సాక్షి హైదరాబాద్: ఈద్–ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను ఈనెల 14న జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ( నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుతారీ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో బుధవారం ఎక్కడా నెలవంక కనిపించలేదన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని.. శుక్రవారం రంజాన్ జరుపుకోవాలని సూచించారు. కాగా, కరోనా కారణంగా ఈద్గా, మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని అన్ని ధార్మిక సంస్థల మతగురువులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment