ముస్లింలకు ప్రముఖుల ఈద్ శుభాకాంక్షలు | Muslims, Eid wishes from celebrities | Sakshi
Sakshi News home page

ముస్లింలకు ప్రముఖుల ఈద్ శుభాకాంక్షలు

Published Fri, Aug 9 2013 6:18 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM

Muslims, Eid wishes from celebrities

న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకొంటున్న ముస్లింలకు వివిధ దేశాధినేతలు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత సమైక్యతకు ఈ పండుగ దోహదపడాలని రాష్ట్రపతి ప్రణబ్ గురువారం విడుదల చేసిన తన సందేశంలో ఆకాంక్షించారు.
 
 ఈ పర్వదినం శాంతి సామరస్యాలకు, సౌభ్రాతృత్వానికి, పురోగతికి దోహదపడాలని ప్రధాని మన్మోహన్ ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒబామా సంక్షోభంతో సతమతమవుతున్న సిరియాకు మానవతా సాయంగా రూ.1,184 కోట్లుఅదనపు సాయాన్ని ప్రకటించారు. భారత్‌లోని కేరళ రాష్ట్రంతో పాటు ఇండోనేసియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాల్లో ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని గురువారం నాడే జరుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement