కోల్‌కతా: ప్రస్తుతం కొనసాగుతున్న విభజించు–పాలించు, విభజన రాజకీయాల ఫలితంగా దేశం పరిస్థితి బాగోలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మంగళవారం ఆమె కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొని, మాట్లాడారు. ‘దేశంలో పరిస్థితి బాగోలేదు..
ప్రస్తుతం కొనసాగుతున్న విభజన రాజకీయాలు, విభజించు–పాలించు విధానాలు సరికావు. హిందూముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆరోపించారు. ‘బెంగాల్ ప్రజల్లో ఐక్యతను చూసి అసూయతోనే వారు నన్ను వేధించారు. కానీ భయపడను. ఎలా పోరాడాలో నాకు తెలుసు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment