- మంగళవారం కనిపించని నెలవంక
- గురువారమే పండుగన్న దక్కన్ మర్కజీ రొహియతే హిలాల్ కమిటీ
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)ను గురువారం జరుపుకోవాలని దక్కన్ మర్కజీ రొహియతే హిలాల్ కమిటీ మంగళవారం రాత్రి ప్రకటించింది. మంగళవారం ఆకాశంలో నెలవంక కనిపిం చకపోవడంతో బుధవారం బదులు గురువారం ఈద్ ను జరుపుకోవాలని కమిటీ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఖుబూల్ పాషా అత్తారి ప్రకటనలో తెలిపారు. బుధవారం రంజాన్ ఉపవాస దీక్ష కొనసాగుతుందన్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదు ఇమామ్‌లు కూడా గురువారమే ఈద్ జరుపుకోవాలని సూచించారు. అయితే కేరళ, కశ్మీర్‌లో మాత్రం బుధవారమే రంజాన్‌ను జరుపుకోనున్నారు.
మరోవైపు రంజాన్‌ను పురస్కరించుకొని గురు, శుక్రవారాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించామని మైనారిటీల సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయన్నారు. బుధవారం మాత్రం పనిదినమేనన్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ యాజ మాన్యం, కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ ఉద్యోగులకు గురువారం ఒక్కరోజే సెలవు ప్రకటించాయి.
ఈద్ రేపు
Published Wed, Jul 6 2016 2:27 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement