రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌ | CM Jagan say Ramadan wishes for Muslims | Sakshi
Sakshi News home page

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

Published Tue, May 3 2022 4:31 AM | Last Updated on Tue, May 3 2022 9:41 AM

CM Jagan say Ramadan wishes for Muslims - Sakshi

సాక్షి, అమరావతి: రంజాన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement