ramadan festival
-
రంజాన్ : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ప్రార్థనలు (ఫొటోలు)
-
India Mosques: రంజాన్ స్పెషల్ దేశంలో ప్రముఖ మసీదుల ఫొటోలు
-
రంజాన్ స్పెషల్ : విద్యుత్ కాంతులతో జిగేల్మంటున్న చార్మినార్ (ఫొటోలు)
-
విజయవాడ : రంజాన్ ఘుమఘుమలు (ఫొటోలు)
-
రంజాన్ ఉపవాసాలపై డబ్యూహెచ్ఓ మార్గదర్శకాలు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ మాసం. ఈ రంజాన్ మాసం భారత్‌లో మార్చి 12( మంగళవారం) నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవికాలం. ఈ నేపథ్యంలో ఆ ఉపవాసలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే యత్నం చేయమని కోరింది. ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలిన సూచించింది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది కాబట్టి డీ హైడ్రేట్ అయ్యి అలిసిపోకుండా ఉండేలా బలవర్థకమైన ఆహారం తీసుకోమని సూచించింది. తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని సూచించింది. అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్‌తో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దని చెబుతోంది. అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఉత్తమని చెబుతోంది. అలాగే కాస్త వ్యాయామం చేయమని చెబుతోంది. ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని సూచించింది. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండమని ఆరోగ్య సంస్థ కోరింది. ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోమని సూచించింది. (చదవండి: ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!) -
ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. మక్కాలో చంద్రుని దర్శనం ఆధారంగా రంజాన్ మాసం భారత్‌లో ఎప్పుడూ ప్రారంభమవుతుందనేది నిర్ణయిస్తారు ముస్లీం మత పెద్దలు. నెలవంక ఆకారంలో ఉండే చంద్రుడు ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం దర్శనం ఇచ్చింది. కాబట్టి మార్చి 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. అంటే ఈ ఏడాది మన దేశంలో ఇవాళ(మార్చి 12వ తేదీ (మంగళవారం)) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఎలా జరుపుకుంటారంటే.. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసం. ఈ నెలల్లో ముస్లీంలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసకాలంలో వారు రెండు సార్లు ఆహారాన్ని స్వీకరిస్తారు. వాటిని సుహూర్, ఇఫ్తార్‌గా పిలుస్తారు. ఇఫ్తార్ అనేది సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారం. సుహూర్ అంటే తెల్లవారుజామున తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉపవాస దీక్ష విరమించుకునే రోజు సాయంత్రం తమ కుటుంబం\ సభ్యులను బంధువులను పిలచుకుని ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. అంతేగాదు ఈ మాసంలో దాన ధర్మాలు, పేదలకు ఆహారం అందించడం వంటవి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉపవాస సమయాల్లో వ్యత్యాసం.. ఈ ఉపవాస సమయాలు ప్రపంచవ్యాప్తంగా మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి ఉపవాస సమయం వ్యవధి చాలా విభిన్నంగా ఉంటుంది. దక్షిణార్థ గోళంలో సూర్యని వంపు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటంలో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి నార్వేలోని ఓస్లోలో ముస్లింలు దాదాపు 15 గంటల 15 నిమిషాల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అదే లండన్‌లో దాదాపు 14 గంటల 11 నిమిషాల పాటు ఉపవాసం ఉంటారని స్టాటిస్లా నివేదిక పేర్కొంది. ఇక జకర్తాలో ఉపవాసం నిడివి సుమారు 13 గంటల నుంచి 13 నిమిషాలు ఉంటుందని స్టాటిస్లా నివేదిక అంచనా వేసింది. #Ramadan starts on Sunday evening, with the first day of fasting on Monday, March 11 this year. While the number of days of Ramadan are equal for all Muslims observing it around the world, the length of the daily fast is not. — Statista (@StatistaCharts) March 8, 2024 (చదవండి: నేటి నుంచే రంజాన్ మాసం ప్రారంభం!) -
Ramadan: మెగాస్టార్‌ని కలిసిన అలీ అండ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఏపీలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు
-
సమతా మమతల పర్వం రమజాన్.. ప్రాముఖ్యత ఇదే..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ప్రధానమైనవి. అనాదిగా ఇవి చలామణిలో ఉన్నవే. ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పండుగ (ఈద్ ) అలాంటిదే. రమజాన్ నెలతో దీనికి సంబంధం ఉండడంతో అదే పేరుతో ప్రసిధ్ధి గాంచింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత ప్రాప్తం కావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళకి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి వెలుగును, జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికింతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాసవ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ నెల మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. ఇకపోతే, వెయ్యి నెలలకంటే విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా రమజాన్‌లోనే ఉంది. అందుకని శక్తివంచన లేకుండా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేస్తారు. రమజాన్ మాసాంతంలో ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజుకు వెళతారు. ఆ రోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ‘ఈద్ ’ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం. మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే, అలాంటి వారిని దైవం తన కారుణ్య ఛాయలోకి తీసుకుంటాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయబోమని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని, సన్మార్గం వైపుకు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా, దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి.ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్ఠలతో గడిపారో ఇకముందు కూడా ఇదే çస్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈ విషయాల పట్ల శ్రధ్ధ వహించకపోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా నెల్లాళ్ళ పాటు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు ఈద్ రోజున దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటారు. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి, స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు చేస్తారు. ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి, అత్తరులాంటి సువాసనలు వినియోగిస్తారు. ఈద్ గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ (వేడుకోలు) చేస్తారు. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తారు. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువు బారినుంచి, దుష్టపాలకుల బారినుంచి, కరవుకాటకాల నుంచి, దారిద్య్రం నుంచి తమను, తమ దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, విశ్వమానవాళినంతటినీ కాపాడమని కడు దీనంగా విశ్వప్రభువును వేడుకుంటారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు, పరిచితులు, అపరిచితులందరితోనూ సంతోషాన్ని పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈవిధంగా ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావపూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుంది. మానవీయ విలువల పరిమళాన్ని వెదజల్లుతుంది. దైవభక్తిని, దైవభీతిని, బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని, ఇంకా అనేక సుగుణాలను జనింపజేస్తుంది. ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... – యండి. ఉస్మాన్ ఖాన్ ఈద్ నమాజ్ ఇలా... అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ప్రారంభంలో రెండు రకతుల ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, ‘అల్లాహు అక్బర్’ అని రెండు చేతులూ పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’ పఠించి, మళ్ళీ ‘అల్లాహు అక్బర్’ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్న సూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు. తరువాత రెండవ రకతు కోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి, మూడుసార్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ మూడుసార్లూ చేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాలుగోసారి ‘అల్లాహు అక్బర్’ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు, తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ అన్ని సందర్భాల్లో వెనుక బారులు తీరిన భక్తులంతా ఇమాంను అనుసరిస్తారు. ఈద్ నమాజులో అజాన్ , అఖామత్లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థిలను అన్వయిస్తూ సమాజానికి మార్గదర్శక సందేశం ఇస్తాడు. తరువాత దుఆతో ఈద్ ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ‘ఫిత్రా’ పరమార్థం పవిత్ర రమజాన్ మాసంలో ఆచరించబడే అనేక సత్కార్యాల్లో ‘ఫిత్రా’ ఒకటి. ఫిత్రా అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధర్మశాస్త్ర పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్ ’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుంచే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆదేశించారు.మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏ రూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు. కనుక పవిత్ర రమజాన్ మాసంలో చిత్తశుద్ధితో అన్నిరకాల ఆరాధనలు ఆచరిస్తూ , ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. ఈ పవిత్ర మాసంలో ఏదో ఒక రకంగా, ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి, తమ పరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది! అల్లాహ్ అందరికీ రమజాన్‌ను సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. -
నేడు రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: దక్షిణాధి, ఉత్తరాది రాష్ట్రాల్లో నెలవంక కనబడటంతో ఈ నెల 22న (శనివారం) రంజాన్ పండుగ జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ(నెలవంక నిర్ధారణ కమిటీ) ప్రతినిధి ముఫ్తీ సయ్యద్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం మొజంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆకాశంలో మబ్బులు ఉండటంతో హైదరాబాద్‌లో నెలవంక కనబడలేదని, తెలంగాణలోని పలు జిల్లాల్లో అది కనబడినట్లు నిర్ధారణ అయిందని, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. దీంతోపాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నెలవంక కనిపించినట్లు సమాచారం అందిందని చెప్పారు. నెల రోజులపాటు కఠోర ఉపవాసాలు ఉండి దైవప్రసన్నత కోసం పాటించిన ఉపవాసాలు అల్లా స్వీకరించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా శాంతిపూర్వక వాతావారణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. రంజాన్ పండుగ(ఈదుల్ ఫితర్) నమాజ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈద్గాలతోపాటు దాదాపు అన్ని మసీదుల్లో ఉందన్నారు. పలు ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం మైదానాల్లో కూడా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయా ఈద్గాలు, మసీదులు, మైదానాల్లో ఈదుల్ ఫితర్ నమాజ్ ఉదయం 6:30 గంట నుంచి 10:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
రంజాన్ 2023: యెమెన్‌లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం
సనా: యెమెన్ దేశంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానికులకు తలో 7 డాలర్లమేర ఉచిత నగదు పంపిణీ కార్యక్రమం చివరకు ఘోర విషాదంతో ముగిసింది. వందల సంఖ్యలో జనం తరలిరావడం, వారిని అదుపుచేసేందుకు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు గాల్లోకి కాల్పులు జరపడం, ఆ తూటాలు తగిలి విద్యుత్ తీగల వద్ద పేలిన శబ్దాలతో భయపడిన పేదజనం పరుగెత్తారు. దీంతో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది. యెమెన్ రాజధాని సనా సిటీలోని ఓ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ తొక్కిసలాటలో చిన్నారులు, మహిళలుసహా 78 మంది ప్రాణాలుకోల్పోయారు.73 మంది గాయపడ్డారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. ఓల్డ్‌సిటీ పరిధిలోని బాబ్ అల్–యెమెన్ ప్రాంతంలోని మయీన్ స్కూల్లో బుధవారం అర్ధరాత్రివేళ ఈ ఘోరం సంభవించింది. నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో విఫలమవడంతో దాతలైన ఇద్దరు స్థానిక వ్యాపారవేత్తలను అరెస్ట్చేశామని హౌతీ రెబల్స్ నేతృత్వంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దారుణ మానవ విపత్తు 2014లో యెమెన్ ఉత్తర ప్రాంతంపై పట్టు కోల్పోయిన హౌతీ తిరుగుబాటుదారులు ఆ తర్వాతి ఏడాదే దేశ రాజధానిని తమ వశంచేసుకుని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. అదే ఏడాది గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి ప్రయత్నించినా ఇంతవరకూ సాధ్యపడలేదు. ఆ ఆగ్రహమే పలు మలుపులు తిరిగి నాటి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య శత్రుత్వాన్ని కొనసాగింది. ఇన్నాళ్లలో అక్కడి ఘర్షణల్లో 1,50,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో పౌరులు, సైనికులను పొట్టనబెట్టుకున్న ఈ సంఘర్షణ ప్రపంచంలోనే అత్యంత దారుణ మానవసంక్షోభాల్లో ఒకటిగా నిలిచింది. 2.1 కోట్ల దేశజనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలు అంతర్జాతీయ సాయంకోసం అర్రులుచాస్తున్నారు. -
నేడు నెలవంక కనపడితే 22న రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్ పండుగ ఉంటుందని, లేని పక్షంలో ముస్లింలు ఆదివారం పండుగను జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ ఖలీల్ అహ్మద్ చెప్పారు. రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ ) శుక్రవారం దీనిపై స్పష్టతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇస్లాంలో రంజాన్ చివరి శుక్రవారానికి ఎక్కువ ప్రధాన్యం ఇస్తారు. ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీస్సులు పొందుతారు. జుమ్మతుల్ విదాను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అన్ని మసీదుల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదులో జుమ్మతుల్ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యలో ఆయా జోన్లలో మసీదు పరిసరాలను శుభ్రం చేశారు. ఈద్గాలలో నమాజ్ కోసం ఏర్పాట్లు: శని లేదా ఆదివారం రంజాన్ పండుగ నేపథ్యంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఈద్గాలలో పండుగ రోజు నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈద్గాల కమిటీలకు కూడా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్‌లోని మీరాలం, మాదన్నపేట్ ఈద్గాలను సందర్శించి ఏర్పాట్లు సమీక్షించామన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని పలు మైదానాల్లో కూడా రంజాన్ పండుగ నమాజ్ కోసం ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించామని తెలిపారు. -
Ramadan Month: నేటి నుంచి రంజాన్..
సాక్షి, హైదరాబాద్: నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, మూడేళ్లుగా కరోనాతో నగరంలో రంజాన్ సందడి అంతగా కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో రంజాన్ కళ మళ్లీ తిరిగి రానుంది. ఒకవైపు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ..మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి. చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మల్లేపల్లితో, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్లు వెలిశాయి. వ్యాపార సంస్థలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఆదర్శ జీవనానికి రంజాన్ మాసం ప్రేరణ: సీఎం సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంత జీవనం దిశగా ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ఖురాన్ పఠనం, ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, జకాత్, ఫిత్రా వంటి ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత, జీవిత పరమార్థం అవగాహనలోకి వస్తాయని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. -
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో "రంజాన్" కళ (ఫొటోస్)
-
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
కళ్యాణదుర్గం/ అనంతపురం శ్రీకంఠం సర్కిల్: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సేవాభావం, సోదర భావంతో మెలగాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా జీవించేలా అల్లా ఆశీర్వదించాలని ప్రార్థించారు. ముస్లింల జీవితాల్లో రంజాన్ పండుగ వెలుగులు నింపాలని కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ ఆకాంక్షించారు. -
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. #EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2022 -
Photo Feature: జనులారా! జర సోచో..
కరోనా కష్టకాలంలోనూ చాలా మంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ఫ్రంట్‌లైన్ వారియర్స్ మాత్రం పండగలు పబ్బాలు లేకుండా అహోరాత్రులు విధుల నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. విధుల నిర్వహణే పండగలా భావిస్తున్నారు. మరోవైపు కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు రైలు మార్గాల ద్వారా ప్రాణవాయువును ఆగమేఘాల మీద తరలిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలను పాటించేందుకు కొంత మంది వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇదిలావుంటే నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు పడుతున్న కష్టాలు గుండెలను పిండేస్తున్నాయి. -
ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... శుభాల పరిమళం..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు మానవ అంతరంగం ఆనందంతో పులకించడం సహజం. అలాంటి వాటిలో పండుగలు ముఖ్యమైనవి. వాటిలో రంజాన్ ఇంకా ముఖ్యమైనది. ముస్లిం సోదరులు జరుపుకునే ‘ఈద్’కి రంజాన్ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత రావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటును చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం ఈద్. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయం అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు ఈద్. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో, ఈ అశాశ్విత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదన్నదికూడా అంతే సత్యం. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్టలతో గడిపారో ఇకముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈవిషయాలపట్ల శ్రద్ధ వహించక పోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్ గాహ్‌లలో కాకుండా మసీదులలోనే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ చేయాలి. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి,కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవాలి. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, పరిచితులు, అపరిచితులందరితో సంతోషాన్ని పంచుకోవాలి. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అన్ని సందర్భాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావి జీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
రేపే రంజాన్
సాక్షి హైదరాబాద్: ఈద్–ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను ఈనెల 14న జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ( నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుతారీ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో బుధవారం ఎక్కడా నెలవంక కనిపించలేదన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని.. శుక్రవారం రంజాన్ జరుపుకోవాలని సూచించారు. కాగా, కరోనా కారణంగా ఈద్గా, మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని అన్ని ధార్మిక సంస్థల మతగురువులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. -
ఇళ్లల్లోనే రంజాన్ జరుపుకోండి
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్‌ను కొనసాగుతున్నందున రంజాన్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలవంక సమయాన్ని బట్టి ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో నిర్వహించుకునే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈద్ ఉల్ ఫిత్రా, సామూహిక నమాజ్‌లను పూర్తిగా నిషేధించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ విడుదల చేశారు. ఇదిలావుండగా.. కరోనా కట్టడికి సామాజిక బాధ్యతగా ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలివీ.. ► రంజాన్ రోజున మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో 50 మందికి మించి పాల్గొనకూడదు. ► ప్రార్థనల్లో పాల్గొనే వారు మాస్క్ ధరించి కనీసం ఆరు అడుగుల చొప్పున భౌతిక దూరం పాటించాలి. ► ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య రెండు విడతల్లో 50 మంది చొప్పున ప్రార్థనలు చేసుకోవచ్చు. ► మాస్క్ లేని ఏ ఒక్కరినీ మసీదుల్లోకి అనుమతించకూడదు. ప్రార్థనలకు ముందు నిర్వహించే వాదును ఇళ్ల వద్దే పూర్తి చేసుకోవాలి. నేలపై కూర్చునేందుకు మేట్లను ఇంటినుంచి తెచ్చుకోవాలి. ► మసీదు ప్రవేశ ద్వారం వద్ద తగిన సంఖ్యలో శానిటైజర్స్‌ను అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరి చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. ► వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలి. ► ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునేందుకు చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి. -
పవిత్ర రమజాన్: జిబ్రీల్ దుఆ .. ప్రవక్త ఆమీన్
అది పవిత్ర రమజాన్ మాసం. శుక్రవారం రోజు. ముహమ్మద్ ప్రవక్త(స) జుమా ఖుత్బా కోసం మింబర్ (వేదిక) ఎక్కుతున్నారు. కుడికాలు మొదటి మెట్టుపైపెడుతూనే ‘ఆమీన్’ అన్నారు. అలా రెండవ మెట్టు, మూడవ మెట్టు అధిరోహిస్తూ ఆమీన్ .., ఆమీన్ అని పలికారు. జుమా సమావేశంలో పాల్గొన్న సహచరులకు ఏమీ అర్థం కాలేదు. ప్రవక్తవారు ఈ రోజేమిటీ.. అసందర్భంగా ఆమీన్ .. ఆమీన్ అని ముమ్మారు పలికారు. అని గుసగుసలాడుకున్నారు. ఇదే విషయాన్ని ప్రవక్తవారిని అడిగారు. దానికాయన, ‘నేను ప్రసంగం కోసమని వేదికనెక్కుతూ మొదటి మెట్టుపై కాలుమోపుతుండగా జిబ్రీల్ వచ్చారు. ఎవరైతే రమజాన్ మాసాన్ని పొంది, దాని ఉపవాసాలు పాటించి తమను తాము నరకాగ్ని నుండి రక్షించుకునే ప్రయత్నం చేసుకోలేదో, వారిపై దేవుని శాపం అవతరించుగాక.. అన్నారు. దానికి నేను ఆమీన్ అన్నాను. రెండవ మెట్టుపై కాలు మోపుతుండగా, ఎవరైతే వృద్ధ తల్లిదండ్రులకి సేవలు చేసి స్వర్గాన్ని పొందే అర్హత సాధించలేదో వారిపై దేవుని శాపం పడుగాక.. అన్నారు. దానికీ నేను ఆమీన్ అన్నాను. మూడవ మెట్టుపై పాదం మోపుతుండగా, ఎవరైతే మీ పేరు అంటే, ‘ముహమ్మద్’ అని పలికి, లేక విని దురూద్, సలాం పలకలేదో వారిపై దేవుని శాపం అవతరించుగాక.. అన్నారు. అప్పుడు నేను ఆమీన్ అన్నాను’. అని వివరించారు ప్రవక్త మహనీయులు. దైవదూతల్లో అత్యంత ఆదరణీయులు, దైవదూతల నాయకుడూ, హజ్రత్ ఆదం అలైహిస్సలాం మొదలు, మొహమ్మద్ ప్రవక్త(స) వరకూ ప్రతీ దైవప్రవక్తకూ దేవుని దగ్గరినుండి సందేశం తీసుకు వచ్చిన జిబ్రీల్ దుఆ చేయడం, ముహమ్మదుర్రసూలుల్లా వారు ఆ దుఆకు ఆమీన్ (తథాస్తు) పలకడమంటే దీనికి ఎంతగొప్ప ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. కనుక రమజాన్ ఉపవాసాలను ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకుండా నియమ నిష్టలతో, అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి. ఆదరించాలి. వారి బాగోగులు చూడాలి. తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం, వారిబాగోగులు చూడక పోవడం దైవాగ్రహానికి దారి తీసేప్రమాదం ఉంది. ఇదే విధంగా ముహమ్మద్ ప్రవక్తవారిపై సలాములు పంపుతూ ఉండాలి. అంటే తరచుగా దురూదె షరీఫ్ పఠిస్తూ ఉండాలి. ప్రవక్త వారి పేరు పలికినా, లేక విన్నా వీలైతే దురూద్ చదవాలి. లేకపోతే కనీసం సల్లల్లాహు అలైహి వసల్లం అని పలకాలి. రమజాన్ రోజాల పట్ల నిర్లక్ష్యం వహించడం, దురూద్ పంపక పోవడం, తల్లిదండ్రుల్ని పట్టించుకోక పోవడం ఎంతటి పెద్దపెద్ద పాపాలో అర్థం చేసుకోవాలి. జిబ్రీల్ దూత దుఆ చేయడం, రసూలుల్లా వారు తథాస్తు పలకడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దైవం మనందరికీ ఈవిషయాలను అర్ధం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
రేపు రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శనివారం నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం ఉపవాసం ఉండాలని, 25వ తేదీ సోమవారం రంజాన్ పండుగ నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర నెలవంక నిర్ధారణ కమిటీ (రుహియాత్ ఇలాల్) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా షుత్తారి శనివారం ప్రకటన విడుదల చేశారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమా చారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు షుత్తారి పేర్కొన్నారు. -
నేడు జుమ్మాతుల్ విదా
చార్మినార్: రంజాన్ మాసంపై కరోనా ఎఫెక్ట్ పడటంతో ముస్లింలు జుమ్మాతుల్ విదా సందర్భంగా నిర్వహించే సామూహిక ప్రార్థనలు సైతం ఈసారి ఇళ్లల్లోనే నిర్వహించనున్నారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారాన్ని అల్ విధా జుమ్మా (జుమ్మాతుల్ విధా) అంటారు. అల్ విధా జుమ్మాకు రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చివరి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్ పండుగ)కు ముస్లిం ప్రజలు సిద్ధమవుతారు. రంజాన్ పండగ కోసం అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు నూతన దుస్తులు, చెప్పులు, అత్తర్లు, గాజులు..ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులను ఖరీదు చేస్తారు. షీర్‌కుర్మా లేనిదే రంజాన్ పండగ పూర్తి కాదు. ఇందుకోసం మార్కెట్లో షీర్‌కుర్మా సేమియాలు అందుబాటులోకి వచ్చాయి. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసర వస్తువుల దుకాణాలన్నీ అందుబాటులో ఉండడంతో పాతబస్తీలోని మార్కెట్లన్నీ గురువారం జనంతో కిటకిటలాడాయి. ఫుట్‌పాత్‌లపైనే మార్కెట్... ప్రస్తుతం లాక్డౌన్ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లపైనే రంజాన్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. అన్ని రకాల వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. చార్మినార్–మక్కా మసీదు రోడ్డులో రంజాన్ మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో చిరువ్యాపారులు ఫుట్‌పాత్‌లను ఆశ్రయించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అయితే భౌతిక దూరం పాటించకపోతే.. కోవిడ్ వైరస్ బారిన పడొచ్చని భావిస్తున్న కొంత మంది షాపింగ్‌కు దూరంగా ఉంటున్నారు. చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్, గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, పత్తర్‌గట్టి, మీరాలం మండి, పటేల్‌మార్కెట్, మదీనా, నయాపూల్ తదితర ప్రధాన రంజాన్ మార్కెట్ ప్రాంతాలన్నీ ప్రస్తుతం నిర్మానుష్యంగా మారగా.. ఫుట్‌పాత్‌లపై కొనసాగుతున్న మార్కెట్ స్థానికులకు కొంత ఊరట కలిగిస్తోంది. కొనసాగుతున్న ఉపవాసదీక్షలు... ప్రస్తుతం లాక్‌డౌన్‌లోనే రంజాన్ ఉపవాస దీక్షలు, రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు ఇళ్లల్లోనే కొనసాగుతున్నాయి. అల్ విధా జుమ్మా ప్రార్థనలను సైతం ఇళ్లల్లోనే నిర్వహించడానికి ముస్లింలు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.వాస్తవానికి అల్ విధా జుమ్మా సందర్భంగా మక్కా మసీదు వేదికగా సామూహిక ప్రార్థనలు జరుగుతాయి. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చివరి శుక్రవారం కూడా ఇళ్లల్లోనే ముస్లింలు ప్రార్థనలు నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌తో చార్మినార్–మక్కా మసీదు వీధులన్నీ బోసిపోయాయి. -
ముస్లింలకు రంజాన్ తోఫా
చంద్రగిరి: రంజాన్ పండుగ పురస్కరించుకుని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మొత్తం పదిరకాల సరుకుల్లో చక్కెర, సేమియా, బాస్మతి, సోనామసూరి బియ్యం, నెయ్యి, రవ్వ, డాల్డా, నూనె ప్యాకెట్ మొదలైనవి ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి సమీపంలోని నారాయణి గార్డెన్స్‌లో సామాజిక దూరం పాటిస్తూ రంజాన్ తోఫా పంపిణీ చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ముస్లింలకు రంజాన్ కానుక అందించాలని సంకల్పించినట్లు చెప్పారు. ప్రతి ముస్లిం కుటుంబానికి 10 రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని ఆయా పంచాయతీలకు రంజాన్ తోఫా ను వలంటీర్ల ద్వారా వారి ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అల్లా అందరినీ బాగా చూడాలని, అందరూ ఆరోగ్యంగా ఉండేలా ఆయన ఆశీర్వదించాలంటూ ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకతీతంగా ఐక్యతతో మెలగడం తన నియోజకవర్గ ప్రత్యేకత అన్నారు. పండుగ రోజుల్లో ప్రజలకు అండగా ఉండడం తన బాధ్యతని తెలిపారు. ఆపత్కాలంలో చెవిరెడ్డి సాయం మరువలేం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్తు సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందించిన సాయం మరువలేమని ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. కరోనా విపత్తు సమయంలో దేశంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను సొంత నిధులతో ఆదుకుంటున్న మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి హేమేంద్రకుమార్ రెడ్డి, మల్లం చంద్రమౌళి రెడ్డి, మైనారిటీ నాయకులు మస్తాన్, ఔరంగజేబు, ఎంపీడీఓ రాధమ్మ, తహసీల్దార్ చంద్రమోహన్, డీఎస్పీ నరసప్ప, సీఐ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యా అల్లా.. దూర్ ‘కరోనా’
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఇస్లాం ధర్మంలో దువా (ప్రార్థన) ఎంతో శక్తివంతమైనది. సమస్య ఏదైనా నిర్మల మనసుతో అల్లాను వేడుకుంటే అనుగ్రహిస్తాడని ముస్లింల నమ్మకం. అందుకే ఐదు పూటలా నమాజులో దువాను ఒక భాగం చేశారు. “ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భయం..భయంగా జీవిస్తున్నారు. ప్రమాదకర మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడమని ముస్లింలు తమ దైవాన్ని వేడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఉపవాసదీక్షపరులు ఇళ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 600 మసీదులు ఉన్నాయి. కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ముస్లింలు ఇళ్లలోనే వ్యక్తిగత నమాజులు చేసుకుంటున్నారు. నమాజు సమయంలోనే కాకుండా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇస్లాం నిబంధనల ప్రకారం వజూ చేసి చేతులెత్తి నిర్మల మనసుతో దువా చేస్తే తప్పక ఫలిస్తుందని మౌల్వీలు పేర్కొంటారు. దువాలో వరాలు అడగవచ్చు. పాపాలు క్షమించమని అడగవచ్చు. విపత్తుల నుంచి కాపాడమని ప్రాధేయపడవచ్చు. అందువల్ల దైవారాధనకు దువాయే ప్రాణమని చెబుతారు. ‘మీకు ఏం కావాలో నాతో అడగండి.. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నాతో అడగడానికి ముఖం చాటేసే వారు పెడదోవ పడ తారు జాగ్రత్త’అని కూడా అల్లా దివ్యగ్రంధంలో సెలవిచ్చినట్లు మౌల్వీలు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో నే ‘యా అల్లా..కరోనాకు దూర్ కరోనా’ అంటూ సర్వమానవాళి సమస్యపై తమ దైవాన్ని ప్రార్థిస్తున్నారు. దువా ఇలా చేయాలి దువా తప్పకుండా ఫలించాలంటే (ఖుబూల్ కావాలంటే) నియమాలను పాటించాలి. నమాజుకు కూర్చున్న శైలిలో కాళ్లు వెనక్కి మడిచి వినయంగా కూర్చోవాలి. పాపాలను క్షమించమని వేడుకునేటప్పుడు మున్ముందు అలాంటి పాపాల జోలికి వెళ్లను అనే సంకల్పంతో దువా చేయాలి.– హఫీజ్ బషీర్ అహ్మద్ నూరి -
ఆ ధగధగలేవీ?
చార్మినార్: ప్రస్తుత రంజాన్‌లో పాతబస్తీ కళ తప్పి కనిపిస్తోంది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ నేపథ్యంలో పాతబస్తీలోని ప్రధాన వీధులు బోసిపోయాయి. నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు లభిస్తుండడంతో ముస్లింలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇళ్లలోనే ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్నారు. రోజుకు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేస్తున్నారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు సహర్‌తో రంజాన్ ఉపవాస దీక్షలను చేపట్టి సూర్యాస్తమయం అనంతరం ఇఫ్తార్ విందులు కొనసాగిస్తున్నారు. పాతబస్తీలో కొనసాగుతున్న కంటైన్మెంట్ క్లస్టర్లలోని స్థానికులకు రంజాన్ మాసం ఉపవాస దీక్షలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ముస్లిం ప్రజలకు అవసరమైన పండ్లు, ఫలాలు కొనుగోలుకు వీలుగా ఆయా బస్తీలకే ఫ్రూట్ వెండర్స్‌ను తరలించినట్లు ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రజనీ కాంత్ రెడ్డి, అలివేలు మంగతాయారు,షేర్లీ పుష్యరాగం, సూర్యకుమార్, డి.జగన్ తెలిపారు. గతంలో వెజిటెబుల్ వెండర్స్‌ను అందుబాటులో ఉంచినట్లే.. ప్రస్తుతం రంజాన్ మాసం ఉపవాస దీక్షల సందర్బంగా ఫ్రూట్ వెండర్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. -
112 ఏళ్ల తర్వాత..
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ మాసం అనగానే ఉపవాస దీక్షలు.. సహర్.. ఇఫ్తార్.. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు.. గృహోపకరణాల కొనుగోళ్లు.. నగరంలో ఎక్కడ చూసినా సందడి కనిపించేది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేది. ఇక్కడి వంటకాలు, రంజాన్ ఆరాధనలు, నైట్ బజార్లతో కళకళలాడేది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుత రంజాన్ నెలలో అంతటా నిశ్శబ్ద వాతావరణమే అలుముకుంది. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మసీదులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. హైదరాబాద్.. పునాదుల నుంచి ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసింది. శతాబ్దాల చరితకునిలయం భాగ్యనగరం. అంటువ్యాధుల రక్షణ కోసం దీనికి పునాదులు పడ్డాయి. వందేళ్లకుపైగా పూర్వం వరదలు, వర్షాలు, అంటువ్యాధుల ప్రభావంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. తాజాగా కరోనా ప్రభావంతో నగరం నిర్మానుష్యంగా మారింది. రంజాన్ మాసంలో సిటీ కళ తప్పడం చరిత్రలో ఇదే తొలిసారి కాదు. 1908లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సుమారు 112 ఏళ్లకు ముందు ఇది జరిగిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (క్వారంటైన్: బిర్యాని కోసం రగడ) ఆనాడు భయం గుప్పిట్లో జనం 1908 సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు మూసీ నదికి వరదలు వచ్చాయి. అప్పుడు రంజాన్ నెల వచ్చింది. నగరంలో వర్షం ఎడతెరిపిలేకుండా మూడు రోజుల పాటు భారీగా కురిసింది. దీంతో నీటి వరదల తాకిడికి మూసీ నది పరీవాహక ప్రాంతాలు తొలుత కొట్టుకుపోయాయి. ఇళ్లు, దుకాణాలు, చిన్న చిన్న వంతెనలు, నయాపూల్ వంతెన నేలమట్టమయ్యాయి. నగరమంతా నీరు నిలిచింది. మూసీనది నుంచి వచ్చిన నీటితో కోఠి, బషీర్‌బాగ్ వరకు నీరు వచ్చి చేరింది. బ్రిటిష్ రెసిడెన్సీ వద్ద 11 అడుగుల మేర నీరు వచ్చి ఆగింది. ఆ రోజుల్లో రంజాన్ మాసం కొనసాగుతోంది. అప్పటి పాలకులు ప్రజల కోసం తమ దర్బార్ దర్వాజాలకు తెరిచారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ నయాపూల్ వంతెన వద్ద వచ్చి కూర్చున్నారు. ప్రజల రోదనలు, ఆర్తనాదాలతో నగరం దద్దరిల్లింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ముస్లింలు రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు రోజూ రెండు పూటలా అన్నం అందజేసింది. ప్రతి కుటుంబానికి నెలకు రూ.120 అందించింది. వరదల సమయంలో కూడా రంజాన్ నెల కొనసాగింది. దాదాపు ఆరు నెలల వరకు నగరం పూర్తి స్థాయిలో తేలిక పడింది. ఇలాంటి రంజాన్ రెండోసారి.. 1908లో వచ్చిన వరదలతో నగరం అతలాకుతలమైంది. ఆ సమయంలోనే రంజాన్ నెల కొనసాగుతోంది. వరదలతో ముస్లింలు సహర్, ఇఫ్తార్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పటి రంజాన్ నెల ఇప్పటి రంజాన్ కంటే ఇంకా భయానకంగా ఉంది. ఇప్పడు ఇళ్లలోనే ఉండాలి. కానీ అప్పుడు ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. వేలాదిగా ప్రాణనష్టం వాటిల్లింది. వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలుతాయని జనంలో భయం. ఇలా ఎన్నో ఇబ్బందులను నగరం చూసింది. వరదల అనంతరం నగరం కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టింది. – అల్లమా ఇజాజ్ ఫరూఖీ,ప్రముఖ చరిత్రకారుడు -
‘ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలి’
సాక్షి, అమరావతి : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ముస్లింలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల నేపధ్యంలో ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసం ప్రార్ధనలను తమ నివాస గృహాల నుండే చేపట్టాలని విన్నవించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట దశలో ఉందని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో అన్ని వర్గాల ప్రజలు అధికారులతో సహకరించాలని పిలుపు నిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం జనాభాను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని గవర్నర్ తెలిపారు. దేశంలోని అన్ని మతాలు, కులాలు, వర్గాలకు చెందిన ప్రజల చురుకైన సహకారంతో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో విజయం సాధించగలమన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. (చదవండి : మానవాళి క్షేమం కోసం ప్రార్థించండి) ప్రస్తుతం మానవజాతి కరోనా రూపంలో అతి పెద్ద సవాలును ఎదుర్కుంటుందని ప్రతి ఒక్కరూ తమ సామాజిక, మతపరమైన కార్యక్రమాలలో భౌతిక దూరం పాటించవలసిన అవసరం ఏంతైనా ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ముస్లిం సోదర, సోదరీమణులు అందరూ ఇంట్లోనే ఉండి, ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి అవసరమైన బలం చేకూరేలా విశ్వవాళి కోసం ప్రార్థించాలని గవర్నర్ అన్నారు. మేము, మనం అన్న బహువచనం భారతీయ సమాజంలో అంతర్భాగమని, భారతీయ సంస్కృతిలో ఇది అత్యంత కీలకమైన అంశం కాగా, పలు సవాళ్లను ఎదుర్కునే క్రమంలో విభిన్న మతాల వారు ఐక్యంగా పోరాటాలు చేసి విజయం సాధించిన చరిత్ర భారతావని సొంతమని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
రంజాన్ నెలవంక మెరిసింది
చార్మినార్: నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ పవిత్ర మాసం శుక్రవారం రాత్రి అడుగిడింది. ఈ మేరకు రుహియ్యతే హిలాల్ కమిటీ అధ్యక్షులు మౌలానా ఖుబ్బుల్ పాషా షుత్తరీ ప్రకటించారు. నేటి (శనివారం) తెల్లవారుజామున 4.29 గంటలకు నిర్వహించే సహర్‌తో మొదటి రోజాతో ప్రారంభమైంది. లాక్డౌన్ కారణంగా నగర చరిత్రలో ఎన్నడూలేని విధంగా సామూహిక ప్రార్థనలు రద్దయ్యాయి. దీంతో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా మసీదులన్నీ బోసిపోయాయి. ఈ ఏడాది రంజాన్ పవిత్ర కార్యం మొత్తం ఇళ్లలోనే కొనసాగనుంది. అయిదు పూటల నమాజ్, రాత్రి తరావీలతో పాటు సాయంత్రం ఇఫ్తార్ (ఉపవాస దీక్షల విరమణ) కూడా ఇళ్లలోనే పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి రంజాన్ నెలవంక దర్శనమిచ్చినా ఎలాంటి హడావుడి, సందడి లేకుండా పోయింది. రంజాన్ మాసంలో ముస్లింలు నిత్యం భక్తిశ్రద్ధలతో ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేస్తారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సహర్‌తో రంజాన్ ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం అనంతరం ఇఫ్తార్ విందులకు హాజరవుతుంటారు. ఒకవైపు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూనే.. మరోవైపు నిత్యావసరాల వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లకు షాపింగ్ చేసేవారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం రంజాన్ మాసంలో ఆ పరిస్థితులు లేకుండాపోయాయి. ఇళ్లలో సైతం సామూహిక ప్రార్థనలు, విందులపై ఆంక్షలు విధించారు. మసీదుల ద్వారా యథావిధిగా అయిదు పూటలు అజాన్‌తో పాటు, ఉపవాస దీక్షల సైరన్లు మోగుతాయి. మసీదులో నమాజ్‌కు మాత్రం కేవలం ఇమామ్, మౌజన్తో పాటు మసీదు కమిటీకి సంబంధించిన మరో ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా భౌతిక దూరం పాటించి నమాజ్ ప్రక్రియ పూర్తి చేయాలి. అల్లాహూ అక్బర్ అంటూ దైవ ప్రార్థనలో నిమగ్నమైన ముస్లింలు మక్కా మసీదులో అన్నీ రద్దు.. లాక్డౌన్లో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. అంతా సామాజిక దూరం పాటించాలి. దీంతో ఎవరినీ మక్కా మసీదుకు రానివ్వడం లేదు. ప్రతి శుక్రవారం మక్కా మసీదులో నిర్వహించే యౌముల్ ఖురాన్ సభలు కూడా రద్దు చేశాం. అల్విదా జుమ్మా నమాజ్‌లు సైతం ఉండకపోవచ్చు. ఒకవేళ మే 7 అనంతరం లాక్డౌన్ ఎత్తి వేసినప్పటికీ.. సామాజిక దూరం పాటించాల్సిందే. రంజాన్ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వ ఖజానాలో అలాగే ఉన్నాయి. మక్కా మసీదుకు ఎవరూ రానప్పుడు నిధుల వినియోగం అవసరం లేదు. ఇఫ్తార్ విందులు కూడా ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి.– మహ్మద్ అబ్దుల్ ఖాదర్ సిద్దిఖీ, మక్కా మసీద్ సూపరింటెండెంట్ రౌండ్ ది క్లాక్ విద్యుత్ సేవలు.. రంజాన్ మాసంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశాం. చార్మినార్, ఆస్మాన్‌గఢ్, బేగంబజార్ మూడు డీఈల పరిధిలో స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం. డివిజన్‌కు 15 మంది చొప్పున రాత్రిపూట విధి నిర్వహణలో ఉంటారు. రంజాన్ మాసంలో మూడు డివిజన్లకు 45 మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తారు. 24 అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటు లో ఉంచాం. ఇందులో 10 ట్రాన్స్పార్మర్లు 500 కేవీఏ, మరో పది 100 కేవీఏ, నాలుగు 160 కేవీఏ ఉన్నాయి. వీటికి తోడు 23 మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచాం. ఎక్కడైనా విద్యుత్ లోడ్ సమస్యలు తలెత్తితే వీటిని ఏర్పాటు చేస్తాం. – ఖ్వాజా అబ్దుల్ రెహ్మాన్, టీఎస్ఎస్పీడీసీఎల్ దక్షిణ మండలం ఎస్ఈ -
లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే పవిత్ర దీక్షలు
-
రంజాన్.. మార్కెట్ బేజార్
దేశంలోనే భాగ్యనగరంలో రంజాన్ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి ముస్లింలు ప్రతి ఏటా ఈ పండుగను నెల రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. దీనికి తగ్గట్లుగానే రంజాన్ మార్కెట్ భారీగా ఉంటుంది. 30 రోజుల వ్యవధిలో దాదాపురూ.5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా చరిత్రలోనే తొలిసారిగా రంజాన్ మార్కెట్ స్తంభించింది. ఇఫ్తార్ విందులు, వస్త్రాలు, హోటళ్లు, అత్తరు పరిమళాలు, లాడ్‌బజార్ గాజుల గలగలలు ఇక లేనట్లే. మొత్తానికి గ్రేటర్లో లాక్డౌన్ కారణంగా రంజాన్ సందడికి బ్రేక్ పడినట్లే. చార్మినార్: లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి రంజాన్ మార్కెట్‌కు అవకాశాలు లేవు. మార్కెట్లన్నీ బోసిపోయి కనిపించనున్నాయి. రంజాన్ మాసంలో సాధారణంగా అన్ని రకాల వ్యాపారాలు కలిసి దాదాపు 5 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ బిజనెస్ అంతా ఈ సంవత్సరం లాస్ అయినట్లే. పాతబస్తీలోని పటేల్ మార్కెట్, మదీనా మార్కెట్, రికాబ్‌గంజ్, ఘాన్సీబజార్, చార్‌కమాన్, హైకోర్టు రోడ్డు, పత్తర్‌గట్టి, మీరాలంమండి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారాలన్నీ దెబ్బతిననున్నాయి. రంజాన్ మార్కెట్లో ప్రతి ఏడాది వస్త్ర వ్యాపారాలు 3 వేల కోట్ల రూపాయలు జరుగుతాయని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ, శంషీర్‌గంజ్ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వెలవెలబోనున్నాయి. జానిమాజ్ మార్కెట్‌కు బ్రేక్... ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యంలో ఉన్న జానిమాజ్లను పాతబస్తీ మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్ (ఎంసీఎం) ఒకే వేదికపైకి తీసుకు వచ్చి నెల రోజుల పాటు కొనసాగే అంతర్జాతీయ జానిమాజ్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతోంది. అయితే ఈసారి జానీమాజ్‌ల మార్కెట్‌పై కరోనా ప్రభావం పడింది. లక్షలాది రూపాలయల వ్యాపారం దెబ్బతింటోంది. దీంతో పాటు కుర్తా, ఫైజామా, టోపీలను కూడా మార్కెట్లలో అందుబాటులో ఉండేవి. ఇవేవీ ఈసారి రంజాన్ మాసంలో కనిపించవు. సేమియా మార్కెట్‌కు కష్టకాలం నిజానికి రంజాన్ మాసానికి రెండు నెలలకు ముందు నుంచే సేమియాల తయారీ కొనసాగుతుంది. గత నెల నుంచి లాక్డౌన్ కొనసాగుతుండడంతో సేమియా తయారీకి అవసరమైన ముడిసరుకు లభించకపోవడంతో సేమియా తయారీ నిలిచిపోయింది. ఈసారి రంజాన్ పండుగకు సేమియా మరింత డిమాండ్ అయ్యే పరిస్థితులున్నాయి. మక్కా మసీదుకు రావద్దు... కరోనా ప్రభావంతో పాటు లాక్డౌన్ కొనసాగుతున్నందున రంజాన్ మాసంలో ఎవరూ మక్కా మసీదుకు రావద్దు. సహర్, ఇఫ్తార్, తరావీలతో పాటు జుమ్మాకీ నమాజ్‌లను ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి. ఇప్పటికే మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. – మహ్మద్ అబ్దుల్ ఖాధర్ సిద్దికీ,మక్కా మసీదు సూపరింటెండెంట్ అత్తర్ గుబాళింపులు ..ప్రశ్నార్థకం మార్కెట్లో అత్తర్ సువాసనల గుబాళింపులు తక్కువగా ఉండబోతున్నాయి. ఇప్పటికే తమ వద్ద ఉన్న అత్తర్తోనే సర్దుకోనున్నారు. గులాబి రేకులు, మల్లెపువ్వులు, మొగలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్ కావాలో దానిని ప్రత్యేకంగా తయారుచేసిన బట్టీలలోని డెకీసాలలో వేస్తారు. డేకీసా పైన మూతకు ఒక చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చే విధంగా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అసలుసిసలు ‘ అత్తర్’. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నోజ్ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తారు. తెలంగాణతో పాటు అసోం, కంబోడియాలలో కూడా దీని తయారీ కేంద్రాలున్నాయి. సుర్మా విక్రయాలుండవు.. రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ప్రతిరోజూ రెండు కళ్లకు ఈ సుర్మాను పెట్టుకుంటారు. ప్రవక్త మూసా అలైహి సలాం సుర్మాను వాడారు కాబట్టి ముస్లిం సోదరులు దీనిని సున్నత్‌గా భావించి రంజాన్ మాసంలో వాడుతున్నారు. జీవిత కాలంలో కనీసం ఒక తులం సుర్మాను తప్పని సరిగా వాడాల్సి ఉంటుందని..అందుకే రంజాన్ మాసంలో సుర్మా వినియోగం ఎక్కువగా ఉంటుందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. పటేల్ మార్కెట్‌కు పని లేదు.. చీరల హోల్‌సేల్ (టెక్స్టైల్స్) మార్కెట్‌కు కేంద్ర బిందువైన పాతబస్తీలోని పటేల్ మార్కెట్లో సాధారణంగా ప్రతి రంజాన్ మాసంలో సందడి నెలకొంటుంది. లాక్డౌన్ కారణంగా ఈ రంజాన్ మాసంలో వస్త్ర దుకాణాలు తెరుచుకునే పరిస్థితులు లేవు. దాదాపు 2 వేల వరకు ఇక్కడ దుకాణాలున్నాయి. దాదాపు 50 టెక్స్టైల్స్ ఫ్యాక్టరీల అనుబంద వ్యాపారాలు కొనసాగుతాయి. ఉపాధి కోల్పోతున్న టైలర్లు.. రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం తప్పనిసరిగా నూతన దుస్తులను ధరించడం ఆనవాయితీ. ఇందుకోసం రంజాన్‌లో పెద్ద ఎత్తున షాపింగ్ చేసి దుస్తులను ఖరీదు చేసి తమ దగ్గర్లోని టైలర్లకు అందజేస్తారు. ఈసారి లాక్డౌన్ కొనసాగుతున్న రోజుల్లో రంజాన్ మాసం రావడంతో టైలర్లు సైతం ఉపాధి కోల్పోతున్నారు. లాడ్‌బజార్ గాజులంటే ఇష్టం.. రంజాన్‌లో తప్పనిసరిగా గాజులు ఖరీదు చేయడం నాకు అలవాటు. నేనే కాదు..మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడి నుంచే ఇష్టమైన గాజులను ఖరీదు చేస్తాం. అందరం కలిసి రాత్రిపూట లాడ్బజర్కు వచ్చి ఎంతో ఇష్టంగా షాపింగ్ చేసేవాళ్లం. ఈ సారి లాక్డౌన్ మమల్ని నిరాశపరుస్తోంది.– మషరత్ ఫాతిమా, గృహిణి, చార్మినార్ తీవ్రంగా నష్టపోతున్నాం.. రంజాన్ మాసం సందర్బంగా కుర్తా, పైజామా, లాల్చీ, టోపీలు, జానీమాజ్‌ల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఈసారి లాక్డౌన్ కొనసాగుతుండడంతో రంజాన్ మార్కెట్ నడిచే అవకాశాలు లేవు. మేం తీవ్రంగా నష్టపోవాల్సిందే. సరుకు రవాణా సామాజిక దూరం అంశంతో సమస్యలు తలెత్తుతాయి. – మహ్మద్ ఇలియాస్ బుకారీ, వ్యాపారి. -
ప్రార్థనలు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: రెండు రోజుల్లో నెలవంక దర్శనమివ్వనుండటంతో రంజాన్ పవిత్ర మాసం ఆరంభం కానుంది. ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింల ఉపవాస దీక్షలు ప్రారంభమవ్వనున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రంజాన్ మాసంలో మసీదుల్లో ప్రవేశం, సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్లకు కట్టడి పడింది. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలపై ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్ననేపథ్యంలో ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులపై ఆంక్షలు విధించి కొన్ని సూచనలు చేయగా, మరోవైపు దేవబంద్ దారుల్– ఉలూమ్, హైదరాబాద్ ఇస్లామిక్ విశ్వవిద్యాలయం జామియా– నిజామియా, ఇస్లామిక్ ఉలేమాలు, మౌలానా, ముఫ్తీలు ఇస్లామిక్ స్కాలర్స్ ద్వారా ఫత్వాలు జారీ అయ్యాయి. లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్, తరావీలు ఇళ్లలోనే పూర్తి చేసుకునేందుకు ముస్లింలకు దిశా నిర్దేశం చేశారు. ఇళ్లలో సైతం సామూహిక ప్రార్థనలు, విందులపై ఆంక్షలు విధించారు. హలీమ్, హరీస్ తయారీని బంద్ చేస్తున్నట్లు వంటకాల యజమానులు స్వచ్ఛందంగా ప్రకటించారు. రంజాన్‌లో ఇలా.. ♦ ప్రతి మసీదులో ఐదు పూటలు అజాన్– నమాజ్‌లు, ఉపవాస దీక్ష సైరన్లకు అవకాశం ♦ మసీదులో ఇమామ్, మౌజన్, మసీదు కమిటీకి సంబంధించిన మరో ముగ్గురికి మాత్రమే ప్రార్థనలకు అనుమతి ♦ మసీదులో సామూహిక ఇఫ్తార్ విందు, హరీస్ వంటకాలకు నో చాన్స్ ♦ ఇళ్లలోనే ఐదుపూటలా నమాజ్, ఉపవాస దీక్ష సహర్, ఇఫ్తార్ విందులు, తరావీ ప్రార్థనలు చేసుకోవాలి. వీటిలోనూ ఆంక్షలు విధించారు ♦ అజాన్ చివరిలో ముస్లింలు తమ ఇళ్లలోనే నమాజ్ చదవాలని అనౌన్స్మెంట్ ♦ జకాత్, ఫిత్రాలు పంచడానికి ఇంటివద్ద గుమిగూడకుండా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పేదవారిని వారి ఇంటి వద్దకు చేర్చాలి. -
విహారంలో విషాదం
బి.కొత్తకోట: ఉపవాస దీక్షలు ముగించి, రంజాన్ పండుగ జరుపుకున్న ఓ కుటుంబం విహారయాత్రకు బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌కు వచ్చి తిరుగుప్రయాణంలో ప్రమాదానికి గురైన సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని హార్సిలీహిల్స్ క్రాస్‌లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం ముత్తకూరుకు చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ముబారక్‌కు చెందిన ఆటోను అద్దెకు మాట్లాడుకొని హార్సిలీహిల్స్ చేరుకున్నారు. సాయంత్రం ఆరుగంటల వరకు కొండపై విందు భోజనాలు చేసుకొని సేదతీరారు. అనంతరం ఆటోలో గ్రామానికి బయలుదేరారు. 9 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డు దాటుకొని హార్సిలీహిల్స్ క్రాస్‌లోకి వస్తున్న ఆటో స్థానికులు చూస్తుండగానే మదనపల్లె రోడ్డు దాటుకొని కోటావూరు వెళ్లే రోడ్డులోని పెద్ద గొయ్యిలో పడింది. ఈ సంఘటన చూస్తున్న స్థానికులు పరుగులు తీసి బాధితులను ఆటో నుంచి వెలుపలికి తీశారు. 12 మందిలో ఆరుగురికి గాయాలుకాగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం కోసం 108కు సమాచారం అందించారు. అదే సమయంలో సంఘటనా స్థలం చేరుకొన్న హైవే పెట్రోలింగ్ వాహనం, మదనపల్లె రూరల్ సీఐ వాహనాల్లో బాధితులను మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో ఎస్.ఫయాజ్(65) తలకు తీవ్రగాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. గఫూర్ (64), సుఫియాబేగం (42), ఫైరోజా (34), నఫీజా (18), అష్రఫ్ (14) గాయపడ్డారు. ఆటోడ్రైవర్ ముబారక్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో పూర్తిగా ధ్వంసమైంది. సంఘటనా స్థలంలో బండరాళ్లు ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్ కావడమే కారణమని అంటున్నారు. విచారణలో వాస్తవాలు తేలాల్సివుంది. -
కనిపించె నెలవంక.. రంజాన్ వేడుక
సాక్షి,సిటీబ్యూరో: నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు మంగళవారం రాత్రి నెలవంక దర్శనంతో దీక్షలు విరమించారు. బుధవారం రంజాన్ పండగ జరుపుకునేందుకు సకల ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం నగరంలోని మసీదులు, ఈద్గాలను ముస్తాబు చేశారు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు మసీదులు, ఈద్గాల్లో ‘ఈద్ ఉల్ ఫితర్’ నమాజ్ చేస్తారు. ఈద్ నమాజ్‌కు ఇస్లాంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రోజు దైవదూతలు ఉపవాస దీక్షలు పాటించిన వారికి స్వాగతం పలుకుతారని ముస్లింల విశ్వాసం. సిద్ధమైన మసీదులు ఇస్లాంలో మసీదులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలో పరిశుద్ధమైన ప్రదేశం మసీదు అని మహ్మద్ ప్రవక్త బోధించినట్టు రచనలు చెబుతున్నాయి. మసీదు నిర్వాహణతో దేవుడి కరుణ లభిస్తుందని, మసీదు సమానత్వనికి, న్యాయానికి ప్రతీక అని మత గురువులు చెబుతారు. ఇంతటి పవిత్రమై వందల మసీదులు, ఈద్గాలకు మహానగరం నిలయం. మసీ–ఎ–సుఫా దక్కన్‌లోని అతిపురాతనమైన ‘మసీ–ఎ–సుఫా’ మసీదు బహమనీ సుల్తాన్ల పాలనా కాలంలోనే నగరంలో నిర్మించారు. అంటే గోల్కొండ కోట నిర్మిణానికి ముందే ఈ మసీదును నిర్మించారని చరిత్రకారుల కథనం. ఇందులో ప్రస్తుతం మూడు వందల మంది నమాజ్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంది. జామా మసీదు చార్మినార్ చెంతన ఉన్న మక్కా మసీదు గురించి అందరికీ తెలిసిందే. అయితే, దీని నిర్మాణానికి పూర్వమే 1597లో జామా మసీదును సుల్తాన్ కులీ కుతుబ్‌షా రాజ్యాధికారి మీర్‌జుమ్లా అమీనుల్ ముల్క్ అతీఫ్ ఖాన్ బహదూర్ నిర్మించారు. ఆ రోజుల్లో ఇదే అతి పెద్ద మసీదు. ఇందులో 1500 మంది నమాజ్ చేసుకునే సౌకార్యం ఉంది. మక్కా మసీదు మక్కా మసీదు మత సామరస్యానికి ప్రతీక. అద్భుతమైన ఇరానీ శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే ఈ మసీదు నిర్మాణానికి 1617లో సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా శంకుస్థాపన చేశారు. అయితే, ఆయన పాలనలో నిర్మాణం పూర్తి కాలేదు. తర్వాత అబ్దుల్లా కుతుబ్‌షా, తానీషా కాలంలో కూడా పూర్తి కాలేదు. చివరికి 1694లో ఔరంగజేబు పాలనలో మసీదు నిర్మాణం పూర్తయింది. మహ్మద్ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు, మట్టి తీసుకొచ్చి ఇక్కడ మసీదు నిర్మాణంలో వాడినందుకు దీనికి ‘మక్కా మసీదు’గా పేరొచ్చింది. ఇందులో దాదాపు 10 వేల మంది నమాజ్ చేసుకోవచ్చు. ఖైరతాబాద్ జామియా మసీదు జామియా మసీదును 1626లో సుల్తాన్ ∙కులీ కుతుబ్‌షా కుమారుడు సుల్తాన్ మహ్మద్ కుతుబ్æషా నిర్మించాడు. ఈ మసీదు ఖైరతాబాద్ చౌరస్తాకు అనుకొని ఉంది. కొత్త నగరంలోని అతిపెద్ద మసీదు ఇదే. ఇందులో 4 వేల మంది నమాజ్ చేసుకోవచ్చు. హయత్‌నగర్ మసీదు హయత్‌నగర్ మసీదును 1626లో కులీ కుతుబ్æషా సోదరి హయత్ బక్షి బేగం నిర్మించారు. ఇందులో సుమారు 1200 మంది నమాజ్ చేసుకోవచ్చు. మజీదే కలాన్ గోల్కొండ కోట ఆవరణలో మజీదే కలాన్ పేరుతో 1666లో హయత్ బక్షి బేగం మరో మసీదును నిర్మించారు. ఇందులో ప్రస్తుతం 1500 మంది నమాజ్ చేకోవచ్చు. ∙గోల్కొండ కోటలో 1668లో సుల్తాన్ అబ్దుల్లా ఈ మసీదును నిర్మించాడు. ఇందులో 1000 మంది నమాజ్ చేసుకోవచ్చు. టోలి మసీదు దమ్మిడి మసీదుగా మరో పేరున్న ‘టోలి మసీదు’ను కార్వాన్లో 1671లో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షాæ నిర్మించాడు. దాదాపు నాలుగున్నర శతాబ్దాలుగా ఈ మసీదులో ఎలాంటి మార్పులు లేకుండా అద్భుతంగా ఉంది. ఇందులో 5 వేల మంది వరకు నమాజ్ చదువుకోవచ్చు. మసీదే మియా ముష్క్ పురానాపూల్ సమీపంలో ‘మసీదే మియా ముష్క్’ మసీదును 1674లో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షాæ ధార్మిక పండితుడైన మియా ముష్క్ పేరు మీద నిర్మించారు. రెండు అంతస్తుల్లో ఉన్న మసీదు ఇదొక్కటే. అయితే, కాలానుగుణంగా రోడ్డు ఎత్తు పెరగడంతో ప్రస్తుతం పై అంతస్తులోనే నమాజ్ చేస్తున్నారు. ఇందులో 1500 మంది నమాజ్ చేసుకోవచ్చు. -
డిజైన్ల చీరలు.. రూ.50 మాత్రమే.!
♦ ఒక చెప్పుల జోడు కేవలం రూ.50 మాత్రమే...!అమ్మకైనా... నాన్నకైనా... కొడుకుకైనా...ఇంట్లో ఎవరికైనా కేవలం యాబై రూపాయలకే ఒక జత. రండి... ఆలస్యమైతే స్టాక్ అయిపోతుందంటూ చార్‌కమాన్ వద్ద మైక్‌లో ఓ చెప్పుల వ్యాపారి.. ♦ బనియన్లు...పదిహేను రూపాయలే. అందరికీ అన్ని సైజులలో..తీసుకోండి...!! అంటూ పత్తర్‌గట్టి వద్ద టేలా బండిపై చిరువ్యాపారి పిలుపు ♦ రంగు రంగుల డిజైన్ల చీరలు..అన్ని వయసుల వారికి రూ.50 మాత్రమే.! అంటూ గుల్జార్‌హౌజ్ వద్ద రోడ్డుపై చీరలు ఉంచి రమ్మంటున్న ఓ చీరెల వ్యాపారి. ♦ రెండు రూపాయలకు ఒకటి...తీసుకోండి..అంటూ చార్మినార్ వద్ద టేలాబండిపై చిన్నచిన్న ప్యాకెట్లలో వంట దినుసులను ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడో టేలాబండి వ్యాపారి. పాతబస్తీలోని రంజాన్ మార్కెట్లో రోజూ కనిపిస్తున్న సందడి ఇది. నాణ్యతతో కూడిన వస్తువులను కూడా అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటంటూ కాదు.. అవసరమైన అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చార్మినార్ :రంజాన్ మాసం సందర్భంగా చార్మినార్–మక్కా మసీదు ప్రధాన రోడ్డులో కొనసాగుతున్న రంజాన్ మార్కెట్ జనం రద్దీతో కళకళలాడుతోంది. రంజాన్ మాసం సందర్బంగా ఫుట్‌పాత్ విక్రయాలు రోడ్డుపైకొచ్చాయి. వినియోగదారులతో దుకాణాలన్నీ బిజీగా మారాయి. పండుగను పురస్కరించుకొని ప్రజలు పండుగ వస్తువులు ఖరీదు చేయడంలో నిమగ్నం కావడంతో పాతబస్తీ ముఖ్య వ్యాపార కేంద్రాలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. మహిళలు పండుగను పురస్కరించుకొని ముచ్చటగొలిపే రంగురంగుల గాజులను ఖరీదు చేస్తుండడంతో లాడ్‌బజార్ గాజుల దుకాణాలు మహిళల రద్ధీతో కిటకిటలాడుతున్నాయి. ముస్లిం మహిళలు రంజాన్ పండుగకు ప్రత్యేకంగా గాజులను ఖరీదు చేసి ముచ్చటగా ధరిస్తారు. పాతబస్తీ ప్రజలే కాకుండా శివారు ప్రాంతాల జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి గాజులను ఖరీదు చేస్తున్నారు. లాడ్‌బజార్, ముర్గీచౌక్, గుల్జార్‌హౌజ్, శాలిబండ తదితర ప్రాంతాలలోని అత్తర్ దుకాణాలు ప్రజల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కిటకిటలాడుతున్న దుస్తుల దుకాణాలు రంజాన్ పండుగకు తప్పనిసరిగా ముస్లింలు నూతన వస్త్రాలు ధరించడం ఆనవాయితీగా వస్తుండడంతో వాటిని ఖరీదు చేయడానికి అధిక సంఖ్యలో దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పటేల్ మార్కెట్, మదీనా, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టీ, రికాబ్‌గంజ్, గుల్జార్‌హౌజ్ తదితర ప్రాంతాలలోని వస్త్ర వ్యాపార కేంద్రాలు రద్దీగా మారాయి. ఖరీదు చేసిన నూతన వస్త్రాలను వెంటనే కుట్టించుకోవడానికి టైలర్ షాపులను కూడా ఆశ్రయించడంతో పాతబస్తీ టైలర్ షాపులకు కూడా గిరాకీ పెరిగింది. కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తూ ఉపవాస దీక్షలను విరమించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా షాపింగ్ చేయడానికి చాలా కుటుంబాలు సుముఖత చూపిస్తున్నాయి. కళ్లు మిరమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా రంజాన్ మార్కెట్లను సందర్శిస్తున్నారు. వివిధ రకాల గృహోపకర వస్తువులను చూస్తూ.. అవసరమైన చోట ఖరీదు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇఫ్తార్ విందుల అనంతరం మహిళలు, పురుషులు, చిన్నారులు పండుగ వస్తువులను ఖరీదు చేయడానికి వ్యాపార కేంద్రాలకు వస్తున్నారు. సంవత్సరానికోసారి రంజాన్‌ను పురస్కరించుకొని కుటుంబ సభ్యులంతా వ్యాపార కేంద్రాలకు వెళ్లడం సరదా, కాలక్షేపంగా ఉంటుందంటున్నారు. దీంతో పాతబస్తీలో ఎటుచూసినా ప్రజల రద్ధీతో ఫుట్‌పాత్‌లు, దుకాణాలు కళకళలాడు తున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. -
21 నుంచి రంజాన్ తోఫాల పంపిణీ
సాక్షి,సిటీబ్యూరో: పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీని ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభించేదుకు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అధికారులు మహానగరంలో మొత్తం 448 మసీదులను ఎంపిక చేశారు. వీటిద్వారా సుమారు 2.24 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలను ఎంపిక చేశారు. వీరికి ఆమేరకు గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో మసీదు ద్వారా 500 మంది చొప్పున గిఫ్ట్‌లను పంపిణీ చేయనున్నారు. గిఫ్ట్ ప్యాక్‌లో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగ్ ఉంటాయి. ముస్లింలలో అత్యంత పేదవారిని గుర్తించి వీటిని అందజేయనున్నారు. వీటితో పాటు మరో 30 వేలకుపైగా గిఫ్ట్ ప్యాకులను రిజర్వ్‌లో ఉంచారు. పేద ముస్లింలు ఎవరికైనా గిఫ్ట్ ప్యాకులు అందని పక్షంలో రిజర్వ్ చేసిన వాటి నుంచి అందించనున్నారు. రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతి మసీదులో కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా మసీదుల పరిధిలోని ముస్లింల స్థితిగతులను కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, పేదవారిని గుర్తించి వారికి గిఫ్ట్ ప్యాక్‌లు అందించనున్నారు. ఇఫ్తార్ విందుకు రూ.లక్ష రంజాన్ ఉపవాసలను పురస్కరించుకుని మసీదుల్లో దావత్–ఏ–ఇఫ్తార్ కార్యక్రమం కోసం మసీదుకు రూ.1 లక్ష చొప్పున ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులను వక్ఫ్‌బోర్డు నుంచి నేరుగా మసీదు కమిటీ ఖాతాలో జమచేయనున్నారు. మహానగర పరిధిలో ఎంపిక చేసిన 448 మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఒక్కో మసీదులో 500 మంది చొప్పున ఈ విందు ఉంటుంది. మసీదులకు కేటాయించిన నిధుల నిర్వహణను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ నెల చివరి వారంలో ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు ఉంటుంది. -
నగరం రంజాన్‌కు సిద్ధం
సాక్షి,సిటీబ్యూరో: పవిత్ర రంజాన్ మాసం కోసం నగరం ముస్తాబవుతోంది. ముస్లింలు ఉపవాస ఆరాధనలకు సిద్ధమవుతున్నారు. ఈ మాసంలో ఉపవాసాలు పాటిçస్తూ దైవారాధనల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మసీదుల్లో ఐదుపూటలా నమాజ్‌లతో పాటు ఇళ్లలో రాత్రింబవళ్లు ప్రత్యేక ప్రార్థనలు సైతం చేస్తారు. అయితే ఈ ప్రార్థనల కోసం ‘జానీమాజ్’లను తప్పక వినియోగిస్తారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో పవిత్ర మాసం ప్రారంభం కానున్న దృష్ట్యా నగరంలో జానీమాజ్‌ల అమ్మకాలు జోరందుకున్నాయి. అందుకు అనుగుణంగా పాతబస్తీ మదీనా సర్కిల్లోని ముహ్మద్ క్యాప్ మార్ట్‌లో ‘అంతర్జాతీయ జానీమాజ్ ఎగ్జిబిషన్’ ఏర్పాటు చేశారు. జానీమాజ్ అంటే.. ఇస్లాంలో నమాజ్ ఆరాధనలు చేసేటప్పుడు ఆరు నిబంధలను పాటించాలి. వాటిలో మొదటిది ఎక్కడైతే నమాజ్ చేస్తున్నారో అ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. నమాజ్ చేయడానికి అనువైన ప్రదేశాన్ని ‘జామే’ అంటారు. నమాజ్ చేసేందుకు వినియోగించేవస్త్రాన్ని జానీమాజ్ అంటారు. ఊపందుకున్న విక్రయాలు రంజాన్ నెల ప్రారంభానికి తక్కువ సమయమే ఉండడంతో ఇళ్లు, మసీదుల్లో వినియోగించేందుకు ముస్లింలు జానీమాజ్‌లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ మాసంలో ఆయా ప్రదేశాల్లో ముస్లింలు జానీమాజ్లపై కూర్చని ఖురాన్ చదవడంతో పాటు అన్ని రకాల ప్రార్థనలు చేస్తారు. దీనికోసం సౌకర్యంగా ఉండే (కార్పెట్ తరహా) వాటినే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోపక్క కొందరు ముస్లింలు తమ తల్లిదండ్రులు, పూర్వికుల పేరు మీద జానీమాజ్‌లను కొనుగోలు చేసి వారి పేరుపై మసీదుల్లో దానం చేస్తున్నారు. ఇక్కడ అన్ని దేశాల వెరైటీలు లభ్యం ప్రపంచ దేశాల్లో తయారు చేసే జానీమాజ్లు ఇక్కడ అందుబాటులో ఉంచారు. సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, మలేసియా, ఇండోనేసియా, బెల్జియం దేశాల్లో తయారైన జానీమాజ్లతో పాటు కశ్మీర్లో చేతితో తయారు చేసే జానీమాజ్‌లను కూడా ఈ ప్రదర్శనలో ఉంచా రు. అయితే, సౌదీలో తయారైన వాటికి అధిక డిమాండ్ ఉంది. మినార్, కన్ని, సాదా, మెరాబ్ తదిరత డిజైన్లు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది రాయితీ ధరలు ఈ ఎడాది రంజాన్‌కు అన్ని రకాల జానీమాజ్‌లను అందుబాటులో ఉంచాం. ఇంట్లో వినియోగించేందుకు వీలుగా మీటర్ పొడవు నుంచి మసీదులు, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక ప్రార్థలనలు నిర్వహించేందుకు అనువుగా పొడవైన రోల్స్ జానీమాజ్లు సైతం ప్రదర్శనలో ఉన్నాయి. వీటిలో చేనేత, అధునాతన వీవింగ్ సిల్క్, నైలాన్, పాలిస్టర్, ఊలుతో నేసినవి కూడా ఉన్నాయి. పండగను పురస్కరించుకుని ఈసారి రాయితీ ధరల్లో అందిస్తున్నాం. – ఇల్యాస్ బుఖారీ, మహ్మద్ క్యాప్ మార్ట్ యజమాని -
వైఎస్ జగన్ పాదయాత్రకు రేపు విరామం
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు ఈనెల 16వ(శనివారం) తేదీన విరామం ప్రకటించారు. పాదయాత్ర తిరిగి ఆదివారం యథాతథంగా కొనసాగుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర : వైఎస్ జగన్ 190వ రోజు ప్రజాసంకల్పయాత్రను ఆత్రేయపురం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కతుంగ క్రాస్ రోడ్డు, లొల్ల, వాడ పల్లి క్రాస్ రోడ్డు మీదుగా మిర్ల పాలెం చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ఉబలంక మీదుగా రావులపాలెం చేరుకున్నాక పాదయాత్ర ముగిసింది. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ రాజన్న బిడ్డ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. -
ఆ తల్లి సేవలకు సలామ్
కర్ణాటక, సిరుగుప్ప రూరల్: ఉన్నది ఒక్కగానొక్క కుమారుడు. అతను దివ్యాంగుడు. అయినప్పటికీ ఆ తల్లి తన కుమారున్ని అపురూపంగా చూసుకుంటోంది. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా భిక్షమెత్తుకొని రెండు కాళ్లు లేని కుమారున్ని పోషిస్తూ మాతృప్రేమనుచాటుకుంటోంది. సింధనూరు తాలూకా కెంగల్ గ్రామానికి చెందిన మహబూబికి ఒక్కడే కుమారుడు. ఇతనికి రెండు కాళ్లు లేవు. దీంతో తల్లే అతని ఆలనా పాలన చూస్తోంది. రోజూ భిక్షమెత్తుకొని కుమారున్ని పోషిస్తోంది. ఈక్రమంలో సిరుగుప్పలో ఏటా పెద్ద ఎత్తున జరిగే రంజాన్ సంబరాల కోసం కుమారున్ని వీపున మోస్తూ పట్టణానికి చేరుకుంది. ఆమె మాట్లాడుతూ భిక్షమెత్తుకొని కడుపు నింపకుంటున్నానని, ఏటా జరిగే రంజాన్ సంబరాలకు కుమారుడితో కలిసి సిరుగుప్పకు వస్తుంటానని పేర్కొంది. -
మీఠా దావత్
జుబాన్ మీఠా హై తో జమానా మీఠా హై మాట తియ్యనిదైతే అందరి మనసులు తియ్యగా ఉంటాయి. ఇంకో వారం రోజుల్లో రంజాన్ మనకి కష్టం ఉన్నా ఇతరులకు తీపి పంచే ఔదార్యం ఉన్న పండుగ. అలాంటి గొప్ప పండుగ చేసుకునే మనందరికీ ఇదిగో ... ఏక్ మీఠా దావత్ ! కాజు హల్వా కావలసినవి :జీడి పప్పులు – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; నీళ్లు – మూడున్నర కప్పులు; నెయ్యి – అర కప్పు; పంచదార – ఒక కప్పు; కుంకుమ పువ్వు – మూడు నాలుగు రేకలు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; బాదం పప్పు తరుగు – పావు టీ స్పూను. తయారీ: ∙జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నీళ్లు పోసి మరిగాక, పంచదార వేసి బాగా కరిగేవరకు కలుపుతుండాలి ∙కుంకుమ పువ్వు జత చేసి మరో నిమిషం పాటు మరిగించి కిందకు దింపేయాలి ∙స్టౌ మీద వెడల్పాటి పాత్రను వేడి చేసి, అందులో నెయ్యి వేసి కరిగాక మైదాపిండి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుతుండాలి ∙మిశ్రమం గోధుమరంగులోకి మారేవరకు ఐదారు నిమిషాలు ఉడికించాక, పంచదార పాకం జత చే సి మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, బాదం పప్పు తరుగు జత చేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని వేరొక పాత్రలోకి తీసుకుని వేడిగా కాని చల్లగా కాని అందించాలి. ఫ్రూట్ ఖీర్ కావలసినవి :బియ్యం – ఒకటి ముప్పావు కప్పులు; పాలు – ఒక లీటరు; బటర్ – 2 టేబుల్ స్పూన్లు; సపోటా ముక్కలు – పావు కప్పు; అరటి పండు ముక్కలు – పావు కప్పు; ఆపిల్ ముక్కలు – పావు కప్పు; కిస్మిస్ ద్రాక్ష – పావు కప్పు; మామిడి పండు ముక్కలు – పావు కప్పు; పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; రోజ్ సిరప్ – ఒక టీ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙స్టౌ మీద పాన్‌లో బటర్ వేసి కరిగాక పండ్ల ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి ∙ఒక టేబుల్ స్పూను పంచదార జత చేసి కొంతసేపు ఉడికించి, సర్వింగ్ డిష్‌లోకి తీసుకోవాలి ∙అదే పాన్‌లో బియ్యం వేసి దోరగా వేయించాలి. (అవసరమనుకుంటే మరి కాస్త బటర్ జత చేయొచ్చు) ∙పాలు జత చేసి అన్నం బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి కొద్దిగా నీళ్లల్లో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలపాలి ∙మిగిలిన పంచదార జత చేసి మరోమారు కలపాలి ∙రోజ్ సిరప్ జత చేసి, తయారుచేసి ఉంచుకున్న పండ్ల ముక్కల మీద వేయాలి ∙పిస్తా ముక్కల తరుగుతో అలంకరించి, చల్లగా అందించాలి. షాహీ టుక్డా కావలసినవి:రబ్రీ కోసం: పాలు – లీటరు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; పాల పొడి – 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా పంచదార పాకం కోసం: పంచదార – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను టుక్డా కోసం: బ్రెడ్ స్లయిసెస్ – 6 ; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: బాదం పప్పులు – 15; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ: ∙ఒక పాత్రలో కప్పుడు నీళ్లు పోసి మరిగించాలి ∙మరుగుతున్న నీటిలో పిస్తా పప్పులు, బాదం పప్పులు వేసి ఒకసారి కలిపి దింపేసి, మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙చల్లారాక బాదం పప్పులు, పిస్తా పప్పుల తొక్క తీసేయాలి. రబ్రీ తయారీ ∙వెడల్పాటి పాత్రలో లీటరు చిక్కటి పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేసి కలిపి దింపేయాలి ∙పంచదార జత చేసి కరిగేవరకు బాగా కలిపి బాదం పప్పుల తరుగు, పిస్తా తరుగు, రోజ్ వాటర్ వేసి కలపాలి. (నోట్: చిక్కగా, చక్కగా, రుచిగా తయారుకావడానికి సుమారు గంట సమయం పడుతుంది. మీగడ వచ్చినప్పుడల్లా తీసి పక్కన ఉంచాలి. అప్పుడు పాలు గోధుమవర్ణంలోకి మారవు. మరగడం పూర్తయ్యాక మీగడ జత చేయాలి) టుక్డా తయారీ ∙బ్రెడ్ చుట్టూ ఉండే గట్టి పదార్థాన్ని తీసేసి, ముక్కలుగా కట్ చేయాలి ∙స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక బ్రెడ్ ముక్కలను రెండువైపులా కాల్చి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.షాహీ టుక్డా కోసం పంచదార పాకం తయారీ ∙ఒక పాత్రలో అర కప్పు పంచదార, అర కప్పు నీళ్లు వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, మరిగించి తీగ పాకం వచ్చాక దింపేయాలి ∙ఏలకుల పొడి జత చేయాలి ∙బ్రెడ్ ముక్కలు జత చేసి బాగా కలపాలి. షాహీ టుక్డా తయారీ ∙పంచదార పాకంలో బ్రెడ్ ముక్కలు మునిగేలా వేసి కొద్దిసేటి తరవాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙వాటి మీద రబ్రీ సమానంగా పోయాలి ∙బాదం తరుగు, పిస్తా తరుగులతో అందంగా అలంకరించాలి ∙అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అందించాలి. బ్రెడ్ హల్వా కావలసినవి: బ్రెడ్ స్లయిసెస్ – 4; పంచదార – పావు కప్పు; కరిగించిన నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 5; నీళ్లు – అర కప్పు తయారీ:బ్రెడ్ స్లయిసెస్ అంచులను తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙బ్రెడ్ స్లయిసెస్ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, చల్లారాక ముక్కలు చేసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి ∙కొద్దికొద్దిగా బబుల్స్‌లా వస్తుండగా, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి ∙బ్రెడ్ ముక్కలు మెత్తగా అయ్యేలా గరిటెతో మెదపాలి ∙ఉడుకుతుండగా, ఒక్కో స్పూను నెయ్యి వేస్తూ కలపాలి ∙బాగా ఉడికిందనిపించాక, వేయించిన జీడిపప్పులు జత చేసి ఒకసారి కలిపి దింపేయాలి. స్వీట్ కోకో బర్ఫీ కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; కోకో పౌడర్ – అర కప్పు; పాలు – తగినన్ని; బాదం పప్పుల తరుగు – ఒక టీ స్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – అర కప్పు తయార:∙మందపాటి పాత్రను వేడి చేసి, నెయ్యి వేసి కరిగించి మంట బాగా తగ్గించాలి ∙మైదా పిండి జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకువేయించి, పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో పాలు పోసి సన్న మంట మీద మరిగించాక, పంచదార జత చేసి కరిగించాలి ∙పాలుకొద్దిగా చిక్కబడ్డాక, మైదా పిండి, కోకో పొడి జత చేసి ఉండ కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి, అందులో ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా పరిచి, బర్ఫీ ఆకారంలో కట్ చేయాలి ∙చల్లారాక ముక్కలను జాగ్రత్తగా తీసి, బాదం పప్పుల తరుగుతో అలంకరించి అందించాలి. ఖజూర్ హల్వా కావలసినవి: గింజలు లేని ఖర్జూరాలు – 200 గ్రా.; పాలు – ఒక కప్పు; పంచదార పొడి – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – పావు కప్పు; జీడి పప్పులు – 100 గ్రా.; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో పాలు, ఖర్జూరాలు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙మంట బాగా తగ్గించి పాలు చిక్కబడి, ఖర్జూరాలు ఉడికే వరకు కలుపుతుండాలి ∙మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార పొడి, నెయ్యి, జీడిపప్పులు వేసి బాగా కలిపి మరోమారు ఉడికించాలి ∙ఏలకుల పొడి జత చేసి కలిపి దింపేయాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో పోసి పల్చగా పరవాలి ∙బాగా చల్లారాక, కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి అందించాలి. షీర్ ఖుర్మా కావలసినవి :పాలు – అర లీటరు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; రోస్టెడ్ సేమ్యా – అర కప్పు; జీడిపప్పులు – 8; బాదం పప్పులు – 10 (ముక్కలు చేయాలి); అన్ సాల్టెడ్ పిస్తా – 10 (ముక్కలు చేయాలి); గింజలు లేని ఖర్జూరాలు – 10; ఏలకుల పొడి – టీ స్పూను; చిరోంజీ – ఒక టేబుల్ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి ∙ఒక పాత్రలో సన్న మంట మీద పాలు మరిగించి, చిక్కబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙రోస్టెడ్ సేమ్యా, పంచదార జత చేసి బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలపాలి ∙డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, రోజ్ వాటర్ జత చేసి బాగా కలిపి దింపేయాలి ∙పంచదార తక్కువగా అనిపిస్తే మరికాస్త జతచే సుకోవచ్చు ∙షీర్ ఖుర్మా బాగా చల్లారాక కుంకుమ పువ్వుతో అలంకరించి అందించాలి. రోజ్ ఫిర్నీ కావలసినవి:బాదం పప్పులు – 10; బాస్మతి బియ్యం – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు + రెండున్నర కప్పులు; పంచదార – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా (ఒక టీ స్పూను పాలలో కలపాలి); రోజ్ వాటర్ – కొద్దిగా. గార్నిషింగ్ కోసం బాదం పప్పుల తరుగు – టీ స్పూను; పిస్తా తరుగు – టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా తయారీ: మిక్సీలో బాదం పప్పులు, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసి చిన్న పాత్రలోకి తీసుకోవాలి ∙బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అర గంట సేపు నానబెట్టాక, నీరు ఒంపేయాలి ∙మిక్సీ జార్లో బియ్యం, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసి, చిన్న పాత్రలోకి తీసి, అర కప్పు పాలు జత చేయాలి ∙రెండున్నర కప్పుల పాలను ఒక పెద్ద పాత్రలో పోసి, స్టౌ మీద ఉంచి, పాలు మరుగుతుండగా, పాలు+బియ్యం మిశ్రమం జత చేసి, మంట తగ్గించి, ఆపకుండా కలుపుతుండాలి ∙సుమారు ఏడు నిమిషాల తరువాత మిశ్రమం చిక్కగా మారుతుంది ∙పంచదార, ఏలకుల పొడి, పాలలో కలిపిన కుంకుమపువ్వు జత చేసి మరోమారు కలపాలి ∙బాదం పప్పు పేస్ట్, రోజ్ వాటర్ జత చేసి, కొద్దిసేపు ఉడికించి దింపేయాలి ∙తయారయిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ∙పైన మూత పెట్టి, ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచి, బయటకు తీసి చల్లగా అందించాలి.(ఇంటికి వచ్చిన అతిథికి రాత్రి భోజనం తరువాత ఫిర్నీ అందిస్తే, పండుగ భావన కలుగుతుంది). వంటింటి చిట్కాలు బియ్యం, తృణధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేకలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి n పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా మారితే, దాని మీద సబ్బు నీళ్లు పోసి సన్నటి సెగ మీద ఉంచి, చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది n రాగి సామగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి n పచ్చి బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి n చపాతీలు ఒత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనె వేసి మడతలుగా చేసి కాల్చి, హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడు గంటలపాటు మెత్తగా ఉంటాయి n చపాతీ పిండిలో ఉడికిన బంగాళదుంపను వేసి బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి n పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక అరటిపండు, సాయంత్రం వెలగపండు తింటే అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు n పెరుగు పచ్చడి మరింత రుచిగా రావాలంటే, పోపులో టీ స్పూను నెయ్యి కలిపితే సరి n గులాబ్‌జామ్ తయారుచేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీర్ జత చేస్తే, మృదువుగా, రుచిగా ఉంటాయి n దోసెల పిండి బాగా పులిస్తే, అందులో రెండు టీ స్పూన్ల గోధుమపిండిని కలిపితే రుచిగా వస్తాయి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. – నిర్వహణ వైజయంతి పురాణపండ -
ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
-
ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ఐకమత్యాన్ని, సామరస్యతను రంజాన్ మాసం పెంపొందిస్తుందని అన్నారు. ఈ పవిత్ర దినాల్లో ముస్లిం సమాజమంతా సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని, అల్లా వారికి సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. సాటి వారికి చేయూత అందించాలనే రంజాన్ సారాంశం మరింతగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలం, మనోనిశ్చలత, దాణ గుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
హైదరాబాద్ : ముస్లిం సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు చెప్పారు. రంజాన్ పర్వదినం మాత్రమే కాదని, ప్రపంచ మానవాళికి అదొక స్ఫూర్తి అని అన్నారు. సర్వ మానవాళి సుఖంగా ఉండాలన్న ఆర్తి ముస్లిం సోదరుల ప్రార్థనలలో కనిపిస్తుందని తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని పేర్కొన్నారు. ప్రజలు భగవంతుని కృప వల్ల సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
రంజాన్‌కు నాయకి?
రంజాన్ పండుగ సందర్భంగా నాయకి చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటి వరకూ అధికంగా హీరోల చుట్టూ తిరుగుతూ డ్యూయెట్లకే పరిమితమైన త్రిష తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా మారిపోయారు. ఈ చెన్నై చిన్నది ఇటీవలే మోహినీ అవతారమెత్తి లండన్‌లో షూటింగ్ చేసొచ్చారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం. అంతకు ముందే నాయకి చిత్రంలో నటించారు. ఇదీ ఆ తరహా హారర్ కథా చిత్రమే. ఇందులో చెన్న చిన్నది త్రిష ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఒక పాత్ర వినోదభరితంగా, మరో పాత్ర రౌద్రభరితంగానూ ఉంటాయట. ఈ రెండు పాత్రలకు చక్కని వేరియేషన్స్ చూపిస్తూ చెన్నై చిన్నది సూపర్‌గా నటించారట. తన మేనేజర్ తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ హక్కుల్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రంజాన్ పండగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
రంజాన్ వేడుకలు
-
అల్ విదా రంజాన్...
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: జుమ్మతుల్ విదాను పురస్కరించుకొని మక్కా మసీదులో శుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయి. మక్కామసీదు ప్రాంగణంతో పాటు చార్మినార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, చార్మినార్ బస్ టెర్మినల్ రోడ్లపై ఏర్పాటు చేసిన కార్పెట్లపై ప్రార్థనలు నిర్వహించారు. ఈ సామూహిక ప్రార్థనలకు ‘అజాన్’ను మహ్మద్ హనీఫ్ పలుకగా... మక్కా మసీదు ఇమామ్ హఫేజ్ మహ్మద్ రిజ్వాన్ ఖురేషీ నమాజ్ చేయించారు. అనంతరం మక్కా మసీదు కతీబ్ హఫేజ్ మౌలానా అబ్దుల్లా ఖురేషి దువా చేశారు. జుమ్మతుల్ విదా కోసం ఆయా మసీదుల్లో ప్రముఖ మతగురువులు జుమా ఖుత్బ పఠించారు. జుమా నమాజ్ అనంతరం ఆయా మసీదుల్లో రంజాన్, ఉపవాసాలు, జకాత్, లైలతుల్ ఖదర్ ప్రాముఖ్యత గురించి ముఫ్తిలు, ఉలేమాలు ప్రసంగించారు. ఈ ప్రార్థనలలో గ్రేటర్ మేయర్ మాజిద్ హుస్సేన్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ మహ్మద్ అల్తాఫ్ రిజ్వీతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఘనంగా షబే ఖదర్ షబే ఖదర్ సందర్భంగా నగరంలోని అన్ని మసీదులలో శుక్రవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నగరంలోని మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు. ముస్లింలు సోదరులు షబే ఖదర్ను పురస్కరించుకొని తరావీ నమాజ్‌లు, నఫీల్ నమాజ్, తాహజుద్ నమాజ్‌లను సామూహికంగా నిర్వహించారు. అనంతరం మసీదుల్లో తరావీ నమాజుల్లో ఖురాన్ పఠించిన హఫెజ్‌లకు సన్మనించారు. ఈ సందర్భంగా మత పెద్దలు షబే ఖదర్ ప్రాముఖ్యత గూర్చి తెలిపారు. రంజాన్‌మాసంలో షబ్బే ఖదర్ రాత్రి దివ్య ఖురాన్ అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని మసీదుల్లో ఖురాన్ ప్రాముఖ్యతను మతగువులు, ముఫ్తీలు వివరించారు. ఈ రాత్రి చేసిన కర్మలకు వెయ్యి రెట్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని భావించి ఎక్కువగా దైవ స్మరణలో గడుపుతారని ముఫ్తీ మస్తాన్ అలీ తెలిపారు. -
రంజాన్ షాపింగ్ ఫెస్టివల్-2014
డ్రీమ్ ఇండియా ఆధ్వర్యంలో 300 స్టాల్స్‌లో రంజాన్ పండుగకు అవసరమమ్యే అన్ని రకాల దుస్తులు, వస్తువులు, ఇమిటేషన్ జ్యువెలరీ, ఫుడ్‌కోర్టులు,అరేబియన్ రుచులు ఈ ఫాపింగ్ ఫెస్టివల్ లో నగరవాసులకు అందిస్తున్నారు. ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్, నాంపల్లి ఈ నెల 29 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రవేశం ఉచితం -
నేటి నుంచి రంజాన్ దీక్షలు
పవిత్ర పండుగ రంజాన్ మాసం ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో ప్రారంభం అయింది. నెల రోజుల పాటుగా ఈ మాసంలో పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షల్ని(రోజా) చేపడతారు. సోమవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని ముస్లింలు ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ మాసంలో ప్రత్యేక ప్రార్థనలకు నగరంలోని మసీదులు ముస్తాబయ్యూయి. సాక్షి, చెన్నై:మహ్మద్ ప్రవక్త సూక్తుల ప్రకారం రంజాన్ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. ఈమాసంలో శక్తి మేరకు ఎవరైతే సత్కార్యాలు, ప్రార్థనల్లో నిమగ్నమై ఉంటారో అట్టి వారు స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు. కాబట్టే ఇతర మాసాల్లో సైతాన్ చేయించిన పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతూ వస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసం పట్ల విశ్వాసం, ఆ మాసంలో నెలకొనే భక్తి వాతావారణ ప్రభావంతో ముస్లింలు పాప కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో ఉపవాసం ఉండకుండా అందరూ అల్లా సూచించిన మార్గంలో ఒకే రకంగా, ఒకే సమయంలో ఈ వ్రతాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ వ్రతంలో కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోరు. ఆఖరుకు నోట్లో ఊరే లాలాజలాన్ని కూడా మింగకుండా ఐదు పూట్ల నమాజుతో, ఖురాన్ పఠనంతో, రాత్రుల్లో తరావీ నామాజుతో ఆరాధనలో లీనమై ఉంటారు. కఠోర ఉపవాస దీక్షను పాటించడమే కాకుండా సమష్టి సహకారంతో ఈ మాసంలో పుణ్య కార్యాలతో మరొకరికి సహాయం చేస్తూ ఉంటారు. పేద, గొప్ప తేడా లేకుండా అల్లాకు విశ్వాస పాత్రులుగా ఉంటూ సేవల్లో నిమగ్నమవుతారు. తమ శక్తి మేరకు ధాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తూ ఈద్ ముబార్ వేళకు ముస్లింలు సన్నద్దం అవుతారు. విందులు : మనిషిని ఒక ఉన్నత మానవీయ విలువలు గల వాడిగా తీర్చిదిద్దడమే పరామర్థంగా నిలుస్తూ వస్తున్న ఈ రంజాన్ మాసం విందులకూ నెలవుగానే నిలుస్తూ వస్తున్నది. అల్లాపై భక్తి విశ్వాసాలతో పగలంతా కఠోర దీక్షలో ఉండే ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ వేళ ధాన ధర్మాలే కుండా విందులు చేసుకుంటూ ఉంటారు. సహర్ సమయంలోనూ ఇదేరకంగా విందుల సందడి ఉంటుంది. ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా నివశించే నగరంలోని ట్రిపిక్లేన్, మన్నడి, తండయార్ పేట, పూందమల్లి, అన్నానగర్, పురసైవాక్కం, పడప్పై, ముడిచ్చూర్, వండలూర్, మన్నివాక్కం, తాంబరం, అరుంబాక్కం, కోడంబాక్కం, పెరంబూరు, మణివాక్కం, అన్నా సాలై పరిసర ప్రాంతాల్లో ఈ సందడిని చూడొచ్చు. ఇస్లాం మత నియమాల ప్రకారం ఉపవాస దీక్షను విరమించే సమయంలో సాత్విక లేదా మితాహారం మాత్రం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఖర్చూరం, ఇతర పండ్లతో పాటుగా మసీదులో తయారు చేసే గంజిని ఆహారంగా ఇఫ్తార్ వేళ తీసుకుంటూ వస్తారు. కొన్ని మసీదుల్లో సహారి వేళ సైతం భోజన సౌకర్యం కల్పిస్తారు. ఈ నెల రోజుల కఠోర దీక్షలో రంజాన్ పండుగకు మూడు రోజుల ముందు వచ్చే రాత్రి ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి. ఆ రోజు రాత్రి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలతో భక్తి భావంలోముస్లిం సోదరులు మునిగి తేలుతారు. పవిత్ర రంజాన్ కోసం కొనుగోలు చేసిన కొత్త బట్టల్ని ఈ శుభారాత్రి రోజు ధరించి ప్రార్థనలు చేస్తారు.