
కరోనా కష్టకాలంలోనూ చాలా మంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ఫ్రంట్‌లైన్ వారియర్స్ మాత్రం పండగలు పబ్బాలు లేకుండా అహోరాత్రులు విధుల నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. విధుల నిర్వహణే పండగలా భావిస్తున్నారు. మరోవైపు కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు రైలు మార్గాల ద్వారా ప్రాణవాయువును ఆగమేఘాల మీద తరలిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలను పాటించేందుకు కొంత మంది వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇదిలావుంటే నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు పడుతున్న కష్టాలు గుండెలను పిండేస్తున్నాయి.

స్టీల్ సామాన్ అమ్ముతూ సంచార జీవనం గడిపే ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలసి కొన్ని నెలలుగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జీవనం సాగిస్తోంది. లాక్‌డౌన్‌తో పిల్లల కడుపు నింపడం కష్టంగా మారింది. దీంతో సొంతూరైన సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు వెళ్లాలని నిర్ణయించుకుంది. బస్సులు లేకపోవటంతో తట్టాబుట్టా సర్దుకొని పిల్లలతో కాలినడకన ఊరికి బయలుదేరింది. మధ్యాహ్నం ఎండ మండే సమయంలో వారి పిల్లలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కాలుతున్న కాళ్లతోనే సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని ఊరికి తల్లిదండ్రుల వెంట నడకసాగించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు పయనమవుతున్నారు హైదరాబాద్ నగరవాసులు. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద గంటల తరబడి వేచి చూడాల్సివస్తోంది.

హైదరాబాద్: రంజాన్ పర్వదినం నేపథ్యంలో గురువారం చార్మినార్ వద్ద దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. మధ్యాహ్నం సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎల్బీనగర్ ఫ్లైఓవర్ గురువారం మధ్యాహ్నం ఇలా కనిపించింది.

లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తూనే గురువారం రాత్రి హైదరాబాద్ మక్కా మసీదు వద్ద నమాజ్ చేస్తున్న పోలీసులు

ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా తెలంగాణకు 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ వచ్చింది. ఆరు కంటైనర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా గురువారం హైదరాబాద్ చేరుకుంది.

రాజమహేంద్రవరంలో ఆక్సిజన్ బెడ్స్‌తో ఉన్న స్పెషల్ బస్సును గురువారం ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు. ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాల’ పేరుతో పిలిచే ఈ బస్సులో 12 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు బస్సుల్లో అత్యవసర చికిత్స అందించేందుకు దీన్ని రూపొందించారు.

కరోనా నేపథ్యంలో ఓ రేషన్ డీలర్ అమలు చేస్తున్న సరికొత్త ఐడియా అందరినీ ఆకట్టుకుంటోంది. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలంలోని రామన్నపేటలో రేషన్ డీలర్.. భౌతిక దూరం పాటించడం కోసం ఇలా ఓ పైప్‌ను ఏర్పాటు చేసి వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు.

డ్రైవర్ అతివేగం, తెల్లవారుజామున ప్రయాణంలో ఆకస్మికంగా రెప్పవాల్చడం ఓ పెను ప్రమాదానికి దారితీసింది. నలుగురి ప్రాణాలను తీసేసింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రోడ్డులో గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

ఇజ్రాయెల్, పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకరస్థాయిలో ఘర్షణ కొనసాగుతోంది. గాజా స్ట్రిప్ వైపు ఇజ్రాయెల్ సైన్యం ఫిరంగులను ప్రయోగిస్తున్న దృశ్యం.
Comments
Please login to add a commentAdd a comment