AP CM YS Jagan Extends Ramadan 2023 Wishes To Muslims - Sakshi
Sakshi News home page

అల్లా దీవెనలతో అంతా మంచి జరగాలి.. ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ ఈద్‌ముబారక్‌

Published Fri, Apr 21 2023 7:51 PM | Last Updated on Sat, Apr 22 2023 9:08 AM

AP CM YS Jagan Extends Ramadan 2023 Wishes To Muslims - Sakshi

సాక్షి, గుంటూరు:  ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలియజేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని పేర్కొన్నారాయన.

మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ పండుగ. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని సీఎం జగన్‌ అన్నారు. కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు. 

పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్‌ దీవెనలతో ఏపీ ప్రజలకు అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. 

ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ సీఎం జగన్‌ ట్వీట్ కూడా చేశారు. ‘‘సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర,సోదరీమణులందరికీ ఈద్ ముబారక్’’ అంటూ సీఎం ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement