
కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాలు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాయి. వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు సర్వే చేస్తున్నారు. ఇంటింటి సర్వే కారణంగా కరోనా పాజటివ్ రేట్ తగ్గు ముఖం పడుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా, కోవిడ్ విజృంభణకు అడ్డుకట్టవేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌తో పాటు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ‘టౌటే’ తుపాను ధాటికి కకావికలం అయిన మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నిర్మల్ జిల్లా గాంధీనగర్ సమీపంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మంగళవారం గోదావరి తీరంలో జింకలు సందడి చేస్తున్న దృశ్యం ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్

మహబూబాబాద్ జిల్లా బీబీనాయక్ తండాలో ఇంటింటి సర్వే చేస్తున్న అంగన్‌వాడీ టీచర్ బోడ పద్మ

లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా కనిపిస్తున్న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ రోడ్డు

గుజరాత్‌లోని ఉనా పట్టణంలో ‘టౌటే’ తుపాను ధాటికి కూలిన ఇల్లు

ఢిల్లీలో లాక్‌డౌన్ కొనసాగుతుండగా వలస కార్మికులు, నీడ లేనివారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి సిఖ్ వలంటీర్లు మంగళవారం ఆహారం వండి వడ్డించారు.

టౌటే తుఫాన్ ప్రభావంతో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద కూలిపోయిన బ్రిటీష్ కాలం నాటి రక్షణ గోడ

ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మంగళవారం తెరుచుకున్నాయి. కోవిడ్ ఆంక్షల దృష్ట్యా భక్తులను అనుమతించలేదు. ఆలయ పూజారులు పూజలు చేశారు.

టౌటే తుఫాన్ తదనంతరం ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు

మొరాకో వైపు నుంచి తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు సముద్రమార్గాన వస్తున్న యువతను స్యూటా వద్ద సరిహద్దుల్లో అడ్డుకుంటున్న స్పెయిన్ భద్రతా సిబ్బంది.
Comments
Please login to add a commentAdd a comment