దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు గురువారం ఈద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. చారిత్రక జామా మసీదు, ఫతేపూరి మసీదు, హజ్రత్ నిజాముద్దీన్ తదితర మసీదుల వద్ద భారీ సంఖ్యలో ముస్లింలు నమాజు నిర్వహించారు. కొన్నిచోట్ల మతసామరస్యాన్ని చాటుతూ.. హిందూ సోదరులను కూడా పండుగకు ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. లక్నోలోని ఐష్‌బాగ్ ఈద్గాలో తొలిసారిగా మహిళలకూ ప్రవేశం లభించింది.
పశ్చిమబెంగాల్ మాల్దాలో ఈద్ వేడుకల్లో సెప్టిక్ ట్యాంక్ కుంగిపోవటంతో పదేళ్ల బాలుడు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. ఈద్ సందర్భంగా ఆమిర్ ఖాన్ తన కుమారుడికి పండుగ కానుకగా కేవలం 2 రూపాయలిచ్చారు. ఇచ్చారు. ఈద్ సందర్భంగా పాకిస్తాన్‌లో బైక్‌తో ప్రమాదకరమైన విన్యాసాలు చేసి పది మంది మృతి చెందారు. వందమందికి గాయాలయ్యాయి.