prayer
-
CJI Chandrachud: అయోధ్య సమస్య పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించా
పుణే: రామ జన్మ భూ మి–బాబ్రీ మసీదు వి వాదం పరిష్కారం కోసం భగవంతుడిని ప్రార్థించానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ఆయన కచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాడని అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకా కన్హేర్సార్. ఈ గ్రామ ప్రజలు ఆదివారం ఆయనను సత్కరించారు. కేసుల విచారణ సమయంలో న్యాయమూర్తులకు కొన్నిసార్లు పరిష్కార మార్గాలు కనిపించవని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. అయోధ్య వ్యవహారంపై విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందన్నారు. అప్పుడు భగవంతుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థించానని, సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నానని తెలిపారు. తాను తరచుగా దేవుడిని ప్రార్థిస్తుంటానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా 2019 నవంబర్ 9న అప్పటి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఒక సభ్యుడే. -
మోదీ మరోమారు ప్రధాని కావాలంటూ ప్రార్థనలు!
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అదే సమయంలో శ్రీరాముడు కొలువైన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని భగవంతుణ్ణి వేడుకుంటూ యాగాలు, ప్రార్థనలు ప్రారంభించారు. బాబ్రీ మసీదు కేసు న్యాయవాది ఇక్బాల్ అన్సారీ ఖురాన్ పఠించి, ప్రధాని మోదీ మూడవసారి ప్రధాని కావాలని వేడుకున్నారు. అలాగే జగద్గురు పరమహంస ఆచార్య.. మోదీ కోసం ప్రార్థనలు చేశారు. అయోధ్య మతపరమైన నగరమని, ఇక్కడి ప్రజల ప్రార్థనలు దేవతలు తప్పకుండా వింటారని, ఇక్కడ ఏ పూజ చేసినా, ప్రార్థించినా దైవం స్వీకరిస్తాడని ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. అయోధ్యలోని తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రధాని మోదీ పాలన దేశానికి, ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. అందుకే దేశ ప్రజలంతా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలన్నారు. -
ఇడుపులపాయ:క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్
-
సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోగల సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి నేటికి (బుధవారం) సరిగ్గా 11 రోజులు అయ్యింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఈ సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ నేపధ్యంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. బాధిత కార్మికులను రక్షించేందుకు ఓన్జీసీ, ఎస్జేవీఎన్ఎల్, ఆర్వీఎన్ల్, ఎన్‌హెచ్‌డీసీఎల్ బృందాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలోని పూరీ నగరానికి చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత, రక్షణను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి ప్రతిగా ఇసుకతో ఒక కళాఖండాన్ని రూపొందించారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యత అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు.. #WATCH पुरी, ओडिशा: रेत कलाकार सुदर्शन पटनायक ने उत्तरकाशी में सुरंग में फंसे श्रमिकों की सुरक्षा और बचाव के लिए प्रार्थना करने के लिए रेत से एक कलाकृति बनाई। (21.11) pic.twitter.com/YSmCnML9ZY — ANI_HindiNews (@AHindinews) November 22, 2023 -
పారిస్ ఎయిర్ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య నెల రోజులుగా యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం డిపార్చర్ హాల్లో 30 మంది ముస్లింలు నమాజ్ చేశారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో ఈ ప్రార్థనలు జరిగాయి. ఈ ఉదంతంపై ఫ్రాన్స్ మాజీ మంత్రి నోయెల్ లెనోయ్ స్పందిస్తూ ఎయిర్ పోర్టులో నమాజ్ చేయడం విచారకరమని అన్నారు. ప్రార్థనల కోసం తగిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయని, అక్కడ వీటిని నిర్వహించుకోవాలని అన్నారు. ఎయిర్ పోర్టులో ఇలాంటి చర్యలను అరికట్టాలని, నిఘా మరింతగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విమానాశ్రయం ప్రార్థనా స్థలంగా మారినప్పుడు సీఈఓ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా ‘విమానాశ్రయంలో ప్రత్యేక ప్రార్థన స్థలం అందుబాటులో ఉందని, ఎయిర్‌పోర్టులో నిబంధనలను అమలు చేసేందుకు విమానాశ్రయ అధికారులు కట్టుబడి ఉన్నారని ఫ్రెంచ్ రవాణా మంత్రి క్లెమెంట్ బ్యూన్ ట్విట్టర్లో తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధ నేపధ్యంలో ముస్లింలకు మద్దతుగా పారిస్ ఎయిర్‌పోర్టులో నమాజ్ చేశారని భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: మనిషి దీర్ఘాయుష్షు ఎంత? -
మహానేత వైఎస్సార్‌కు ఘనంగా స్మృత్యంజలి
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా శనివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా స్మృత్యంజలి ఘటించారు. ప్రత్యేకంగా అలంకరించిన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనుబంధాన్ని తలచుకున్నారు. ఈ సందర్భంగా దివంగత మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులందరితో పాస్టర్ నరేష్‌బాబు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైవీ స్వర్ణమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ సుగుణమ్మ, డాక్టర్ ఈసీ దినేష్రెడ్డిలతో కలిసి వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, పోతుల సునీత, రమేష్ యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, డాక్టర్ సు«ధా, ఎస్.రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లికార్జునరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి పాల్గొన్నారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీఐజీ సెం«థిల్కుమార్, జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, జేసీ గణేష్‌కుమార్ తదితర అధికారులు సీఎం వెంట ఉన్నారు. అనంతరం ఇడుపులపాయలో వైఎస్ కుటుంబీకుల ప్రార్థన మందిరం సమీపంలో సింహాద్రిపురం నేతలతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకు ముందు అనంతపురం జిల్లా నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్న సీఎంకు ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు స్వాగతం పలికారు. వైఎస్సార్‌కు షర్మిల నివాళి వేంపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం 8.10 గంటలకు వైఎస్సార్ సతీమణి విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణితో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు. -
ఆసియాలో అతిపెద్ద చర్చి కరుణాపురంలో
ఎటుచూసినా ఉట్డిపడుతున్న కళాసంపద...జెరూసలెం నుంచి తెచ్చిన మట్టి..బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు.. భక్తులే భాగస్వాములై రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లోపాలుపంచుకున్న వైనం.. ఏకకాలంలో సుమారు 30 వేల మంది ప్రార్థన చేసుకొనే వీలు.. ఇవీ వరంగల్ శివారు కరుణాపురంలో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నిర్వాహకులు పేర్కొంటున్న ఈ ప్రార్థనా మందిరం ఈ నెల 4న అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంబోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, అన్ని వర్గాల వారిని అహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు, దైవజనులు పాల్సన్రాజ్, జయప్రకాష్లు తెలిపారు. లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. అద్భుత కట్టడంగా.. కరుణాపురం క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం అపురూప కట్టడంగా దర్శనమిస్తోంది. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేశారు. రెండంతస్తుల్లో హాల్‌ను రూపొందించారు. చర్చి నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 70 కోట్లు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా, మొత్తంగా 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఇందులో ఒకేసారి 30 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. వికీపీడియా ప్రకారం ఆసియాలో అతిపెద్ద చర్చిగా నాగాలాండ్‌లోని జున్హెబోటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చి ఉంది. ఆ చర్చి పొడవు 203 అడుగులు, వెడల్పు 153 అడుగులు, ఎత్తు 166 అడుగులు. అందులో ఏకకాలంలో 8,500 దాకా ప్రార్థనలు చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కరుణాపురంలో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్‌తో అనుబంధంగా ఉండటం విశేషం. ప్రత్యేకతలు ఇవీ.. ♦ చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని (డోమ్) అమెరికా నుంచి తెప్పించారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం కొనుగోలు చేశారు. ♦ మందిరం లోపల రీసౌండ్ రాకుండా సౌండ్‌ప్రూఫ్ మెటీరియల్ అద్దారు. ♦ భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ♦ ప్రార్థనామందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు. ♦ పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు. చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని అద్దాల చిత్తరువులతో రూపొందించారు. ♦ ఎల్ఈడీ స్క్రీన్స్‌తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ♦ చుట్టూ దీపస్తంభాలు.. ఇంకుడు గుంతలు నిర్మించారు. ♦ భవనం శంకుస్థాపనలో జెరూసలెం నుంచి మట్టి.. బైబిల్లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్లు వేశారు. చర్చి చుట్టూ ఆలివ్ (ఏసుక్రీస్తు ప్రార్థనలు ఈ ఆలివ్ చెట్ల మధ్యనే ప్రార్థనలు చేసేవారు) చెట్లు ఏర్పాటు చేశారు. -
Ramadan Month: నేటి నుంచి రంజాన్..
సాక్షి, హైదరాబాద్: నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా, మూడేళ్లుగా కరోనాతో నగరంలో రంజాన్ సందడి అంతగా కనిపించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో రంజాన్ కళ మళ్లీ తిరిగి రానుంది. ఒకవైపు ముస్లింలు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ..మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, ఫలాలు కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి. చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మల్లేపల్లితో, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్లు వెలిశాయి. వ్యాపార సంస్థలను రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ఆదర్శ జీవనానికి రంజాన్ మాసం ప్రేరణ: సీఎం సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రమైన రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంత జీవనం దిశగా ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ఖురాన్ పఠనం, ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, జకాత్, ఫిత్రా వంటి ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత, జీవిత పరమార్థం అవగాహనలోకి వస్తాయని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. -
రామ్ చరణ్ - ఉపాసన.. ఎక్కడికెళ్లినా ఆ విషయాన్ని మర్చిపోరు!
మెగా హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ జంట సందడి చేసింది. మరికొన్ని నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ కార్యక్రమానికి వెళ్లేముందు ఈ జంట పూజలు చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాకుండా భారతీయ సంప్రదాయ దుస్తులో ఈ జంట వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది మా ఆచారంతో పాటు భారతదేశానికి సంప్రదాయం ఉట్టిపడేలా చేస్తుంది. ఈ రోజును కృతజ్ఞతలు తెలుపుతూ ప్రారంభించడం మనందరికీ చాలా ముఖ్యం. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ ధరించిన దుస్తులపై ఉన్న బటన్లు నిజానికి నాణేలు, వీటిని భారత్ చిహ్నంతో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన ఉపాసన తెలంగాణ కళాకారులు తయారు చేసిన పట్టు చీరలో కనిపించారు. కాగా.. 95వ ఆస్కార్ వేడుకల్లో RRRలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ అవార్డును ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కాగా.. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ జోడిగా నటిస్తోంది. -
ప్రతికూలమూ అనుకూలమే!
ఎదురుదెబ్బలు తగిలితే మనం బెదిరి పోకూడదు; పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మనం చెదిరి పోకూడదు. ఏ పరిణామానికీ మనం బెదిరి పోకూడదు; ఏ పర్యవసానానికీ మనం చెదిరి పోకూడదు. బెదిరి పోయి భయపడుతూ ఉండడం జీవనం కాకూడదు; చెదిరి పోయి చతికిలపడి పోవడం జీవితం కాకూడదు. జీవనగతి ప్రగతిని, జీవితస్థితి అభ్యున్నతిని ΄పొందాలి. ‘ఇప్పుడు ఇది అంతం కాదు; ఇది అంతానికి ఆరంభం కూడా కాదు; కానీ ఇది ఆరంభానికి అంతం కావచ్చు’ అని విన్స్ టన్ చర్చిల్ చెప్పిన మాటల్ని ఆలోచనలోకి తీసుకుని ఎదురుదెబ్బలు తగిలినప్పడూ, పరిస్థితులు ప్రతికూలించినప్పుడూ మనం ప్రతిస్పందించాలి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడూ, ప్రతికూలమైన పరిస్థితులప్పడూ మన గతి అంతమై పోయిందనో, మనం ఇక ఇంతే అనో కాకుండా కొత్త ఆరంభానికి ఇది అంతం అయి ఉండచ్చు అన్న ఆశాభరితమైన ఆలోచనతో మనం భవిష్యత్తును చేపట్టేందుకు ఉద్యుక్తులం అవ్వాలి. ఎదిగినవాళ్లందరూ ఎదురుదెబ్బలు తిన్నవాళ్లే. ప్రయోజకులు అయిన వాళ్లందరూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లే. ఏ తరుణంలో అయినా మన తీరే మనకు మేలు చేస్తుంది, మనల్ని మేలైనవాళ్లను చేస్తుంది. ‘వర్తమాన క్షణాలలో ఉన్న దాన్ని అంగీకరించు నువ్వే దాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా’ అని జర్మన్ తాత్త్వికుడు ఎక్‌హార్ట్ టోల్ సరైన సూచన చేశారు. తగిలిన ఎదురుదెబ్బల్ని , ప్రతికూల పరిస్థితుల్ని మనం అంగీకరించాలి. నిజానికి అవి మనం ఎంపిక చేసుకున్నవి కాక పోయినా జరిగాయి కాబట్టి వాటిని మనం అంగీకరించాలి. అంగీకరించకుండా మనల్ని మనం మభ్యపెట్టుకోవడంవల్ల, వాటి దెబ్బకు కుంగి పోవడం వల్ల మనం వాటిని అధిగమించలేం. వాటిని మనం అధిగమించి తీరాలి. ఎదురు దెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించిన జీవితమే విజయవంతమైన జీవితం అవుతుంది. జీవితం అంటూ ఉన్నాక అది విజయవంతం అవ్వాలి. అబ్రహం లింకన్ 1831లో వ్యాపారంలో విఫలం అయ్యాడు. 1832లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయాడు. 1833లో వ్యా΄ారంలో మరోసారి విఫలమయ్యాడు. 1835 లో తీవ్రమైన నరాల జబ్బుతో బాధపడ్డాడు. 1838 లో స్పీకర్ పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1840లో ఎలక్టర్ పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1843, 48లలో కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి పోటీ చేసి ఓడి పోయాడు. 1855 లో సెనెట్‌కు పోటీ చేసి ఓడి పోయాడు. 1856లో ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1858 లో సెనెట్‌కు పోటీ చేసి ఓడి పోయాడు. 1860లో అమెరికా అధ్యక్షుడయ్యాడు. అబ్రహం లింకన్ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు; ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించినందుకు పొందిన విజయంగా ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఎదురుదెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించగలిగితే ఏం సాధించవచ్చో అబ్రహం లింకన్ జీవితం తెలియజేస్తోంది. ప్రపంచచరిత్రలో ఇటువంటి ఉదంతాలు చాల ఉన్నాయి. ఎదురుదెబ్బలు, ప్రతికూల పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అవి ఉంటూనే ఉంటాయి. మనకు ఎదురు దెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించాలన్న సంకల్పం, ప్రయత్నం బలంగా ఉండాలి. ఆశ, ఆకాంక్ష, ఆసక్తి ఈ మూడూ మనిషి ప్రగతికి, అభ్యున్నతికి ఎంతో ముఖ్యం. వీటికి తోడుగా లేదా ఊతంగా నమ్మకం అనేది ఉండాలి. ‘ఓ నమ్మకమా! మాకు నమ్మకాన్నివ్వు, భయం నుంచి విముక్తి నివ్వు, అంతులేని సంపదలకు మమల్ని అధిపతుల్ని చెయ్యి...’ అంటూ సాగుతూ వేదంలో ఒక ప్రార్థన ఉంది. మనకు నమ్మకం కావాలి; మనం నమ్మకాన్ని నమ్ముకోవాలి. మన సంకల్పాన్ని, ప్రయత్నాన్ని నమ్ముకుని ఎదురుదెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి మనం రాణించాలి, రాజిల్లాలి. – రోచిష్మాన్ -
శివుడి ఎదుట మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్న మేక.. ఏం కోరుకుందో ఏమో?
జంతువులు దేవుళ్లను ప్రార్థించడం ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చూసే ఉంటాము. కాగా, తాజాగా ఓ మేక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివుడి గర్భగుడి ముందు ఓ మేక మొకాళ్ల మీద నిలబడి ప్రార్ధనలు చేసింది. దీంతో, మేకకు చూసిన భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ ఘటనను సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఆనందేశ్వర్ మందిరంలో ఉన్న శివుడు గర్భగుడి ముందు ఓ మేక తన మొకాళ్ళ మీద మోకరిల్లి దేవుడికి ప్రార్థనలు చేసింది. గుడిలో ఉన్న భక్తులతో కలిసి ప్రార్థనలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. कानपुर के आनंदेश्वर मंदिर में बकरे का अनोखा अंदाज, बाबा को झुक-झुककर किया प्रणाम, श्रद्धालुओं की तरह टेका माथा#kanpur #Kanpurnews #Anandeshwarmandir #Hinduism #kanpurtemple #Uniquevideo pic.twitter.com/AjPTuqfMxF — Journalist Prabhat Kashyap (@Prabhat_1090) October 9, 2022 -
మతాలు వేరైనా.. మమతలు ఒక్కటే
చివరి ఘడియల్లో చాలాచోట్ల ఇప్పుడు ఆసుపత్రి సిబ్బందే అయినవారు అవుతున్నారు. ఆఖరి చూపులూ వారివే అవుతున్నాయి. పాలక్కాడ్ లోని ఒక ఆసుపత్రిలో తాజాగా ఒక ముస్లిం మహిళ చివరి క్షణాలలో ఆ ఆసుపత్రి డాక్టర్.. రేఖ మాత్రమే ఆమె చెంతన ఉన్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆ మహిళ చెవిలో ‘షహాద’ కూడా వినిపించారు! హిందూ మహిళ అయివుండీ షహాద చెప్పిన డాక్టర్ రేఖ ‘సంస్కారానికి’ ముస్లిం సమాజం అంతా హర్షిస్తోంది. డాక్టర్ రేఖాకృష్ణకు తనిక చేయగలిగిందేమీ లేదని అర్థమైంది! ఐసీయులో ఉన్న ఒక కోవిడ్ పేషెంట్ చివరి ఉఛ్వాస నిశ్వాసాలను ఆ క్షణంలో ఆమె చూస్తూ ఉన్నారు. పాలక్కాడ్‌లోని పఠంబి లో ‘సేవన హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్’లో ఆమె వైద్యురాలు. మే 17 ఆ రోజు. డాక్టర్ రేఖ కళ్లెదుట మరణశయ్యపై ఉన్నది ఒక ముస్లిం మహిళ. అప్పటికి కొద్దిసేపటికి క్రితమే వెంటిలేటర్‌ను తొలగించారు. కుటుంబ సభ్యులకు కబురు కూడా వెళ్లింది. పోయే ప్రాణం ఎందుకోసమో ఆగి ఉన్నట్లుగా అనిపించింది డాక్టర్ రేఖకు ఆమెను సమీపాన్నుంచి చూస్తున్నప్పుడు! ఆమె మనసులో ఏదో స్ఫురించింది. వెంటనే ఆ పేషెంట్ చెవిలో మెల్లిగా.. ‘లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్..’ అని ‘షహాద’ పఠించారు. అల్లా ఒక్కడే దేవుడు, మహమ్మదు అతడిచే అవతరించబడిన ప్రవక్త’ అనే విశ్వాస వచనమే షహాద. సంప్రదాయం ప్రకారం ఆ మతస్తులు చేయవలసిన ప్రార్థన షహాద. కుటుంబ సభ్యులు వచ్చేలోపు డాక్టర్ రేఖ తనే ఆ ప్రార్థన వచనాలను ఆఖరి మాటలుగా ఆ మహిళకు వినిపించారు. అప్పటికి రెండు వారాలుగా కోవిడ్ న్యుమోనియాతో చికిత్స పొందుతున్నారు ఆవిడ. అన్నీ రోజులూ ఆమె తరఫువాళ్లు ఆమెను చూడ్డానికి వీల్లేకపోయింది. ఆఖరికి.. చివరి చూపును కూడా! వారికి ఆ లోటు తెలియకుండా, పేషెంట్ మనసును గ్రహించినట్లుగా డాక్టర్ రేఖ ఒక ముస్లింలా ఆ ప్రార్థన వచనాలను పలికారు. ∙∙ హిందూ మహిళ అయుండీ షహాదను పఠించినందుకు ముస్లిములంతా డాక్టర్ రేఖపై దీవెన లు కురిపిస్తున్నారు. ‘‘ముందుగా అనుకున్నదేమీ కాదు. నాకెందుకో అలా చేయాలని అనిపించింది. బహుశా నేను దుబాయ్‌లో కొన్నాళ్లు పని చేసి వచ్చినందువల్ల, అక్కడి వారితో కలిసిమెలిసి ఉన్నందు వల్ల, వాళ్లు నా పట్ల చూపిన గౌరవ మర్యాదలకు కృతజ్ఞతగా నేనిలా చేసి ఉంటాను’’ అంటున్నారు డాక్టర్ రేఖ. ఆమెకు అరబిక్ వచ్చు. ‘‘అందుకే ఉచ్చారణ దోషాలు లేకుండా షహాద ను జపించగలిగాను’’ అంటారు. అయితే ఈ విషయం బయటికి రావడంలో డాక్టర్ రేఖ ప్రమేయం ఏమాత్రం లేదు. సాటి వైద్యుడి ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న ముస్లిం ప్రొఫెసర్ ఒకరు ఫేస్బుక్లో డాక్టర్ రేఖ చొరవ ను కొనియాడుతూ పెట్టిన పోస్ట్ చదివిన వారు అభినందనలు తెలియజేస్తుంటే ఆమె స్పందించవలసి వచ్చింది. అబ్దుల్ హమీద్ ఫైజీ అంబలక్కడవు అనే సున్నీ స్కాలర్ అయితే డాక్టర్ రేఖ చేసిన పని పట్ల అమితమైన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మతం పేరుతో మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్న తరుణంలో పర మత సహనానికి ఆమె ఒక ఆదర్శంగా నిలిచారు’’అని అభివాదాలు తెలియజేశారు. ఇటీవలే మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఇలాంటి ‘సంస్కారవంతమైన’ ఘటనే జరిగింది. అయితే ఆ ఘటనలో.. ఆయేషా అనే ముస్లిం మహిళ.. అయినవారెవరూ దగ్గర లేకపోవడంతో ఒక హిందూ పురుషుడికి మత సంప్రదాయాల ప్రకారం తనే అంత్యక్రియలు జరిపించి అందరి మన్ననలు పొందారు. ‘‘దీన్నొక మత విషయంగా నేను చూడలేదు.. మనిషికి మనిషి సాయం అన్నట్లుగానే భావించాను’’ – డాక్టర్ రేఖాకృష్ణ -
‘అక్కడేందుకు కూర్చున్నావ్?’
ప్రభువులు, ప్రబోధకులైనా సరే పిల్లలొచ్చి ఎదురుగా నిలబడితే ఎక్కువసేపు తమ పీఠాలపై కూర్చోలేరు. వాళ్లేదో మామూలు మనుషులు అయినట్లు పిల్లలు క్వశ్చన్ చేస్తుంటారు. ‘అక్కడెందుకు కూర్చున్నావు?’ అని అడిగితే ప్రభువు మంత్రి వైపు చూడాలి సమాధానం కోసం. ప్రబోధకుడికి మంత్రి ఉండడు. పైనున్న వాడిని అడగాలి. పైనున్నవాడినైనా కనిపిస్తే పిల్లలు వదిలి పెడతారనా? ‘నీ పేరేంటి?’ అని అడుగుతారు. ‘నేను వేంకటేశ్వరస్వామిని’ అని చెబితే, ‘పైనెందుకు ఉన్నావ్? కింద నీకు ఇల్లు లేదా?’ అని ఆరా తీస్తారు. పిల్లల లోకంలో ఎవరూ ఎంతోసేపు పెద్దలుగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండలేరు. పోలీస్ డ్రెస్‌లో ఉన్నా, ప్రీస్ట్ దుస్తుల్లో ఉన్నా సరెండర్ అయిపోవలసిందే. వీళ్లతో కలిసి మట్టిలో ఆడవలసిందే. ‘డ్యూటీ లో ఉన్నాను’ అంటే కుదరదు. ‘డ్యూటీలో ఉంటే ఆడకూడదా?’ అని అడుగుతారు. సమాధానం చెప్పడం కన్నా వెళ్లి వాళ్లతో కలిసి ఆడి యూనిఫారాలకు కాస్త మట్టి పూసుకోవడం, మరకలు అంటించుకోవడం సుఖం. రెండు రోజులుగా ఒక వీడియో నెట్ లో తిరుగుతోంది. ఇప్పటికి ఎన్నో లక్షల మంది చూశారు. తల్లీ, చిన్నపాప చర్చిలో ఉంటారు. ఏ దేశంలోనిదో క్రైస్తవాలయం. పాప తల్లి పక్కన నిలుచుని ఉంటుంది. ప్రీస్ట్ ప్రేయర్ చేస్తూ ఆ పాపను బ్లెస్ చెయ్యడానికి చెయ్యి పైకి లేపుతారు. వెంటనే పాప కూడా తన చెయ్యి పైకి లేపి ప్రీస్ట్ చేతిని తాకుతుంది. ప్లేయర్స్ గాలిలో చేతులు తాకించుకుంటారు కదా గోల్ కొట్టినప్పుడో, క్యాచ్ పట్టినప్పుడో.. అలా ‘హై ఫైవ్’ ఇస్తుంది! ప్రీస్ట్ గారు నవ్వు ఆపుకోలేక, నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. తల్లి మళ్లీ నవ్వకుండా ఉండగలిగింది. ప్రీస్ట్ అంటే ఉండే భయ భక్తి గౌరవ భావాల వలన కావచ్చు! ఎదురుగా ఉన్నది ప్రీస్ట్ అనే గ్రహింపు తల్లుల్లా చిన్నారులకు కలిగే వరకు ప్రీస్టులు, ప్రభువులు పీఠాలు దిగి పిల్లలతో కలిసి నవ్వుతూ ఉండాల్సిందే, చేతులు కలుపుతూ ఉండాల్సిందే. పిల్లలిక్కడ!! ఇంకో చిన్నారి ఉంది లండన్‌లో. వాళ్ల మదర్ పెద్ద పోస్టులో ఉన్నారు, సోషల్ వర్క్‌లో కావచ్చు. ఆమెతో ఇంట్లో నుంచి లైవ్ లో మాట్లాడుతున్నారు బి.బి.సి. న్యూస్ యాంకర్ క్రిస్టియన్ ఫ్రేజర్. మధ్యలో వచ్చి ఇంటర్వ్యూని క్రాష్ చేసేసింది! ‘మమ్మీ ఈ బొమ్మలు ఎక్కడ పెట్టమంటావ్?‘ అని అడిగింది. ‘ష్..’ అని తల్లి సైగ చేసి స్క్రీన్ మీద యాంకర్ని చూపించింది. యాంకర్ కల్పించుకుని ‘కింది షెల్ఫ్‌లో పెడితే బాగుంటుంది కదా చూడు..’ అన్నారు నవ్వుతూ. తల్లి ఇబ్బంది పడింది కానీ కూతురు అదేమీ పట్టించుకోలేదు. ‘వాట్ ఈజ్ హిస్ నేమ్.. వ్వాటీస్ హిస్ నేమ్ మమ్మీ?’ అని అడిగింది స్క్రీన్‌లో యాంకర్ వైపు చూడకుండానే. పాపం ఆయనే చెప్పుకున్నారు.. ‘మై నేమ్ ఈజ్ క్రిస్టియన్ ఫ్రేజర్’ అని. ఇదంతా లైవ్ లో వస్తూనే ఉంది. -
ఢిల్లీలో ప్రియాంకా గాంధీ ధర్నా
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో నిర్వహించిన ప్రార్థన సమావేశానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. బాధితురాలి ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. హత్రాస్ ఘటన పట్ల కేంద్రం, యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రతి పక్షాలు దీన్ని మంచి అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఇక గురువారం ప్రియాంక, రాహుల్ గాంధీలు బాధితురాలి కుటుంబాన్ని పరమార్శించాలని భావించి గ్రామానికి వెళ్లాడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రాహుల్ గాంధీని నెట్టడంతో ఆయన కిందపడ్డ సంగతి తెలిసిందే. (చదవండి: కోర్టు ఆదేశం ఆశాజనకంగా ఉంది) -
తూర్పుగోదావరిలో ఢిల్లీ కలకలం
నీడతో యుద్ధం చేయడమంటే అదో హాస్యాస్పద పదం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా నీడతోనే యుద్ధం చేస్తోంది. శత్రువు ఎక్కడ ఉన్నాడో ... ఎలా ఉన్నాడో తెలియకపోయినా జిల్లా యంత్రాంగం, పాలకులంతా ఒక్కటై నిరంతర పోరు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు గత రెండు రోజులుగా నమోదుకాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న యంత్రాంగం తాజా పరిణామంతో అప్రమత్తమైంది. సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలో కరోనా కల్లోలం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. బుధవారం జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు. దీంతో జిల్లాలో కరోనా కేసులు నాలుగుకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దాపురం కవాడీవీధికి చెందిన 65 ఏళ్ల వ్యక్తిని గత ఆదివారం అనుమానిత కేసుగా కాకినాడ జీజీహెచ్‌కు తీసుకురాగా బుధవారం పాజిటివ్‌గా నిర్థారించారు. ఈ క్రమంలో ఆ వీధిలో జిల్లా యంత్రాంగం విస్తృతమైన చర్యలు తీసుకుంది. కోవిడ్–19 జిల్లా ప్రత్యేకాధికారి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీం అస్మి పరిస్థితిని సమీక్షించి పటిష్టమైన చర్యలకు ఆదేశించారు. మంగళ, బుధవారాల్లో నమోదైన మూడు పాజిటివ్ కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడంతో జిల్లా వాసుల దృష్టంతా ఢిల్లీ వెళ్లి వచ్చినవారిపైనే పడింది. లండన్ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన 23 ఏళ్ల యువకుడితో తొలి పాజిటివ్ కేసు నమోదు కాగా కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రస్తుతం కోలుకుని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ నిజాముద్దీన్ వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు తిరిగొచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కలెక్టరేట్లో గుబులు.. ఈ అంశంపై వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, సామాజిక మాధ్యమాల సమాచారాన్ని క్రోడీకరించి పరిశీలిస్తే రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో రెండు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాకినాడ బ్యాంకు పేటలోని పాజిటివ్ కేసు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తి ఢిల్లీ నుంచి జిల్లాకు తిరిగొచ్చాక ఎక్కడెక్కడకు తిరిగారు. ఎవరెవరిని కలిశారనేది ఆరా తీసిన యంత్రాంగానికి గుండెలు గుభేల్మన్నాయి. రవాణా అనుమతి పనిపై కాకినాడ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్ సహా పలు సెక్షన్లతోపాటు కోవిడ్–19 అత్యవసర విభాగంలో కూడా కలియ తిరిగినట్టు కలెక్టరేట్ సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించారు. దీంతో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి డీఎంహెచ్ఒ కార్యాలయంలో కోవిడ్–19 పర్యవేక్షిస్తున్న డాక్టర్ మల్లిక్ సూచనలతో కలెక్టరేట్లో పలు సెక్షన్లను ఐసోలేషన్ చేయడంతో కలెక్టరేట్ యంత్రాంగం కాస్త ఊపిరిపీల్చుకుంది. ఆ వ్యక్తితోపాటు రాజమహేంద్రవరం పాజిటివ్ కేసు వ్యక్తి కూడా రాజమహేంద్రవరంలోని జాంపేటలో స్నేహితుడిని కలిసేందుకు వెళ్లడం, ఇటు కాకినాడ వ్యక్తి పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లో ప్రార్థనలకు వెళ్లడంతో ఆయా ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. పెద్దాపురంలో పాజిటివ్‌గా నమోదైన 65 సంవత్సరాల వ్యక్తి ఢిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు వెళ్లి ఈ నెల 18న జిల్లాకు తిరిగొచ్చాడు. జిల్లా అంతటా జల్లెడ.. మూడు పాజిటివ్ కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికే సోకడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం జిల్లా అంతటా జల్లెడ పడుతోంది. జిల్లా నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన 27 మందితోపాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల కోసం వలంటీర్లు ద్వారా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి జిల్లాకు తిరిగొచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారితోపాటు కలిసిన వారెవరు అనేది ఒక కొలిక్కి తీసుకురాగలిగారు. జిల్లావ్యాప్తంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్న వారిని ప్రాథమికంగా గుర్తించి 108 శాంపిళ్లను సేకరించారు. వారందర్నీ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. కొత్తపేట, గోకవరం, మండపేట, కాజులూరు, రామచంద్రాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరం తదితర ప్రాంతాలకు చెందిన వారిని ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నారనే కారణంతో ఆస్పత్రులకు, క్వారంటైన్ సెంటర్లకు తరలించడంతో స్థానికులలో ఆందోళన నెలకొంది. వచ్చే రెండు వారాలు స్వీయ నిర్బంధంలో ఉంటే భయమేమీ లేదని కలెక్టర్ భరోసానిస్తున్నారు. కాతేరు శాంతినగర్‌లో రెడ్‌జోన్ రాజమహేంద్రవరం రూరల్: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివశిస్తున్న కాతేరు గ్రామంలోని శాంతినగర్ ప్రాంతంలో కిలోమీటరు మేర రెడ్ అలర్ట్ ప్రకటించారు. శాంతినగర్ మొత్తాన్ని ఆధీనంలోనికి తీసుకున్న అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ డాక్టర్ ఆర్.మహే‹Ùకుమార్ నేతృత్వంలో డీఎల్పీవో జె.సత్యనారాయణ, ధవళేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. శాంతినగర్‌లో కరోనా బాధితుడి ఇంటి నుంచి కిలో మీటర్ మేర బ్లీచింగ్, హైపోక్లోరైట్‌ను స్ప్రే చేయించారు. వైద్యసిబ్బంది, గ్రామ వలంటీర్లు తొమ్మిది బృందాలుగా ఏర్పడి ఆయా కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించారు. ఐసోలేషన్‌లో కవాడీ ప్రాంతం పెద్దాపురం: జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో కరోనా కలవరపెడుతోంది. జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినప్పటికీ సుమారు 67 ఏళ్ల వద్ధుడికి కరోనా లక్షణాలున్నాయని తెలియడంతో మంగళవారం అధికార యంత్రంగా ఆ ప్రాంతాన్ని గుర్తించి ఐసోలెటేడ్ ప్రాంతంగా ప్రకటించారు. పట్టణ ప్రజల ఆరోగ్యంపై వలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించాలని ఆర్డీఓ మల్లిబాబుకు çకలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు. అనంతరం స్థానిక బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతిగహం, వరహాలయ్యపేట యాసలపు సూర్యారావు భవనంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌ను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. పట్టణంలోని 16.17 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జి.శేఖర్ ఆ«ధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దావీదురాజు పారిశుధ్య సిబ్బందితో ప్రత్యేక శానిటేషషన్ డ్రైవ్‌ను నిర్వహింపజేశారు. కలెక్టర్ వెంట డీఎంఅండ్‌హెచ్‌ఓ బి.సత్యసుశీల, డీఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. -
అర్ధమైంది గురువర్యా...
ఓ ధార్మిక గురువుకు ఇద్దరు శిష్యులు. ఒకసారి ఆ శిష్యులు నమాజుకు బయలుదేరారు. మార్గమధ్యంలో వారు చూస్తుండగానే ఓ వ్యక్తికి ప్రమాదం జరిగింది. అక్కడ ఆగిపోతే నమాజు సమయం మించిపోతుంది. వదిలేసి వెళ్ళిపోతే అతని ప్రాణాలు పొయ్యే పరిస్థితి. ఇద్దరిలో ఒక యువకుడు దైవకార్యాన్ని ఎట్టిపరిస్థితిలోనూ విడిచిపెట్టకూడదని, తరువాత ఆలోచిద్దామన్నాడు. కాని రెండవ యువకుడు, నమాజును తరువాత చేసుకుందాం... ముందు ఇతడిని వైద్యుడి దగ్గరికి తీసుకు వెళదామన్నాడు. కాని అతను, ‘దైవప్రార్థన తరువాతనే ఏదైనా’ అంటూ స్నేహితుడి స్పందన కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. రెండో యువకుడు ఆ క్షతగాత్రుణ్ణి దగ్గరిలోని వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాడు. ప్రథమ చికిత్స అందించిన వైద్యుడు, సకాలంలో తీసుకొని రావడం వల్ల ఇతని ప్రాణాలు నిలిచాయని, ఆలస్యమైతే ఇతను ప్రాణాలతో మిగిలేవాడు కాదనీ అన్నాడు. తరువాత ఆ యువకుడు కూడా మసీదుకు చేరుకొని, దైవానికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ రెండు రకతులు నఫిల్ నమాజు, తరువాత ఫర్జ్ నమాజు ఆచరించాడు. కాసేపటికి విషయం గురువుకు తెలిసింది. అంతా సావధానంగా విన్న గురువు, మొదటి శిష్యుణ్ణి మందలించాడు. ధర్మాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావని రెండవ శిష్యుణ్ణి ప్రశంసించారు. దీంతో, ‘అదేమిటి గురువర్యా.. జమాత్‌తో నమాజ్ ఆచరిస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కదా. జమాత్ వదలడం పాపం కదా’ అన్నాడు శిష్యుడు. ‘నువ్వన్నది నిజమే.. కాని, ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అతణ్ని గాలికి వదిలేసి ప్రార్థనలో లీనమైపోతే దేవుడు ఆ ప్రార్థనను స్వీకరిస్తాడా? ఈనాడు చాలామంది చేస్తున్న తప్పు ఇదే. సామాజిక విషయాలను పట్టించుకోకుండా ఆధ్యాత్మికతలో లీనమైపోతున్నారు. మరికొందరు ప్రాపంచిక విషయాల్లో పడి ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. తోటి మానవుల్ని నిర్లక్ష్యం చేసి ఆధ్యాత్మికతలో ఎంతగా మునిగి తేలినా దేవుడు హర్షించడు. తన ఆరాధనలను నెరవేర్చక పోయినా దైవం క్షమిస్తాడు కాని మానవ హక్కుల విషయంలో మాత్రం మన్నించడు. దైవ ప్రసన్నత ద్వారానే ఇహ పరలోకాల్లో సాఫల్యం’ అని చెప్పాడు గురువు. అర్ధమైందన్నట్లు తల పంకించాడు శిష్యుడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
విధేయత లేని ప్రార్థనలు అర్థరహితం
ప్రవాహం లాంటి ప్రార్థనా ధాటి కొందరిది. అంతటి ఆత్మీయావేశం వారి నిజ జీవితంలో ఉంటుందా అంటే అనుమానమే. అద్భుతమైన పదాలు ఏరి కూర్చిన పూదండ మరికొందరి ప్రార్థన. ఆ ఆత్మీయ సౌందర్యం వారి విశ్వాస జీవితంలో మాత్రమే కనిపించదు.. నవరసాలూ గొంతులోనే పలికిస్తూ సాగే ఏక పాత్రాభినయం మరికొందరి ప్రార్థన. కాని వారి విశ్వాస జీవితం నిండా నీరసమే, నటనే. దేవునితోనే నేరుగా సంభాషించే మహిమానందకరమైన సాధనంగా దేవుడే మనకిచ్చిన ‘ప్రార్థన’ అనే ఆరాధనా మాధ్యమం తాలూకు సరికొత్త రూపాలివి. ప్రార్థనాశక్తిని తక్కువచేసే ప్రయత్నం కానే కాదిది. ‘విశ్వాసికి ప్రార్థన ప్రాణవాయువు’. ప్రార్ధన సర్వస్వమే, కాని మన క్రియలకు ప్రత్యామ్నాయం కాదు. ఐగుప్తు దాస్య విముక్తి నాటి రాత్రి మోషే వెంబడి నడిచిన లక్షలాదిమంది ఇశ్రాయేలీయులు తమ త్రోవలో ముందుకు సాగకుండా అడ్డుపడ్డ ఎర్ర సముద్రాన్ని, వెనక తరుముకొస్తున్న ఫరో సైన్యాన్ని చూసి భయపడి ‘ఐగుప్తులో మాకు సమాధులు లేవని మమ్మల్నిక్కడికి తెచ్చావా?’ అంటూ మోషే మీద విరుచుకుపడగా, వారికి భయపడి మోషే దేవుణ్ణి ప్రార్థిస్తుండగా, ఇది ప్రార్థించే సమయమా? అని గద్దిస్తూ,‘నీ చేతిలోని కర్రతో సముద్రాన్ని కొట్టి, అదిచ్చే దారిలో ముందుకు సాగిపో!!’ అన్నాడు దేవుడు (నిర్గమ 14:13–16). దేవుని ఆజ్ఞలకు విధేయులవడానికన్నా ప్రార్థించడానికే ప్రాధాన్యతనిచ్చే వారికి దేవుడు వేసే మొట్టికాయ ఇది. ప్రార్థన గొప్పది కాని దేవుని పట్ల, దేవుని ఆజ్ఞలపట్ల మన ‘విధేయత’ మరెంతో గొప్పది. క్రియలు లేని, దేవుని పట్ల విధేయత లేని ప్రార్థన అర్థరహితమైనది. యెరికో తర్వాత ‘హాయి’ పట్టణంలో ఇశ్రాయేలీయులు ఓడినప్పుడు మొహం చెల్లక ప్రార్థిస్తున్న యెహోషువను, ఓటమికి కారణమైన పాపం ఎక్కడుందో తెలుసుకోకుండా ప్రార్థన ఎందుకు చేస్తున్నావని దేవుడు నిలదీశాడు (యెహోషువ 7:10). అపుడు ఆకాను అనే వ్యక్తి చేసిన అవిధేయతా పాపం బట్టబయలై, ప్రాయశ్చిత్తం కూడా జరిగింది. ‘నీవు బలిపీఠం మీద అర్పణ చెల్లిస్తున్నపుడు, ఎవరితోనైనా నీకు విరోధమున్నదని గుర్తొస్తే, అర్పణనొదిలేసి వెళ్లి ముందు సమాధానపడాలి’ అన్న యేసుక్రీస్తు ఆదేశం కొత్తనిబంధనకాలపు మన ప్రార్థనలను సరికొత్తగా నిర్వచిస్తోంది (మత్తయి 5:23,24). ప్రార్ధనకన్నా, అర్పణకన్నా నిర్దోషమైన హదయానికే దేవుడు విలువనిస్తాడు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, ఇంకెవరితోనూ సమాధానం లేకున్నా, వాటిని సరిదిద్దుకోకుండా, కేవలం ప్రార్థనలతో విశ్వాసుల్లో హాజరు వేయించుకొనే వేషధారుల జీవితాలు అందుకే ఆనందం కరువై వెల వెలబోతుంటాయి. దేవుని ప్రేమను తెలుసుకోవాలన్న ఆశతో ఉన్న వేలాదిమంది చుట్టూ కనిపిస్తుంటే, ప్రభువా నన్నెలా వాడుకొంటామంటూ ఇంకా ప్రార్థనలే చేస్తున్న విశ్వాసులు ఇకనైనా కళ్ళు తెరవాలి. కొత్తనిబంధన బైబిల్ సారాంశమే దేవుని ప్రేమను మాటల్లో, క్రియల్లో కూడా ప్రకటించడమైతే ఇంకా ప్రార్థనలతో కాలక్షేపం దేనికి? ప్రార్థన చెయ్యకూడదని కాదు, ప్రార్థన మాత్రమే చేస్తాను అన్న ధోరణి సరైనది కాదు. ప్రభువు పనికి పూనుకొన్న విశ్వాసి జీవితంలో ప్రార్థనా వూటలు అనంతంగా ఉబుకుతుంటాయి, మనిషి పనిచేస్తూ ఊపిరి కూడా పీల్చుకొంటున్నట్టే, విశ్వాసి ప్రార్థన, పరిచర్య ఒకేసారి సాగుతూ ఉంటాయి. ప్రార్థన మిళితమైన పరిచర్య జీవితం వారిది.. ఒక ధనికుడు పేదలు, దీనులకు సాయం కలగాలంటూ రోజూ ప్రార్థన చేసేవాడట. ఆ ప్రార్థన రోజూ వినే అతని పదేళ్ల కొడుకు ఒకసారి ‘నీకున్న డబ్బంతా నాకిచ్చెయ్యి నాన్నా’ అన్నాడు. ఎందుకని అడిగితే, ‘అదంతా పేదలకు పంచేస్తాను నీ ప్రార్థనలన్నీ ఒక్క రోజులో నిజం చేస్తాను’ అన్నాడట. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మహాత్మా.. మోదీని గద్దె దించు!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు హస్తినకు వచ్చిన ఆమె.. పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ప్రార్థన చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మహాత్మున్ని మమత వేడుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ పార్టీకి సొంత భావజాలం ఉంటుందని అన్నారు. తాము దేశభక్తిని విశ్వసిస్తున్నామని తెలిపారు. గాంధీ ముందు ప్రార్థన చేయడానికే తాను పార్లమెంటుకు వచ్చినట్టు పేర్కొన్నారు. బీజేపీని, నరేంద్ర మోదీని అధికారంలోంచి తొలగించి దేశాన్ని, ఐక్యతను కాపాడాలని గాంధీజీని ప్రార్థించినట్టు చెప్పారు. తమ ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఇటీవల మమతాబెనర్జీ కోల్‌కతాలో మూడు రోజుల పాటు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
అంత సమయం ఏదీ!
ఒక ఊరిలో ఒక దేవాలయముంది. ఆ ఊళ్లో ఒక సాధువు ఉండేవాడు. అతను రోజూ తన పొట్టకు సరిపడా భిక్షాటన చేసుకుని మిగతా సమయం అంతా దేవాలయంలో ధ్యానంతో గడుపుతూ, రాత్రి నిద్రపోవటానికి ముందు దేవుని దగ్గరకు వెళ్లి ఏడుస్తూ, ఏదో మొరపెట్టుకుంటున్నట్లుగా భగవంతుణ్ణి వేడుకునే వాడు. ఇది రోజూ గమనిస్తున్న ఆ గుడి పూజారికి ఆ సన్యాసి రోజూ దేవుని ఏమని కోరుకుంటాడో తెలుసుకోవాలనిపించింది. ఒకరోజున ఆ సాధువును సమీపించి ‘‘బాబా! మీరు గొప్ప దైవభక్తి సంపన్నులు. మీకు ‘నా’ అన్న వారు ఎవరూ లేరు. మీరు రోజూ దేవుణ్ణి ఎవరికోసం ప్రార్థిస్తారు? ఏమని ప్రార్థిస్తారు’ అని అడిగాడు. అందుకు ఆ సన్యాసి చిరునవ్వుతో ‘‘నేను ఏమీ అడక్కుండానే ఎంతో కరుణ తో అవసరమైన దానికంటే ఎక్కువగా కురిపిస్తూ నా అవసరాలన్నీ తీర్చాడు భగవంతుడు. ఒక్కొక్క అవసరాన్ని తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా.. అందుకోసమే రోజంతా – నా అవసరం ఎలా తీర్చాడో అందుకు ఒక్కొక్క అవసరానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే, ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నా – ఆయన తీర్చిన నా అన్ని అవసరాలకు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయలేక పోతానేమో అని ఆందోళనగా ఉంది’’ అని సమాధానం చెప్పాడు. పూజారి ఆశ్చర్యంతో ‘‘అయితే మీరు భగవంతుణ్ణి ఏమీ కోరరా?’’ అనడిగాడు. ‘‘భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయటానికే రోజంతా సరిపోతుందే! ఇక కోరికలు కోరే తీరికెక్కడ? అడక్కుండానే అన్ని కోర్కెలు తీరుస్తుంటే తిరిగి కోరికలు తీర్చమని కోరాలా! ఏవి తీర్చాలో ఆయనకు తెలియదా!’’ అన్నాడు. సాధువు సమాధానంతో పూజారిలో జ్ఞానం మేల్కొంది. నిజమైన పూజ అంటే ఏమిటో అర్థమైంది. – డి.వి.ఆర్. -
దేవుని సార్వభౌమత్వానికి తలవంచితేనే ఆశీర్వాదం
ప్రార్థన ఎలా చెయ్యాలి? దేవునితో విశ్వాసి చేసే ‘ప్రార్థన’ అనే సంభాషణ ఎలా సాగాలి? తన గురించైనా, మరి దేని గురైంచైనా సర్వజ్ఞుడైన దేవునికి, విశ్వాసి కొత్తగా ఏదైనా చెప్పవలసిన అవసరం ఉంటుందా? మరి మనం చెప్పవలసిందేమీ అవసరం లేకుండా ముందే అంతా ఎరిగిన దేవునితో ప్రార్థనలో మనమాయనకు ఏమి చెప్పాలి? విశ్వాసిలో బాహ్యం, ఆంతర్యం అనే రెండు ప్రధానాంశాలుంటాయని అపొస్తలుడైన పౌలు వివరించాడు (2 కొరింథీ 4:16). ఈ రెండింటి మధ్యా అంతర్గతంగా నిరంతర సంఘర్షణ సాగుతూ ఉంటుంది. లోకం ప్రాతినిధ్యం వహించే మన బాహ్యానికి, దైవసంబంధమైన మన ఆంతర్యంలోని ఆత్మీయతకు ఎప్పుడూ ఘర్షణే!! అయితే ఎంత నలిగినా, బలహీనపడ్డా, చింతచచ్చినా పులుపుచావదన్నట్టు, మనిషిలోని ‘అహం’ మాత్రం ఓటమిని అంత తొందరగా అంగీకరించదు. కాని ఈ అంతర్గత సంఘర్షణలో మనిషిదెప్పుడూ ఓటమే!! గెలవాలన్న ప్రయత్నమే తప్ప, గెలిచే అవకాశాలు మనిషికి ఏ మాత్రం లేని ఈ రంగంలోనే, దేవుని ప్రేమ మాత్రం అంతకంతకూ మరెక్కువగా విశ్వాసిలో పరిపూర్ణమౌతుందంటాడు అపొస్తలుడైన పౌలు. తన జీవితంలో ఒక ముల్లు ఉండేదంటాడాయన. ముండ్లు లేని జీవితాలసలుంటాయా? అయితే ఆ ముల్లును తొలగించమని తాను ముమ్మారు వేడినా దేవుడు దానిని తొలగించలేదు సరికదా, ‘నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లోనే నా శక్తి సంపూర్ణమవుతుందని దేవుడు తనకు బదులిచ్చాడు’ అని పౌలు తన నిస్సహాయతను, ఓటమిని కొరింథీ చర్చికి వివరించుకున్నాడు (2కొరింథీ 12:1–9). అతిశయపడేందుకు పౌలు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎవరికీ లేని ఒక పరలోకానుభవం కూడా ఉంది. ఆయన పరలోకం దాకా వెళ్లి మానవుల వశంలో లేని ఎన్నో పారలౌకికానుభవాలకు గురయ్యాడు.. కానీ తిరిగొచ్చిన తర్వాత ఆ ‘అనుభవం’ గురించి ఏ ఒక్కరికి కూడా ఆయన చెప్పుకోలేదు. సరికదా అలా పరలోకానికి వెళ్ళింది తానే అని కూడా చెప్పుకోకుండా, అలా వెళ్లిన ఒక వ్యక్తి తనకు తెలుసునని మాత్రం పౌలు తన పత్రికలో వివరించడం పౌలు సాత్వికత్వానికీ, వినయానికి, తగ్గింపు స్వభావానికి స్పష్టమైన ఉదాహరణ.. కానీ క్రీస్తు ప్రేమకు నన్ను అంతకంతకు దగ్గర చేసే నా బలహీనతలయందే నేను అతిశయిస్తాను తప్ప, అతిశయించేందుకు తన వద్ద మరేదీ లేదని అపొస్తలుడైన పౌలు అంత సవినయంగా ప్రకటించుకోవడం, పైపై మెరుగుల ప్రచారం తప్ప మరేదీ లేని క్రైస్తవానికి ప్రతినిధులైన నేటి తరం విశ్వాసులకు, పరిచారకులకు ఎన్నటికీ అర్థం కాదు. కొందరి ప్రార్థనల నిండా వాళ్ళ జీవితంలోని ముండ్ల ప్రస్తావనే ఉంటుంది. ముల్లు తీసెయ్యమని అడగడం తమ హక్కు, దాన్ని తీసివేయడం దేవుని బాధ్యత అన్నట్టుగా వాళ్ళ ప్రార్థనలు సాగుతుంటాయి. అయితే తన ముల్లు తీసెయ్యమంటూ తాను మూడుసార్లు అడిగినా దేవుడు అందుకు తిరస్కరించి, ఆ ముల్లు నిన్ను బలహీనుణ్ణి చెయ్యడంలోనే నా బలం నీలో పరిపూర్ణమవుతుందంటూ దేవుడు జవాబిచ్చాడని పౌలు రాసుకున్నాడు. మనం ఏదడిగితే అది ఇస్తూ మనల్ని సంతోషపర్చడానికే దేవుడున్నాడన్న పద్ధతిలో లోతులు లేక కేవలం పబ్బం గడుపుకునే బాపతు పద్ధతిలో సాగుతున్న ఈనాటి పరిచారకుల పసలేని ప్రసంగాల కారణంగా ‘దేవుని సార్వభౌమత్వం’ అనే అత్యంత ప్రాముఖ్యమైన ఆత్మీయాంశం విశ్వాసులకు అర్ధం కావడం లేదు. దేవుడు సార్వభౌమత్వం కలిగిన సర్వాధికారి తప్ప, మనమేది అడిగితే అది తెచ్చిచ్చే ‘అల్లాఉద్దీన్ అద్భుతదీపం’ కాదు. కూడా. మనమడిగింది ఆయన చేస్తాడు కాని దాన్ని చెయ్యకుండా ఉండే సార్వభౌమత్వం కూడా దేవుని సొంతం. దేవుని సంపూర్ణంగా విశ్వసించడమంటే, దేవుని సార్వభౌమత్వాన్ని విశ్వసించడమే, దేవుని విధానాలను, దేవుని సమయాన్ని సంపూర్ణంగా ఎరగటమే!! దేవునిలో ఎదగడమంటే, ప్రాపంచికంగా మనం బలహీనపడటమేనన్న పౌలు మాటలు, దేవుని హృదయస్పందనకు సాదృశ్యాలు. ‘మన బాహ్యపురుషుడు కృషిస్తున్నా, ఆంతర్య పురుషుడు దినదినం వినూత్నపర్చబడుతున్నాడు’ అంటాడు పౌలు. అలాంటి ఆత్మీయవృద్ధిని, దేవుని సార్వభౌమత్వాన్ని కాంక్షిద్దాం. -
మాయమ్మ చేసిన క్రిస్మస్ కేకు
పలాసకు ఆరు మైళ్ళ దూరంలో డెబ్బై గడపలున్న మా ఊళ్లో ప్రభువును నమ్ముకున్న కుటుంబం మాదొక్కటే. దసరాకీ, గౌరీపూజకీ వడపప్పు, అరిసెలు, మెత్తటి గారెలు ఇరుగూ పొరుగు పంపిస్తే తినడమేగానీ క్రిస్మస్కు, ఈస్టర్కూ ఒక కేకుముక్కో, గులాప్పువ్వో వండి పక్కింటికీ ఎదురింటికీ పంపడానికి మాయమ్మకు సేతులొచ్చేవి కాదు. ఆ సమచ్చరం క్రిస్మసుకు ముందు పలాసా చర్చీ నుండి పాదరుగారు, సిస్టర్గార్లు ఒక రాత్రి పూట జీపులోవొచ్చి ఊరంతా నిద్రలెగిసినట్లు క్రిస్మస్ పాటలు పాడి మా ఇంటికొస్తే తెల్లటి బట్టల్లోన ఉన్న పాదరు గారిని సూడ్డానికి పక్కింటి రామారావు, ఆళ్ళావిడా ఒచ్చారు. వాళ్లు పాదరు గారితో ‘ఈ మొగుడూ పెళ్లాం మీ పండగ రోజు పిల్లడ్ని పట్టుకొని చర్చీకొచ్చీడమూ, పొద్దల్లా అక్కడే ఉండిపోయి పొద్దోయికి మీరిచ్చిన పాలుగుండ, పంచదార పట్టుకొని పార్రాడమే గాని ఒక కేకో , పండో, కాయో ఎవులకీ ఇచ్చింది లేదు’ అని చెప్పగానే మాయమ్మ , నాయిన మొఖాలు సున్నం రాసినట్లయిపోయినాయి. పాదరుగారు మాయమ్మతోటి ‘సరోజినమ్మా .. పండుగంటే సంతోషం పంచుకోవటం కదా. ఇరుగూ పొరుగుకు పండగపూట ఒక తీపో, కారమో చేసి పంపాలి. ఈ సంవత్సరం కేక్ చేసి అందరికీ పంచు’ అన్నారు. ‘దానికి తరవాని పులుసు సెయ్యడమే రాదు ఇంకా కేకు ఎక్కడ సేస్తాది’ అన్న మా నాయిన మాటలకు నవ్వీసి ‘కేక్ చెయ్యక్కర్లేదు. బజార్లో దొరుకుతుంది. కొనేసి ఊరంతా పంచండి ‘ అని సెప్పీసి పాదరుగారు ఎల్లిపోయారు. దాంతో ఈసారి క్రిస్మసుకు అరిసెలు వండీసి, మిగిలిపోయిన అరిసిల పిండిలో ఇంకొంచం నీళ్లు కలిపి పొంగడాలు సేసి, దానితోటి ఒక కేకు ముక్క కూడా ఊరంతా పంచీసి ఉన్న సెడ్డపేరును సెరిపీసుకోవాలని మాయమ్మ నాయిన అనుకున్నారు. క్రిస్మస్సుకు ఊరందరికీ పంచడానికి ఎంత కేకు కావాలని మాయమ్మ మా నాయిన ఆలోచన సేస్తే సుమారు నాలుక్కేజీలు కావాలని లెక్క తేలింది.నాలుక్కేజీల కేకు రేటెంత అని అడిగితే పలాసల కోవాకొట్టు గురుమూర్తి వందరూపాయలు సెప్పినాడు. మా నాయిన బుర్ర మీద గుడ్డేసుకుని ఇంటికొచ్చి విసయం సెప్పి, వందరూపాయల అప్పు ఇచ్చెటోడు ఇప్పుడుకిప్పుడు ఎక్కడ దొరుకుతాడని మాయమ్మనడిగాడు. మాయమ్మ అప్పుడికే తను దాసుకున్న సొమ్ముతోటి మా నాయినకొక పంచి, నాకు ఎర్ర నిక్కరు, పసుపు జుబ్బా , దానికి ఒక సీర కొనీసింది.మిగిలిన డబ్బులుకి పప్పలు సెయ్యడానికి నూని కొనీసి, ఆరబెట్టిన బియ్యము మిల్లాడించేసి రడీగా ఉన్నాది. కేక్ కొనడానికి ముప్పై రూపాయలు పట్టుకెల్లిన మా నాయిన పప్పులుడకలేదు. తెల్లారితే క్రిస్మస్సు. ఇరవై నాలుగు తేదీ రాత్రి చర్చికి ఎల్లడానికి ముందే పప్పల వంట పూర్తి చేసీసింది మా యమ్మ. ఆ రాత్రి యేసయ్య పాటలతో, కొవ్వొత్తుల కాంతులతో చర్చంతా ప్రభువు పుట్టిన గడియల్ని పండుగ సేసుకున్నాం. ఊరికి బయలుదేరుతుంటే పాదరుగారు ‘కేక్ పంచుతున్నారా లేదా’ అని మా నాయినను అడిగితే మొగమాటంగా తలూపీసి ఊరికి పారొచ్చినాము. మాయమ్మ దారంతా సణుక్కోనొచ్చింది.ఇంటికొచ్చినప్పడుకి వేకువజామైపోయింది. నేను రాగానే పడుకుండి పోయినాను. పొద్దున్న నేను లెగిసినప్పుడికి మాయమ్మ , మా నాయిన ఇద్దరూ ఇంటిలోన లేరు. కానీ ఎదురుగా నల్లటి రంగులోన కొంచం మిగిలున్న కేకు కనిపించింది. అది పెద్ద అట్ట మీద ఉంది. చాలా కేకు ఎవరో తినీసినట్లు అర్థమవుతున్నది. అంత పెద్ద కేకు ఎక్కడిది, ఎవరు తెచ్చారు అని నేను ఆలోసిస్తుంటే మాయమ్మ మొకమంతా పళ్ళు చేసుకొని లోపలికొచ్చింది. ‘ఊర్ల ఒక్కిల్లు ఒగ్గకుండా పంచీసినాను. పక్కింటి రామారావు నాలుగు ముక్కలు ఒక్కడే తినీసాడు బెగ్గురోడు’ అని ‘ఇది మొత్తం నీకే నాయినా.. తినీ’ అని అన్నాది.‘డబ్బుల్లేవని నాయిన అన్నాడు కదా.. మరిప్పుడెలగ కొన్నాడమ్మా’ పెద్ద ముక్కను తెంపి నోట్లో కుక్కుకోబోతూ అడిగాను. ‘మీరు పక్షులను చూడుడు. అవి విత్తవు, కోయవు’ అని పాదరు బైబిల్లోన మాటలు సెప్తారు కదా .. ఇదీ అలగే . మన పరిస్థితి జీపు డ్రైవరు జీవరత్నము తెలిసిన నలుగురికీ సెప్పితే, చర్చిలోనే కలిగినోళ్లందరూ నాలుగు డబ్బులేసుకొని కొవాకొట్టులోన డబ్బులు కట్టి జీవరత్నము తోటే తెల్లవారినప్పుడుకి పంపించినారు. మీ నాయన అరిసిలు, కేకు ముక్క పట్టుకొని జీవరత్నంఇంటికే బయల్దేరినాడు. ఈ ఊర్ల యేసును నమ్ముకున్న ఒక్క కుటుంబము మనది. ఉన్న రెండు పండుగలూ జరుపుకోలేని జరుగుబాటు మనది. ఈ సమ్మచ్చరం మనము సక్కగా క్రిస్మస్సుసేసుకున్నట్లు సేసిన ఆల్లందరూ సల్లగుండాలని ప్రార్ధన సెయ్యు నాయినా’ అని సెప్పింది మా యమ్మ. నేను గోడకున్న ప్రభువు ఫొటో ఉన్న కాలెండర్ దుక్కు సూసి, సిలువ గుర్తు ఏసుకుని .. కళ్ళు మూసుకుని ఆమెన్ అనుకున్నాను. - కె.వి. కరుణకుమార్ -
ఆయన వారిని అమ్మా అని పిలిచాడు
క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేసింది స్త్రీలే. క్రీస్తు బోధలనీ, క్రీస్తు దైవత్వాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ స్త్రీలే. క్రైస్తవంలో స్త్రీలకు గుర్తించదగ్గ స్వేచ్చ ఉంది. కారణం క్రీస్తు బ్రతికున్న రోజుల్లో స్త్రీల మధ్యన ఎక్కువగా పరిచర్య చేయడం. పురుషాధిక్యత ఉన్న యూదా జాతిలో కన్యక అయిన మరియ అనే స్త్రీ, క్రీస్తును కనడానికి ముందుకొచ్చింది. క్రీస్తుకు తల్లిగా మారేందుకు తనని తాను తగ్గించుకుని గాబ్రియేల్ అనే దూత చెప్పినట్టు విన్నది. దేవునికి లోబడతానని తన విధేయతతో ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసింది. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన స్త్రీగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. యోసేపుకు ప్రధానం చేయబడ్డ ఆమెను, ఒకానొక సమయంలో అవమాన భారం వల్ల యోసేపే వదిలేయాలనుకున్నాడు. అయినా లేఖనాలలో రాయబడ్డట్టు జరిగేందుకు తన సమ్మతిని తెలియజేయడమే కాదు ఆమె అన్ని పరిస్థితులలో దృఢనిశ్చయంతో ఉంది. పురుషాధిక్యత గల యూదా సమాజంలో పురుషులతో స్త్రీలు బహిరంగంగా మాట్లాడడం నిషేధం. క్రీస్తు మగ్ధలేన అనే ప్రాంతానికి చెందిన స్త్రీని దోపిడీగాళ్ల చేతులలో నుండి విడిపిస్తాడు. అప్పటినుంచి మగ్ధలేన మరియ క్రీస్తుతో పాటే ఉంది. క్రీస్తు పరిచర్యలో తనవంతు పాత్రను పోషించింది. క్రీస్తు పరిచర్య చేస్తూ వెళ్ళిన ప్రాంతాల్లో స్త్రీలను సమావేశపరుస్తూ, క్రీస్తును గురించి అనేకులకి చెబుతూ క్రీస్తు కోసం సాక్షిగా నిలబడింది. ఆమె క్రీస్తును ఎంతగా ఆరాధించిందంటే.. క్రీస్తు సిలువ వేయబడిన మూడోరోజున ఆయన దేహానికి సుగంధద్రవ్యాలు పూయడానికి తనతోపాటు మరికొందరు స్త్రీలను తీసుకుని పొద్దు పొడవకముందే సమాధి దగ్గరకు చేరుకుంది. సమాధిలో క్రీస్తు కనపడలేదని భయపడింది. దేవదూత ద్వారా ఆయన పునరుత్థానాన్ని గురించి తెలుసుకుని, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్న వార్తా ఆమే మొదటగా చేరవేసింది. క్రీస్తును తమ కుటుంబంలో ఒకరిగా చేర్చుకుని, ఆయన బేతనీ అనే ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తమ గృహంలో ఆతిథ్యం ఇచ్చారు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు. వాళ్లు మార్త, మరియలు. క్రీస్తు బేతనియకి వచ్చినప్పుడల్లా వాళ్ళింట్లో బస చేసే వాడు. వారి సహోదరుడు లాజరుతో క్రీస్తుకు మంచి స్నేహం. క్రీస్తు చెప్పే మాటలు వినడానికి వాళ్లు ఎంతో ఆసక్తి చూపేవాళ్లు. ఒకానొక సమయంలో లాజరు అకారణంగా చనిపోయాడు. క్రీస్తు మూడు రోజులయ్యాక ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వారు ఆయనకీ విషయాన్ని తెలియజేస్తారు. లాజరును తిరిగి బతికిస్తాడు క్రీస్తు. ఇక అప్పటినుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్లు క్రీస్తును ఘనపరిచి ఆయన ప్రేమ తత్వాన్ని ప్రచారంచేసారు. సమరయులు యూదులకన్నా జాతి పరంగా చిన్న వాళ్లు. క్రీస్తు పరిచర్య చేస్తున్న రోజుల్లో సమరయ గ్రామాల వైపు వెళ్తూ వాళ్లకు కావలసిన సహాయాన్ని, సహకారాన్ని అందించేవాడు. ఒకానొక సమయంలో ఒక సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న సమయంలో క్రీస్తు అటుగా వెళ్లాడు. తాగడానికి నీళ్లిమ్మని అడిగాడు. ఆమె యూదుడైన క్రీస్తు తనని నీళ్లడగటం చూసి తన గతాన్ని చూసి క్రీస్తు తనని అసహ్యించుకుంటాడని భయపడింది. కాని క్రీస్తు ఆమెకి బుద్ధి వాక్యాన్ని బోధించాడు. తాను క్రీస్తు అనే విషయాన్ని ఆమెకి తెలిసేలా చేసాడు. ఆమె పరుగెత్తుకుంటూ ఊళ్లోకి వెళ్ళింది. క్రీస్తు గురించి ఊరంతా తెలిసేలా ఆయన కోసం గొప్ప సాక్షిగా మారింది. పన్నెండు ఏళ్ళుగా రక్తస్రావం ఆగక బాధపడుతున్న ఓ స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది. యేసు ప్రభువు తనకి స్వస్థతనివ్వాలంటే ఆయన ముందు ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. కలవాలి. కాని అంతమంది జనంలో ఆమె ఆయన దగ్గర ఆయన దగ్గరగా వెళ్ళలేదు కాబట్టి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను అని అనుకుంది. అలాగే చేసింది. వెంటనే రోగం బాగైంది. ఓ రోజు వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని జనాలు రాళ్లు పట్టుకుని తరుముతూ వచ్చారు. ఆమె మీద రాళ్లు విసురుతున్నారు. ఇక ఆమెని చంపటమే తరువాయి. క్రీస్తు ఆమె దగ్గరకి వెళ్లి పడిపోయిన ఆమెని లేపాడు. రాళ్లు పట్టుకున్న వాళ్లను వారించాడు.పాపం చేయని వాడు ఆమె మీద మొదట రాయి వేయాలన్నాడు. అందరి పాపాలను నేల మీద రాయటం మొదలు పెట్టాడు. అంతే! అందరు ఎవరి పాపాలను వారు చూసుకుని భయపడి రాయి వదిలేసి పారిపోయారు. యేసు క్రీస్తు ఆ స్త్రీ దగ్గరకెళ్ళి ‘‘అమ్మా నీ మీద రాళ్ళేయడానికి వచ్చిన వాళ్లు ఎవరు లేరు. ఇక వెళ్ళు. ఇంకెప్పుడు పాపం చేయొద్దని ఆమెని విముక్తురాలిని చేసాడు. క్రీస్తు స్త్రీలందరినీ అమ్మా అనే పిలిచాడు. ఒకానొక సమయంలో మరియ అనే ఒక స్త్రీ, క్రీస్తు పరిసయ్యుల ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు అత్తరు బుడ్డి తెచ్చి అతని తల మీద పోసింది. శేరున్నర అత్తరు ఆమె జీవిత కాలం సంపాదించిన డబ్బుతో కొనినదైయుంటుంది. ఆమె తన కన్నీటితో క్రీస్తు పాదాలను కడిగి తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచి అత్తరు పూసింది. ఆమె చేసిన పని ఎంత గొప్పదో క్రీస్తు చెప్తూ ఆమె ప్రేమ ఎంత గొప్పదో అందుకే అంత గొప్పగా ఆయన్ని సన్మానించుకుందని చెప్తాడు. అది క్రీస్తు వల్ల తన జీవితంలో జరిగిన గొప్ప మేలు వల్ల కావచ్చు లేదా క్రీస్తు మీద తనకున్న వల్లమాలిన ప్రేమ కావచ్చు. యేసు క్రీస్తు పుట్టినప్పుడు అన్నా అనే ప్రవక్తి క్రీస్తును దేవాలయంలో చూసింది. ఆయన పుట్టుక గురించిన ప్రవచనం తనకి ముందే తెలుసునని, క్రీస్తుని చూడడానికే అంత ముదుసలిదైన తాను బతికే ఉందని చెప్తుంది. క్రీస్తును తన చేతుల్లోకి ఎత్తుకుని శుభవచనాలు పలుకుతూ పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తుంది. ఎంతోమంది స్త్రీలకు క్రీస్తు చాలా ఆత్మీయుడిగా ఉన్నాడు. ఆయనకు స్త్రీ పురుష భేదం ఉన్నట్టు ఎక్కడా కనపడదు. ఆయన తనలోని మాతృత్వాన్ని ప్రేమగా చూపించడంవల్లే చాలామంది స్త్రీలు పరిచర్య చేయడానికి ఇష్టపడి ఉంటారు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీలనైనా, ఎలాంటి స్త్రీలు తన దగ్గరకి వచ్చినా ఆయన వాళ్లని ‘అమ్మా’ అని సంబోధించేవాడు. క్రీస్తు తత్వమే ఆయనని చాలామంది ఆత్మీయుడిగా చేసింది. ఆ స్త్రీలందరూ ఆయనని ఘనపరిచి అనేకులకి ఆయన్ని పరిచయం చేస్తూ ఆయన ప్రేమకి సాక్షులుగా నిలుచున్నారు. - మెర్సీ మార్గరెట్ -
క్రీస్తు నడిచిన దారులలో
అనంతమైన ప్రేమను పంచడానికి ఏసు తన శరీరాన్ని రక్తసిక్తం చేసుకున్నాడు. సత్యమార్గం బోధించడానికి ఏసు తన భుజంపై శిలువ మోశాడు. కష్టతరమైన మార్గం ఆవల అగ్ని కంటే స్వచ్ఛమైన జీవనం మనిషిని వెలిగించును అని బోధించాడు. ఆస్తి అడగలేదు... క్షమను అడిగాడు. బంగారం అడగలేదు... కరుణ అడిగాడు.నీ నుంచి నీ దేహభాగాలను అడగలేదు... కేవలం పొరుగువారిని ప్రేమించమన్నాడు. తాత్కాలిక భోగలాలస దుఃఖహేతువు. నీ నడవడిక బలిమి పరలోకానికి సేతువు. క్రీస్తుమార్గం నిజమనిషి మార్గం. ప్రతి మానవుని మార్గం. ఏ మతమైనా మంచితనం, ప్రేమ, దయ, ఉన్నతమైన గుణాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది. ఈ లక్షణాలన్నీ ప్రతి మనిషిలోనూ ఉండాలని బోధిస్తుంది. తద్వారా లోకమంతా ప్రశాంతంగా, హాయిగా ఉండాలని ఆకాంక్షిస్తుంది. మనిషి మతం నుంచి అనుక్షణం ఎంత వీలైతే అంత మంచిని ఎరుకతో గ్రహించి తీసుకుంటూ ఉండాలి. దృష్టిని చెదరనీక ముక్కుసూటిగా వెళుతూ మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. ప్రయాసపడాలి. మతానికి తాను వెలుతురు కావాలిగాని తన స్వార్థానికి మతాన్ని వెలుతురుగా మార్చుకొనరాదు.క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ఎల్లప్పుడూ బోధించే ప్రేమతత్వం, క్షమాగుణం గురించి ఈరోజు గుర్తు చేసుకోవడం ఆనందమే కాదు అవసరం కూడా.మనిషి సహజంగానే ఆశాజీవి. అతడు తనకెప్పుడూ మంచి జరగాలని తన జన్మకు జీవునికి ఒక ప్రయోజనం కలగాలని ఆశిస్తూ ఉంటాడు. అతడికి వచ్చేది ఏదీ లేకపోతే తాను ఏదీ ఇవ్వడు. ఇదే తీరులో పరలోక ప్రవేశానికి కూడా అతడు ప్రయత్నిస్తాడు. మనిషి లక్ష్యం ఎప్పుడూ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనే ఉంటుంది. మనిషి తన జీవనంలో ఏ మంచి చేసినా క్రీస్తు నామమందు ఏ పనిలో లగ్నమైనా అతని దృష్టి సదా పరలోక రాజ్యంపైనే ఉంటుంది. ఎందుకంటే భూమిపై జీవితం అశాశ్వతం. పరలోక జీవనమే శాశ్వతం. అలా అని ఆరాధకుడు భావిస్తాడు. అయితే పరలోక రాజ్యం ఊరికే వస్తుందా? ఇందుకు రెండు ముఖ్యమైన కార్యాలు చేస్తుండాలి. ఒకటి ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ, ఆయన్ని ఆరాధిస్తుండాలి. మరొకటి ఆయన సూచించిన మార్గాలలో జీవితాలను గడపాలి. ఆ మార్గాలు: అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు.. తల్లిదండ్రులను సన్మానించాలి.. వ్యభిచరించకూడదు.. దొంగిలించకూడదు... నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి... క్షమాగుణం కలిగి ఉండాలి... ఇవన్నీ మన జీవితాల్లో ప్రతినిత్యం అనుసరిస్తూ ఉంటే పరలోక రాజ్యం సాధ్యం. ఇవన్నీ చేయాలంటే మనిషికి కష్టంగా ఉంటుంది. దానికి బదులు తేలికైనది, సులభమైనది అయిన దేవుడిని కీర్తించడం ద్వారా మనిషి తన పని సులవవుతుందని భావించడంలో అతడి అల్పత్వం, స్వార్థం బయట పడుతుంటుంది. తోబుట్టువుపై పగ, ద్వేషం పెట్టుకుని క్షమించడం రాక, మనసులో ఈర్ష్య పెట్టుకుని పొరుగింటివారిని హత్తుకోవడం రాక రెండు గంటలు మోకాళ్ల మీద దేవుని కన్నీటి ప్రార్థనలు చేయడం లాభదాయకం అన్న ఆలోచన ఎంత వరకు సమంజసం అన్నది ఆలోచించాలి. అలా చేస్తే నిజంగానే పరలోకం అనేది ఉంటే దాని ప్రవేశం కలుగుతుందా? ప్రభువు చెప్పిన శాంతిని మనం పెంపొందుతుందా? నిజమైన శాంతి క్షమాపణలో ఉంటుంది అని మనమంతా గ్రహించాలి. అప్పుడే మనం కరుణా హృదయులుగా క్రీస్తులో విరాజిల్లుతాం. క్రీస్తు చెప్పే ఎన్నో మంచి విషయాలను మనం పుస్తకాల ద్వారా ప్రసంగాల ద్వారా ప్రార్థనా కూటముల ద్వారా వింటున్నాం. ఆ సమయంలో ప్రభావితం అవుతాం. అయితే ఆ ప్రభావాన్ని ఘనంగా నిలబెట్టుకోవడంలోనే విఫలమవుతూ ఉంటాం. దైవం మనిషి రూపం ధరించి సాధించినది మనిషి జన్మ ఎత్తిన మనకు సాధ్యం కాకుండా పోతుందా? క్రీస్తు చెప్పేది చేసేది ఎప్పుడూ ఆత్మపరిశీలన గురించే. నిన్ను నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావు... తోటివారితో ఎంత స్వచ్ఛంగా ఉంటున్నావు అన్నదే క్రీస్తు బోధనల్లో ప్రధాన విషయం. క్రీస్తు చెప్పే ప్రతి అంశంలోనూ ప్రేమ, సమానత్వం ఉంటుంది. ‘నీ దగ్గరకు నేను బిచ్చగాని రూపంలో వస్తాను’ అంటాడు. అంటే ఒక అవసరం కోసం ఎదురు చూసేవారిలో తాను ఉంటానని, వారిని దేవునిలా ఆదరించమని అందులో ధ్వని. మనం ఒకరికి సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మనం ఆ సహాయం చేయాలి. మంచిని పెంచాలి. క్రీస్తు ఖరీదైన బట్టలకు వెంపర్లాడటం అటుంచి ఎక్కువ మోతాదులో బట్టలూ ధరించలేదు. రుచుల కోసం వెంపర్లాడలేదు. రక్తమోడుతున్న క్రీస్తే మనకు తెలుసు. క్రీస్తు వరాలు ఇవ్వడు. నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకొమ్మని ఆశ, బలం ఇస్తాడు. నీ జీవితం నీ చేతుల్లో ఉందని మనకి గుర్తు చేస్తూనే నీకు ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా సాధించగలవని భరోసా ఇస్తూ ఆశీర్వదిస్తాడు. బైబిల్ని చేత ధరించడంతోపాటు దానిని హృదయంలో దింపుకోవడంలోనే మనిషి వెలుతురువైపు ప్రయాణించడం ఉంటుంది. నిజానికి బైబిల్ గొప్ప కౌన్సెలర్. మన నడవడికను గురించి ఈ కాలానికీ అవసరమైన సంస్కరణను చక్కగా సూచిస్తుంది. ఎంతో మధురమైన వాక్యాలను బోధిస్తుంది. వాటిని బట్టీ పట్టడంతో పాటు అర్థం చేసుకొని ఎదగడం కూడా మనం చేయాలి. తనను తాను చిన్న బిడ్డగా మార్చుకొని మార్పు పొంది తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని చెప్తుంది బైబిల్. ఇలా ఉన్నవారిని ఎవరైనా అభ్యంతరపరిస్తే వారి మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట తథ్యమని మనల్ని ఒక భయానికి గురి చేసైనా మంచిని పెంపొందిస్తుంది. ప్రేమ, క్షమాగుణం కలిగి, తల్లిదండ్రులను ప్రేమించడం అనే లక్షణాన్ని కలిగి ఉండటాన్నే అసలైన ఆస్తిగా బోధిస్తాడు క్రీస్తు. దానికి మించి మన దగ్గర ఉన్న ఇతర ఆస్తులను పేదలకు ఇచ్చేయమంటాడు.అప్పుడే నీకు పరలోకంలో జీవం ఉందంటాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్తాడు. రేపటి కోసం ఆస్తులు పోగు చేసుకోవద్దని చెప్పాడు.ఈరోజుకోసం తిండీ గుడ్డా ఉంటే చాలన్నాడు. ఎందుకంటే ఆహార్యం కంటే దేహం గొప్పదన్నవాడు క్రీస్తు. ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రక్రియ ఉంటేనే శాంతి, సమాధానం, మంచి గుణం బతికుంటుందని క్రీస్తు తత్వం చెబుతున్నాడని అర్థమవుతుంది. అదే క్రమంలో ప్రేమ దేవుని మూలంగా కలుగతున్నది. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మన కోసం సిలువేసుకోవడంలోనే అమితమైన ప్రేమ ఉంది అంటుంది బైబిల్. సమస్త లోకాన్ని ప్రేమతో నింపమంటుంది. ఇలా సకలం ప్రేమమయం కావాలంటే నీలో ముందు వంచన ఉండకూడదు. నువ్వు ఒకరిపై తీర్పులకు సిద్ధమైనప్పుడు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోక నీ సహోదరుడి కంట్లోని నలుసుని ఎందుకు చూస్తున్నావంటాడు యేసు. క్రీస్తు రెండవ రాకడకు మనల్ని సిద్ధం చేస్తాడు దేవుడు. క్రీస్తు పరిశుద్ధ ఆత్మ అయి మళ్లీ ఈ భూమ్మీదకు రెండవసారి వచ్చేసరికి మనం సంసిద్ధంగా ఉండాలంటాడు. అంటే ధర్మశాస్త్రం చెప్పిన ఆశయాలను అనుసరించాలి అని అర్థం. మంచి వారిని దేవుడు పరలోకానికి తీసుకువెళతాడన్న చెడ్డవారిని ఇక్కడే వదిలేస్తాడన్న భయమే మనల్ని మంచితనంలోకి నడిపించాలి. అయితే మనం ఎంతవరకూ భయపడుతున్నాం అన్నది మనకు తెలియాలి. ఈరోజు మనిషి తమ జీవితాన్ని నిజంగా క్రీస్తు చెప్పిన తత్త్వంతో నింపుకున్నాడా లేదా అనేది తరచి చూసుకోవాలి. పరలోక రాజ్యానికై ఎదురు చూడటం కంటే నిజంగా అందుకు యోగ్యులుగా మారే లక్షణాల సాధన కోసం శ్రద్ధ పెట్టే సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులానే జీవించేవాడు క్రైస్తవుడు. వాడు నిజమైన మానవుడు. హ్యాపీ క్రిస్మస్. పరలోక రాజ్యం ఊరికే వస్తుందా? ఇందుకు రెండు ముఖ్యమైన కార్యాలు చేస్తుండాలి. ఒకటి ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ, ఆయన్ని ఆరాధిస్తుండాలి. మరొకటి ఆయన సూచించిన మార్గాలలో జీవితాలను గడపాలి. ఆ మార్గాలు: అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు.. తల్లిదండ్రులను సన్మానించాలి.. వ్యభిచరించకూడదు.. దొంగిలించకూడదు... నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి... క్షమాగుణం కలిగి ఉండాలి... ఇవన్నీ మన జీవితాల్లో ప్రతినిత్యం అనుసరిస్తూ ఉంటే పరలోక రాజ్యం సాధ్యం. ∙మానస ఎండ్లూరి -
ప్రార్థనతో ఆశ్రయం...ఆనందం
దేవుని ‘సంపూర్ణమైన సంరక్షణ’ ఒక కవచంలాగా, ఒక దుర్భేద్యమైన కోటలాగా మనల్ని, మన కుటుంబసభ్యుల్ని ఆవరించి ఉండగా ఏ అపాయమూ మనల్ని సమీపించదన్న అంశం చాలా విలువైనది. ఎన్నోసార్లు ఆ అంశం ఇతివృత్తంగా వ్యాసాలూ రాశాను. అయితే దేవుని మీద నాకున్న ఆ విశ్వాసానికి ఒక పరీక్ష ఎదురైంది. నా పెద్ద కూతురు ప్రవచన పెళ్లి జీవన్పాల్తో 2012లో జరిగినప్పటినుండి అతని ఉద్యోగరీత్యా వారు అబుదాబి (యుఏఐ)లో ఉంటున్నారు. మేమంతా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తుండగా, 2017లో ప్రవచన గర్భం దాల్చింది. అప్పటినుండీ నా భార్య ఇక్కడినుంచి వెళ్లి కూతురుతోపాటే ఉంది. స్కానింగ్‌లో కవల పిల్లలని చెప్పడంతో మా సంతోషానికి అవధుల్లేవు. డిసెంబర్ 1న ప్రసవం జరుగుతుందన్నారు. కొన్ని ప్రసవ సంబంధమైన కాంప్లికేషన్స్ ఉన్నా మేమెంతో ఆనందంగా ఉన్నాం. ఇంతలోనే హఠాత్తుగా, ప్రవచనకు నొప్పులొస్తున్నాయని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామంటూ నా భార్య ఏడుస్తూ ఆగస్టు 17న ఉదయం కాల్ చేసింది. ఏం జరుగుతోందో మాకర్థమయ్యేలోగానే మళ్ళీ కాలొచ్చింది ప్రసవమై ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని. మాకెవ్వరికీ ఆనందించాలో, బాధపడాలో తెలియని అనిశ్చిత స్థితి. సరిగా ఆరు నెలల ఆరురోజులకు పుట్టారు నా మనవరాళ్లు. వెంటనే అక్కడికెళ్లి ప్రార్ధించి అక్షయ, ఆశ్రయ అని నేనే నామకరణం చేశాను. అక్షయ 440 గ్రాముల బరువు, ఆశ్రయ 536 గ్రాములుంది. వాళ్ళు బతికే అవకాశాలు 15 శాతం మాత్రమేనని. ఒకవేళ బతికినా అన్ని శరీరాంగాలు, వ్యవస్థలు ఆరోగ్యంగా, సక్రమంగా ఉండే అవకాశం 5 శాతం మాత్రమేనని డాక్టర్లు తేల్చారు. ఆది మాకందరికీ ముఖ్యంగా ప్రవచనకు, జీవన్ పాల్‌కు పిడుగుపాటయ్యింది. వాళ్ళు బతకడం కష్టమని ఇంత గొప్ప డాక్టర్లు తేల్చేసినా, మేమంతా ప్రార్థిస్తునే ఉన్నాము. అయితే మనసులో ఏదో ఒక మూలన అనుమానం, దేవుడు అద్భుతం చేస్తాడా? అని. మా ఆశలు నీరుగార్చుతూ ‘అక్షయ’ 14 రోజులు మాత్రం బతికి ప్రభువును చేరుకుంది. జీవన్‌పాల్ తన భార్య కోసం ౖ«పైకి ధైర్యంగా కనిపిస్తున్నా, ప్రవచనను ఓదార్చడం మాలో ఎవరివల్లా కాలేదు. దేవుడు గొప్పవాడు, శ్రమల్లో చెయ్యి విడువడు అని ప్రసంగాలు, వ్యాసాల్లో లక్షలమందికి ప్రకటించే నా విశ్వాసానికి ఇప్పుడొక పెను సవాలు ఎదురయింది. ఆ రాత్రి భోరున ఏడుస్తూ ప్రవచన వచ్చి‘డాడీ, ఎందుకిలా అయ్యింది.. ఇంకొక పాపైనా దక్కుతుందా...’ అనడుగుతుంటే నాకూ దుఃఖం పొర్లుకొచ్చింది. కాని తేరుకొని ‘విశ్వాసానికి ప్రథమ శత్రువు భయమే. నీవు నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు, ఏడవొద్దు, ప్రార్థన చెయ్యి’ అని ప్రవచనను చిన్నప్పుడు సముదాయించినట్లే సముదాయించాను. ఆ రాత్రంతా మౌనంగా ప్రార్థన చేశాను. నా భార్య కూడా పుట్టెడు దుఃఖంలో ఉంది కాని ప్రార్థన చేస్తోంది. ఆశ్రయను బతికించమనీ, డిప్రెషన్ అంచుల్లో జీవచ్ఛవంలా ఉన్న నా కూతుర్ని కూడా బతికించమనీ... ఆ రాత్రంతా నేను చాలా మెల్లిగా చేసుకొంటున్న ప్రార్ధనలో ప్రతి మాటా తాను విన్నానని, అదే తనను బలపర్చిందని ఆ తర్వాత ప్రవచన నాకు చెప్పింది. ప్రవచన ఆ కాళరాత్రిలో ఎంత బలాన్ని ప్రభువులో పుంజుకొందంటే, ఆశ్రయ ఇంక్యూబేటర్లో ఉన్న ఆసుపత్రికి ప్రతి రోజూ వెళ్లి ఉదయం నుండి రాత్రి భర్త తనను పికప్ చేసుకోవడానికి వచ్చేదాకా లాంజ్‌లోనే ప్రార్థిస్తూ కూర్చునేది. దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుకునేది. కొందరైతే డిప్రెషన్‌తో ఆమె పిచ్చిదవుతోందన్నారు. డాక్టర్లు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని సూచించేవారు. ఈ లోగా మా విశ్వాసానికి అన్నీ అవరోధాలే!! ఆశ్రయ బ్రెయిన్లో క్లాట్ ఏర్పడింది, ఒకసారి ఊపిరితిత్తులు రెండూ ఫెయిల్ అయ్యాయి, కంటిచూపు మందగించింది, శరీరంలో రక్తం తగినంతగా లేక 5 సార్లు రక్తమార్పిడి చేశారు. అది ప్రతిసారీ ప్రాణగండమే. రెండుసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్కు గురై ఆశ్రయకు ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. కాని విశ్వసించినట్టే, దేవుడు ‘చిన్నారి ఆశ్రయ నావ’ ను ఇన్ని పెను తుఫానుల్లోనూ క్షేమంగా తీరం చేరుకోవడానికి ఇమ్మానుయేలు దేవుడై తన తోడునిచ్చాడు. వైద్యచరిత్రలో మరో అధ్యాయం సృష్టిస్తూ, వైద్యనియమాలను, విశ్వాసాలను తిరగరాస్తూ ఈ ఏడాది జనవరి 5 న ఆశ్రయ అబుదాబి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చింది. ఇదేమీ జరగనప్పుడు, మాకొక మనవడో, మనుమరాలో పుడితే ఎవరెస్టు పర్వతమంత ఆనందం మా సొంతమనుకునే వారం. కాని జనవరి 5న ఆశ్రయ ఇంటికొచ్చినపుడు మేమనుభవించిన ఆనందం పది ఎవరెస్టు పర్వతాలకన్నా ఎక్కువే! ఎందుకంటే అన్ని ఆరోగ్యవ్యవస్థలూ సక్రమంగా, అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తూ, అందరికీ ఆనందాన్ని పంచుతూ, ఆడుతూ. దేవుని పాటలు పాడుతూ పరవళ్లు తొక్కే జలపాతం లాంటి ‘ఆశ్రయ’, దేవుడు మా కుటుంబానికిచ్చిన అపురూపమైన మాకు క్రిస్మస్ కానుక. దేవునిలో మా అందరి విశ్వాసం రెట్టింపయ్యింది. మానవాళికి తోడుగా ఉండేందుకు యేసుప్రభువే భువికి దిగివచ్చిన క్రిస్టమస్ రాబోతోంది... ఆయన తోడ్పాటును కోరుకోవడానికి అందరికీ ఇది మరో అవకాశం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
శక్తి మేరకు కట్టుబాటు
ఆంగ్లేయుల కాలంలో ఓ మసీదు ఇమామ్ సాబ్ ను బ్రిటీషు పోలీసులు దేశద్రోహం కేసులో అరెస్టు చేసి జైలులో వేశారు. ధార్మికంగా నిష్టగా ఉండే ఇమామ్ గారికి జైలులో నమాజు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ శుక్రవారం జుమా నమాజు కోసం మసీదుకు వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. బ్రిటీషు పోలీసులు అనుమతిచ్చేవారు కాదు. అయినప్పటికీ జుమా నమాజు కోసం తలంటు స్నానం చేసి సిద్ధమయ్యేవారు. జుమా నమాజు అజాన్ వేళయిందంటే చాలు అజాన్ పిలుపు వినేందుకు ఎంతో ఆతృతతో జైలు ప్రవేశ ద్వారం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి జైలు ఇనుప చువ్వలు పట్టుకుని నిల్చునే వారు. అజాన్ పలుకులు పూర్తిగా విన్న తరువాతనే తన జైలు గదిలోకి వెళ్లి కూర్చునేవారు. ఆయన ప్రతీసారీ శుక్రవారం ఇలానే చేసేవారు. ఎన్నో శుక్రవారాలపాటు ఈ వ్యవహారమంతా గమనించిన జైలరు గారు ఒకరోజు హాఫిజ్ గారిని తన గదికి పిలిపించుకుని ‘‘ఈ జైలు పరిసరాలనుంచి నువ్వు బయటికెళ్లలేవని తెలిసి కూడా ప్రతి శుక్రవారం నమాజు కోసం సిద్ధమయ్యి గేటు దగ్గర అలా ఎందుకు ఎదురు చూస్తుంటావు’’ అని అడిగారు. దానికి ఇమామ్ సాబ్ ‘‘జైలరు గారూ, శుక్రవారం అజాన్ వినగానే పనులన్నీ పక్కనపెట్టి నమాజు కోసం బయలుదేరాలన్నది నా ప్రభువు ఆజ్ఞ. నా శక్తిమేరకు నా ప్రభువు ఆజ్ఞకు కట్టుబడి ఉన్నానని అనుకుంటున్నాను. నా ఈ పరిస్థితిని చూసి అల్లాహ్ తన దాసుల జాబితాలో నాపేరును తప్పకుండా నమోదు చేసుకుంటాడు. ఎందుకంటే అల్లాహ్ ఎవ్వరి పైనైనా శక్తికి మించిన భారం మోపడు. అల్లాహ్ నాకు తప్పకుండా శుక్రవారం నమాజు పుణ్యాన్నిస్తాడు. నా ఈ ఆచరణ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే’’ అని చెప్పాడు! జైలరు గారు ఆశ్చర్యపోయారు. ప్రతీ భక్తుని ఆలోచనా దృక్పథం ఇలానే ఉండాలి. మనం మన పరిధిలో, మన శక్తిమేర ధర్మంపై నిలకడను ప్రదర్శించాలని, ధర్మాజ్ఞలకు కట్టుబడేందుకు కృషిచేయాలని ఈ గాథ తెలియజేస్తోంది – నాజియా -
వానదేవుడు ఆకాశవాణి
అతనికి సెలవనేదే లేదు. అతని ఉద్యోగమే అలాంటిది. నిజానికి నగర వీధులు పరిశుభ్రంగా ఉండాలంటే సెలవు రోజుల్లోనే బాగా నీళ్లు చల్లాలి. అందుకోసమే మున్సిపాలిటీ వాళ్లు చాలా వాహనాలు పెట్టారు.వాటిలో ఒకదానికి ఆయన డ్రైవర్.ఒక్కోసారి నెలల తరబడి వానచుక్క నేలరాలదు. అలాంటి రోజుల్లో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా తన వ్యాన్‌లోని నీళ్ల ట్యాంకును ఖాళీ చేస్తూ, పొడవైన దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లమీద నీళ్లు చల్లుతూ ఉండవలసి వస్తుంది. వేసవి కాలంలో మధ్యాహ్న వేళల్లో కొంచెం నయం. బాగా కాగిన నేలలోంచి మట్టి వాసన వస్తుంది. అది అతనికి తల్లిపాలకోసం నోటితో తడిమే పిల్లవాడికి తల్లి వెచ్చని శరీరం నుంచి వచ్చే కస్తూరి వాసన లాగా అనిపిస్తుంది. చలికాలంలో అలా ఉండదు. నేల మీది మంచుగడ్డను పగలగొట్టాలి. రక్తం గడ్డకట్టే చలి అయినా నిర్జనమైన రోడ్లను శుభ్రం చేయాల్సిందే. ఈ రొడ్డకొట్టుడు జీవితానికి విరుగుడు వాన. వాన అంటే అతనికి సెలవు అని అర్థం. అప్పుడు అతను చెయ్యవలసిన పనిని వానదేవుడు చేస్తాడు. అతను విశ్రాంతి తీసుకుంటాడు.అప్పుడప్పుడు పడుకుంటూ అతను, ‘‘ఓ భగవంతుడా! రేపు వాన కురిపించు. నేను సాయంకాలం దాకా నిద్రపోతాను.’’ అని ప్రార్థన చేస్తాడు. కొన్నిసార్లు భగవంతుడు ఆయన మొర ఆలకిస్తాడు. రాత్రిపూట వాన కురుస్తుంది. అతను పొద్దున్నే నిద్రలేస్తాడు. వానపడి ఉండటం చూసి మళ్లీ పడుకుంటాడు. శరీరంలోని ప్రతి అణువూ విశ్రాంతి పొందే దాకా అలా పక్కమీద పడుకుంటాడు. పూర్తిగా విశ్రాంతి తీసుకుని విసుగొచ్చే దాకా పడుకుంటాడు. అతను పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య వీరో. ఆమె చాలా సాదాసీదాగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న తరువాత కూడా అతను తన పద్ధతిని మార్చుకోలేదు. ఉదయం ఆమె లేవకముందే ఇల్లు వదిలిపోయేవాడు. సాయంత్రం ఇరుగు పొరుగు ఆడవాళ్లు బజారుకు పోయి తమ మగవాళ్లతో తిరిగి ఇళ్లకు చేరిన చాలాసేపటికి అతను తిరిగి ఇల్లు చేరుకుంటాడు. బహుశా ఒక బిడ్డ పుడితే అతని పరిస్థితిలో మార్పు రావచ్చని వీరో ఆశించింది. పాపతో ఆడుకోవడానికి ఉబలాటపడతాడని, ఆ రకంగా ఇంటి దగ్గర ఎక్కవసేపు ఉంటాడని అనుకుంది.వీరోకు కొడుకు పుట్టాడు. కానీ అతని విధానంలో మార్పు రాలేదు.ఏమీ పనిలేనప్పుడు కూడా అతను ఇంట్లో ఉండకుండా ఇరుగు పొరుగు వాళ్లతో పిచ్చాపాటి మాట్లాడటానికో, చెట్టు కింద పేకాట ఆడటానికో వెళ్లిపోయేవాడు. పొద్దున్నే పిల్లవాడింకా లేవకముందే, పక్క వీధిలో ఉన్నావిడ భర్తలాగా తన భర్త తనను అలా మున్సిపల్ పార్క్ వైపు తీసుకుపోతే బాగుండునని వీరో ఆదేశించింది. సాయంత్రం కొడుకు కళ్లకు కాటుక దిద్ది అందమైన బట్టలు వేస్తుంది. కానీ ఆ పిల్లవాని తండ్రి అతడు చలాకీగా ఆడుకుంటూ చిలిపి చేష్టలు చేస్తుండగా చూడటానికి రాడు. ఒకరోజు సాయంకాలం. అది పున్నమికి ముందటి రోజు. ఇరుగుపొరుగు ఆడవాళ్లు గుడికి పోవడానికి తయారవుతున్నారు. వీరో వాళ్లను చూసింది. ఆ రాత్రి తాము కూడా మర్నాడు ఉదయం గురుద్వారాకు ఎందుకు వెళ్లకూడదని భర్తనడిగింది. ‘‘వాన దేవుణ్ని వాన కురిపించమని అడుగు. మనం కూడా గురుద్వారాకు వెళ్లవచ్చు’’ అని గొణుగుతూ నిద్రలోకి జారుకున్నాడతను. చుక్కలు నిండిన వినీలాకాశం వైపు చూస్తూ వీరో ప్రార్థన చేసింది – ‘‘భగవంతుడా! ఈ రాత్రి వాన కురిపించు. రేపు గురుద్వారాకు పోవాలనుకుంటున్నాను. నాతో కూడా నా కొడుకు నా భర్త రావాలని నా కోరిక’’.ఆ రాత్రి వాన పడింది. మర్నాడు ఉదయం ఆ కుటుంబం గురుద్వారాకు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తూ దారిలో దండిగా మిఠాయి కొనుక్కున్నారు. మున్సిపల్ పార్కుకు కూడా వెళ్లారు. సాయంకాలం కొడుకు నాన్న పొట్టమీద కూర్చుని ఆడుకుంటున్నాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. నవ్వుకున్నారు. ఆ రాత్రి వీరో ఎంతో సంతోషించింది. తెల్లవారుతున్నా దీపం మండుతూనే ఉంది. వత్తి కాలిపోయి దానంతట అది ఆరిపోయేదాకా కిటికీలో దీపం వెలుగుతూనే ఉంది.ఒకసారి ఆమె ప్రార్థనను మన్నించిన వానదేవుడు మళ్లీ వాన విషయం మరిచిపోయినట్టున్నాడు. వీరో కొన్నాళ్లు తాము గడిపిన ఆ సెలవు దినాన్ని స్మరించుకుంటూ గడిపేసింది. కానీ జీవితం మళ్లీ నిస్సారమనిపిస్తోంది. ఇంటి మీద అయిష్టత, ఇరుగుపొరుగు ఆడవాళ్ల మీద అపారమైన అసూయపెరిగాయి. వర్షం కోసం ప్రార్థించింది. కానీ లాభం లేదు. నెలరోజులు గడిచిపోయాయి. పున్నమి రోజు వచ్చింది. చుట్టుపక్కల వాళ్లు పరమానందంగా ఉన్నారు. స్త్రీలు చీరలకు మిరుమిట్లు గొలిపే రంగులు అద్దుకున్నారు. పురుషులు గడ్డాలు సవరించుకుని మీసాలు చక్కగా మెలేసుకున్నారు. వాళ్లు ఆరోజు బజారులో, గురుద్వారాలో కాలక్షేపం చేస్తున్నట్లు వీరో తెలుసుకుంది. ఆరాత్రి అలిసిపోయి తూగుతున్న భర్తకు పున్నమిని గుర్తుచేసి అతనితో వాదనకు దిగింది. అతను పాత సమాధానమే చెప్పాడు – ‘‘వరుణదేవుణ్ని వర్షం కోసం ప్రార్థించు. మనం కూడా గురుద్వారాకు పోదాం’’. ఆ తర్వాత నిద్రపోయాడు. వీరో పక్కమీద కూర్చొని పెదవులు కదిలిస్తూ ప్రార్థించింది – ‘‘ఓ భగవంతుడా! వాన కురిపించు. ఓ స్వామీ! వాన కురిపించు’’. ప్రార్థన చేస్తూ చేతులు అలా జోడించుకునే నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి పిడుగు పడిన శబ్దం ఆమెను నిద్రలేపింది. మెరుపు మెరిసింది. వర్షం మొదలైంది. మర్నాడు ఉదయమే కుటుంబమంతా గురుద్వారాకు వెళ్లారు. తిరిగివస్తూ బజారు మీదుగా, మున్సిపల్ పార్క్ మీదుగా వస్తూ నగరంలోని బంధువుల్ని పలకరించారు. ఆ రోజు పరమానందంగా గడిచిపోయింది. వీరో తన చీరకు అంచు కొనుక్కోవాలనుకుంది. ఆ విషయం ఇంటికి వచ్చేసినాక గుర్తుకొచ్చింది. బజారు చాలా దూరం. పైగా పిల్లవాడు బాగా అలిసిపోయి నీరసంగా ఉన్నాడు. మళ్లీ బయటికి వెళ్లడానికి బాగా ఆలస్యమైంది. కానీ చీరకు అంచు కొనుక్కోవాలనే కోరిక మనసులో మిగిలిపోయింది. రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేసింది. ‘‘స్వామీ! వాన కురిపించు. దయచేసి ఒక్కసారి..’’ అందుకు లోలోపలే సిగ్గు పడింది. అది గుడిలో పూజారిని రెండోసారి ప్రసాదం అడిగినట్లనిపించింది. ఆ రాత్రంతా ఆమె అదే ఆలోచనతో పక్కమీద పొర్లుతూనే గడిపింది. ఎడారిలో దప్పికతో వరపుతో తిరుగుతున్నట్టు, అడవిలో దారితప్పి తిరుగుతున్నట్టు, అగాధంలో పడిపోతున్నట్టూ కలలు వచ్చాయి. ఉదయ కాంతులు చీకటిని పారదోలుతున్న సమయంలో పిల్లవాని ఏడుపు విని వీరో మేల్కొంది. కళ్లు గట్టిగా నులుముకుంది. చూస్తే వర్షం కురుస్తోంది. వీరో ఉలిక్కిపడింది. భయంతో వణికిపోతూ వర్షం వైపు చూస్తూ కిటికీ దగ్గర నిలబడింది. భయాన్ని, ఉలికిపాటును వదిలించుకొని గురుద్వారాకు వెళ్లడానికి ఉపక్రమించింది. అవీ ఇవీ కొనుక్కోవడానికి ఇంకో పదిరూపాయలు ఖర్చు పెట్టింది. ఆ మధ్యాహ్నం ఆమె చెల్లెలు, మరిది వచ్చారు. కుండపోతగా వర్షం కురుస్తున్నందువల్ల వాళ్లు ఆ రోజు తర్వాత రెండు రోజులూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. మరిది చికాకు పడ్డాడు. వాళ్ల ఊరెళ్లే రైలును అందుకోవాలనుకున్నాడు. కానీ వాన కుండపోతగా కురుస్తూనే ఉంది. తను ఆగిపొమ్మంటే వాన ఆగిపోతుందనే భావన ఉంది వీరోకి. ఆగమంటే చాలు ఆకాశంలో మేఘాలు ఖాళీ చేస్తాయి. చుట్టాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత నమ్మకం కలుగుతూంది ఆమెకు తనమీద. వాళ్లు పదకొండు గంటల రైలందుకోవాలి. అప్పుడే తొమ్మిది దాటింది. వాళ్ల ఇబ్బందికి కారణం లేకపోలేదు.‘‘వాన పది గంటలకు ఆగిపోతుంది. మీరు అప్పుడు వెళ్లవచ్చు’’ అంది వీరో.సరిగ్గా పది గంటలకు వర్షం ఆగిపోయింది. ఆమె చెల్లెలూ మరిది చాలా సంతోషించారుగాని వీరో భర్త మాత్రం దానిని గుర్తించలేదు. వీరో మనసులోంచి ఆ విషయాన్ని తొలగించుకోలేకపోయింది. భర్త బట్టలు ఉతుకుతూ వాకిలి ఊడుస్తూ, ఇంకా ఇతర ఇంటి పనులు చేసుకుంటూ, తాను కోరినప్పుడు వాన రావడం, ఆగిపోతుందన్నప్పుడు ఆగిపోవడం ఎలా జరుగుతుందో మధ్యమధ్యలో ఆమె జ్ఞాపకం తెచ్చుకుంటోంది. తనలో తానే ఉప్పొంగిపోతోంది. కిటికీ దగ్గర నిలబడి ఆకాశంవైపు చూస్తూ నవ్వుతూ గంటలు గడిపేస్తోంది. అక్కడ ఎవరో నిలబడి తనవైపు చూసి నవ్వుతున్నట్లు భావిస్తుంది. జీవితం చాలా హాయిగా ఉన్నట్లుంటుంది. ఆకాశంలో గంటల తరబడి కొనసాగుతున్న నిశ్శబ్ద బంధుత్వానికి భంగం కలిగించిందొకటి. అది పక్కింటి రేడియో. అది ఉదయం మధ్యాహ్నం సాయంకాలం విశ్రాంతి లేకుండా శబ్దం చేస్తూనే ఉంది. చెవుల్లో వేళ్లు పెట్టి మూసుకుంది. దూది పెట్టుకుంది. కానీ రేడియో శబ్దం వినిపించకుండా అరికట్టలేకపోయింది. ఆ రేడియో శబ్దం చెవులు చిల్లులు పడేట్టుండటమే కాదు, మనసు పొరల్ని కూడా చీల్చేస్తోంది. అంతే కాక ఆమె సర్వస్వాన్ని ఆక్రమించేస్తోంది. కొంతకాలం తర్వాత గాలిలోంచి వస్తున్న సంగీతాన్ని వింటూ ఆనందిస్తున్నట్లు అనిపించింది వీరోకు. చాలా పాటలు నోటికి వచ్చాయి. తనలో తానే పాడుకుంటోంది.ఆమె కొడుకు కూడా పిల్లల పద్ధతిలో రాగాలు తీస్తున్నాడు. పాలవాడు, కూరగాయలవాడు, పాకీ ఆవిడ వంటి వాళ్లంతా తమ పనులు తాము చేసుకుంటూ రేడియో సంగీతం పాడుతున్నారు. ఒకరోజు సాయంత్రం వీరో రేడియో వింటూ పక్కింట్లో ఉంది. సంగీతం పూర్తికాగానే, కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటన వెలువడింది. ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను కూడారావొచ్చని ఆ ప్రకటన చెప్పింది. ఆ వాతావరణ సూచన వీరో మొహం మీద కొట్టినట్లయింది. వర్షం కురుస్తుందని, లేదని రేడియో ఎలా చెప్పగలుగుతుంది? అసాధ్యం. ఆ రాత్రి పిడుగుపడిన శబ్దం విని ఆమె మేల్కొంది. వర్షం బోరున కురుస్తోంది. వర్షం వెంట తుఫాను. ఆ తర్వాత వీరోకు నిద్ర రాలేదు. మళ్లీ పున్నమి వచ్చింది. వీరో వర్షం కోసం ప్రార్థన చేసింది. రాత్రంతా చేతులు జోడించి ప్రార్థన చేసింది. అలాగే ఆకాశం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. చుక్కలు స్పష్టంగా వెలుగుతున్నాయి. చందమామ ఆమెను చూసి నవ్వాడు. మబ్బులూ లేవు. వానా లేదు. వాతావారణం పొడిగా ఉంటుందని రేడియో చెప్పింది. మరో నెల గడిచింది. మళ్లీ పున్నమి వచ్చింది. వీరో దేవుని తలుచుకుంది. కళ్లనీళ్లు పెట్టుకొని ప్రార్థించింది. మొక్కులు మొక్కుకుంది. వినీలాకాశంలోంచి చుక్క వాన కూడా రాలలేదు. చుక్కలు ప్రకాశించాయి. నిండు చంద్రుడు నవ్వాడు. పొడి వాతావరణమే కొనసాగుతుందని రేడియో ప్రకటించింది. ప్రతిరోజూ రేడియో అలాగే చెబుతోంది. మళ్లీ ఒక పున్నమి రాత్రి వచ్చింది. ఈసారి ఆమె ఉపవాసం ఉంటూ మరింత భక్తిశ్రద్ధలతో ప్రార్థించింది. ఫలితం శూన్యం. చుట్టుపక్కల వాళ్లు నవ్వుకుంటూ సంతోషంగా గురుద్వారాకు వెళ్లారు. ఆమె భర్త తూర్పుపటం ఎగరక ముందే పనిలోకి వెళ్లిపోయాడు. ఆమె చుక్కలు మెరిసే ఆకాశం వైపు చూసి వేదనగా అడిగింది – ‘‘నీకేం పోయేకాలం వచ్చింది?’’. (‘పున్నమిరాత్రి – ఇతర కథానికలు’ సౌజన్యంతో) పంజాబీ మూలం : కర్తార్‌సింగ్ దుగ్గల్ అనువాదం: రాచపాళెం చంద్రశేఖరరెడ్డి -
ఇలా మాట్లాడతానని ఊహించలేదు: అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయితో తనకు ఆరున్నర దశాబ్ధాల స్నేహం ఉందని బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ గుర్తుచేసుకున్నారు. తామిద్దరం కలిసి సినిమాలు చూశామని, ఎన్నో పుస్తకాలు చదివామని అన్నారు. అటల్జీ మరణం తమందరికీ తీరని నష్టమని చెప్పారు. వాజ్‌పేయి గొప్ప నేతని, ఆయన మరణంతో రాజకీయ వ్యవస్థలో శూన్యత ఏర్పడిందని అద్వానీ అన్నారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన వాజ్‌పేయి సంస్మరణ సభలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. అటల్జీ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన నుంచి విలువైన పాఠాలను తాను స్వీకరించానని అద్వానీ చెప్పుకొచ్చారు. తాను ఎన్నో బహిరంగ సభల్లో ప్రసంగించినా అటల్జీ పరోక్షంలో ఇలాంటి సమావేశంలో మాట్లాడతానని తాను ఊహించలేదన్నారు. తాను రచించిన పుస్తకావిష్కరణ సభలో వాజ్‌పేయి లేకపోవడం తనను బాధించిందని దివంగత నేతకు నివాళులర్పిస్తూ అద్వానీ పేర్కొన్నారు. రాజీ ఎరుగని వాజ్‌పేయి : మోదీ పార్లమెంట్లో పలు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నా ఎన్నడూ తన సిద్ధాంతాలతో వాజ్‌పేయి రాజీపడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అత్యున్నత విలువలతో కూడిన పార్లమెంటేరియన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాలకు వాజ్‌పేయి వన్నెలద్దారని కొనియాడారు. ఎక్కడా ఘర్షణలు, అశాంతికి చోటులేకుండా ఏకాభిప్రాయంతో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కేవలం ఒక పార్టీ అధికారం చెలాయిస్తున్న రోజుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వాజ్‌పేయి నిత్యం ప్రజల కోసం పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురు రామ్‌దేవ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ఇతర విపక్ష నేతలతో పాటు అటల్ బిహారి వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా భట్టాచార్య, మనుమరాలు నీహారిక తదితరులు పాల్గొన్నారు. -
దేవుడితో మాట్లాడే సమయం
‘‘మంత్రజపాలు చేసినా, హోమాలు నిర్వహించినా, యజ్ఞయాగాదులు చేసినా, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా బుద్ధి కుదురుగా లేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే మోక్షం కలుగదు’’ అని తనను దర్శించడానికి వచ్చే భక్తులకు తరచు బోధించేవారు సాయి. ఒక గింజ మొలకెత్తి, చిగురులు తొడిగి, వృక్షం కావాలంటే ఎన్నో శక్తులు, ఎన్నో విధాల సాయం చేస్తాయి. నేల, నీరు, గాలి, సూర్యుడు.. ఇవన్నీ ఊపిరులూదితే కానీ ఆ గింజ ప్రాణం పోసుకోదు. ఎదగదు. అయినా ఇవన్నీ ఆ మొక్క నుంచి ఏమీ ఆశించవు. మీరూ ఎవరినుంచీ ఏమీ ఆశించకండి. చేతనైతే ఎవరికైనా మేలు చేయండి లేదంటే కనీసం కీడు చేయకుండా ఉండండి’’ అని బాబా బోధించేవారు. ఎల్లవేళలా దైవనామస్మరణ చేసేవారిని మాత్రమే కాదు, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవటం, మంచి భావనలతో మనసును నిష్కల్మషంగా ఉంచుకోవటం.. వీటిని ఆచరించేవారిని కూడా బాబా సదా అంటిపెట్టుకుని ఉంటారు. బాబా చూపిన ఆధ్యాత్మిక బాట కేవలం భక్తిపరమైనదే కాదు, అది మంచి జీవనశైలిని కూడా అలవరుస్తుంది. దానిని ఆచరించిన వారు అన్నింటా మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఆయన ఆచరణ సాధ్యం కాని విషయాలను ఆచరించమని చెప్పలేదు. ఫలానా నియమాలను పాటించాలని, యజ్ఞయాగాదులు చేయమని సూచించలేదు. తననే పూజించమని చెప్పలేదు. మరేం చేశారంటే.. మనిషి మోక్షం పొందడానికి సరికొత్త జీవన విధానాన్ని ప్రచారం చేశారు. అంతేకాదు, ఆ విధానంలో ఎలా జీవించాలో అందరికీ జీవించి చూపారు. అలాంటి జీవన శైలిని అలవరచుకుంటే ఎవరయినా ఎంతటి స్థాయికి చేరుకోగలరో తెలిసేలా జీవించారు. సాయి చెప్పిన దానిని బట్టి ప్రార్థన అంటే దేవుడితో బేరం కుదుర్చుకోవడం కాదు. ‘ఫలానా పని అయితే నీ దగ్గరకు వస్తాను, అదిస్తాను, ఇదిస్తాను, నాకు ఈ పని అయ్యేలా చూడు’ అని మొక్కుకోవడం కాదు. నిజమైన ప్రార్థనలో ప్రతిఫలాపేక్ష ఉండదు. మనకు జీవితమనే గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం ప్రార్థనలోని పరమార్థం. ఇంకా సూటిగా చెప్పాలంటే – ‘ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడే సమయం’అన్నమాట. నిజంగా దేవుడి కోసం చేసే ప్రార్థనలో కోరికలు ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకూడదు. నిజమైన భక్తి ఎలా ఉండాలంటే.. మనసులో మంచిని తలుచుకోవాలి. కళ్లతో మంచిని చూడాలి. నాలుకతో మంచిని మాట్లాడాలి. చెవులతో మంచిని వినాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నిర్మలం కాని మనసులోకి భగవంతుడు ప్రవేశించలేడు. కాబట్టి పైన చెప్పిన మంచి పనులన్నింటినీ చేస్తూ, మనసును పూర్తిగా భగవంతుడి పైన లగ్నం చేయాలి. -
ఆర్చ్‌బిషప్ లేఖ.. రాజకీయ దుమారం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కల్లోల రాజకీయ వాతావరణం నెలకొందని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయంటూ ఢిల్లీ ఆర్చ్‌బిషప్ లేఖ రాయడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘దేశం కోసం’ ప్రార్థించాలంటూ క్రైస్తవ మతబోధకులను ఉద్దేశించి ఆయన లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని చర్చిలను ఉద్దేశించి ఈ నెల 8న ఆర్చ్‌బిషప్ అనిల్ కౌటో రాసిన ఈ లేఖను బీజేపీ తప్పుబట్టింది. ‘కులం, మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టాలనుకోవడం తప్పు. సరైన పార్టీకి, సరైన అభ్యర్థికి ఓటు వేయమని మీరు చెప్పవచ్చు. కానీ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఓటు వేయకూడదని చెప్తూ మీకు మీరే కుహనా లౌకికవాదిగా అభివర్ణించుకోవడం దురదృష్టకరం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ సమ్మిళిత అభివృద్ధి కృషి చేస్తున్నారని, ఏ ఒక్క వర్గంపైనా కేంద్రం వివక్ష చూపడం లేదని, ఈ నేపథ్యంలో అందరూ ప్రగతిశీల సానుకూల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరముందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ‘దేశం కోసం’ ప్రార్థనా ప్రచారం చేయాలని, ప్రతివారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని, ప్రతి ఆదివారం సామూహిక ప్రార్థనల సందర్భంగా తప్పకుండా లేఖలో పేర్కొన్న ప్రార్థనను చదివి వినించాలని ఆర్చ్‌బిషప్ అనిల్ కౌటో తన లేఖలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రాజకీయ కల్లోల వాతావరణాన్ని చూస్తున్నాం. ఇది మన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామిక విలువలు, లౌకిక నిర్మాణానికి ముప్పుగా పరిణమిస్తోంది’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో హుందాతనంతో కూడిన ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, మన రాజకీయ నాయకుల్లో స్వచ్ఛమైన దేశభక్తి జ్వాల ఎగిసిపడేలా చూడాలని ప్రభువును కోరుతూ ప్రార్థన చేయాలని లేఖలో సూచించారు. అయితే, ఈ లేఖలో ఎలాంటి రాజకీయ ప్రేరేపణ లేదని, ఎన్నికలకు ముందు ఇలా లేఖ రాయడం ఆనవాయితీగా వస్తుందని ఆర్చ్‌బిషప్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
దేవుడా.. ఓ మంచి దేవుడా
భోజనం చేసే ముందు ప్రార్థన చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్లను చూడగానే మనందరికీ వెంటనే వెంకటేశ్ గుర్తొస్తుంటారు. వెంకటేశ్ ఎందుకు గుర్తుకు వస్తారు అనుకుంటున్నారా? ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ‘దేవుడా ఓ మంచి దేవుడా. మాకు తినడానికి అన్నం ఇచ్చావ్. కలుపోవటానికి కూర, పప్పు, సాంబార్ ఇలా అన్నీ ఇచ్చావ్. చాలా థ్యాంక్స్’ అంటూ వెంకీ చేసే సరదా ప్రార్థన, ఆయన చూపించే కామిక్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోలేరు. ఇక్కడున్న ఫొటోలో జాన్వీ కపూర్ కూడా భోజనం చేసే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కానీ జాన్వీ కపూర్ వెంకటేశ్ లాగా సరదా ప్రార్థన చేయడం లేదండోయ్. సీరియస్‌గా ప్రార్థిస్తున్నారట. జాన్వీ ఫస్ట్ మూవీ ‘ధడక్’ కంప్లీట్ అయిన తర్వాత టీమ్ మెంబర్స్ అందరూ డిన్నర్‌కు కలిశారట. అప్పుడు జాన్వీ ఇలా ప్రార్థన చేస్తుంటే టీమ్ మెంబర్ ఒకరు ఫొటో తీసి ఆన్లైన్లో షేర్ చేశారు. ‘ధడక్’ సినిమా జులై 20న రిలీజ్ కానుంది. -
మీ ప్రార్థనకు చేరువలోనే దేవుని జవాబుంది
తాను పూర్తిగా దీనులు, పేదల పక్షపాతినని యేసుప్రభువు ఎన్నో వాక్యాల్లో, ఉదంతాల్లో స్పష్టం చేశాడు. దౌర్జన్యాన్ని దీనత్వంతో, దుర్మార్గాన్ని ప్రేమతో, అరాచకాన్ని క్షమాశక్తితో మాత్రమే ఎదుర్కొని శాశ్వతంగా శాంతిస్థాపన చేయగలమని యేసుప్రభువు విశ్వసించాడు, బోధించాడు, ఆచరణలో రుజువు చేశాడు కూడా. యెరూషలేములోని ఆదిమ చర్చిని, విశ్వాసులను భయంకరంగా హింసించిన పౌలు ఇపుడు సిరియా లోని చర్చిల్ని ధ్వంసం చేసి, విశ్వాసులను చెరపట్టి యెరూషలేముకు తెచ్చి హింసించేందుకు అనుమతి పత్రికలతో బయలుదేరుతుంటే ప్రధాన యాజకులు, యూదులు బహుశా పట్టణంలో తోరణాలు కట్టి మరీ అతనికి గొప్ప వీడ్కోలునిచ్చి ఉంటారు (అపో.కా. 9:2). పట్టణమంతా ఇలా యూదుల కోలాహలంతో నిండి ఉంటే, పౌలు అరాచకాలకు బాధితులై భయపడి, పూర్తిగా కృంగిపోయిన నిస్సహాయులైన క్రైస్తవ విశ్వాసులు మాత్రం పౌలు చిత్రహింసలనుండి విడుదల కోసం యెరూషలేములోనే రహస్యస్థలాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో బలహీనులు చేసే ప్రార్థనకు వెయ్యి ఏనుగుల బలముంటుంది. సిరియాలో అరాచకం సృష్టించేందుకు వెళ్లిన పౌలును, వారి ప్రార్థనలకు జవాబుగా దమస్కు శివార్లలోనే దేవుడు పట్టుకున్నాడు. అక్కడ యేసుప్రభువు సాక్షాత్కారంతో పౌలు అనూహ్యంగా గొప్ప క్రైస్తవ సాక్షిగా మారాడు. సిరియాలోని క్రైస్తవులను తెగనరికి వారి తలలతో యెరూషలేముకు తిరిగొస్తాడనుకున్న పౌలు, ఇపుడు సువార్తికుడై చేతిలో బైబిలుతో తిరిగొచ్చి తాను చర్చిలను పడగొట్టి, విశ్వాసులను హింసించిన చోటే యేసే రక్షకుడంటూ సువార్త ప్రచారం చేస్తున్నాడు. ఇది అక్కడి యూదులకు, క్రైస్తవ విశ్వాసులకు కూడా అనూహ్యమైన పరిణామం. ఒకప్పటి ‘యూదుల హీరో’, ఇపుడు విశ్వాసులు, చర్చిల తరపున పరిచర్య చేసే ‘క్రైస్తవ హీరో’ అయ్యాడు. చేతిలో కత్తితో పౌలు ఎంత బీభత్సాన్ని సృష్టించాడో, ఇపుడు చేతిలో బైబిలుతో అంత శాంతిస్థాపన చేస్తున్నాడు. ఒకప్పుడు తుఫాను గాలులకు అల్లాడిన చెట్టుకొమ్మల్లాగా భయంతో హడలిపోయిన చర్చి, ఇప్పుడు దినదినం క్షేమాభివృద్ధినొందుతూ శాంతితో విలసిల్లిందని బైబిల్ చెబుతోంది (అపో.కా. 9:31). విశ్వాసుల ప్రార్థనకు జవాబుగా ఒకే అధ్యాయంలో కేవలం 30 వచనాల్లో దేవుడు చేసిన అద్భుతం ఇది. దీనులు, నిస్సహాయులు, కృంగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి ప్రార్థనలకు దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. వారి మొరలకు ఆయన తప్పక జవాబునిస్తాడు. ఎందుకంటే దేవుడు బలవంతులు, ధనికుల పక్షం కాదు, తాను పూర్తిగా దీనులు, పేదల పక్షపాతినని యేసుప్రభువు ఎన్నో వాక్యాల్లో, ఉదంతాల్లో స్పష్టం చేశాడు. దౌర్జన్యాన్ని దీనత్వంతో, దుర్మార్గాన్ని ప్రేమతో, అరాచకాన్ని క్షమాశక్తితో మాత్రమే ఎదుర్కొని శాశ్వతంగా శాంతిస్థాపన చేయగలమని యేసుప్రభువు విశ్వసించాడు, బోధించాడు, ఆచరణలో రుజువు చేశాడు కూడా. యెరూషలేములో బలహీనులైన ఆనాటి విశ్వాసులు చేసిన ప్రార్థనలు చరిత్ర గతినే మార్చేశాయి. పౌలు పరివర్తనతో యూదుల నోళ్లు మూతపడి, మరెప్పుడూ కోలుకోలేని విధంగా వారు పూర్తిగా బలహీనపడ్డారు, కాని చర్చి మాత్రం ఎంతో బలపడి తన జైత్రయాత్రలో ఘనవిజయాల దిశగా సాగిపోయింది. మీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో తీరని సమస్య, పూడ్చలేని లోటు ఉన్నాయా? మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మోకరించి, ‘దేవా నీవే నాకు దిక్కు, సాయం చెయ్యి’ అని ఒక నిస్సహాయుడిగా ప్రార్థించండి. దేవుడు ఊహించని విధంగా జవాబిస్తాడు. చర్చికి సమస్యగా ఉన్న పౌలు, విశ్వాసుల ప్రార్థనలకు జవాబుగా మారి అదే చర్చికి ఆశీర్వాదమైనట్టు, మీ సమస్యనే దేవుడు ఆశీర్వాదంగా మార్చుతాడన్నది బైబిల్ చెప్పే సత్యం, – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
పరిస్థితిని మార్చే ప్రార్థన
పరమ దుర్మార్గులు, క్రూరులు అయిన నీనెవె ప్రజలకు దుర్గతి కలుగబోతోందని ప్రకటించి పరివర్తన చెందేందుకు దేవుడు వారికొక అవకాశమిద్దామనుకున్నాడు. వారికి ఈ విషయం ప్రకటించే బాధ్యతను యోనా అనే ప్రవక్తకిచ్చాడు, అయితే యోనా అవిధేయుడై నీనెవెకు కాకుండా తర్షీషు అనే చోటికి పారిపోయేందుకు ఓడలో ప్రయాణమయ్యాడు. నీనెవె లోని లక్షా ఇరవై వేలమంది ఉజ్జీవానికి దేవుడు సంకల్పిస్తే, ఆ సంకల్పాన్ని నిర్వీర్యం చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తే దేవుడూరుకుంటాడా? యోనా ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకుంది. ఆ విపత్తు యోనా అవిధేయతకు దేవుడు చూపిస్తున్న ఉగ్రత అని తెలుసుకున్న మిగతా ప్రయాణికులు, యోనాను సముద్రంలోకి విసిరేశారు. అక్కడ దేవుడు నియమించిన ఒక మహా మత్స్యం, యోనాను మింగగా, మూడు రోజులపాటు యోనా దాని గర్భంలో మోకరించి పాశ్చ్యాత్తాప ప్రార్థన చేశాడు. తాను నీనెవెకు వెళ్తానని మొక్కుబడి కూడా చేశాడు. అప్పుడు దేవుడాజ్ఞ ఇయ్యగా మత్స్యం అతన్ని ఒడ్డున కక్కి వేసింది. వెంటనే యోనా నీనెవె పట్టణానికి వెళ్లి దేవుని మాటలు ప్రకటించగా, అంతటి దుర్మార్గులూ అనూహ్యంగా సాధువులైపోయి, ఉపవాసప్రార్థనలు చేసి తమ దుర్మార్గతను వదిలేశారు. అంతకాలం దుర్మార్గత అనే దుర్గంధంతో నిండిన నీనెవె పట్టణం, దేవుని ప్రేమ, క్షమ అనే అద్భుతమైన పరిమళంతో నిండిపోయింది. నరకం ఒక్కసారిగా పరలోకంగా మారితే ఎలాఉంటుందో నీనెవెలో ప్రత్యక్హంగా యోనాకు అనుభవమైంది. రగిలే ఒక నిప్పురవ్వే, ఉవ్వెత్తున లేచే మహాజ్వాలను సృష్టిస్తుంది.. తాను మారి ఉజ్జీవించబడితేనే విశ్వాసి తానున్న సమాజాన్ని మార్చి ఉజ్జీవింప చేయగలడు. దేవుడెవరో ఎరుగని లక్షా ఇరవైవేల మంది నీనెవె ప్రజలను మార్చడం కన్నా, తానెన్నుకున్న, తన సొంతవాడైన యోనాప్రవక్తను మార్చడానికే దేవుడు ఎక్కువగా శ్రమించవలసి వచ్చింది. అంతటి దుర్మార్గులైన నీనెవె ప్రజలూ ఒక్క ప్రసంగంతోనే తాము చేసేది తప్పని తెలుసుకున్నారు. కాని దేవునికెంతో సన్నిహితుడై వుండీ, ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా పోవడం తప్పని యోనాకు అనిపించలేదు. అయితే నీనెవె ప్రజల దుర్మార్గత అయినా, యోనా చూపించిన అవిధేయత అయినా, దేవుని దష్టిలో పాపమే!! నాలాంటి పవిత్రుడు నీనెవె ప్రజలవంటి దుర్మార్గుల వద్దకు పోవడమేమిటి? అనుకున్నాడు యోనా. నువ్వూ , నీనెవె ప్రజలూ సమాన పాపులే అన్నాడు దేవుడు. పాపాల్లో చిన్నవి, పెద్దవి అని లేవు. దేవుని దృష్టిలో ఎంతదైనా, ఏదైనా పాపం పాపమే. పాపి దాని నుండి విడుదల కావల్సిందే. దుర్మార్గులైన పాపులు, ఆంతర్యంలో పాపంతో నిండినా పైకెంతో పరిశుద్ధంగా నటించే వేషధారులు... అంతా దేవుని దృష్టిలో సమానమే. అయితే దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు నీనెవె ప్రజలనూ వదులుకోలేదు, యోనాను కూడా వదులుకోలేదు. మిమ్మల్ని, నన్నూ వదులుకోడు. యోనా ప్రార్థన అతని జీవితాన్ని, నీనెవె ప్రజల ఉపవాస ప్రార్థన వారందరి జీవితాల్ని మార్చింది. కోరికలు తీర్చే ప్రార్థనలు కాదు, జీవితాల్ని మార్చుకునే ప్రార్థనలు ఈ లెంట్‌లో చేద్దాం. – రెవ.డా.టి.ఏ.ప్రభు కిరణ్ -
అప్పుడు గీతా శ్లోకాలు.. ఇప్పుడు గాయత్రి మంత్రం
హర్యానా : పాఠ్య పుస్తకాల్లో గీతా శ్లోకాలను ప్రవేశపెట్టిన హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు ముందుకు వేసింది. పాఠశాలల్లో రోజువారి ప్రార్థనా గీతంగా గాయత్రి మంత్రాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈమేరకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. దీనికి సంభందించి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత విలువలు, సంస్కృతి, సంప్రాదాయలను పెంపొందించేందు గాయత్రి మంత్రం సహాయపడుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి రామ్ బిలాష్ శర్మ నిర్ధారించారు. డిపార్టుమెంట్‌లోని పలువురు సీనియర్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు గాయత్రి మంత్రం గొప్పతనం తెలిసేలా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గాయత్రి మంత్రం సాథువులు,రుషులు ప్రపంచానికిచ్చిన వరం అని విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ తెలిపారు. ఇక పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో గాయత్రి మంత్రం తప్పనిసరి అన్నారు. 2015లోనే గీతా శ్లోకాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఖట్టర్ భావించినా ప్రతిపక్షాలనుంచి తీవ్ర విమర్శలు రావడంతో 2016లో సిలబస్‌గా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
టీచర్లు రాక.. ప్రార్థన చేయించిన ఎంఈఓ
చిన్నచింతకుంట(దేవరకద్ర): మండల పరిధిలోని అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ విద్యార్థులతో ప్రార్థన చేయించారు. ఆ సమయానికి ఉపాధ్యాయులు ఒక్కరు కూడా రాలేదు. చాలారోజులుగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారని ఎంఈఓ తెలిపారు. దీంతో వారిని పలుమార్లు హెచ్చరించినా పనితీరు మారలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశానని, ఉదయం 9:30 అవుతున్నా ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. హెచ్ఎం.బాలయ్య , ఉపాధ్యాయుడు నాగరాజు, గోపాల్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇర్మా బాధితుల కోసం వైఎస్ జగన్ ప్రార్థన
సాక్షి, అమరావతి: హరికేన్ ఇర్మా బాధితులు ప్రతి ఒక్కరి కోసం తాను ప్రార్థిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని జగన్ ట్వీటర్లో ఆకాంక్షించారు. కరీబియన్ దీవుల్లో విధ్వంసం సృష్టించిన ఈ హరికేన్.. అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. -
ఉపవాస వ్రతంలో స్త్రీలకు సహకరించాలి
రమజాన్ కాంతులు స్త్రీలు రోజూ ఐదువేళలా నమాజు చేస్తూ, రమజాన్ నెల ఉపవాసాలూ పాటిస్తూ, తన భర్త పట్ల వినయంతో మసలుకుంటూ, ఆమె భర్త ఆమె యెడల సంతృప్తిగా ఉంటే ఆమె పరలోకాన స్వర్గద్వారాల్లో తనకు నచ్చిన ద్వారం గుండా ప్రవేశించవచ్చు. అంతేకాదు, స్త్రీలు ఇంటిపనులు చక్కదిద్దుకుంటూనే తస్బీహ్ చేస్తూ బోలెడన్ని పుణ్యాలు మూటగట్టుకోవచ్చు. రోజులో ఒక గంట చొప్పున సమయం తీసి ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి. సమాతె ఖుర్ ఆన్ కార్యక్రమాల్లోనైనా పాల్గొనవచ్చు. లేదా కనీసం మొబైల్ ఫోన్లో ఖుర్ ఆన్ రికార్డింగులైనా వినే ప్రయత్నం చేయాలి. వీటన్నింటితోపాటు తగిన నిద్ర కూడా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే నిద్రలేమి వల్ల తలనొప్పి, వికారం, చికాకు, అసహనం కలుగుతాయి. వేడిచేసే పదార్థాలను విడనాడి చలువ చేసే పదార్థాలను సేవించి ఉపవాస వ్రతాన్ని ఆహ్లాదంగా పూర్తి చేయాలి. ఈ వ్రతాన్ని నిరాటంకంగా పూర్తి చేయడంలో భర్త ఆమెకు సహకరించాలి. ఇంటివారంతా ఇంటిపనుల్లో పాలుపంచుకోవాలి. ఇంటి ఇల్లాలి పైనే భారమేసి వదిలేస్తే ఉపవాసిని కష్టాలకు గురి చేసినట్లవుతుంది. సహర్‌కి దస్తర్ఖాన్ పరచడం, ప్లేట్లు, గ్లాసులు, నీళ్లు పెట్టడం, తిన్నాక తీయడంలో సహకరించడం వంటి పనులు చేయాలి. ఇఫ్తార్లోనూ పండ్లు కోయడం, పానీయాలు తయారు చేయడం వంటి పనుల్లోనూ ఆడ, మగ భేదం లేకుండా తోడ్పాటు అందించాలి. అప్పుడే ఇంటి ఇల్లాలు రమజాన్ ఉపవాస ఫలాన్ని ఆనందంగా అనుభవించగలుగుతుంది. -
ప్రార్థన... అంటే..! దేవునితో సంభాషణే!!
