Eid al-Fitr
-
బక్రీద్ : భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు (ఫొటోలు)
-
జామా మసీదులో ముస్లింల ప్రార్థనలు
నేడు (సోమవారం) బక్రీద్ సందర్భంగా ఢిల్లీలోని జామా మసీదులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెల్లవారుజాము నుంచే ముస్లింలు ప్రార్థనల కోసం మసీదుకు తరలివచ్చారు. దీంతో జామా మసీదు చుట్టుపక్కల ప్రాంతాలు, మార్కెట్లలో సందడి నెలకొంది.ఈద్ ఉల్ అజా పండుగను బుధవారం సాయంత్రం వరకు ముస్లింలు జరుపుకోనుండటంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. జామా మసీదులో ఈరోజు ఉదయం 6 గంటలకు, ఫతేపురి మసీదులో ఉదయం 7.15 గంటలకు ఈద్-ఉల్-అజా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫతేపురి మసీదు షాహీ ఇమామ్ డాక్టర్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను సమైక్యంగా జరుపుకోవాలన్నారు. #WATCH | Delhi: Devotees offer Namaz at the Jama Masjid on the occasion of Eid Al Adha festival. pic.twitter.com/OnufmNVisx— ANI (@ANI) June 17, 2024 పండుగలనేవి ఆనందంగా చేసుకునేందుకేనని, ఈరోజు ఎవరినైనా బాధపెడితే పండుగ అర్థరహితమన్నారు. జంతువుల బలి విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈద్ ఉల్ అజా సందర్భంగా పాత ఢిల్లీలోని మార్కెట్లలో సందడి నెలకొంది. రాత్రంతా ఇది కొనసాగింది. ఢిల్లీలోని దర్గా పంజా షరీఫ్‌లో ఈద్-ఉల్-అజా సందర్భంగా బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నమాజ్ చేశారు. #WATCH | Delhi: BJP Leader Mukhtar Abbas Naqvi offers Namaz at Dargah Panja Sharif on the occasion of Eid Al Adha pic.twitter.com/bVcNW9Ec6K— ANI (@ANI) June 17, 2024 -
Eid 2024 : ఈద్ ముబారక్ అంటున్న ఈ సెలబ్రిటీలను గుర్తు పట్టారా (ఫోటోలు)
-
Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్ హెల్దీగా ఇలా..!
ఈద్ 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ పవిత్ర రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి. రంజాన్ పండుగ చేసుకుంటారు. దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు. ముఖ్యగా రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఒకటి హలీం. రెండోది షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్. సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్‌తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. మరి షీర్ ఖుర్మా రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు: చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా వేయించాలి. ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. చిక్కగా మరిగాక మంట సిమ్‌లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు. ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం. *సాక్షి పాఠకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు* -
దేశ రాజధానిలో ఘనంగా ఈద్ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు వివిధ మసీదులలో నమాజ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు ముస్లింలు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈద్ జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపూర్ మసీదు ఇమామ్‌లు చంద్రుని దర్శనాన్ని ధృవీకరించారు. చంద్రుడిని చూసిన తర్వాత ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఫతేపూర్ మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రమ్ అహ్మద్.. ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశానికి శాంతి, సామరస్యం సమకూరేందుకు ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరారు. కాగా చంద్రుడు కనిపించినంతనే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా అభినందనల పరంపర మొదలైంది. ఫోన్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లింలు ఈద్ కోసం పెర్ఫ్యూమ్, క్యాప్స్, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పాత ఢిల్లీతో పాటు, జామియా నగర్, సీలంపూర్, జాఫ్రాబాద్, నిజాముద్దీన్ సహా ఇతర మార్కెట్లలో రద్దీ పెరిగింది. రాత్రంతా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈద్ వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. #WATCH | Delhi: Devotees gather at Jama Masjid to offer prayers, on the occasion of Eid-ul-Fitr. pic.twitter.com/Id3OsJDGxv — ANI (@ANI) April 11, 2024 -
ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష!
ముఫ్ఫై రోజుల రమజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి... సహరీ, ఇఫ్తార్ ల ద్వారా సహనశీలత, కృతజ్ఞతాభావం అలవడ్డాయి.. ఖురాన్ పారాయణం, తరావీహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి. మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది. ఓ అల్లాహ్! ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యమైంది! ! ఓ అల్లాహ్! నీకు వేనవేల షుక్రియా (కృతజ్ఞతలు) అంటూ అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఈద్గాహ్ కు చేరుకుంటారు. ‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్’ మా రమజాన్ ఆరాధనలన్నీ స్వీకరించు ప్రభూ! అంటూ వేడుకుంటారు. నెల రోజుల రమజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపునే శుభ సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’ రమజాన్ పర్వదినం. ఈద్గాహ్ మైదానానికి చేరుకుని అల్లాహ్ ఘనతను, గొప్పతనాన్ని చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియలు. రంజాన్‌లో అల్లాహ్‌కు ఇచ్చిన వాగ్దానాలు మిగతా 11నెలలూ ఆచరణాభాగ్యానికి నోచుకోవాలని రోదిస్తారు. రాబోయే రంజాన్ వరకూ రంజాన్ స్ఫూర్తి కొనసాగించే భాగ్యాన్నివ్వమని అల్లాహ్ కు విన్నవించుకుంటారు. రెండు రకాతుల షుక్రానా నమాజు చేస్తారు. రమజాన్ మొదలు మళ్లీ వచ్చే రంజాన్ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి రంజాన్‌ను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్‌కు షుక్రియా తెలుపుకుంటారు. కేవలం మేము రంజాన్ వరకే ముస్లిమ్గాగా ఉండకుండా మిగతా 11నెలలూ ముస్లిమ్‌గా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని అల్లాహ్‌ని వినమ్రంగా వేడుకుంటారు. నెలంతా ఎన్నెన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు చేసినా వాటిపట్ల రవ్వంత గర్వాన్ని కూడా రానీయకూడదు. నెలసాంతం పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్ పారాయణం, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి ఆచరించిన నమాజులు, జకాత్, ఫిత్రా దానాలను నీవు నీ ప్రత్యేక కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు. నమాజు తరువాత ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. అందరి పండుగ.. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు ప్రతీ ముస్లిమ్ కుటుంబం ఉన్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్ ఖుర్మా పాయసాన్ని తమ ఆత్మీయులకు, దగ్గరి బంధువులకు, ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు. తమకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహ భాగ్యాలను చాటుకోవాలన్నది ప్రవక్త బోధన. ఫిత్రా, జకాత్ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబంలోని ఎంతమందైతే ఉన్నారో ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి నిరుపేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే. అర్హులై ఉండి ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు స్వీకరించబడవన్నది కూడా ప్రవక్త హెచ్చరిక. ఈదుల్ ఫిత్ర్ ఇలా... ఈదుత్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిములు ఖర్జూరాలు తిని ఈద్గాహ్ కు చేరుకుంటారు. ఈద్గాహ కు కాలినడకన వెళ్లడం ఉత్తమం. ఈద్ నమాజు తరువాత పిల్లలకు ఈదీ (ఈద్ కానుక)లు ఇస్తారు. ఖజా రోజాలు... రమజాన్ నెలలో ఎలాంటి కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా మిగతా రోజుల్లో ఏడాదంతా ఉపవాసం పాటించినా సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే కొంతమందికి రమజాన్ నెల ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. బాలింతలు, రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, రోగగ్రస్తులు మిగతా రోజుల్లో ఆ ఉపవాసాల సంఖ్యను పూరించాలన్నది ఖురాన్ ఉద్బోధ. ఇలాంటి రోజాలను ఖజా రోజాలు అని అంటారు. వీలయినంత త్వరగా ఈ రోజాలను పూర్తిచేయాలని ఉలమాలు సందేశమిస్తారు. రంజాన్ లో తప్పిపోయిన రోజాలను తొలి తీరికలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. రమజాన్ స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలి. ఖురాన్ ప్రబోధనలు ►మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయనిర్ణేతల వద్దకు తీసుకునిపోకండి. (2:188) ►ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. (2:253) న్యాయం పలకాలి. ►అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.(4:10) ►తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. (4:36) ►మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. (5:2) ►అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం.(9:108) ►పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. (17:29) నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు.యాచకుణ్ణి కసురుకోకు.(93.10) (చదవండి: హలీమ్.. రుచికి సలామ్) -
ఈద్గా స్థలాన్ని అపవిత్రం చేసిన టీడీపీ మూకలు
సత్తెనపల్లి: ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్గా స్థలాన్ని టీడీపీ మూకలు అపవిత్రం చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం రాత్రి సత్తెనపల్లి వచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు ఈద్గా స్థలంలోకి చొరబడి మద్యం సేవించి, పొగతాగుతూ మూత్ర విసర్జన చేశారు. ఈద్గా స్థలానికి తాళం వేసి ఉండటంతో ప్రహరీ పగులగొట్టి టీడీపీ మూకలు లోపలికి ప్రవేశించాయి. అక్కడే ఆహారం వండుకుని, మద్యం సేవించి ఖాళీ సీసాలు, సిగరెట్ పెట్టెలు పడేశారు. ఆ ప్రాంతంలోనే మూత్ర విసర్జన కూడా చేశారు. ఈద్గా ప్రాంతాన్ని ఆదివారం ముస్లింలు, మత పెద్దలు పరిశీలించి తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్‌మీరా మాట్లాడుతూ.. రంజాన్ రోజున 10 వేల మంది ముస్లింలు సామూహిక నమాజులకు హాజరయ్యే ఈద్గా స్థలంలో మద్యం సేవించి, మూత్ర విసర్జన చేయడం బాధాకరమన్నారు. టీడీపీ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. ఈద్గా ప్రాంతమంతా పరిశీలించి అక్కడ పడేసిన ఖాళీ మద్యం సీసాలను, సిగరెట్ పెట్టెలను తొలగించారు. ఈద్గాలోని నమాజ్ చేసే ప్రాంతాన్ని వాటర్ ట్యాంకర్‌తో నీటిని రప్పించి కడిగి శుభ్రం చేశారు. ఈద్గా స్థలాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగుల్‌బాషా, నాయకులు సయ్యద్ సలీం, షేక్ మహమ్మద్ గని, షేక్ జానీ, షేక్ ముక్త్యార్, హుస్సేన్, మత పెద్దలు సుభానీఖాన్, ఖలీల్, సయ్యద్ హుస్సేన్, మహీబుల్లా, చిన్నమాబు, యూసఫ్, రెహమాన్, షేక్ కరీం, ఖాజా పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో బక్రీద్ కోలాహలం (ఫొటోలు)
-
Ramadan 2022: రమజాన్ విశిష్టత.. సంప్రదాయం.. మరిన్ని విశేషాలు!
సృష్టిలోని విభిన్న జీవరాశులకు విభిన్నమైన పేర్లు ఉన్నట్లుగానే, మానవ సంతతిని మనిషి లేక మానవుడు అంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనిషివేరు, మానవత్వం వేరు. మనిషి అనబడే ప్రతివారిలోనూ మానవత్వం ఉండాలన్న నిబంధనేమీ లేదు. ప్రాణులుగా, జీవులుగా అంతా సమానమే! మానవులైనా, జంతువులైనా లేక మరే జీవి అయినా... కనుక జీవం కలిగి ఉండడం అనేది జంతుజాలంపై మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమీ కాదు. జంతువూ ఒక ప్రాణే మనిషి కూడా ఒక ప్రాణే అయినప్పుడు జంతువుపై మనిషికి ఏ విధంగానూ ప్రత్యేకత, శ్రేష్ఠత, ప్రాధాన్యతా ఉండవు. జంతువులపై మనిషికి విశిష్ఠత, ప్రత్యేకత ప్రాప్తం కావాలంటే మనిషిలో మానవత్వం, మానవీయ విలువల సుగంధం ఉండాలి. ఇవి మాత్రమే మానవుడికి ప్రత్యేకతను ప్రసాదించి, మానవ ఔన్నత్యాన్ని పెంచుతాయి. మనిషిలో మానవీయ విలువలు లేకపోతే, అతడు మానవ సంతతి అయినప్పటికీ, మానవ సమాజంలోనే ఉంటున్నప్పటికీ అలాంటి వాణ్ణి మనం మనిషి అని సంబోధించడానికి వెనుకాడతాం. లోలోపల ఎక్కడో ఏహ్యభావం పాదుకొని ఉంటుంది. అలాంటివాణ్ణి మానవ రూపంలోఉన్న దానవుడు అనుకోవచ్చు. మరి మానవత్వం అంటే ఏమిటి, మానవీయ విలువలు అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానంగా చాలామంది చాలా అభిప్రాయాలు చెబుతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కొలమానం, ఒక్కొక్క ప్రమాణం. కాని మానవత్వం, మానవీయ విలువల అసలు కొలమానం దైవ గ్రంథంలో, ప్రవక్తవారి జీవితంలో మనకు లభిస్తుంది. సమాజంలో మానవత్వాన్ని జాగృతం చేయడానికి, మానవుల హృదయాల్లో దాన్ని పాదుగొల్పడానికి దైవం కొన్ని నియమాలను ఏర్పరచాడు. ఆ దైవదత్తమైన మార్గదర్శక తరంగాల్లోంచి పెల్లుబికి వచ్చేదే అలౌకికమైన మానవీయ ఆధ్యాత్మిక ఆనందం. నిత్య నూతనత్వాన్ని, మానసిక ఆనందాన్ని పొందడం కోసం, మనిషి మనిషి కలిసి, సామూహిక నైతికతను సమాజంలో పాదు గొల్పడానికే వ్రతాలు, నోములు, పండుగలు, పబ్బాలు. కొద్దికాలంపాటు మనిషి తన శరీరంలో, దైనందిన జీవనక్రమంలో కొన్ని అనూహ్యమైన మార్పులను ఆహ్వానించి తద్వారా నూతనోత్తేజ ఆధ్యాత్మిక భావ తరంగాల్లో తేలిపోతాడు. పవిత్ర రమజాన్ పండుగను మనం ఆ దృష్టికోణం నుంచి చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింసోదరులు జరుపుకొనే రెండు ప్రధాన పండుగల్లో ‘ఈదుల్ ఫిత్ర్ ’ మొట్టమొదటిది, అత్యంత ప్రాముఖ్యం కలది. ఇస్లామీయ కేలండరు ప్రకారం, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెలగా ఉన్న ‘రమజాన్’ ముప్పయి రోజులు ఉపవాస దీక్షలు పాటించి పదవ నెల అయిన షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే పండుగే ఈదుల్ ఫిత్ర్ . సాధారంగా దీన్ని రంజాన్ పండుగ అని వ్యవహరిస్తుంటారు. రమజాన్ పేరువింటూనే ప్రతి ఒక్కరికీ సేమియా, షీర్ ఖుర్మా గుర్తుకు వస్తాయి. పట్టణ వాసులకైతే ‘హలీమ్’, ‘హరీస్’లాంటి వంటకాలూ నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లింలు ఇంత నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోడానికి కారణం, ఇది ఒక్కరోజు పండుగ కాదు. నెలరోజులపాటు ఆనందంగా, ఆరాధనా భావతరంగాల్లో తేలియాడుతూ జరుపుకొనే ముగింపు ఉత్సవం. ఈనెల రోజులూ ముస్లింల ఇళ్లు, వీధులన్నీ సేమియా, షీర్ ఖుర్మా, బగారా, బిరియానీల ఘుమఘుమలతో, అత్తరు పన్నీర్ల పరిమళాలతో, ఉల్లాస పరవళ్ల హడావిడితో కళకళలాడుతూ ఉంటాయి. సహెరి, ఇఫ్తార్ల సందడితో నిత్యనూతనంగా, కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. పవిత్రగ్రంథ పారాయణంలో, తరావీ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, అహ్లాదాల సమ్మేళనాన్నే ‘పండుగ’ అనడం సమంజసం. ఇలాంటి అపూర్వ, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. అదే రమజాన్ పండుగ. ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, విలువలకు లోబడి, హద్దులను అతిక్రమించకుండా, దుబారాకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు చోటీయ కుండా, దైవానుగ్రహాలను స్మరించుకుంటూ, ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తంచేయడం, హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకోవడమే పండుగ. నిజానికి పండుగలు మానవ జీవన స్రవంతిలో భాగమై, సమైక్యతకు, సంస్కృతీ సంప్రదాయ వికాసాలకు దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మత ధర్మానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం, ఒక స్ఫూర్తి ఉంటుంది. పండుగ మానవాళి హితం కోరుతుంది, హితం బోధిస్తుంది. ముస్లిములు అత్యంత శ్రద్ధాభక్తులతో జరుపుకొనే ఈదుల్ ఫిత్ర్ (రమజాన్) పర్వం సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ప్రాచీనకాలం నుంచి ప్రతిదేశంలోనూ, ప్రతిజాతిలోనూ పండుగల సంప్రదాయం చలామణీలో ఉంది. మానవులకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, వ్యక్తిగతంగా కాని, సామూహికంగా కాని ఏదైనా మేలు జరిగినప్పుడు, ప్రయోజనం చేకూరినప్పుడు వారి అంతరంగాల్లోంచి ఆనందం తన్నుకొచ్చి బహిర్గత మవుతుంది. ఇది చాలా సహజం. అలాంటి మానవ సహజ భావోద్రేకాల ప్రత్యక్ష ప్రతిస్పందనల ప్రతిరూపమే పండుగలు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం కూడా అలాంటి భావోద్రేకాలు, ఆనంద తరంగాల ప్రతిస్పందనల ప్రత్యక్ష ప్రతిరూపమే. అసలు రమజాన్ పేరు వినగానే ఎవరికైనా ఒక రకమైన దివ్యానుభూతి కలుగుతుంది. మనసు, తనువు తన్మయత్వంతో పులకిస్తాయి. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా వంగిపోతుంది. గుండెలనిండా ఆనందం ఉప్పొంగుతుంది. ఆనందం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది. మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ముఖ్యమైనవి. మనిషికి ఏదైనా మేలు జరిగినప్పుడు అంతరంగం ఆనందంతో పులకించడం, హృదయం ఉల్లాసభరితమవడం, మదిలో మధురానుభూతులు సుడులు తిరగడం సహజం. అసలు రమజాన్ అన్నది పండుగ పేరుకాదు. అదొక నెల పేరు. సంవత్సరంలోని పన్నెండునెలల్లో తొమ్మిదవది రమజాన్. అయితే దైవం పవిత్ర ఖురాన్‌లాంటి మానవ సాఫల్య గ్రంథరాజాన్ని అవతరింప జేయడానికి, అత్యుత్తమ ఆరాధనా విధానమైన ‘రోజా’ను విధిగా చేయడానికి ఈనెలను ఎన్నుకున్నాడు. అందుకే దీనికి ఇంతటి ఔన్నత్యం ప్రాప్తమైంది. మానవుల మార్గదర్శక గ్రంథమైన ఖురాన్తోను, ఆనవాయితీగా పాటించే రోజాలతో ఈనెలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ విషయాన్ని దైవం ఇలా ప్రకటించాడు: ‘ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఇది సమస్త మానవాళికీ సంపూర్ణ మార్గదర్శిని. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి (2 – 185). మనం ఒక్కసారి మనసుపెట్టి ఆలోచిస్తే, మానవులపై దేవుని అనుగ్రహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన తన అపార ప్రేమానురాగాలతో మానవ మనుగడకోసం అనేక ఏర్పాట్లు చేశాడు. శిశువు మాతృగర్భం నుంచి భూమిపై పడగానే అతని/ ఆమె ఊడిగం చెయ్యడానికి సృష్టి మొత్తం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు సృష్టి సమస్తం మానవుడి కోసమేనంటే అతిశయోక్తికాదు. అపారమైన ఆయన కారుణ్యానుగ్రహాలను వర్ణించడం ఎవరివల్లా అయ్యేపనికాదు. సృష్టిలోని వృక్ష సంపదనంతా కలాలుగా మార్చి, సముద్ర జలాలన్నింటినీ సిరాగా చేసి దైవానుగ్రహాలను రాయదలచినా, వృక్షాలు అంతరించిపోతాయి, జలాలన్నీ ఇంకిపోతాయి కాని ఆయన కారుణ్యానుగ్రహాలు ఇంకా అనంతంగా మిగిలే ఉంటాయి. ఇంతటి అనుగ్రహశీలి కనుకనే దేవుడు మానవుల ఆధ్యాత్మిక వికాసం కోసం, నైతిక, మానవీయ విలువల మార్గదర్శనం కోసం పవిత్ర ఖురాన్ లాంటి మహదానుగ్రహాన్ని ప్రసాదించాడు. రోజా లాంటి మహత్తర ఆరాధనను పరిచయం చేశాడు. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాలను, నైతిక సుగుణాలను, మానవీయ విలువలను జనింపజేయడానికి నెల్లాళ్లపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్ధునిగా చేయడమే రమజాన్ శిక్షణలోని అసలు ఉద్దేశం. నెల్లాళ్లపాటు నియమబద్ధంగా, నిష్ఠగా సాగే ఆరాధనా విధానాలు మనిషిని ఒక క్రమశిక్షణాయుత జీవన విధానానికి, బాధ్యతాయుత జీవన విధానానికి, దైవభక్తి పరాయణతతో కూడిన జీవన విధానానికి అలవాటు చేస్తాయి. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే రమజాన్ దీక్షలను పరాత్పరుడైన దైవం తమకు అనుగ్రహించినందుకు, వాటిని వారు శక్తివంచన లేకుండా చిత్తశుధ్ధితో ఆచరించగలిగినందుకు సంతోషంగా, దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రవక్త మహనీయుల వారి సంప్రదాయం వెలుగులో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. దైవ ప్రసన్నతను చూరగొనడానికి వ్రతం పాటించడంతోపాటు, ఫర్జ్, సున్నత్, నఫిల్, తరావీహ్ నమాజులు ఆచరిస్తూ, అనేక సదాచరణలను ఆచరిస్తారు. ఆర్థికంగా కలిగిన వాళ్లు ఈ రోజుల్లోనే జకాత్ చెల్లిస్తారు. నిల్వ ఆదాయంలోంచి రెండున్నర శాతం చొప్పున ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి. ఇస్లామ్ మూలసూత్రాల్లో ఇది ఒక మౌలిక విధి. రమజాన్ శుభాల కారణంగా ఇది కూడా ఈ నెలలోనే నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఫిత్రాలు చెల్లిస్తారు. ఫిత్రా కచ్చితంగా పండుగకు ముందే చెల్లించాలి. ఫిత్రాలకు ఆర్థిక స్థోమతతో సంబంధంలేదు. కాస్తోకూస్తో కలిగిన వాళ్లు తమ నిరుపేద సోదరులను ఆదుకోడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ జరుపుకునే స్థోమతలేని వారికి ఫిత్రాలు ఎంతగానో తోడ్పడతాయి. ఫిత్రా పైకంతో వారుకూడా పండుగ సామగ్రో, కొత్తబట్టలో కొనుక్కుని పండుగ సంతోషంలో పాలు పంచుకో గలుగుతారు. ఉపవాసం పాటించినా, పాటించక పోయినా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తరఫునా ఫిత్రాలు చెల్లించాలి. ముస్లిం, ముస్లిమేతర అన్న తారతమ్యం లేకుండా అర్హులైన పేదసాదలకు ఇవ్వాలి. సమాజంలోని పేదసాదల పట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. అనవసర కార్యక్రమాల్లో, వినోదాలకు, భోగవిలాసాలకు ధనం వృథా చేయకుండా నలుగురికీ మేలు జరిగే మంచి పనుల్లో ఖర్చుపెట్టాలి. సత్కార్యాలకు, సమాజ సంక్షేమానికి వినియోగమయ్యే ధన వ్యయాన్నే దైవం స్వీకరిస్తాడు. ఈ విధంగా రమజాన్ నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాస దీక్షలు నిరంతరాయంగా నెలరోజులపాటు కొనసాగి షవ్వాల్ చంద్రవంక దర్శనంతో ముగుస్తాయి. ‘షవ్వాల్ ’ మొదటి తేదీన జరుపుకునే పండుగే ‘ఈదుల్ ఫిత్ర్ ’. నిజానికిది దేవుని మన్నింపు లభించే మహత్తరమైన రోజు. మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే అలాంటి వారిని దైవం తన కారుణ్యఛాయలోకి తీసుకుంటాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయము అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం సత్యం. ఈ అశాశ్వత దేహం నుంచి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పులను సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ముస్లిములందరూ పండుగపూట పెందలకడనే లేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు ఆచరిస్తారు. అనంతరం నూతనవస్త్రాలు ధరించి, అత్తరు పన్నీరులాంటి సుగంధ పరిమళం వినియోగించి, ఆనందోత్సాహాలతో ఈద్ గాహ్‌కు వెళతారు. అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజావ్రతం ఆచరించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనం కోసం, సమాజంలో విలువల విస్తృతి కోసం పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింప జేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ రెండు రకతులు నమాజ్ చేస్తారు. తరువాత ఇమామ్ ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు. అందరూ కలిసి అల్లాహ్ గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు. తమ కోసం, తమ కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, తమ దేశం కోసం, దేశవాసుల సుఖ సంతోషాల కోసం, యావత్ ప్రపంచ శాంతి సంతోషాల కోసం ఆయనను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన తీపి వంటకాలను తమ హిందూ ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్ ’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ విధంగా ‘ఈదుల్ ఫిత్ర్ ’ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొదిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం , త్యాగం, కరుణ, సానుభూతి భావాలను ప్రోదిచేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. కనుక రమజాన్ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. నెల్లాళ్ల శిక్షణ ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్లీ రమజాన్ వరకు ఈ తీపి అనుభూతులు మిగిలి ఉండాలి. అల్లాహ్ సమస్త మానవాళినీ సన్మార్గ పథంలో నడిపించాలని, పుడమిపై శాంతి వర్ధిల్లాలని, యావత్ ప్రపంచం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుందాం. ఈద్ రోజు సంప్రదాయం రమజాన్ నెల పూర్తి రోజాలను నెరవేర్చడమంటే, దైవాదేశ పాలనలో ఒక గురుతరమైన బాధ్యతను నెరవేర్చడం. ఇలాంటి సందర్భంలో ఒక మనిషిగా అతని హృదయం ఆనందంతో పొంగిపోవడం, ఒక విశ్వాసిగా అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోవడం సహజం. ఈ సహజ భావోద్రేకాలే ‘ఈదుల్ ఫిత్ర్’ రూపంలో బహిర్గతమవుతాయి. ఈ పండుగలో విశ్వాసి తాను రోజా విధి నెరవేర్చిన సందర్భంగా తన హృదయంలోని సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాడు. మరోవైపు ఒకవిధిని నియమానుసారం నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించినందుకు దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాడు. ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో ముస్లింలు ఈసంబరాలు జరుపుకుంటారు. పండుగనాడు ఇలా చేయడం సున్నత్ గుసుల్ చేయడం: ముహమ్మద్ ప్రవక్త (స)సంప్రదాయాన్ని అనుసరించి, ఈద్ గాహ్‌కు వెళ్లే ముందు గుసుల్ (స్నానం) చేయాలి. సుగంధ ద్రవ్యాలు వాడడం: ఉన్నంతలోనే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు వాడాలి. మంచివస్త్రాలు ధరించడం: పండుగ సందర్భంగా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి. ఈద్ గాహ్‌కు వెళుతూ బిగ్గరగా తక్బీర్ పలకడం: ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ , లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్’ అని బిగ్గరగా పలుకుతూ ఉండాలి. కాలినడకన ఈద్ గాహ్‌కు వెళ్ళడం: నమాజు కోసం ఈద్ గాహ్‌కు కాలినడకన వెళ్లాలి. ఒకదారిన వెళ్లి, మరోదారిన తిరిగి రావాలి. ఖర్జూరాలు తినడం: ఈద్ గాహ్‌కు వెళ్లే ముందు బేసిసంఖ్యలో ఉండేలా పచ్చి, లేక ఎండు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరం లేని పక్షంలో ఏదైనా తీపివస్తువు తినవచ్చు. 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినే ప్రవక్త మహనీయులు ఈద్ గాహ్‌కు వెళ్లేవారు. ఈదుల్ ఫిత్ర్ ఇలా.. పండుగ నమాజును ముహమ్మద్ ప్రవక్త (స) వారు ఈద్ గాహ్‌లో చేసేవారు. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించి ‘ఈద్ ’ నమాజును ఊరిబయట బహిరంగ ప్రదేశంలో (ఈద్ గాహ్‌లో) నెరవేర్చడం శుభదాయకమని ప్రపంచదేశాల ధార్మిక విద్వాంసుల ఏకాభిప్రాయం. అయితే అనివార్య పరిస్థితుల్లో ఈద్ నమాజును మస్జిద్‌లోనే చేసుకోవచ్చు. ప్రవక్తవారు, ఒకసారి వర్షం కారణంగా ఈద్ నమాజును మసీదులోనే చేశారు. కాబట్టి ఈద్ గాహ్‌లో పండుగ నమాజు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పండుగనాడు ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించడంతో పాటు, సుగంధ ద్రవ్యాలు వాడడంకూడా ప్రవక్త సంప్రదాయమే. ఈద్ గాహ్‌కు వెళ్ళేముందు కొద్దిగా అల్పాహారం తీసుకోవాలి. బక్రీద్ పండుగకు మాత్రం అసలు ఏమీ తినకుండానే ఈద్ గాహ్‌కు వెళ్లాలి. ఈదుల్ ఫిత్ర్ (రమజాన్ )నమాజును కాస్త ఆలస్యంగా, ఈదుల్ అజ్ హా (బక్రీద్ ) నమాజును చాలా తొందరగా చేయాలి. ఈదుల్ ఫిత్ర్‌లో సదఖా, ఫిత్రా.. ఈదుల్ అజ్ హాలో ఖుర్బానీ ముఖ్యవిధులు. యావత్ ప్రపంచంలో ఈ పండుగను అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. ఇదిలా ఉంటే, కొందరు నిరుపేదలు, అభాగ్యులు ఈ పండుగ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తారు. ఎందుకంటే, సంపన్నులు, స్థితిమంతులు సదఖా, జకాత్, ఫిత్రా తదితర దానధర్మాల పేరుతో తమలాంటి పేదవారిని ఆదుకుంటారనే కొండంత ఆశతో. కనుక కలిగినవారు, స్థితిమంతులు సమాజంలోని నిరుపేద సోదరుల పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి. పండుగ పేరుతో మితిమీరిన విలాసాలకు తమ సంపదను ఖర్చు చేయకుండా అభాగ్యులు, అగత్యపరులకు సహాయం చేసివారి ఆర్థిక స్థితిని మెరుగుపరచే ప్రయత్నం చెయ్యాలి. దీనివల్ల లబ్ధిదారుల సంతోషం, వారి దీవెనలతో పాటు, దేవుని ప్రసన్నత, పరలోక సాఫల్యం సిధ్ధిస్తుంది. పేదసాదల దీవెనలూ తోడుగా నిలుస్తాయి. అందుకే ఇస్లామీ ధర్మశాస్త్రం ధన దుబారాను తీవ్రంగా గర్హించింది. దుబారా ఖర్చు చేసేవారు షైతాన్ సోదరులని చెప్పింది. అవసరార్థులకు, పేదసాదలకు ధనసహాయం చేయడాన్ని ప్రోత్సహించింది. అందుకని పండుగ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. స్వీయ ఆనందంతోపాటు, సమాజమంతా ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నది ముహమ్మద్ ప్రవక్త(స) వారి ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఈవిధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. సేమియా, షీర్ ఖుర్మాల తీపితోపాటు, కులమతాలకు అతీతంగా, అందరిమధ్య ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అనుబంధాలను ప్రోదిచేస్తుంది. (అందరికీ ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు.) -యండి. ఉస్మాన్ ఖాన్ -
ఈద్ ముబారక్: అనుపమ పరమేశ్వరన్ స్టన్నింగ్ ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ఏ పండుగ వచ్చినా తనదైన శైలిలో సాంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకునే ముద్దుగుమ్మ సమయానికి తగినట్టుగా ఇపుడు ముస్లిం సాంప్రదాయంలోకి మారిపోయారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్‌లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఈద్ ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి. ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా రూ.786 ప్లాన్ ను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈద్ సందర్భంగా ముస్లింలు పవిత్ర సంఖ్యగా భావించే 786 నంబరుతో ఈ ప్లాన్ తీసుకు రావడం విశేషం. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు మాత్రమే. సంస్థ ఆవిష్కరించిన మరో ప్లాన్ ధర 699 రూపాయలు. వీటితో పాటు కంపెనీ ఇప్పటికే ఎస్‌టివి 118, కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్లనుతీసుకొచ్చింది ఈ ప్లాన్లు అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి, బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకోసం ఇటీవల చాలా ప్రీపెయిడ్ ప్లాన్లతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ .786 ఈద్ స్పెషల్ ప్లాన్ : రూ. 786 టాక్‌టైమ్, మొత్తం 30జీబీ హై స్పీడ్ డేటా లభ్యం. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటులోవుంటుంది. 2020 జూన్ 21 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ .699 ప్రీపెయిడ్ ప్లాన్: ఈద్ స్పెషల్ ప్లాన్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది. మొత్తం 500 ఎమ్‌బి డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ సదుపాయం, రోజుకు 100ఎస్ఎంఎస్ లు లభ్యం. ఇది 160 రోజుల చెల్లుబాటులో వుంటుంది. అలాగే స్పెషల్ పెర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్ కూడా వుంది. బీఎస్ఎన్ఎల్ కాంబో 18 డేటా ప్లాన్: కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్ : రెండు రోజులుతో స్వల్పకాలిక ప్రణాళిక. ఈ ప్రణాళిక పుదుచ్చేరి, లక్ష్వదీప్ సహా 22 సర్కిళ్లలో లభిస్తుంది. 30 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇతర నెట్‌వర్క్‌లకు 250 నిమిషాల వరకు ఉచిత కాలింగ్ సదుపాయం. -
‘600 ఏళ్లలో ఎన్నడూ ఇలా లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘గత 600 సంవత్సరాల్లో మొట్టమొదటి సారిగా ఈద్, శుక్రవారం సందర్భంగా ముస్లింల ప్రార్థనలు లేకుండా పోయాయి’ అని ఇస్లాం మత గురువు హజీ బిలాల్ అహద్ అమ్దాని వ్యాఖ్యానించారు. ఆయన శ్రీనగర్‌లోని జేలం నదీ ఒడ్డునగల 14వ శతాబ్దం నాటి ‘ఖాంక్ ఏ మౌలా’కు ఆయన డిప్యూటి ఇమామ్‌గా పనిచేస్తున్నారు. ‘ఎన్నో ఆందోళనల సందర్భంగా కూడా ఇలా ప్రార్థనలు జరగకుండా ఉన్న రోజు లేదు. అంతెందుకు, మిలిటెన్సీ ఎక్కువగా ఉన్న 1989లో నలువైపుల నుంచి తుపాకీ తూటాలు దూసుకొచ్చినప్పుడు కూడా ఈ మౌలాలో ప్రార్థనలు నిలిచిపోలేదు. రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఆగస్టు 5వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఈద్ రోజునగానీ, శుక్రవారం నాడుగానీ మౌలాలో సామూహిక ప్రార్థనలకు స్థానిక అధికారులు అనుమతించలేదు’ అని ఆయన గురువారం స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. ‘హమ్ క్యా చాహ్తే హై, ఆజాదీ’ అంటూ 1989లో మిలిటెంట్లు జరిపిన ఆందోళనలో అనేక మంది మరణించారు. 1947లో కశ్మీర్లో జరిగిన మత కలహాల్లో కూడా వందలాది మంది మరణించారు. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1975లో కశ్మీర్లో ప్రధాన మంత్రి వ్యవస్థను రద్దు చేసి షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసినప్పుడుగానీ, 1998 కశ్మీర్లో సైన్యం సద్భావన యాత్ర నిర్వహించినప్పుడుగానీ ప్రార్థనలు నిలిచిపోలేదన్నది అమ్దాని ఉద్దేశం. కశ్మీర్లో అప్రకటిత కర్ఫ్యూ అమల్లోకి వచ్చి సెప్టెంబర్ 5వ తేదీ నాటికి సరిగ్గా నెల రోజులు గడిచాయి. అయినప్పటికీ శ్రీనగర్‌తోపాటు పలు పట్టణ ప్రాంతాల్లో స్మశాన నిశబ్దం కొనసాగుతోంది. ల్యాండ్, మొబైల్ టెలిఫోన్ సర్వీసులను, ఇంటర్నెట్ సదుపాయాలను ఇంతవరకు పునరుద్ధరించలేదు. రాష్ట్రం నుంచి ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు కశ్మీర్లోకి రావాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న అప్రకటిత ఆంక్ష కొనసాగుతోంది. ప్రార్థనలు నిర్వహించకుండా కొన్నిచోట్ల ఇమామ్‌లను అరెస్ట్ చేసినట్లు అమ్దాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను శ్రీనగర్ పోలీసు ఉన్నతాధికారి ఖండించారు. ఇతర కేసుల విషయంలో కొందరు ఇమామ్‌లను అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే తాజా పరిణామాలకు, వారి అరెస్ట్‌లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదని శ్రీనగర్‌లోని అగ సయ్యద్ హజీ హాసన్ మందిరం ఇస్లాం గురువు అగా సయ్యద్ ఐజాజ్ రిజ్వీ తనను కలిసిన మీడియా ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఆయన్ని ఆగస్టు 22వ తేదీన ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. జడిబాల్లోని మరో మసీదు ఇమామ్ ఇమ్రాన్ రెజా అన్సారీతోపాటు మరొ కొందరు ఇమామ్‌లను సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారట. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని మాత్రమే పోలీసులు వారికి చెప్పారట. శ్రీనగర్‌లోని పలు చారిత్రక మసీదుల్లో కూడా శుక్రవారం నాటి ప్రార్థనలు నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిల్లో పావురాల రెక్కల చప్పుడు మినహా మరే ఇతర శబ్దాలు వినిపించడం లేదు. -
ఈద్ స్ఫూర్తిని కొనసాగించాలి
‘ఈద్’ ముగిసి నాలుగు రోజులు గడిచి పొయ్యాయి. నెలరోజులపాటు ఆరాధనలు, సత్కార్యాలు, సదాచారాల్లో మునిగి తేలిన ముస్లిం సమాజం, తమకంతటి పరమానందాన్ని పంచిన పవిత్ర రమజాన్ మాసానికి ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈద్ ముగియడంతోనే శుభాల పర్వానికి తెరపడకూడదు. రమజాన్ నెల్లాళ్ళూ మస్జిదులు ఏ విధంగా కళకళలాడాయో, అలాగే రమజాన్ తరువాత కూడా నమాజీలతో కళకళలాడేలా చూడాలి. రమజాన్‌లో కనిపించిన సేవాభావం, దాతృస్వభావం, న్యాయబద్దత, ధర్మశీలత, వాగ్దానపాలన, ప్రేమ, సోదరభావం, సహనశీలత, పరోపకారం, క్షమ, జాలి, దయ, త్యాగభావం రమజాన్ అనంతరమూ ఆచరణలో ఉండాలి. అసత్యం, అబద్ధం పలకకపోవడం, అశ్లీలానికి పాల్పడక పోవడం, చెడు వినకపోవడం, చూడకపోవడం, సహించకపోవడంతోపాటు, అన్నిరకాల దుర్గుణాలకు దూరంగా ఉండే సుగుణాలు నిరంతరం కొనసాగాలి. తొలకరి జల్లుతో బీడువారిన పుడమి పులకించినట్లు, రమజాన్ వసంతాగమనంతో నైతిక వర్తనంలో, ఆధ్యాత్మిక ప్రగతిలో గణనీయమైన వృద్ధీవికాసాలు జరిగాయి. అనూహ్యమైన మానవీయ పరివర్తనకు బీజం పడింది. ఇప్పుడది నిలబడాలి, నిరంతరం కొనసాగాలి ఈ వృద్ధీ వికాసాలు ఒక్క నెలకే పరిమితం కాకూడదు. మనిషిని మనీషిగా మార్చడానికే ఈ శిక్షణకు ఏర్పాటు చేసింది ఇస్లాం. నిజానికి ఇస్లాం బోధనలు చాలా సరళం, సంపూర్ణం, సమగ్రం, స్పష్టం, స్వచ్ఛం, నిర్మలం. మానవులు వీటిని ఆచరిస్తే, అనుసరిస్తే నైతిక, ఆధ్యాత్మిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలన్నిటినీ సమన్వయ పరచగలరు. వీటిమధ్య ఒక సమతుల్యతను సాధించగలరు. ఈ రంగాలన్నింటా దైవాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ప్రతి పనినీ ఆరాధనగా మలచుకోగలరు. మానవుల ప్రతి పనినీ ఆరాధనా స్థాయికి చేర్చిన ధర్మం ఇస్లాం. అందుకే పవిత్ర రమజాన్ నెలలో వారి శిక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ధర్మం. ఇక దాన్ని సద్వినియోగం చేసుకోవడమైనా, దుర్వినియోగం చేసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది. అందుకని రమజాన్ స్పూర్తిని కొనసాగించాలి. అప్పుడే రోజాల ఉద్దేశ్యం నెరవేరుతుంది. పండుగ ఆనందానికి పరమార్ధం చేకూరుతుంది. భావిజీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుంది. దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు లేని చక్కని ప్రేమపూరితమైన సుందరసమాజం ఆవిష్కృతమవుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మాతో పెట్టుకుంటే మసే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారని హెచ్చరించారు. రంజాన్(ఈద్–ఉల్–ఫితర్) సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్డులో ప్రార్థనలకు హాజరైన 25,000 మందికిపైగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మాతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారు.. ఇకపై ఇదే మా నినాదం. బీజేపీ మతాన్ని రాజకీయం చేస్తోంది. హిందువులు త్యాగానికి ప్రతీకలు. ముస్లింలు ఇమాన్(సత్యప్రియత)కు, క్రైస్తవులు ప్రేమకు, సిక్కులు బలిదానానికి ప్రతీకలు. మనమంతా ప్రేమించే భారతదేశం ఇదే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటాం’ అని మమత తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ కొంతసేపటికే అది తగ్గిపోతుంది. ఈవీఎంల సాయంతో వాళ్లు(బీజేపీ) ఎంతత్వరగా అధికారంలోకి వచ్చారో, అంతేత్వరగా తెరమరుగైపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముస్లింలకు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, సీఎం మమత రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు
-
ప్రేమతత్వాన్ని ప్రోదిచేసే ఈద్
ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో ముస్లింలు ఎంతో నియమనిష్టలతో రోజా వ్రతం పాటిస్తారు. భక్తిశ్రధ్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని భక్తితో పారాయణం చేస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స) వారిపై సలాములు పంపుతూ ఉంటారు. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుం టారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాస దీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. రమజాన్ ఉపవాసదీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకుపోయిఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. రమజాన్ ఉపవాసవ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుత జీవనవిధానానికి, బాధ్యతాయుతమైన జీవనవిధానానికి, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవన విధానానికి అలవాటుచేస్తుంది. మానవుల్లో మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ మనోవాక్కాయ కర్మల ద్వారా త్రికరణశుధ్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతా పూర్వకంగా భక్తిశ్రధ్ధలతో పండుగ జరుపుకుంటారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభం నుండి అంతం వరకు ఒక క్రమ పద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో గడిపినవారు ధన్యులు. అందుకే ‘ఈద్’ (పండుగ)ను శ్రామికుని వేతనం (ప్రతిఫలం) లభించే రోజు అంటారు. ఆ రోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ ఆప్యాయంగా రుచిచూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఉన్నత మానవీయ విలువలు కలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర ‡భావాలకు పునాది వేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోది చేస్తుంది. ఇదీ ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్థం. – యండి.ఉస్మాన్ ఖాన్ -
సకల శుభాల సంరంభం
ముస్లింలు జరుపుకునే రెండు ప్రధాన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ ఒకటి. దీన్నే సాధారణంగా రమజాన్ పండుగ అని వ్యవహరిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారు మక్కా నగరం నుండి మదీనా నగరానికి వలస వెళ్ళిన పద్ధెనిమిది నెలల తరువాత, రమజాన్ నెల మరి రెండురోజుల్లో ముగుస్తుందనగా, హిజ్రిశకం రెండవ సంవత్సరంలో సదఖ, ఫిత్రా, ఈద్ నమాజులకు సంబంధించిన ఆదేశాలు అవతరించాయి.‘‘ఎవరైతే పరిశుధ్ధతను పొంది, అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఈద్ నమాజు ఆచరించారో వారు సాఫల్యం పొందుతారు.’ అని ఖురాన్ చెబుతోంది.ఒకసారి హజ్రత్ అబుల్ ఆలియా.. అబూఖుల్ దాతో.. ‘రేప మీరు నమాజు కోసం ఈద్ గాహ్‌కు వెళ్ళేముందు ఒకసారి నావద్దకు వచ్చి వెళ్ళండి.’అన్నారు.మరునాడు అబూఖుల్దా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు.. ‘‘ఏమైనా భుజించారా?’’ అని అడిగారు.‘‘అవును, భుజించాను’’ అన్నారు ఖుల్ దా‘‘గుస్ల్ (స్నానం) చేశారా?’’ అని మళ్ళీ ప్రశ్నించారు.‘చేశాను. అన్నారాయన‘‘మరి, జకాత్, ఫిత్రాలు చెల్లించారా??’ అని అడిగారు మళ్ళీ.‘‘ఆ..ఆ.. చెల్లించాను.’’ అన్నారు అబుల్ ఖుల్దా.’శుభం. ఇక చాలు.. ఈవిషయాలే అడుగుదామని రమ్మన్నాను. ఖురాన్ వాక్యంలోని సారాంశం కూడా ఇదే’ అన్నారు అబుల్ ఆలియా.పవిత్రఖురాన్‌లో ‘ఈద్ ’ అనే పదం ఓ ప్రత్యేక అర్ధంలో మనకు కనిపిస్తుంది. సూరె మాయిదాలో దైవ ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం, ఆకాశం నుండి ‘మాయిదా’ను(ఆహార పదార్ధాలతో నిండిన పళ్ళెరాలు)అవతరింపజేయమని దైవాన్ని వేడుకున్నారు. ‘ప్రభూ..! మాముందు వడ్డించిన విస్తరినొకదాన్ని ఆకాశం నుండి అవతరింపజేయి. అదిమాకూ, మా పూర్వీకులకూ, రాబోయే తరాలకూ ఈద్ (పండుగ)రోజు అవుతుంది.’ అని ప్రార్ధించారు.తరువాత, ఆయన ఇజ్రాయేలీయులతో, మీరు 30 రోజుల వరకు ఉపవాస వ్రతం పాటించి, ఆకాశం నుండి ‘మాయిదా’ వర్షింపజేయమని అల్లాహ్ ను ప్రార్థించండి. ఆయన మీ వేడుకోలును స్వీకరిస్తాడు. ఎందుకంటే, స్వయంగా ఆచరించిన వారికే దాని ప్రతిఫలం లభిస్తుంది.’ అన్నారు. వారి మాట ప్రకారం, ఇజ్రాయేలీయులు 30 రోజులు ఉపవాసం పాటించారు. దాంతో ఆకాశం నుండి ‘మాయిదా’ అవతరించింది. అది ఎంత తిన్నా తరిగేది కాదు. అందుకే మాయిదా అవతరణను క్రీస్తుమహనీయులు పండుగ(ఈద్)తో పోల్చారు. అంటే, దైవానుగ్రహాలు పొంది సంతోషాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం ప్రవక్తల సంప్రదాయం అన్నమాట. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా వుంది: ‘ప్రవక్తా.!వారికిలా చెప్పు. ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, కారుణ్యమే. దానికి వారు ఆనందోత్సాహాలు జరుపుకోవాలి.’(10–58)ఆయన అనుగ్రహాల్లో అత్యంత గొప్ప అనుగ్రహం పవిత్రఖురాన్ అవతరణ. ఇది మానవాళి మార్గదర్శిని.రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి.అల్లాహ్ అనుగ్రహాలను గురించి గనక మనం ఆలోచించగలిగితే, మానవ మనుగడకోసం ఆయన ఎన్ని ఏర్పాట్లు చేశాడో అర్ధమవుతుంది. మానవుడు మాతగర్భం నుండి భూమిపై పడగానే అతని కోసమే సృష్టిమొత్తం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇన్ని అనుగ్రహాలు తమపైకురిపించినందుకు కృతజ్ఞతగా ప్రవక్త మహనీయులవారి సంప్ర దాయం వెలుగులో భక్తిశ్రద్ధలతో ‘ఈద్’ జరుపుకుంటారు. అధికంగా ఆరాధనలు చేస్తారు. సదఖ, ఖైరాత్, ఫిత్రా, జకాత్ తదితర పేర్లతో దానధర్మాలు చేస్తారు.పేద సాదలు కూడా తమతో పాటు పండుగ సంతోషంలో పాలుపంచుకునేలా ఫిత్రాల రూపంలో ఆర్థికంగా సహకరిస్తారు. రమజాన్ నెలవంక దర్శనంతో మొదలైన ఉపవాసాలు నెలరోజుల తరువాత షవ్వాల్ చంద్రవంక ను చూడడంతో విరమిస్తారు. ఈ పండుగనే ‘ఈదుల్ ఫిత్ర్’అంటారు.పండుగరోజు ముస్లిములందరూ పొద్దున్నే స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజ్ చేస్తారు. అనంతరం నూతన వస్త్రాలు ధరించి, అత్తరు, పన్నీరు లాంటి సుగంధాలు రాసుకొని ఆంనందోత్సాహాలతో ‘ఈద్ గాహ్’ కు బయలుదేరతారు. అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజా వ్రతం పాటించే మహాభాగ్యం కలగజేసినందుకు, మానవుల మార్గదర్శకం కోసం, సాఫల్యం కోసం పవిత్రగ్రంథం అవతరింపజేసినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రెండు రకతులు నమాజ్ చేస్తారు.తరువాత ‘ఇమాం’ ఖురాన్, హదీసుల వెలుగులో సమాజానికి దిశా నిర్దేశన చేస్తూ సందేశ మిస్తాడు. అందరూ కలిసి దేవుని గొప్పదనాన్ని, ఘనంగా కీర్తిస్తారు. తమకోసం, తమ కుటుంబాలకోసం, బంంధు మిత్రుల కోసం, దేశంకోసం, దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం, ప్రపంచ శాంతి కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన తీపి వంటకాలను కులమతాలకతీతంగా మిత్రులు స్నేహితులందరికీ ‘ఈద్ ముబారక్’ శుభాకాంక్షలతో పంచి పండుగ జరుపుకుంటారు. ఈవిధంగా ‘ఈదుల్ ఫిత్ర్’ పండుగ మానవ సమాజంలో నైతిక, మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. పరోపకార గుణాలను సహనం, సానుభూతి భావాలను ప్రోది చేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. అల్లాహ్ మనందరికీ సన్మార్గ భాగ్యం ప్రాప్తింపజేయాలని, ప్రపంచం సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ ఈద్ నమాజ్ ఇలా... అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, అల్లాహు అక్బర్ అని రెండుచేతులు పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’పఠించి, మళ్ళీ అల్లాహు అక్బర్ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్నసూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు. తరువాత రెండవ రకతుకోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి మూడు సార్లు అల్లాహు అక్బర్ అంటూ మూడుసార్లూచేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాల్గవ సారి అల్లాహుఅక్బర్ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు,తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్ లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈద్ నమాజులో అజాన్, అఖామత్లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థితులను అన్వయిస్తూ సమాజానికి సందేశం ఇస్తారు. -
చంద్రబాబు ఈద్ ముబారక్ బదులు ఊద్ ముబారక్ అన్నాడు
-
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
మానవత్వమే మతం
కొచ్చి: నవత్వానికి మతాలు అడ్డురావని వారు నిరూపించారు. విపత్కర పరిస్థితుల్లో అన్య మతస్తుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించి ఆదర్శంగా నిలిచారు. వరదల ఉధృతికి త్రిసూర్ జిల్లాలోని కోచ్‌కడవులోని జుమా మసీదును వరదనీరు ముంచెత్తింది. దీంతో సమీపంలోని రత్నేశ్వరి ఆలయంలోని హాలులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేసుకోవడానికి దేవాలయ కమిటీ అంగీకరించింది. ప్రార్థనలు చేసుకోవడానికి హాలులో ఏర్పాట్లుచేసింది. ‘బుధవారం కల్లా వరద నీరు తగ్గితే, ప్రార్థనలు చేసుకోవచ్చని భావించాము. కానీ నీరు అలాగే ఉంది. దేవాలయ కమిటీ సభ్యులను కలవగా దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి వెంటనే అంగీకరించారు’ అని మసీదు కమిటీ అధ్యక్షుడు పీఏ ఖలీద్ చెప్పారు. ‘మొదట మనమంతా మనుషులం. అందరం ఒకే దేవుని బిడ్డలం అని గుర్తుంచుకోవాలి’ అని రత్నేశ్వరి దేవాలయ కమిటీ సభ్యుడొకరు అన్నారు. దేవాలయంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న నన్‌లు బక్రీద్ సందర్భంగా మెహందీ పెట్టుకున్న వీడియోలు, హిందూ దేవాలయాల్ని శుభ్రం చేస్తున్న ముస్లింల ఫొటోలు మాధ్యమాల్లో వైరల్అయ్యాయి. హిందువులకు మసీదులో ఆశ్రయం వరదలకు నిరాశ్రయులైన పలు హిందూ కుటుంబాలకు మల్లప్పురం జిల్లా అక్కంపాడులోని చెలియార్ గ్రామంలో ఉన్న జుమా మసీదు ఆశ్రయం కల్పించింది. వరదలకు నిలువనీడ కోల్పోయిన 78 మంది హిందువులకు మసీదులో వసతి కల్పించారు. వరదనీటితో అపరిశుభ్రంగా మారిన వెన్నియాడ్లోని విష్ణుమూర్తి ఆలయాన్ని, మల్లప్పురంలోని అయ్యప్ప ఆలయాన్ని కొంతమంది ముస్లింలు శుభ్రం చేశారు. ‘ముక్క’ను వదులుకున్న ఖైదీలు కర్ణాటకలో వరద బాధితులను ఆదుకునేందుకు పరప్పన అగ్రహారం, బళ్లారి జైలు ఖైదీలు ఒక్కవారం మాంసాహారాన్ని వదులుకున్నారు. ఇలా ఆదా అయ్యే నగదు మొత్తాన్ని వరద బాధితల సహాయార్థం వెచ్చించాలని జైలు అధికారులను కోరారు. ఈ రెండు జైళ్లలో ప్రతి శుక్రవారం ఖైదీలకు మాంసాహారం వడ్డిస్తారు. ఇందుకోసం సుమారు రూ.2–3 లక్షల దాకా ఖర్చవుతోంది. బక్రీద్ సందర్భంగా కేరళలోని త్రిసూర్ రత్నేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు -
ఈద్ వేళ ఉగ్ర ఘాతుకం...
శ్రీనగర్ : పవిత్ర బక్రీద్ పర్వదినాన కశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. వేర్వేరు ఘటనల్లో ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులు, ఒక బీజేపీ కార్యకర్త ను కాల్చిచంపారు. బాధిత కుటుంబాల్లో ఈద్ సంబరాల స్థానంలో విషాదం నింపారు. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని లార్వెలో ఈద్ జరుపుకోవడానికి స్వస్థలం వచ్చిన ఇన్స్పెక్టర్ మహ్మద్ అష్రాఫ్ దార్‌ను ఉగ్రవాదులు బుధవారం సాయంత్రం అతని స్వగృహంలోనే హత్యచేశారు. ఆయన బుద్గాంలోని స్పెషల్ బ్రాంచీలో పనిచేస్తున్నారు. అంతకుముందు, కుల్గాంలో ఈద్ ప్రార్థనలు చేసి ఇంటికి వెళ్తున్న ట్రైనీ కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ షాను పొట్టనబెట్టుకున్నారు. పూల్వామా జిల్లాలో స్పెషల్ పోలీసు అధికారి మహ్మద్ యాకూబ్ షాపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కుప్వారా జిల్లాలో మంగళవారం రాత్రి అపహరణకు గురైన స్థానిక బీజేపీ కార్యకర్త మృతదేహం బుధవారం కనిపించింది. ఆయన శరీరమంతా బుల్లెట్లు దిగి ఉండటంతో ఈ ఘాతుకానికి పాల్పడింది ఉగ్రవాదులే అని భావిస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విచారం వ్యక్తం చేస్తూ కశ్మీర్ లోయలో హింస ఎక్కువ కాలం కొనసాగదన్నారు. అనంత్‌నాగ్‌లోని జంగ్లాట్ మండీ, బారాముల్లాలోని సోపోర్ తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు రాళ్లు రువ్వారు. -
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు
-
దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు
-
వైరల్ ఫోటో ; మండిపడుతోన్న నెటిజన్లు
ఇస్లామాబాద్ : గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటో చూసిన జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే ఒక ఎద్దును క్రేన్ సాయంతో మూడంతుస్తుల భవనం మీద నుంచి కిందకు దించుతున్నారు. ప్రమాదంలో ఉన్న దాన్ని కాపాడటం కోసం కిందకు దించుతున్నారనుకుంటే పోరపాటే. ఎందుకంటే వారు ఆ ఎద్దును త్యాగం(వధించడం) కోసం తీసుకోస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఒకరు తీసిన ఈ ఫోటో గురించే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది. వివరాల ప్రకారం మరికొద్దిరోజుల్లో ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్ అల్ అధా/బక్రీద్ పండుగ సందర్భంగా కరాచీకి చెందిన ఒక వర్తకుడు తన ఎద్దును స్థానిక పశువుల సంతలో అమ్మాలనుకున్నాడు. అందుకోసం తన మూడంతుస్తుల బిల్డింగ్ మేడ మీద ఉన్న ఎద్దును క్రేన్ సాయంతో కిందకు దించుతున్నాడు. అందులో భాగంగా ఎద్దును తాళ్లతో బంధించాడు. దాని మూతిని కూడా తాడుతో కట్టి క్రేన్‌తో కిందకు దించాడు. అంతేకాక దాని కొమ్ములకు పాకిస్తాన్ జెండాలను కట్టాడు. ఈ ఫోటో చూసిన జంతు ప్రేమికులు.. ‘క్రూరమైన చర్య’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘నువ్వు శాఖాహారివి కాబట్టే జంతు సంరక్షణ అంటూ మాట్లాడుతున్నావు. అయితే నీ మాటలను ఎవరూ పట్టించుకోరు. జీవహింస అంటూ కూర్చుంటే ఇంత రుచికరమైన మాంసం ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈద్ అల్ అధా/ బక్రీద్‌ను ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ రోజే ఇబ్రహీం ప్రవక్త తన కుమారిన్ని బలి ఇవ్వడానికి సిద్దపడ్డారు. అందుకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ నెల 22న బక్రీద్‌ను జరుపుకోనున్నారు. -
పీఆర్సీ అమలుకు కృషి చేస్తా: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీపై కృషి చేస్తానని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన ‘ఈద్ మి లాప్’కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలని కోరారు. సకలజనుల సమ్మెలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రతి ఉద్యోగి ఐదు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం నేతలు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీరెల్లి కమలాకర్‌రావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సరోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పలు అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేసింది. ఉపాధ్యాయ బదిలీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేయటంతో పాటు ఖాళీగా ఉన్న జీహెచ్ఎం, ఎంఈవో పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతూ తీర్మానించింది. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు
-
సరిహద్దుల్లో కానరాని ఈద్ సందడి
సాక్షి, శ్రీనగర్ : ఈద్ సందర్భంగా భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఏటా కనిపించే దృశ్యాలకు భిన్నంగా ఈసారి గంభీర వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అట్టారి-వాగా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు పరస్పరం స్వీట్లు పంచుకోలేదు. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈద్ సందర్భంగా ఇరు దేశాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం, స్వీట్లు పంచుకోవడానికి దూరంగా ఉన్నారు. రాజౌరిలోని నౌషెరా బ్లాక్‌లో శనివారం సైతం పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో ఓ భారత జవాన్ మరణించారు. ఇక ఈద్, దీపావళి వంటి పర్వదినాల్లో, స్వాతంత్ర్యదినం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఇరు దేశాల జవాన్లు స్వీట్లు పంచుకుని సందడి చేసేవారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజునా పాకిస్తాన్ రేంజర్లతో స్వీట్లు పంచుకునే సంప్రదాయానికి బీఎస్ఎఫ్ స్వస్తిపలకడం గమనార్హం. అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ యదేచ్ఛగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటానికి నిరసనగా బీఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఈద్ ప్రార్థనలు ముగియగానే..
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఈద్ రోజూ ఘర్షణలు చెలరేగాయి. శనివారం ఉదయం ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే పలు ప్రాంతాల్లో ఆందోళన బాట పట్టిన కశ్మీరీ యువకులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. తొలుత అనంత్‌నాగ్ జిల్లా జంగ్లాత్ మండి పట్టణంలో చెలరేగిన ఘర్షణలు ఆ తర్వాత పలు ప్రాంతాలకు విస్తరించాయి. ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఘర్షణల్లో బ్రక్పోరా పట్టణానికి చెందిన షీరజ్ అహ్మద్ అనే యువకుడు మరణించాడని పోలీసులు తెలిపారు. నిరసనకారులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విధినిర్వహణలో నిమగ్నమైన భద్రతా దళాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలు భాష్పవాయు గోళాలు, పెల్లెట్ గన్స్‌ను ప్రయోగించారు. ఘర్షణల్లో ముగ్గురు ఆందోళనకారులకు గాయాలయ్యాయని, వీరు అనంత్‌నాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. షోపియాన్ పట్టణంలో యువత కూడా భద్రతా దళాలపై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. రాజధాని శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలోనూ ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే ఆందోళనకారులు గుమికూడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రమజాన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముస్లీంల పవిత్ర పండుగ రమజాన్ ను తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. కులమతాలకు అతీతంగా సోదరభావంతో ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ముస్లీం ప్రార్థనల కొసం ఈద్గా, మసీదుల వద్ద జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగర మేయర్ బొంతు రాంమోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డిలు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మాసబ్ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్ వద్ద ముస్లీం సోదరులు నమాజ్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సనత్ నగర్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట మజీద్‌లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రబాద్ చిలకలగూడ ఈద్గాలో మంత్రి పద్మారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాన్సువాడలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నల్గొండలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయవాడ: రమజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిని వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీంలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా రామవరప్పాడు రోడ్డు నిర్మాణంలో తొలగించిన మసీదును ఎందుకు నిర్మించడం లేదంటూ చంద్రబాబును ముస్లీం సోదరులు ప్రశ్నించారు. దీంతో ఏడాది లోపు మసీదు నిర్మిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. కడప: రాయచోటి పట్టణంలోని ఈద్గాలో జరిగిన వేడుకల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పార్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ప్రధాని మోదీ రమజాన్ సందేశం
న్యూఢిల్లీ : శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం దేశమంతటా ఈద్ ఉల్ ఫితర్ (రమజాన్) పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7.35 గంటలకు నెలవంక కనిపించిందని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ ప్రకటించారు. దేశ ప్రజలకు రమాజన్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్‌తో పవిత్ర రమాజాన్/రంజాన్ మాసం ముగుస్తుంది. 30 రోజులపాటు ఉపవాసం ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈ పర్వదినాన్ని జరుపుకునే ముస్లింలు రమజాన్ సందర్భంగా తమ బంధుమిత్రులు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపుతారు. మసీదులు, ఈద్గాలు, నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ నిరుపేదలకు సహాయం చేస్తారు. రమజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈద్ ముబారక్. దేశ పౌరులందరికీ, ప్రత్యేకంగా దేశవిదేశాల్లోని మన ముస్లిం సోదర, సోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భం మన కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని, మన సమాజం పరస్పర ప్రేమానురాగాలను పెంపొందించాలని కోరుకుంటున్నాను’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ‘ఈద్ ముబారక్, ఈ పర్వదినం సమాజంలో మన ఐక్యతను, సామరస్యాన్ని మరింత పెంపొందించాలని ఆశిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా దేశ ప్రజలకు రమజాన్ శుభాకాంక్షలు చెప్తూ.. ఆడియో ఫైల్‌ను షేర్ చేశారు. పలువురు జాతీయ రాజకీయల నాయకులు, పలువురు ప్రముఖులు కూడా రమజాన్ శుభాకాంక్షలుత తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్: ఈద్ ముబారక్ ప్లాన్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ ప్లాన్‌ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా ఈద్ ముబారక్ పేరుతో మరో ఎస్టీవీ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 786 ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 2జీబీ డేటా ఆఫర్ చేస్తోంది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తోపాటు, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ స్పెషల్ ప్లాన్‌వాలిడిటీ 150 రోజులు. ఈ లిమిటెడ్ పీరియడ్ ప్రస్తుతానికి ఢిల్లీ,ముంబైలో అందుబాటులో ఉంటుంది. జూన్ 12నుంచి 26 తేదీల మధ్య ఈ ప్లాన్ రీచార్జ్‌కు లభ్యమవుతుంది. లిమిటెడ్ పీరియ్డ్ ఆఫర్ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ప్లాన్ దేశవ్యాప్తంగా లాంచ్ చేసేదీ లేనిదీ క్లారిటీ రావాల్సి ఉంది. -
ఇద్దరు కలిసిన ఈద్
బాద్షా, భాయ్ బాలీవుడ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చారు. ‘జీరో’ కోసం కలిసిన ఈ హీరోలిద్దరూ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జీరో’. ఈ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు షారుక్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. ఈద్ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు. టీజర్లో ‘చేయి కలుపు బ్రదర్’ అంటూ షారుక్, సల్మాన్ డ్యాన్సులతో స్క్రీన్‌ను మెరిపించారు. బ్రదర్స్ ఇద్దరం కలసి హిందూస్థాన్‌కి ఈద్ ముబారక్ చెబుతున్నాం అంటూ షారుక్‌ని సల్మాన్ ఎత్తుకోవడం.. సల్మాన్‌కి ముద్దిస్తున్న షారుక్ ఖాన్ టీజర్ ఇద్దరి అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
‘జీరో’ మూవీ టీజర్ రిలీజ్
-
షారూఖ్‌ను ఎత్తుకున్న సల్మాన్
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ రెండు రోజులు ముందుగానే పండుగ తీసుకొచ్చాడు. ఈద్ కానుకగా కొత్త టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా జీరో మూవీ టీం ముందుగానే ప్రకటించింది. అయితే ఈద్ కన్నా రెండు రోజుల ముందే టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంతేకాదు అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు చిత్రయూనిట్. జీరో సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈద్ కానుకగా ఈ ఇద్దరు కలిసి నటించిన సన్నివేశాలకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. షారూక్, సల్మాన్ లు కలిసి ఆడిపాడిన టీజర్ అభిమానులను ఖుషీ చేస్తుంది. ఈద్ సందర్భంగా ఇద్దరు సోదరులు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటూ టీజర్‌ను ముగించారు. ముఖ్యంగా మరుగుజ్జుగా కనిపిస్తున్న షారూఖ్‌ను ఎత్తుకోవటం, షారూఖ్ ప్రేమగా సల్మాన్‌కు ముద్దుపెట్టడం టీజర్లో హైలెట్ గా నిలుస్తాయి. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
పండగ పూట పలావు ముక్కల కత!
ఈద్గాలో నమాజు అయిపోయినాక ఒక్కరికి కూడా ఈద్‌ముబారక్ చెప్పకుండా, ఛాతీ ఛాతీ కలిపి వాటేసుకోకుండా, చిల్లర డబ్బుల కోసరం వెంటపడే బుడబుక్కలోళ్లని పుణ్యానికి కూడా పట్టించుకోకుండా ఏందో అర్జెంటు పనున్నట్టుగా యింటికొచ్చేస్తాడు మా నాయిన. ఆయన వెనకనే మా అన్నా నేనూ. పలావొండుంటారు కదా. అదీ కత. కానీ మా నాయిన పుణ్యమా అని ఏ రంజాను పండక్కి కూడా పస్టు పస్టు తినే బాగ్యం మాకు లా. ముందు పెండెం రవికి క్యారేజి కట్టాలి. ఆనేకనే మేము తినాలి. మా నాయినమ్మా అమ్మా అయితే అప్పుడు కూడా తినేదానికిలా. రవికి కట్టిన క్యారేజీని మా నాయిన తీసకెళ్లి వాళ్లింట్లో యిచ్చొచ్చేసినాక – పలావెంకారెడ్డోళ్లొచ్చి పండగ దావత్ చేసెళ్లినాక – బిస్తర్ ఎత్తుకొని, బాసన్లు సర్దుకొని, అప్పుడు తినాలి మా నాయినమ్మా అమ్మా. పాపం వాళ్లు పొద్దుననంగా లేచి పరగడుపున వంటపని మొదలుపెట్టి, మావుసం ముక్కులు శుద్దం చేసుకొని, కొబ్బరి మసాలా నూరుకొని, గోంగూర వొలుచుకొని, కట్టెల పొయ్యిమీద సస్తా బతకతా అంతా రెడీ చేసి పెట్టుంటే మా నాయిననేవోడు నమాజు నుంచి రావడంతోటే ‘మీరు తిన్నారంటమ్మే’ అని అడగబళ్లా? ‘రవికి క్యారేజీ కట్టినారంటమ్మే’ అని అడగతాడు.అడగటమే కాకుండా అటకమీది నుంచి అయిదు డబ్బాల క్యారేజీ దించి, దాని నిండుగా ఆయన సొహస్తాలతో పలావు ముక్కలూ, ఖుర్మా, గట్టి సేమ్యాలూ, పాలసేమ్యాలూ దిట్టంగా పెట్టుకుంటాడు. మా అమ్మా నాయినమ్మా ఎంతో యిష్టంగా ఒండుకున్న పలావులోని ముక్కలన్నీ మా నాయిన లోడుకొని లోడుకొని పోతా వున్నా వాళ్లిద్దరూ నోరు మెదపడానికి లా. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకొని చూస్తా వుండిపోవాల్సిందే. యింతకీ యీ పెండెం రవి ఎవరో తెలియాలంటే గరానా వొంశెస్తుడైన మా నాయిన పూటకు ఠికానా లేని కరెంటు పనోడు ఎట్టయినాడనే కథను తెలుసుకునే పనుంది.మా నాయిన సొంతూరు కావలికి ఉత్తరం తట్టున్న రామాయపట్నం. ‘తెట్టు’ దగ్గిర దిగి మూడు మైళ్లు తూర్పుకెళితే తెల్లటి యిసకా, దూరంగా బులుగు రంగులో సముద్రం ఆనేక మా ఊరూ అవుపిస్తాయి. పొట్టి పెంకుల యిళ్లతో, తాటాకు వసారాలతో, చిల్లచెట్లతో, బకింగ్ హాము కాలవతో బలే కళగా వుంటుంది మా వూరు. మేం పిలకాయలుగా వున్నప్పటి కంటే మా నాయినోళ్ల చిన్నతనంలోనే మా వూరు యింకా కళగా వుండేదంట. అట్టా కళగా వున్నరోజుల్లోనే ఆడ మా తాత మొహమ్మద్ సాయిబు చేపలాపారం చేస్తా లాట్గవర్నర్ అమ్మా మొగుడిలా చెలాయిస్తా వుండేవాడంట. అప్పట్లో మా తాత చేతి కింద నాలుగు నాటు పడవలు, పదిమంది పట్టెపోళ్లు, లెక్కలు రాయడానికి ఇద్దరు గుమాస్తాలు వుండేవాళ్లంట. మా తాత హయాములో మాకు సముద్రం దగ్గిర పదిహేనెకరాల సరుగుడు తోట, తెట్టు దగ్గిర రోడ్డు వారగా బెంగుళూరు మామిడితోట,ఆరెకరాల పొలం వుండేవి. (యిప్పుడు యాబై అంకణాల యింటి జాగా మాత్రమే మిగిలింది.) అట్టా డబ్బుదస్కం తిండీ గిండీ జంజామతంగా వున్న మా యింట్లో మా నాయిన ఒక్కగానొక్క మొగపిల్లోడిగా పుట్టినాడు. అందువల్ల మా తాతకీ, మా నాయినమ్మకీ, మా నాయిన కంటే ముందూ వెనకా పుట్టిన మా ముగ్గురు మేనత్తలకీ మా నాయినంటే బలే గారాబం. మా నాయిన యిది కావాలంటే కావాలి. అది వద్దంటే వద్దు రీతిలో చలాయించినాడు. ముందు నుంచీ కూడా మా నాయినకు చదువంటే బలే యింటరెస్టు వుండటం చూసి మా తాత మా నాయిన్ని ఫస్టుఫారం అయిపోయినాక నెల్లూరులోని సిఎంసి హైస్కూలులో సెకండ్ ఫారం చేర్పించినాడు.ఇస్కూల్లో చదువుకోవడం, కుమార్గల్లీలోని మా పెదత్త (మా నాయిన పెదక్క) యింట్లో తిని పొణుకోవడం తప్పితే యింకో పని ఎరగని మా నాయినకు ఎస్ఎల్సిలో పడింది దెబ్బ. అది కూడా మా పెదత్త బర్తయిన నెల్లూరు సాయిబు రూపంలో. నెల్లూరు సాయిబంటే మా యిలాకాలో చిన్న కత కాదు. ఆయనంత శ్రీమంతుడు, జల్సా మనిషి యింకెవ్వరూ లేరు మా యిళ్లలో. (నెల్లూరు టౌనోడినని బలే డాబుసరిచూపిస్తాడు కాబట్టి మా యిళ్లల్లో ఆయన్ని నెల్లూరు సాయిబు అని పిలస్తారు). మా పెదత్త కట్నం కింద ‘ఊదుబుట్ట’ నిండుగా ఎనబై సవర్ల బంగారాన్ని మా తాత పెడితే ‘నేనంత లెవిలు తక్కువోణ్ణా’అని నలగరి ముందర నగల బుట్టని కాలితో తన్నినాడంటే నెల్లూరు సాయిబు మిడిసిపాటు అప్పట్లో అలా వుండేది. ఒకప్పుడు కుమార్గల్లీలో సగం ఆస్తులకు ఓనరయిన మా నెల్లూరు సాయిబు గానాబజానా ఆడోళ్ల పిచ్చిలో పడి ఆస్తులన్నీ కరగపెట్టుకున్నా, బెట్టుసరికి పోయి, ‘నవాబుగారూ’ అంటా మళ్లా ఏ పిలుపు వచ్చినా కాదనుకుండా తయారయి పోతా వుండేవాడంట. అట్టాంటి అలివిగాని మనిషైన నెల్లూరు సాయిబు ఒకరోజు వున్నట్టుండి మా పెద్దత్తను పట్టుకొని సావగొట్టేసినాడు – ‘బిడ్డలు ఎదిగొస్తా వున్నారు... నీ జల్సాలు మానుకోయ్యా’ అని నోరు తెరిచి చెప్పిన పాపానికి. సావగొట్టడమే గాకుండా ‘నువు నాకు అక్కర్లేదు పో’ అని మా పెదత్తని మా తాతింటికి తరిమేసినాడు. ఆమె వెనుకనే ఏడ్చుకుంటా మా నాయిన. ఆ రావడం రావడం మూడు నెలల దాక మా పెదత్త పోనేలా. నెల్లూరు సాయిబు రానేలా. యింక చేసేదేముంది. లక్షణంగా పరీక్షలు రాయాల్సిన మా నాయిన గోళ్లు గిల్లుకుంటా ఇంట్లో కూచుండిపోయినాడు. అప్పటికే మా తాత యాపారంలో లాసయిపోయి, మా రెండో అత్త పెళ్లికి సరుగుడు తోట అమ్మకనూకి, చేతిలో డబ్బులాడక అల్లాడతా వున్నాడు. ఆ టయిములో మా పెదత్తొచ్చి నెత్తిన కూచోవడమే కాకుండా మా నాయిన చదువు ఖరాబై పోవడంతో ఆ విసుగునంతా మా నాయిన మీద చూపించినాడంట మా తాత. ఒకరోజు మా బరెగొడ్డు పేడేస్తా వుంటే – ‘రే.. అబయా.. గమ్మున్నట్టా కూచోకపోతే ఆ పేడైనా ఎత్తరాదా’ అన్నాడంట మా నాయినతో.అంతే. మా నాయినకు పొడుచుకొచ్చేసింది.‘యీ నా కొడుకు నన్నింత మాటంటాడా?’ అని అదే రోజు రాత్రి మా యినప్పెట్టెలో నుంచి పదో యిరవయ్యో అంటే ఎల్లికొల్ల కదా. వాటితో రెండు రోజుల పాటు హాయిగా నెల్లూరులో తిరిగి ఆనేక బస్సెక్కి నేరుగా కర్నూల్లో దిగినాడంట మా నాయిన. ఆడ ఏమి చేయాల్నో తెలియక ఆఖరకుఎవుర్నో బతిమిలాడుకొని కరెంటు పనిలో చేరిపోయినాడు.కర్నూలులో మా నాయన పని అట్టా వుంటే రామాయపట్నంలో మా తాత పని యింకోలాగా వుంది. పాపం, కొడుకు కనిపించకుండా పోయేసరికి పిచ్చోడాల తయారయ్యి ఊరూరా తిరిగి వెతకడం మొదలు పెట్టినాడాయన. ఆరు నెలలకి కూడా మా నాయిన కాణ్ణుంచి ఉత్తరం పత్తరం లాకపోయేసరికి ‘వారం రోజుల్లో నా కొడుకుని చూపించినావో సరేసరి. లాకపోతే సముద్రంలో దూకిచస్తా’ అని ఫైనలు వార్నింగిచ్చేసింది మా నాయినమ్మ. దాంతో మా తాత ‘ఎట్టరా బగమంతుడా’ అనుకుంటా వుంటే ఏడో నెలలో మా నాయిన ఊర్లోకి దిగినాడు, ఒక చేతిలో కరెంటు పనితో యింకో చేతిలో ఎనబై రూపాయిల తొలి సంపాదనతో.ఇదీ మా నాయన కరెంటు పనోడైన కత.నిజానికి యీడతో కతయిపోవాల్సిందేకానీ మా నాయన మామూలోడు కాదు కాబట్టి యింకా కత నడిపించినాడు. మాతాత అన్న మాటని అన్నాళ్లు పోయినా మనసులో నుంచి చెరిపెయ్యకుండా ‘నువ్వూ వద్దూ నీ ఆస్తీ వద్దు’ అంటా కావలికి వచ్చేసినాడు.కావలిలో మా నాయినకు దొరికిన గురువే పెండెం రవి.అప్పట్లో ఆయన పెద్ద ఎలక్ట్రికల్ కాంట్రాక్టరు. మంచి పలుకుబడున్నోడే కాకుండా బలే మనసున్న మనిషాయన. కావల్లో దిక్కూ దివాణం లాకుండా తిరుగుతున్న మా నాయిన్ను చూసి పెండెం రవే పిలిచి ఆయన చేతికిందకు తీసుకున్నాడు. అంతేగాకుండా కన్నకొడుకాల పోషించి పెద్ద పనిమంతుడిలా తీర్చిదిద్దినాడు.అందుకనే మా నాయినకు రవీ అంటే అంత బయం. అంత బక్తి. రంజాను పండగొస్తే ఆయనకు క్యారేజీ కట్టి తీసకెళ్లి ఇస్తేనే మా నాయినకు పండగ చేసుకున్నట్టు లెక్క. లాకుంటేలా.అయితే దేనికైనా మితం వుండబళ్లా?ఆ సముచ్చరం క్యారేజీ తీసకపోయిన మా నాయన మళ్లా కాసేపటికే వచ్చి యింకో క్యారేజీ కావాలని కూచున్నాడు.‘రవోళ్ల కూతురూ అల్లుడూ వచ్చుండారు. వాళ్లకు కూడా పలావు పెట్టబళ్లా?’ అని డిమాండు చేసినాడు. ఆయన డిమాండింగు చూసి మా అమ్మకు సర్రన ఎక్కింది కోపం. ‘యాడుందయ్యా అంత? ఏం బళ్లేదులే’ అనింది అడ్డం చెబుతా.మా నాయిన వింటేగా. ‘పండగ చేసుకునేది మనం తినడానికంటమ్మే. తీ గబాల్న’ అంటా మళ్లా రెండో క్యారేజీలో పలావూ, ముక్కలూ పెట్టుకొని వెళ్లిపోయినాడు. ఆ దెబ్బకి దబరలోని సగం ముక్కలుఖాళీ. పలావెంకారెడ్డోళ్లు దావత్‌కి వచ్చినాక ‘యీ ఒక్క ముక్కే.. యీ ఒక్క ముక్కే’ అంటా మా నాయిన ఎచ్చులకి పోయి మిగిలిన ముక్కలన్నీ కూడా ఖాళీ చేయించేశాడు.యింకేముంది? మొత్తం ఖాళీ!అంతా అయిపోయినాక ఎంకారెడ్డోళ్లని సాగనంపి, ఆకొక్క వేసుకొని, ఫ్యాను కింద హాయిగా నిదరపోతున్న మా నాయిన్ను ఊసురోమంటా చూసినారు మా నాయినమ్మా అమ్మా.ఉత్త మెతుకులూ టమేటా తొక్కులూ మిగిలిన పలావు దబర తట్టే చూస్తా ‘యీ నా కొడుకుని కని ఏనాడు బాగుపడ్డానని’ అనింది మా నాయినమ్మ మంటగా.‘యీ మహానుబావుణ్ణి కట్టుకొని ఏమి సుకపడ్డానని?’ అనింది మా అమ్మ కచ్చగా.ఆనేక వాళ్లిద్దరూ పొయ్యిలోని బొగ్గుతో మొకాలు కడుక్కొని, ఆ ఉత్త మెతుకులనే గోంగూరతో కలుపుకొని తిని, గమ్మున పొణుకున్నారు. -
బులుగంటే బులుగా పలావెంకారెడ్డా!
భారతీయ కథలలో రంజాన్ ప్రస్తావన రాగానే అందరికీ గుర్తొచ్చే కథ ప్రేమ్‌చంద్ రాసిన ‘ఈద్గా’. తెలుగులో జ్వాలాముఖి రాసిన ‘ఈద్ కా చాంద్’ కథలో కూడా రంజాన్ ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే ‘దర్గామిట్ట కతల్లో’ మూడు వరుస రంజాన్ కథలు కూడా పాఠకులను విశేషంగా అలరించాయి. వాటి నుంచి రెండు కథలు... యిప్పుడంటే కావలి కోర్టెదురుగ్గా పలావు సెంటరు పెట్టి ప్లేటుకు యిరవై ఆరు రూపాయలు కళ్ల చూస్తా వున్నాడుకానీ మేము పిలకాయలుగా వున్నప్పుడు పలావెంకారెడ్డి కూడా బాగా యిబ్బందులు పడినోడే! పలావెంకారెడ్డి (పలావు+వెంకారెడ్డి) మా నాయనకు ప్రాణ స్నేహితుడు. అంతే కాదు. మా నాయన పెళ్లికి పెద్ద కూడా.మా అమ్మను మా నాయనకిచ్చి చేయాలని మా తాత మస్తాన్‌సాయిబు నిచ్చయించుకున్నాక మా నాయన ‘కాండక్టు’ను యింకెవుర్నీ అడక్కుండా నేరుగా పలావెంకారెడ్డినే అడిగినాడంట.‘ఆ పిల్లోడికేమి సామీ. బంగారం. కళ్లు మూసుకొని యిచ్చెయ్యి’ అని పలావెంకారెడ్డి బరోసా యిచ్చినాకే మా తాత కుదుట పడినాడంట.పలావెంకారెడ్డి మా నాయిన కంటే ఏడెనిమిదేళ్ల పెద్దోడు. అయినాగానీ కసరత్తు చేసిన కండలతో (ఆయన ఒకప్పుడు పయిల్వానులే), మంచి ఒంటి చాయతో, తలకురంగేసుకొని తెల్లటి గుడ్డలు కట్టుకొని కుర్రపిల్లోడాల కనిపించేవాడు.‘నిఖా’నాటికి మా అమ్మ పద్నాలుగేళ్ల చిన్నపిల్ల కాబట్టి పలావెంకారెడ్డి మా అమ్మని ‘అమ్మాయ్’ అని పిలిచేవాడంట. ఆ తర్వాత్తర్వాత ఆయనకి ఆ పిలుపే అలవాటయిపోయింది. మా నాయినంటే ఏమోగానీ ఆయనకు మా అమ్మంటేనే బాగా అబిమానం.సంక్రాంతి వచ్చిందంటే చాలు మా అమ్మకు యిష్టమని చెప్పి పెద్ద స్టీలు టిపిను నిండుగా అరిసెలు, మనుబూలు, లడ్లు తీసుకొచ్చి ‘తీసుకో అమ్మాయా’ అంటా యిచ్చేవాడు పలావెంకారెడ్డి. ఆనేక మా నాయిన్ని మా అన్ననీ నన్నూ యింటికి పిలచకెళ్లి, యిస్తరాకు నిండుగా పాయిసం పోసి పండగ బోజనం పెట్టేవాడు. (ఇక్కణ్ణే యింకో సత్యం కూడా చెప్పుకోవాలి. మా అమ్మ ఏ పెళ్లికీ ఏ శుబకార్యానికీ వెళ్లాలన్నా నిన్న మొన్నటిదాకా కూడా పలావెంకారెడ్డి బార్య నగో, ఆయన కోడలి నగో తెచ్చుకునేది హక్కుగా). మేం పిలకాయలుగా వున్నప్పుడు పలావెంకారెడ్డికి యవసాయం వుండేదో లేదో నాకు తెలియదుకానీ యింట్లో మాత్రం ఎప్పుడూ బరెగొడ్లుండేవి. ఆయన బార్య తెల్లారి లేచి బర్రెగొడ్డాల కష్టపడతా వుండేది.యీ కష్టాన్ని రొంతయినా దూరం చేయాలని పలావెంకారెడ్డి రకరకాల యాపారాలు చేసినాడంట. అయితే సత్తెకాలపు మనిషి కాబట్టి డబ్బులు సంపాదించడం ఆయనకి చేతకాల. (చివరాకరికి పలావు సెంటరు పెట్టినాక ఆయన దశ తిరిగింది. అదెప్పుడైతే పెట్టినాడో అప్పుణ్ణుంచి మా వూర్లో ఆయన పేరు రేమాల వెంకారెడ్డికి బదులు పలావెంకారెడ్డిగా మారిపోయింది).మా చిన్నప్పుడు ఆయనకి ఒంగోలు బస్టాండుకాడ గుడ్డల కొట్టు వుండేది. రోజుకు మీటరు గుడ్డకైనా ఆ కొట్టు నడిచేది కాదుగానీ పలావెంకారెడ్డి, ఆయన పెద్ద కొడుకు మాత్రం టంచనుగా అందులో బేరానికి కూచోనుండే వాళ్లు.పలావెంకారెడ్డి గురించి యింత కత ఎందుకు చెప్పినానంటే రంజాను నెల వచ్చినాక ఆయనతో మాకు పని పడింది – మా అమ్మ పోడు వల్ల.‘వీదిలోని ఆడోళ్లంతా గాదంశెట్టి సుబ్బారావు కొట్టుకాడికెళ్లి కోరిన గుడ్డలు తెచ్చుకుంటా వున్నారు. నాక్కూడా రెండొందలో మూడొందలో పారేయ రాదా? నేను కూడా పిలకాయలకు గుడ్డలు తెచ్చుకోనా’ అని రంజాను నెల మొదులైన కాణ్ణుంచి మా నాయన ప్రాణం తీస్తా వుంది మా అమ్మ.మా నాయినేమో ‘ఆ’ అనడూ, ‘ఊ’ అనడూ. మా అమ్మ చూసీ చూసీ మా నాయన వాటానికి యింకిది మందు కాదని చెప్పి, న్యాక్‌గా మా నాయినమ్మను ఉసిగొలిపొదిలింది.‘రే అబయా. ఏందిరా నువ్వూ నీ బేడంగీ పనులూ. మనకు లాకపోయినా పిలకాయలకన్నా నాలుగు గుడ్డముక్కలు తేకపోతే ఎట్టా. వీదిలో కొత్త గుడ్డలేసుకున్న పిలకాయలను చూసి మన పిలకాయలు మనసు కష్టపెట్టుకోరా’ అనింది మా నాయినమ్మ.యింక మా నాయిన ఏమనుకున్నాడో ఏమోకానీ ‘సాయింత్రం పెద్దోణ్ణి, రెండోవాణ్ణి కొట్టుకాడికి పంపించండి. డబ్బులు దొరికితే అట్నే తీసిస్తా’ అని చెప్పేసి పోయినాడు.సాయింత్రానికి మా అమ్మ – నన్నూ మా అన్ననే కాకుండా మా చెల్లెల్ని కూడా రెడీ చేసి రైల్వేరోడ్డులోని మా కరెంటుషాపు కాడికి పంపించింది ఆశగా. కానీ మా నాయిన ఎట్టాంటోడా? మేము పోయేసరికి చేతులు నెత్తిన పెట్టుకొని సప్పంగా కూచోనున్నాడు టేబులు ముందర. మమ్మల్ని చూడ్డం తోటే లేచి ‘ఇయ్యాల కాదులే. యింటికి పాండి’ అన్నాడు – మా చెల్లెల్ని ఎత్తుకొని కొట్టుకి తాళం వేయబోతా.మా ప్రాణాలు వుసూరుమన్నాయి. మా అన్నకైతే ఏడుపొక్కటే తక్కవా.సరిగ్గా అప్పుడే దేవుడిలా వచ్చినాడు పలావెంకారెడ్డి. మమ్మల్ని చూడ్డంతోటే ‘ఏందయ్యో! చిన్న నవాబులంతా కలిసొచ్చినారో’ అన్నాడు నవ్వతా.మా నాయిన కూడా నవ్వి సంగతి చెప్పినాడు. అది విని ‘పండగ గుడ్డలకి పిలకాయలొస్తే ఉత్త చేతులతో వెనక్కి తీసకెళ్లిపోతావా కరీం సాయిబా? నా కొట్టులా. పాండి పాండి’ అన్నాడు పలావెంకారెడ్డి.‘యిప్పుడొద్దులే ఎంకారెడ్డా. డబ్బులొచ్చినాక చూద్దాం’ అన్నాడు మా నాయిన మొహమాటానికి పోతా.‘మా యింట్లో కరెంటు పని చేస్తే నువు డబ్బులడుగుతావా... నీ బిడ్డలకు గుడ్డలిస్తే నేను డబ్బులడిగేదానికి’ అని బయిల్దేరదీశాడాయన. అందరం కలిసి ఒంగోలు బస్టాండుకాడున్న పలావెంకారెడ్డి గుడ్డల కొట్టుకెళ్లాం.‘కరీంసాయిబా! ఎట్టా మళ్ల తీయబోయేది లేదుకానీ తీసేదేదో దిట్టంగా తీసి. నాలుగు రోజులు పడుంటాయి’ అని కొయ్య అల్మారాలో వున్న తానుల్లో నుంచి దిట్టంగా కనిపిస్తున్న బులుగురంగు తానునొకదాన్ని బయటికి లాగినాడు పలావెంకారెడ్డి. ‘గ్యారంటీ గుడ్డ. చిరిగే కొసినే లా’ అన్నాడు.మా నాయనకు ఏమున్నా లాకపోయినా ‘గ్యారంటీ’ అనే మాట వినపడితే చాలు ‘అదే యివ్వు’ అంటాడు కాబట్టి పలావెంకారెడ్డితో కూడా ‘అదే యివ్వు’ అన్నాడు. అంతే. పలావెంకారెడ్డి ఆ తాన్ను కోయడమైతే ఏమి, కొట్టు దిమ్మె మీదున్న దర్జీ సాయిబుకి మేమంతా కొలతలు యివ్వడమైతే ఏమి, దర్జీసాయిబు ఆ గుడ్డని తీసకెళ్లి యినపబకెట్టులో నానబెట్టడమైతే ఏమీ అంతా అయిదు నిమిషాల్లో జరిగిపోయింది. ఎట్టా గుడ్డ మిగిలింది కదా అని మా తమ్ముడికి కూడా వురామారిగా కొలతలు చెప్పి కుట్టెయ్యమన్నాడు మా నాయిన. ఆ రాత్రి ఏదో గనకార్యం చేసినట్టుగా ‘ఎంకారెడ్డి గుడ్డలిచ్చినాడు. డబ్బుల్లా ఏమీ లా’ అని మా అమ్మ దగ్గిర గొప్పలు చెప్పుకున్నాడు.మరుసటి రోజు సాయంత్రం కుట్టిన గుడ్డలు తెస్తా వుంటే మా నాయినకు తోడుగా పలావెంకారెడ్డి కూడావచ్చినాడు మా యింటికి. గుడ్డలు యింట్లోకి రాంగానే మా అమ్మ గబగబా వచ్చి, గుడ్డలన్నీ తెరిచి చూసి, యింత పొడుగున గాలి వొదిలి, గమ్మున లోపలికెళ్లిపోయింది.మా నాయినమ్మ మాత్రం మురిసిపోతా మమ్మల్నందరినీ పిలిచి వాటిని ట్రయిలుకు తొడిగింది. అవి తొడుక్కున్నాక మా అన్నా నేనూ మా చెల్లెలూ మా తమ్ముడూ అందరం పై నుంచి కింద దాకా ఫుల్లుగా బులుగంటే బులుగు!పలావెంకారెడ్డి మమ్మల్నా గుడ్డల్లో చూసి, బుగ్గలు పొంగిస్తా, తృప్తిగా తల వూపినాడు. మా నాయిన కూడా బిర్రుగా మెడ ఎగరేసి ‘అదిరినాయిలే. యింకపా’ అన్నాడు. పలావెంకారెడ్డి లేచినాడు. మా నాయిన బయటికొచ్చి సైకిల్ తీయబోతా వుంటే ‘అన్నో.. మాట’ అంటా పలావెంకారెడ్డిని ఆపేసింది మా అమ్మ.సైకిల్ పట్టుకొని మా నాయిన, ఆయన్ని చిల్లర డబ్బులు అడగతా నేనూ బయట్నే వుండిపోయాం. కాసేపటికి పలావెంకారెడ్డి తత్తరబిత్తరగా తల గోక్కుంటా బయటికొచ్చినాడు.‘య్యో! కరీం సాయిబా! అడిగినోడికి నీకూ బుద్దిలా. యిచ్చినోడికి నాకు బుద్దిలా. నలుగురికీ నాలుగు రకాల తాన్లు కోపిచ్చుంటే పోయుండేది కదా. యిప్పుడు నీ భార్య చూడు. యిస్తే యిచ్చినావుగాని ఎంకారెడ్డనా మరీ అన్యాలంగా బులుగంటే బులుగా అని అడగతా వుంది’ అన్నాడు నవ్వతా.మా అమ్మ అట్టా మాట్లాడద్దని ఊహించని మా నాయిన నోరెళ్ల పెట్టినాడు.‘‘అంతేకాదయ్యా. ‘మా యింటాయనకు పని తెలిసినా లాబంలా. నీకు యాపారం తెలియకపోయినా లాబంలా. యిద్దరూ యిద్దరే. రూపాయి జవురుకొని రారు. నెత్తిన చెయ్యి పెట్టడం నేర్చుకోరు. మీ యింట్లో యీ మనిషి పని చేస్తాడు. నువ్వేమో అందుకు బదులుగా గుడ్డలిస్తావు. యిట్టా చెల్లుకు చెల్లు బేరాలు చేసుకుంటా వుంటే మీరెప్పుటికి బాగుపడతారు నాయినలారా! యికనైనా న్యాక్ నేర్చుకొని మీ పెళ్లాం బిడ్డల్ని సుకపెట్టండి తండ్రులారా’ అని బుద్దులు చెప్పిందయ్యా ఆ బుజ్జమ్మా’’ అన్నాడు బక్తిగా. -
నేను ఈద్ జరుపుకోను
సాక్షి, లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ భక్తుడినని ఈద్‌ను జరుపుకోనని స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను హిందువునని, ఈద్ వేడుకల్లో ఎందుకు పాల్గొంటానని అన్నారు.తాను యజ్ఞోపవీతం ధరించి అదే సమయంలో ముస్లిం టోపీ ధరించే నమాజ్ చేసే రకం కాదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏడాదికి ఒకసారి వచ్చే హోలీ పండుగను ప్రతిఒక్కరూ గౌరవించాలని..నమాజ్ ఎప్పుడూ చేస్తుండేదేనని యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మార్చి 11న జరిగే పూల్పూర్ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, హోలీ సమయంలో నమాజ్ చేసే వేళలను మార్చడాన్ని సీఎం స్వాగతించారు. -
భారీ వర్షాలు.. గురుద్వారాలో బక్రీద్ ప్రార్థనలు
సాక్షి, డెహ్రాడూన్: ఈద్-అల్-అదా(బక్రీద్) సందర్భంగా దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రార్థనలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్ లో మాత్రం ఓ భిన్నమైన దృశ్యం దర్శనమిచ్చింది. ఛమోలి జిల్లా జోషిమఠ్ లోని ఓ గురుద్వారాలో నమాజ్ నిర్వహించటం ద్వారా ఆకట్టుకున్నారు నిర్వాహకులు. నిజానికి వారంతా గాంధీ మైదాన్‌లో ప్రార్థనలు నిర్వహించాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు ఆటంకం కలిగించాయి. దీంతో వందల మంది ఇలా గురుద్వారాలో నిర్వహించిన నమాజ్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం ,శాంతి, సామరస్యం, ప్రేమ, స్నేహం ఇవన్నీ మానవత్వానికి ప్రతిరూపాలే. మతాలు ఎన్ని అయినా దేవుడు ఒక్కడే .. ఏ దేవుడు అయినా.. ఏ ధర్మం ఆయినా మనకు చెప్పేది నీతి ఒక్కటే.. అదే సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం. మతం, కులం మన సంస్కృతిలో భాగం కాదు. ఒక కాలానికి అనువుగా గీసుకున్న విభజన రేఖ అది. అయినా పట్టింపులు లేని నేటి కాలానికి మతం రంగు పులమటం అనేది హాస్యాస్పదమే అనుకోవాలి. ఏది ఏమైనా మన సంస్కృతి మాత్రం చాలా గొప్పది. -
సెప్టెంబర్ 2న బక్రీద్
సాక్షి, హైదరాబాద్: మంగళవారం నెలవంక దర్శనం కాకపోవడంతో సెప్టెంబర్ 2వ తేదీ (శనివారం)న బక్రీద్‌ను జరుపుకోవాలని రూయత్ –ఎ– హిలాల్ (నెలవంక నిర్ధారణ) కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్ పాషా షుత్తరీ ప్రకటించారు. మంగళవారం మొజంజాహీ మార్కెట్లోని కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కమిటీలతో ఈ విషయమై సంప్రదింపులు జరిపామని పాషా షుత్తరీ తెలిపారు. -
ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అవకాశం చిక్కినప్పుడల్లా ఇస్లాంపై, ముస్లింలపై విరుచుకుపడే డొనాల్డ్ ట్రంప్ ఆ వర్గానికి సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ముస్లింలకు విందు ఇచ్చే సంప్రదాయానికి చరమగీతం పాడారు. రంజాన్ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఆదివారం రాత్రి ఒక ప్రకటన చేశారు. అందులో విందు జోలికి పోకుండా కేవలం ‘ముస్లింలకు శుభాకాంక్షల’తోనే సరిపెట్టారు. అమెరికాలోని ముస్లింలకు రంజాన్ విందు ఇచ్చే సంప్రదాయం సుమారు 200 ఏళ్ల కిందట.. థామస్ జెఫర్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలైంది. జెఫర్సన్ అనంతరం ఈ సంప్రదాయాన్ని కొందరు అధ్యక్షులు పాటించగా, మరికొందరు పాటించలేదు. అయితే 1990లో బిల్‌క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ‘ముస్లింలకు విందు’పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. అప్పటి ఫస్ట్ లేడీ హిల్లరీ క్లింటన్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించేవారు. క్లింటన్ తర్వాత అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్ జార్జ్ బుష్.. ఒకవైపు ఇస్లామిక్ దేశాలపై యుద్ధం చేసినా, వైట్‌హౌస్‌లో రంజాన్ విందు ఇవ్వడం మాత్రం మానలేదు. బారక్ ఒబామా పాలనలోనూ రంజాన్ విందు ఘనంగా జరిగేది. 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా కొనసాగుతోన్న ఆచారానికి ట్రంప్ తూట్లుపొడిచారు. -
ఈద్ నమాజ్ ముగియగానే ఘర్షణలు
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత శ్రీనగర్: వేసవి రాజధాని శ్రీనగర్ సహా జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పదిమంది గాయపడ్డారు. శ్రీనగర్‌లోని అతి పెద్ద మైదానమైన ఈద్ఘా బయట ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఇక్కడ ప్రార్థనల సందర్భంగా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. స్థానికులు ఇక్కడ నమాజ్ చేసిన అనంతరం ఈ ఘర్షణలు జరిగాయి. ఇక్కడ ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ఉపయోగించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఇక్కడ మూగిన ఆందోళనకారులు చెదిరిపోయారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ పట్టణంలోనూ దాదాపు గంటసేపు ఘర్షణలు జరిగాయి. జంగ్లత్ మండీ వద్ద ఈద్ ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణపడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపూర్, పఠాన్ పట్టణాల్లోనూ ఘర్షణలు జరిగినట్టు సమాచారం. -
దేశవ్యాప్తంగా ముస్లిం సోదరుల ప్రార్థనలు
న్యూఢిల్లీ: ఈద్-ఉల్-ఫితర్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులు సోమవారం దేశవ్యాప్తంగా మసీదుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అన్ని ప్రాంతాల్లోని ప్రార్థనాలయాల వద్ద ప్రత్యేక నమాజులు చేసి అల్లాను ప్రార్థించారు. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పిల్లా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి మసీదులకొచ్చి ప్రార్థనలు జరిపారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దీంతో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో నగరాలతో పాటు చిన్నా, పెద్ద పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే సందడి నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరిగాయి. అలాగే పవిత్ర రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మసీదుల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు అలాయ్ భలాయ్ తీసుకుంటున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ వేడుకలు ప్రశాంతంగా జరిగిలే అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదివేల మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పోలీస్ టీమ్‌లను కూడా రంగంలోకి దింపామన్నారు. ప్రార్థనా మందిరాల దగ్గర సీసీ టీవీలు ఏర్పాటు చేసి... పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. -
మీఠా రమజాన్
ఒక నెల రోజులు...ఎంగిలి కూడా మింగకుండా అల్లాని ధ్యానించారు. మరి... పండగొచ్చినప్పుడు నోరూరే మిఠాయిలు చేసుకోవద్దా?చలో... జషన్ మనాయేంగే!మీఠా మీఠా జషన్ మనాయేంగే! ఈద్ ముబారక్!! షీర్ ఖుర్మా కావల్సినవి: సేమ్యా – 100 గ్రాములు; నెయ్యి – టేబుల్ స్పూన్; పాలు – 3 లీటర్లు; పంచదార – 200 గ్రాములు; బియ్యప్పిండి – 10 టేబుల్ స్పూన్లు;ఏలకుల పొడి – చిటికెడు; పాలపొడి – కప్పు;ఎండు ఖర్జూరం – 100 గ్రాములు(కొన్ని నీళ్లు పోసి రాత్రి పూట నానబెట్టి, మరుసటి రోజు సన్నగా తరగాలి);బాదంపప్పు – 50 గ్రాములు;పిస్తాపప్పు – 50 గ్రాములు;పచ్చికొబ్బరి ముక్కలు – 50 గ్రాములు; కెవ్రా (మార్కెట్లో లభిస్తుంది) – టీ స్పూన్ తయారీ:∙పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి∙అందులో సేమ్యా వేసి సన్నని మంట మీద ముదురు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి ∙గిన్నెలో నుంచి సేమ్యాని మరొక పాత్రలోకి తీసుకోవాలి ∙స్యేమ్యా వేయించిన గిన్నెలోనే పాలు పోసి మరిగించాలి ∙బియ్యప్పిండిలో కొద్దిగా చల్లని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని, పంచదార, ఏలకుల పొడిని మరుగుతున్న పాలలో పోసి కలిపి సన్నని మంట మీద ఉడికించాలి ∙అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్మిస్, పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి ∙సేమ్యావేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. కద్దూ కా మీఠా కావలసినవి: సొరకాయ తురుము – 2 కప్పులు; పాలు – 1 లీటరు; పంచదార – 2 కప్పులు; కోవా – 2 కప్పులు; సగ్గుబియ్యం – అర కప్పు; బాదం పప్పులు – అర కప్పు; పిస్తా – అర కప్పు; మిల్క్‌మేడ్ – కప్పు; పైనాపిల్ ముక్కలు – అర కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు, కిస్మిస్: పది తయారీ ∙సొరకాయ తురుమును ఉడికించి నీళ్ళు వడకట్టి పక్కన పెట్టుకోవాలి ∙బాదం, పిస్తా పప్పులను నెయ్యిలో వేయించాలి ∙అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగబెటి,్ట సగ్గుబియ్యం కలిపి ఉడికాక కోవా కలపాలి ∙ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత పంచదార కలిపి కరిగాక స్టౌపై నుంచి దించేయాలి ∙ఈ మిశ్రమాన్ని చల్లబరచి ఉడికించిన సొరకాయ తురుమును కలుపుకోవాలి ∙చివరిగా పైనాపిల్ ముక్కలు, వేయించి ఉంచిన బాదం, పిస్తా పలుకులు, కిస్మిస్ కలుపుకోవాలి. చావల్ కా మీఠా కావలసినవి: బాస్మతి బియ్యం రవ్వ – కప్పు; పాలు – 2 కప్పులు; కోవా – కప్పు; జీడిపప్పు పేస్ట్ – అర కప్పు; రోజ్‌వాటర్ – టీ స్పూను; బాదం, కిస్మిస్ – అరకప్పు తయారీ :అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరిగించి బాస్మతి బియ్యం రవ్వ కలిపి ఉడికించాలి ∙రవ్వ ఉడికిన తరువాత కోవా, పంచదార కలిపి ఐదు నిమిషాలుంచి పిస్తా, రోజ్‌వాటర్ కలిపి స్టౌ పైనుంచి దించేయాలి ∙చావల్ కా మీఠాను మట్టిపాత్రలో వుంచితే తేమని పీల్చుకుని మరింత రుచిగా వుంటుంది. బాదం, కిస్మిస్తో గార్నిష్ చేయాలి. ఖుబాని కా మీఠా కావలసినవి: ఖుబాని (డ్రై ఆప్రికాట్లు) – 1 కప్పు పంచదార – ఒకటిన్నర కప్పు రాస్బెర్రి ఎసెన్స్ – అర టీ స్పూను డ్రైఫ్రూట్స్ : గార్నిషింగ్‌కి తయారీ: ఖుబానీలను 10 గంటలు నానబెట్టుకోవాలి విత్తనాలు తీసేసి ఒక గంట ఉడకబెట్టాలి .ఖుబానీలు మెత్తబడగానే పంచదార కలపాలి .తరువాత మరో అరగంట పాటు ఉడికించి చివరిగా రాస్బెర్రి ఎసెన్స్ కలిపి దించాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి. డబుల్ కా మీఠా కావలసినవి: బ్రెడ్ – 4 స్లైసెస్; పాలు – 1 కప్పు; పంచదార – 1 కప్పు; జీడిపప్పు – అర కప్పు; పిస్తా పప్పు – అరకప్పు; బాదంపప్పు – అర కప్పు; నెయ్యి – అర కప్పు; నీళ్ళు – 3 టీస్పూన్లు; ఏలకులపొడి – అర టీ స్పూను తయారీ: బ్రెడ్‌ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, నెయ్యిలో వేయించి పక్కన ఉంచాలి ∙బాదం, పిస్తా, జీడిపప్పులను కూడా ఆ నెయ్యిలో వేయించాలి ∙ఓ పాత్రలో పాలు మరగబెట్టాలి ∙బ్రెడ్ ముక్కలను మరిగిన పాలలో వేసి కలుపుకోవాలి ∙పంచదారలో నీళ్ళు పోసి కలిపి పాకం పట్టి, బ్రెడ్ ను వేయించగా మిగిలిన నెయ్యిని కలుపుకోవాలి ∙దీంట్లో బ్రెడ్ మిశ్రమాన్ని, పిస్తా, బాదం, జీడిపప్పు, ఏలకులపొడి చల్లి మంట తీసేయాలి ∙దీనిని వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయవచ్చు. కేసర్ సేమ్యా మీఠా కావల్సినవి:సేమ్యా – 10 గ్రాములు పాలు – కప్పుపంచదార – 200 గ్రాములుకోవాల లేదా కలాకండ్ – 100 గ్రాములుజీడిపప్పు – 50 గ్రాములు కేసరి కలర్ – చిటికెడు కుంకుమపువ్వు – 10 రేకలు తయారీ: కడాయిలో నెయ్యి వేసి, సేమ్యాని వేయించి తీయాలి ∙మరొక పాత్రలో పాలు మరిగించి అందులో పంచదార, ఏలకుల పొడి, కేసరి రంగు, కోవా, కుంకుమపువ్వు వేసి కలపాలి దీంట్లో సేమ్యా కలపాలి ∙సేమ్యా ఉడికాక, దించి, జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. -
పొట్ట పగిలేలా తిని...
కరాచి: పండుగ పూట పిండి వంటలు ఎక్కువగా తిని కాస్త భుక్తాయాసం పడటం సహజమే. కానీ పాకిస్థాన్ లో బక్రీద్ ను పురస్కరించుకొని అతిగా తిని ఒక్క కరాచీ నగరంలోనే ఏకంగా 4000 మంది ఆస్పత్రులపాలయ్యారు. ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 4000 మంది ప్రజలు బక్రీద్ రోజున సాంప్రదాయ నాన్ వెజ్ వంటకాలను తిని డయేరియా, వాంతులు, డీ హైడ్రేషన్, జీర్ణకోశ సమస్యలతో బాధపడ్డారని కరాచీ వైద్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఇందులో 2,200 మంది జిన్నా పీజీ మెడికల్ కాంప్లెక్స్, 1,000 మంది కరాచీ సివిల్ హాస్పిటల్, 500 మంది అబ్బాసీ షహీద్ ఆస్పత్రిని సందర్శించారని కరాచీ వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు వాతావరణ మార్పుల మూలంగా ఆయిల్ ఫుడ్, జంక్ పుడ్ ను తీసుకోకుండా శాఖాహారమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో 1000 మంది జంతువులను వధిస్తుండగా గాయాలపాలై ఆస్పత్రులను సందర్శించారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లిం సోదరులు బక్రీద్ (ఈదుల్ జుహా) పండగను మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, షాద్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్, దేవరకద్ర, కొడంగల్, మక్తల్, ఆత్మకూరు, అయిజ కొత్తకోట తదితర పట్టణాలు, మండలకేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్ సంబరాలను ఇస్లామిక్ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హిందూ, ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వర్షం వచ్చిన లెక్కచేయకుండా తడుస్తూనే ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. జిల్లాకేంద్రంలోని వానగుట్టపై రహెమానియా ఈద్గా మైదానంలో ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామె మసీదు ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 9గంటలకు ప్రత్యేక నమాజ్ చేయించారు. పండగ ప్రాశస్త్యాన్ని ఖుత్బా రూపంలో వివరించి, దైవకృప కోసం పవిత్ర ఖురాన్ గ్రంథంలోని సందేశాలతో పాటు ప్రవక్త మహ్మద్ అలైహివసల్లమ్ ఆచరించిన ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం లోక కల్యాణం కోసం దువా (ప్రార్థన) చేశారు. జిల్లా, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా కటాక్షించాలని అల్లాను వేడుకున్నారు. ప్రముఖుల ఈద్ ముబార క్ ... బక్రీద్‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తర ఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్‌తో పాటు ఆయా పార్టీల నేతలు ఎన్పీ వెంకటేశ్, మహ్మద్ వాజిద్, మక్సూద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల భారీ బందోబస్తు... బక్రీద్ సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీసులు పహారా కాశారు. -
దేశవ్యాప్తంగా ఈద్ ముబారక్
-
హల్ చల్ చేస్తున్న 'బాహుబలి' బర్రె!
'బాహుబలి' సినిమాలో భారీ (గ్రాఫిక్) దున్నపోతుతో భల్లాలదేవ పోరాడే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ భారీ దున్నపోతును తలదన్నేస్థాయిలో ఉండే దున్నపోతు ఒకటి ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పట్టణంలో హల్ చల్ చేస్తోంది. 1500 కిలోల బరువుతో, భారీ ఆకారంతో ఉన్న దున్నపోతుకు ముద్దుగా 'బాహుబలి' బర్రె అని పేరు పెట్టారు. ఈద్ ఉల్ ఆధా (బక్రీద్) పండుగ సందర్భంగా ఈ దున్నపోతు స్థానికంగా స్పెషల్ ఆట్రాక్షన్ గా మారింది. పంజాబ్ లోని లూథియానా నుంచి ఈ దున్నపోతును రూ. 11 లక్షలకు మహమ్మద్ తౌఫీక్ ఖురేషి, నదీం అనే వ్యక్తులు కొనుగోలు చేశారు. బక్రీద్ సందర్భంగా అంతకంటే ఎక్కువ ధరకే ఇది అమ్ముడుపోతుందని వారు భావిస్తున్నారు. ఒకవేళ అమ్ముడుపోకపోతే తామే బలి ఇయ్యాలని నిర్ణయించారు. ముర్రా జాతికి చెందిన ఈ భారీ దున్నపోతు స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఈ 'బాహుబలి'ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాలే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనం వచ్చి దీనిని తిలకించి మురిసిపోతున్నారు. -
మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రార్థనలు
హైదరాబాద్ : త్యాగనిరతి, సేవ, భక్తి భావానికి ప్రతీక అయిన ‘ఈదుల్ అజ్ఉహా’ బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని మీరాలం ఈద్గా, మక్కా మసీద్‌లో మంగళవారం ఉదయం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సామూహికంగా నమాజులు పఠించారు. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ వారు తమ ప్రార్థనలు కొనసాగించారు. అలాగే ఢిల్లీ జామా మసీదు పోటెత్తింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదుకు చేరుకుని ప్రార్థనలు చేశారు. ఇక అల్లా ప్రసన్నుడైన దినంగా చెప్పుకునే బక్రీద్ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఈద్ ముబాకర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్రమైన హృదయంతో అల్లాను ప్రార్థించి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. మరోవైపు బక్రీద్‌ను పురస్కరించుకుని మేకలు, గొర్రెలు, ఒంటెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. -
త్యాగనిరతికి ప్రతీక బక్రీద్
కడప కల్చరల్ :అద్భుతమైన ఈ సృష్టిని నియంత్రించే శక్తి ఒకటి ఉందని, ఆ శక్తినే అల్లాహ్ (దైవం) అని, ఆయన ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేసేందుకు వెనుకాడకూడదన్న సందేశాన్నిచ్చే పండుగ బక్రీద్. ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతిని, సహనశీలత, రుజు వర్తనలను తెలుపుతుంది. మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి దైవం పక్షాన ప్రభవించిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఐదు వేల సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన దేవుడే సకల చరాచర సృష్టికి కారకుడని, ఆయన పట్ల భక్తి ప్రకటించడం ద్వారా ముక్తిని పొందవచ్చునని జాతికి పిలుపునిచ్చారు. ఇస్లాంలో రంజాన్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో, బక్రీద్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మంగళవారం ఈ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాటు సిద్ధం చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని ప్రతి వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. ఖుర్బానీ ద్వారా వచ్చిన మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక వంతు పేదలకు, రెండో భాగాన్ని బంధుమిత్రులకు ఇస్తారు. మరో భాగాన్ని తమ కోసం వాడుకుంటారు. త్యాగనిరతికి ప్రతీక: ప్రవక్త ఇబ్రహీంకు దైవం మరొక కఠిన పరీక్ష పెట్టారు. కలలో అందిన సూచన మేరకు కుమారుడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతారు. కుమారుడు కూడా దైవాజ్ఞను శిరసావహించేందుకు అంగీకరిస్తాడు. తండ్రి ఇబ్రహీం కుమారుడిని ‘జుబాహ్’ చేశాడు. తీరా చూస్తే కుమారుడికి బదులు అక్కడ ఒక గొర్రెపోతు జుబాహ్ చేయబడి ఉంటుంది. దైవం పట్ల ప్రవక్త ఇబ్రహీంకు గల ఆచంచల భక్తి, విశ్వాసాలకు, త్యాగనిరతికి ప్రతీకగా ముస్లింలు యేటా ‘ ఈద్–ఉల్– జుహా ’ పండుగను నిర్వహించుకుంటున్నారు. ఖుర్బానీ జంతువుల రక్త మాంసాలు అల్లాహ్‌కు చేరవు. కేవలం మీ భయభక్తులే చేరుతాయి – (దివ్య ఖురాన్‌లోని సందేశం) నగరంలో.. బక్రీద్ పండుగ సందర్బంగా నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం కడప నగరంలో మసీదులు, ఈద్గాలలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర శివార్లలోని బిల్టప్, దండు ఈద్గాలు, చాంద్ ఫిరా గుంబద్తోపాటు దాదాపు అన్ని మసీదులు, ఈద్గాలలో ప్రార్థనల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. -
త్యాగపతాక - ప్రేమ ప్రతీక
నేడు ‘బక్రీద్’ ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం ముస్లిం సోదరులకు అత్యంత ప్రధానమైన పండుగలు రెండు ఉన్నాయి. మొదటిది ఈదుల్ ఫిత్ర(రమజాన్), రెండవది ఈదుల్ అజ్ హా (బక్రీద్). ప్రపంచంలోని ముస్లిం సోదరులంతా జిల్ హజ్ మాసం పదవ తేదీన పండుగ జరుపుకుంటారు. ఇదేరోజు అరేబియా దేశంలోని మక్కా నగరంలో ’హజ్’ ఆరాధన జరుగుతుంది. లక్షలాదిమంది యాత్రికులతో ఆ పవిత్రనగరం కళకళలాడుతూ ఉంటుంది. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్తవారి సంప్రదాయాలను పాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. ఆ జనవాహినిలో ‘తవాఫ్’ చేసేవారు కొందైరతే, ‘సఫా మర్వా’ కొండలమధ్య సయీ’ చేసేవారు మరికొందరు. అదొక అపురూపమైన సుందరదృశ్యం. రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. ఆ అపూర్వ హజ్ దృశ్యాన్ని ఊహిస్తేనే హృదయం పులకించి పోతుంది. ఒకప్పుడు ఎలాంటి జనసంచారమే లేని నిర్జీవ ఎడారి ప్రాంతమది. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ యావత్ ప్రపంచ ముస్లిం సమాజానికి ప్రధానపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ఈదుల్ అజ్ హా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు, హజ్, ఖుర్బానీలకు మూలకారణం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇబ్రాహీం(అ) గొప్ప దైవప్రవక్త. దేవునికి ప్రియ మిత్రుడు. తన పూర్తిజీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించిన త్యాగధనుడు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞగానే భావించి, ఆచరించేవారు. ఒకరోజు ఇబ్రాహీం ప్రవక్త తన చిన్నారి తనయుడు ఇస్మాయీల్ గొంతుకోస్తున్నట్లు కలగన్నారు. దీన్ని ఆయన దైవాజ్ఞగా భావించి, తనయునితో సంప్రదించారు. తండ్రికి తగ్గ ఆ తనయుడు వెనకా ముందు ఆలోచించకుండా త్యాగానికి సిద్ధమయ్యాడు. వెంటనే ఇబ్రాహీం ప్రవక్త(అ) తనయుని మెడపై కత్తి పెట్టి ‘జిబహ్’ చెయ్యడానికి ఉపక్రమించారు. దీంతో ఆ త్యాగధనుల పట్ల అల్లాహ్ ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది..‘నాప్రియ ప్రవక్తా ఇబ్రాహీం! నువ్వుస్వప్న ఉదంతాన్ని నిజం చేసి చూపించావు. నా ఆజ్ఞాపాలనలో మీరిద్దరూ మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడనయ్యాను. నా పరీక్షలో మీరు పరిపూర్ణంగా సఫలీకృతులయ్యారు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలి తతంగంతో నాకు నిమిత్తం లేదు. మీరిప్పుడు సంపూర్ణంగా విశ్వాసులయ్యారు. ఈ శుభసమయాన మీత్యాగనిరతికి గుర్తింపుగా స్వర్గంనుండి ఒక దుంబాను పంపుతున్నాను.’ అని పలికింది దైవవాణి. వెంటనే చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో ప్రత్యక్షమైన గొర్రెజాతికి చెందిన పొట్టేలును జబహ్ చేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న ఈదుల్ అజ్ హా పండుగ ఆమహనీయుల త్యాగస్మరణే. ఆర్థికస్థామత కలిగినవారు హజ్ యాత్రకు వెళ్ళగలిగితే, స్ధోమత లేనివారు తమ తమ ఇళ్ళవద్దనే పండుగ జరుపుకుంటారు. ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేనివారికి దైవం రెండు రకతుల నమాజు ద్వారానే హజ్, ఖుర్బానీలు చేసినవారితో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అందుకని పండుగసంతోషాన్ని గుండెల్లో నింపుకొని, హద్దుల్ని అతిక్రమించకుండా పండుగ జరుపుకోవాలి. ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. దైవభీతి, పాపభీతి, బాధ్యతాభావం, సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను మనసులో ప్రతిష్టించుకోవాలి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఏ త్యాగానికైనా సదా సన్నద్ధులై ఉండాలి. ధనప్రాణ త్యాగాలతో పాటు, మనోవాంఛలను త్యాగం చెయ్యాలి. స్వార్థం, అసూయా ద్వేషాలనూ విసర్జించాలి. సాటివారి సంక్షేమం కోసం ఎంతోకొంత త్యాగం చేసే గుణాన్ని అలవరచుకోవాలి. ఈవిధమైన త్యాగభావాన్ని మానవుల్లో జనింపజేయడమే ఈదుల్ అజ్ హా (బక్రీద్ )పర్వదిన పరమార్థం. - యండి.ఉస్మాన్ ఖాన్ -
నేడు బక్రీద్
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు జిల్లావ్యాప్తంగా మంగళవారం బక్రీద్ పండగను ఘనంగా జరుపుకోనున్నారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం చివరి మాసమైన జిల్‌హిజ్జా 10తేదీన జరుపుకునే ఈ పండగను ‘ఈద్–ఉల్–జహా గా’ వ్యవహరిస్తారు. ముస్లింలు సామూహికంగా ఈద్గాకు వెళ్లి ప్రత్యేక నమాజు చేయడం రివాజు. బక్రీద్ పండగను జరుపుకుని, లోక కల్యాణం కోసం నమాజు చేసి ప్రార్థనలు చేస్తారు. పేదలు, ధనికుల తేడా లేకుండా అందరూ ఆనందోత్సహాలతో పండగను జరుపుకుంటారు. స్థానిక జామియ మసీదు నుంచి ఉదయం 8 గంటలకు ముస్లింలు సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక రహెమానియ ఈద్గా వద్దకు చేరుకుని 9గంటలకు ప్రత్యేక నమాజ్ చేస్తారని ఈద్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ జకీ తెలిపారు. బక్రీద్ ప్రాశస్త్యం.. ఇబ్రహీం ఖలీలుల్లా రజియల్లాహు తాలా అనే పైగంబర్ దంపతులు చేపట్టిన నియమనిష్టల ఫలితంగా వారికి ఇస్మాయిల్ జబీవుల్లా అనే ఏకైక కొడుకు ఉన్నాడు. అయితే వారి భక్తిని, త్యాగాన్ని పరీక్షించడానికి అల్లా తన కొడుకును బలి ఇవ్వాల్సిందిగా ఇబ్రహీం కలలో కనిపించి ఆజ్ఞాపిస్తాడు. దైవ నిర్ణయాన్ని శిరసావహించడమే మార్గదర్శకంగా భావించిన ఆ దంపతులు తమ కుమారుడిని బలి ఇవ్వడానికి నిర్ణయించి, అతడిని సిద్ధం చేస్తారు. దైవాదేశం మేరకు ఆ బాలుడిని సుదూర ప్రాంతమైన అడవుల్లోకి తీసుకెళ్లి బలిపీఠంపై పీక కోయడానికి తండ్రి సిద్ధమవుతుండగా.. ఆ ఖుర్బానీ ప్రక్రియను ఆపి వేయాలని దైవవాణి వినిపిస్తుంది. దైవ వాక్కు వృథాగా పోవద్దని, ఇస్మాయిల్ జబీవుల్లాస్థానంలో అటుగా వచ్చిన ఓ పొట్టెలును బలి ఇవ్వాలని ఆదేశిస్తుంది. లోకకల్యాణం కోసమే ఈ సంఘటన జరిగిందని, తమ సంతానానికి ఎలాంటి కీడు జరగరాదనే భావించి ముస్లింలు ఆ నాటి నుంచి బక్రీద్ నెలలో పొట్టెళ్లతో పాటు పలు రకాల జంతువులను ఖుర్బానీ ఇవ్వడం పరిపాటిగా మారింది. ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు ఈద్ ముబారక్ చెప్పడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈద్గా వద్దకు చేరుకుని పట్టణ ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే శిబిరం వద్ద ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలపనున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరితోపాటు ఆయా పార్టీల నేతలు వేడుకల్లో పాల్గొనున్నారు. ఈద్ నమాజ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఊపందుకున్న పొట్టెళ్ల విక్రయాలు స్టేషన్ మహబూబ్‌నగర్: బక్రీద్‌కు ఖుర్బానీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మూడు రోజులపాటు పొట్టెళ్ల మాంసాన్ని పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో వారంరోజుల నుంచే పొట్టెళ్ల విక్రయకేంద్రాలు వెలిశాయి. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్, వన్‌టౌన్, క్లాక్‌టవర్, మార్కెట్, మదీనా మజీద్, షాసాబ్‌గుట్ట, రామచూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో పొటెళ్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈ సారి పొటెళ్ల ధర అమాంతం పెరిగింది. పొట్టెళ్ల బరువును బట్టి రూ.7 వేల నుంచి రూ.12వేల వరకు అమ్ముతున్నారు. -
అక్కడ మొబైల్ సర్వీసులన్నీ బంద్
శ్రీనగర్: ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నేటికీ ఎక్కడికక్కడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్న జమ్ముకశ్మీర్‌లో ఒక్క బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ సర్వీసు తప్ప మిగితా మొబైల్ ఫోన్ సర్వీసులు ఆగిపోయాయి. అలాగే, బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సౌకర్యాలను కూడా మంగళవారం అధికారులు నిలిపివేయనున్నారు. ముస్లింల పర్వదినం బక్రీద్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం జమ్ముకశ్మీర్ లో గత 66 రోజులుగా అశాంతియుత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మరోపక్క బక్రీద్ సందర్భంగా బలగాల కాల్పుల్లో చనిపోయినవారికి నివాళి అర్పించినట్లుగా ర్యాలీ తీయాలని కొంతమంది వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. అయితే, ఈ ర్యాలీని ఆసరాగా చేసుకొని కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు హింసకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల నేపథ్యంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిషేధించారు. ఎలాంటి రూమర్లు వ్యాపించకుండా చేసే చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ముస్లింలకు వ్యతిరేకం కాదు
* బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి * పేద ముస్లింల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలను తెచ్చిందన్నారు. రాష్ట్రంలో పేద ముస్లింల అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పాతబస్తీలో ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. పేదలకు కేంద్రం ఇస్తున్న నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై మాత్రమే బీజేపీ పోరాటమని, ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్న మజ్లిస్‌కు మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో ప్రభుత్వం: నాగం సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆర్థిక ప్రయోజనాల కోసం.. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించా రు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నడుస్తున్న ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం పెంచడానికి ఇచ్చిన జీవో 146 ఆధారంగా అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచడంలో కేసీఆర్‌కు ప్రమేయం లేకుంటే సీబీఐ విచారణ జరి పించాలని డిమాండ్ చేశారు. ఈఎన్సీ మురళీధర్‌రావు ఈ అవినీతిలో కీలకపాత్రధారి అని, ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడటం, కేసీఆర్ కుటుంబ సభ్యులకు కమీషన్లు దోచిపెట్టడానికే మురళీధర్‌రావుకు పదవీకాలాన్ని పొడిగించారన్నారు. ప్రాజెక్టులను ఆలస్యం చేసినవారికి జరిమానాలను విధించకుండా, అంచనాలను పెంచడం వెనుక భారీ అవినీతి ఉందన్నారు. కరువులో రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన నిధులనూ కాంట్రాక్టర్లకు ఇస్తూ, రైతుల రక్తాన్ని సీఎం కేసీఆర్ పీల్చుకుంటున్నారని నాగం విమర్శించారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు గురువారం ఈద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. చారిత్రక జామా మసీదు, ఫతేపూరి మసీదు, హజ్రత్ నిజాముద్దీన్ తదితర మసీదుల వద్ద భారీ సంఖ్యలో ముస్లింలు నమాజు నిర్వహించారు. కొన్నిచోట్ల మతసామరస్యాన్ని చాటుతూ.. హిందూ సోదరులను కూడా పండుగకు ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. లక్నోలోని ఐష్బాగ్ ఈద్గాలో తొలిసారిగా మహిళలకూ ప్రవేశం లభించింది. పశ్చిమబెంగాల్ మాల్దాలో ఈద్ వేడుకల్లో సెప్టిక్ ట్యాంక్ కుంగిపోవటంతో పదేళ్ల బాలుడు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. ఈద్ సందర్భంగా ఆమిర్ ఖాన్ తన కుమారుడికి పండుగ కానుకగా కేవలం 2 రూపాయలిచ్చారు. ఇచ్చారు. ఈద్ సందర్భంగా పాకిస్తాన్లో బైక్‌తో ప్రమాదకరమైన విన్యాసాలు చేసి పది మంది మృతి చెందారు. వందమందికి గాయాలయ్యాయి. -
ఈద్ ముబారక్
భక్తిభావం వెల్లివిరిసింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. గురువారం ఉదయాన్నే పిల్లలు, పెద్దలు స్నానాలు ఆచరించి.. కొత్త బట్టలు ధరించారు. స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లాహ్ నామస్మరణతో తరించారు. అనంతరం కులమతాలకతీతంగా ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఇళ్లకు చేరుకుని షీర్ కుర్మా రుచులను ఆస్వాదించారు. ఇతర మతాలకు చెందిన స్నేహితులకు పంచిపెట్టి ఆనందంగా గడిపారు. -
దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది ముస్లింలు సంప్రదాయ దుస్తులు ధరించి తమకు సమీపంలో ఉన్న మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ జమామసీదులో గురువారం జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలంతా ఈ ప్రార్థనలకు హాజరయ్యారు. ఒకరినొకరు హత్తుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు తమ ఉపవాస దీక్షలను విరమించి పండగ చేసుకుంటున్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మక్కామసీద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసదీక్షలు నిర్వహించిన ముస్లిం సోదరులు.. దీక్షలకు పరిపూర్ణ ఫలితం లభించే రంజాన్ పండుగ రోజున సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆలింగనాలు, కరచాలనాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోనూ ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని... ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించిన పిల్లలు ప్రార్థనా మందిరం వద్ద సందడి చేశారు. -
రంజాన్‌కు సర్వం సిద్ధం
♦ నేడు ఈద్-ఉల్-ఫితర్ ముగిసిన నెల రోజుల రోజాలు ♦ వేడుకలకు సిద్ధమవుతున్న ముస్లింలు ♦ నోరూరించనున్న షీర్ఖుర్మా ♦ ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గాల ముస్తాబు ♦ 30 రోజుల ఉపవాసాలను విశ్వాసులు పూర్తి చేశారు. ఇక పండగే మిగిలింది. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ బుధవారంతో ముగిసింది. షవ్వాల్ మాసంలోని మొదటి రోజున(గురువారం) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు. ఈ పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. తలస్నానంతో మొదలు ముస్లింలు పండగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి.. ఈతర్ పూసుకొని ఊరి చివరన ఉండే ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఁఈద్-ముబారక్* అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రంజాన్ రోజున షీర్ఖుర్మా చేసుకొని నోరు తీపి చేసుకుంటారు. ఆ రోజు ప్రతిచోట పవిత్రత, పరిశుద్ధత వెల్లివిరుస్తాయి. వాతావరణమంతా దైవ విశ్వాసం, దైవ భీతి, విధేయతా భావాలతో, ఉన్నతమైన నైతిక పోకడలతో, సత్క్రియా, సదాచారాలతో అలరారుతుంది. ధనికులు, పేదలు అనే తారతమ్యం లేకుండా సమాజంలోని అందరూ ఒకే విధమైన దినచర్య పాటిస్తారు. ఈ పండగ మానవుల వ్యక్తిగత జీవితాన్ని, సాంఘిక స్థితిని, ఆరోగ్యకర పద్ధతుల్లోకి మలచి శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పుతుంది. పండగ తర్వాత మరో ఆరు రోజుల పాటు షవ్వాల్ దీక్షలు విశ్వాసులు పాటిస్తారు. ఫిత్రా దానం పండగ రోజున నమాజ్‌కు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండగకు ఈద్-ఉల్-ఫితర్ అని పేరు వచ్చింది. ఉపవాసాల పాటింపులో మనిషి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. వాటి పరిహారార్థం చేసే దానమే ఫిత్రా. దీని ద్వారా నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కూడా, ఇతరులతో పాటు పండగ వేడుకల్లో పాల్గొని, మంచి వస్త్రాలు ధరించి, మంచి వంటకాలు అరగించే వీలు కలుగుతుంది. పావు తక్కువ రెండు సేర్ల గోధుమలు కానీ, తూకానికి సరిపడా పైకాన్ని గానీ కడు నిరుపేదలకు ప్రతి ముస్లిం దానం చేయాలి. జకాత్ ఇస్లాం నిర్థేశించిన సిద్ధాంతాల్లో జకాత్ నాలుగోది. జకాత్ అంటే దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరు తమకు ఉన్న దానిలోనే అవసరమున్న వారికి కొంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఆ సంవత్సరం పండిన పంట, వ్యాపారం కోసం నిర్థేశించబడిన సరుకులు, చివరకి తమ వద్ద ఉన్న పశువుల నూ వెల కట్టి, అందులో నుంచి 2.5 శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. రంజాన్ నెలలోనే జకాత్‌ను చెల్లించడం అత్యంత పుణ్యదాయకంగా భావిస్తారు. పలు విషయాలు అవగతం ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. దివ్య ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అదుపులో ఉంటాయి. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షను ఆచరించడం సర్వసాధారణం. 30 రోజుల పాటు పాటించే దీక్షల్లో చుక్క నీరు కూడా సేవించరు. ఇలా 30 రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్ష చేస్తారు. తద్వారా రంజాన్ మాసంతో అనేక విషయాలు అవగమవుతాయి. మనో నిగ్రహం కలుగుతుంది. ఆకలిదప్పుల విలువ తెలుస్తుంది. దాన గుణం అలవడుతుంది. చెడు అలవాట్లు, కోరికలు దహించుకుపోతాయి. ప్రేమ, అభిమానం, క్రమశిక్షణ, రుజువర్తన, కర్తవ్య పారాయరణ, సర్వ మానవ సౌభ్రాతృత్వం తదితర గుణాలు దరిచేరుతాయి. ఇన్ని ప్రత్యేకతలతో సాగే రంజాన్ మాసం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలతో ముగుస్తుంది. ఇహలోకంలో ఆచరించే ఇలాంటి కఠోర దీక్షలు పరలోకంలో రక్షణగా ఉండి కాపాడతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. రంజాన్ నెలలో ఉపవాసాలతో, దానధర్మాలతో గడిపినవారి ప్రార్థనలను అల్లా ఆలకిస్తాడని, వారి పాపాలు పరిహారమై, అగ్ని సంస్కారం పొందిన బంగారంలా మోము దివ్యకాంతిలో వెలుగొందుతుందని ముస్లింలు విశ్వసిస్తారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కుల, మత భేదాలు లేకుండా హిందువులు, క్రైస్తవులు.. ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. వివిధ కుల సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పండగ రోజున ఈద్గాలకు వెళ్లి ఈద్-ముబారక్ చెబుతారు. పండగ శుభాకాంక్షలు సిద్దిపేట జోన్: మత సామరాస్యానికి పవిత్ర రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన బుధవారం పత్రికా ముఖంగా ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందును అధికారికంగా నిర్వహించిన మొదటి ప్రభుత్వం తమదేనని గుర్తుచేశారు. సోదర భావానికి దోహదం జహీరాబాద్: జహీరాబాద్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ జె.గీతారెడ్డి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జరుపుకోనున్న రంజాన్.. ప్రజల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. పండగలు ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. -
పాక్ ప్రధానికి మోదీ రంజాన్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేశారు. రంజాన్ సందర్భంగా షరీఫ్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ తరపున పాక్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. ప్రత్యేకమైన ఈ రోజున సమాజంలో శాంతి వర్థిల్లాలని మోదీ ఆకాంక్షించారు. పాక్ ప్రధానితో పాటు పొరుగు రాష్ట్రాల ప్రధానమంత్రులకు మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఇరాన్ అధ్యక్షడు హసన్ రౌహనీ, యెమన్ అధ్యక్షుడితో పాటు ఆప్ఘనిస్తాన్ రాష్ట్రపతి మహ్మద్ అష్రఫ్ ఘనీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాలకు కూడా మోదీ ఫోన్లో శుభాకాంక్షలు చెప్పారు. -
ఈద్ ముబారక్ అంటున్న హీరో
మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్న మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం వేషధారణలో ఉన్న తన ఫొటోనే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ కంప్లీట్ యాక్టర్.. ఇద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ పండుగలోని దైవస్ఫూర్తి మీ జీవితాల్లో ఆనందం, శాంతి కలిగించాలని ఆకాంక్షించారు. మోహన్ లాల్ కీలక పాత్రలో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. గతంలో గాండీవం సినిమాలో ఓ పాటలో కనిపించిన మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో అలరించనున్నాడు. Eid Mubarak...May the divine spirit of Ramadan fill your life with happiness, peace and prosperity pic.twitter.com/RUBEwvB8SZ — Mohanlal (@Mohanlal) 6 July 2016 -
గురువారం రంజాన్ సెలవు
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) సెలవును ఈ నెల 7వ తేదీన ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమన్వయ సంఘం కార్యదర్శి ఎల్.సురేశ్ తెలిపారు. దీనికి అనుగుణంగా.. కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలన్నింటికీ ఇంతకు ముందు నోటిఫై చేసినట్లుగా ఈ నెల 6వ తేదీన కాకుండా, ఈ నెల 7వ తేదీకి సెలవు దినాన్ని మార్చాలని నిర్ణయించింది. సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డీఓపీటీ) ఒక ఆఫీస్ మెమొరాండమ్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీనితో రంజాన్ సెలవును ఈ నెల 6కు బదులు 7వ తేదీకి మార్చినట్లయింది. -
ఆయీయే మేడం..! ఆయీయే..!!
హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లాడ్‌బజార్ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది అందమైన గాజులు. సాధారణ రోజుల్లో నిత్యం రద్దీగా ఉండే లాడ్‌బజార్ ప్రస్తుతం రంజాన్ మార్కెట్ సందర్భంగా మరింత బిజీగా మారింది. ప్రత్యేకమైన రంజాన్ ఆఫర్లతో లాడ్‌బజార్‌లోని గాజుల దుకాణదారులు కళకళలాడుతున్నాయి. పండుగ కోసం ముస్లిం మహిళలు రంగురంగుల గాజుల కొనుగోలులో నిమగ్నమయ్యారు. అందుకనే ఎంతో మక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ తమకు కావాల్సిన గాజులను ఇక్కడ ఖరీదు చేస్తుంటారు. ఇది కేవలం నగరానికి, రాష్ట్రానికే పరిమితమైన సంగతి కాదు. ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా మహిళలు లాడ్‌బజార్‌కు వచ్చి తమకు ఇష్టమైన వాటిని ఎంపిక చేసుకొంటారు. ఇక్కడ పగలూ రాత్రీ ఒక్కటే! ఇక్కడి రంజాన్ నైట్ బజార్లో విద్యుత్ దీపాల కాంతిలో రాత్రి పగలు ఒకేలాగా కనిపిస్తున్నాయి. అద్దాల పెట్టెల్లో ఉన్న రంగు రంగుల రాళ్ల గాజులు ఛమక్ఛమక్మంటూ మహిళల ముఖాలను మెరిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఎన్ని జతల గాజులు చేతికి ఉన్నా.... ఊరిస్తూ మరో జత వేసుకోవాలనిపిస్తుంది లాడ్బజార్కొస్తే. మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్... రకరకాల గాజులు. చూసే కొద్ధీ ఏది తీసుకోవాలో తెలియని అయోమయం.... ఆతత... రద్దీ.. కొనుగోలు చేసేవారితో కిటకిటలాడుతుంది లాడ్‌బజార్. చార్మినార్ పడమర వైపు పాదం దగ్గర పుట్టిన ఒక వెలుగుల వీధి లాడ్‌బజార్. తరతరాలుగా భాగ్యనరగం గర్వించదగ్గర రీతిలో ఖ్యాతి గడిస్తుంది ఈ గాజుల బజార్. దక్కను ప్రాంత వాసుల పెన్నిధి అయిన ఈ బజారుకు నాటికీ నేటికీ కూడా మరో ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి. ఒక్కసారి అడుగు పెడితే చాలు.. ఒక్కసారి లాడ్‌బజార్‌లో అడుగు పెడితే చాలు గంటల తరబడి దుకాణాలను చూస్తూ గడిపేస్తాం. దుకాణాలలోని షోకేజ్‌లలో గల వివిధ రకాలైన గాజులను తనివితీరా చూస్తూ ఉండిపోతారు. ఐదు రూపాయల నుంచి పది వేల రూపాలయ వరకు ఖరీదు చేసే ఇక్కడి గాజులు హిందు, ముస్లిం అనే తారతమ్యం లేకుండా అందరికీ కావాల్సిన డిజైన్లలో అందుబాటులో ఉంటాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్లు, యువతు లు, పిల్లలు ఇక్కడి గాజుల పట్ల మోజు పెంచుకుంటూ ఉంటారు. లాడ్‌బజార్ అంటే.. లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. అంతేకాక తాము ప్రేమించి వారికి లాడ్‌బజార్‌లో ఏవైనా గాజులను ఖరీదు చేసి బహుమతిగా ఇస్తే వారి పట్ల ప్రేమానురాగాలు అధికమౌతాయని కూడా చాలామంది భావిస్తుంటారు. మహ్మద్ కూలీ కుతుబ్‌షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్‌బజార్‌లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారని పెద్దలు అంటారు. ఐదవ నవాబ్ మహ్మద్ కూలీ కుతుబ్‌షా 1591-92 కాలంలో చారిత్రాత్మకమైన చార్మినార్‌ను నిర్మించారు. భాగమతిని గాఢంగా ప్రేమించిన ఆయన ఆమె పేరుతోనే హైదరాబాద్ నగరాన్ని కూడా నిర్మించారు. చార్మినార్ నిర్మించాక కాలక్రమేణా గుల్జార్‌హౌజ్ పరిసర ప్రాంతాలలో నివాస స్థలాలు ఏర్పడ్డాయి. ప్రారంభంలో ఒకటి రెండు వ్యాపార సముదాయాలతో ఏర్పడిన గాజుల దుకాణాలు రాను రాను సంఖ్య పెంచుకొని లాడ్బజార్గా విస్తరించాయి. అప్పట్లో.. అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళుతుండడంతో, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో క్రమంగా ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో 250 పైగా దుకాణాలు నిత్యం వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. లక్షల్లో వ్యాపారం.. లాడ్‌బజార్ దుకాణాల లో ప్రస్తుతం రంజాన్ మార్కెట్ సందర్బంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ.50 వేలకు పైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాల లో జరిగే వ్యాపారం కలిపితే రూ. 50 లక్షలకు పైగా ఉంటుందంటున్నారు. ‘ఆయీయో మేడం.....! ఆయీయే....!!’... అంటూ దుకాణాల ముందు నిల్చొని బేర సారాలు....ఒకరికి మించి మరొకరు పిలుపు. రూ.500 చెప్పిన గాజుల జత రూ. 200లకు ఇవ్చొచ్చు...లేదా ఒక్క రూపాయలు కూడా తగ్గకపోవచ్చు. రంజాన్ మాసంలోని చివరి రెండు రోజులు కావడంతో మరింత రద్దీ కనిపిస్తోంది. -
దోస్తీ దావత్
స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం. ముస్లిం భాయ్ ఈద్ చేసుకుంటున్నాడంటే... చుట్టు పక్కలవాళ్లందరికీ పండగే! ఎంతో అభిమానంగా, ఇతర మతస్థులను కూడా ప్రేమగా పిలిచి మరీ పండుగ రోజు భోజనం పంచుకుంటారు. భారతదేశంలో ఉన్న ముస్లిం భాయ్ దిల్ పెద్దది. కంచం... ఇంకా పెద్దది. కచ్చీ బిర్యానీ కావల్సినవి: బాస్మతి బియ్యం - పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ - కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం- వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు - 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం - టేబుల్ స్పూన్; పసుపు - అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క - పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు - కప్పు; కుంకుమపువ్వు - కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి) మటన్ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) రైస్ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత) తయారీ బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి. కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి. మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడ య్యాక నానిన మటన్ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20-25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి. షీర్ ఖుర్మా కావల్సినవి: పాలు - అర లీటర్ (3 కప్పులు); నెయ్యి - టేబుల్‌స్పూన్; పంచదార - ఒకటిన్నర టేబుల్ స్పూన్ (డేట్స్ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్ (వెర్మిసెల్లి)- అర కప్పు; జీడిపప్పు - 8 (తరగాలి); బాదంపప్పు - 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు - 8 (తరగాలి); ఖర్జూర - 9 (సన్నగా తరగాలి); యాలకులు - 4 (లోపలి గింజలను పొడి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్మిస్ - టేబుల్ స్పూన్; రోజ్‌వాటర్ - టీ స్పూన్ తయారీ: సేవియాన్ ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి అదె గిన్నె లేదా పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీయాలి విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్ చివరగా అలంకరించుకోవచ్చు. నోట్: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి. భేజా మసాలా కావల్సినవి: మేక బ్రెయిన్ (భేజా)- 200 గ్రాములు; టొమాటో తరుగు - కప్పు ; ఉల్లిపాయ తరుగు - కప్పు; పచ్చిమిర్చి చీలికలు - 3; కొత్తిమీర తరుగు - టీ స్పూన్; మిరియాలు (కచ్చాపచ్చాగ దంచాలి) - 10; కారం - అర టీ స్పూన్; ధనియాల పొడి - అర టీ స్పూన్; జీలకర్ర - అర టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత; నిమ్మరసం - తగినంత తయారీ: మరుగుతున్న నీళ్లలో పసుపు, ఉప్పు వేసి భేజాను 2-3 నిమిషాలు ఉంచాలి. తరువాత నీళ్లను వడకట్టాలి. గట్టిపడిన భేజాను ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కాగాక జీలకర్రను చిటపటలాడించాలి. దీంట్లో ఉల్లిపాయతరుగు వేసి ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. దీంట్లో టొమాటో తరుగు వేసి మరో 3-4 నిమిషాలు ఉడికించి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు వేసి మరో అర నిమిషం కలపాలి. దీంట్లో ఇతర మసాలా పొడులు వేసి, గరిటెడు నీళ్లు, ఉప్పు కలిపి ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక కట్ చేసిన భేజాను వేయాలి. ఎక్కువ కలపకుండా నూనె కూరనుంచి వేరయ్యేదాక సన్నని మంట మీద ఉడికించాలి. చివరగా మంటతీసేసి కొత్తిమీర, నిమ్మరసం వేసి దించాలి. పాయా షోర్బా కావల్సినవి: మటన్ ముక్కలు (పాయా/కండ ఉన్న ఎముకలు) - 10-15; వెల్లుల్లి - 8 రెబ్బలు; ఉల్లిపాయలు - 4; పసుపు - అర టీ స్పూన్; లవంగాలు - 5; పచ్చ యాలక్కాయలు - 4; లవంగాలు - 6; దాల్చిన చెక్క - చిన్న ముక్క; ఉప్పు - తగినంత; నెయ్యి - అర కప్పు; కారం - అర టీ స్పూన్; మిరియాల పొడి - అర టీ స్పూన్; కొత్తిమీర - చిన్న కట్ట; గరం మసాలా - టీ స్పూన్; నిమ్మరసం - టేబుల్ స్పూన్ తయారీ: మటన్‌ని శుభ్రపరుచుకొని పక్కనుంచాలి. 2 ఉల్లిపాయలను సన్నగా తరగాలి. మరో రెండింటిని వెల్లుల్లితో కలిపి ముద్దచేసి పక్క నుంచాలి. పెద్ద మందపాటి గిన్నె15-16 కప్పుల నీళ్లు, మటన్ ముక్కలు వేసి ఉడికించాలి. దీంట్లో ఉల్లిపాయ ముద్ద, పసుపు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. పాయా మిశ్రమం చిక్కపడుతుండగా మరో 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. విడిగా ఒక పాన్‌ను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి, దాంట్లో ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత కారం, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాయాలో వేసి కలపాలి. చాలా సన్నని మంట మీద దాదాపు 4 గంటల సేపు మరిగించాలి. పాయ నుంచి ముక్క విడిపోయేదాకా ఉడికించాలి. తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసి, పైన కొద్దిగా నెయ్యి వేసి మంట తీసేయాలి. నిమ్మరసం కలిపి వేడి వేడిగా రోటీ, పుల్కాలలోకి వడ్డించాలి. పత్తర్ కా గోష్ కావల్సినవి : బోన్‌లెస్ మటన్ - కేజీ; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టేబుల్ స్పూన్; దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూన్; జాజికాయ పొడి - పావు టీ స్పూన్; లవంగాల పొడి - చిటికెడు; యాలకుల పొడి - పావు టీ స్పూన్; గరం మసాలా - పావు టీ స్పూన్; నెయ్యి - 100 గ్రాములు; ఆవనూనె - అర కప్పు; మిరియాల పొడి - చిటికెడు; బొప్పాయి కాయ గుజ్జు - టేబుల్ స్పూన్; కారం - టీ స్పూన్; అనాసపువ్వు పొడి - చిటికెడు; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; చిలికిన పెరుగు - కప్పు; ఉప్పు - తగినంత; వెల్లుల్లి రసం - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మటన్‌ని శుభ్రం చేసి, నీళ్లన్నీ పోయేలా వార్చాలి. అందులో పై మసాలా, కారం... అన్నీ కలిపి 2 గంటలు నానబెట్టాలి. వెడల్పాటి రాయిని బొగ్గుల కుంపటి మీద పెట్టి వేడి చేయాలి. నెయ్యి వేసి, ఒక్కో ముక్కను అన్ని వైపులా బాగా కాల్చి తీయాలి. వేడి వేడిగా వడ్డించాలి. నోట్: ఇలాగే చికెన్‌తోనూ తయారుచేసుకోవచ్చు. - కర్టెసీ ప్రదీప్ ఖోస్లా హెడ్ షెఫ్ - సిఇఓ, హైదరాబాద్ హౌజ్ -
సుల్తాన్ షూటింగ్లో బిజీ బిజీగా అనుష్క
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'సుల్తాన్ ' షూటింగ్లో బాలీవుడ్ భామ అనుష్క శర్మ బిజీ గా ఉంది. తొలిసారిగా సల్మాన్ సరసన నటించే అవకాశాన్ని అనూహ్యంగా దక్కించుకున్న ఈ బ్యూటీ షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమీర్, షారూక్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్లతో నటించి తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ పీకే భామ మొదటిసారిగా సల్మాన్ కు జోడీగా నటిస్తోంది. పరిణితీ చోప్రా, కంగనా రనౌత్, క్రితి సనన్ ,దీపికాపదుకొనే కత్రినా లాంటి టాప్ హీరోయిన్ల తో పోటీపడి మరీ అవకాశాన్ని చేజిక్కించుకుంది. అద్భుతమైన నటనతో పలువురి ప్రశంసలందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ క్యారెక్టర్లో మరింతగా ఒదిగిపోయేందుకు కసరత్తులు చేస్తోందట. కాగా హరియాణాకు చెందిన 40 ఏళ్ల రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'సుల్తాన్' 2016 ఈద్‌కు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మాతగా అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సగం షూటింగ్ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసుకుంది. -
భక్తి శ్రద్ధలతో బక్రీద్
బక్రీద్ పండుగను జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పేదలు, బంధువులకు మాంసంతో చేసిన వంటకాలను అందించారు. అల్లా ప్రసన్నుడైన దినంగా చెప్పుకునే బక్రీద్ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఈద్ ముబాకర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్రమైన హృదయంతో అల్లాను ప్రార్థించి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ ప్రాశస్త్యాన్ని మత పెద్దలు, గురువులు వివరించారు. త్యాగనిరతి, సేవ, భక్తి భావానికి ప్రతీక అయిన ‘ఈదుల్ అజ్ఉహా’ బక్రీద్ పర్వదినాన్ని జిల్లాలోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇబ్రహీం, ఇస్మాయిల్ త్యాగానికి అల్లాః ప్రసన్నుడైన పవిత్రదినాన పేదలకు, తమ బంధువులకు విందు ఇచ్చారు. ఉదయం నుంచే మసీదులు కిక్కిరిశాయి. కొత్త బట్టలు ధరించి చిన్నాపెద్దా తేడా లేకుండా పవిత్ర హృదయంతో అల్లాఃను ప్రార్థించారు. జిల్లాలోని ముఖ్య నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. -
పొట్టేళ్ల కొట్లాట
-
'వచ్చే ఏడాది ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు'
హన్మకొండ (వరంగల్ జిల్లా) : రానున్న ఏడాదిలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకోస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని జాకరీయా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈవిధంగా వ్యాఖ్యానించారు. మసీదుల్లో పని చేసే ఇమామ్‌లకు గౌరవ వేతనంగా రూ. 2వేల చెక్కులను ఇచ్చేందుకు మంత్రి వరంగల్ చేరుకున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప దినాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇమామ్‌లు తమ బ్యాంకు ఖాతా నంబర్లును ఇస్తే ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు. -
భక్తిశ్రద్ధలతో ఈదుల్ ఫితర్
కర్నూలు: రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ముస్లింలు ఈద్గాలకు బయలుదేరారు. నగరంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఇక్కడ ఖాజీ సలీం బాషా నమాజు చేయించారు. ఈద్గా లోపల స్థలం సరిపోక.. ఆనంద్ టాకీస్ బ్రిడ్జి వరకు ముస్లింలు రోడ్లపైనే నమాజు చేశారు. ఈ సందర్భంగా ఖాజీ సలీం బాషా ఈదుల్ ఫితర్ ప్రత్యేక సందేశాన్నిస్తూ.. రంజాన్ పండుగ ముస్లింలలో చక్కని క్రమశిక్షణకు, నియమబద్ధమైన జీవనానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. నెల రోజుల కఠినమైన ఉపవాస దీక్షలు ముస్లింలకు మానవీయ దృక్పథంతో పాటు సేవాభావాన్ని అలవరుస్తుందన్నారు. ప్రపంచ మానవాళికి శాంతి సౌభాగ్యాలు కలగాలని దువా చేశారు. కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఈ యేడాది భారీ సంఖ్యలో ముస్లింలు నమాజులో పా ల్గొన్నారు. మౌలానా జుబేర్ పేష్ ఇ మాంగా వ్యవహరించి ప్రత్యేక నమాజు చేయించారు. పాత ఈద్గాలో 9 గంటలకే నమాజు ప్రారంభం కావడంతో.. కొత్త ఈద్గాకు తాకిడి పెరిగింది. నమాజులో పాల్గొన్న ఎమ్మెల్యే ఎస్వీ ఈదుల్ ఫితర్ ప్రత్యేక నమాజులో కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు నగరంలోని పాత ఈద్గాలో ప్రారంభమైన ఈదుల్ ఫితర్ నమాజులో పాల్గొన్న ఆయన.. అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పరిధిలోని రెండు ఈద్గాల్లోఉదయం 7 గంటలకే ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభమైంది. ముస్లిం మహిళలు కూడా నమాజులో పాల్గొన్నారు. హిందూ ముస్లింలు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం. ట్రాఫిక్ మళ్లింపు ఉదయం 8 గంటల నుంచి పాత, కొత్త ఈద్గాల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించారు. సి.క్యాంప్ నుంచి కొత్త బస్టాండ్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను రాజ్‌విహార్ సెంటర్ నుంచి వెంకటరమణ కాలనీ నుంచి హైవే వైపు మళ్లించారు. కొత్త ఈద్గా వద్ద ఉదయం 10 నుంచి 11 గంటల వరకు లారీలు బస్సులను నిలిపేశారు. నమాజు అనంతరం అన్ని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. -
ఘనంగా రంజాన్
అంతటా భక్తి భావం.. అందరి నోటా అల్లాహ్ గురించి ప్రశంస.. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు.. సహృద్భావ వాతావరణం.. ఆహ్లాదం గొలిపిన అత్తరు పరిమళాలు.. సోదర భావం తెలుపుతూ ఆలింగనాలు... వెరసి శనివారం జిల్లాలో రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. కడప నగరంలోని బిల్టప్ ఈద్గా వద్ద భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థన చేస్తున్న దృశ్యమిది. (ఇన్సెట్లో) పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో కడప ఎమ్మెల్యే అంజద్‌బాష, మాజీ మంత్రి అహ్మదుల్లా, అమీర్‌బాబు, సుభాన్‌బాష, షఫీ తదితరులు కడప కల్చరల్ : ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు శనివారం జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు మధ్యాహ్నం 11.30 గంటల వరకు కొనసాగాయి. కొందరు మసీదులలో ప్రార్థనలు చేయగా, ఎక్కువ శాతం మంది సమీపంలోని ఈద్గాలలో సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు. పులివెందుల, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప నగరం బిల్టప్ ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మత గురువు ముఫ్తీ న్యామతుల్లా పండుగ సందేశాన్ని అందజేశారు. ఈ పండుగ.. దైవం మానవులకు అందించిన గొప్ప వరమని, ఈ సందర్భంగా అల్లాహ్ సూచించిన మార్గాన్ని జీవితాంతం కొనసాగించాలని సూచించారు. మనం చేసే కార్యక్రమాల్లో అడుగడుగునా అల్లాహ్ తోడుండాలని కోరాలన్నారు. జీవితాంతం ఉత్తమ మార్గంలో పయనించేందుకు ఆయన నుంచి శక్తిని కోరుదామన్నారు. చాలా మంది ఈ ప్రపంచం తమదేనని గర్వం వ్యక్తం చేస్తున్నారని, నిజానికి ఒక్క అడుగు స్థలాన్ని కూడా తీసుకు వెళ్లలేరని ఆయన గుర్తు చేశారు. మానవుడిలోని చైతన్యం పూర్తిగా అల్లాహ్ దయ మాత్రమేనని తెలుసుకోవాలన్నారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ భక్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్బంగా ఆయన ఆశీస్సులు అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రాంగణంలో ఒకరినొకరు హత్తుకుని ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఘనంగా ఏర్పాట్లు ఎండ ఇబ్బంది ఉండకూడదన్న భావంతో కార్యక్రమ నిర్వాహకులైన జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు బిల్టప్ ఈద్గా మైదానంలో పూర్తిగా షామియానా వేశారు. మంచి నీటికి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ను ముందే మళ్లించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగలేదు. పోలీసు సిబ్బంది అడుగడుగునా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎస్ఎండీ అహ్మదుల్లా, ఎమ్మెల్యే అంజద్‌బాష, ఆయన సోదరుడు అహ్మద్‌బాష, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, అమీర్‌బాబు, జిలానీబాష, సంఘ సేవకులు సలావుద్దీన్, సుభాన్‌బాష, దుర్గాప్రసాద్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌అలీ, షఫీ, దర్గా ప్రతినిదులు నయీం, అమీర్‌తోపాటు నగరానికి చెందిన ముస్లింలు పాల్గొన్నారు. -
ఘనంగా రంజాన్
మహబూబ్‌నగర్ అర్బన్: ముస్లింలు రంజాన్ సందర్భంగా శనివారం ‘ఈద్- ఉల్- ఫితర్(రంజాన్)’ పండుగను జిల్లాలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు ఆచరించారు. ప్రత్యేక పండుగ నమాజ్‌ను చదివి సర్వమానవాళి క్షేమంకోసం అల్లాను వేడుకున్నారు. అనంతరం హిందూ, ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆర్థికస్థోమత కలిగిన కొందరు ముస్లింలు దానధర్మాలు చేశారు. జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్‌చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాగటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ సి.విశ్వప్రసాద్ ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వానగట్టు వద్దనున్న ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 10 గంటలకు ప్రత్యేకప్రార్థనలు జరిపించారు. ఈద్ ముబార క్ .. రంజాన్ పవిత్రమాసం అనంతరం ఈద్ఉల్ ఫితర్‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్‌ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతిని ధులు, అధికారులు ము స్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దిరెడ్డి సాయిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేతలు హైదర్అలీ, వాజిద్, శేఖ్ అబ్దుల్లా, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, ఎన్పీ వెంకటేశ్, సయ్యద్ ఇబ్రహీం, బెనహర్, బెక్కెం జనార్ధన్, డీఎస్పీ కృష్ణమూర్తి, గోపాల్‌యాదవ్, రిటైర్డు డీసీహెచ్ఎస్ డా క్టర్ శ్యామ్యూల్, సీహెచ్ చంద్రయ్య తదితరులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారీ బందోబస్తు.. రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లాకేంద్రం తో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీసులు పహారా కాశారు. పోలీసులు, ఆ శాఖ అధికారులు కూడా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
వైభవంగా ఈదుల్ ఫితర్
న్యూఢిల్లీ: ఈదుల్ ఫితర్ వేడుకలు దేశవ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. మసీదులు, ప్రార్థనా మందిరాల వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు సమావేశమై పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మసీదులు ఈద్ ముబారక్ నినాదాలతో మార్మోగాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ హజ్రత్బల్ దర్గా వద్ద సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతో సహా 60 వేల మందికి పైగా ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో అగ్రశ్రేణి వేర్పాటువాద నాయకుల్ని హౌస్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కశ్మీర్లో కొన్ని చోట్ల భద్రతా సిబ్బందిపై రాళ్లు విసరడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక జమా మసీదు, ఫతేపూర్, హజ్రత్ నిజాముద్దీన్ మసీదుల వద్ద వందల సంఖ్యలో ప్రార్థనలు చేశారు. శ్రీనగర్‌లో ఈద్గా మసీదులో 50 వేల మంది ప్రార్థనలు చేశారు పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మోదీ ఈద్, రథయాత్ర శుభాకాంక్షలు ఈదుల్ ఫితర్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సౌభ్రాతృత్వం, సామరస్యాలకు ప్రతీక అని ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ పండుగ దేశంలో ఐక్యతను, శాంతి, సామరస్యాలను పెంపొందించాలని, ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. పూరి జగన్నాథ స్వామి 138వ రథయాత్ర సందర్భంగా కూడా ప్రధాని ప్రజలకు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. 400 ఏళ్ల పురాతన ఆలయంలో తాను పూజలు చేసిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా నవకళేబర్ రథయాత్ర, ఈద్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, అక్ష య్ కుమార్, అజయ్ దేవగన్ తదితరులు సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. -
భారత జవాన్ల 'ఈద్' మిఠాయిలను తిరస్కరించిన పాక్
వాఘా: ఇప్పుడప్పుడే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు తలెత్తకముందే.. 'పొరుగు దేశం మిఠాయిలు చేదు' అన్నట్లుగా వ్యవహరించింది దాయాది పాకిస్థాన్. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పండుగల సందర్భంలో పరస్పరం పలకరించుకొని, మిఠాయిలు తినిపించుకునే సంప్రదాయానికి తెరదించింది. సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతోన్న పండుగ చెలిమికి మంగళం పాడింది. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) ఇవ్వజూపిన మిఠాయిలు స్వీకరించేందుకు పాక్ సైనికులు నిరాకరించారు. ఈ ఉదయం వాఘా సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది. వాఘానే కాకుండా భారత్- పాక్ సరిహద్దుల్లోని ముఖ్యమైన స్థావరాన్నింటివద్దా ఇలాంటి పరిస్థితే నెలకొంది. 'పండుగ సందర్భంగా పొరుగు దేశం సైనికులకు స్వీట్లు ఇవ్వడం ఆనవాయితి. అయితే ఈ సారి మాత్రం వారు స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. ఏది ఏమైనా మేం కోరుకునేది శాంతినే' అని బీఎస్ఎఫ్ డీఐజీ ఎంఎఫ్ ఫారూఖ్ చెప్పారు. పాక్ తీరుకు భిన్నంగా అసోం, మేఘాలయాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద భారత్, బంగ్లాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, స్వీట్లు తినిపించుకోవడం గమనార్హం. కశ్మీర్ అంశం ప్రస్తావన లేకుండా భారత్- పాక్‌ల మధ్య చర్చలు అసాధ్యమని పాక్ రక్షణ సలహాదారు అజీజ్ ప్రకటించినప్పటినుంచి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం రెట్టింపయింది. గడిచిన పక్షంరోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి పాక్ సేనలు భాతర జవాన్లు, సాధారణ పౌరులపై తుపాకి గుండ్ల వర్షం కురిపించాయి. రంజాన్ పండుగ నాడు కూడా భారత సైన్యం స్థావరాలపై పాక్ రేజర్లు పలు మార్లు కాల్పులు జరిపారు. -
కశ్మీర్లో పాక్, ఐఎస్ఐఎస్ జెండాల కలకలం
శ్రీనగర్ : పవిత్ర రంజాన్ రోజు... జమ్మూకకాశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. వేర్పాటు వాది హురియత్ నేత జిలానీ గృహ నిర్బంధానికి నిరసనగా కొందరు శనివారం రోడ్లపైకి వచ్చారు. ఈద్ ప్రార్థనల అనంతరం శ్రీనగరలో అనంతనాగ్ లో హురియత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన పోలీసులపై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఐఎస్ జెండాలు తరచుగా దర్శనమిస్తున్నాయి. -
నేడు రంజాన్ పండుగ
- ముగిసిన ఉపవాస దీక్షలు - ముస్తాబైన ఈద్గాలు, మసీదులు - శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం సాక్షి, హైదరాబాద్: ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పండుగను నేడు(శనివారం) అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఈద్-ఉల్ -ఫితర్‌ను జరుపుకోవాలని హైదరాబాద్ రువాయత్-ఏ-హిలాల్ కమిటీ ప్రకటించింది. దీంతో రంజాన్ ఉపవాస దీక్షలు ముగిసినట్లయింది. రాష్ట్రవ్యాప్తంగా ముస్తాబైన ఈద్గాలు, మసీదుల్లో ఉదయం ఈద్-ఉల్-ఫితర్ సామూహిక ప్రార్థనలు పెద్దఎత్తున జరగనున్నాయి. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
నేడు రంజాన్
నెల్లూరు (కల్చరల్) : శుక్రవారం సాయంత్రం జిల్లాలో మబ్బుల చాటున దోబూచులాడుతూ నెలవంక కనిపించడంతో శనివారం ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ అని జిల్లా వ్యాప్తంగా ఆన్ని మసీదుల్లో ఇమామ్‌లు ప్రకటించారు. ప్రముఖ మసీదులు, ఈద్గాలు రంజాన్ ప్రార్థనల కోసం సిద్ధమయ్యాయి. ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉదయాన్నే వంటపనులు పూర్తిచేసుకుని సామూహికంగా నమాజ్ చదివేందుకు సిద్ధమవుతారు. ప్రార్థనలు పూర్తయిన తర్వాత ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సంబరాల రంజాన్.... బంధువులను, స్నేహితులను ఆప్యాయంగా కలుసుకునేందుకు రంజాన్ పండుగ అవకాశం కల్పిస్తుంది. నగరంలోని షాపులన్నీ శుక్రవారం కిటకిటలాడాయి. నెలవంక కన్పించడంతో యువకులు టపాసులు కాల్చి సందడి చేశారు. నగరంలో కోలాహలం నెలకొంది. -
ఈద్ ముబారక్
స్టేషన్ మహబూబ్‌నగర్: రంజాన్ పర్వదినానికి మసీదులు, ఈద్గాలు సుందరంగా ముస్తాబయ్యాయి. శుక్రవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు 29రోజుల పాటు చేపట్టిన ఉపవాసాలను విరమించారు. చంద్రుడు కనిపించడంతో పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా ఈదుల్ ఫితర్ పండగను జరుపుకుని, మానవకల్యాణం కోసం ప్రత్యేక నమాజులు చేస్తారు. జిల్లా కేంద్రంలోని జామీయ మసీదు నుంచి ఉదయం 9 గంటలకు ముస్లిం సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక వానగట్టు రహెమానియా ఈద్గా వద్దకు చేరుకుంటారు. అక్కడ10గంటలకు జామియా మసీదు ప్రధాన ఇమామ్ హాఫిజ్ ఇస్మాయిల్ ప్రత్యేక నమాజు ప్రార్థనలు చేయిస్తారు. మదీనా మసీదులో ఉదయం 9.30 గంటలకు, సిరాజుల్ ఉలుమ్లో 8 గంట లకు, మునీర్ మసీదులో 9 గంటలకు ప్రత్యేకనమాజు నిర్వహించనున్నారు. ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు ఈద్ ముబారక్ చెప్పడానికి ప్రజాప్రతిని ధులు, అధికారులు ఈద్గా వద్దకు చేరుకుని పట్టణ ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే శిబిరంవద్దముస్లింలకు పండ గ శుభాకాంక్షలు తెలుపనున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ టీకే శ్రీదేవి, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్పాటు ఆయా పార్టీల నేతలు పండుగ వేడుకల్లో పాల్గొనున్నారు. ఈద్ నమాజ్ సందర్భంగా ఎలాం టి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుం డా పోలీసు అధికారులు పట్టణంలో ముం దస్తుగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈద్గా వద్ద ప్రత్యేక నమాజు ఈదుల్ ఫితర్ ప్రత్యేకనమాజుకు వేలాది సంఖ్యలో ముస్లింలు వక్ఫ్ రహెమానియా ఈద్గా వద్ద రానుండటంతో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. టెంట్లు, తాగునీటి తదితర సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. మునిసిపాలిటీ సిబ్బం ది వారం రోజుల నుంచి ఈద్గా వద్ద మరమ్మతులు చేపట్టింది. -
ఈద్సీజన్ను టార్గెట్ చేస్తున్న సల్మాన్
-
సల్మాన్ 'సుల్తాన్' విడుదల వచ్చే ఏడాది ఈద్‌కు..
ముంబై: వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో చిత్రంతో అలరించనున్నారు. ఆయన రాబోవు చిత్రం సుల్తాన్ 2016 ఈద్‌కు సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించనుండగా.. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహించనున్నారు. తిరిగి ఈ చిత్రం ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యాశ్ రాజ్ ఫిల్మ్స్ పేరు మీదే రానుంది. 2012లో ఇదే బ్యానర్వచ్చిన ఏక్ తా టైగర్ చిత్రం బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఇదే బ్యానర్‌పై సుల్తాన్‌గా సల్మాన్ దర్శనమివ్వనున్న నేపథ్యంలో రికార్డులు తిరగ రాస్తుందేమో వేచి చూడాల్సిందే. -
త్వరలో కాకినాడ ఈఐడీ ప్యారీ షుగర్ రిఫైనరీ ప్రారంభం
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని ఈఐడీ ప్యారీ(ఇండియా) షుగర్ రిఫైనరీ ప్లాంట్‌లో కోల్-ఫైర్డ్ బాయిలర్లను ఏర్పాటు చేస్తున్నామని మురుగప్ప గ్రూప్ తెలిపింది. ఈ బాయిలర్ల ఏర్పాటు తర్వాత ఈ రిఫైనరీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల టన్నులు ప్రాసెస్ చేయగలమని అంచనాలున్నాయని మురుగప్ప గ్రూప్ డెరైక్టర్ (ఫైనాన్స్) ఎన్. శ్రీనివాసన్ చెప్పారు. కాగా 201516లో తమ గ్రూప్... కంపెనీల ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, టెక్నాలజీలపై రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని గ్రూప్ వైస్ చైర్మన్ ఎం.ఎం. మురుగప్పన్ చెప్పారు. వీటిల్లో సైకిళ్లు తయారు చేసే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా కోసం రూ.90 కోట్లు కేటాయించామని వివరించారు. -
న్యూ ఎంట్రీ!
ఇప్పటికే విదేశీ నటులు బీటౌన్‌లో తళుక్కుమంటున్నారు. ఉన్న తారలు చాలరన్నట్టు పాప్ స్టార్ ఈద్ షీరన్‌ను దిగుమతి చేస్తున్నారు. షారూఖ్‌ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘హ్యాపీ న్యూ ఇయర్’కు సీక్వెల్లో ఇతగాడితో ఓ రోల్ చేయించాలని దర్శకురాలు ఫరాఖాన్ కోరుకుంటోంది. అందుకు షీరన్‌ను ఒప్పించిందని కూడా సమాచారం. రీసెంట్గా ముంబైలో షీరన్ ఇచ్చిన మ్యూజిక్ మస్తీకి బాలీవుడ్ తారలు ఫిదా అయ్యారట. ఆ తరువాత జరిగిన లావిష్ పార్టీలో అభిషేక్‌బచ్చన్, ఫరా తదితర సినీ జనంతో అతగాడి పరిచయాలు కూడా జరిగిపోయాయట! ‘షీరన్ ముంబై వస్తున్నాడని, నాతో పాటు ఇతర హిందీ నటులను కలవాలనుకుంటున్నాడని లండన్‌లో ఉంటున్న మా కజిన్ జుబిన్ ఫోన్లో చెప్పింది. ఇది విని స్టన్నయ్యా. షీర్తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అభిషేక్ కూడా ఓకే అన్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది ఫరా! ఇండియన్ స్క్రీన్‌పై ఈ పాప్ స్టార్ ఏమాత్రం పాపులర్ అవుతాడో చూడాలి! -
ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు
రాయచూరు/బళ్లారి అర్బన్: ఈద్ మిలాద్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన రాయచూరులో మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని షరాఫ్ బజార్, పరకోట, ఖాదర్ గుండ, ఎల్బీఎస్ నగర్, షియా తలాబ్, అరబ్ మొహల్లా నుంచి వేలాది మంది ముస్లింలు ఈద్ మిలాద్ నబీ ర్యాలీలతో తీనకందిల్ వద్దకు చేర్చారు. 3 గంటలకు తీన్‌కందిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏక్ మినార్, జైలు, నగర సభ, టిప్పూ సుల్తాన్ రోడ్డు, జిల్లాధికారి కార్యాలయం, ఈద్గా మైదానం వరకు నిర్వహించారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు భోసురాజు, మాజీ ఎమ్మెల్యే యాసిన్, కాడా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వసంత్‌కుమార్, డాక్టర్ తాజుద్దీన్, ఇతర నేతలు పాల్గొని అభినందనలు తెలిపారు ఈద్ మిలాద్ ఉన్ నబి వేడుకలను పురస్కరించుకొని బళ్లారిలో భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ, ఉసేన్‌నగర్ మసీద్ సంస్థ, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 19వ వార్డులోని ఉసేన్‌నగర్ మసీదు ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వి మ్స్ డెరైక్టర్ డాక్టర్ వీ.శ్రీనివాస్ శిబి రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తం తయారు చేయలేమని, మనమే రక్తదా నం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నా రు. 50 మంది రక్తదానం చేసినట్లు తెలి పారు. అనంతరం భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు టీ.అల్లాబకాష్ ఈద్ మిలాద్ శోభయాత్రను ప్రారంభించగా నగర వీధుల గుండా ఊరేగింపు సాగింది. స్పందన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బీ.దేవణ్ణ, ఐఆర్సీఎస్ జిల్లా కార్యదర్శి, హోంగార్డ్స్ కమాండెంట్స్ షకీబ్, హాజీ అబ్దుల్ సత్తార్‌సాబ్, విమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. కంప్లి : ఈద్ మిలాదున్నబి వేడుకలు కంప్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జోగి కాలువ వద్ద గల బడేసా ఖాద్రి దర్గా నుంచి మక్కా మసీదు చిత్రపటంతో నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగగా దర్గాకు చేరుకున్నారు. మతగురువు సయ్యద్ అబుల్ హసన్ ఖాద్రి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఖాద్రి పాల్గొన్నారు. సింధనూరు టౌన్: పట్టణంలో ఆదివారం మిలాదున్న బి వేడుకలు ఘనంగా జరిగాయి. మక్కా, మదినాల స్తంభం నమూనాలను కుష్టగి రోడ్డు, టిప్పుసుల్తాన్ సర్కిల్, కిత్తూరు రాణి చెన్నమ్మ సర్కిల్ మీదుగా ఊరేగించారు. ఖలందరియా కమిటీ, రోషన్ కమిటీ, టిప్పు సుల్తాన్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. సింధనూరు తా లూకాలోని హుడా గ్రామంలో ఆదివారం ఆద్ మిలాద్ పండుగను జరుపుకున్నారు. అనంతరం ముస్లింలు ఊరేగింపు నిర్వహించి ప్రార్థన నిర్వహిం చారు. బళగానూరు గ్రామంలో కూడా షా జామియా మసీద్ సన్నిధిలో ఎస్.శెక్షావలి నేతృత్వంలో శనివారం రాత్రి జాగరణ చేపట్టి ప్రార్థనలు నిర్వహించారు. హొస్పేట : నగరంలో ఆదివారం ఈద్ మిలాద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఐఎస్ఆర్ రహదారి ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ప్రముఖ వీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. -
ప్రశాంతంగా ఈద్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. దేశ రాజధానిలోని చారిత్రక జామా మసీద్, ఫతేపూర్ మసీదుల్లో వేల సంఖ్యలో ప్రార్థనలకు హాజరై నమాజ్ అనంతరం ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రార్థనా స్థలాల వద్ద ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్లాం ప్రవచించిన ప్రేమ, దయ, కరుణ, సామరస్య గుణాలను అనుసరించాలని మత గురువులు ఉద్బోధించారు. ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్లో ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
రాచరికపు మూఢ నమ్మకాలను విశ్వసించొద్దని చెప్పినందుకు దేశం నుంచి బహిష్కరించినా.. కన్నవారు కాదుపొమ్మన్నా.. ఆయనకు దేవుడిపై అభిమానం సడలలేదు. కనికరించే దేవుడే.. కన్న కొడుకును గుట్టల్లో ఒంటరిగా వదలమన్నా జంకలేదు. కడుపుతీపి కన్నా.. తనకు దైవభ క్తే ముఖ్యమని భావించిన ఆయన ఆఖరికి దేవుడి ఆజ్ఞ మేరకు కొడుకును కూడా బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు. చివరికి అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన భక్తుడిగా ప్రసిద్ధికెక్కి త్యాగాని కి మారుపేరుగా నిలిచారు ఇబ్రాహిం. అందుకే ఆయన త్యాగానికి స్ఫూర్తిగా శతాబ్దాలుగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. - నేడు ఈద్ ఉల్ అజ్హా - ముస్తాబైన ఈద్గాలు, మసీదులు పోచమ్మమైదాన్/ హసన్‌పర్తి : ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ముస్లింలకు రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఈద్-ఉల్ ఫితర్(రంజాన్), రెండోది ఈద్-ఉల్-అజ్హా (బక్రీద్) ఒకటి. బక్రీద్ అంటే ’ బకర్- ఈద్’ అంటే జంతువును బలిచ్చే పండుగ. అందుకే దీనినే ఈద్-ఉల్-ఖుర్బానీ అని కూడా పిలుస్తారు. ఖుర్బానీ అంటే దేవుడి పేరుతో పేదవారికి జంతువు మాంసాన్ని దానం చేయడం. చరిత్ర చెబుతున్నదేంటంటే.. పూర్వం ఇరాక్ దేశ ప్రజలు విగ్రహారాధన కు ప్రాధాన్యతనిచ్చేవారు. ఈ దేశంలో నివసించే ఇబ్రాహిం తండ్రి విగ్రహాలను తయారు చేసేవాడు. ఇది నచ్చని ఇబ్రాహిం తన తండ్రి ని ‘మనం ఎందుకు విగ్రహాలను ఎందుకు పూజించాలి’అని ప్రశ్నిస్తాడు. ఇది వంశపారంపర్యంగా వస్తోందని ఆయన సమాధానం ఇవ్వడంతో సంతృప్తి చెందని ఆయన ప్రజల్లో దైవ భక్తి పెంపొందించి, విగ్రహారాధన తొలగించేందుకు సిద్ధమవుతాడు. అనంతరం అల్లాహ్‌ను ప్రార్థించాలని దేశంలో ప్రచారం చేపడతాడు. ఇది గిట్టని ఆ దేశ రాజు నమ్రూద్ ఇబ్రాహింకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. ఈ నేపథ్యంలో ఇబ్రాహిం తన భా ర్యతో కలిసి దైవ ప్రచారం చేసుకుంటూ మక్కా నగరానికి చేరుకుంటాడు. తన తదనంతరం దైవ కార్యభారాన్ని నిర్వర్తించేందుకు సంతానం ఉంటే బాగుంటుందని వారు అల్లాహ్‌ను నమాజ్‌లో వేడుకుంటారు. వారి ప్రార్థనలకు మెచ్చిన అల్లాహ్ పండంటి మగబిడ్డను ప్రసాదిస్తాడు. కొద్ది రోజుల తర్వాత దైవంపై ఉన్న నమ్మకాన్ని పరీక్షించేందుకు వారికి పుట్టిన కొడుకు ఇస్మాయిల్‌ను జనసంచారం లేని ప్రదేశంలో వదిలిరావాలని ఇబ్రాహింను అల్లాహ్ ఆజ్ఞాపిస్తాడు. దైవ ఆజ్ఞను పాటించిన ఇబ్రాహిం భార్య, కుమారుడిని జనసంచారం లేని గుట్టల నడుమ వదిలేస్తాడు. ‘ఇక్కడ మమ్మల్ని ఎందుకు వదిలారని అతడి భార్య ప్రశ్నించగా, ఇది దేవుడి ఆజ్ఞ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత ఇస్మాయిల్ నీటి కోసం ఏడుస్తుండడంతో అతడి తల్లి హాజ్రా నీటిని తెచ్చేందుకు సఫా, మర్వా అనే రెండు గుట్టలను ఏడు సార్లు ఎక్కి నీళ్ల కోసం వెతుకుతుంది. దాహాన్ని తట్టుకోలేని ఆ బాలుడు కాళ్లతో భూమిపై తన్నడంతో నీటి ఊట ఉద్భవిస్తుంది. ఆ నీటినే ‘జమ్..జమ్’ పేరుతో నేడు పిలుస్తున్నారు. ఈ ప్రాంతమే నేటికీ మక్కా నగరంగా రూపాంతరం చెందింది. ఖుర్బానీ ఎందుకు ఇవ్వాలంటే.. ప్రతీ మనిషి తన ప్రాణ రక్షణ కోసం ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. దైవాజ్ఞ మేరకు ఇస్మాయిల్‌ను బలి ఇచ్చే స్థానంలో గొర్రె పోతు ప్రత్యక్షమై ఆయన ప్రాణాలు రక్షించినందున, ఖుర్బానీ ఇస్తే ప్రాణాలు, ఆస్తులు రక్షించబడుతాయని ఖురాన్లో ఉంది. దీంతో ఏటా బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు ఖుర్బానీ (బలి) ఇస్తారు. గొర్రె, మేకను బలి ఇవ్వాలంటే ఒక వ్యక్తి పేరున ఇవ్వాలి. ఆవు, ఒంటెను ఇవ్వాలనుకుంటే ఏడుగురు కలిసి ఖుర్బానీ ఇవ్వవచ్చని పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారు. హజ్ యాత్ర ఎవరు చేయాలంటే.. ప్రపంచంలోని ఏ దేశంలో ఉండే ముస్లిం అయినా ఎలాంటి అప్పు లేకుండా రూ. లక్ష రూపాయలు నిల్వ ఉన్న ప్రతీ వ్యక్తి హజ్ చేయాలని ముస్లిం మతపెద్దలు చెబుతుంటారు. హజ్ యాత్రతో పూర్వం చేసిన పాపాలు తొలిగి తల్లిగర్భం నుంచి జన్మించిన శిశువులా కడిగిన ముత్యంలా ఉంటాడని ఖురాన్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏటా లక్షల సంఖ్యలో ముస్లింలు మక్కా, మదీనాను సందర్శించి తమ పాపాలను నుంచి విముక్తి పొందుతారు. దేవుడిచ్చిన గొర్రె.. అల్లాకు ప్రియమైన భక్తుడు ఇబ్రాహిం అలైహీసలాం. ఇతడి భక్తిని పరీక్షించేందుకు అల్లాహ్ ఎన్ని పరీక్షలు పెట్టినా అన్నింటిలో తన దైవ భక్తిని చాటుకుంటాడు. ఒక రోజు ఇబ్రాహీం భక్తిని పరీక్షించిదలచిన అల్లాహ్.. ఇబ్రహీం కలలో కనిపించి.. ‘నీ కుమారుడు ఇస్మాయిల్‌ను బలి ఇవ్వాలని’ ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఇబ్రహీం వెనుకాడకుండా కొడుకు, భార్యను తీసుకుని ఓ నిర్జీవ ప్రదేశానికి బయలుదేరుతాడు. మార్గమధ్యలో భార్య ఎక్కడి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా... ఇది దైవాజ్ఞ అని చెప్పడంతో ఆమె అతడి వెంట నడుస్తుంది. అయితే ఇబ్రహీంను ఎలాగోలా దేవుడి మార్గం నుంచి తప్పించాలని భావించిన ‘సైతాన్’ నీవు చేయబోతున్న పని మంచిది కాదని, దేవుడు కలలో వచ్చి కొడుకును బలి ఇవ్వమంటే ఇస్తావా..? ఇది న్యాయం కాదు. నీవు చేసే పని తప్పు అని ఆయనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. అయినా, సైతాన్ మాటలు లెక్కచేయని ఇబ్రాహిం దైవకార్యం పూర్తి చేసేందుకు ముందుకు సాగుతాడు. నిర్జీవ ప్రదేశానికి వెళ్లిన తర్వాత కొడుకును బలిచ్చేందుకు సిద్ధమవుతాడు. అయితే తన తండ్రి దైవం కోసం చేసే పనిలో కొడుకుపై మమకారం చూపితే అల్లాహ్‌కు ఆగ్రహం వస్తుందని భావించిన ఇస్మాయిల్ తండ్రిని కళ్లకు గంతలు క ట్టుకోమని సూచిస్తాడు. కుమారుడు చెప్పినట్టుగా ఇబ్రాహిం తన కళ్లకు గంతలు కట్టుకుని కత్తితో కుమారుడి గొంతు కోసేందుకు సిద్ధమవుతాడు. ఇబ్రాహిం భక్తికి చలించిపోయిన అల్లాహ్ ఇస్మాయిల్ స్థానంలో దుంబ (గొర్రె పోతు)ను ప్రవేశపెట్టడంతో ఇబ్రాహిం దానిని జుబాహ్ (కోయడం) చేస్తాడు. కళ్లకు కట్టిన గుడ్డను విప్పి చూడగా గొర్రె చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి ప్రతీ బక్రీద్ పండుగకు జంతువులను ఖుర్బానీ (బలి) ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కరువులేని దేశం మక్కా.. క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఇబ్రాహిం తన కొడుకు ఇస్మాయిల్‌తో కలిసి కాబాను నిర్మించారు. అనంతరం ఇక్కడ ఉండే ప్రజలు, ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేలా చూడాలని వారు అల్లాహ్‌ను ప్రార్థించారు. అంతేకాకుండా ఇక్కడి ప్రజలు కూడా సుఖ శాంతులతో, ఎలాంటి కరువు కాటకాలు లేకుండా జీవించేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నివ సించే, బతుకుదెరువు కోసం వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తారని ప్రజల విశ్వాసం. ముస్తాబైన ఈద్గాలు.. బక్రీద్ (ఈద్-ఉల్ అజ్హా) పండుగను జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. నమాజ్ కోసం ఈద్గాలు, మసీదు లు ముస్తాబయ్యాయి. ఉదయం 8 నుంచి 9 గంటలలోపు నమాజ్ చేసి ఖుర్బానీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
యూపీలో రెండు ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ
లక్నో: రంజాన్ పండగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలోని కర్కుదా గ్రామంలో రెండు ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఇరు వర్గాల వారు ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరుపుకోవడంతో పాటు రాళ్లు రువ్వుకున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఇరువర్గాల వారిపై పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. దాంతో వారు అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బలగాలను భారీగా మోహరించినట్లు చెప్పారు. స్థానిక ఛాపర్ వాలీ మసీదులో ముందు మేమే ప్రార్థనలు నిర్వహించాలని రెండు వర్గాలు పట్టబట్టాయి. ఆ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆ ఘర్షణలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. రాంపూర్, షహరాన్‌పూర్‌లో ఇటీవల రెండు మతస్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం విదితమే. ఆ ఘర్షణలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సహారన్‌పుర్‌లో కర్ప్యూ విధించారు. అయితే బుధవారం అయిదుగంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఘనంగా ఈదుల్ ఫితర్
కొత్త జుబ్బా పైజామాలు... సరికొత్త రంగురంగుల టోపీలు.. అత్తరు గుబాళింపులు... దూద్సేమియాల ఘుమఘుమలతో నగరంలో ఈదుల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే నగరంలోని వన్‌టౌన్, పూలబజార్, గడియారం ఆసుపత్రి ప్రాంతం, గడ్డా వీధి, పాతబస్టాండ్, రాజ్‌విహార్, కొత్తబస్టాండ్, మద్దూర్‌నగర్, క్రిష్ణానగర్, అబ్బాస్‌నగర్ తదితర వీధులలో ముస్లింల సందడి కనిపించింది. ఉదయం 8కే జొహరాపురం సమీపంలోని ఈద్గాలలో ఈదుల్ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఉదయం 9:30కి పాత ఈద్గాలో నమాజు ప్రారంభమైంది. పాత ఈద్గాలో జరిగిన ఈదుల్ ఫితర్ నమాజులో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గఫూర్, ఎస్పీ రవికృష్ణ పాల్గొన్నారు. సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలో ఉదయం 10:30 గంటలకు ఈదుల్ఫితర్ నమాజు ప్రారంభమైంది. ఆయా ఈద్గాలలో ప్రపంచలోని మానవులందరూ సుఖశాంతులతో నివసించేటట్లు భగవదనుగ్రహం లభించాలని దువా(ప్రార్థన) చేశారు. నమాజు అనంతరం ముస్లింలు రహదారులపై నడిచివస్తుండగా పలువురు హిందూమిత్రులు వారిని ఆలింగనం చేసుకొని ఈద్‌ముబారక్ తెలిపారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముస్లింలంతా రంజాన్‌ను ఘనంగా నిర్వహించుకున్నారు. - కర్నూలు, కల్చరల్ -
ముస్లిం సోదరులకు రానా, సినీ పరిశ్రమ శుభాకాంక్షలు
గాజాలో మరణించిన చిన్నారుల కోసం రంజాన్ పవిత్ర దినం రోజున ప్రార్థన నిర్వహించాలని బాలీవుడ్ ప్రముఖుడు అనురాగ్ బసు సూచించారు. ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం రోజున బాలీవుడ్, టాలీవుడ్, పలు రాజకీయ ప్రముఖులు శుభాంకాంక్షలు తెలిపారు. కులం, ప్రాంతం, భాషలకతీతంగా భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖులు ముస్లిం సోదరులకు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో తమ సందేశాలను పోస్ట్ చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో దగ్గుబాటి రానా, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, నయనతార, శరత్ కుమార్, జయం రవి తదితరులున్నారు. Eid Mubarak to everyone !! Lets pray for the people of GAZA & kids who lost their lives. pic.twitter.com/s4ucmX3SWW— anurag basu (@basuanurag) July 29, 2014 Eid Mubarak. Spread love and rise above hate it's one of my favourite days of the year— Varun Dhawan (@Varun_dvn) July 29, 2014 Eid Mubarak everyone. Wishing you all love, peace and prosperity always.— Akshay Kumar (@akshaykumar) July 29, 2014 Eid mubarak!! From the #kickteam love peace and happiness 😆 http://t.co/HmZSSy6xus— Jacqueline Fernandez (@Asli_Jacqueline) July 29, 2014 #eidmubarak to all my muslim friends— kajal agarwal (@KajalAgarwal) July 29, 2014 Eid Mubarak to one and all .— sHAhID kapooR (@shahidkapoor) July 29, 2014 The festival of Peace, Joy, Brotherhood. Eid Mubarak. May God bless all!— Suresh Raina (@ImRaina) July 29, 2014 U fasted,u prayed, U been good 4 a whole 30 days. So ur merciful ALLAH gave u a sign, Out came the moon 2 say come celebrate.. Eid mubarak!!— Rana Daggubati (@RanaDaggubati) July 29, 2014 Family time with my mom in law and kids. #EidMubarak http://t.co/Yfu7dxadXf— Farah Khan (@FarahKhanAli) July 29, 2014 Eid Mubarak! Day off frm shoot in pondy. Home sweet home. #biriyani 😁— Jayam Ravi (@actor_jayamravi) July 29, 2014 Eid mubarak to all my tweetos:) just going to gorge on the yummy Sheer korma sent home:) :)— SHILPA SHETTY (@TheShilpaShetty) July 29, 2014 Maybe it's a blasphemous thought but Eid is synonymous to Biryani for me. #EidMubarak— Ankur Tewari (@ankurtewari) July 29, 2014 Eid mubarak to all of you from me, Aalia and Omar. . Wishing u all love, joy and peace.:) have a wonderful day and wonderful year ahead.— Pooja Bedi (@poojabeditweets) July 29, 2014 Happy Birthday and Eid Mubarak to my friend and favourite Sanju @duttsanjay . Miss u and sending u loads of love and wishes. God bless— Farah Khan (@FarahKhanAli) July 29, 2014 Eid Mubarak to all my Muslim brothers & friends :) pic.twitter.com/c85lZU6df5— Gopi Mohan (@Gopimohan) July 29, 2014 Eid Mubarak all you wonderful people. Peace, prosperity and love to all of you. And yummy biryani and sevaiyan to me.— kunal kapoor (@kapoorkkunal) July 29, 2014 Eid Mubarak to all my friends.. Love,Peace and Happiness always..— satish kaushik (@satishkaushik2) July 29, 2014 Eid Mubarak! Blessings and love! Wish everyone peace and love! Forgiveness is the virtue of the strong!— Tanishaa Mukerji (@TanishaaMukerji) July 29, 2014 I wish all Sri Lankan Muslims a very happy Eid ul-Fitr. Your contributions to our unity and harmony is greatly valued. Eid Mubarak. -MR— Mahinda Rajapaksa (@PresRajapaksa) July 29, 2014 Eid Mubarak my friends!! Jashn jashn!!— Shreya Ghoshal (@shreyaghoshal) July 29, 2014 Eid Mubarak everyone...love n respect— Sidharth Malhotra (@S1dharthM) July 29, 2014 Eid Mubarak to all my brothers and sisters, may this day shower the divine blessings and guide us to peace prosperity and harmony— R Sarath Kumar (@realsarathkumar) July 29, 2014 Eid Mubarak to all of you. Happiness, peace and prosperity.— Abhishek Bachchan (@juniorbachchan) July 29, 2014 Eid Mubarak to everyone pic.twitter.com/ynrYmFsc03— Dr Raman Singh (@drramansingh) July 29, 2014 EID MUBARAK TO ALL 😬god bless u with peace ,happiness n togetherness lots of love to each one of u 😘 big hug😬😊😊 pic.twitter.com/f4ijazeGzJ— RAAI LAXMI (@iamlakshmirai) July 29, 2014 On the auspicious occasion of Eid, may you be blessed with peace, prosperity and happiness. Eid Mubarak everyone!— Vasundhara Raje (@VasundharaBJP) July 29, 2014 Eid Mubarak beautiful people. People give love effortlessly on Eid n also receive without hesitation. Let's learn to make everyday Eid.— Hrithik Roshan (@iHrithik) July 29, 2014 Eid Mubarak friends 🌙! May you be filled with Happiness, Peace and Blessings for all.🙏— Nayanthara✨ (@NayantharaU) July 29, 2014 -
దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు
-
ప్రత్యేక ప్రార్ధనలు చేసిన పఠాన్ బ్రదర్స్
-
ఈద్ ముబారక్
-
ఈద్ ముబారక్
కర్నూలు(కల్చరల్): ముప్పై రోజులుగా వినిపించిన ఔటు శబ్దాలు.. కనిపించిన సహేరీ ఇఫ్తార్ల సందళ్లు.. గుబాళించిన హలీమ్.. హరీస్‌ల ఘుమఘుమలు... ఇక నేటితో సెలవు చెప్పి వీడ్కోలు పలుకుతున్నాయి. రమ్యమైన రంజాన్ నెల వెళ్లొస్తానంటూ.. మేఘాల మాటున కనిపించీ కనిపించని నెలవంకకు సలాములు చెబుతూ వెళ్లిపోయింది. రంజాన్ చివరిరోజున అందరి మదిలో ఉల్లాసాలు నిండగా దూద్సేమియా పండగ వచ్చేసింది. మంగళవారం ఈదుల్ ఫితర్‌ను ముస్లింలు కనులపండువగా నిర్వహించుకోనున్నారు. సోమవారం సాయంత్రం నగరంలో హిందూ ముస్లింలు ఈద్‌ముబారక్ భాయ్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కరచాలనం చేసుకున్నారు. వన్‌టౌన్, చిత్తారి వీధి, పూలబజార్, చిన్నమార్కెట్ వీధి, గనీగల్లి, ఖడక్‌పుర, పెద్దమార్కెట్ వీధి, పాతబస్టాండ్ సమీపంలోని కొత్తపేట, ఉస్మానియా కాలేజీ వీధి, సంకల్బాగ్, మద్దూర్‌నగర్, సి.క్యాంప్, కృష్ణానగర్, అబ్బాస్‌నగర్, అమీన్ అబ్బాస్‌నగర్, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాల్లో రంజాన్ పండుగ కొనుగోళ్ల సందడి కనిపించింది. అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్, శ్రీనివాస క్లాత్ మార్కెట్, మించిన్బజార్లలో దుకాణాల వద్ద భారీ సంఖ్యలో మహిళలు గుమిగూడి వస్త్రాలు, టోపీలు, అత్తర్లు కొనుగోలు చేశారు. ఈద్గాకు వెళ్లే కంటే ముందే ఫిత్రా దానం ఈదుల్ ఫితర్ రోజున ముస్లిములు పేదలకు ఫిత్రా దానం చేయాలని రోజా మసీదు ఇమాం అబ్దుర్రజాక్ తెలిపారు. ప్రతి నిరుపేద ముస్లిం కుటు ంబం కూడా రంజాన్‌మాసం చివరి రోజైన ఈదుల్ఫితర్ను జరుపుకునేందుకే ఈ ఫిత్రా దానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత ఈద్గాలో ఉదయం 9:30 గంటలకు కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్ఫితర్ నమాజు జరుగుతుందన్నారు. ముస్తాబైన ఈద్గాలు నగరంలోని కొత్తబస్టాండ్ సమీపంలోని పాత ఈద్గా, సంతోష్‌నగర్ సమీపంలోని కొత్త ఈద్గా, వన్‌టౌన్‌లోని జమ్మిచెట్టు సమీపంలోని ఈద్గాలు ఈదుల్ఫితర్ నమాజు కోసం ముస్తాబయ్యాయి. ఈద్గా ప్రాంగణం శుభ్రపరచి, నీళ్ల సౌకర్యం, షామియానాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సి.క్యాంప్ మీదుగా కొత్తబస్టాండ్‌కు వెళ్లే వాహనాలను హైవే వైపుకు మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
రంజాన్‌కు భారీ ఏర్పాట్లు
చార్మినార్/బహదూర్‌పురా/సాక్షి, సిటీబ్యూరో: ఈద్-ఉల్-ఫితర్‌ను ఘనంగా జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రార్థనలను పురస్కరించుకుని ఈద్గాలను ము స్తాబు చేస్తున్నారు. పాతబస్తీలోని మీరాలం, మాదన్నపేట్, గోల్కొండ, సికింద్రాబాద్‌లోని ఈద్గాలతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఆ యా ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాతబస్తీ మీరాలం ఈద్గాను అన్ని హంగులతో ప్రార్థనలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. పండుగరోజు ఆంక్షలు.. సామూహిక ప్రార్థనల దృష్ట్యా మీరాలం ఈద్గా తదితర ప్రాంతాల్లో పండుగ రోజు ట్రాఫిక్ ఆం క్షలు విధించనున్నారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించనున్నారు. మీరాలం ఈద్గా క్రాస్ రోడ్డు నుంచి ఈద్గా వైపు ఎటువంటి వాహనాలను అనుమతించరు. శివరాంపల్లి, ఎన్పీఏ నుంచి బహదూర్‌ఫురా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హట్స్ టీ జంక్షన్ నుంచి అలియాబాద్ వైపు దారి మళ్లిస్తారు. బ్యాగులు, సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు వద్దు: డీసీపీ ఈద్గాలో సామూహిక ప్రార్థనలకు వచ్చే ముస్లిం లు తమ వెంట బ్యాగులు, సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులు తీసుకు రాకూడదని దక్షిణ మండలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠీ కోరారు. ఈద్గా వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించిన అనంతరమే సామూహిక ప్రార్థనలకు అనుమతిస్తామన్నారు. ఈద్గాల అభివృద్ధి: డిప్యూటీ సీఎం రాష్ట్రంలోని ఈద్గాలను అభివృద్ధి పరిచేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈద్-ఉల్-ఫితర్‌ను పురస్కరించుకొని పాతబస్తీ మీరాలం ఈద్గాను ఆదివారం ఉదయం ఆయన జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... తాడ్బన్ మీరాలం ఈద్గాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. మీరాలం ఈద్గా ముఖద్వారం వద్ద శాశ్వత కమాన్, మీరాలం ఈద్గా లోపల శాశ్వత షెడ్‌ను త్వరలో నిర్మిస్తామన్నారు. ఆయన వెంట బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజాం ఖాన్, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రత్యూమ్నా, పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ అధికారులు, కార్పొరేటర్లు మహ్మద్ మోబీన్, ఎంఏ గఫార్, అజీజ్ బేగ్, టీఆర్ఎస్ బహదూర్‌పురా నియోజకవర్గ ఇన్చార్జి ఎస్ఏ ఖైసర్, మహ్మద్ అబ్దుల్ గఫార్ ఖాన్ తదితరులు ఉన్నారు. -
సౌత్ కధలపై మనసుపడ్డ సల్లుభాయ్
-
ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకైన వేడుకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హజ్ యాత్ర సందర్భంగా మక్కా జనంతో కిటకిటలాడుతోంది. పలు దేశాల నుంచి తరలివచ్చిన ముస్లింలతో రద్దీగా మారింది. సివిల్ వార్ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వందలాది సిరియన్లు కూడా ఈద్‌ను జరుపుకుంటున్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని మేకలు, గొర్రెలు, ఒంటెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఈ సందర్భంగా ఢిల్లీ జామా మసీదు పోటెత్తింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదుకు చేరుకుంటున్నారు. సామూహికంగా నమాజులు పఠిస్తున్నారు. హైదరాబాద్‌లోని మీరాలం ఈద్గా, మక్కా మసీద్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
నమాజు పఠించిన ముస్లింలు
-
ఇరాక్‌లో బాంబు పేలుడు: ఎనిమిది మంది మృతి
ఉత్తర ఇరాక్‌లోని దక్షిణ కిర్క్లో ఓ మసీద్‌కు అత్యంత సమీపంలో ఈ రోజు ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఎనిమిది మంది మరణించారని పోలీసులు మంగళవారం వెల్లడించారు. మరో 12 మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ రోజు ఈద్ అల్ అద పండగ. ఈ సందర్బంగా మసీద్‌లో ప్రార్థనలు తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనాయని, అందు కోసం అధిక సంఖ్యలో ముస్లింలు మసీద్ చేరుకున్నారని తెలిపారు. అయితే పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఏ తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. అల్ ఖైదా తీవ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
మసీద్‌లో బాంబు పేలుడు: గవర్నర్ మృతి
పశ్చిమ అఫ్ఘాన్‌లోని పుల్-ఈ- అలం మసీద్ లో మంగళవారం ఉదయం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో లాగర్ ప్రావెన్స్ గవర్నర్ అరసల జమల్ మరణించారని ప్రభుత్వ అధికార ప్రతినిధి దిన్ మహమ్మద్ దర్విష్ కాబుల్‌లో వెల్లడించారు. మరో 15 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు. ఈ - అల్ - అదాహ్ పండగ సందర్బంగా ఈ రోజు ఉదయం పుల్ - ఈ - అలం మసీద్‌లో ప్రార్థనలు నిర్వహించేందుకు ముస్లీంలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉంచిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజీవ్ డివైజ్ (ఐఈడీ) ఒక్కసారిగా పేలిందన్నారు. అయితే ఆ ఘటనకు బాధ్యులం తామేనంటు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదని దిన్ మహమ్మద్ పేర్కన్నారు. -
ఇరాక్‌లో కారు బాంబు పేలుడు:14 మంది మృతి
ఇరాక్‌లోని సమర్రానగరంలో మార్క్ట్ వద్ద నిన్న సాయంత్రం కారు బాంబు పేలుడు సంభవించన ఘటనలో 14 మంది మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు.ఈద్- అల్- అదా పండగ సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మార్కెట్ వద్ద ఉన్న సమయంలో పేలుడు సంభవించింది. ఆ శబ్దానికి భయపడి ప్రజలు భయంతో పలు వైపులకు పరుగులు తీశారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఇరాక్‌లో ఇటీవల కాలంలో బాంబుపేలుళ్లు, ఆత్మాహుతి దాడులు నిత్యకృత్యమైపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వివిధ సంఘటనల్లో 6 వేలమంది పౌరులు మరణించారని, 14 వేల మంది గాయపడ్డారని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ పేర్కొంది. -
ఘనంగా ఈద్-ఉల్-ఫితర్
ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు జిల్లాలో ముస్లిం సోదరులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామ,గ్రామాన ఉన్న మసీదులు, ముఖ్యమైన ఈద్గాల వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖమ్మం నగరంలో వందలాది ఏళ్ల చరిత్రకల గాంధీచౌక్‌లోని ఈద్గావద్ద వేలాదిమంది ముస్లిం లు ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఈద్గాకు సదర్‌గా వ్యవహరిస్తున్న నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రార్థనలకోసం తగిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అతిపెద్దదైన మీనార్ కలిగిన ఖమ్మం ఖిల్లాలోని మజీద్-ఎ-నిమ్రాలో వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మజీద్-ఎ-నిమ్రా అధ్యక్షులు వాహెద్హుస్సేన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ప్రార్థనలకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలోని 45 మసీదులలో భారీ సంఖ్యలో రం జాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫిత్రా సొమ్ముకోసం ఈద్గాలు, మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో యాచకులు ఎదురుచూశారు. ఖమ్మం సమీపంలోని గొల్లగూడెం ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలలో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేత పొంగులేటిశ్రీనివాసరెడ్డి ఈద్గాను సందర్శించి ప్రార్థనల్లో పా ల్గొన్నారు. ఆయన ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అడిషనల్ ఎస్పి తఫ్సీర్ ఇక్బాల్ పలువురు ప్రముఖులు ఇక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. వెల్లివిరిసిన సోదరభావం రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు తమ ఇంటికి బంధువులు, స్నేహితులను, ఇరుగుపొరుగును ప్రత్యేకంగా ఆహ్వానించి పాయసం అందించారు. కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నగరవాసులు ముస్లిం సోదరుల ఇళ్లకువెళ్లి ఈద్‌ముబారక్ తెలిపారు. అందరూ కలసి పాయసం సేవించారు. అంతటా పండుగ వాతావరణం, సోదరభావం వెల్లివిరిసింది. అందరూ సుఖంగా ఉండాలి మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన పార్థనల సందర్భంగా మత పెద్దలు సందేశమిస్తూ విశ్వ మానవాళి సుఖ, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గాంధీచౌక్ లోని ఈద్గా వద్ద ఇమాం మౌలానా సఫ్దర్జ్రా ప్రసంగిస్తూ మహ్మద్ ప్రవక్త ద్వారా సర్వశక్తి వంతుడైన అల్లాహ్ ప్రపంచ శాంతికోసం పంపిన సందేశాన్ని వినిపించారు. ప్రపంచంలోని ముస్లింలు మాత్రమే కాక అన్ని జాతులు, మతాల వారు ఆనందంగా ఉండటానికి వీలుగా కరుణ చూపాలంటూ అల్లాహ్‌ను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్, సయ్యద్బుడన్సాహెబ్, సయ్యద్ సిరాజుద్దీన్, అహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. జైన్-ఉల్-అబిదిన్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్అసద్, గ్రామీణవైద్యుల సంఘ జిల్లా మైనారిటీ నేత నూర్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రముఖ మసీదులైన కమాన్‌బజార్‌లోని జమా మసీదులో ఇమాం సయ్యద్ అబ్దుల్ అజీజ్, కుతుబ్ షాహి మసీదులో ఇమాం మహ్మద్ సుబూర్, గాంధీచౌక్ లోని ఈద్గా వద్ద ఇమాం మౌలానా సఫ్దర్జ్రా,మజీద్ ఖ్వాసాలో హఫీజ్ మహ్మద్ అహ్మద్ ముస్లిం సోదరులతో ప్రత్యేక నమాజ్‌లు చేయించారు. మార్కెట్ మసీదు, బికె బజార్‌లోని జైన్-ఉల్-అబిదిన్ మసీదు, నిజాంపేట మసీదు, శుక్రవారపేటలోని తబేలా మసీదు, కస్బా బజార్‌లోని ఖాజీపుర మసీదు, ప్రభాత్ టాకీస్ సమీపంలోని గంధేషహీద్ మసీదు, కాల్వొడ్డులోని మోతి మసీదు, పాకబండ బజార్, ముస్తాఫానగర్, బుర్హాన్పుర తదితర ప్రాంతాలలోని మసీదులలో వేలాది మంది రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేటినుంచి 6రోజులు ఉపవాస దీక్షలు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం రంజాన్ పర్వదినం మరుసటిరోజు (షవ్వాల్ నెల రెండవ రోజు) నుంచి 6 రోజుల పాటు ఉపవాసదీక్షలను ముస్లింలు పాటిస్తారు. అయితే రంజాన్ నెలలో రోజాను ముస్లింలందరూ ఖచ్చితంగా పాటిస్తారు. రంజాన్ పండగ రోజు అనంతరం షవ్వాల్‌లో పాటించే ఈ ఉపవాసాలను మాత్రం ఆరోగ్యం ఇతర పరిస్థితుల దృష్ట్యా వీలయిన వారు పాటిస్తారు. -
ఘనంగా రంజాన్
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: ముస్లింల పవిత్రమాసం రంజాన్ ముగిం పు సందర్భంగా శుక్రవారం రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) పండుగను జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలు ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నూతన వస్త్రాలు ధరిం చి సామూహికంగా ప్రార్థనా స్థలాల్లో పాల్గొని ప్ర త్యేక పండుగ నమాజ్‌ను చదివి సర్వ మానవాళి క్షేమం కోరుతూ అల్లాహ్‌ను వేడుకున్నారు. హిం దూ, ముస్లిం సోదరులు ఒకరినొకరు అలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన కొందరు ముస్లిం లు ఫిత్రా (దానధర్మాలు) చేశారు. పలువురు ప్ర జా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. నెల రో జులపాటు ఉపవాస దీక్షను కొనసాగించిన ము స్లింలు చివరి రోజు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వానగట్టు వద్దనున్న ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా జామియా మసీదు ఇమామ్ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. ప్రముఖుల శుభాకాంక్షలు... రంజాన్ పవిత్ర మాసం అనంతరం శుక్రవారం ఈద్ఉల్ ఫితర్‌ను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరుఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, కలెక్టర్ గిరిజాశంకర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్పీ నాగేంద్రకుమార్, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు.. రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు, ఆ శాఖ అధికారులు కూడా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
ఘనంగా ఈద్ వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈద్‌ను పురస్కరించుకుని రాజధాని నగరంలోని అన్ని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో పాత ఢిల్లీ పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం వేలాదిగా తరలివచ్చిన ముస్లింలతో జామా మసీద్ పరిసరాలు సంద డి సందడిగా కనిపించాయి. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రార్థనల్లో పాల్గొన్న చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెల్లటి దుస్తుల్లో ఉన్న ముస్లింలు వేలాదిగా ఒకచోట చేరి ప్రార్థనలు చేయడంతో పాతబస్తీ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రార్థనల అనంతరం పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పత్యేక ప్రార్థనలతో ఢిల్లీలోని జామా మసీద్‌తోపాటు ఫిరోద్షా కోట్లా మసీద్, సప్దర్‌జంగ్ మసీద్, ఫతేపురి మసీద్, దరియాగంజ్‌లోని ఘటామసీద్, ఢిల్లీగేట్ సమీపంలోని జీన్వాలీ మసీద్, కశ్మీరీగేట్‌లోని షియామసీద్లు కిటకిటలాడాయి. ప్రార్థనల అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన షీర్(రంజాన్ప్రత్యేక వంట కం)రుచులను బంధుమిత్రులతో కలిసి ఆస్వాదించారు. వీటితోపాటు చికెన్ కుర్మా, మటన్ తది తర వంటకాలతో సామూహిక భోజనాలు చేశారు. ‘అందరికి మంచి జరగాలని, దేశంలో శాంతి చేకూరాలని, దేశంలోని అందరికి తినడానికి తిండి దొరకాలని’ కోరుకున్నామని ఏపీ భవన్ ఉద్యోగి గౌస్మహ్మద్ తెలిపారు. వరుణుడూ పాల్గొన్నాడు... నగరంలో శుక్రవారం జరుపుకున్న రంజాన్ వేడుకల్లో వరుణుడూ పాల్గొన్నాడు. ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించినా కాసేపటికే ఆకాశం మేఘావృతమైంది. అప్పటికే ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్లింలు మసీదులకు చేరుకున్నారు. సరిగ్గా ప్రార్థనలు ప్రారంభమవుతాయనుకునే సమయంలోనే చిరుజల్లులతో నగరవాసులను పలకరిం చాడు. అయితే జోరువాన కాకపోవడంతో తుంపరతుంపరలుగా పడుతున్న వానలోనే నగరవాసులు ఈద్‌ను జరుపుకున్నారు. కురుస్తున్న జల్లులను అల్లా ఆశీర్వాదంగా కొందరు అభివర్ణించారు. పిల్లలు, పెద్దలు కూడా వానను ఆస్వాదించారు. -
ఈద్ ప్రార్థనలకు హఫీజ్ సయీద్ నేతృత్వం!
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ నేతృత్వంలో శుక్రవారం లాహోర్‌లోని విఖ్యాత గడాఫీ స్టేడియంలో ఈద్ ప్రార్థనలు జరిగాయి. సయీద్‌తో కలిసి వేలాది మంది రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు నగరంలోని పలు ప్రాంతాలలో సయీద్ ఫొటోతో కూడిన పోస్టర్లు వెలిశాయి. దీనికి కొన్నిగంటల ముందు.. కాశ్మీర్, పాలస్తీనా, బర్మాల్లో అణచివేతకు గురైనవారు స్వేచ్ఛా వాయువుల్లో ఈద్ జరుపుకునే సమయం దగ్గర్లోనే ఉందని ఈ ఉగ్రనేత ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. ‘ఈ పరీక్షా సమయంలో మేము మీకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. త్వరలో మీ విజయానంతరం ప్రపంచం యావత్తూ మీకు ఈద్ ముబారక్ చెబుతుంది. మీ త్యాగాలు వృథా పోవు. దేవుణ్ని స్తుతిస్తాం. ఇస్లాం బలపడుతుంది. ఆ సమయం అతి సమీపంలోనే ఉంది.. కాశ్మీర్’ అంటూ (@HafizSaeed JUD) ఉపదేశమిచ్చాడు. జమాద్-ఉద్-దవా ఉగ్రసంస్థ అధినేత అయిన సయీద్ తలపై కోటి డాలర్ల రివార్డు ఉంది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన పేలుళ్లకు కుట్ర పన్నిన సయీద్‌ను కఠినంగా శిక్షించాలని భారత్ అనేకమార్లు పాక్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక ర్యాలీలనుద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నోసార్లు కన్పించాడు. కానీ ఆ దేశం మాత్రం అతనికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లేవంటూ వెనకేసుకొస్తోంది. ముంబై ఉగ్ర డాడుల్లో ఆరుగురు అమెరికన్లతో పాటు మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. -
భక్తి శ్రద్ధలతో రంజాన్
పవిత్రమాసంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం (09-08-2013) ముస్లింల ప్రార్థనలతో నగరంలో ఈద్గాలు, మసీదులు కళకళలాడాయి. ఉదయం 8 గంటల నుంచే ప్రార్థనాలయాలకు వేలాదిమంది తరలివచ్చారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఉల్లాసంగా గడిపారు. మక్కామసీదులో ముస్లింల ప్రార్థనల మీరాలం ఈద్గాలో... చార్మినార్ వద్ద దానం చేస్తూ... చిలకలగూడ ఈద్గా: చిన్నారులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే జయసుధ భద్రతాసిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్న చిన్నారులు చిలకలగూడ ఈద్గాలో ... లాలాగూడ: రంజాన్ వేడుకల్లో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఎల్బీనగర్ మజీద్గల్లీ వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్న పుత్తా ప్రతాప్‌రెడ్డి మియాపూర్ ఆదిత్యనగర్ కాలనీలోని ఈద్గాలో... రంజాన్ వేడుకల్లో కొత్వాల్ అనురాగ్ శర్మ రంజాన్ సందర్భంగా భోలక్‌పూర్‌లో ఒంటెలపై ఊరేగుతున్న చిన్నారులు భోలక్‌పూర్ బడీ మసీద్‌లో... అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ లో... -
బెంగాల్ మైనారటీలకు దీదీ వరాల జల్లు
ఈద్ పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత దీదీ రాష్ట్రంలోని మైనారటీ వర్గాలకు వరాల జల్లు కురిపించారు. నగరంలోని రెడ్ రోడ్డులో ముస్లిం సోదరులతో కలసి దీదీ శనివారం ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ... రాష్ట్రంలోని మైనారటీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని ముస్లిం సోదరులకు మమత దీదీ హామీ ఇచ్చారు. అందులో భాగంగా మైనారటీ వర్గాలకు చెందిన చిన్నారులు, విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్యం, ఇతర ఉన్నత విద్యా రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆమె ఆకాంక్షించారు. అందుకోసం మైనారటీ వర్గాలు ఉన్నత విద్యా అభ్యసించేందుకు రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. అలాగే వివిధ జిలాల్లోని మైనారటీలు వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని మమత ఈ సందర్భంగా తెలిపారు. ముస్లిం సోదరులకు మమత ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. -
దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు
దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు తమ ఉపవాస దీక్షలను విరమించి పండగ చేసుకుంటున్నారు. ఇఫ్తార్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి రంజాన్ పండుగ, శుక్రవారం కలిసి రావడంతో ముస్లింలు మరింత ఆనందంగా ఉన్నారు. లక్షలాది మంది ముస్లింలు సంప్రదాయ దుస్తులు ధరించి తమకు సమీపంలో ఉన్న మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మక్కామసీద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసదీక్షలు నిర్వహించిన ముస్లిం సోదరులు.. దీక్షలకు పరిపూర్ణ ఫలితం లభించే రంజాన్ పండుగ రోజున సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆలింగనాలు, కరచాలనాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ముంబైలోని దహీసర్, బొరివ్లి, జోగేశ్వరి, అంధేరి, మారోల్, బాంద్రా, సియాన్, బైకుల్లా, మాజాగావ్, ఘట్కోపర్, ఇతర ప్రాంతాలు ప్రత్యేకప్రార్థనల సందర్భంగా జనసంద్రంగా మారాయి. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పవిత్ర సందేశాన్ని అందించారు. గడిచిన రెండు దశాబ్దాల్లో తొలిసారిగా చారిత్రక ఆజాద్ మైదాన్‌లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరగలేదు. భారీ వర్షం కురుస్తుండటం వల్ల బహిరంగ ప్రదేశం కావడంతో ఇక్కడ ప్రార్థనలు నిర్వహించలేదని నాగ్‌పాడలో నివసించే సయ్యద్ జాఫర్ తెలిపారు. మహారాష్ట్రలోని థానె, రాయగఢ్, రత్నగిరి, పుణె, నాసిక్, ఔరంగాబాద్, బీద్, నాందేడ్, ఇతర జిల్లాల్లో కూడా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. -
ముస్లింలకు ప్రముఖుల ఈద్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకొంటున్న ముస్లింలకు వివిధ దేశాధినేతలు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత సమైక్యతకు ఈ పండుగ దోహదపడాలని రాష్ట్రపతి ప్రణబ్ గురువారం విడుదల చేసిన తన సందేశంలో ఆకాంక్షించారు. ఈ పర్వదినం శాంతి సామరస్యాలకు, సౌభ్రాతృత్వానికి, పురోగతికి దోహదపడాలని ప్రధాని మన్మోహన్ ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒబామా సంక్షోభంతో సతమతమవుతున్న సిరియాకు మానవతా సాయంగా రూ.1,184 కోట్లుఅదనపు సాయాన్ని ప్రకటించారు. భారత్‌లోని కేరళ రాష్ట్రంతో పాటు ఇండోనేసియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాల్లో ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని గురువారం నాడే జరుపుకున్నారు. -
‘అబ్రామ్’ మీడియాకు దూరంగా ఉండటమే మంచిది : షారుక్
‘ఈ రంజాన్ పండగ చాలా ప్రత్యేకమైనది’ అని ముంబైలోని తన నివాసం 'మన్నత్' లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అన్నాడు. రంజాన్ పండగ రోజు తాను నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ విడుదలతోపాటు..ఓ అద్బుతమైన చిన్నారి అబ్రామ్ తమ కుటుంబంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు. ఇలాంటి ఆనందక్షణాలు తనకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయని, గత తొమ్మిది రోజులుగా చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉండటం కారణంగా తాను సరిగా నిద్ర కూడా పోలేదని, అయినా తాను చాలా ఎనర్జిటిక్ ఉన్నానని అన్నారు. మే 27 తేదిన సర్రోగసి ద్వారా షారుఖ్ ఓ బిడ్డకు తండ్రి అయిన విషయం తెలిసిందే. సర్రోగసి వివాదం షారుక్‌ను ఇంకా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. తన కుమారుడు అబ్రామ్ను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంచాలని అనుకుంటున్నానని.. అంతకంటే ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అని అన్నాడు. ఇప్పటికే అబ్రామ్పై చాలామంది ఎక్కువగానే మాట్లాడారని, అయితే ఆ సమయంలో అసత్యాలు మాట్లాడుకోవడం కాస్తా బాధేసింది అని అన్నాడు. తన జీవితంలోకి ప్రవేశించిన చిన్నారిపై అవాస్తవాలు మాట్లాడటంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. తన కుమారుడు అబ్రామ్ గురించి కాని, ఆరోగ్యం గురించి కాని మాట్లాడటానికి నిరాకరించాడు. -
'తెలంగాణ' ఏర్పాటు సరైన చర్య కాదు: ప్రమోద్ బోరా
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు సరైన చర్య కాదని అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్యు) అధ్యక్షుడు ప్రమోద్ బోరా మంగళవారం రాటలో జరిగిన విలేకర్ల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఓ విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలు కలసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఏబీఎస్యు ఇచ్చిన 15 వందల గంటల బంద్ నిరాటంకంగా సాగుతోంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలం అంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దాంతో దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వివిధ సంస్థలకు ఊపిరిలూదినట్లు అయింది. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులకుపైగా నిత్య నిరసనలు, తీవ్ర ఆందోళనలతో అసోం రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజ జీవనం అస్తవ్యస్తమైంది. కార్బి అంగ్లాంగ్ జిల్లాను ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలని రెండు సంఘాలు 64 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలోని అన్నిపార్టీల నేతలు యూపీఏ చైర్మన్ సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసేందుకు న్యూఢిల్లీ పయనమైయ్యారు. అయితే జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా అంత సవ్యంగానే ఉందని కార్బి అంగలాంగ్ జిల్లా అధికారులు తెలిపారు. దాంతో ఆరుగంటలపాటు కర్ఫ్యూ ను సడలించినట్లు చెప్పారు. జిల్లాలోని మంజలో పారెస్ట్ కార్యాలయన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను భద్రత దళాలు అరెస్ చేసినట్లు చెప్పారు. బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూడీపీఎఫ్ సోమవారం పిలుపు నిచ్చింది. దాంతో దిగువ అసోంలోని అయిదు జిల్లాలు పూర్తిగా ప్రజాసేవలు నిలిచిపోయాయి. దాంతో జనాలు ఇళ్లకే పరిమితమైనారు. అయితే ఈద్ పండగ నేపథ్యంలో బంద్ పాక్షికంగా నిర్వహించాలిన 60 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీఎస్‌యూ నిర్ణయించింది. అలాగే 11 రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే వెల్లడించింది. అలాగే రాజధాని, సరయిగాట్,కామరుప్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు బ్రహ్మపుత్ర మెయిల్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికార ప్రతినిధి పేర్కొన్నారు.