూ. 68 వేల కోట్ల మేరకు ప్రణాళిక ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఎలాంటి కసరత్తు లేకుండా అధికారులు ప్రతిపాదనలు పంపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో... లక్ష్యాన్ని సాధించేలా బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని, టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఇచ్చే నివేదికల తరువాత బడ్జెట్‌పై తుది నిర్ణయానికి వస్తారని ఓ అధికారి వివరించారు. సమగ్ర సర్వేపై వర్క్‌షాప్.. సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై సలహాలు, సూచనల కోసం గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం అపార్డ్‌లో వర్క్‌షాప్ నిర్వహించింది. ఎన్ఐఆర్డీ, పంచాయతీరాజ్, సెర్ప్ అధికారులు, ఆర్థిక, సామాజికవేత్తలతో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అధికారులు, నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
ఎంట్రీ.. ఎంత కష్టమో!
నీలగిరి : సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ కార్యక్రమం చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 19వ తేదీన (ఒక్క రోజు) ఇంటింటికీ తిరిగి సేకరించిన కుటుంబ వివరాలను కంప్యూటరీకరించడంలో సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ నాటికి మొత్తం కుటుంబ వివరాలు కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాల్సి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం గడువు కంటే ముందుగానే ఈ డాటా మొత్తాన్ని ఈ నెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ అనేకచోట్ల కావాల్సిన కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరతతో ఆలస్యమవుతోంది. దీంతోపాటు తీవ్రమైన విద్యుత్ కోతల కారణంగా సిబ్బంది అనుకున్నంత స్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. పలుచోట్ల కాలేజీల్లో పాతపడిన కంప్యూటర్లను వాడుతుండడం వల్ల డాటా ఎంట్రీ ముందుకు సాగడం లేదు. ప్రధానంగా సర్వే అప్పుడు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేయలేదు. దీంతో ఎంట్రీ సిబ్బంది మళ్లీ ఆయా కుటుంబాలకు ఫోన్లు చేసి వివరాలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో అధికారులు నిర్ణయించిన ప్రకారం ఒక్కో ఆపరేటర్ రోజుకు 60 ఫారాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయాల్సి ఉండగా..20 నుంచి 30 ఫారాలకు మించి దాటట్లేదు. గడువులోగా పూర్తయ్యేనా..? జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 11,69,690 కుటుంబాల వివరాలు సేకరించారు. దీంట్లో శనివారం సాయంత్రం వరకు అధికారుల ఇచ్చిన సమచారం మేరకు 4,06,394 కుటుంబాల వివరాలను మాత్రమే కంప్యూటర్లలో నమోదు చేశారు. ఇంకా 7,63,296 కుటుంబాల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం విధించిన గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. గడువు సమీపిస్తుండడంతో అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. ఎంట్రీ కార్యక్రమం వేగవంతం చేయాలని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా డివిజన్ అధికారులను ఆదేశించినప్పటికీ పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. నల్లగొండ డివిజన్లో 2,39,459 కుటుంబాలు సర్వే చేశారు. వీటిల్లో కేవలం 1,07,966 కుటుంబాలకు చెందిన వివరాలను మాత్రమే కంప్యూటర్లలో ఎంట్రీ చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలో 53 వేల కుటుంబాలు కాగా ఇప్పటివరకు కేవలం 4 వేల కుటుంబాల వివరాలు మాత్రమే కంప్యూటర్లో నమోదు చేశారు. కంప్యూటర్లలో సాంకేతికలోపాలు తలెత్తడం వల్ల ఎంట్రీ ఆలస్యంగా జరుగుతోంది. చర్లపల్లి సమీపంలోని నిట్స్ కాలేజీలో మరో సెంటర్‌ను పెట్టారు. ఇక్కడ 20 కంప్యూటర్ల ద్వారా 40మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ చేస్తున్నారు. భువనగిరి డివిజన్లోని సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ప్రధానంగా సర్వర్ డౌన్ సమస్య అన్నిచోట్లా ఉంది. సర్వర్లు డౌన్ అయితే రెండు గంటల వరకు ఓపెన్ కావడంలేదు. భువనగిరిలోని ఆరోర, వాత్సల్య, శారద, కేబీఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్లు, బీబీనగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల, బొమ్మలరామారం మండలం చీకటి మామిడి ప్రొగ్రేస్, భూదాన్‌పోచంపల్లి దేశ్ముఖిలోని సెయింట్ మేరి ఇంజినీరింగ్ కళాశాలలో పాత కంప్యూటర్ల వాడకం వ ల్ల సమస్య ఎక్కువగా ఉంది. దీంతో డాటా ఎంట్రీ చేస్తున్నప్పటికీ ఆప్‌లోడ్ కావడంలేదు. భువనగిరిలో వాత్సల్య, శారదా కళాశాలల్లో పాత కంప్యూటర్లతో డాటా ఎంట్రీ అపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజుకు 20 ఫారాలకు మించి ఎంట్రీ చేయడం కష్టంగా ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో కరెంట్ కోతలు ఇబ్బందిపెడుతున్నాయి. కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో ఆపరేటర్లు నిరసన తెలిపారు. మునుగోడు మండలానికి సంబంధించి డాటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఎన్యుమరేటర్లు పూర్తిస్థాయిలో సర్వే ఫారాలు నింపకపోవడంతో వీఆర్వోలు వివరాలు సేకరించి, ఇచ్చాక డాటా ఎంట్రీ చేస్తున్నారు. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా 180 కంప్యూటర్లు, దేవరకొండ నగర పంచాయతీలో 20 వార్డులకు 20 కంప్యూటర్లు ఉపయోగించి డాటా ఎంట్రీ చేస్తున్నారు. కంప్యూటర్ల కొరత, రాత్రి వేళ డాటా ఎంట్రీ చేయడం కోసం ఆపరేటర్లు హాజరవడం లేదు. ఒక్కో ఎంట్రీకి 5 రూపాయలు మాత్రమే ఇస్తుండడంతో ఒక్కో ఆపరేటర్ రోజుకు 50 నుంచి 70 ఫారాలు ఎంట్రీ చేస్తుండగా అతనికి కేవలం రూ.300 కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఆపరేటర్లు ఒక రోజు వచ్చిన వారు మరుసటి రోజు రావడానికి సుముఖత చూపడం లేదు. దీంతో ఆపరేటర్ల కొరత ఎక్కువగా ఉంది. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర సర్వే ద్వారా మున్సిపల్ అధికారులు మొత్తం 21వేల కుటుంబాలను గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ ఐదు రోజులుగా పట్టణ పరిధిలోని క్రాంతి కళాశాల, మండల పరిధిలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటరీకరిస్తున్నారు. అయితే నెట్ నెమ్మదిగా ఉండడంతో పనివేగంగా జరగడం లేదు. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో 14, ఆర్డీఓ కార్యాలయంలో 6 కంప్యూటర్లు ద్వారా డాటా ఎంట్రీ చేస్తున్నారు. 40 మంది ఆపరేటర్లు రెండు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. అనుభవం లేని కంప్యూటర్ ఆపరేటర్ల వల్ల ఇప్పటివరకు కేవలం 2,300 కుటుం బాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. శనివారం మ రో 20 కంప్యూటర్లను తెప్పించారు. కానీ డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉంది. సూర్యాపేట మండలం బాలెంల గ్రామ సమీపంలోని అరవిందాక్ష ఇంజినీరింగ్ కళాశాలలో తుంగతుర్తి, తిరుమలగిరి, సూర్యాపేట అర్బన్ కుటుంబాలకు సంబంధించిన వివరాలను కంప్యూటరీకరిస్తున్నారు. ఇందుకు 90 కంప్యూటర్లు అవసరం ఉండగా 52 కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. ఎంట్రీ ఆపరేటర్లను 52 మందిని, 52 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. వీరు గంటకు ఆరు నుంచి పది కుటుంబాల సర్వే వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. విద్యుత్ సమస్య కొంత ఉన్నప్పటికీ ఇన్వర్టర్లు ఉండడంతో కంప్యూటరీకరణ చేయడం పట్ల ఇబ్బంది కలగడం లేదు. కానీ కంప్యూటర్లు సరిపడా లేకపోవడం, సర్వర్ల సమస్య, ఆపరేటర్లకు అవగాహన లేకపోవడం వల్ల ఎంట్రీ ఆలస్యమవుతోంది. -
అద్భుతం ఆవిష్కృతమైంది..!
గతంలో ఎక్కడా లేనివిధంగా సర్వే జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేతో గొప్ప అద్భుతం ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే తొలిసారి ప్రజల భాగస్వామ్యంతో అందరూ ఆశ్చర్యపడేలా అద్భుతంగా ఈ సర్వే జరిగిందని పేర్కొన్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, బి.నర్సయ్యగౌడ్‌లతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమగ్ర సర్వేపై చిలువలు పలువలుగా అసత్య ప్రచారం చేసిన ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పారని, దాంతో ఆయా నేతల ముఖాలు మాడిపోయాయని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో 98 శాతం మేరకు సర్వే జరిగిందని వెల్లడించారు. ఎన్యూమరేటర్లు తమ ప్రాంతాలకు రాలేదని ప్రజలు ధర్నాలు చేయడం చూస్తుంటే, వారు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఎంత ఆదుర్దా కనబరిచారో అర్థమవుతోందన్నారు. ముంబై, భీవండి, సూరత్, అహమ్మదాబాద్‌ల నుంచి రైళ్లలో.. జెడ్డా, గల్ఫ్‌ల నుంచి ప్రత్యేక విమానాల్లో ప్రజలు సర్వే కోసం రావడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఉంచిన నమ్మకం, గౌరవానికి ఇది నిదర్శనమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మొత్తం భారతదేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సర్వే జరిగిందని చెప్పారు. సరైన పద్ధతిలో ఏ పని చేసినా ఫలితం గొప్పగా ఉంటుందనే విషయాన్ని నిరూపించిన తెలంగాణ ప్రజలకు ఆయన కృత జ్ఞతలు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో మంగళవారం తమ వివరాలను నమోదు చేసుకోలేకపోయిన కుటుంబాలకు మరో అవకాశం ఇవ్వడంపై బుధవారం తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్ వంటి నగరాలు, జిల్లాల్లో ఎక్కడైనా మిగిలిపోయిన వారి విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు. సర్వేలో భాగంగా అడిగిన ప్రశ్నల ద్వారానే తమకు అవసరమైన సమాచారం అందుతుందని, అది తమకే అర్థం అవుతుందని పేర్కొన్నారు. అవసరమైన మేర సమాచారం లేదని భావిస్తే మళ్లీ సర్వే నిర్వహిస్తారా అని అడగ్గా.. ఆ అవసరముంటే మళ్లీ చేద్దామని బదులిచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ఇంతకాలం చీకట్లో ఉన్నాం ‘‘ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం స్పష్టమైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులు ఉదయం 5 గంటల నుంచే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నడుంబిగించారు. వారికి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. బ్యాంకు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థులు ఇలా సర్వేలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. సరైన వివరాలు, సమాచారం లేకుండా మనం ఇప్పటివరకు చీకట్లో ఉన్నాం. సర్వేతో అందిన వివరాలతో అద్భుతాలు సృష్టిద్దామని తెలంగాణ ప్రజలకు హామీనిస్తున్నాను. తెలంగాణలోని జనాభాపై ఏవో లెక్కలున్నప్పటికీ తాజా సర్వే ప్రకారం నాలుగున్నర కోట్ల వరకు ఇక్కడి జనాభా ఉండొచ్చునని తెలుస్తోంది. హైదరాబాద్ జనాభాపైనా స్పష్టత వస్తుంది. ఇక్కడ దాదాపు 1.2 కోట్ల మంది ఉన్నట్టు అంచనా. ఈ వివరాలను బట్టి నగరానికి ఎంత నీరు అవసరం, ఇతరత్రా అవసరాలకు ఎంత కేటాయించాలో తెలుస్తుంది. నవ్వినోళ్ల మొహాలే నల్లబడ్డాయ్ ఇంత సులభతరంగా చేస్తున్న సర్వేను కొంతమంది చిలవలు పలువలు చేసి, చిల్లరమల్లర చేసి వాళ్ల పరువు వారే తీసుకున్నారు. ఇలాంటి అంశాలపై విపక్ష పార్టీలు భవిష్యత్‌లో ప్రజల మూడ్ తెలుసుకుని వ్యవహరిస్తే మంచిది. ఈ సర్వే విజయవంతమైన తీరును చూసైనా విమర్శకులకు కనువిప్పు కలగాలి. సర్వేలో పూర్తిగా భాగస్వాములు కావడం ద్వారా ప్రజలు వారి చెంపలు చెళ్లుమనిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఆంధ్ర ప్రాంత మిత్రులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇందులో పాలుపంచుకున్నారు. మొత్తమ్మీద ప్రజలు చాలా సౌకర్యవంతంగా ఫీలయ్యారు. జీహేచ్ఎంసీ పరిధిలో అయితే తమ ప్రాంతానికి ఎన్యూమరేటర్లు రావడం లేదంటూ ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి అడగడం, కొన్నిచోట్ల ధర్నాలు చేయడం సర్వే పట్ల వారికున్న ఆసక్తిని స్పష్టంచేస్తోంది. ప్రభుత్వం ఇట్లా కూడా పనిచేస్తుందా అని ప్రజ లు చేసి చూపించారు. ప్రజలు కలలు కనే తెలంగాణను సాధించుకునేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. ప్రజల సహకారం ఇలాగే ఉంటే బంగరు తెలంగాణను వారి చేతుల్లో పెడతా. 15 రోజుల్లో క్రోడీకరణ సర్వే వివరాలు బహుముఖంగా ఉపయోగపడతాయి. దీని ద్వారా ప్రభుత్వపరంగా చాలా నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది. పది పదిహేను రోజుల్లో మొత్తం డేటాను కంప్యూటరీకరించి సీఎం, సీఎస్, మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, హెచ్ఓడీలు, కలెక్టర్లు, జేసీలు, ఆర్డీఓలు, ఎమ్మార్వోల వరకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతీ గ్రామంలో ఐటీ కనెక్టివిటీ అందుబాటులో రానున్నందున ప్రతి గ్రామపంచాయితీలో కూడా ఈ సమాచారం అందుబాటులోకి వస్తుంది. భూమి, ఇళ్లు, పెన్షన్ ఇలా అన్ని సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందేందుకు ఉపయోగపడుతుంది. మేం జరిపిన తరహాలోనే ఇతర రాష్ట్రప్రభుత్వాలు కూడా సర్వేలు నిర్వహించుకుంటే ఫలితం ఉంటుంది. సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ పథకాలు సరైనవిధంగా ప్రజలకు చేరేందుకు అవసరమైన సమాచారాన్ని పొందేందుకు సర్వే ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ఆలోచించాల్సిందిగా ఇతర రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రానికి కూడా ఈ సర్వే కనువిప్పు అవుతుంది. నా బిడ్డలు తప్పుచేసినా జైల్లోనే.. ప్రభుత్వపరంగా ఒక్కపైసా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వంలో అసలు అవినీతికి తావు లేకుండా చర్యలు చేపడతాం. చివరకు నా కుమారుడు గానీ కుమార్తె గానీ అవినీతికి పాల్పడినా జైలుకు పంపుతాం. ప్రజాధనాన్ని కైంకర్యం చేసే మోసగాళ్లు, దోపిడీదారులు, నేరస్తుల పట్ల కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. విడిచిపెట్టే ప్రసక్తే లేదు’’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. పవన్‌కళ్యాణ్, విజయశాంతి, సర్వేకు సహకరించలేదన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. తెలంగాణలో ఉంటూ తమ సమాచారాన్ని ఇవ్వనివారు ఇక్కడ పర్యాటకులుగా ఉండాలన్నారు. వివరాలను తప్పుగా ఇచ్చినవారిపైనా చర్యలు ఉంటాయన్నారు. ముంపు గ్రామాలది ముగిసిన కథ: సీఎం సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలది ముగిసిన కథ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ముంపు గ్రామాల్లో సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. లోక్‌సభ, రాజ్యసభల ఆమోదంతోపాటు, రాష్ట్రపతి కూడా దీనికి ఆమోదముద్ర వేసినందున అది ముగిసిన అధ్యాయమన్నారు. ‘ఈ ముంపు గ్రామాల గురించి ఇప్పుడు ఏమి చేయలేం బ్రదర్. అవి పక్క రాష్ట్రానికి వెళ్లినందున అక్కడ సర్వే నిర్వహించలేక పోయాం’ అని చెప్పారు. ముస్లిం యువతుల పెళ్లికి రూ. 51 వేలు.. ‘ముస్లిం యువతులకు ప్రస్తుతం పెళ్లి సందర్భంగా రూ.25 వేలతో జుమ్మెరాత్ బజార్లో సెకండ్‌హ్యాండ్ సామాన్లు ఇస్తున్నారు. ఈ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.25 వేలను రూ. 51 వేలకు పెంచాలని నిర్ణయించాం. రూ.51 వేలతో సామాగ్రి కాకుండా.. ఆ మొత్తాన్ని పెళ్లికుమార్తె బ్యాంకు అకౌంట్లో జమ చేస్తాం. కళ్యాణలక్ష్మి పథకం కింద దళిత, గిరిజన యువతులకు రూ. 50 వేలు ఇవ్వాలని ఇదివరకు మంత్రిమండలి నిర్ణయించింది. దానిని కూడా రూ.51 వేలకు పెంచుతున్నాం’ అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం... ‘తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం సింగపూర్, మలేషియా దేశాల పర్యటనకు వెళ్తున్నా. ఈనెల 25వ తేదీ వరకు ఈ రెండు దేశాల్లో అధికారులతో కలిసి పర్యటిస్తున్నా. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడానికి రావాల్సిందిగా దేశంలోని ముఖ్యమంత్రుల్లో నా ఒక్కరికే ఆహ్వానం వచ్చింది. కొత్త రాష్ట్రం కొత్త ముఖ్యమంత్రి అన్న ఉద్దేశంతో పంపించారు. మలేషియాలో అద్భుత రీతిలో అభివృద్ధి జరిగింది. ఎలా సాధించారన్న అంశాన్ని పరిశీలిస్తాం. అక్కడి అధికారులు, మంత్రులతో సమావేశమవుతాం. సింగపూర్ నుంచి కౌలాలంపూర్‌కు కారులోనే వెళ్తాను. అలా వెళ్తేనే అక్కడి పట్టణాలు ఎలా అభివృద్ధి చెందాయో అవగాహన వస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో జీరో అవినీతి అమలు చేస్తామని, పరిశ్రమలకు ఎలాంటి అవినీతి లేకుండా అన్ని అనుమతులు అందిస్తామన్నారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమావేశంలో సింగపూర్ ప్రధాని కూడా పాల్గొంటారు. నేడు ప్రభుత్వ సాధారణ సెలవుదినం మంగళవారం జరిగిన సమగ్ర సర్వే దష్ట్యా బుధవారాన్ని సాధారణ సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు పనిచేయవు. ఎన్యుమరేటర్లంతా వ్యయప్రయాసలకు ఓర్చి సమాచార సేకరణ విధుల్లో పనిచేశారంటూ కేసీఆర్ వారికి కతజ్ఞతలు తెలిపారు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సర్వే సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నందున వారందరికీ సెలవు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. -
'సర్వే’త్రా సక్సెస్..
దాదాపు 95 శాతం కుటుంబాల సమాచారం సేకరణ సమగ్ర కుటుంబ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు పలుచోట్ల అర్ధరాత్రి వరకూ కొనసాగిన సర్వే ఒక్కో ఎన్యూమరేటర్‌కు 25-40 ఇళ్ల కేటాయింపు బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చేందుకు ప్రజల విముఖత పలుచోట్ల ఎన్యూమరేటర్ల డుమ్మా.. ఏర్పాట్లలో లోపాలు వరంగల్‌లో కలెక్టర్ నివాసం ఎదుట ధర్నా తెలంగాణవ్యాప్తంగా పూర్తిగా బంద్ వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా కదలని బస్సులు సాక్షి నెట్వర్క్: ప్రజలు, రాజకీయవర్గాల్లో ఎంతో ఆసక్తి.. ఒకింత ఉత్కంఠ, వివాదాలను రేకెత్తించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. అధికారుల పొరపాట్లు, గ్రామస్తుల ఆందోళనల మధ్య విజయవంతంగా పూర్తయింది. సర్వేకు సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించడానికి వీలుగా సెర్ప్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఎన్యూమరేటర్ల రాక కోసం ప్రజలు వేచిచూడడం, వారు తమ ఇళ్ల వద్దకు రాగానే అవసరమైన పత్రాలు చూపి, నమోదు చేసుకోవడం కనిపించింది. చాలాచోట్ల అనుకున్న సమయానికి సర్వే ప్రారంభం కాలేదు. ఎన్యూమరేటర్ల కోసం ఎదురుచూసిన గ్రామస్తులు.. ఎంతకూ రాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ధర్నాలకు దిగారు. ఎన్యూమరేటర్లను, అధికారులను నిర్బంధించారు. మరికొన్ని చోట్ల సర్వేను బహిష్కరించారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. సర్వే కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో.. అంతటా కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపించింది. సర్వే వల్ల ఉదయం, సాయంత్రం మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సర్వే కోసం వారం రోజులుగా ప్రత్యేక బస్సులు నడిపి రూ. 12 కోట్ల ఆదాయం ఆర్జించిన ఆర్టీసీకి, మంగళవారం దెబ్బకు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది. ఉదయం నుంచే..: సర్వే కోసం ఎన్యూమరేటర్లను ఉదయం ఐదు గంటల నుంచే మండల కేంద్రాల నుంచి గ్రామాలకు పంపారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 25 నుంచి 40 కుటుంబాల వరకూ కేటాయించారు. దాంతో వారు సర్వే పత్రంలోని అన్ని వివరాలను సేకరించకుండా ప్రధానంగా కుటుంబసభ్యుల పేర్లు, ఆధార్ నంబరు, వాహనాలు, ఆస్తులు, ఇళ్లు, సామాజిక అంశాలపై మాత్రమే సమాచారాన్ని నమోదు చేశారు. బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల వివరాలు ఇవ్వడానికి చాలావరకు ప్రజలు విముఖత వ్యక్తం చేశారు. రాత్రి 9.30 సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులకు సమాచారం అందింది. జిల్లా, మండలకేంద్రాలు, గ్రామాల్లో సర్వేకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కనిపించింది. పల్లెల్లో సర్వే సందడి సర్వే నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా పల్లెల్లో సందడి నెలకొంది. పండుగ వాతావరణాన్ని తలపించింది. పట్టణ ప్రాంతాల్లోనేమో పూర్తిగా బంద్ వాతావరణం కన్పించింది. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట, కరీంనగర్ జిల్లా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ జిల్లా బాసర తదితర పుణ్య క్షేత్రాలన్నీ బోసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 15 భూగర్భ గనులు, నాలుగు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మైదాన ప్రాంతాల్లో కంటే గోండు, కొలాం, మన్నేవార్ తదితర తెగల వారు నివసించే ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వేకు బాగా స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలున్నప్పటికీ... కేవలం ఒక కుటుంబం వివరాలు మాత్రమే సేకరిస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం, తాండూరు, హయత్‌నగర్, రాజేంద్రనగర్‌లో స్థానికులు ఆందోళన చేశారు. మెదక్ జిల్లాలో సర్వేకు భారీ స్పందన కనిపించింది. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని తన నివాసంలో సర్వేలో పాల్గొన్నారు. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సర్వేకు హాజరు కాలేదు. పాలమూరులో పెరిగిన కుటుంబాలు.. మహబూబ్‌నగర్‌లో ముందుగా లెక్కించిన దానికంటే పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఉండడంతో సర్వేలో జాప్యం చోటుచేసుకుంది. రాత్రి పదిగంటల అనంతరం కూడా చాలా చోట్ల ఎన్యుమరేటర్లు సర్వే కొనసాగిస్తూనే ఉన్నారు. మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలో వివరాల సేకరణకు వచ్చిన ఎన్యుమరేటర్ భూమి వివరాలు అడగడంతో ఇద్దరు అన్నదమ్ములు గొడవకు దిగారు. వివాదం ముదిరి కొట్టుకున్నారు. సర్వేకు ఖమ్మం జిల్లాలో మంచి స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని ముస్తఫానగర్‌లో జాతకాలు చెప్పే కుటుంబాలు సర్వే కోసం సింగపూర్ నుంచి వచ్చారని సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్వగ్రామం ముంపు మండలంలో ఉండడంతో ఆయన భద్రాచలంలో ఉంటున్న ఇంటికి కూడా అధికారులు స్టిక్కర్ వేయలేదు. దీంతో ఆయన ఆర్డీవోతో ఫోన్లో మాట్లాడి తన వివరాలు నమోదు చేసుకున్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో ఒక ఎన్యూమరేటర్ మద్యం తాగి వచ్చి హంగామా సృష్టించారు. వరంగల్‌లో అస్తవ్యస్తం సర్వేకు వరంగల్ జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. ముందుగా సరైన సంఖ్యలో ఎన్యూమరేటర్లను నియమించకుండా... చివరి నిమిషంలో ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులకు ఆ విధులను అప్పగించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వరంగల్ నగరంలోని గిర్మాజీపేట, బొడ్రారుు వంటి కొన్ని ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. ఇళ్ల వివరాల విషయంలో అధికారులు చేసిన తప్పిదాలతో సర్వే అస్తవ్యస్తంగా మారింది. హన్మకొండ జవహర్‌కాలనీ, జూలైవాడ, రెవెన్యూకాలనీ, ప్రకాష్‌రెడ్డిపేట తదితర కాలనీల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిసినా స్పందన కనిపించకపోవడంతో... కలెక్టర్ నివాసం ముందు ధర్నా చేశారు. వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కొందరు పట్టణవాసులు బైఠాయించి నిరసన తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎస్సీ కాలనీలో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వే అస్తవ్యస్తం: ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: సమగ్రకుటుంబ సర్వే పూర్తిఅస్తవ్యస్తంగా సాగిందని, చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఆ వివరాలు ఎందుకూ పనికిరావని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మంగళవారం విమర్శించారు. కర్ఫ్యూ వాతావరణం సృష్టించిన ఈ సర్వే దండగేనన్నారు. ప్రభుత్వానికి ఏదైనా రహస్య ఎజెండా ఉండి ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. జిల్లాల వారీగా నమోదైన శాతాలు.. జిల్లా శాతం మహబూబ్‌నగర్ 99 ఖమ్మం 98 కరీంనగర్ 98 నల్లగొండ 97 మెదక్ 96 ఆదిలాబాద్ 96 నిజామాబాద్ 93 రంగారెడ్డి 89 వరంగల్ 86 జీహెచ్ఎంసీ 77 -
సర్వేకు రాని ఎన్యూమరేటర్లు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైనప్పటికీ, కొన్ని ప్రాంతాలకు సాయంత్రం అయినా ఎన్యూమరేటర్లు రాలేదు. సర్వే సిబ్బంది వస్తారని ప్రజలు ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్ల వద్దనే ఉన్నారు. కావలసిన డాక్యుమెంట్లతో వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 61 శాతం సర్వే పూర్తి అయింది. రంగారెడ్డి జిల్లాలో 61 శాతం, నిజామాబాద్ జిల్లాలో 63 శాతం, మెదక్ జిల్లాలో 70, కరీంనగర్ జిల్లాలో 60, నల్లగొండ జిల్లాలో 70, ఖమ్మం జిల్లాలో 65 శాతం సర్వే పూర్తి అయింది. ఆదిలాబాద్ జిల్లాలో 50 శాతం, వరంగల్ జిల్లాలో 60, మహబూబ్‌నగర్ జిల్లాలో 55 శాతం సర్వే పూర్తి అయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇంకా సర్వే మొదలు కాలేదు. అంబర్‌పేట, రామాంతపూర్, ఇంకా మరికొన్ని ప్రాంతాలకు సర్వే రానేలేదు. కొంత మంది సిబ్బంది కొన్ని ఇళ్లలో మాత్రమే సర్వే పూర్తి చేసి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. సిబ్బందిలో కొందరు తమకు అధికారులు 40 ఇళ్ల అడ్రస్‌లు మాత్రమే ఇచ్చారని, మిగతా ఇళ్లలో సర్వే చేయకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. సూరారంకాలనీ, బేగంపేట్,ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, మియాపూర్, చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీ, అమీర్‌పేట్, సైదాబాద్ కాలనీ,సనత్‌నగర్, ఎల్పీ నగర్, సైనిక్‌పురి వద్ద ఆర్కే పురం, హబ్సీగూడ, తార్నాకలో ప్రజలు సర్వే సిబ్బంది కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో సిబ్బంది స్థానికులకు సర్వే పుస్తకాలు ఇచ్చి, వివరాలు మీరే నింపండని వదిలివేస్తున్నారు. ఇంటి యజమానులు లేక ఇంట్లో ఉన్నవారు తమ ఇష్టవచ్చిన విధంగా నింపుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సతకపల్లి గ్రామంలో సర్వే జరగకపోవడంతో పంచాయతీ ఎదుట గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఇదే జిల్లా హుస్నాబాద్‌లోని 9వ వార్డులో కూడా ఇంకా ప్రారంభించలేదు. స్థానికులు ఆందోళనకు దిగారు. -
హైదరాబాద్‌లో రోడ్లు ఖాళీ
-
‘సర్వే’పై సవాలక్ష అనుమానాలు!
చర్చావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేపై తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పలు అనుమానాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫిలింనగర్ ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా భవన్లో శుక్రవారం చర్చావేదికను నిర్వహించారు. స్థానిక ఇంటింటి సమగ్ర సర్వే క్లస్టర్ ఆఫీసర్లు మల్లెల గిరి, జయకృష్ణతో పాటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ లక్ష్మీబాయి, ఫిలింనగర్ 18 బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మామిడి నర్సింగరావుతో పాటు 32 స్వయం సహాయక బృందాల అధ్యక్షురాళ్లు ఇందులో పాల్గొన్నారు. పలు అనుమానాలను వ్యక్తం చేయగా... వాటిని అధికారులు నివృత్తి చేశారు. బంజారాహిల్స్: ఇంటింటి సర్వే నిమిత్తం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లు పూర్తి స్నేహభావంతో మెలుగుతూ వివరాలు నమోదు చేసుకోవడమే కాకుండా వారికి వచ్చే అపోహలు కూడా తొలగిస్తారని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరూ అందుబాటులో లేకపోయినా వారికి సంక్షేమ పథకాలు అందవని అంటున్నారని ప్రజ్వల గ్రూప్ అధ్యక్షురాలు సాంబమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. యజమాని సరైన వివరాలు ఇస్తే చాలని క్లస్టర్ ఆఫీసర్ జయకృష్ణ వెల్లడించారు. సర్వే చేసే ఎన్యూమరేటర్లు అణువనువూ సోదా చేస్తారని వదంతులు వినిపిస్తున్నాయని సరస్వతి మహిళా గ్రూప్ అధ్యక్షురాలు సుగుణ, మహాలక్ష్మి గ్రూప్ అధ్యక్షురాలు చంద్రమ్మ, గంగ గ్రూప్ అధ్యక్షురాలు పద్మమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి ఇళ్లు కట్టుకున్నామని రెక్కాడితో డొక్కాడని స్థితిలో ఉన్నామని ఈ పరిస్థితిలో తెల్లరేషన్ కార్డు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నామని ధనలక్ష్మి గ్రూపు అధ్యక్షురాలు ధనలక్ష్మి, కనకదుర్గ గ్రూప్ అధ్యక్షురాలు పద్మ, తేజస్విని గ్రూప్ అధ్యక్షురాలు గోవిందమ్మ, జ్యోతి గ్రూపు అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ, కుందన గ్రూప్ అధ్యక్షురాలు కౌసల్య వాపోయారు. తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఎన్నడూ లేని విధంగా ఈ సర్వే ఏంటంటూ పలువురు మహిళలు దుయ్యబట్టారు. బ్యాంకు ఖాతా నంబర్లు ఇస్తే ప్రమాదం కదా అని శ్రీ రాజరాజేశ్వరి గ్రూప్ అధ్యక్షురాలు రమ్య ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద వారిని వదిలేసి మాలాంటి వాళ్లను లక్ష్యంగా పెట్టుకుంటారా అని బీజేఆర్ నగర్ సమాఖ్య అధ్యక్షురాలు మల్లీశ్వరి, బసవతారకం నగర్ సమాఖ్య అధ్యక్షురాలు యాదీశ్వరి అన్నారు. బడుగులకు వేధింపులా? సర్వే రోజున కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ సర్వే ఎందుకో తెలియడం లేదు. మా కార్డులు తొలగిస్తారని భయంగా ఉంది. బడుగులను వేధించకుండా బడాబాబులను లక్ష్యంగా పెట్టుకుంటే మంచిది. - ఆర్.విజయరత్నం, శ్రీ రాజరాజేశ్వరి మహిళా గ్రూపు ఆందోళన వద్దు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితమైన సమాచారం ప్రజల నుంచి స్వీకరించడానికే సర్వే జరుగుతున్నది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్ అంచనా వేయడానికి సర్వే చేస్తున్నాం. - మల్లెల గిరి, సర్వే క్లస్టర్ అధికారి -
అటు సర్వే...ఇటు సెలవులు!
-
19/8 ఆరోజు ఏంటి....
-
ఇంటింటి సర్వేపై తనిఖీ
-
ఇంటింటి సర్వేపై తనిఖీ
వచ్చే నెలలో ప్రత్యేక కార్యక్రమం అందులో తప్పులు తేలితే ప్రభుత్వ ప్రయోజనాలుండవు ఉప కులాలనూ వెల్లడించాల్సిందే.. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లు అనర్హులకు లబ్ధి చేకూరినట్లు ఫిర్యాదులు వస్తే విచారణ సాక్షి, హైదరాబాద్: సమగ్ర ఇంటింటి సర్వేతోనే ఈ ప్రక్రియ ముగిసిపోదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సర్వేలో వచ్చిన సమాచారం నిర్ధారణకు సెప్టెంబర్‌లో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19వ తేదీన నిర్వహించే సమగ్ర ఇంటింటి సర్వే సమాచారం కంప్యూటరీకరణ కార్యక్రవూన్ని సెప్టెంబర్ 4వ తేదీ నాటికి ముగించాలని నిర్ణయించింది. ప్రజలు ఇచ్చిన సమాచారాన్నే ఆధారంగా చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయురాదని, ఆ సమాచారం వాస్తవమా..? కాదా..? అన్న అంశాన్ని సవివరంగా తేల్చుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక బృందాల తనిఖీ తరువాత..సరైన సమగ్ర సమాచారాన్ని కంప్యూటర్లలో నమోదు చేయనున్నట్లు ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కావాలని తప్పుడు సమాచారం ఇస్తే నష్టం తప్ప ప్రయోజనం ఉండదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముందు ముందు ప్రభుత్వ పథకాలకు వారు అనర్హులయ్యే అవకాశవుుంటుందని ఆ వర్గాలు పేర్కొన్నారుు. సర్వే ఫార్మాట్లో పేర్కొన్న విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గంతోపాటు వారి ఉప కులాలను కూడా వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదు పేజీలున్న ఈ సర్వే ఫార్మాట్లో.. ఈ నిబంధనను కూడా ఉంచారు. దీని ద్వారా ఏయే కులాలు ఏ మేరకు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాయో స్పష్టం అవుతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ప్రభుత్వం అందించే ప్రతీ ప్రయోజనం అర్హులకు మాత్రమే చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆ వర్గాలు పేర్కొన్నారుు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, గృహాలు, భూ పంపిణీ లబ్ధిదారుల వివరాలన్నిటినీ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ లబ్ధిదారుల జాబితాను చూసి, అందులో బోగస్ లబ్ధిదారులున్నా.. అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నట్లు తేలినా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని అధికారవర్గాలు తెలిపారుు. విచారణలో అనర్హులకు లబ్ధి కలుగుతున్నట్లు తేలితే.. వారికిచ్చిన ప్రభుత్వ ప్రయోజనాన్ని రద్దు చేయనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆ పథకానికి అర్హుడైన పక్షంలో.. ఆ వ్యక్తిని సంబంధిత పథకానికి ఎంపిక చేస్తావుని అధికారులు తెలిపారు. అన్ని సంక్షేమ పథకాలు పూర్తి పారదర్శకతో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నావుని వివరించారు. లబ్ధిదారుల పేర్లన్నీ ఆయా ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో ఉంచుతావుని చెప్పారు. -
సర్వేపై అపోహలొద్దు
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేట: ఈ నెల 19న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేం దుకు వచ్చిన ఆమె సోమవారం రామాయంపేట, రాయిలాపూర్ గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 19న సర్వే చేపడుతున్నందున అందరు విధిగా ఇండ్లలో ఉండి సర్వే సిబ్బందికి సహకరించాలని, ఇండ్లలో లేని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవన్నారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారితో పాటు తహశీల్దార్, ఎంపీడీఓ సర్వే విషయమై సమీక్ష జరుపుతారన్నారు. హైదరాబాద్ శాంతి భద్రతల అధికారాలను గవర్నర్‌కు అప్పగించే విషయమై ఆమె మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న నియమ నిబంధనలనే మన రాష్ర్టంలో కూడా పాటించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కీలక పాత్ర పోషించారని, రాయిలాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి వారం రోజుల్లో జీఓ విడుదల కానుందని, దసరా నుంచి వృద్ధులు, వితంతువులకు పెరిగిన పింఛన్లు మంజూరవుతాయని తెలిపారు. ఒక ఏడాదిపాటు విద్యుత్ కోత ఉంటుందని, ఆ తరువాత 24 గంటల పాటు ఎలాంటి కోత లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందని, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం,మెదక్ ఆర్డీఓ వనజాదేవి, రామాయంపేట ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, ఎంపీడీఓ అనసూయబాయి, జెడ్పీటీసీ సభ్యురాలు బిజ్జ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చెర్మైన్ రమణ తదితరులు పాల్గొన్నారు -
సర్వే గడబిడ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇంటింటి సర్వే’ జిల్లా యంత్రాం గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సర్వేకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం గండంగా మారింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లోని జిల్లా పరిధి సర్వే బాధ్యత లు గ్రేటర్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నా.. గ్రామీణ ప్రాంతంలో సర్వే నిర్వహణకు తగి నంత ఉద్యోగులు లేకపోవడం ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నెల 19న గ్రేటర్ పరిధి మినహా 7,41,600 ఇళ్లలో ‘ఆర్థిక, సామాజిక సర్వే’ నిర్వహించేందుకు 28,447 మంది అవసరమని లెక్కగట్టారు. దీంట్లో కేవలం 17,617 మంది మాత్రమే అందుబాటులో ఉండడం, ఇంకా 10,830 మంది సిబ్బంది కొరత ఉండడం జిల్లా యంత్రాంగాన్ని వేధిస్తోంది. శుక్రవారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సర్వేకు సరిపడే స్థాయిలో సిబ్బందిని సమకూర్చుకోవడం కష్టతరంగా మారినందున, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారు. ఇటీవల ఎన్నికల విధుల్లో నూ వీరి సేవలు వినియోగించుకున్నామని, ఇప్పుడు కూడా ఆ వెసులుబాటు కల్పిస్తే సర్వే సిబ్బంది కొరతను అధిగమిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన రేమండ్ పీటర్.. ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తెలియజేస్తామన్నారు. ఇంటింటి సర్వేలో ప్రైవేటు ఉద్యోగులను వినియోగించుకోకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో దీన్ని సడలిస్తే కానీ గండం గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు. పట్టణ ప్రాంతాలను సర్వే నుంచి మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాలకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం పెద్ద కష్టంకాబోదని భావించిన అధికారగణానికి తాజా పరిణామం మింగుడు పడకుండా ఉంది. సర్వే నిర్వహణపై రెండు రోజుల్లో శిక్షణా తరగతులు నిర్వహించాల్సివుండగా, ఇప్పటివరకు సిబ్బంది సేకరణపై స్పష్టత రాకపోవడం చికాకు కలిగిస్తోంది. -
కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
రాంనగర్ :తెలంగాణ పునర్నిర్మాణంలో తొలి అడుగుకు ఉపయోగపడే సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. సమగ్ర కుటుంబ సర్వేపై సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మండల, పట్టణస్థాయి రిసోర్సు పర్సన్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ఒకే రోజు జరపడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారుల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వే కీలకం కానుందన్నారు. ఎంత వ్యయ ప్రయాసల కోర్చి అయినా ఒక్క రోజే సర్వే పూర్తి చేసి డేటా ఎంట్రీ నిర్వహించి సర్వే ఫారాలను ఆర్డీఓలకు అందజేయాలన్నారు. జిల్లాలో 9 లక్షలకు పైగా కుటుంబాలుంటే 10 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయని, మరో 4 లక్షల మంది రేషన్‌కార్డులు కొత్తగా కావాలని కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులన్నీ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేవని గ్రహించాలన్నారు. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేవిధంగా ఈ సర్వే దోహదపడుతుందని చెప్పారు. పింఛన్లు, గృహ నిర్మాణాలు, రేషన్‌కార్డులు, ఇతర లబ్ధి మొత్తం ఈ సర్వే డేటా ఆధారంగానే ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. గతంలో చాలా రకాల సర్వేలు చేసినా ఈ సర్వేకు చాలా తేడా ఉన్నట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలు చోటు చేసుకోకుండా సర్వే ద్వారా పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. గృహాల సర్వే విషయంలో వయస్సు నిర్ధారణ కోసం రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు పరిశీలించాలని అధికారులకు సూచించారు. సమాచార సేకరణ అనేది ఒక కళ అని, సమాచార సేకరణలో వృత్తి నైపుణ్యం ప్రదర్శించి సమగ్ర సమాచారం సేకరించాలని కోరారు. సర్వే కోసం ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఎక్కువ నివాసాలు ఉన్న బ్లాకులకు సహాయ నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ఇద్దరు సహాయకులతో వెళ్లి నివాసాలకు నోటిఫైడ్ నంబరు కేటాయించి జాబితాలను ఎన్యుమరేటర్లకు అందజేయాలని సూచిం చారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 30 ఇళ్లు కేటాయిస్తామని, 9 లక్షల కుటుంబాలకు గాను 32 వేల మంది సిబ్బంది నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే మరో 5 శాతం అదనపు సిబ్బంది సేవలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీపీఓ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌రావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
19న ఇల్లు కదలొద్దు
ఆ రోజు వివరాలు నమోదు చేయించుకుంటేనే సంక్షేమ పథకాలు ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన సాక్షి, హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఈ నెల 19న తమ సొంత గ్రామాల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ రోజు అన్ని వివరాలను నమోదు చేసుకోకుంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకునే అవకాశం ఉండదని చెప్పారు. శుక్రవారం హెచ్ఐసీసీలో జరిగిన సదస్సులో కేసీఆర్ మాట్లాడుతూ... ప్రజలంతా ఈ సర్వేను అత్యంత ప్రాధాన్యమైన విషయంగా పరిగణించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సర్వే విధుల్లో పాల్గొంటామని ఉద్యోగులు ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సర్వే రోజును ఉద్యోగులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని, సర్వే బృందాలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా ఉద్యోగులకు సీఎం పలు వరాలు ప్రకటించారు. తహసీల్దార్, ఎంపీడీవోలు, ఇతర అధికారులకు వాహన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణం మంజూరు చేయడంతో పాటు నెలవారీ అలవెన్సు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. తహసీల్దార్లు సొంత జిల్లాల్లో ఉద్యోగం చేయొద్దన్న నిబంధనను రద్దు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో జయశంకర్ మెమోరియల్, విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగా, తెలంగాణ జిల్లాల్లో నివాసముంటున్న సీమాంధ్రులంతా ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలతో మమేకమై ఉన్నందున వారితో ఏ ఇబ్బందీ లేదని సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ప్రభుత్వం ముందున్న సమస్యల్లా హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్రులతోనేనని పేర్కొన్నట్లు సమాచారం. -
ఒక్క క్లిక్‌తో ఇంటిగుట్టు
-
19న ‘సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’..
-
ఒక్క క్లిక్‌తో ఇంటిగుట్టు
19న ‘సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’.. పకడ్బందీ ఫార్మాట్‌తో వివరాల సేకరణ కులం, మతం, ఇళ్లు, ఆస్తిపాస్తుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల దాకా.. విద్యార్హతలు, ఉద్యోగం నుంచి పొందుతున్న సబ్సిడీల దాకా నమోదు తప్పుడు సమాచారమిస్తే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలకు అనర్హతే కుటుంబ యజమానితో ధ్రువీకరణ సంతకం 4 లక్షల మందితో ఒకే రోజు నిర్వహణ.. ఎన్నికల తరహాలో ఏర్పాట్లు పోలీసు సిబ్బందితోనూ (సివిల్ దుస్తుల్లో) సర్వే సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రభుత్వ ముద్రతో స్టిక్కర్! 19న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు.. సర్వేపై 11న ఎన్యూమరేటర్లు, రిసోర్స్ పర్సన్లకు శిక్షణ సాక్షి, హైదరాబాద్: ఒక్క క్లిక్ చేస్తే చాలు.. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలూ ఆవిష్కృతమవుతాయి. కుటుంబంలోని వారికి ఉన్న ఇళ్లు, ఆస్తిపాస్తుల నుంచి.. ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులున్నాయా? అనే అంశం దాకా పూర్తి వివరాలు తెలిసిపోతాయి. రేషన్, ఆధార్ కార్డుల వివరాల నుంచి ఆదాయపన్ను దాకా... మొత్తంగా చెప్పాలంటే కుటుంబం చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించనున్న ‘సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’లో సేకరించనున్న వివరాల ఫార్మాట్ ఇది.. ఐదు పేజీలున్న ఈ ఫార్మాట్లో కుటుంబ సభ్యుల పేర్లు, కులం, మతం, రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు, గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్లతో పాటు విద్యార్హతలు, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, పొందుతున్న సబ్సిడీలు, పెన్షన్లు, చెల్లిస్తున్న ఆదాయపన్ను వంటి అంశాలు, స్థిరచరాస్తులు, పశు సంపద వివరాలనూ పొందుపర్చాల్సి ఉంది. అంతేగాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏవైనా వ్యాధులున్నాయా? అందులో కేన్సర్, గుండె జబ్బు, క్షయ, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారెవరున్నారు? అనే వివరాలను కూడా నమోదు చేసేలా ఫార్మాట్‌ను రూపొందించారు. జిల్లాకు రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19వ తేదీన అన్ని జిల్లాల్లో ‘సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే’ నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు రాత్రి 8.30 వరకూ హెచ్ఐసీసీలో సుదీర్ఘంగా జరిగిన సదస్సులో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్వే నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ. రెండు కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంటింటి సర్వే చేసే ఎన్యుమరేటర్లకు, రిసోర్స్ పర్సన్లకు ఈ నె ల 11వ తేదీన ఆర్డీవో కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించని వారిని కూడా ఈసారి సర్వే కోసం వినియోగించుకోనున్నారు. ఆ డేటాబేస్ మొత్తం సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు. 19వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తయినట్లు ఆయా ఇళ్లకు తెలంగాణ రాష్ట్ర ముద్ర స్టిక్కర్ వేయాలని వచ్చిన ప్రతిపాదనకు సీఎం స్పందిస్తూ.. బాగానే ఉంటుందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన.. అత్యంత పకడ్బందీగా చేపడుతున్న ఈ సర్వేను ఒక్కరోజులోనే పూర్తి చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. ఒక్కో ఉద్యోగి సగటున 20 నుంచి 25 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించారు. సర్వేకు పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమైనందున ఇందులో పోలీసులను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా సివిల్ దుస్తుల్లో పోలీసులు సర్వే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సర్వే సిబ్బందికి రవాణా, వసతి, భోజన సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా రవాణా సమస్య తలెత్తకుండా ఉండేందుకు.. సర్వే నిర్వహించే రోజున అవసరమైన మేరకు ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఎంగేజ్ చేసుకునే పనిలో పడ్డారు. పోలింగ్ తరహాలో.. సమగ్ర కుటుంబ సర్వే కోసం ఎన్నికల పోలింగ్ తరహాలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోనుంది. తాము ఏగ్రామంలో, ఏయే కుటుంబాలను సర్వే చేయబోతున్నామనే సంగతిని సర్వే సిబ్బందికి చివరి నిమిషం వరకు తెలియనివ్వరు. 19వ తేదీన ఉదయానికల్లా ప్రత్యేక వాహనాల్లో ఉద్యోగుల(ఎన్యుమరేటర్ల)ను సర్వే నిర్వహించాల్సిన గ్రామంలో దించుతారు. ఆ వెంటనే వారు ఏయే కుటుంబాల ఇళ్లకు వెళ్లి సర్వే చేయాలో తెలిపే జాబితాను ఎన్యుమరేటర్లకు అధికారులు అందజేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలను సేకరించి తిరిగి అదే వాహనంలో సాయంత్రానికి మండల కేంద్రానికి వెళ్లి అక్కడున్న అధికారులకు అందజేయాలి. పోలింగ్ రోజున ఓటింగ్ యంత్రాలను మండల కేంద్రాల్లో అప్పగించిన తరహాలోనే ఎన్యుమరేటర్లు కూడా సర్వే పత్రాలను అందచేయాల్సి ఉంటుంది. ఆ సర్వే పత్రాల్లోని సమాచారాన్ని కంప్యూటర్ ఆపరేటర్లు కంప్యూటర్లో నమోదు చేసి మండల అధికారి నుంచి జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు సహా ముఖ్యమంత్రి కార్యాలయాలకు అనుసంధానం చేస్తారు. తప్పుడు సమాచారమిస్తే అనర్హులే.. సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్లో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే సదరు లబ్ధిదారుడు ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీని రద్దుచేయడంతో పాటు భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు పొందేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు. సదరు సర్వే ఫార్మాట్లోని చివరి పేజీలో ఈ ధ్రువీకరణను కూడా పొందుపరిచి కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. దీంతోపాటు సదరు కుటుంబ యజమాని వెల్లడించిన వివరాలన్నీ నిజ మా? కాదా? అని నిర్ధారించుకోవాల్సిన బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఒకవేళ అధికారులు తప్పు చేశారని భావిస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దు.. సర్వే సమయంలో కాని, సర్టిఫికేట్ల మంజూరు సమయంలో కాని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఒకసారి పోస్టింగ్ అయిన అధికారులను రెండేళ్ల వరకు కదిలించబోమని కూడా ఆయన మరోమారు హామీ ఇచ్చారు. -
‘సర్వే’యర్ల కొరత !
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇంటింటి సర్వే’ జిల్లా యంత్రాంగానికి కత్తిమీదసాములా మారింది. ఈ నెల 19న ఒకేరోజు సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో ఉద్యోగులను సమకూర్చుకోవడం అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. జిల్లాలో 13 లక్షల ఇళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు 54వేల మంది సిబ్బంది అవసరమని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు 30వేల మంది ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు వీరందరినీ పోలింగ్ విధులకు వినియోగించుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సంఖ్యకంటే అదనంగా మరో 14వేల మంది అవసరం కానుండడంతో ఏంచేయాలో అధికారగణానికి పాలుపోవడంలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం కేసీఆర్ ఆయా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ‘సమగ్ర సర్వే’ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను కలెక్టర్ ఎన్.శ్రీధర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, సర్వేకు సరిపడా ఉద్యోగులు లేనందున.. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలోనే ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సర్వే విధానంపై విడిగా సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. పక్కాగా ‘స్థానికత’ సమగ్ర సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ‘ఫాస్ట్’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసినందున.. స్థానికత ధ్రువీకరణ పత్రాల మంజూరులో అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు చెప్పారు. సేకరించిన సర్వే వివరాలను రెండు వారాల్లో కంప్యూటరీకరించాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. సమగ్ర సర్వేకు 54వేల మంది సిబ్బంది అవసరమని, ఆ మేరకు సమీకరించుకునేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాలో విరివిగా మొక్కలు నాటాలని సీఎం చెప్పారన్నారు.