ramzan festival
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్
-
దేశ వ్యాప్తంగా ప్రారంభమైన ప్రార్థనలు
-
ముస్లిం సోదరులకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలియజేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారాయన. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని సీఎం జగన్ అన్నారు. కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని సీఎం జగన్ పేర్కొన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో ఏపీ ప్రజలకు అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర,సోదరీమణులందరికీ ఈద్ ముబారక్’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్.#EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2023 -
రంజాన్ కి ముస్తాబవుతున్న పాతబస్తి మీర్ ఆలం ఈద్గా
-
Ramadan Month: నేటి నుంచి రంజాన్..
సాక్షి, హైదరాబాద్: నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, మూడేళ్లుగా కరోనాతో నగరంలో రంజాన్ సందడి అంతగా కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో రంజాన్ కళ మళ్లీ తిరిగి రానుంది. ఒకవైపు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ..మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి. చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మల్లేపల్లితో, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్లు వెలిశాయి. వ్యాపార సంస్థలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఆదర్శ జీవనానికి రంజాన్ మాసం ప్రేరణ: సీఎం సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంత జీవనం దిశగా ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ఖురాన్ పఠనం, ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, జకాత్, ఫిత్రా వంటి ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత, జీవిత పరమార్థం అవగాహనలోకి వస్తాయని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. -
రంజాన్ నెల ప్రారంభం.. ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో.. నెల రోజులపాటు నియమ నిష్టలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తోందని చెప్పారు. ‘కఠిన ఉపవాస దీక్ష (రోజా) ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దాన ధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్. ఈ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంవో గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
Mamata Banerjee: దేశంలో పరిస్థితి ఏం బాగోలేదు
కోల్‌కతా: ప్రస్తుతం కొనసాగుతున్న విభజించు–పాలించు, విభజన రాజకీయాల ఫలితంగా దేశం పరిస్థితి బాగోలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మంగళవారం ఆమె కోల్‌కతాలోని రెడ్ రోడ్లో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొని, మాట్లాడారు. ‘దేశంలో పరిస్థితి బాగోలేదు.. ప్రస్తుతం కొనసాగుతున్న విభజన రాజకీయాలు, విభజించు–పాలించు విధానాలు సరికావు. హిందూముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆరోపించారు. ‘బెంగాల్ ప్రజల్లో ఐక్యతను చూసి అసూయతోనే వారు నన్ను వేధించారు. కానీ భయపడను. ఎలా పోరాడాలో నాకు తెలుసు’ అన్నారు. -
ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తలపై టోపీ ధరించి ఆద్యంతం చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు సీఎం.. విజయవాడలోని వన్‌టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా భవనాన్ని ప్రారంభించారు. ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హోరెత్తిన సభా ప్రాంగణం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి సీఎం ఇఫ్తార్ విందుకు వెళ్తున్న క్రమంలో సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది. యువత సెల్ ఫోన్లలో సీఎంను ఫొటోలు, వీడియో తీస్తూ సందడి చేశారు. అంతకు ముందు వేదికపై నుంచి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. నమాజ్ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు ఉర్దూకు రాష్ట్ర రెండో అధికారిక భాష హోదా కల్పించడంతో పాటు రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ 4 % రిజర్వేషన్‌తో ముస్లింలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడితే.. ఆయన వారసుడు సీఎం జగన్ అంతకు మించి సంక్షేమాభివృద్ధిని అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, రోజా, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్, పలువురు ఎమ్మెల్యేలు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. -
రంజాన్ పర్వదినం పై కరోనా ప్రభావం
-
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ పర్వ దినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పెంపొందిస్తుందని.. తెలంగాణలో గంగా, జమునా తహజీబ్‌కు రంజాన్ పర్వదినం ప్రతీక అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రేమ, శాంతి గుణాలకు స్ఫూర్తి రంజాన్: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం దయ, దాతృత్వం, సోదరభావం, ప్రేమ, శాంతి గుణాలకు స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి రావాలని ఈ శుభసందర్భంగా ఆమె ఆకాంక్షించారు. -
రేపే రంజాన్
సాక్షి హైదరాబాద్: ఈద్–ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను ఈనెల 14న జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ( నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుతారీ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశంలో బుధవారం ఎక్కడా నెలవంక కనిపించలేదన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రంజాన్ మాసం చివరి రోజుగా భావించి ఉపవాసం పాటించాలని.. శుక్రవారం రంజాన్ జరుపుకోవాలని సూచించారు. కాగా, కరోనా కారణంగా ఈద్గా, మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలని అన్ని ధార్మిక సంస్థల మతగురువులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. -
ఇళ్లల్లోనే రంజాన్ జరుపుకోండి
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్‌ను కొనసాగుతున్నందున రంజాన్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలవంక సమయాన్ని బట్టి ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో నిర్వహించుకునే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈద్ ఉల్ ఫిత్రా, సామూహిక నమాజ్‌లను పూర్తిగా నిషేధించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ విడుదల చేశారు. ఇదిలావుండగా.. కరోనా కట్టడికి సామాజిక బాధ్యతగా ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలివీ.. ► రంజాన్ రోజున మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో 50 మందికి మించి పాల్గొనకూడదు. ► ప్రార్థనల్లో పాల్గొనే వారు మాస్క్ ధరించి కనీసం ఆరు అడుగుల చొప్పున భౌతిక దూరం పాటించాలి. ► ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య రెండు విడతల్లో 50 మంది చొప్పున ప్రార్థనలు చేసుకోవచ్చు. ► మాస్క్ లేని ఏ ఒక్కరినీ మసీదుల్లోకి అనుమతించకూడదు. ప్రార్థనలకు ముందు నిర్వహించే వాదును ఇళ్ల వద్దే పూర్తి చేసుకోవాలి. నేలపై కూర్చునేందుకు మేట్లను ఇంటినుంచి తెచ్చుకోవాలి. ► మసీదు ప్రవేశ ద్వారం వద్ద తగిన సంఖ్యలో శానిటైజర్స్‌ను అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరి చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. ► వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలి. ► ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునేందుకు చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి. -
ముస్లిం సోదరులకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
-
ఇళ్లలోనే రంజాన్ వేడుకలు..
సాక్షి, అనంతపురం: జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ముస్లింలు రంజాన్‌ను జరుపుకున్నారు. మసీదుల్లో ఐదు మంది చొప్పున మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎవరి ఇళ్లల్లో వారు కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. ముస్లింలు అత్యధికంగా నివసించే అనంతపురం, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి తదితర పట్టణాల్లో రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి అంతా సుభిక్షంగా ఉండాలని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అల్లాను ప్రార్థించారు. ముస్లింలకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సహకరించాలని వారు ఆకాంక్షించారు. కర్నూలు: జిల్లాలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుకున్నారు. కరోనా వైరస్ కట్టడి కి అందరు కలిసి కట్టుగా కృషి చేయ్యాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తూర్పుగోదావరి: కాకినాడలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్ల వద్దే కుటుంబసభ్యులతో కలిసి ప్రార్ధనలు నిర్వహించుకున్నారు. వైఎస్సార్ జిల్లా: రంజాన్ సందర్భంగా కమలాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయ కర్త దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి. జడ్పీటీసీ నరేన్ రామాంజుల రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాహ్ దగ్గరయిన ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండి నవాజ్ ఈద్ ప్రార్థనలు చేసి ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. -
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్
సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్‌గా ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా విశ్వ వ్యాప్తంగా రంజాన్ మాసం పవిత్రతను ఆపాదించుకుందన్న గవర్నర్, పవిత్ర ఖురాన్ బోధనలు యుగయుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయన్నారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మార్పు చెందుతారని, ఈ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో ఈ మాసం ప్రత్యేకతగా నిలిచిందని, కఠోర ఉపవాస వ్రతం సహనాన్ని పెంచుతుందని వివరించారు. సర్వ మానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
నిబంధనలు పాటిస్తూ రంజాన్ జరుపుకోవాలి
-
ఇళ్లల్లోనే ప్రార్థనలు
మాపట్ల వివక్ష లేకుండా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా సమర్థవంతంగా విపత్తును ఎదుర్కొంటోంది. ముందుచూపుతో ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ విపత్తును ఎదుర్కోవడానికి బాగా పనికి వచ్చింది. వారి సేవలు అమూల్యమైనవి. ఇవాళ వలంటీర్ల వ్యవస్థ లేకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేది. – సీఎం వైఎస్ జగన్‌తో ముస్లిం పెద్దలు ప్రస్తుత పరిస్థితిలో ఈ రంజాన్ మాసంలో అందరూ సహకరించాలని, ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని సూచించాలని అభ్యర్థిస్తున్నాను. ఇది మనసుకు కష్టమైన మాటే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కోరుతున్నా. దయచేసి అందరూ సహకరించాలి. – సీఎం ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యుల సూచనలు తప్పకుండా పాటిస్తున్నాం. ఎవరూ కూడా వీటిని ఉల్లంఘించకుండా చూసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ సమయంలో ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునేలా చూస్తాం. – సీఎం వైఎస్ జగన్‌తో ముస్లిం పెద్దలు సాక్షి, అమరావతి: కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించడంతో పాటు ఎక్కువ మంది ఒకే చోట చేరడం హానికరమైన పరిస్థితుల్లో రంజాన్ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ముస్లిం పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏం చెప్పారంటే.. ఇప్పుడేం జరుగుతోందో మీకు తెలుసు ► పవిత్ర రంజాన్ మాసం మరో ఐదు రోజుల్లో మొదలవుతుందనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ రంజాన్ మాసంలో మామూలుగా ఐదుసార్లు మనమంతా నమాజ్‌కు పోతాం. రాత్రి పూట కూడా అందరూ ఒక చోట ఏకమై తరావీహ్ నమాజ్ చేస్తాం. ► ఈ పవిత్ర రంజాన్ మాసంలోనే దాన ధర్మాలు ఇంకా ఎక్కువగా చేస్తాం. అయితే ప్రస్తుతం ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతోందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్‌ను అధిగమించేందుకు కొద్ది రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ► ఈ నేపథ్యంలో ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను ఇళ్లలోనే జరుపుకున్నాం. ఇప్పుడు రంజాన్ రాబోతోంది. అన్ని పండుగల్లోనూ దేవుడికి దగ్గరగా ప్రార్థనా స్థలాల్లో గడపడానికి బదులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లోకి పోవాల్సి వచ్చింది. ► 14 రోజుల క్వారంటైన్ అనంతరం అందరూ పరీక్షలు చేయించుకోవాలి. ముస్లిం మతపెద్దలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో డిప్యూటీ సీఎంలు అంజాద్ బాషా, ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి ► నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు, ఉద్దేశ పూర్వక దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ముస్లిం పెద్దలు సీఎంకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో కోవిడ్–19 నివారణ చర్యలు గట్టిగా తీసుకుంటున్నారని, ఈ చర్యలకు అందరూ సహకరిస్తున్నారని చెప్పారు. ► ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. అయితే కొన్ని పత్రికలు, చానళ్లు ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలు, నకిలీ వీడియోలు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలు కలిగిస్తున్నారని వివరించారు. కర్నూలు ఎమ్మెల్యే మీద కూడా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ► దీనిపై సీఎం స్పందిస్తూ ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారంపై నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి.. చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రభుత్వం బాగా పనిచేస్తోంది ముస్లిం పెద్దల ప్రశంసలు ► మా జీవితంలో అధికారులు, వైద్య సిబ్బంది ఇంత సేవ చేయడాన్ని ఎప్పుడూ చూడలేదు. మేము కూడా క్వారంటైన్లకు వెళ్లి, అధికారులతో కలిసి వారికి కౌన్సెలింగ్ చేస్తున్నాం. ► ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేసుల వ్యాప్తి, విస్తరణ తగ్గుతోంది. ఒక మనిషికి రోజుకు రూ.500 చొప్పున భోజనం కోసం ఖర్చు పెడుతుండటం అభినందనీయం. ఇంతగా సేవచేసే ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ► ఫేక్ వీడియోలతో ముస్లిం సమాజం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడా వివక్ష చూపుతున్నారు. ఈ విష ప్రచారాన్ని నిలువరించాలని కోరుతున్నాం. మర్కజ్ ఘటన అనుకోకుండా జరిగింది. ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదు. ఈ ఘటన తర్వాత సీఎం స్పందించిన తీరు చాలా బావుంది. మానవత్వంతో వ్యవహరించాలని, వైరస్‌కు కులం, మతం తేడా లేదని ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. -
కానుకలు వచ్చేశాయ్!
బేల/ఆదిలాబాద్‌రూరల్: రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుపేద ముస్లింలకు ప్రభుత్వం తరపున గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చేశాయ్. ఈ నెల 7వ తేదిన రంజాన్ నెల ప్రారంభం కాగా జిల్లాలోని పేద ముస్లింలకు ఈ గిఫ్ట్‌ల పంపిణీతో పాటు ఈఫ్తార్ విందుల నిర్వహణ కోసం ఇప్పటికే మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు మొత్తం 4,500గిఫ్ట్ ప్యాక్‌లు చేరుకున్నాయి. ఈ నెల 18వ తేదీన వీటి పంపిణీ ప్రారంభానికి సన్నాహాలు చేసినప్పటికీ, అనివార్య కారణాలతో కుదరలేదని తెలిసింది. ఎట్టకేలకు 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా 61మసీదుల వద్ద వీటిని ఒకేసారి పంపిణీ చేయడానికి సంసిద్ధత కొనసాగుతోంది. దీంతో పాటు ఈ 28వ తేదీ సాయంత్రమే జిల్లాలోని ఆదిలాబాద్ నియోజకర్గంలోని 19, బోథ్ నియోజకవర్గంలోని 9 మసీదుల వద్ద ఇఫ్తార్ విందులను సైతం ఏర్పాటు చేయనున్నారు. గిఫ్ట్ ప్యాక్‌లను అందిస్తారిలా.. రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందించేందుకు జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌లో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తపైజామా, ఒక బ్యాగు ఉండనున్నాయి. స్థానిక మసీదు కమిటీల నిర్వాహకులు ఎంపిక చేసిన కుటుంబాలకే వీటిని అందించనున్నారు. ఎంపిక విధానంలో ఈ ఏడాది రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడి ఎంపిక చేసి టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లను ఒక రోజు ముందుగానే అందజేసి, గిఫ్ట్ ప్యాక్‌లను అందిస్తారు. ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీపై ఏసీబీ నిఘా సైతం ఉండనుంది. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా పూర్తిస్థాయిలో మైనార్టీ అధికారులు పారదర్శకంగా మసీదు కమిటీ నిర్వాహకుల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ప్రధానంగా వితంతులు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరుపేదలకు ఈ ప్రతిపాదనలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాగా మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ఏసీబీ నజర్ ఉంచుతున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను మసీదు కమిటీ నిర్వహకులకు ఇచ్చి, గిఫ్ట్ ప్యాక్‌లు తీసుకున్నట్లు పేపర్‌పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. మసీదు కమిటీ ఎంపిక చేసిన ప్రాంతంలో పోలీసులు, మైనార్టీ శాఖ అధికారులు మసీదు కమిటీ సమక్షంలో వీటిని పంపిణీ చేయనున్నారు. తమ పవిత్ర పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఈ గిఫ్ట్ ప్యాక్‌లు పంపించడంతో ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంపిణీకి ఏర్పాట్లు చేశాం నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఈ గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే జేసీ సమక్షంలో మసీదు కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. ప్రభుత్వం తరపున అందిస్తున్న ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణిని పారదర్శకంగా నిర్వహించనున్నాం. ఈ నెల 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. – కృష్ణవేణి, జిల్లా మైనార్టీ శాఖ అధికారి -
ఇఫ్తార్ విందుతో గిన్నిస్ రికార్డు
దుబాయ్: ముస్లింల ప్రధాన పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాసం తర్వాత ఇచ్చే విందునే ఇఫ్తార్‌గా పిలుస్తారు. తాజాగా ఈ ఇఫ్తార్ విందుతో భారత్‌కు చెందిన ఓ సేవా సంస్థ గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అబుదాబిలోని దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయులు నడిపిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విందు గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ‘గల్ఫ్ న్యూస్’ తెలిపింది. ఈ సందర్భంగా చారిటీ వ్యవస్థాపకులు జోగిందర్ సింగ్ సలారియా మాట్లాడుతూ... ‘శాఖాహారం ఆరోగ్యానికి మంచిదే కాకుండా, దీన్ని తీసుకోవడం వల్ల జంతు వధను అరికట్టవచ్చు. ఈ రికార్డు సాధించడంలో సాయపడిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు’ తెలిపారు. -
పుట్టిన రోజే.. చివరి రోజు!
బుడిబుడి నడకలతో, వచ్చీరాని మాటలతో ఇంట్లో వారందరికీ సంతోషం పంచిన ఆ చిన్నారికి మొదటి పుట్టిన రోజు చివరిదయింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, బంధు మిత్రుల ఆప్యాయతల నడుమ నిండు నూరేళ్లు జీవించాల్సిన వాడు పుట్టిన ఏడాదికే కానరాని లోకాలకు తరలిపోయాడు. తమకు జీవనాధారమైన ఆటో కన్నపేగును చిదిమేసిన విషయాన్ని తలచుకుని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పండుగ రోజు జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సాక్షి, జూపాడుబంగ్లా : మండలంలోని 80 బన్నూరులో శనివారం ఆటో కిందపడి ఓ చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. మృతుడి బంధువుల కథనం మేరకు..గ్రామానికి చెందిన ఇలాష్బాషా, ఆశ్మ దంపతులకు కుమారుడు యూసుఫ్(ఏడాది)ఉన్నాడు. కుమారుడి పుట్టినరోజు, రంజాన్ పండుగ ఒకే రోజు రావటంతో ఆ ఇంట్లో బంధువులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం ఇంట్లో అందరూ పండగ హడావుడిలో ఉండగా తండ్రి కుమారుడి తీసుకుని ఇంటికి సమీపంలో ఉన్న మినరల్‌వాటర్ ప్లాంటు వద్దకు వెళ్లాడు. తండ్రి ఆటోలోని ట్యాంకులో నీటిని నింపుకొని గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించాడు. ఈక్రమంలో ఆటో వెనక్కు నడపడంతో వెనుక ఉన్న చిన్నారిపై దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా వచ్చీరాని మాటలతో అందర్నీ నవ్వించిన యూసుఫ్ మృతిచెందాడనే వార్తతో కుటుంబ సభ్యులు నిశ్చేష్టులయ్యారు. ఘటన స్థలికి చేరుకుని గుండెలు అవిసేలా రోదించారు. పండగ వాతావరణం కాస్త విషాదభరితంగా మారింది. గ్రామంలోని ముస్లింలు, చుట్టుపక్కల వారు మృతి చెందిన బాలుణ్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఎవ్వరికీ ఎలాంటి హానీ చెయ్యని తమకు పండుగరోజు, పుట్టిన రోజునాడే అల్లా తమ బిడ్డను తీసుకెళ్లాలా అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కలచివేసింది. -
రంజాన్‌నాడు నెత్తురోడిన అఫ్గాన్
జలాలాబాద్: రంజాన్ రోజు అఫ్గానిస్తాన్ నెత్తురోడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రజలు, తాలిబన్ ఫైటర్లు కలిసి జరుపుకున్న వేడుకలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 21 మంది మృతిచెందగా 41 మంది గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువ మంది తాలిబన్లే ఉన్నారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాలిబన్లతో సర్కారు కుదర్చుకున్న కాల్పలు విరమణ ఒప్పందం ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ప్రభుత్వ ఒప్పందం నేపథ్యంలో అఫ్గాన్ భద్రతా దళాలతో కలిసి తాలిబన్ ఫైటర్లు, ప్రజలు ఆలింగనాలు చేసుకోవడం, సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడిపిన కాసేపటికే ఈ దాడి జరిగింది. దాడిని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. కాల్పుల విరమణను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ మూడ్రోజుల కాల్పుల విరమణకు తాలిబన్ నాయకుడు హైబతుల్లా అఖున్జాదా అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది గురువారం నుంచి ఆదివారం వరకు అమల్లో ఉంది.ఈ ఘటనకు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. అఫ్గాన్‌లో శాంతిస్థాపన కోసం అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలకు కొంతకాలంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే.. కాల్పుల విరమణకు తాలిబాన్లు అంగీకారం తెలిపారు. ఇంతలోనే తాలిబన్లు లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపుతోంది. -
రంజాన్ రోజు జమ్మూకశ్మీర్‌లో అల్లర్లు
-
పండగపూట విషాదం
బాలుడిపై విద్యుత్ తీగ పడి దుర్మరణం అత్తాపూర్ (రాజేంద్రనగర్): రంజాన్ పండగా రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఇంట్లో సామానులను తీసుకురావడానికి బయటకు వెళ్లిన బాలుడు కరెంట్ తీగ మీదపడి అక్కడికక్కడే మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన హమీద్, షబాన్‌బేగం దంపతులకు ముజమిల్(8) ఒక్కగానొక్క కుమారుడు. రంజాన్ పండగ కావడంతో ముజమీల్ సోమవారం సామాన్లు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. ఇంద్రానగర్‌లోని దుకాణం వద్దకు వెళ్తుండగా విద్యుత్ స్తంభంపై ఉన్న తీగ ఒక్కసారిగా తెగి బాలుడిపై పడింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురైన బాలుడు విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. -
ముస్లింలను మరోసారి వంచిస్తున్న కేసీఆర్
► బీజేపీకి మద్దతుపై పునరాలోచించుకోవాలన్న ఉత్తమ్ ► రామ్‌నాథ్ రాష్ట్రపతి పదవికి అనర్హుడని వ్యాఖ్య ► పేద ముస్లింలకు రంజాన్ సామగ్రి పంపిణీ సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల విషయంలో ముస్లింలను మోసగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా మరోసారి మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ముస్లింలకు ఆదివారం గాంధీభవన్‌లో పండుగ సామాగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే మత తత్వ పార్టీ అయిన బీజేపీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా లౌకికవాదాన్ని కాపాడాల్సిన అత్యున్నత స్థానంలో ఉండే రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్ కోవింద్ అనే మతతత్వ వ్యక్తిని బీజేపీ నిలబెట్టిందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా కేసీఆర్ కూడా మతవాదానికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఉండేవారు నిర్వహించాల్సిన రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్ అర్హుడు కాదన్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చే అంశంలో సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రపతి పదవికి మీరాకుమార్‌కు అన్ని రకాల అర్హతలున్నాయన్నారు. లోక్‌సభ స్పీకరుగా మీరాకుమార్ చేసిన కృషి వల్లే తెలంగాణ బిల్లు నెగ్గిందని, కేసీఆర్ సీఎం పదవిలో కూర్చున్నాడన్నారు. 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను ముస్లింలు క్షమించబోరని షబ్బీర్ అలీ హెచ్చరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంఐఎం వైఖరిని ప్రకటించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ 10కె రన్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలను, స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకుపోవాలని పార్టీ కార్యకర్తలకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద 10కే, 5కే, 2కే రన్‌ను ఆదివారం నిర్వహించారు. దేశాన్ని ఐక్యంగా నిలబెట్టడానికి ఇందిరాగాంధీ చేసిన కృషి మరువలేనిదని ఉత్తమ్ కొనియాడారు. భారత్ పటిష్టమైన దేశంగా అవతరించడానికి, ప్రపంచ దేశాలకు వస్తువులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎగుమతి చేయగలుగుతుందంటే ఖచ్చితంగా ఇందిరమ్మ చేసిన ఘనతేనని పేర్కొన్నారు. ఉక్కుమనిషి ఇందిర: రాజ్‌బబ్బర్ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి, ఐక్యంగా నిలబెట్టడానికి ఉక్కుమనిషిగా ఇందిరాగాంధీ వ్యవహరించారని ఉత్తరప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ అన్నారు. ఇందిరమ్మ ఆశయాల సాధన ఈ దేశానికి ఎంతో ఉపయోగమన్నారు. -
ఈద్ రేపు
- మంగళవారం కనిపించని నెలవంక - గురువారమే పండుగన్న దక్కన్ మర్కజీ రొహియతే హిలాల్ కమిటీ న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)ను గురువారం జరుపుకోవాలని దక్కన్ మర్కజీ రొహియతే హిలాల్ కమిటీ మంగళవారం రాత్రి ప్రకటించింది. మంగళవారం ఆకాశంలో నెలవంక కనిపిం చకపోవడంతో బుధవారం బదులు గురువారం ఈద్ ను జరుపుకోవాలని కమిటీ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఖుబూల్ పాషా అత్తారి ప్రకటనలో తెలిపారు. బుధవారం రంజాన్ ఉపవాస దీక్ష కొనసాగుతుందన్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదు ఇమామ్‌లు కూడా గురువారమే ఈద్ జరుపుకోవాలని సూచించారు. అయితే కేరళ, కశ్మీర్లో మాత్రం బుధవారమే రంజాన్‌ను జరుపుకోనున్నారు. మరోవైపు రంజాన్‌ను పురస్కరించుకొని గురు, శుక్రవారాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించామని మైనారిటీల సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయన్నారు. బుధవారం మాత్రం పనిదినమేనన్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ యాజ మాన్యం, కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ ఉద్యోగులకు గురువారం ఒక్కరోజే సెలవు ప్రకటించాయి. -
ఏపీలో జులై 7న రంజాన్ ప్రభుత్వ సెలవు
హైదరాబాద్: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని జులై 7 (గురువారం) నాడు ప్రభుత్వ సెలవుగా ఏపీ ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. -
దేశంలో ఎక్కడా లేని విధంగా 73 స్కూళ్లు..
కరీంనగర్: దేశంలో ఎక్కడా లేని విధంగా 73 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. సోమవారం కరీంనగర్లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రంజాన్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
'26న నిజాం కాలేజీలో ఇఫ్తార్ విందు'
హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 26న నిజాం కాలేజీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం ఆయన రంజాన్ పండుగపై సమీక్ష నిర్వహించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాని సూచించారు. రంజాన్ సందర్భంగా 2 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. -
పుణ్యస్నానమే లక్ష్యంగా..
పద్మ పురాణం, బ్రహ్మ పురాణాలలో గోదావరి నది ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు.. నదీనదాల్లో గోదావరికి ఎంతో ప్రాధాన్యం ఉంది.. గంగానది ఎంతో పవిత్రం.. అలాంటి గంగలో అరవైసార్లు స్నానం చేస్తే లభించే పుణ్యం గోదావరిలో ఒక్కసారి చేస్తే లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.. దీనిని బట్టి గోదావరి పుష్కరాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయ జీవనంలో ఎంత ముఖ్యమైనవో చెప్పవచ్చు. ఈ గోదావరిలో పుణ్యస్నానం ఆచరించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సాక్షి, గుంటూరు : రంజాన్ పండగ, ఆదివారం వరుసగా రెండు రోజుల పాటు సెలవులు రావడంతో జిల్లా నలుమూలల నుంచి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు బయలుదేరారు. ప్రధానంగా రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో యాత్రికులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు వేలసంఖ్యలో తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి నుంచి సొంత వాహనాల్లో ఎక్కువ మంది వెళ్లారు. అయితే శనివారం ఉదయం నుంచి బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. గుంటూరు నుంచి ఏలూరుకు 90 కిలోమీటర్లు ఉంటుంది. మామూలు రోజుల్లో కేవలం రెండు గంటల్లో ఏలూరు చేరుకోవచ్చు. అయితే శనివారం ఏలూరు వెళ్లాలంటే ఏడు నుంచి ఎనిమిది గంటల సమ యం పట్టింది. ఏలూరు నుంచి రాజమండ్రి వంద కిలోమీటర్లు వరకు ఉంటుంది. రాజ మండ్రి, కొవ్యూరు వెళ్లేందుకు సుమారు పది నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని యాత్రికులు చెబుతున్నారు. మార్గమధ్యంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీ గా నిలిచిపోయింది. దీం తో పాటు కాజా టోల్‌గేటు వద్ద సైతం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భక్తుల రద్దీతో ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. రాజమండ్రి, భద్రాచలం వెళ్లే బస్సులు కిటకిటలాడాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేకంగా కొన్ని సర్వీసులను పెంచినా అవి ఏమాత్రం సరిపోలేదు. అలాగే ప్రత్యేక రైళ్లు సమయపాలన లేదు. ఎప్పుడు రైళ్లు వస్తాయో ప్రయాణికులకు సరైన సమాచారం లేదు. దీంతో అనేక మంది రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి సైతం యాత్రికులు గుంటూరు జిల్లా మీదగా వెళ్లాల్సి ఉంది. దీంతో చెన్నై, కొలకొత్తా హైవేై ఎన్‌హెచ్-5 పై వాహనాల రద్దీ తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం రాజమండ్రి, కొవ్యూరుల్లో 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారంటే భక్తుల రద్దీ ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. -
ఈద్ ముబారక్ హో
నెల పాటు అన్ని నియమ నిబంధనలు పాటించి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ముస్లింలు సిద్ధమయ్యారు. శుక్రవారం పొద్దుమునిగాక చంద్రుడు కనిపించగానే హర్షం వ్యక్తం చేస్తూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉన్నంతలో మంచి దుస్తులు వేసుకుని శనివారం ఈద్గా మైదానంలో సామూహికంగా అల్లాను ప్రార్థించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కడప కల్చరల్ : రమజాన్....ప్రపంచంలోని ముస్లింలందరూ అత్యంత పవిత్రంగా భావించే పండుగ. శని వారం దేశంలో రమజాన్ (ఈదుల్ ఫితర్) పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించగానే ఈద్ కా చాంద్ ముబారక్ హో’ (పండుగ శుభాకాంక్షలు) అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు యువకులు నగరంలోని పలు ప్రాంతాల్లో బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. పండుగను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో లీనమయ్యారు. ముగిసిన రోజా, తరావీ ప్రార్థనలు నెల రోజులపాటు అన్ని నియమ నిబంధనలు పాటించి రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞత చెల్లిస్తూ పండుగ చేసుకోనున్నారు. ఈమాసం సందర్భంగా నెల రోజులుగా ఎంతో పవిత్రంగా కొనసాగించిన ఉపవాస దీక్ష(రోజా)లు, తరావీ ప్రార్థనలు శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముగిశాయి. కడప నగరంలోని అన్ని మసీదులలో మూడు రోజుల కిందటే తరావీ ప్రార్థనలలో పవిత్ర ఖురాన్ పఠనం పూర్తి చేశారు. పండుగ గురించి ప్రకటన వెలువడగానే ఆయా మసీదు కమిటీల ప్రతినిధులు రంజాన్ సామూహిక ప్రార్థనలకోసం ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా బిల్టప్ సమీపాన ఉన్న ఈద్గా-యే-అమీన్, దండు ప్రాంతంలో షాహీ ఈద్గా మైదానాలలో ప్రత్యేక ఏర్పాట్ల నిర్వహణలో బిజీ అయ్యారు. ప్రతి ఒక్కరూ ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించ అత్తరు, పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలతో ఈద్గాలో సమావేశమై సామూహికంగా అల్లాహ్‌కు కృతజ్ఞత చెల్లిస్తూ ‘ఈద్’ నమాజ్ చేయనున్నారు. తమ అపరాధాలను మన్నించాలని, సన్మార్గాన నడపాలని దువా చేయనున్నారు. శనివారం సామహిక ప్రార్థనలకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలి వస్తారు గనుక జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కువ మంది ముస్లింలు ఈద్గాలో ఈద్ ప్రార్థనలు నిర్వహించేందుకు ఉత్సాహం చూపుతారు. బిల్టప్ ఈద్గాలో జరిగే ప్రార్థనల్లో పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేస్తారు. అలాగే ఆయా మసీదుల్లో మత గురువులు ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగ పవిత్రతను తెలియజేయనున్నారు. ఫిత్రా పంపిణీ పవిత్ర రంజాన్ పండుగలో భాగంగా ముఖ్యమైన ఫిత్రా, జకాత్‌లను వారం రోజులుగా పేదలకు పంపిణీ చేస్తున్నారు. పండుగ ప్రకటన వెలువడగానే ఈ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. ఈ పండుగ సందర్భంగా పేదలు, అనాథలు, వికలాంగులు కూడా సంతోషంగా ఉండాలన్న ఉదాత్తమైన ఆశయంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పండుగ సందడి బజార్లలో పండుగ సందడి కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి పండుగకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్న ముస్లింలతో ప్రధాన బజార్లు కిటకిటలాడాయి. ఫ్యాన్సీ, వంట సామగ్రి, వస్త్రాలు, పాదరక్షల కొనుగోలుతో సందడిగా మారాయి. పెద్ద, చిన్న దుకాణాలతోపాటు తోపుడు బండ్లపై కూడా విక్రయాలు బాగా జరిగాయి. శుక్రవారం రాత్రికే కడప నగరంలోని ప్రధాన బజార్లలో రంజాన్ కళ ఉట్టిపడింది. -
కిక్కిరిసిన ఈద్గాలు
పింప్రి, న్యూస్‌లైన్ : పుణేలో రంజాన్ వేడుకలను మంగళవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రార్థనా స్థలాలకు తరలి వచ్చారు. స్థానిక ఈద్గా మైదానాల్లో ఉదయం 8, 9, 10 గంటలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు అల్లానామస్మరణతో మార్మోగాయి. పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో ఇక్కడకు చేరుకున్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు హిందువులు, క్రైస్తవులు ఈద్గా మైదానాల వద్ద బారులు తీరారు. గులాబీ పూలతో ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మతసామరస్యం వెల్లువిరిసింది. మావల్, తలేగావ్, వడగావ్, దేహూరోడ్, లోనావాలా పరిసరాలల్లో భారీ వర్షానికి ఈద్గా మైదానాలు అసౌకర్యంగా మారడంతో మసీదులల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. తలేగావ్ జామా మసీదు, మౌలానా సికందర్ ఎ ఆజామ్, హఫీజ్ కమ్యూమ్, మౌలానా షేక్ ప్రార్థనా మందిరాలల్లో మూడుసార్లు నమాజ్ చేశారు. ఎమ్మెల్యే బాలా భేగడే, జమా మసీదు ట్రస్టు చాంద్ సాబ్ సికిలకర్, మాజీ కార్పొరేటర్ బాబాలాల్‌నాలబంద్, నగర అధ్యక్షులు సులోచనా ఆవారే, ఉప నగర అధ్యక్షులు సత్యేంధ్ర రాజ్‌లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. జామా మసీదు ట్రస్ట్, షేర్-ఎ-రఝూ యంగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ముబారక్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రూపాలేఖా దోరే, మనోజ్ డోరే, ట్రస్టు ప్రముఖులు యూనుస్ అనీస్ భాయి తాంబోలీ, అబ్దుల్ భాయి షేఖ్, రషీద్ సయ్యద్, యంగ్‌కమిటీ సదర్ మజహర్ షేక్, అమీర్ షేక్ తదితరులు పాల్గొన్నారు. షోలాపూర్ : షోలాపూర్ పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మైదానాలల్లో, వివిధ మసీద్‌లలో ప్రార్థనలు చేశారు. రంగ్ భవన్ చోక్ సమీపంలోని మైదానంలో మహిళలు కూడా ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
రామచంద్రాపురం: రంజాన్ పండుగను పురస్కరించుకుని నూతన వస్త్రా లు కొనుగోలు చేసేందుకు వెళుతున్న అన్నదమ్ములను మృత్యువు లారీ రూ పంలో కబలించింది. ఈ సంఘటన పట్టణంలోని సంగీత థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రవీం దర్‌రెడ్డి కథనం మేరకు.. పట్టణంలోని మార్కెట్లో నివాసముండే ఇస్మాయిల్ మటన్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇస్మాయిల్‌కు ముగ్గురు కుమారులు. రంజాన్‌ను పండుగను పురస్కరించుకుని బట్టలు తెచ్చుకునేందుకు పెద్ద కుమారుడు ఇమ్రాన్ (28), రెండో కుమారుడు సద్దాం (24) బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం రామచంద్రాపురం పట్టణంలోని సంగీత థియేటర్ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న లారీ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్ అక్కడిక్కడే దుర్మరణం చెందగా, సద్దాం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంజాన్ దగ్గర పడడంతో ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు అక్కడివారిని కలిచివేసింది. మృతుడి కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రోజా, ఖురాన్... దేవుడి వరాలు
ఇస్లాం వెలుగు ఉపవాసాల ఉద్దేశాన్ని, పవిత్ర ఖురాన్ అవతరణ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పరలోక పరాభవం నుండి తప్పించుకొని దైవ ప్రసన్నతకు పాత్రులం కాగలుగుతాం. ఇది పవిత్ర రమజాన్ మాసం. దైవ విశ్వాసుల పాలిట వరాల వసంతం. అందుకే దైవ విశ్వాసులంతా ఈ పవిత్రమాసంలో ఉపవాస వ్రతం పాటిస్తారు. ఇది సృష్టికర్త తరఫున మోపబడిన విధి. ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ ఇలా వివరిస్తోంది: ‘‘విశ్వాసులారా! గత ప్రవక్తల అనుయాయులకు ఏ విధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అలాగే ఇప్పుడు మీరు కూడా ఉపవాసాలు ఆచరించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’’ (2-183). దైవం పట్ల భయభక్తులు ఉన్నప్పుడే మనిషి అన్ని రకాల చెడులనూ, దుర్మార్గాలను విసర్జించి మంచిని స్వీకరిస్తాడు. ప్రతి మనిషీ మరణానంతరం ప్రపంచంలో తాను చేసుకున్న కర్మలకు పరలోకంలో విశ్వ ప్రభువు ముందు సమాధానం చెప్పుకోవలసి ఉన్నందున ఆ ప్రకారమే ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుంది. విశ్వాసి మదిలో నిరంతరం మెదిలే ఈ భావనే దైవభీతి. ఇలాంటి భయభక్తులు కలిగిన మనిషి సమస్త చెడులకు, పాపాలకు దూరంగా ఉంటూ సదాచార సంపన్నుడై సదా పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితం గడుపుతాడు. పై వాక్యంలో రమజాన్ ఉపవాసాల అసలు ఉద్దేశం ‘దైవభీతి’ లేక ‘దైవభక్తులు’ అని తెలియజేయబడింది. అంటే రమజాన్ మాసంలో ఆచరించే ఉపవాసాలు మనిషిలో భయభక్తుల్ని జనింప జేసి, ఆ భావనలను పటిష్టం చేసే శిక్షణ ఇస్తాయన్నమాట. దైవం విశ్వాసులకు రమజాన్ ఉపవాసాలు పాటించాలని ఆజ్ఞాపించిన ఉద్దేశంలో దైవభీతితో పాటు, కృతజ్ఞత తెలియజేసుకోవడం కూడా ఉంది. అంటే, దైవం రమజాన్ మాసంలో మానవుల జీవితాలను సమూలంగా సంస్కరించి వారికి ఇహ పర సౌభాగ్యాలు అనుగ్రహించే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని కూడా అవతరింపజేసినందుకు వారాయనకు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. ‘‘దైవం మీకు రుజుమార్గం చూపినందుకు ఆయన ఔన్నత్యాన్ని కొనియాడడానికి, ఆయనకు కృతజ్ఞులై ఉండేందుకు గాను ఈ సౌలభ్యం ప్రసాదించాడు’’ (2-185). రమజాన్ ఉపవాసాలు పాటించడం ద్వారానే మనం దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోగలుగుతాం. ఈ పవిత్ర మాసంలో ఒక విశ్వాసి శక్తి ఉండి కూడా ఉపవాసాలు పాటించడం లేదంటే, అతడు దైవం చేసిన మేలును మరిచిపోయి ఆయనకు కృతఘు్నడై పోయాడని అర్థం. అ కృతఘ్నతా పర్యవసానాన్ని అతడు పరలోకంలో చవిచూడవలసి ఉంటుంది. కనుక ఉపవాసాల ఉద్దేశాన్ని, పవిత్ర ఖురాన్ అవతరణ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పరలోక పరాభవం నుండి తప్పించుకొని దైవ ప్రసన్నతకు పాత్రులం కాగలుగుతాం. అలా కాకుండా మిగతా మాసాలకు లాగానే రమజాన్‌ను కూడా నిర్లక్ష్యంగా గడిపేస్తే అంతకంటే దౌర్భాగ్యం మరేమీ ఉండదు. దైవం సమస్త మానవాళికీ సన్మార్గ భాగ్యం ప్రసాదించాలని, పరలోకంలో ఉన్నత స్థానాలు అనుగ్రహించాలనీ కోరుకుందాం. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ -
ఆధ్యాత్మిక శోభ
జంట పండుగలతో అలరారనున్న మహానగరం ఓవైపు బోనాలు, మరోవైపు పవిత్ర రంజాన్ ప్రార్థనలు నేడు గోల్కొండ కోటలో బోనాలు మతసామరస్యం వెల్లివిరిసేలా నెలరోజుల పండుగలు సాక్షి, సిటీబ్యూరో: జంట పండుగల వేళ మహానగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మతసామరస్యం వెల్లివిరిసేలా అన్ని వర్గాల వారు భక్తిపూర్వకంగా జరుపుకొనే పండుగలివి. భిన్న సంస్కృతుల మధ్య ఐక్యతకు చాటే సమయమిది. ఓ వైపు ఆనందం ఉట్టిపడేలా జరుపుకొనే ఆషాఢం బోనాల జాతర.. మరోవైపు ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే పవిత్ర రంజాన్ ప్రార్థనలు ఒకేసారి రావడంతో నగరం ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆషాఢంలో అమ్మవారి బోనాలు, పోతరాజుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఆషాఢ మాసం ప్రవేశించడంతో ఆదివారం భక్తజనసందోహం నడుమ గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వందల ఏళ్లుగా భక్తుల ఆరాధ్యదైవంగా, కొంగుబంగారంగా వెలుగొందుతోన్న జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఓ వైపు బోనమెత్తుకొని బారులు తీరే మహిళలు, మరోవైపు గుగ్గిలం, మైసాక్షిల పరిమళాలు, పోతరాజుల విన్యాసాలు అమ్మవారిని వేనోల్లా కీర్తిస్తూ ఆలపించే పాటలతో నగరం పులకించిపోనుంది. గోల్కొండలో ప్రారంభమయ్యే జాతర వరుసగా పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఆ తరువాత నగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలతో నెల పాటు కొనసాగుతుంది. మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. మరోవైపు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఇది కూడా నెల పాటు కొనసాగనుంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాను ఆరాధిస్తూ, ఉపవాసాలతో మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిల్లిపాది కఠోరమైన ఉపవాసదీక్షలు పాటిస్తారు. అన్ని వర్గాలతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటారు. పేద ముస్లింలను ఆదుకునేందుకు అందజేసే ఆర్థిక సహాయం రంజాన్ మాసంలోని గొప్పతనాన్ని ఆవిష్కరించనుంది. వరుస పండుగలు... ఆషాఢం తరువాత శ్రావణంలోనూ వరుగా పండుగలే వస్తున్నాయి. శ్రావణమాసం కూడా పవిత్రమైంది. ఆ నెలంతా భక్తులు, మహిళలు పూజలు, వ్రతాలు, నోములతో గడిపేస్తారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలతో నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడనుంది. ఈ వరుస పండుగలు మానసిక ప్రశాంతతను, ఆహ్లాదాన్ని, ప్రేమ, ఆప్యాయతలను పంచుతాయి. ఆధ్యాత్మిక భావాలను కలిగించడంతోపాటు, మానవ సంబంధాల్లోని మహోన్నతమైన విలువలను ఆవిష్కరిస్తాయి. -
పండుగపూట విషాదం
పరిగి, న్యూస్‌లైన్: రంజాన్ పర్వదినం.. ఆ కుటుంబమంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొంది. పిల్లలు సహా తండ్రి ఈద్గాకు వెళ్లి నమాజు చేసి వచ్చారు. కానీ అంతలోనే విధి ఆ బాలుడిని కాటేసింది. గుంత రూపంలో మృత్యువు కబళించింది. అప్పటిదాకా ఆనందంగా ఉన్న ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పరిగి మండలం సుల్తాన్పూర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం గుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు.. దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్ లారీ డ్రైవర్. ఆయనకు ఆరో తరగతి చదువుతున్న సోను(11), కూతుళ్లు అఫ్రిన్ (15), తబసుం(14), సోని(9) సంతానం. ఇటీవల పరిగి మండలం సుల్తాన్పూర్ గేట్ సమీపంలో స్థలం కొనుగోలు చేసి అక్కడే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. పిల్లలను పరిగిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. శుక్రవారం రంజాన్ పండుగ ఉండటంతో జహంగీర్ తన కుమారుడు సోనుతో కలిసి పరిగిలోని ఈద్గాకు వెళ్లి ప్రార్థనలు చేసి వచ్చారు. మధ్యాహ్నం తర్వాత సోను స్థానిక కుంట సమీపంలోని పొదల్లోకి బహిర్భూమికి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరికి రాకపోవటంతో కుమారుడి కోసం తల్లి వెతకసాగింది. కుంట ఒడ్డున సోను నీళ్లు తీసుకువె ళ్లిన డబ్బా, ఓ చెప్పు కనిపించింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. సమీప పొలాల రైతులు, గ్రామస్తులతో కలిసి కుంటలో వెతికారు. ఈక్రమంలో సాయంత్రం సోను మృతదేహం కుంటలో కనిపించింది. దీంతో జహంగీర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుంట లోతు మామూలుగానే ఉన్నప్పటికీ అందులో జేసీబీలతో మట్టి తవ్వకాలు అక్రమంగా జరపటంతో దాదాపు 10 మీటర్ల మేర గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచాయి. ఆ గుంతలే బాలుడిని బలిగొన్నాయని గ్రామస్తులు చెప్పారు. సుల్తాన్పూర్ శివారులోనే మరో చోట జేసీబీ గుంతల్లోనూ గతంలో ఓ బాలుడు పడి మృతిచెందినట్లు గ్రామస్తులు చెప్పారు. -
ఘనంగా ఈద్-ఉల్-ఫితర్
ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు జిల్లాలో ముస్లిం సోదరులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామ,గ్రామాన ఉన్న మసీదులు, ముఖ్యమైన ఈద్గాల వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖమ్మం నగరంలో వందలాది ఏళ్ల చరిత్రకల గాంధీచౌక్‌లోని ఈద్గావద్ద వేలాదిమంది ముస్లిం లు ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఈద్గాకు సదర్‌గా వ్యవహరిస్తున్న నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రార్థనలకోసం తగిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అతిపెద్దదైన మీనార్ కలిగిన ఖమ్మం ఖిల్లాలోని మజీద్-ఎ-నిమ్రాలో వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మజీద్-ఎ-నిమ్రా అధ్యక్షులు వాహెద్హుస్సేన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ప్రార్థనలకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలోని 45 మసీదులలో భారీ సంఖ్యలో రం జాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫిత్రా సొమ్ముకోసం ఈద్గాలు, మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో యాచకులు ఎదురుచూశారు. ఖమ్మం సమీపంలోని గొల్లగూడెం ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలలో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేత పొంగులేటిశ్రీనివాసరెడ్డి ఈద్గాను సందర్శించి ప్రార్థనల్లో పా ల్గొన్నారు. ఆయన ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అడిషనల్ ఎస్పి తఫ్సీర్ ఇక్బాల్ పలువురు ప్రముఖులు ఇక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. వెల్లివిరిసిన సోదరభావం రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు తమ ఇంటికి బంధువులు, స్నేహితులను, ఇరుగుపొరుగును ప్రత్యేకంగా ఆహ్వానించి పాయసం అందించారు. కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నగరవాసులు ముస్లిం సోదరుల ఇళ్లకువెళ్లి ఈద్‌ముబారక్ తెలిపారు. అందరూ కలసి పాయసం సేవించారు. అంతటా పండుగ వాతావరణం, సోదరభావం వెల్లివిరిసింది. అందరూ సుఖంగా ఉండాలి మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన పార్థనల సందర్భంగా మత పెద్దలు సందేశమిస్తూ విశ్వ మానవాళి సుఖ, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గాంధీచౌక్ లోని ఈద్గా వద్ద ఇమాం మౌలానా సఫ్దర్జ్రా ప్రసంగిస్తూ మహ్మద్ ప్రవక్త ద్వారా సర్వశక్తి వంతుడైన అల్లాహ్ ప్రపంచ శాంతికోసం పంపిన సందేశాన్ని వినిపించారు. ప్రపంచంలోని ముస్లింలు మాత్రమే కాక అన్ని జాతులు, మతాల వారు ఆనందంగా ఉండటానికి వీలుగా కరుణ చూపాలంటూ అల్లాహ్‌ను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్, సయ్యద్బుడన్సాహెబ్, సయ్యద్ సిరాజుద్దీన్, అహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. జైన్-ఉల్-అబిదిన్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్అసద్, గ్రామీణవైద్యుల సంఘ జిల్లా మైనారిటీ నేత నూర్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రముఖ మసీదులైన కమాన్‌బజార్‌లోని జమా మసీదులో ఇమాం సయ్యద్ అబ్దుల్ అజీజ్, కుతుబ్ షాహి మసీదులో ఇమాం మహ్మద్ సుబూర్, గాంధీచౌక్ లోని ఈద్గా వద్ద ఇమాం మౌలానా సఫ్దర్జ్రా,మజీద్ ఖ్వాసాలో హఫీజ్ మహ్మద్ అహ్మద్ ముస్లిం సోదరులతో ప్రత్యేక నమాజ్‌లు చేయించారు. మార్కెట్ మసీదు, బికె బజార్‌లోని జైన్-ఉల్-అబిదిన్ మసీదు, నిజాంపేట మసీదు, శుక్రవారపేటలోని తబేలా మసీదు, కస్బా బజార్‌లోని ఖాజీపుర మసీదు, ప్రభాత్ టాకీస్ సమీపంలోని గంధేషహీద్ మసీదు, కాల్వొడ్డులోని మోతి మసీదు, పాకబండ బజార్, ముస్తాఫానగర్, బుర్హాన్పుర తదితర ప్రాంతాలలోని మసీదులలో వేలాది మంది రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేటినుంచి 6రోజులు ఉపవాస దీక్షలు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం రంజాన్ పర్వదినం మరుసటిరోజు (షవ్వాల్ నెల రెండవ రోజు) నుంచి 6 రోజుల పాటు ఉపవాసదీక్షలను ముస్లింలు పాటిస్తారు. అయితే రంజాన్ నెలలో రోజాను ముస్లింలందరూ ఖచ్చితంగా పాటిస్తారు. రంజాన్ పండగ రోజు అనంతరం షవ్వాల్‌లో పాటించే ఈ ఉపవాసాలను మాత్రం ఆరోగ్యం ఇతర పరిస్థితుల దృష్ట్యా వీలయిన వారు పాటిస్తారు. -
భక్తి శ్రద్ధలతో రంజాన్
పవిత్రమాసంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం (09-08-2013) ముస్లింల ప్రార్థనలతో నగరంలో ఈద్గాలు, మసీదులు కళకళలాడాయి. ఉదయం 8 గంటల నుంచే ప్రార్థనాలయాలకు వేలాదిమంది తరలివచ్చారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఉల్లాసంగా గడిపారు. మక్కామసీదులో ముస్లింల ప్రార్థనల మీరాలం ఈద్గాలో... చార్మినార్ వద్ద దానం చేస్తూ... చిలకలగూడ ఈద్గా: చిన్నారులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే జయసుధ భద్రతాసిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్న చిన్నారులు చిలకలగూడ ఈద్గాలో ... లాలాగూడ: రంజాన్ వేడుకల్లో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఎల్బీనగర్ మజీద్గల్లీ వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్న పుత్తా ప్రతాప్‌రెడ్డి మియాపూర్ ఆదిత్యనగర్ కాలనీలోని ఈద్గాలో... రంజాన్ వేడుకల్లో కొత్వాల్ అనురాగ్ శర్మ రంజాన్ సందర్భంగా భోలక్‌పూర్‌లో ఒంటెలపై ఊరేగుతున్న చిన్నారులు భోలక్‌పూర్ బడీ మసీద్‌లో... అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ లో... -
ముస్లింలకు ప్రముఖుల ఈద్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకొంటున్న ముస్లింలకు వివిధ దేశాధినేతలు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత సమైక్యతకు ఈ పండుగ దోహదపడాలని రాష్ట్రపతి ప్రణబ్ గురువారం విడుదల చేసిన తన సందేశంలో ఆకాంక్షించారు. ఈ పర్వదినం శాంతి సామరస్యాలకు, సౌభ్రాతృత్వానికి, పురోగతికి దోహదపడాలని ప్రధాని మన్మోహన్ ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒబామా సంక్షోభంతో సతమతమవుతున్న సిరియాకు మానవతా సాయంగా రూ.1,184 కోట్లుఅదనపు సాయాన్ని ప్రకటించారు. భారత్‌లోని కేరళ రాష్ట్రంతో పాటు ఇండోనేసియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాల్లో ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని గురువారం నాడే జరుపుకున్నారు. -
రాష్ట్రానికి రంజాన్ కళ