సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణా హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. కోఠి, సుల్తాన్ బజార్లో గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత సంతోష్‌గుప్తా ఆధ్వర్యంలో 500 మంది పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కూరగాయలను హోం మంత్రి పంపిణీ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ మే 7 వరకూ లాక్‌డౌన్ పొడిగించారని, ప్రజలంతా సహకరించాలని మహమూద్ అలీ కోరారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment