చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Published Wed, Jul 23 2014 8:47 PM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
హైదరాబాద్: రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా శుక్రవారం నుంచి చార్మినార్ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చార్మినార్ నుంచి మదీనా, చార్మినార్ నుంచి మురిగిచౌక్,చార్మినార్ నుంచి మొఘల్‌పుర కమాన్ వరకూ వాహనాల రాకపోకలు బంద్ చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement