Ramdan
-
ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష!
ముఫ్ఫై రోజుల రమజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి... సహరీ, ఇఫ్తార్ ల ద్వారా సహనశీలత, కృతజ్ఞతాభావం అలవడ్డాయి.. ఖురాన్ పారాయణం, తరావీహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి. మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది. ఓ అల్లాహ్! ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యమైంది! ! ఓ అల్లాహ్! నీకు వేనవేల షుక్రియా (కృతజ్ఞతలు) అంటూ అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఈద్గాహ్ కు చేరుకుంటారు. ‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్’ మా రమజాన్ ఆరాధనలన్నీ స్వీకరించు ప్రభూ! అంటూ వేడుకుంటారు. నెల రోజుల రమజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపునే శుభ సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’ రమజాన్ పర్వదినం. ఈద్గాహ్ మైదానానికి చేరుకుని అల్లాహ్ ఘనతను, గొప్పతనాన్ని చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియలు. రంజాన్‌లో అల్లాహ్‌కు ఇచ్చిన వాగ్దానాలు మిగతా 11నెలలూ ఆచరణాభాగ్యానికి నోచుకోవాలని రోదిస్తారు. రాబోయే రంజాన్ వరకూ రంజాన్ స్ఫూర్తి కొనసాగించే భాగ్యాన్నివ్వమని అల్లాహ్ కు విన్నవించుకుంటారు. రెండు రకాతుల షుక్రానా నమాజు చేస్తారు. రమజాన్ మొదలు మళ్లీ వచ్చే రంజాన్ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి రంజాన్‌ను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్‌కు షుక్రియా తెలుపుకుంటారు. కేవలం మేము రంజాన్ వరకే ముస్లిమ్గాగా ఉండకుండా మిగతా 11నెలలూ ముస్లిమ్‌గా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని అల్లాహ్‌ని వినమ్రంగా వేడుకుంటారు. నెలంతా ఎన్నెన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు చేసినా వాటిపట్ల రవ్వంత గర్వాన్ని కూడా రానీయకూడదు. నెలసాంతం పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్ పారాయణం, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి ఆచరించిన నమాజులు, జకాత్, ఫిత్రా దానాలను నీవు నీ ప్రత్యేక కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు. నమాజు తరువాత ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. అందరి పండుగ.. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు ప్రతీ ముస్లిమ్ కుటుంబం ఉన్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్ ఖుర్మా పాయసాన్ని తమ ఆత్మీయులకు, దగ్గరి బంధువులకు, ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు. తమకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహ భాగ్యాలను చాటుకోవాలన్నది ప్రవక్త బోధన. ఫిత్రా, జకాత్ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబంలోని ఎంతమందైతే ఉన్నారో ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి నిరుపేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే. అర్హులై ఉండి ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు స్వీకరించబడవన్నది కూడా ప్రవక్త హెచ్చరిక. ఈదుల్ ఫిత్ర్ ఇలా... ఈదుత్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిములు ఖర్జూరాలు తిని ఈద్గాహ్ కు చేరుకుంటారు. ఈద్గాహ కు కాలినడకన వెళ్లడం ఉత్తమం. ఈద్ నమాజు తరువాత పిల్లలకు ఈదీ (ఈద్ కానుక)లు ఇస్తారు. ఖజా రోజాలు... రమజాన్ నెలలో ఎలాంటి కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా మిగతా రోజుల్లో ఏడాదంతా ఉపవాసం పాటించినా సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే కొంతమందికి రమజాన్ నెల ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. బాలింతలు, రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, రోగగ్రస్తులు మిగతా రోజుల్లో ఆ ఉపవాసాల సంఖ్యను పూరించాలన్నది ఖురాన్ ఉద్బోధ. ఇలాంటి రోజాలను ఖజా రోజాలు అని అంటారు. వీలయినంత త్వరగా ఈ రోజాలను పూర్తిచేయాలని ఉలమాలు సందేశమిస్తారు. రంజాన్ లో తప్పిపోయిన రోజాలను తొలి తీరికలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. రమజాన్ స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలి. ఖురాన్ ప్రబోధనలు ►మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయనిర్ణేతల వద్దకు తీసుకునిపోకండి. (2:188) ►ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. (2:253) న్యాయం పలకాలి. ►అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.(4:10) ►తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. (4:36) ►మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. (5:2) ►అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం.(9:108) ►పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. (17:29) నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు.యాచకుణ్ణి కసురుకోకు.(93.10) (చదవండి: హలీమ్.. రుచికి సలామ్) -
ముస్లిం సోదరులకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలియజేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారాయన. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని సీఎం జగన్ అన్నారు. కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని సీఎం జగన్ పేర్కొన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో ఏపీ ప్రజలకు అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర,సోదరీమణులందరికీ ఈద్ ముబారక్’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్.#EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2023 -
Ramadan Month: నేటి నుంచి రంజాన్..
సాక్షి, హైదరాబాద్: నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, మూడేళ్లుగా కరోనాతో నగరంలో రంజాన్ సందడి అంతగా కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో రంజాన్ కళ మళ్లీ తిరిగి రానుంది. ఒకవైపు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ..మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి. చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మల్లేపల్లితో, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్లు వెలిశాయి. వ్యాపార సంస్థలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఆదర్శ జీవనానికి రంజాన్ మాసం ప్రేరణ: సీఎం సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంత జీవనం దిశగా ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ఖురాన్ పఠనం, ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, జకాత్, ఫిత్రా వంటి ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత, జీవిత పరమార్థం అవగాహనలోకి వస్తాయని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. -
రమజాన్ పవిత్ర మాసం: చివరి రోజుల సదాచరణలు
పవిత్ర రమజాన్ చివరి దినాల్లో ఆచరించవలసిన ఆరాధనల్లో షబేఖద్ర్ బేసిరాత్రుల జాగరణ, ఏతెకాఫ్, ఫిత్రా ప్రధానమైనవి. చివరి బేసిరాత్రుల్లో విరివిగా ఆరాధనలు చేసి షబేఖద్ర్ ను పొందే ప్రయత్నం చేయాలి. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యి నెలలకన్నా శ్రేష్ఠమని పవిత్ర ఖురాన్ చెబుతోంది. అంటే షుమారు 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన కన్నా అధికమన్నమాట. మానవుడి సగటు జీవితకాలంకన్నా ఎక్కువ. అలాగే ఏతెకాఫ్ కూడా చాలాగొప్ప ఆరాధనే. చివరి పదిరోజులు మసీదులోనే ఒక పక్కన చిన్న పరదా ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా దైవారాధనలో గడపాలి. నమాజులు, జిక్ర్, దైవనామ స్మరణ, పవిత్ర గ్రంథ పారాయణం, హదీసు గ్రధాలు తదితరధార్మిక ఆచరణలు తప్ప, ఏవిధమైన ప్రాపంచిక కార్యకలాపాలు చేయకూడదు. మానవ సహజ అవసరాలకు తప్ప మసీదునుండి బయటికి వెళ్ళకూడదు. ఏతెకాఫ్ ద్వారా దైవంతో బంధం పటిష్టమవుతుంది. దైవప్రేమ, దేవుని సామీప్యత ప్రాప్తమవుతుంది. అలాగే ఈరోజుల్లో ఫిత్రాలు కూడా చెల్లించాలి. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధార్మిక పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుండే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త (స) ఆదేశించారు. ఫిత్రా దానంగా ఒక ‘సా’ అంటే పావుతక్కువ రెండు శేర్లు ఆహార దినుసులు పేదసాదలకు ఇవ్వాలి. మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఏ రూపంలో ఐనా ఇవ్వవచ్చు. ఫిత్రాలవల్ల రెండురకాల లాభాలున్నాయి. ఒకటి–రోజాలను ఎంత నిష్టగా పాటించినా, మానవ సహజ బలహీనత వల్ల ఏవో చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిహారంగా ఈ ఫిత్రాలు ఉపయోగపడతాయి. వీటివల్ల రోజాలు పవిత్రతను, పరిపూర్ణతను సంతరించుకొని స్వీకారభాగ్యానికి నోచుకుంటాయి.రెండు– ఫిత్రాలవల్ల సమాజంలోని పేద , బలహీనవర్గాలకు కాస్తంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారుకూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోగలుగుతారు. ఈకారణంగానే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాన్ని,‘నిరుపేదల భృతి ’ అన్నారు. అందుకే ఫిత్రాను ఉపవాసులకే పరిమితం చేయకుండా, పరిధిని విస్తరించారు. ఉపవాసం ఉన్నా లేకపోయినా అందరూ ఫిత్రా చెల్లించాలని చెప్పారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే, అంతమంది తరఫున కుటుంబ యజమాని ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందు జన్మించిన శిశువు తరఫున కూడా తల్లిదండ్రులు ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందే ఈ బాధ్యత నెరవేర్చుకోవాలి. ముందు చెల్లిస్తే లబ్ధిదారులు పండుగ సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. పండుగ సంతోషంలో అందరినీ భాగస్వాములను చేయడమే అసలు ఉద్దేశ్యం. అల్లాహ్ అందరికీ రమజాన్ చివరి దశకాన్ని సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ముస్లిం సోదరులకు తెలంగాణ సర్కారు ప్రత్యేక కానుకలు..
సాక్షి, నిర్మల్: రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సరఫరా చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే కోవిడ్ నిబంధనల ప్రకారం పంపిణీకి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు 6 వేలు గిఫ్ట్‌ప్యాక్‌లు.. పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు తెలంగాణ సర్కారు ఏటా గిఫ్ట్‌ప్యాక్‌లు అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 6వేల వరకు వచ్చాయి. వీటిని నియోజకవర్గాల వారీగా పంపణీకి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గానికి 2వేలు, ము థోల్ నియోజకవర్గానికి 2500, ఖానాపూర్ నియోజ కవర్గానికి 1500 చొప్పున కేటాయించారు. మసీదుల వారీగా అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి అందజేయనున్నారు. పంపిణీకి ఇబ్బందులు ఏర్పడకుండా ఇప్పటికే నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్లను ప్రత్యేక అధికారులుగా, మిగతా మండలాల తహసీల్దార్లను ఆయా మండలాల ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో అర్హులైన వారికి పంపిణీ చేస్తారు. ఇఫ్తార్ విందు రద్దు.. ఏటా రంజాన్ సందర్భంగా డ్రెస్ మెటీరియల్, చీర, కుర్తా పైజామాకు సంబంధించిన దుస్తులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌లు అందించడంతో పాటు ఇఫ్తార్ విందు కూడా ఘనంగా ఇచ్చేవారు. అయితే కోవిడ్ కారణంగా గతేడాది ఇఫ్తార్ విందు రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటిస్తూ గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీ.. రంజాన్ సందర్భంగా జిల్లాకు 6వేల గిఫ్ట్‌ప్యాక్‌లు వచ్చాయి. త్వరలోనే వీటిని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులైన వారికి పంపిణీ చేయనున్నాం. – స్రవంతి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, నిర్మల్ -
ఈద్ కానుకగా ‘రాధే’లోని మూడో పాట విడుదల
-
అభిమానులకు సల్మాన్‌ఖాన్ ఈద్ ‘కానుక’
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన మాట నిలబెట్టుకున్నాడు. ఎప్పటిలాగే ఈ రంజాన్‌కు తన తాజా సినిమా ‘రాధే’ను భాయిజాన్ విడుదల చేయాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఈ క్రమంలో భాయిజాన్ ‘రాధే’లోని భాయ్ అంటూ సాగే పాటను సోమవారం సాయంత్రం విడుదల చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలైన విషయం తెలిసిందే. అభిమానులకు ఈద్ సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ‘రాధే’లోని మూడో పాటను భాయిజాన్ విడుదల చేశాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో ప్రకటిస్తూ.. ‘మొదట అందరికి ఈద్ ముబారక్. ఈ ఏడాది మహమ్మారిని ఎదుర్కోవటానికి మనందరికి బలం చేకూరాలని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. (అయ్యో ఈ సారి భాయిజాన్ సినిమా లేదే!) అంతేగాక ‘‘ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది ఈద్‌కు నా సినిమాను విడుదల చేయలేకపోయాము. కాబట్టి నా ప్రియమైన అభిమానులందరి కోసం ఈ పాటను ప్రత్యేకంగా రూపోందించాం. మనమంతా సోదర భావం, ఐక్యతగా ఉండాలనే భావనతో భాయ్ అని పిలుచుకుంటాము. దీనికి గుర్తింపుగా ‘భాయ్ భాయ్’ పాటను ఈద్ ప్రత్యేక రోజును ఉత్తమంగా భావించి విడుదల చేశాం. దీనిని మీరంతా తప్పకుండా ఆనందిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా భాయిజాన్ గత కొన్నేళ్లుగా ప్రతి రంజాన్‌కు తన కొత్త సినిమాను విడుదల చేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంగా విడుదలైన భాయిజాన్ సినిమాలన్ని ఘన విజయం సాధించి భారీ కలెక్షన్లను రాబట్టాయి. అదే విధంగా 2020 ఈద్‌కు కూడా తన ‘రాధే సినిమాను విడుదల చేయాలనుకున్నాడు. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. (కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్) -
‘మటన్ బిర్యానీ, పాయసం పంపించా తీసుకోండి’
హైదరాబాద్: ముస్లింలు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు చేసుకున్నారు. ఇక రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హలీమ్, బిర్యానీ, సేమియా పాయసం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం సోదరులు తమ ఆత్మీయులను ఇంటికి పిలిచి రంజాన్ ప్రత్యేక వంటకాలను వడ్డించే వీలులేకుండా పోయింది. అయితే టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన ఆత్మీయులకు కోసం వినూత్నంగా ఆలోచించాడు. మటన్ బిర్యానీ, సేమియా పాయసం, డెజర్ట్స్‌ను టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రికి షమీ ప్రత్యేకంగా పంపించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పేర్కొంటూ, తను పంపించిన ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించిన ఫోటోను కూడా జత చేశాడు. ‘రవి భాయ్.. సేమియా పాయసం, మటన్ బిర్యానీ, డెజర్ట్స్‌లను ప్యాక్ చేసి పంపించాను. కొద్దిసేపట్లో మీ దగ్గరికి వస్తుంది. స్వీకరించండి’ అంటూ షమీ ట్వీట్ చేశాడు. అంతకుముందు తన అభిమానులకు, సహచర క్రికెటర్లకు సోషల్ మీడియా వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు. Ravi bhai app ki Seviyan ,kheer ,or Mutton biryani maine courier kardia hey Kucch time main pahunch jaega dekhlo app @RaviShastriOfc pic.twitter.com/MZSshUpz3O— Mohammad Shami (@MdShami11) May 25, 2020 Eid Mubarak! May Allah fulfill your all dreams and hopes. pic.twitter.com/KHHfgNjTr1— Mohammad Shami (@MdShami11) May 25, 2020 చదవండి: ఐపీఎల్-2020 విజేత ఆర్సీబీ: సంబరంలో ఫ్యాన్స్ హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్ -
లాక్డౌన్ ఆంక్షలు.. ఇళ్లల్లోనే ఈద్ వేడుకలు
-
అయ్యో ఈ సారి భాయిజాన్ సినిమా లేదే!
ముంబై: గత కొన్నాళ్లుగా ఈద్ అంటే కొత్త బట్టలు, రంజాన్ తోఫా, రకరకాల వంటకాలు, ఖీర్, బిర్యానీ... భాయిజాన్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమా. ఇలా ఈద్ 2009 నుంచి కొనసాగుతుంది. అయితే 2020 ఈద్ అందుకు భిన్నంగా జరిగింది. భాయిజాన్ కొత్త సినిమా తప్పా మిగిలిన అన్ని ఉన్నప్పటికీ అభిమానుల్లో కొంత అసంతృప్తి. ప్రతీ రంజాన్‌కు భాయిజాన్ సినిమా థియేటర్లో చూడందే వారికి పండుగ పండగలా గడవదు. ఇక మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపోందించిన తెలుగు పోకిరిని సల్మాన్ హీరోగా ‘వాంటెడ్’ 2009 ఈద్ సందర్భంగా విడుదలై బీ-టౌన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. 2010-‘చుల్బుల్ పాండే’, 2011-‘బాడీగార్డు’, 2012-‘ఎక్ తా టైగర్’తో రంజాన్‌కు అభిమానులను అలరించిన భాయిజాన్ 2013లో కాస్తా బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత 2014-‘కిక్’, 2015-‘భజరంగీ భాయిజాన్’, 2016-‘సుల్తాన్’, 2017-‘ట్యూబ్‌లైట్’, 2018-‘రేస్’, 2019-‘భరత్’తో థియోటర్లో ఈద్ సందర్భంగా అభిమానులను పలకరించాడు. (కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్) అయితే 2020లో ఈద్ కానుకగా సల్మాన్, దిశా పటానీల రాధేను విడుదల చేయనున్నట్లు సల్మాన్ గతేడాది సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ కారణంగా దేశంలో సినిమా థియోటర్లతో పాటు ఇతర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లను కూడా నిలిపివేయడంతో ‘రాధే’ చిత్రం విడుదల వాయిదా పడింది. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అంతేగాక రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్‌లు కీలక పాత్రలో కనిపించనున్నారు. (సల్మాన్‌తో పూరి సినిమా?) -
రెండు వారాల పాటు క్వారంటైన్లో నటుడు
ముంబై: నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని తన స్వస్థలమైన బుధానాలో 14 రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు. రంజాన్ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ముంబాయి నుంచి తన స్వస్థలం బుధానాకు శనివారుం వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను రెండు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అక్కడి అధికారులు సూచించారు. అయితే లాక్డౌన్లో ఆయన తన స్వస్థలానికి వెళ్లాడానికి అధికారుల వద్ద అనుమతి పొందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మహరాష్ట్ర(రూరల్) ఎస్పీ నేపాల్ సింగ్ మాట్లాడుతూ.. నవాజుద్ధీన్ తన కుటుంబంతో కలిసి బుధానాకు ప్రయాణించడానికి అనుమతి పొందారని స్పష్టం చేశారు. అంతేగాక ఆయనకు, కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివి వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారంతా క్వారంటైన్ ఉన్నారని ఆయన ధృవీకరించారు. (కోలీవుడ్ టు బాలీవుడ్) చదవండి: ఇండియాలోనే తెలియనివారు ఎవరూ లేరు.. ఇక నవాజుద్దీన్ సోదరుడు అయజుద్దీన్ మాట్లాడుతూ.. ‘ఇది రంజాన్ పండుగ మాసం కావున నవాజుద్దిన్ బుధానాకు రావడం ముఖ్యం. అంతేకాదు లాక్డౌన్లో షూటింగ్‌లు కూడా లేకపోవడంతో నవాజుద్దీన్ బుధానాకు రావాలని నిర్ణయించుకున్నాడు. మా సోదరి మరణించి కూడా 4 నెలలు గడిచింది. ఈద్ పండుగ కూడా వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో నవాజుద్ధీన్ మా కుటుంబంతో గడిపితే అందరం సంతోషిస్తాం. అయితే ఈ ఏడాది మేము రంజాన్ పండుగ జరుపుకోనప్పటికీ నవాజుద్దీన్ ఈ సమయంలో ఇంట్లో ఉండటం అవసరం’ అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా అధికారుల ఆదేశం మేకు, లాక్డౌన్ నిబంధనలకు కట్టుబడి తాను, తన కుటుంబం క్వారంటైన్‌లోనే ఉంటామని, ఎవరినీ కలిసే ప్రయత్నం చేయమని నవాజుద్దీన్ అధికారులు తెలిపాడు. కాగా ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ మోటిచూర్ చక్నాచూర్‌లో నటించాడు. తాజాగా ఆయన నటించిన ‘ఘూమ్‌కేటు’ మే 22 న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో విడుదలకు సిద్ధంగా ఉంది. (క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి) -
జమాత్‌కు దూరంగా.. జకాత్‌కు దగ్గరగా
కర్నూలు(అర్బన్): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఉపవాస దీక్షలకు ముస్లింలు ఉపక్రమించారు. నెలరోజుల పాటు ఐదుపూటలా నమాజు చేస్తారు. ఈ మాసంలో ఏ కార్యం చేసినా పుణ్యం 70 రెట్లు అధికంగా ఉంటుందని దివ్య ఖురాన్‌తో పాటు హదీసుల్లో పేర్కొన్నారు. ఎవరిపైనా కోప పడకుండా, కొట్లాడకుండా ప్రశాంత చిత్తంతో అల్లాను ఆరాధించాలి. లాక్డౌన్ నిబంధనలను గౌరవిస్తూ రంజాన్ పుణ్య కార్యాలు ఆచరించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా నమాజ్ జమాత్‌తో (సామూహికంగా) చేయాలనేది శ్రేష్టమైన విధానమని పేర్కొంటారు. అయితే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా జమాత్‌తో కాకుండా వ్యక్తిగతంగా ఇళ్లలోనే నమాజు చేయడం ద్వారా పుణ్యం ఏమాత్రమూ తగ్గదని ఆలిమ్లు పేర్కొంటున్నారు. ఉపవాస వస్తువుల కొనుగోలుకు వెసులుబాటు.. రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్షలకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వం ఉదయం 10 గంటల వరకు వెసులు బాటు కలి్పంచింది. పుణ్యకార్యాల్లో భాగంగా ఎవరైనా సహెర్కు ఆహారం సమరి్పంచాలనుకుంటే తెల్లవారు జామున 3 నుంచి 4.30 గంటల వరకు ఉండే సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ పూర్తి చేసుకోవాలి. అలాగే ఇఫ్తార్‌కు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు వెసులుబాటు ఉంటుంది. సడలింపులు ఇచ్చాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ మాసంలో లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చామని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మసీదులో ఇమామ్, మౌజన్, మరో ముగ్గురు కమిటీ సభ్యులు (మొత్తం ఐదుగురు) నమాజ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ధ్రువీకరించిన ఇమామ్, మౌజన్లకు ఇంటి నుంచి మసీదులకు వెళ్లేందుకు పాసులు ఇస్తారన్నారు. గుర్తించిన హోటళ్ల ద్వారా సహెర్, ఇఫ్తార్ సమయంలో కేవలం పార్శిల్స్ మాత్రమే ఇచ్చేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. ‘జకాత్’కు సంబంధించి పేదవారి ఇంటికి సరుకులు చేర్చాలని, బహిరంగ ప్రదేశాల్లో, దాతల ఇళ్ల వద్ద సరుకులు పంచరాదని సూచించారు. క్వారంటైన్ సెంటర్లలో ఉంటున్న ముస్లింలకు సహెర్, ఇఫ్తార్ సమయంలో నాణ్యమైన పౌష్టికాహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్ సమకూరుస్తున్నట్లు చెప్పారు. భౌతిక దూరాన్ని పాటిద్దాం ఐదు పూటలా మసీదుల నుంచి ఆజాన్ పిలుపు వినిపిస్తుంటుంది. ఇమామ్, మౌజన్లు మసీదులో నమాజ్ చేస్తారు. లాక్డౌన్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటించాల్సి ఉంది. నమాజులు ఇళ్లల్లోనే చేయాలి. ఇది నా ఒక్కరి నిర్ణయం కాదు. దేశంలోని మౌలీ్వలు, మతపెద్దలందరు కలసికట్టుగా తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం కలి్పంచిన వెసులుబాటును సది్వనియోగం చేసుకుందాం. – ముఫ్తి అబ్దుస్సలాం, ప్రభుత్వ ఖాజీ -
రంజాన్: నెలవంక దర్శనం
సాక్షి, హైదరాబాద్ : రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నెలవంక దర్శనమిచ్చింది. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. లాక్డౌన్ నేపథ్యంలో రంజాన్ మాసంలో ఇంట్లోనే నమాజు చేయాలని ముస్లింలకు ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదు షాహీ ఇమామ్‌లు సూచించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా సహకరించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా సూచించిన విషయం తెలిసిందే. -
ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు : హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణా హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. కోఠి, సుల్తాన్ బజార్లో గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత సంతోష్‌గుప్తా ఆధ్వర్యంలో 500 మంది పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కూరగాయలను హోం మంత్రి పంపిణీ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ మే 7 వరకూ లాక్డౌన్ పొడిగించారని, ప్రజలంతా సహకరించాలని మహమూద్ అలీ కోరారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. -
రంజాన్ విధుల్లో.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, నిజామాబాద్ : రంజాన్ పర్వదినాన నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వర్తిస్తుండగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ పుల్లూరి ఆనంద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఖిల్లా ఈద్గా వద్ద రంజాన్ పండుగ విధుల్లో ఉన్న ఆనంద్‌కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయారని వైద్యుల నిర్ధారించారు. కానిస్టేబుల్ ఆనంద్కి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆనంద్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుర్కపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆనంద్ మృతిపట్ల సీపీ కార్తికేయ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. -
ప్లేట్ ఖుష్
పండగ అంటే షేర్వానీ తొడగడం... షేర్ చేసుకొని తినడం. పొరుగువారిని పిలవడం... నలుగురికి పంచడంఇలా చేస్తే... హృదయం ఆనందంతో నిండిపోతుంది... పంచిన మనకు ప్లేట్ఖుష్ తిన్నవారి పేట్ఖుష్ అందరికీ దిల్ఖుష్. పత్తర్ కా ఘోష్ కావల్సినవి :బోన్‌లెస్ మటన్ – కేజీ; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్; దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్; జాజికాయ పొడి – పావు టీ స్పూన్; లవంగాల పొడి – చిటికెడు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; నెయ్యి – 100 గ్రాములు; ఆవనూనె – అర కప్పు; మిరియాల పొడి – చిటికెడు ; బొప్పాయి కాయ గుజ్జు – టేబుల్ స్పూన్; కారం – టీ స్పూన్; అనాసపువ్వు పొడి – చిటికెడు ; నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు; చిలికిన పెరుగు – కప్పు ; ఉప్పు – తగినంత ; వెల్లుల్లి రసం – 2 టేబుల్ స్పూన్లు తయారి:మటన్‌ని శుభ్రం చేసి, నీళ్లన్నీ పోయేలా వార్చాలి ∙అందులో పై మసాలా, కారం... అన్నీ కలిపి 2 గంటలు నానబెట్టాలి ∙వెడల్పాటి రాయిని బొగ్గుల కుంపటి మీద పెట్టి వేడి చేయాలి ∙నెయ్యి వేసి, ఒక్కో ముక్కను అన్ని వైపులా బాగా కాల్చి తీయాలి ∙వేడి వేడిగా వడ్డించాలి. నోట్: ఇలాగే చికెన్‌తోనూ తయారుచేసుకోవచ్చు. మటన్ బిర్యానీ కావల్సినవి:బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగి వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి); మసాలా (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) ; రైస్ మసాలా: (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత) తయారి: బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి ∙కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, తగినంత ఉప్పు వేసి బియ్యం ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి ∙తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి ∙మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్ వేసి కలపాలి ∙పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి ∙సగం ఉండికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి ∙ మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి ∙డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి ∙సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి ∙తర్వాత వేడి వేడిగా వడ్డించాలి. గోంగూర మటన్ కావాల్సినవి:గోంగూర ఆకులు (శుభపరిచినవి) – 250 గ్రాములు; బోటి (మేక మాంసం) – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత ; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – టీ స్పూన్; గసగసాలు – టీ స్పూన్ తయారి:మేక మాంసం తీసుకొని వేడినీటిలో 15 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లు వంపేసి, చల్లారిన తరువాత ముక్కలు చేయాలి. పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి వేయించాలి. ఆ తరువాత బోటిని వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి. 15 నిమిషాల తరువాత తరిగిన పుంటికూర ఆకులు వేసి ఉడికించి, గరం మసాలా, కొత్తి మీర వేసి దించాలి. భేజా ఫ్రై కావల్సినవి:మేక బ్రెయిన్ (భేజా)– 200 గ్రాములు; టొమాటో తరుగు – కప్పు; ఉల్లిపాయ తరుగు – కప్పు ; పచ్చిమిర్చి చీలికలు – 3 ; కొత్తిమీర తరుగు – టీ స్పూన్; మిరియాలు (కచ్చాపచ్చాగ దంచాలి) – 10 ; కారం – అర టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – తగినంత తయారీ:మరుగుతున్న నీళ్లలో పసుపు, ఉప్పు వేసి భేజాను 2–3 నిమిషాలు ఉంచాలి ∙తరువాత నీళ్లను వడకట్టాలి ∙గట్టిపడిన భేజాను ముక్కలుగా కట్ చేయాలి ∙పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కాగాక జీలకర్రను చిటపటలాడించాలి ∙దీంట్లో ఉల్లిపాయ తరుగు వేసి ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి ∙దీంట్లో టొమాటో తరుగు వేసి మరో 3–4 నిమిషాలు ఉడికించి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు వేసి మరో అర నిమిషం కలపాలి ∙దీంట్లో ఇతర మసాలా పొడులు వేసి, గరిటెడు నీళ్లు కలిపి ఉడికించాలి ∙మిశ్రమం చిక్కగా అయ్యాక కట్ చేసిన భేజాను వేయాలి ∙ఎక్కువ కలపకుండా నూనె కూరనుంచి వేరయ్యేదాక ఉడికించాలి ∙చివరగా మంటతీసేసి కొత్తిమీర, నిమ్మరసం వేసి దించాలి. పాయా షోర్బా కావల్సినవి: మటన్ ముక్కలు(పాయా/కండ ఉన్న ఎముకలు) – 10–15; వెల్లుల్లి – 8 రెబ్బలు; ఉల్లిపాయలు – 4 ; పసుపు – అర టీ స్పూన్; లవంగాలు – 5; పచ్చ యాలక్కాయలు – 4 ; లవంగాలు – 6 ; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఉప్పు – తగినంత ; నెయ్యి – అర కప్పు ; కారం – అర టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; కొత్తిమీర – చిన్న కట్ట; గరం మసాలా – టీ స్పూన్; నిమ్మరసం – టేబుల్ స్పూన్ తయారి:మటన్‌ని శుభ్రపరుచుకొని పక్కనుంచాలి ∙2 ఉల్లిపాయలను సన్నగా తరగాలి ∙మరో రెండింటిని వెల్లుల్లితో కలిపి ముద్దచేసి పక్క నుంచాలి ∙పెద్ద మందపాటి గిన్నె15–16 కప్పుల నీళ్లు, మటన్ ముక్కలు వేసి ఉడికించాలి ∙దీంట్లో ఉల్లిపాయ ముద్ద, పసుపు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి సన్నని మంట మీద ఉడికించాలి ∙పాయా మిశ్రమం చిక్కపడుతుండగా మరో 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి ∙విడిగా ఒక పాన్‌ను స్టై మీద పెట్టి నెయ్యి వేసి, దాంట్లో ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి ∙తర్వాత కారం, మిరియాల పొడి వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాయాలో వేసి కలపాలి ∙ చాలా సన్నని మంట మీద దాదాపు 4 గంటల సేపు మరిగించాలి ∙పాయ నుంచి ముక్క కొద్దిగా విడేదాకా ఉడికించాలి ∙తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసి, పైన కొద్దిగా నెయ్యి వేసి మంట తీసేయాలి ∙నిమ్మరసం కలిపి వేడి వేడిగా రోటీ, పుల్కాలలోకి వడ్డించాలి. మటన్ ఫ్రై కావల్సినవి:మటన్ ముక్కలు – 200 గ్రాములు; పసుపు – అర టీ స్పూన్; అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; నిమ్మకాయ – సగం ముక్క; గరం మసాలా – అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; కారం – టీ స్పూన్; మైదా – టీ స్పూన్; ఉప్పు – తగినంత; కొత్తిమీర – టీ స్పూన్; నూనె – తగినంత తయారి: ∙మటన్‌ను కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉడికించాలి ∙నీళ్లన్నీ ఇంకిపోయాక నిమ్మ రసం కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి ∙తర్వాత మటన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా వేసి కలపాలి ∙కడాయిలో తగినంత నూనె వేసి మటన్‌ని బాగా వేయించాలి ∙చివరగా కొత్తిమీర చల్లి దించాలి. నిమ్మముక్కతో వడ్డించాలి. మటన్ కర్రీ కావల్సినవి: బోన్‌లెస్ మటన్ – అర కేజీ; జీలకర్ర – అర టేబుల్ స్పూన్; ఉల్లిపాయల తరుగు – కప్పుడు; గసగసాల పేస్ట్ – అర కప్పు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్ ; కారం – అర టీ స్పూన్; బిర్యానీ ఆకులు – 2 ; లవంగాలు – 8 ; ఆకుపచ్చ ఇలాచీలు – 8 ; దాల్చిన చెక్క – చిన్న ముక్క; జాజికాయ పొడి – పావు టీ స్పూన్; నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత తయారి: ∙కడాయిలో లవంగాలు, ఇలాచీలు, జాజికాయ పొడి, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేయించి, పొడి చేయాలి ∙గిన్నెలో నూనె వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీంట్లో మటన్ ముక్కలు, చేసి పెట్టిన గరం మసాలా, పసుపు, కారం వేసి, కప్పు నీళ్లు ఉప్పు వేసి ఉడికించాలి. చిక్కదనం బట్టి మరికొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు ∙చివరగా గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. వేడి వేడిగా అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
‘రంజాన్’తో మార్కెట్లు కిటకిట
అబిడ్స్/జియాగూడ : రంజాన్ పండుగతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రంజాన్ పండుకు ప్రత్యేకంగా కొత్త బట్టలు, రంజాన్ సామాగ్రి, హలీం తయారీ కోసం మేకల విక్రయాల జోరుతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. రంజాన్ పండుగ చేరువవుతుండటంతో మైనార్టీలు పండుగకు కావాల్సి వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రధాన మార్కెట్లకు చేరుకుని కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా జియాగూడ సబ్జిమండి, పురానపూల్, బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, బడీచౌడి, జుమ్మెరాత్‌బజార్ తదితర ప్రాంతాల్లో రంజాన్ విక్రయాలు ఊపందుకున్నాయి. రంజాన్ పండగకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు .. రంజాన్ పండుగకు మైనార్టీలు ప్రత్యేకంగా కుందన్, చెమ్కీతో తయారు చేసిన వస్త్రాలను అధికశాతం పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తారు. అలాగే ఇమిటేషన్ గోల్డ్ వస్తువులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. రంజాన్ పండుగ రోజున అచ్చమైన ముస్లిం వస్త్రాలను ధరించి శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. రంజాన్ పండుగకు మహారాష్ట్ర, కోల్‌కతా ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం వర్క్ వస్త్రాలు హైదరాబాద్‌కు దిగుమతి అవుతాయి. మైనార్టీలు ఉండే పాత బస్తీ, కార్వాన్, సబ్జిమండి, కోఠి ప్రాంతాల్లో వీటì విక్రయాలు జోరుగా కొనసాగుతాయి. అలాగే చెమ్కీ చెప్పులు, కమ్మలు, జుమ్కాలు, లాకెట్లు, బింగియా, జడ గంటలు తదితరవి ఎక్కువ శాతం కొనుగోలు చేస్తారు. ప్రతి ఏటా వీటి విక్రయాలు లక్షల్లో ఉంటాయి. రంజాన్ వస్త్రాలను ఆరు నెలల ముందు నుంచే ఇతర రాష్ట్రాలలో తయారై నగరానికి చేరుకుంటాయి. వస్త్రాలలో కుందన్స్ డిజైన్లకు గాగ్రా, చుడీదార్, అనార్కలీ, సారీలు తదితరవి అధిక శాతం కొనుగోలు చేస్తారు. వీటి ధరలు రూ. 1500 నుంచి రూ. 10,000 వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంటాయి. మేక మాంసానికి గిరాకీ.. రంజాన్ సీజన్లో హలీం తయారీకి మేకల మాంసం అవసరం. వీటి విక్రయాలు కూడా జియాగూడ మేకల మండి, పురానాపూల్, రింగ్ రోడ్, మొఘల్ఖనాలా, అత్తాపూర్ హై వే రోడ్డు, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో మేకలను విక్రయిస్తుంటారు. మండిల్లో మేకల విక్రయాలు హలీం తయారీ కోసం జోరుగా కొనసాగుతున్నాయి. హలీం తయారీకి వాడే మేకలు ఝాన్సీ, మహారాష్ట్రాల నుంచి అధిక శాతం మండిలకు దిగుమతి అవుతున్నాయి. దీంతో గొర్రె మేకల ధరలు కూడా సాధారణ రోజుల కంటే ధరలు పెరిగాయి. నాణ్యతకు మారుపేరు.. జియాగూడ మేకల మండి జాతీయ స్థాయిలో నెం.1 మార్కెట్‌గా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మాంసం హలీం తయారీ నిమిత్తం నగరంలోని అన్ని హోటళ్లకు సప్లయి చేస్తున్నాం. మండీని ఆధునీకరించినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. – జమాల్పూర్ బందూలాల్, జియాగూడ స్లాటర్ హౌస్ వెల్పేర్ ఫెడరేషన్ చైర్మన్ -
‘పాక్‌కు దీటుగా బదులిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌కు ధీటైన బదులిస్తామని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రంజాన్ నేపథ్యంలో సరిహద్దు వ్యవహారంపై ఆమె మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్‌తో చర్చల అంశంపై ఆమె స్పందించారు. ‘ ఓవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. మరోపక్క చర్చలంటే కుదిరే పని కాదు. ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి కుదరవు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలు. అలా కాదని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన జవాబిస్తాం. సరిహద్దులను సురక్షితంగా ఉంచటం మా బాధ్యత. భారత్ కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి కట్టుబడి ఉంది. అంతేగానీ కవ్వింపు చర్యలను ఉపేక్షించబోదు’ అని ఆమె పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారంపై ఆమె స్పందించారు. ‘రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారం, సంబంధాలు చాలా ధృడమైనవి. రాఫెల్ జెట్స్ కొనుగోళ్ళలో ఎటువంటి కుంభకోణం జరగలేదు. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. యూపీఏ హయాంలో ఆయుధాల కొరత ఉండేది. 2013-14 లో 87 వేల కోట్లకు గాను 79వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, ప్రస్తుతం భద్రతా బలగాలకు ఆయుధాల కొరత లేదు. 2017-18లో 86488 కోట్ల కేటాయింపులకు గాను 90460 ఖర్చు చేశాం. అవసరమైన ఆయుధాలు కొనే అధికారాన్ని సులభతరం చేశాం’ అని ఆమె వివరించారు. కంటోన్మెంట్ల రోడ్ల గురించి.. ‘దేశంలోని 62 కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై పలు విజ్ఞప్తులు అందాయి. టీఆర్ఎస్(తెలంగాణ) సహా పలు పార్టీల ప్రతినిధులతో చర్చించాం. మిలటరీ, సివిల్ సొసైటీతో సమావేశాలు నిర్వహించాం. రోడ్ల మూసివేతపై ఎంపీలు చేసిన విజ్ఞప్తిలో అర్ధముంది. ఇప్పటిదాకా 850రోడ్లు మూసివేయబడ్డాయి. 119 రోడ్లు నిబంధనలు పాటించకపోవటంతో మూసేశారు. 80 రోడ్లను మళ్ళీ తెరిపించాం. 15 రోడ్లను పాక్షికంగా తెరిచాం. 24 ఇంకా మూసివేసే ఉన్నాయి ’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. -
‘రంజాన్ స్పెషల్ హలీం’ కథ ఇదీ..
రంజాన్ అంటే హలీం... హలీం అంటే రంజాన్ అనే స్థాయిలో ప్రాచుర్యం పొందిందీ వంటకం. ఇంతకీ వంటకం ఎక్కడిది? ఎవరు పరిచయం చేశారు? నగరానికి ఎలా వచ్చింది? దీని ప్రస్థానం ఎలా మొదలైంది? ఇంతటి ప్రాచుర్యం ఎలా పొందింది? తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేకం. సాక్షి, సిటీబ్యూరో : హలీం వంటకం పురుడు పోసుకుంది హైదరాబాద్‌లోనే. ఈ రుచికరమైన వంటకాన్ని మనమే ప్రపంచానికి పరిచయం చేశాం. ఇరాన్‌కు చెందిన హుస్సేన్ జాబిత్ 1947లో మదీనా సర్కిల్లో ఓ హోటల్ నెలకొల్పాడు. విభిన్న రకాల ఇరాన్ వంటకాలను నగరవాసులకు రుచి చూపించాడు. అయితే 1956లో రంజాన్ మాసం ప్రారంభమైన తొలిరోజు ‘హలీం’ పేరుతో ఓ కొత్త వంటకాన్ని తయారు చేసి, 25పైసలకు కఠోరా (పాత్ర)లో ఇవ్వడం ప్రారంభించాడు. అలా హలీం ప్రస్థానం ప్రారంభమైంది. తొలుత లభించని ఆదరణ... తొలుత హలీంకు పెద్దగా ఆదరణ లభించలేదు. తొలి ఏడాది ఎక్కువగా విక్రయమవ్వలేదు. దీంతో బిర్యానీ తింటే హలీం ఫ్రీ అని ప్రకటించారు. ఇక రెండో ఏడాది వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హలీం విశిష్టతను తెలియజేస్తూ పోస్టు కార్డులతో ప్రచారం నిర్వహించారు. టెలిఫోన్ డైరెక్టరీలోని అడ్రస్‌లకు పోస్టు కార్డులు రాశారు. దీంతో కొంతమేర విక్రయాలు పెరిగాయి. 1956–1960 వరకు పోస్టు కార్డులు, పత్రిక ప్రకటనలు, పోస్టర్లు తదితర మార్గాల్లో హుస్సేన్ ప్రచారం నిర్వహించారు. మొత్తానికి ఆయన ప్రయత్నం ఫలించింది. 1961 నుంచి హలీంకు డిమాండ్ పెరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున మదీనాకు రావడం మొదలైంది. ఎక్కువ జనం రావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. ఇలా 1998 వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగాయి. అదే ఏడాది హోటల్ నిర్వాహకుడు హుస్సేన్ మరణించారు. విశ్వవ్యాప్తం... తర్వాతి కాలంలో హలీం మరింత ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా 2005 నుంచి నగరంలో విక్రయాలు బాగా పెరిగాయి. మదీనా హోటల్ మూతపడిన తర్వాత పిస్తాహౌస్, షాగౌస్, సర్వీ, షాదాబ్ తదితర ఈ రంగంలోకి వచ్చాయి. పిస్తాహౌస్ హలీంకు డిమాండ్ విపరీతమైంది. ప్రస్తుతం వీరు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. అదే ప్రత్యేకత.. ఇరానీ పద్ధతిలోనే మా హోటల్లో హలీం తయారు చేస్తాం. ఇరానీ హలీం ప్రత్యేకత ఏమిటంటే ఘాటుగా ఉండదు. ఇందుకు గోధుమలు, మాంసం, నెయ్యి సమానంగా తీసుకోవాలి. ఈ మూడు హలీం తయారీకి కీలకం. మసాల దిను సులు వంటకానికి అనుగుణంగా వాడుకోవాలి. – మీర్జా అలీ, సర్వీ హోటల్ నిర్వాహకుడు ఇరానీ పద్ధతిలో.. ఇరానీ సంప్రదాయాలు మనతో మమేకమయ్యాయి. ఇరానీ రుచులు తొలి నుంచి నగరానికి పరిచయమే. ప్రస్తుతం నగరంలోని ఎన్నో హోటళ్లలో హలీం తయారు చేస్తున్నారు. అయితే ఇరానీ హోటళ్లలో మాత్రమే ఇరానీ పద్ధతిలో హలీం తయారు చేస్తున్నారు. మేము నేటికీ ఇరానీ పద్ధతిలోనే హలీం తయారు చేస్తున్నాం. – మహ్మద్ సల్మాన్ మన్సూరీ, బావర్చి హోటల్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 40 ఏళ్లుగా... మా నాన్న మదీనా సర్కిల్లో 40 ఏళ్లుగా హలీం విక్రయిస్తున్నారు. నగర ప్రజలకు ఆహార అలవాట్లకు అనుగుణంగా తయారు చేయడం మా ప్రత్యేకత. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. స్వచ్ఛమైన మసాలా దినుసులు వినియోగిస్తున్నాం. – ఉమర్ అదిల్, షాబాద్ హోటల్ నిర్వాహకుడు -
ఘనమైన మాసం – విలువైన రాత్రి
సంవత్సరంలోని పన్నెండు నెలల్లో అత్యంత శోభాయమానమైన, విశిష్టమైన నెల రమజాన్. ఇందులోని ప్రారంభదశ– అంటే మొదటి పదిరోజులు కారుణ్యభరితమైనవి. ఈ దశలో దైవకారుణ్యం విశేషంగా వర్షిస్తుంది. రెండవదశ క్షమాపణ, మన్నింపునకు సంబంధించినది. ఈదశలో దేవుడు దాసుల తప్పుల్ని క్షమించి, తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. ఇకమూడవది, నరకాగ్ని నుండి విముక్తిదశ. ఈ చివరిదశలో అల్లాహ్ అసంఖ్యాకమందిని నరకజ్వాలల భయం నుండి విముక్తి కల్పిస్తాడు. ఇది చాలా కీలకమైన దశ. దీని ప్రాశస్త్యం చాలా గొప్పది. సంవత్సరంలోని పన్నెండు నెలల్లో రమజానుకు ఎంతటి ప్రాముఖ్యం ఉంది. ఈ నెలలోని మూడుదశల్లో చివరి పదిరోజులకు అలాంటి ప్రాముఖ్యమే ఉంది. ఈ చివరి పదిరోజుల్లోని ఒకరాత్రిలో ‘షబెఖద్ర్’ ఉంది. దీన్ని ‘లైలతుల్ ఖద్ర్’ అని కూడా అంటారు. ఇది వెయ్యి నెలలకన్నా ఎక్కువ విలువైనది. ఈ రాత్రిలోనే పవిత్రఖురాన్ గ్రంథం అవతరించింది. ఈ విషయాన్ని అల్లాహ్ ఇలా ప్రకటించాడు: ‘మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము. ఆ రాత్రి ఘనత ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలలకన్నా ఎంతో శ్రేష్ఠమైనది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా శుభోదయం వరకు పూరి ్తశాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి’. (పవిత్రఖురాన్ 97– 1,5) ఖురాన్లో మరొకచోట ఇలా ఉంది.: ‘ఖురాన్ అవతరించిన నెల రమజాన్. అది సమస్త మానవాళికీ మార్గదర్శక జ్యోతి. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన సూచనలు అందులో ఉన్నాయి.’(2–185) ఖురాన్ అవతరణే ఘనతకు మూలం మానవజాతికి సన్మార్గం చూపి, వారి ఇహ పర సాఫల్యానికి దిక్సూచిగా నిలిచే మహత్తర మార్గదర్శిని రమజాన్ నెలలో – ప్రత్యేకించి చివరిభాగంలోని ’లైలతుల్ ఖద్ర్’లో అవతరించింది కాబట్టే ఈరాత్రికి ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత ఏర్పడ్డాయి. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధన వెయ్యి నెలలకన్నా ఎక్కువగా చేసిన ఆరాధనతో సమానమంటే దీనిప్రాశస్త్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందుకే రమజాన్ చివరి పదిరోజుల్లోని బేసిరాత్రుల్లోఆరాధనలు అధికంగా చెయ్యాలని ప్రవక్త ఉపదేశించారు. అంటే 21, 23, 25, 27, 29 రాత్రులన్న మాట. ఎవరైతే ఆత్మసంతోషంతో, పరలోక పుణ్యఫలాపేక్షతో ఈ రాత్రి ఆరాధనల్లో గడుపుతారో వారు నిజంగానే ధన్యులు. వారి గత అపరాధాలన్నీ మన్నించబyì పునీతులవుతారు. మరెవరైతే షబేఖద్ర్‌లో ఆరాధనలు చేయకుండా నిర్లక్ష్యం చేసి, ఆ శుభరాత్రిని పోగొట్టుకుంటారో అలాంటివారికి మించిన దౌర్భాగ్యులు, దురదృష్టవంతులు మరెవరూ ఉండరు. మహా ప్రవక్త వారి ప్రవచనాలద్వారా మనకు ఈవిషయాలు తెలుస్తున్నాయి. అందుకని ఈ పవిత్ర మాసంలో, ముఖ్యంగా చివరి పదిరోజుల్లోనైనా చిత్తశుధ్ధితో, ఆత్మసంతోషంతో ఆరాధనలు, సదాచారాలు అధికంగా చేసి దైవప్రసన్నత పొందడానికి ప్రయత్నించాలి.’ ‘ఏతెకాఫ్’ ’ఫిత్రా’ లకు కూడా ఇదే అనువైన కాలం. చివరిపదిరోజులు ఏతెకాఫ్ పాటించడానికి ప్రయత్నించాలి. అంటే మొత్తం పదిరోజులపాటు రేయింబవళ్ళుమసీదులోనే ఆరాధనలో గడపాలన్నమాట. అత్యవసరాలైన మానవసహజ అవసరాలకు మాత్రమే మసీదునుండి బయటికి వెళ్ళే అనుమతి ఉంది. అన్నపానీయాలు కూడా మసీదుకే తెప్పించుకోవాలి. ఈవిధంగా రమజాన్ చివరిదినాల్లో పండుగకు కొన్నిరోజుల ముందు ఫిత్రాలు కూడా చెల్లిస్తే, పేదసాదల పండుగ అవసరాలు తీరతాయి. వారు కూడా సంతోషంగా పండుగసంబురాల్లో పాలుపంచుకునే అవకాశాలు మెరుగుపడతాయి. కొందరిసంతోషం కాకుండా అందరి ఆనందమేకదా పండుగ. అల్లాహ్ అందరికీ ఇతోధికంగా పుణ్యకార్యాలు ఆచరించి, ఇహపర సాఫల్యాలకు అర్హతసాధించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అల్లాయే నాకు ఈ అవకాశం ఇచ్చాడు
-
పాప కోసం.. రంజాన్ దీక్ష పక్కన పెట్టాడు
పట్నా : మానవత్వాన్ని మించిన మతం లేదని నిరూపించాడు బిహార్‌కు చెందిన ఓ ముస్లిం. పసిపాప ప్రాణాలు కాపాడటానికి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను పక్కన పెట్టాడు. ఇంతకీ విషయమేమిటంటే.. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆర్మీ జవానుగా పనిచేసే రమేశ్ సింగ్ భార్య ఆర్తీ కుమారి రెండు రోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనారోగ్యంతో జన్మించిన పాప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అర్జెంటుగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అయితే పాపది అరుదైన ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో తమ వద్ద స్టాక్ లేదంటూ ఆస్పత్రి చేతులెత్తేసింది. దీంతో పాప కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పాప పరిస్థితి గురించి ప్రకటన ఇచ్చారు. ఫేస్బుక్లో ప్రకటన చూసిన మహ్మద్ అష్ఫాక్ తనది అదే బ్లడ్ గ్రూప్ కావడంతో రక్తం ఇచ్చేందుకు ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఏదైనా తిన్న తర్వాతే రక్తం ఇవ్వాలంటూ డాక్టర్ సూచించడంతో.. మహ్మద్ అక్కడే భోజనం చేసి కాసేపటి తర్వాత రక్తదానం చేశాడు. అల్లాయే నాకు ఈ అవకాశం ఇచ్చాడు : మహ్మద్ అష్ఫాక్ ‘నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆర్మీ జవాను కూతురు ప్రాణాపాయంలో ఉందని తెలిసినపుడు నాకు చాలా బాధగా అన్పించింది. నా బ్లడ్ గ్రూప్ పాప బ్లడ్ గ్రూప్‌తో సరిపోవడంతో అల్లాయే ఒక నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశం నాకు కల్పించాడని భావించాను. అందుకే పాప ప్రాణాల్ని కాపాడటం కోసం ఒక్కరోజు ఉపవాస దీక్షను విరమించాను. నాకు హిందూ, ముస్లిం అనే తేడాలు ఏమీలేవు. మానవత్వాన్ని మించిన మతం లేదని నేను నమ్ముతానంటున్న’ అష్ఫాక్‌పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
వేయి పుణ్యాల మూట... షబె ఖద్ర్
రమజాన్ కాంతులు షబే ఖద్ర్ ఇస్లాం సంప్రదాయంలో పాటించే అతి పెద్ద పర్వదినం. ఎంతో గౌరవప్రదమైన, మరెంతో విలువైన ఈ రేయి శుభాలను ఏ ఒక్కరూ జారవిడుచు కోరాదు. ఎందుకంటే ఈ రాత్రి దైవదూతలతో భూలోకమంతా కిక్కిరిసిపోతుంది. కాబట్టి ఈ రాత్రి చేసే ఆరాధనలకు దైవం ఇచ్చే ప్రతిఫలాన్ని ఒడిసిపట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఈ రేయిలో వీలైనన్ని ఎక్కువసార్లు నఫీల్ నమాజులు, ఖుర్ ఆన్ పారాయణం చేయాలి. ఖుర్ ఆన్ భావాన్ని మనకు వచ్చిన భాషలో చదువుకోవాలి. ధార్మిక పుస్తకాలను అధ్యయనం చేసి, ధార్మిక జ్ఞానాన్ని పెంపొదించుకోవాలి. మంచి జీవితాన్ని ప్రసాదించమని అల్లాహ్‌ను వేడుకోవాలి. మన ప్రవక్త (స) రమజాన్ నెల చివరి పదిరోజుల్లో దైవారాధనలో పూర్తిగా నిమగ్నం అవడమేగాక తన సహచరులను, ఇంటివారిని కూడా ప్రోత్సహించేవారు. మహాప్రవక్త (స) రమజాన్ చివరి వారంలో చేసినన్ని విస్తృత ఆరాధనలు మరే నెలలోనూ చేసేవారు కారని హజ్రత్ ఆయిషా (ర) తెలిపారు. కాబట్టి వెయ్యి నెలలపాటు అల్లాహ్ ఆరాధన చేసి పొందిన పుణ్యఫలం కంటే ఎన్నో రెటు... ఈ ఒక్కరోజు ఆరాధన చేసి పుణ్యాలు మూటకట్టుకోవచ్చు. – బైరున్నీసాబేగం -
ఇఫ్తార్ వికటించి 900 మందికి అస్వస్థత..
బాగ్ధాద్: ఇరాక్‌లో రంజాన్ మాసం సంధర్భంగా ఇచ్చిన ఇఫ్తార్ విందు వికటించి ఇద్దరు మృతి చెందగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మోసుల్ నగరంలోని క్యాంపులో చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రంజాన్ మాసం సందర్భంగా ఖతారీ హ్యూమనిరేషన్ అనే ఆర్గనైజేషన్ ఇప్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ విందులో పాల్గొన్న సుమారు 900 మంది తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఆహారం తిన్న క్యాంపు జనం వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఇఫ్తార్ విందు వికటించడం వలన డిహైడ్రేషన్ గురయ్యారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు అందుతున్నాయి. ఇప్తార్ విందులో పెట్టిన చికెన్, బీన్స్ ఆహారాన్ని ఖతారీ చారిటీ ఇర్భిల్ నగరంలోని ఓ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ట్రస్టుకు సంబంధించిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఇర్భిల్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య యుద్దం జరుగుతుంది. -
ముస్లిం సోదరులకు రానా, సినీ పరిశ్రమ శుభాకాంక్షలు
గాజాలో మరణించిన చిన్నారుల కోసం రంజాన్ పవిత్ర దినం రోజున ప్రార్థన నిర్వహించాలని బాలీవుడ్ ప్రముఖుడు అనురాగ్ బసు సూచించారు. ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం రోజున బాలీవుడ్, టాలీవుడ్, పలు రాజకీయ ప్రముఖులు శుభాంకాంక్షలు తెలిపారు. కులం, ప్రాంతం, భాషలకతీతంగా భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖులు ముస్లిం సోదరులకు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో తమ సందేశాలను పోస్ట్ చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో దగ్గుబాటి రానా, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, నయనతార, శరత్ కుమార్, జయం రవి తదితరులున్నారు. Eid Mubarak to everyone !! Lets pray for the people of GAZA & kids who lost their lives. pic.twitter.com/s4ucmX3SWW— anurag basu (@basuanurag) July 29, 2014 Eid Mubarak. Spread love and rise above hate it's one of my favourite days of the year— Varun Dhawan (@Varun_dvn) July 29, 2014 Eid Mubarak everyone. Wishing you all love, peace and prosperity always.— Akshay Kumar (@akshaykumar) July 29, 2014 Eid mubarak!! From the #kickteam love peace and happiness 😆 http://t.co/HmZSSy6xus— Jacqueline Fernandez (@Asli_Jacqueline) July 29, 2014 #eidmubarak to all my muslim friends— kajal agarwal (@KajalAgarwal) July 29, 2014 Eid Mubarak to one and all .— sHAhID kapooR (@shahidkapoor) July 29, 2014 The festival of Peace, Joy, Brotherhood. Eid Mubarak. May God bless all!— Suresh Raina (@ImRaina) July 29, 2014 U fasted,u prayed, U been good 4 a whole 30 days. So ur merciful ALLAH gave u a sign, Out came the moon 2 say come celebrate.. Eid mubarak!!— Rana Daggubati (@RanaDaggubati) July 29, 2014 Family time with my mom in law and kids. #EidMubarak http://t.co/Yfu7dxadXf— Farah Khan (@FarahKhanAli) July 29, 2014 Eid Mubarak! Day off frm shoot in pondy. Home sweet home. #biriyani 😁— Jayam Ravi (@actor_jayamravi) July 29, 2014 Eid mubarak to all my tweetos:) just going to gorge on the yummy Sheer korma sent home:) :)— SHILPA SHETTY (@TheShilpaShetty) July 29, 2014 Maybe it's a blasphemous thought but Eid is synonymous to Biryani for me. #EidMubarak— Ankur Tewari (@ankurtewari) July 29, 2014 Eid mubarak to all of you from me, Aalia and Omar. . Wishing u all love, joy and peace.:) have a wonderful day and wonderful year ahead.— Pooja Bedi (@poojabeditweets) July 29, 2014 Happy Birthday and Eid Mubarak to my friend and favourite Sanju @duttsanjay . Miss u and sending u loads of love and wishes. God bless— Farah Khan (@FarahKhanAli) July 29, 2014 Eid Mubarak to all my Muslim brothers & friends :) pic.twitter.com/c85lZU6df5— Gopi Mohan (@Gopimohan) July 29, 2014 Eid Mubarak all you wonderful people. Peace, prosperity and love to all of you. And yummy biryani and sevaiyan to me.— kunal kapoor (@kapoorkkunal) July 29, 2014 Eid Mubarak to all my friends.. Love,Peace and Happiness always..— satish kaushik (@satishkaushik2) July 29, 2014 Eid Mubarak! Blessings and love! Wish everyone peace and love! Forgiveness is the virtue of the strong!— Tanishaa Mukerji (@TanishaaMukerji) July 29, 2014 I wish all Sri Lankan Muslims a very happy Eid ul-Fitr. Your contributions to our unity and harmony is greatly valued. Eid Mubarak. -MR— Mahinda Rajapaksa (@PresRajapaksa) July 29, 2014 Eid Mubarak my friends!! Jashn jashn!!— Shreya Ghoshal (@shreyaghoshal) July 29, 2014 Eid Mubarak everyone...love n respect— Sidharth Malhotra (@S1dharthM) July 29, 2014 Eid Mubarak to all my brothers and sisters, may this day shower the divine blessings and guide us to peace prosperity and harmony— R Sarath Kumar (@realsarathkumar) July 29, 2014 Eid Mubarak to all of you. Happiness, peace and prosperity.— Abhishek Bachchan (@juniorbachchan) July 29, 2014 Eid Mubarak to everyone pic.twitter.com/ynrYmFsc03— Dr Raman Singh (@drramansingh) July 29, 2014 EID MUBARAK TO ALL 😬god bless u with peace ,happiness n togetherness lots of love to each one of u 😘 big hug😬😊😊 pic.twitter.com/f4ijazeGzJ— RAAI LAXMI (@iamlakshmirai) July 29, 2014 On the auspicious occasion of Eid, may you be blessed with peace, prosperity and happiness. Eid Mubarak everyone!— Vasundhara Raje (@VasundharaBJP) July 29, 2014 Eid Mubarak beautiful people. People give love effortlessly on Eid n also receive without hesitation. Let's learn to make everyday Eid.— Hrithik Roshan (@iHrithik) July 29, 2014 Eid Mubarak friends 🌙! May you be filled with Happiness, Peace and Blessings for all.🙏— Nayanthara✨ (@NayantharaU) July 29, 2014