ముంబై: నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని తన స్వస్థలమైన బుధానాలో 14 రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు. రంజాన్ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ముంబాయి నుంచి తన స్వస్థలం బుధానాకు శనివారుం వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను రెండు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అక్కడి అధికారులు సూచించారు. అయితే లాక్‌డౌన్‌లో ఆయన తన స్వస్థలానికి వెళ్లాడానికి అధికారుల వద్ద అనుమతి పొందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మహరాష్ట్ర(రూరల్) ఎస్పీ నేపాల్ సింగ్ మాట్లాడుతూ.. నవాజుద్ధీన్ తన కుటుంబంతో కలిసి బుధానాకు ప్రయాణించడానికి అనుమతి పొందారని స్పష్టం చేశారు. అంతేగాక ఆయనకు, కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివి వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారంతా క్వారంటైన్ ఉన్నారని ఆయన ధృవీకరించారు. (కోలీవుడ్ టు బాలీవుడ్)
చదవండి: ఇండియాలోనే తెలియనివారు ఎవరూ లేరు..
ఇక నవాజుద్దీన్ సోదరుడు అయజుద్దీన్ మాట్లాడుతూ.. ‘ఇది రంజాన్ పండుగ మాసం కావున నవాజుద్దిన్ బుధానాకు రావడం ముఖ్యం. అంతేకాదు లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు కూడా లేకపోవడంతో నవాజుద్దీన్ బుధానాకు రావాలని నిర్ణయించుకున్నాడు. మా సోదరి మరణించి కూడా 4 నెలలు గడిచింది. ఈద్ పండుగ కూడా వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో నవాజుద్ధీన్ మా కుటుంబంతో గడిపితే అందరం సంతోషిస్తాం. అయితే ఈ ఏడాది మేము రంజాన్ పండుగ జరుపుకోనప్పటికీ నవాజుద్దీన్ ఈ సమయంలో ఇంట్లో ఉండటం అవసరం’ అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా అధికారుల ఆదేశం మేకు, లాక్‌డౌన్ నిబంధనలకు కట్టుబడి తాను, తన కుటుంబం క్వారంటైన్లోనే ఉంటామని, ఎవరినీ కలిసే ప్రయత్నం చేయమని నవాజుద్దీన్ అధికారులు తెలిపాడు. కాగా ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ మోటిచూర్ చక్నాచూర్‌లో నటించాడు. తాజాగా ఆయన నటించిన ‘ఘూమ్‌కేటు’ మే 22 న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో విడుదలకు సిద్ధంగా ఉంది. (క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి)
Comments
Please login to add a commentAdd a comment