రోజూ ధ్యానం లేదా ప్రార్థన చేయడం వల్ల మానసికంగా ఎంతో బలం కలుగుతుంది. క్రమబద్ధంగా చేసే ప్రార్థన మనసు బలం పుంజుకోవడానికి ఉపకరిస్తుంది. ఏ వ్యాకులత, దిగులు లేకుండా గడిపేందుకు తోడ్పడుతుంది. రోజూ ప్రార్థన చేసే అలవాటు లేనివారికి ప్రార్థన చేయడం చాలా కష్టం అవుతుంది. ఏకాగ్రత కుదరదు. అనునిత్యం తోటివారితో, కుటుంబ సభ్యులతో మాట్లాడటం అలవాటైన వాళ్లకు ప్రార్థనలో మౌనంగా కూర్చోవడం కష్టమే. సమయం భారంగా కదులుతున్నట్లు ఉంటుంది. నిమిషం... గంటలా దీర్ఘంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. దీనితో సహనం సడలి, ప్రార్థన సరిగా సాగదు. కానీ ఒకరు చెప్పడం వల్ల లేదా ఒకరు శాసించడం వల్లనో ప్రార్థన చేయడం సాధ్యం కాదు. ప్రార్థనను దినచర్యలో భాగంగా అలవరచుకోవడం అవసరం. అది తెలుసుకుంటే జీవితానికి చాలా ఉపయోగం. స్నానం, భోజనం, ఉద్యోగం, నిద్ర ఎలాగో, ప్రార్థన కూడా అలాగే చేయాలి. ప్రతిరోజూ దైవప్రార్థనతోనే రోజును ప్రారంభించాలి. దైవప్రార్థనతోనే రోజును ముగించాలి. అలా క్రమ క్రమంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే, మెల్ల మెల్లగా అది బాధ్యత కన్నా కూడా భగవంతుడితో విడదీయరాని మహోన్నతమైన బంధంగా మారుతుంది. చివరగా ఒకమాట... ‘మనుషులతో అయితే మాట్లాడవచ్చు’ అనుకునేవారు... మౌనంగా దేవునితో మాట్లాడవచ్చు... అని కూడా తెలుసుకోవాలి. నిజానికి కష్టం సుఖం పంచుకోవడానికి దేవునికి మించిన ఆత్మబంధువు ఎవరున్నారు!? ఆత్మీయం -
అజాన్ సంప్రదాయం ఏర్పడిందిలా!
ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలన్నా, ఎటువంటి ప్రకటన చెయ్యాలన్నా ప్రవక్త మహనీయులు మసీదునే వేదికగా చేసుకునేవారు. ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ప్రసంగ వేదిక (మింబర్ ) మొదటి మెట్టుపై నిలబడి ప్రసంగించేవారు. సంభాషణ అయితే ’మింబర్ ’ రెండవ మెట్టుపై కూర్చుని మాట్లాడేవారు. ప్రారంభంలో ఎవరికివారు నమాజు వేళకు మస్జిదుకు చేరి ప్రార్థన చేసేవారు. కాని అందరూ ఫలానా సమయానికి మస్జిదుకు రావాలని పిలిచే పద్ధతేదీ లేదు. అందుకని ప్రవక్తమహనీయులు సహచరులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దూరాన ఉన్నవారికి తెలియడం కోసం ఏదో ఒకవిధానం రూపొందించాలన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. కొందరు బాకా ఊదడం గాని, గంట మోగించడం గాని చేద్దామన్నారు. మరికొందరు శంఖం పూరిస్తే బాగుంటుందన్నారు. ఈవిషయంపై ఏకీభావం కుదరగానే శంఖాన్ని ఏర్పాటు చేయమని ప్రవక్తవారు హజ్రత్ ఉమర్ గారికి పురమాయించారు. ఇవే ఆలోచనలతో ఇంటికి వెళ్ళిన ఉమర్ ఆ రాత్రి ఒక కలగన్నారు. ’గంటలు, బాకాలు కాదు ‘అజాన్ ’ పలకండి’ అని ఆ కల సారాంశం. ఈ ‘అజాన్ ’ ఏమిటీ? తెల్లవారిన తరువాత ఈ విషయం ప్రవక్తకు తెలియజేద్దామని, అసలు ‘అజాన్ ’ అంటే ఏమిటీ అని ఆలోచిస్తూ మసీదువైపు బయలుదేరారు. అంతలో మసీదు పక్కనే ఓ ఇంటికప్పుపై హజ్రత్ బిలాల్ నిలబడి ’అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అష్ హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్...’ అని పలుకుతున్న మధురవచనాలు చెవిన పడ్డాయి. అజాన్ అంటే ఇదేనేమో... మరి బిలాల్‌కు ఎవరు చెప్పారీ పలుకులు అనుకుంటూ వడివడిగా అడుగులేశారు. అప్పటికే అక్కడ కొంతమంది విశ్వాసులు ఈ విచిత్ర పలుకుల్ని వింటున్నారు. అక్కడికి చేరుకున్న ఉమర్ , బిలాల్ నుద్దేశించి, ‘ఎవరు చెప్పారు ఇలా చదవమని?’ అంటూ ప్రశ్నించారు సంభ్రమాశ్చర్యాలతో.. ఇప్పుడే హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ వచ్చి, తనకు ఎవరో కలలో కనిపించి, అజాన్ ఇలా పలకాలని చెప్పినట్లు తనకు చెప్పారన్నారు బిలాల్. అక్కడినుండి హజ్రత్ ఉమర్ నేరుగా ప్రవక్త వారి వద్ద కెళ్ళి, ’దైవప్రవక్తా! రాత్రి నాకు, అబ్దుల్లాబిన్ జైద్ ఇద్దరికీ ఒకేలాంటి కల వచ్చింది’ అని అంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఇదంతా విన్న దైవప్రవక్త, ‘ఉమర్! ఇది అల్లాహ్ మహదానుగ్రహం. నా వద్దకు కూడా ఇలాంటి సందేశమే వచ్చింది’. అన్నారు సంతోషంగా. ఈ విధంగా ప్రార్థన (నమాజ్ ) కోసం మసీదుకు రమ్మని పిలిచే సంప్రదాయం ఏర్పడింది. అప్పటినుండి మసీదు పక్కనే ఉన్న ఇంటికప్పుపై నిలబడి హజ్రత్ బిలాల్ (ర) అజాన్ పలికేవారు. అదేవిధానం యావత్ ప్రపంచంలో కొనసాగుతోంది. ప్రళయకాలం వరకూ ఇన్షా అల్లాహ్ ఇదే పద్ధతి కొనసాగుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం) -
దురాశకు అంతులేకపోతే దేవుని కృప ఉగ్రతగా మారుతుంది!
• సువార్త అడక్కుండా దేవుడు మనకిచ్చేదెప్పుడూ ఆశీర్వాదకరమైనది. దేవుణ్ణి మనమడిగి తీసుకున్నది మాత్రం ఆశీర్వాదకరమైనది కావచ్చు, కాకపోవచ్చు. అందుకే యేసు ప్రభువు ‘నీ చిత్తమే సిద్ధించుగాక’ అంటూ చేసే ప్రార్థన అత్యంత ఆశీర్వాదకరమైన, శక్తితో కూడిన ప్రార్థన అని బోధించారు (మత్త6:10). మన పరలోకపు తండ్రిౖయెన దేవదేవునికి ఆయన పిల్లలమైన మనపట్ల అద్భుతమైన ప్రణాళికలున్నాయి. అవి యథాతథంగా నెరవేరడం మనకు అత్యంత ఆశీర్వాదకరం. కాని తెలిసీ తెలియక, మొండిగా, తొందరపాటుతో మనం చేసే ప్రార్థనలు ఆయన ప్రణాళికలు, తలంపుల నెరవేర్పునకు ఆటంకాలు కారాదు. ఇశ్రాయేలీయులు చేసిన తప్పు అదే. దేవుడు బానిసత్వం నుండి విముక్తినిస్తే దాని విలువనర్థం చేసుకోకుండా దారిలో ఆహారం సరిగా లేదంటూ సణిగే వారినేమనాలి? గుప్తు కఠిన దాస్యాన్ని దేవుడు దూరం చేస్తే, ఐగుప్తు అన్నమే బావుందంటూ, ఇశ్రాయేలీయులు వాపోవడం వారి మొదటి తప్పు. మన్నాకు బదులు మాంసమివ్వలేడా? అన్న అసంతృప్త భావనతో పరోక్షంగా దేవుని బాహుబలాన్ని శంకించడం వారి రెండవ తప్పు. ఐగుప్తు విముక్తి సమయంలో చూపించిన ప్రేమను దేవుడు అరణ్యమార్గంలో చూపించడం లేదన్న విధంగా మన్నాను తక్కువ చేసి పరోక్షంగా వ్యాఖ్యానించడం వారి మూడవ తప్పు. ఈ తప్పులు అప్పుడెప్పుడో ఇశ్రాయేలీయులు చేసినవే కాదు, ఇప్పటికీ మనం చేస్తున్న తప్పులివి. మనిషికి అంతులేని ఆశలంటారు. అది తప్పు. మనిషి దురాశకు అంతులేదు. అయితే దేవుని కృప కూడా అంతులేనిదే. కాకపోతే మనం పరిమితి దాటితే దేవుని కృప కాస్తా ఉగ్రతగా మారుతుంది. ఆయన ఉగ్రతను భరించడం మనుషులెవరికీ సాధ్యం కాదు. దురాశపడి జీవితంలో బాఉపడి సుఖపడ్డవాళ్లు, ఏదీ ఆశించకుండా దేవుడిచ్చిందే ఆశీర్వాదమనుకొని చెడిపోయిన వాళ్లు లోకంలో ఉండరు. – రెవ.డాక్టర్ టి.ఎ.ప్రభుకిరణ్ -
ముగిసిన మేరీమాత ఉత్సవాలు
కర్నూలు సీక్యాంప్: ఈ నెల 2వ తేదీ నుంచి బిషప్ చర్చిలో నిర్వహిస్తున్న మేరీమాత ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరిరోజు జిల్లా నలుమూలల నుంచి క్రైస్తవులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని దైవసందేశం వినిపించారు. శత్రువును కూడా ప్రేమతో జయించాలని ఆయన ఉద్బోధించారు. దివ్యవాణి ఆధ్యాత్మిక చానల్ కోఆర్డినేటర్ పప్పుల సుధాకర్, ఉపదేశి ఆంతోని, మరియదళ్ సభ్యులు, యూత్, క్యాథలిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
తిరుమలలో అన్యమత ప్రార్థన
సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం వేరే మతానికి చెందిన ఓ యువకుడు ప్రార్థన చేయడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాకు చెందిన అమీర్ అమ్జా.. శ్రీవారిని దర్శనా నికి తొలిసారిగా తిరుమలకు వచ్చాడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఓ మూలన కూర్చొని ప్రార్థన చేస్తున్న అమ్జా ను గమనించిన పోలీసులు అతన్ని అదుపు లోకి తీసుకున్నారు. కాగా, ఆ యువకుడు అన్యమత ప్రార్థనలపై తిరుమలలో నిషే« ధం ఉందనే విషయం తనకు తెలియ దంటున్నాడు. అమ్జా వ్యక్తిగత సమాచారా న్ని రాష్ట్ర, కేంద్ర హోం శాఖలకు పంపించా రు. ఈ ఘటనపై టీటీడీ ఈవో డి. సాంబశి వరావు విచారణకు ఆదేశించారు. -
కరుణోదయం
-
ప్రార్థనకు నయం చేసే శక్తి ఉందా?...
సంజీవని ప్రతి మనిషికి మరో మనిషిని స్వస్థత పరిచే శక్తి ఉంటుంది. మాట ద్వారానో, స్పర్శ ద్వారానో, ప్రార్థన ద్వారానో వారు సాటి మనిషిని రుగ్మత/జబ్బు/అనారోగ్యం నుంచి బయటపడేస్తారు. ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాం. ఎవరో జబ్బు పడతారు... వాళ్లకు ఎవరో ఒక దగ్గరి బంధువు మీద ప్రేమ, అభిమానం లేదంటే మమకారం ఉంటాయి. ఎందరు పలకరించినా కోలుకోకుండా ఆ ఫలానావాళ్లు వచ్చి నీకేం కాలేదు లే అని అనగానే లేచి కూచుంటారు. అలా ఎందుకు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కాని అలా జరుగడం అందరికీ తెలుసు. కాకపోతే ఈ శక్తి మహనీయులకు ఎక్కువగా ఉంటుంది. రాముడి కాలు తగిలి బండరాయిలా పడి ఉన్న అహల్య మనిషయ్యిందని పురాణ కథనం. యదార్థ దృష్టిలో చూస్తే అంతవరకూ జడత్వంతో మనోవైకల్యంతో ముడుచుకుపోయిన అహల్య రాముడి సాంత్వనం వల్ల ఓదార్పు వల్ల కరస్పర్శ వల్ల కోలుకుందని అర్థం చేసుకోవాలి. ఏసుప్రభువు మాయలు మంత్రాలు ఏమీ చేయలేదు. తన కొద్దిపాటి స్పర్శతో అంధునికి చూపు తెప్పించాడు. కుష్టువ్యాధిగ్రస్తుడి దేహాన్ని రసి రహితం చేశాడు. సాయిబాబా జీవితంలో ఇతరులను స్వస్థత పరచిన ఉదంతాలు ఎన్నో గ్రంథస్తం అయ్యాయి. ఆయన తన భౌతిక దేహాన్ని చాలించినది కూడా ఇతరుల అస్వస్థతను తన వంటి మీదకు తెచ్చుకోవడం వల్లనే అని విశ్వాసం. యోగుల జీవితాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా ఉంటాయి. దేశంలోని అనేక దేవాలయాలు, చర్చ్‌లు, మసీదులు, దర్గాలు... వెళ్లి ప్రార్థన చేస్తే నయం అవుతుందన్న నమ్మకాన్ని స్థిరపరిచి ఉన్నాయి. విశ్వాసం కూడా ఒక్కోసారి ఔషధంగా పని చేస్తుందనడంలో అవాస్తవం లేదు. హిమాలయ పరమగురువు స్వామి రామ తన పుస్తకం ‘ఎట్ ద ఫీట్ ఆఫ్ ఏ హిమాలయన్ మాస్టర్’ అనే పుస్తకంలో హిమాలయ పరమ గురువులు స్టెత్ పెట్టకుండా, నాడీ పరీక్షించకుండా ఎదుటివారిని ఎలా స్వస్థత పరిచారో విపులంగా రాశారు. స్వామి రామ గురువు పేరు ‘బెంగాలీ బాబా’. ఒకసారి వారిద్దరూ ఒక ఊరిలో భిక్షాటనకు వెళ్లారు. వీధిలో కనిపించిన ఒక వ్యక్తి మా యింటికి రండి భిక్ష వేస్తాను అని పిలుచుకువెళ్లాడు. కాని ఆ ఇంటి ఇల్లాలు అందుకు నిరాకరించింది. ‘మన కష్టాల్లో మనముంటే నీకు స్వామీజీలను ఇంటికి తీసుకురావాలని ఎలా అనిపించింది? మన పిల్లవాడు మసూచీతో బాధపడుతున్నాడని నీకు తెలియదా? వాడు చనిపోబోతున్నాడు. ఇలాంటి సమయంలో ఇతరులకు అతిథి మర్యాదలు మనం చేయగలమా?’ అని అతడిని నిందించింది. ఇది గురుశిష్యులు ఇద్దరూ విన్నారు. ఆ వ్యక్తి నిస్సహాయంగా బయటకు వచ్చి ‘క్షమించండి స్వామీ’ అన్నాడు. అప్పుడు స్వామి రామ గురువు ‘నేను మీ అబ్బాయిని రక్షిస్తాను’ అని అన్నారు. అని ఇంట్లోకి వెళ్లారు. ఒక గ్లాసు నీళ్లు తెప్పించి ఆ గ్లాసు పట్టుకుని రోగ గ్రస్తుడైన పిల్లవాడి మంచం చుట్టూ తిరిగారు. ఆ తర్వాత ఆ నీళ్లు తాగేశారు. కొన్ని నిమిషాల్లో పిల్లవాడి ఒంటి మీద ఉన్న మసూచి వ్రణాలు ఆయన శరీరం మీదకు వచ్చాయి. శిష్యుడైన స్వామి రామ అది చూసి భయపడిపోయాడు. గురువును చూసి రోదించసాగాడు. శిష్యుడిని తీసుకొని బయటకు వచ్చేసిన గురువు ఒక చెట్టు కింద నిలబడ్డారు. కాసేపటికి ఆయన ఒంటి మీద ఉన్న వ్రణాలు చెట్టు మీద ప్రత్యక్షమయ్యాయి. మరి కాసేపటికి అవి మాయమైపోయాయి. ఈ ఉదంతాన్ని ఆయన తన పుస్తకంలో రాశాడు. అయితే స్వస్థత పరిచే శక్తి కలిగిన ఎందరో మహనీయులు దాదాపుగా ఆ పనికి ఇష్టపడకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి స్వస్థత పరిస్తే ప్రజలు ధన కనక వస్తు వాహనాలతో వారిని సత్కరించడానికి పూనుకుంటారు. దాని వల్ల వ్యామోహం కలుగుతుంది. ఫలితంగా స్వస్థత పరిచే శక్తి పోతుంది. ఇప్పటికీ నోట్ల కట్టలతో హిమాలయాల్లో ఉన్న మహనీయుల చుట్టూ తిరిగే కుబేరులు చాలామంది ఉన్నారు. వారిని తప్పించుకుని తిరిగే మహనీయులూ ఉన్నారు. ‘ఒక డబ్బున్న వ్యక్తి ఎంతకూ తగ్గని తన తలనొప్పిని తగ్గించమని నోట్ల కట్టలతో ఒక హిమాలయ గురువు దగ్గరకు వచ్చాడు. గురువు ఆ డబ్బును తిరస్కరించాడు. ఆ వ్యక్తి పదే పదే ప్రార్థించడంతో సరే... ఇక నీకు తలనొప్పి రాదు పో అని అన్నాడు. అంతే. తలనొప్పి పోయింది’ అని కూడా స్వామి రామ తన పుస్తకంలో రాశారు. మహనీయులే కాదు ప్రజలు కూడా తాము అభిమానించే వారిని తమ అభిమానంతో బతికించుకోగలరు. సినీ నటుడు అమితాబ్ షూటింగ్ ప్రమాదంలో గాయపడినప్పుడు దేశమంతా ప్రార్థనలు చేసి అతణ్ణి బతికించుకుంది. వైద్యప్రమేయంతో పాటు దైవ ప్రమేయం కూడా ఒక్కోసారి అవసరమవుతుంది. రజనీకాంత్ అనేకసార్లు తీవ్రమైన అస్వస్థతకు లోనై కూడా అభిమానుల ప్రార్థనలతో కోలుకున్నాడని చెప్పాలి. ఇప్పుడు జయలలిత వంతు. తమిళనాడు ప్రజల విశేష అభిమానాన్ని చూరగొన్న జయలలిత గత కొన్నిరోజులుగా అస్వస్థతో ఆస్పత్రిలో ఉన్నారు. వైద్యులు హోరాహోరీగా ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆమె కోసం ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. స్వస్థత పరిచే శక్తిని తమ మనోభీష్టం నుంచి సృష్టించి ఆమెకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మనసు ఒకటి గట్టిగా కోరుకుంటేనే అది జరుగుతుందని నమ్మకం. అన్ని లక్షల మనస్సులు గట్టిగా ఒకటి కోరుకుండా ఆ కోరిక ఒక శక్తి రూపం దాల్చవచ్చు. అది స్వస్థతకు సహాయపడవచ్చు. నాస్తికులు, బుద్ధిజీవులు, తార్కికవాదులు ఇలాంటి వాదనలన్నింటినీ కొట్టి పడేయవచ్చు. పై వాదనను బలహీన పరిచే వాదనలు వారి దగ్గర బోలెడన్ని ఉండవచ్చు. కాని ఇండియా ఉద్వేగాల దేశం. విశ్వాసాల దేశం. బుద్ధికంటే ఎక్కువగా హృదయమే ఈ దేశాన్ని పాలించింది. -
ఎటీఎంకు పూజ చేసి మాజీ ఎమ్మెల్యే నిరసన
-
దైవ ప్రార్థన చాలా అవసరం
రేపల్లె: యువతతో సమాజాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే వైఎంసీఏ ధ్యేయమని వైఎంసీఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లెబి ఫిలిప్ మాథ్యూ పేర్కొన్నారు. పట్టణంలోని ఇండియా రూరల్ ఇవాంజిలికల్ చర్చిలో గురువారం నిర్వహించిన కృతజ్ఞతా ప్రార్థన కూడికలో ఆయన మాట్లాడారు. ‘నిన్ను వలె నీరు పొరుగు వారిని ప్రేమించు’ అని క్రీస్తు చెప్పిన మార్గాన్ని యువత ఎంచుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలతో పాటు దైవప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పారు. వైఎంసీఏ సౌత్, ఈస్ట్ రీజియన్ చైర్మన్, ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానియులు రెబ్బా మాట్లాడుతూ ప్రేమ, కరుణ, దయ గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏసు ప్రభువు కొలువుతీరి ఉంటాడరన్నారు. జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ లెబి ఫిలిప్ మాధ్యూ, సీహెచ్ఆర్పీ మణికుమార్‌ను ఇమ్మానియేలు రెబ్బా దంపతులు పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. వైఎంసీఏ జాతీయ కార్యదర్శి సీహెచ్ఆర్పీ మణికుమార్, ఐఆర్ఈఎఫ్ పరిపాలనాధికారి దీవెన రెబ్బా, రెబ్బా జాన్‌పాల్(చంటి), ప్రిన్సిపాల్స్ జడ్.రత్నప్రసాద్, హానోక్ తదితరులు పాల్గొన్నారు. -
నా దివ్యమహిమలు వర్ణింపశక్యం కావు
మామిడిపూడి ‘గీత’ విభూతి యోగం అర్జునుని ప్రార్థనను అంగీకరించి శ్రీకృష్ణ పరమాత్ముడు తన విభూతులను ఇలా చెబుతున్నాడు. ‘‘అర్జునా! నా దివ్యమహిమలు అనంతాలు. అవి వర్ణింపశక్యమైనవి కావు. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని మాత్రం వినిపిస్తాను. విను. సర్వభూతాలలోనూ ఉండే ఆత్మను నేనే. సమస్తభూతాల సృష్టి స్థితి లయములకు కారణభూతుడను నేనే. సర్వక్షేత్రములయందును క్షేత్రజ్ఞుడను నేనే. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత! (13-33) ఒక్క సూర్యుడు సమస్త లోకాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తున్నాడో అట్లే నేను క్షేత్రజ్ఞుడనై ఎల్ల క్షేత్రాలను ప్రకాశింపజేస్తున్నాను. నా జ్యోతి పరంజ్యోతి. సూర్యచంద్రాదులను ప్రకాశింపజేస్తోంది. అర్జునా! సమస్త చరాచర భూతాల లోపల వెలుపల నేను నిండి ఉన్నాను. కానీ నా సూక్ష్మత్వ కారణం వల్ల నన్ను తెలుసుకోవడం సులభం కాదు. - కూర్పు: బాలు-శ్రీని -
వైభవంగా కాత్యాయనీ వ్రతం
పాత గుంటూరు: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం సంపత్‌నగర్‌లోని శ్రీశారదా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 500 మంది కన్యలతో సామూహిక కాత్యాయనీ వ్రతాన్ని నిర్వహించారు. అంతకుముందు శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి సంచాలకత్వంలో యువ శతావధాని పార్వతీశ్వరశర్మ అష్టావధానం నిర్వహించారు. జె.జె.కె.బాపూజీ, రామడుగు వెంకటేశ్వరశర్మ, కల్వకొలను సూర్యనారాయణ, కె.వి.ఎల్.ఎన్.అప్పలాచార్య, మల్లప్రగడ శ్రీవల్లి తదితరులు ప్రశ్నలను సంధించారు. -
’ అమ్మ’ కోలుకోవాలని ముస్లింల ప్రార్థనలు
-
2 లక్షల మంది క్రైస్తవులతో ప్రార్థన
నల్లగొండ టూటౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ డిసెంబర్లో 2లక్షల మంది క్రైస్తవులతో ఒకేసారి ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ బి.రాజేశ్వర్‌రావు అన్నారు. సోమవారం స్థానిక రత్న ఫంక్షన్‌హాలులో క్రైస్తవ ప్రముఖులు, చర్చి ఫాదర్లతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల పండుగలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్‌నని అన్నారు. క్రైస్తవుల పిల్లల చదువులకు, ఉపకార వేతనాలు మంజూరు చేసి ఉన్నత చదువుల కోసం కృషి చేశారని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందంజలో ఉండేందుకు సీఎం నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. విలేకరుల సమావేశంలో రేఖల భద్రాద్రి, తీగల జాన్‌శాస్త్రీ, పాల్, ఏసురాజు, జోసఫ్, పోకల అశోక్, వేణుగోపాల్, ప్రభాకర్ తదితరులున్నారు. -
కృష్ణమ్మకు కలెక్టర్ దంపతుల పూజలు
అమరావతి : కృష్ణానది పుష్కరాల సందర్భంగా పదవ రోజున నదీమతల్లికి కలెక్టర్ కాంతిలాల్ దండే దంపతులు ఆదివారం ఉదయం వేకువజామున కృష్ణవేణి మాతకు పూజలు నిర్వహించారు. తొలుత పురోహితులు సంకల్పం చెప్పిన తర్వాత కలెక్టర్ దంపతులచే కృష్ణమ్మకు జలతర్పణం వదిలారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. -
జై.. ఆచూకీ చెప్తే 50,000 బహుమతి!
నాగ్ పూర్ః తప్పిపోయిన పులి ఆచూకీ తెలియాలంటూ ఇప్పటికే జనం పూజలు చేస్తుండగా.. మహరాష్ట్ర ప్రభుత్వం జై.. ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఉమ్ రెడ్-కర్హండా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి జై.. ఆచూకీ కోసం ఇప్పటికే ప్రభుత్వం.. అటవీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రివార్డు ప్రకటించింది. నాగ్ పూర్ అభయారణ్యం నుంచి ఈ యేడాది ఏప్రిల్ 18న ఏడేళ్ళ వయసున్న భారీకాయం గల పెద్దపులి జై.. తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుతుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరించే ప్రదేశం వంటి వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని, తెలిపినవారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే ప్రకటించగా... తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో 50 వేల బహుమానాన్ని ప్రకటించింది. అటవీశాఖ శుక్రవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ టైగర్స్ డే' సందర్భంగా అడవి నుంచీ తప్పిపోయిన పులి ఎప్పటికైనా తిరిగివస్తుందంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాని సమాచారం కోసం అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ఆయన తెలిపారు. పెద్దపులి ఆచూకీకోసం ప్రజలు పడుతున్న తాపత్రయానికి ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జై.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని అమితంగా చూరగొంది. రాచరికాన్ని ప్రదర్శించే జీవన విధానం, భారీ శరీరాకృతి కలిగిన జై... పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జై.. సుమారు 250 కేజీల బరువుంటుంది. ఇప్పటికే స్థానికులు జై.. ఆచూకీకోసం ప్రార్థనలు, పూజలు చేస్తుండగా... 100 మంది వరకూ జనం, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు, స్వచ్ఛందంగా గాలిస్తున్నారు. వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జై.. ఆచూకీకోసం ప్రయత్నించాలని అటవీ అధికారులు సైతం కోరారు. శాంక్చరీ టోపోగ్రఫీ తెలిసిన బృందం ద్వారా కూడా పులి ఆచూకీ తెలుసుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
పులికోసం పూజలు!
నాగ్ పూర్ః తప్పిపోయిన మనుషులు, పెంపుడు జంతువులకోసం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వడం చూస్తాం. ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టడం వింటాం. అయితే అభయారణ్యాల్లో నివసించే జంతుజాలం కనిపిస్తే వేటాడటమే తప్పించి... కబురు చెప్పమంటూ ప్రకటనలు ఇవ్వడం, నగదు బహుమతులు ప్రకటించడం ఎక్కడైనా చూశారా? నాగ్‌పూర్‌లోని ఉమ్రెడ్-కర్హండ్లా అభయారణ్యం ప్రాంతంలో అదే జరిగింది. తప్పిపోయిన ప్రముఖ పులి జాయ్ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించడమే కాదు.. అది ఎలాగైనా తిరిగి రావాలంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్ రెడ్-కర్హండ్లా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి 'జాయ్' కోసం నాగపూర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 18 నుంచీ కనిపించకుడా పోయిన జాయ్ ( పులి) ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని ఇస్తామంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంతకు ముందే ప్రకటించగా.. జాయ్ తిరిగి రావాలని కోరుకుంటూ కొందరు అభిమానులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18న జాయ్ తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారంకోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరిస్తున్న ప్రదేశం వంటి వివరాలు ఏవి తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వివరాలు తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జాయ్.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని చూరగొంది. భారీ శరీరాకృతి, రాచరికాన్ని ప్రదర్శించే తీరులో జీవన విధానం కలిగి ఉండే జాయ్... చూపరులను కళ్ళు తిప్పుకోకుండా చేసేది. అభయారణ్యానికి వచ్చిన దగ్గరనుంచీ విదేశీయులతో సహా అనేక మంది పర్యటకులను ఆకట్టుకుంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జాయ్... సుమారు 250 కేజీల దాకా బరువుంటుంది. అటువంటి ప్రముఖ పులి ఆ ప్రాంతంలో కనిపించకుండా పోవడంతో దాని ఆచూకీకోసం అనేక రకాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ ఖర్గే ఆదేశాల మేరకు.. అధికారులు జాయ్ కోసం ప్రత్యేక సెర్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జాయ్ పాదముద్రలు ట్రేస్ చేసేందుకు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి, ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అటవీ సిబ్బందికి అధికారులు సూచించారు. ఇప్పటికే 100 మందివరకూ వ్యక్తులు, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా జాయ్ కోసం శోధిస్తుండగా... వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జాయ్ ను వెతికేందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. -
విజయదుర్గమ్మా..... వానలు కురిపించవమ్మా..
– ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం – కదిలివచ్చిన భక్తజనం కడప కల్చరల్ : మాతా నమోస్తుతే....తల్లీ విజయదుర్గమ్మా.. నిండుగా వానలు కురిపించవమ్మా....మా జిల్లా పచ్చగా ఉండేటట్లు దీవించవమ్మా....సాగునీటికి, తాగునీటికి కొరత లేకుండా చూడుతల్లీ అంటూ భక్తులు శ్రీ విజయ దుర్గామాతను కోరుకున్నారు. అమ్మవారిని స్తుతిస్తూ నినాదాలు చేశారు. మంగళవారం స్థానిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పవిత్ర జలాలు గల 108 కలశాలతో అభిషేకించారు. 41 రోజులపాటు జిల్లాలోని అన్ని మండలాలలోగల దేవాలయాలలో ఈ కలశాలను ఉంచి పూజలు నిర్వహించారు. అభిషేకం సందర్భంగా ఆయా మండలాలకు చెందిన భక్తులు ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ ఆటోలలో ఆ పవిత్ర కలశాలను ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకొచ్చారు. జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మవారిని స్వయంగా అభిషేకించారు. బారులు తీరి వేచి ఉండి మరీ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ వేద పండితులు రాయపెద్ది సుబ్బరామశర్మ, ఫణిభూషణశర్మలు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. కలెక్టర్ పూజలు.. జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ మంగళవారం శ్రీ విజయదుర్గాదేవిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గాప్రసాద్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి అమ్మవారి విశేష వస్త్రాలను, చిత్రపటాన్ని, గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలుకు చెందిన విజయదుర్గ కార్డియాలజీ సెంటర్ వైద్యులు ప్రత్యేకంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. -
లోక కల్యాణం కోసం ...
కడప కల్చరల్ : ‘శ్రీ విజయదుర్గాదేవీ.. జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి’ అని భక్తులు వేడుకున్నారు. ఆదివారం స్థానిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా విరాట పర్వ పారాయణం నిర్వహించారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మయజ్ఞ సహిత అష్టోత్తర శతకలశాభిషేక ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం చతుర్వేద హవనం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీ పారాయణం, హోమం, మూలమంత్ర పారాయణం చేశారు. రాయపెద్ది సుబ్బరామశర్మ, ఫణిభూషణశర్మ ఆధ్వర్యంలో దాదాపు 15 మంది వేద పండితులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకుడు దుర్గాప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
అవును, మీరు సత్యసంధులు...
ప్రవక్త జీవితం ప్రార్థన పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ‘ఏమిటిది? ఏదో కొత్తకొత్తగా ఉంది. ఎందుకిలా చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు అలీ ఏమాత్రం తడుముకోకుండా. ‘ఇది దేవుడు మానవుల కోసం పంపిన ధర్మం బాబూ! అనాదిగా ప్రవక్తలంతా లోకానికి ఇదే ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు. ఇప్పుడు మానవులు అనుసరించాల్సిన ధర్మం ఇదే..!’ అన్నారు ముహమ్మద్ (స). ‘మరి ఈ రుకూలు, సజ్దాలేమిటి?’ మరో ప్రశ్న సంధించాడు ఆ బాలుడు. ‘బాబూ! దేవుడు నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నాపై తన వాక్కును అవతరింపజేశాడు. నేను ప్రజలకు మంచి విషయాలు బోధించాలని, సన్మార్గం తప్పి అజ్ఞానాంధకారంలో తచ్చాడుతున్న ప్రజలకు సన్మార్గం చూపాలని, దైవారాధన వైపుకు ప్రజల్ని ప్రేరేపించాలని దేవుడు నాపై తన వాణిని అవతరింపజేస్తున్నాడు. ఈ రుకూలు, సజ్దాలన్నీ ఆ దైవం కోసమే..!’ వివరించారు ముహమ్మద్ (స). ‘చాలా బాగుంది. ఈ ఆరాధనా విధానం నాకు బాగా నచ్చింది. మరి నేను కూడా మీరు నమ్మిన దైవాన్ని నమ్మవచ్చా? మీకులాగానే దైవాన్నిఆరాధించవచ్చా? మీ వెంట నేను కూడా నమాజ్ చేయవచ్చా?’ అని ప్రశ్నించాడు. ‘తప్పకుండా బాబూ! అలాగే చేయి. సమస్త మానవాళికీ దేవుడు ఒక్కడే, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు. ఆయనే ఆరాధనలకు అర్హుడు. నువ్వు కూడా ఆయన్నే ఆరాధించు. విగ్రహారాధన వదిలిపెట్టు’ అన్నారాయన. ‘సరే, అయితే నాన్నగారిని కూడా ఒక మాట అడిగి మీకు చెబుతాను.’ ‘సరే అలాగే. నాన్నగారితో మాట్లాడు. ఏ విషయమైనా పెద్దవాళ్లను సంప్రదించడం మంచి పద్దతి’ అన్నారాయన. నాన్నగారిని అడిగి చెపుతానని అన్నాడేగాని, అలీకి ఆ రాత్రి అసలు నిద్రే పట్టలేదు. దాదాపు తెల్లవార్లూ మెలకువతోనే ఉన్నాడు. ముహమ్మద్ (స) చెప్పిన మాటలే మాటిమాటికీ గుర్తుకొస్తున్నాయి. ఆయన ఆచరించిన నమాజ్ దృశ్యాలే కళ్లలో మెదులుతున్నాయి. ఆలోచనలతోనే తెల్లారిపోయింది. వెంటనే ఆయన ముహమ్మద్ (స) దగ్గరికొచ్చి, ‘నేను మిమ్మల్ని, మీరు ఆచరించే ధర్మాన్ని విశ్వసిస్తున్నాను. నాకు ప్రార్ధనా విధానం నేర్పండి’ అన్నాడు. ‘నాన్నగారితో మాట్లాడావా?’ అన్నారు ముహమ్మద్ (స) . ‘నాన్నగారిని సంప్రదించాలనుకున్నాను కాని, ఆ అవసరం కనిపించలేదు’. అలీ నిర్ణయం పట్ల ముహమ్మద్ (స) సంతోషించారు. ప్రేమతో గుండెలకు హత్తుకున్నారు. ప్రార్థనా విధానం నేర్పారు. అప్పటి వరకూ అవతరించిన దైవ వాణిని అలీకి నేర్పించారు. ఇక అప్పటినుండి క్రమం తప్పకుండా అలీ కూడా ముహమ్మద్ (స)తో కలిసి నమాజ్ ఆచరించడం మొదలుపెట్టారు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు గురువారం ఈద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. చారిత్రక జామా మసీదు, ఫతేపూరి మసీదు, హజ్రత్ నిజాముద్దీన్ తదితర మసీదుల వద్ద భారీ సంఖ్యలో ముస్లింలు నమాజు నిర్వహించారు. కొన్నిచోట్ల మతసామరస్యాన్ని చాటుతూ.. హిందూ సోదరులను కూడా పండుగకు ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. లక్నోలోని ఐష్బాగ్ ఈద్గాలో తొలిసారిగా మహిళలకూ ప్రవేశం లభించింది. పశ్చిమబెంగాల్ మాల్దాలో ఈద్ వేడుకల్లో సెప్టిక్ ట్యాంక్ కుంగిపోవటంతో పదేళ్ల బాలుడు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. ఈద్ సందర్భంగా ఆమిర్ ఖాన్ తన కుమారుడికి పండుగ కానుకగా కేవలం 2 రూపాయలిచ్చారు. ఇచ్చారు. ఈద్ సందర్భంగా పాకిస్తాన్లో బైక్‌తో ప్రమాదకరమైన విన్యాసాలు చేసి పది మంది మృతి చెందారు. వందమందికి గాయాలయ్యాయి. -
దిల్మాన్
పండుగ రోజు నమాజు చేసిన తర్వాత ఆలింగనం చేసుకోవడం సంప్రదాయం. అంటే... గుండెను గుండె తాకే సంప్రదాయం. ఆ పలకరింపు చాలా అందమైనది. గుండెతో గుండె మాట్లాడుకునేంత అందమైనది. ముస్లింభాయిలు మతాన్ని ఎంతగా ప్రేమిస్తారో... దేశాన్నీ అంతగా గౌరవిస్తారు. మన సోదర భారతీయులు అల్లా మాటను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ప్రేమను పంచుతున్నారు. అవును, మన ముసల్మాన్ భాయ్‌లు నిజంగా దిల్మాన్ భాయ్‌లు!! ఆ వైపు ఆరేళ్ల పాప... ఈ వైపు చిన్నారి వధువు ‘ఏయ్ ఆగండి’... అరిచింది నాజియా. వాళ్లు పట్టించుకోలేదు. అసలామె మాటే వినిపించు కోలేదు. ఆరుబయట ఆడుకుంటోన్న ఆరేళ్ల పాప నోరు మూసి, తమ బైకు మీద బలవంతంగా కూర్చోబెట్టుకున్నారు. ఆమెను ఎత్తుకుపోవాలని బండి స్టార్ట్ చేశారు. కానీ వారి బండి చక్రాలు ముందుకు కదల్లేదు. ఎందుకంటే వాటికి అడ్డంగా నాజియా నిలబడింది. ఉత్తరప్రదేశ్‌లోని సాఘిర్ ఫాతిమా మొహమ్మదియా బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని నాజియా. ఆరోజు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎవరో చిన్నారి ఆక్రందనలు వినిపించడంతో ఠక్కున ఆగింది. ఇద్దరు యువకులు ఓ ఆరేళ్ల పాపను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అది చూసిన నాజియా వెంటనే అక్కడికి పరుగుత్తింది. వాళ్లతో పెనుగులాడి, పాపను విడిపించి తీసుకుపోయింది. తల్లిదండ్రులకు అప్పగించి తిరిగి ఇంటికి బయలుదేరింది. దారిలో ఓ చోట పెళ్లి బాజాలు వినిపించాయి. దాంతో ఆమె దృష్టి అటువైపు మళ్లింది. ఆసక్తిగా అటువైపు నడిచింది. పెళ్లి పీటల మీద తన జూనియర్ డింపీని చూసి షాకయ్యింది. తొమ్మిదేళ్ల డింపీకి ఓ ముప్ఫై ఏళ్ల వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేస్తున్నారామె తల్లిదండ్రులు. డింపీ కళ్లనీళ్లతో తలవంచుకుని కూర్చుంది. ఆమెనలా చూసి నాజియా మౌనంగా ఉండలేకపోయింది. వెంటనే ఆమె సమీపంలోని పోలీసులకు విషయాన్ని తెలియజేసింది. వారు వచ్చి పెళ్లి ఆపారు. డింపీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఒకేసారి రెండు సాహసాలు చేసిన నజియా గురించి పై అధికారులకు తెలియజేశారు. దాంతో సాహన బాలిక అవార్డు నాజియాను వెతుక్కుంటూ వచ్చింది. కడలిని... దాటించాడు కడుపున జన్మించాడు! చెన్నై నగరం. వర్షం, వరద జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బైటికి కాలుపెట్టే పరిస్థితి లేక అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో కెవ్వున కేక పెట్టింది చిత్ర. ఉలిక్కిపడ్డాడు మోహన్. నెలలు నిండిన కడుపును చేతపట్టుకుని నొప్పితో మెలికలు తిరుగుతోంది చిత్ర. మోహన్ గుండె గుభేల్మంది. తన భార్యను ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలి? తప్పదు. తీసుకెళ్లాలి. వెంటనే చిత్రను తీసుకుని బయటికి వచ్చాడు. కానీ గమ్యం చేరడం అసాధ్యమనిపిస్తోంది. తనకు, తన భార్యకు, ఇంకా భూమి మీద అయినా పడని తన బిడ్డకు అదే ఆఖరు రోజేమో అనిపిస్తోంది. అలా జరగనివ్వొద్దంటూ దేవుణ్ని మనసులోనే ప్రార్థిస్తున్నాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడో తెలీదో కానీ... దేవుడిలా ఒక వ్యక్తి మాత్రం వచ్చాడు. అతడే యూనస్. తన స్నేహితులతో కలిసి చిత్రను లైఫ్‌బోట్‌పైకి ఎక్కించాడు. నానా తంటాలు పడి చిత్రను ఆస్పత్రికి చేర్చాడు. అతడు పడిన కష్టం వృథాగా పోలేదు. చిత్ర పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్న క్షణమే పేరు పెట్టేసింది. ఆ పేరు... యూనస్. తెగించారు! విధికి తలవంచారు యువత తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదు అంటారు. అవును నిజమే. యువత తలచు కుంటే ఏమైనా చేయగలదు. ఎదుటివాళ్లను కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం ఇవ్వగలదు. ఆ రోజు నిర్జీవంగా పడివున్న డానిష్, నోమన్‌లను చూసి అందరూ ఈ మాటే అన్నారు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాల్వకు దగ్గరలో నడుస్తున్నారు డానిష్, నోమన్. అంతలో ఉన్నట్టుండి ఎవరివో అరుపులు వినిపించాయి. మాటలు ఆపి అటువైపు చూశారు. సుమన్ అనే మహిళ. పొరపాటున కాల్వలో పడిపోయినట్టుంది. పైకి రాలేక, ప్రవాహానికి ఎదురీదలేక అవస్థ పడుతోంది. మెల్లమెల్లగా మునిగిపోతోంది. అది చూసి తక్షణం స్పందించారు ఈ మొరాదాబాద్ (యు.పి.) యువకులిద్దరూ. ఎలాగైనా ఆమెను కాపాడాలని ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం... ఆమెను కాపాడలేకపోయారు. పైగా ఆ ప్రయత్నంలో... తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. వారి త్యాగం అందరినీ కంటతడి పెట్టించింది. వారి అంత్యక్రియలకు ఆ ఊరి ప్రజానీకం తరలివచ్చింది. మతఘర్షణలకు పేరు మోసిన ఆ ప్రాంతంలో... ఆ ముస్లిం యువకుల అంతిమ యాత్రకు హిందువులు పెద్ద సంఖ్యలో హాజరై అశ్రుతర్పణ ఇవ్వడం విశేషం. నాకెందుకులే అనుకోలేదు ‘నేనున్నాను’ అని వచ్చాడు అది ముంబై, లోఖండేమార్గ్లోని ఓ కిరాణా షాపు. యజమాని రజనీష్ ఠాకూర్ (36) తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అంతలో ఓ వ్యక్తి షాపులోకి వచ్చాడు. కస్టమర్ అనుకుని ఏం కావాలి అని అడగబోయాడు రజనీష్. కానీ అతడు అడిగే అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా రజనీష్ మీద దాడి చేశాడు. చేతిలో ఉన్న కత్తితో కసకసా పొడిచేశాడు. అసలే ఠాకూర్ వికలాంగుడు. దాంతో ఎటూ తప్పించుకోలేక, ప్రాణాలను రక్షించుకునే మార్గంలేక భయంతో మాన్పడిపోయాడు. కాసేపుంటే ప్రాణాలు వదిలేసేవాడే. కానీ అప్పుడే అక్కడికి ఫోన్ రీచార్జ్ చేయించు కోడానికి వచ్చాడు నసీరుద్దీన్ మన్సూరి (65). జరుగుతున్నదాన్ని చూసి నివ్వెరపోయాడు. అయితే భయపడి పారిపోలేదు. మనకెందుకులే అని వెళ్లిపోనూ లేదు. శక్తినంతా కూడదీసుకున్నాడు. నిందితుడికి ఎదురు తిరిగాడు. ప్రాణాలొడ్డి పోరాడి వాణ్ని తరిమేశాడు. రజనీష్‌ని తక్షణం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రక్తం బాగా పోవడంతో ప్రాణాపాయ స్థితిలో పడ్డ రజనీష్‌కి తన రక్తం ఇచ్చాడు. అతడి ప్రాణాలు కాపాడాడు. ఆ కుటుంబం వీధిపాలు కాకుండా నిలిపాడు మన్సూరి. స్నేహం అనుకోలేదు... బంధం అనుకున్నాడు ‘‘ఏంటీ... సంతోష్ చనిపోయాడా?’’... స్నేహితుడి మరణవార్త వింటూనే విస్తుపోయాడు రజాక్. సంతోష్ తన ప్రాణ స్నేహితుడు. అతడు పోవడమంటే తనలో సగం మరణించినట్టే. అంతటి గాఢ స్నేహం వాళ్లది. అందుకే రజాక్ కళ్లు నీటి చెలమలయ్యాయి. సంతోష్ మరణం ఊహించనిదేమీ కాదు. చాలాకాలంగా ఏదో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు. ఇక చికిత్స ఏం చేయించుకుంటాడు? అందుకే వ్యాధిని, అది పెట్టే బాధని సహించడం అలవాటు చేసుకున్నాడు. కానీ రజాక్ మాత్రం స్నేహితుడి స్థితి చూడలేకపోయాడు. తనకు ఉన్నంతలో ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఎలాగైనా స్నేహితుణ్ని కాపాడుకోవాలని తపించాడు. కానీ అతని ఆశ నిరాశే అయ్యింది. మృత్యువు అతని మిత్రుణ్ని లాక్కెళ్లిపోయింది. విషయం తెలియగానే పరుగు పరుగున వెళ్లాడు రజాక్. మంచమ్మీద విగత జీవిగా పడివున్నాడు సంతోష్. ఆ మంచం పక్కనే దిగులుగా కూర్చుని ఉంది అతడి భార్య. ఆమె కళ్లలో వేదనతో పాటు అంత్యక్రియలు కూడా చేయలేని నిస్సహాయత కనిపించింది. అయినవాళ్లు ఇంకెవరూ లేకపోవడంతో ఆ భారం కూడా తనపైనే వేసుకున్నాడు రజాక్. అతడి నిర్ణయం విని కొందరి నొసలు పైకి లేచాయి. ఓ ముస్లిం, హిందువుకి అంత్యక్రియలు ఎలా చేస్తాడు? ఆ ప్రశ్న అన్ని పక్కల నుంచీ వినిపించినా విననట్టే కదిలాడు రజాక్. క్షణాల్లో పంచె కట్టాడు. కుండ చేతపట్టాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్య క్రియలను పూర్తి చేశాడు. నిజమైన స్నేహితుడిగా నిలిచిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘటన ఇది. -
బతకడమంటే మైలురాళ్లు దాటడం కాదు!
పేతురు యొప్పే (ఇప్పటి టెల్ అవీవ్ పట్టణం)కొచ్చి సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. మధ్యాహ్నం పూట మిద్దెమీద ప్రార్థన చేస్తూ బాగా ఆకలిగొన్నాడు. అప్పుడు అన్ని రకాల జంతువులు, పురుగులు, పక్షులున్న ఒక దుప్పటి నాలుగు చెంగులతో ఆయన ముందు దించబడగా, వాటిని చంపుకొని తిని ఆకలి తీర్చుకొమ్మని చెప్పే ఒక స్వరం వినపడింది. ఎంతో నిష్ట కలిగిన యూదుడనైన తాను నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి ఎన్నడూ తినలేదని పేతురు బదులిచ్చాడు. దేవునిలో కొచ్చిన తర్వాత మనిషి మారడం అనివార్యం. అలా దేవునిలో మారిన ప్రతి విశ్వాసీ ఒక అద్భుతమైన శక్తిగా పరిణామం చెందుతాడు. అలాంటివాళ్లే లోకాన్ని కూడా మార్చుతారు. అలా మూడుసార్లు జరిగింది. ఆ దర్శన భావమేమిటో పేతురుకి అర్థం కాలేదు. అంతలో కైసరయ పట్టణం నుండి వచ్చిన కొందరు ఆయన్ను కలిశారు. అక్కడి కొర్నేలీ అనే భక్తిపరుడైన శతాధిపతి తన ఇంటికొచ్చి తన వారందరికీ క్రీస్తు సువార్త ప్రకటించమంటూ పంపిన ఆహ్వానాన్ని వారు పేతురుకు తెలిపారు. పేతురులాంటి ఛాందస యూదుల దృష్టిలో సున్నతిలేని రోమీయుడైన కొర్నెలీ అన్యుడు, అంటరానివాడు. అతడిచ్చే మంచినీళ్లు కూడా ముట్టరువారు. అయితే అపవిత్రమైనవి ఆరగించమన్న దైవదర్శన భావం క్రీస్తు రక్షణ సువార్తను ఇక నుండి అన్యులకు కూడా ప్రకటించమన్న దైవాదేశంగా అర్థం చేసుకొని పేతురు దానికి విధేయుడై అప్పటికప్పుడు కొర్నేలీ వద్దకు వెళ్లి వాళ్లింట్లో బసచేసి అక్కడి ఐదుమందిని ప్రభువులోనికి నడిపించాడు. అలా అన్యులై క్రైస్తవంలోకి వచ్చిన వారందరికీ ఆద్యుడయ్యాడు (అపొ.కా. 9-43). యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి విశ్వాసిలో మార్పు తేకుండా ఉండదు. పేతురులో కూడా క్రమంగా మార్పులొచ్చాయి. సత్యవాక్య ప్రబోధకుడుగా పేతురు జీవితంలో ముందు సత్యప్రతిష్ట జరగాలి. ‘దేవుడు పరమ తండ్రిగా గల వసుధైక కుటుంబంగా ఈ లోకాన్ని మార్చే పనిలో అతను అందరితో కలిసేవాడుగా మారాలి. వృత్తి కారణాలవల్ల చర్మకారులతో ఛాందస యూదులు కలవరు. కాని పేతురు వచ్చి చర్మకారుని ఇంట్లో బస చేసి అతని ఆతిథ్యం స్వీకరించడమే అతనిలో మార్పునకు నిదర్శనం. అయితే చర్మకారులకే కాదు సున్నతి లేని అన్యులకు కూడా ప్రభువు మార్గం బోధించమని ఆదేశిస్తే పేతురు అందుకు కూడా సిద్ధమై మరో అడుగు ముందుకేయడం ఆత్మీయంగా అతను సాధించిన ఒక గొప్ప విజయం. ఎందుకంటే క్రైస్తవంలోకి సున్నతి కలిగిన యూదులకు మాత్రమే ప్రవేశముంటుందన్నది అతని స్థిరాభిప్రాయం. ఆ విషయంలో అపొస్తలుడైన పౌలుతో విభేదించాడు కూడా (గలతి 2:11-21). అయితే ఆ దర్శనంతో పేతురు చాలా మారాడు. దేవునిలో కొచ్చిన తర్వాత మనిషి మారడం అనివార్యం. అందుకే దేవునిలోకి వచ్చిన తర్వాత మోసగాళ్లు నిజాయితీపరులుగా, స్వార్థపరులు నిష్కామయోగులుగా, క్రూరులు ఎంతో సాత్వికులుగా మారడం చూస్తున్నాం. రంధ్రం పడిన చెంబు తనను తానెలా బాగుచేసుకోలేదో, పరిశుభ్రపర్చుకోలేదో మనిషి కూడా తనను తాను మార్చుకోలేడు, బాగు చేసుకోలేదు. అందుకు అతని సృష్టికర్తయైన దేవుడే పూనుకోవాలి. అలా దేవుడు మార్చిన వాడే నూతనసృష్టి అవుతాడు (2 కొరింథీ 5:17). దేవునిలో మారిన ప్రతి విశ్వాసీ ఒక అద్భుతమైన శక్తిగా పరిణామం చెందుతాడు. అలాంటివాళ్లే లోకాన్ని కూడా మార్చుతారు. మనమెవరమూ పుట్టుకతోనే పరిపూర్ణులం కాదు. కాబట్టే దేవుని తోడ్పాటుతో రోజూ కొంత నేర్చుకుంటూ క్రమంగా పరిపూర్ణులవుతాం. ఆ విధంగా విశ్వాస జీవన ప్రయాణంలో ప్రతి మజిలీని ఆస్వాదిస్తాం. అంతిమంగా యేసుక్రీస్తు స్వరూపాన్ని సంతరించుకునే అంతిమ గమ్యానికి చేరుకుంటాం. ఈ ప్రయాణంలో అందరికీ కలుపుకొంటూ పదిమందికీ చేయూతనిస్తూ ముందుకు సాగాలి. జీవించడమంటే అలా మనుషులను సంపాదించుకొంటూ ముందుకు సాగడమే తప్ప మైలురాళ్లు దాటడం కాదు. గుండెనిండా పగ, ద్వేషం నింపుకుంటే అవి చివరికి మనల్నే దహించేస్తాయి. ప్రేమ నిండిన గుండె ప్రేమనే గుబాళింప చేస్తుంది. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
శక్తి ప్రార్థనలో లేదు, అది వినే దేవునిలో ఉంది!!
సువార్త ఆహాబు రాజు దుర్మార్గపు పాలనలో ఇశ్రాయేలీయులు ఆర్థికంగా, ఆత్మీయంగా కూడా ఎంతో చితికిపోయిన కాలమది. అతని భయంతో ‘బయలు’ అనే విగ్రహానికి వాళ్లంతా ఆరాధనలు చేస్తున్న కాలంలో, ఏలియా ప్రవక్త ఒక్కడే దేవుని పక్షంగా నిలబడ్డాడు. పైగా కర్మెలు పర్వతం మీద, బయలు నిజమైన దేవుడైతే రుజువు చేయమంటూ అతని ప్రవక్తలను సవాలు చేశాడు. వాళ్లు విఫలమైన చోటే ఆకాశం నుండి బలిపీఠం మీద తన ప్రార్థనతో అగ్ని కురిపించి తన దేవుడు నిజమైన వాడంటూ రుజువు చేశాడు. అంతకాలంగా కరువుతో అలమటించిన దేశంపైన ఏలియా ప్రార్థనతో వర్షాలు కురిసి అంతా తెప్పరిల్లారు. (1రాజులు 18:37) యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన యాకోబు ఈ ఉదంతాన్ని ప్రస్తావించి నీతిమంతుడు చేసే మనఃపూర్వకమైన ప్రార్థన లో ఎంతో బలముందుంటున్నాడు (యాకోబు 5:16). అయితే దేవుని వాక్యాన్ని తమకనుగుణంగా అన్వయించుకునే అతి తెలివితేటలతో చాలామంది ‘ప్రార్థన విజయం’ ‘ప్రార్థన శక్తి’ లాంటి నినాదాలు లేవదీసి సొంత ప్రార్థనా -పరిచర్య దుకాణాలు తెరిచారు. ఏమాత్రం కష్టపడకుండా, నష్టపోకుండా చేయగలిగింది ప్రార్థనాపరిచర్య కనుక దాంట్లో ‘ముందుకు’ దూసుకెళ్లిపోతున్నారు. ఈ మాటలు ప్రస్తావించిన యాకూబుతో సహా అపొస్తలులు, ఎంతోమంది ఆదిమ విశ్వాసులు గొప్ప ప్రార్థనాపరులు. ఎందుకంటే వాళ్లంతా తమ సర్వం పోగొట్టుకుని హతసాక్షులయ్యారు. నాడు కర్మెలు పర్వతం మీద ఏలియా చేసిన ప్రార్థనలో అహాబునెదిరించిన తెగింపు, దేవునికోసం పౌరుషముంది. అది మన ప్రార్థనల్లో ఉన్నాయా? ఏలియా తనకోసం ప్రార్థన చేసుకోలేదు. మరి మనం? మన కోరికలు, అవసరాలకోసం చేసే ప్రార్థనకు ఏలియా ప్రార్థనకున్న శక్తి ఎక్కడినుండి వస్తుంది? మనం ప్రార్థించినట్టు జరిగితే ‘ఇది నా ప్రార్థనావిజయం’ అంటూ ప్రగల్భాలు పలకడం, లేకపోతే ‘దేవుని చిత్తం’ అంటూ దాటేయడం సర్వసాధారణమైంది. అయితే ప్రార్థన చేయకూడదా? తప్పక చేయాలి. విశ్వాసికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. మనకోసం మన ఆప్తులకోపం ప్రార్థన చేయడం మన ఆత్మీయ బాధ్యత. కాని దానికి ముందుగా ప్రార్థనకు సంబంధించి కొన్ని మూలాంశాలు తెలుసుకోవాలి. విశ్వాసిని దేవునితో అనుసంధానం చేసే ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రక్రియ ‘ప్రార్థన’. ఈ అనుసంధానంలో విశ్వాసి తనకు సంబంధించి దేవుని చిత్తమేమిటో స్పష్టంగా తెలుసుకుంటాడు. కాబట్టి తానడుగుతున్న దానికన్నా, దేవుడివ్వాలనుకుంటున్నదే తనకు మేలు చేస్తుందన్న ఉన్నత స్థాయికి విశ్వాసి ఎదుగుతాడు. ‘నీ చిత్తమే సిద్ధించును గాక’ అంటూ యేసుక్రీస్తు నేర్పించి, కలువరికి ముందు గెత్సెమనెలో చేసిన ప్రార్థనకు మించిన ప్రార్థన ఈ లోకంలో లేదు. అనుకోకుండా ఎదురైన ఆపదనుండి తప్పించమంటూ ప్రార్థన చేయడం సహజం కాని. అది దేవునికి తెలియదనుకొని ఆయనకే సమాచార మివ్వడానికి పూనుకోవడం సర్వజ్ఞాని, సార్వభౌముడు అయిన దేవుని అవమానించడమే!! ఈ ఆపదనుంచి తప్పించమని దేవుని అగడంతోపాటు దీనిద్వారా నాకు దేవుడేం నేర్పించాలనుకుంటున్నాడని కూడా ఆలోచించాలి. మన బాధ్యతారాహిత్యం, సోమరితనం, అతి తెలివితేటలు, జ్ఞానం లేకపోవడం వంటివి మన జీవితాల్లో చాలాఆపదలు రావడానికి కారణం కాదా? ఆపదనుంచి దేవుడు తప్పించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడంటూ చంకలు గుద్దుకోవడంకాదు, ఆపదలో ఎందుకు పడ్డామో గ్రహించి తప్పులు దిద్దుకోవడం అవివేకం, అవశ్యం కూడా!! శక్తి ప్రార్థనలో కాదు అది వినే దేవునిలోనే ఉంటుంది. దేవుని చిత్తానికనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే నిజమైన ఆత్మీయ విజయం!! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
రెణ్ణిమిషాల జాబితా
ప్రార్థన వరుసగా ‘ఐదు రోజులు’ సెలవులు రావడంతో- పిల్లలు ఊరెళ్లారు. పుస్తకాలు రంజింపజేయలేని ఒంటరితనం! ఈ ఆదివారపు నిరర్థకమైన పగటిపూటకు నన్ను అక్కున చేర్చుకోగలిగేవారెవరు? లక్కీగా అజయ్ ఖాళీగావున్నాడు. పైగా ఇలాంటి పిలుపుకోసమే ఎదురుచూస్తున్నాడు. ఇంకేం! ఇద్దరమూ అనంతగిరి వెళ్లిపోయాం. వికారాబాద్ ఎర్రటినేలలు, కడిగినట్టున్న నల్లటి రోడ్లు, పచ్చటి ఆకులు, మసక మసక కొండల అంచులు, ఊయలలూగనిచ్చే గిల్లీ తీగలు, గుహను తొలిచిన మున్యాశ్రమం, కోనేటిపక్కన వాల్చిన నడుము, అడ్డంగా పరుగెత్తిన ముంగిస, సాగినంత నడక, పీల్చుకోగలిగినంత గాలి, వర్షం పడీపడనట్టున్న సుతిమెత్తటి వాతావరణం... మేము ఆశించినదానికంటే దొరికింది చాలా ఎక్కువ! దానికి ‘కృతజ్ఞతగా’ మెట్లు ఎక్కీ దిగీ ఆలయంలోకి వెళ్లాం. సన్నని ద్వారంగుండా దిగువకు, లోపలికి ప్రవేశించాం. పలుచటి జనంతో అనంతపద్మనాభ స్వామి! పూజారి - మంత్రాలేవో చదువుతున్నాడు. ముందున్నవాళ్లు శ్రద్ధగా వింటున్నట్టున్నారు. నా పక్కనున్న అజయ్ దండం పెట్టుకోవడానికి చేతులు ముడుస్తున్నాడు. అయితే, దేవుడి దగ్గర తనకు అహం ఏమీలేదన్నమాట! నేనేం చేయను? ఒకటేదో కోరుకోవాలి; నాకు సంబంధించినవాళ్లందరికీ శుభం కలగాలి. రెండు నిమిషాలు(!) కళ్లు మూసుకున్నాను. అమ్మ, బాపు, తమ్ముడు, పిల్లలు, చెల్లి, వాళ్ల పిల్లలు- వారిని పట్టించే ఆహార్యాలతో నా లోపల కదలాడారు. బంధువులు- మేనత్తలు, మామయ్యలు, వాళ్ల కుటుంబం, మా అత్తవాళ్లు, వదినలు... మా ఆఫీసు సహచరులు- ఎం, వై, 1, 2, 3, 4, 5... అక్క, బావ... ఐదో తరగతి దోస్తులు- రా, బా, ఎ, కె... ఆ వీళ్లు- నీ, పు, అ, కి... టెన్తు ఫ్రెండ్సు- శి, ప్ర, క్రా, సు, సా... డిగ్రీ, పాతాఫీస్, అక్కడ, అరే ఇటు, అటు... స్థలాన్ని దాటి కాలపు వేగంతో పేర్లు నాకు తగులుతూవున్నాయి. రా, సం, కు, మ, శ్రీ, భ... పేరునుంచి మరో పేరుకూ, ఊరినుంచి మరో ఊరికీ, పట్నం నుంచి నగరానికీ స్మరణ దూకుతూవుంది. ఇంకా ఎవరు? ఎల్, జె, బి, పి, ఎస్... ఇంకా ఎవర్ని మిస్సయ్యాను! నిజంగా నేను కోరుకోవడం వల్లే వాళ్లందరికీ మంచి జరిగేట్టయితే, నేను వాళ్లపేరు తలుచుకోకపోవడం న్యాయం కాదు కదా! పేర్లను తలుచుకుంటున్నప్పుడు కూడా కాలాన్ని లెక్కగట్టడం ఆపలేదు. రెణ్నిమిషాల అంచనాతో కళ్లు తెరిచాను. దేవుడు నన్ను సూటిగా చూస్తున్నట్టున్నాడు! ఇంకా ఎన్నో పేర్లు స్ఫురిస్తున్నాయి. మామూలుగా రోజూ మాట్లాడేవాళ్లు ఇందాక గుర్తురాలేదు. డి, ఐ, జె, వి, బి, ఎన్... ఇంకా, వెళ్తున్నప్పుడు ఉప్పు రాసి జామకాయలమ్మిన ముసలాయన... మమ్మల్ని ఆటోలో అంతదాక మోసుకెళ్లిన అమ్జాద్... అక్కడే డిపార్టుమెంటులో పనిచేసే యాదగిరి... నేను కోరుకోవడం వల్లే మంచి జరిగేట్టయితే- ఏ ఒక్కరినీ వదలకూడదని కదా నా ఆలోచన! నా స్మరణ ఎంత వేగంగా జరిగినప్పటికీ, కొన్ని పదులకొద్దీ పేర్లను తలచుకున్నప్పటికీ, ఇంకా ఎన్నో పేర్లు నేను ఆ క్షణంలో మరిచిపోయాను. అలాంటిది, ఈ భూమ్మీది కోటానుకోట్ల మనుషుల్నీ, మనుషుల్నే కాకుండా సకల చరాచర జీవరాశుల్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడా? ఒకవేళ మరిచిపోతే? గుర్తుపెట్టుకుంటేగనక ఆయన కచ్చితంగా దేవుడే అయ్యుండాలి! - పూడూరి రాజిరెడ్డి -
సెర్బుల హృదయనాదం
సంగ్రామం సెర్బు జాతీయుల ఇళ్లలో కొన్ని శతాబ్దాల పాటు కనిపించిన సాధారణ దృశ్యమది. మగపిల్లవాడికి మూడు నాలుగేళ్లు వచ్చాక ఓ రోజు అతడి తాతగారు పిలిచి, ప్రార్థన కోసం అన్నట్టు మోకాళ్ల మీద నిలబె డతారు. వాడికి ఎదురుగా రెండడుగుల దూరంలో తాతగారు నుంచుని ‘గుస్లే’వాద్యం మీద కొన్ని పాటలు ఆలపిస్తాడు. చివరిగా, వయోలిన్‌ను పోలి ఉండే ఆ తంత్రీ వాద్య పరికరాన్ని బాలుడి చేత ముద్దాడిస్తారు. అది ‘తన జాతి పట్ల తనకున్న కర్తవ్యాన్ని నెరవేరుస్తాను’ అని ఆ పిల్లవాడు చేసే ప్రమాణం. తన జాతి బానిస చరిత్రతో, వర్తమాన పోరాట క్రమంతో చేసుకునే తొలి పరిచయం. జొవాన్ జొవానొవిక్ అనే సెర్బుకవి ఈ సంప్రదాయాన్ని కవిత రూపంలో గొప్పగా నమోదు చేశాడు. గుస్లే మోగని ఇల్లు శ్మశానంతో సమానమని సెర్బులు భావించేవారు. సెర్బులంటే ఐరోపా దక్షిణాది స్లావ్ జాతీయులు. ఇళ్లలోనే కాదు, జాతీయ సామాజికోత్సవాలలోనూ గుస్లేని దేవతామూర్తిలా ఆరాధిస్తారు. ముఖ్యంగా జూన్ 28న జరుపుకునే విదోవ్దన్ జాతీయదినంలో గుస్లే ప్రాధాన్యం అపారం. అదే కొసావో దినం. వీటస్డే అని కూడా అంటారు. వేకువకు ముందే నది దగ్గరకు వెళ్లి, ఉదయించే సూర్యబింబానికి ఎదురుగా నిలబడి ‘జాతిని బానిసత్వం నుంచి విముక్తం చేస్తాం’ అని ప్రమాణం చేస్తూ, ఎర్రదారం చేతికి కట్టుకునేవారు. విదోవ్దన్లో గుస్లేని మోగిస్తూ సెర్బుల వీరగాథ లను ఆలపించేవాళ్లను గుస్లర్లు అంటారు. వీళ్లంతా అంధులే. కానీ ఆ అంధత్వాన్ని ఒక శౌర్య పతకంలా గౌరవిస్తారు. ఎందుకంటే, వీరగాథలు పాడే గుస్లర్ల కళ్లని టర్కీ సైన్యం పెకలించివేసేది. గుస్లేని గన్ధాలో (కమాను)తో మీటిస్తే చాలు సెర్బుల గుండెలు ఉప్పొంగుతాయి. గుస్లర్ల గానంలో విదోవ్దన్ నాటి రాత్రి తడిసిపోతుంది. సెర్బుల నృత్యాలతో గ్రహావా లోయ పులకించిపోతుంది. ‘కొసావో శాపం’ పాటను గుస్లే మీద వింటారు. టర్కుల పాలన నుంచి, అంటే విదేశ పాలన నుంచి సెర్బుల పుణ్యభూమి కొసావోనూ, స్వజాతినీ విముక్తం చేయడానికి జరుగుతున్న యుద్ధంలో పాల్గొననివాళ్లందరికీ ఆ శాపం తగులుతుందని సెర్బుల సిద్ధాంతం. కొసావోను ఒట్టోమాన్ టర్కీ సుల్తాన్ ఆక్రమించాడు. టర్కీకి వ్యతిరేకంగా పూర్వపు సెర్బియా రాజు లాజరస్, అతని అల్లుడు మిలో పోరాడారు. ప్రాణత్యాగం చేశారు. ఇది జూన్ 28, 1389లో జరిగింది. అప్పుడు ప్రారంభించారు సెర్బులు -మాతృభూమి విముక్త పోరాటం. ఆధునిక కాలంలో రైతాంగ పోరాటాల రూపంలో 1807, 1809, 1834, 1852, 1857, 1858లలో పెద్ద పెద్ద తిరుగుబాట్లు జరిగాయి. ప్రతి తరంలోను గుస్లే నాదం వినిపించి, ఈ పోరాటంలో పాల్గొంటానని, కొనసాగిస్తానని సెర్బు బాలల చేత పూర్వీకులతో ఉన్న రక్త సంబంధం మీద ప్రమాణం చేయిస్తారు. అలాంటి కుటుంబం నుంచీ, అలాంటి గ్రహావో ప్రాంతం నుంచీ వచ్చాడు గవ్రిలో ప్రిన్సిప్. ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీల మరణం, మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. ఆ హత్య చేసినవాడు గవ్రిలో. సెర్బుల భూభాగాలు(బాల్కన్ ప్రాంతాలు) 1389 నుంచి టర్కీ పాలనలో ఉండి, 1908లో ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికం కిందకు వచ్చాయి. సెర్బుల పోరాట దిశ కూడా మారింది. 1878లోనే స్వాతంత్య్రం పొందిన సెర్బియా వీరికి అండగా నిలబడింది. గవ్రిలో జూలై 25, 1894న ఒబ్లజాజ్లో పుట్టాడు. తండ్రి పీటర్ ప్రిన్సిప్. తల్లి మేరియా నానా నీ మిక్సిక్. గవ్రిలో తాత జోవో, పినతండ్రి ఇలిజా, పీటర్ అంతా స్వతంత్ర పోరాటయోధులే. అప్పటి చాలామంది సెర్బు యువకుల్లాగే చరిత్ర, చారిత్రక సాహిత్యం, తత్వశాస్త్రం గవ్రిలో ఇష్టపడ్డాడు. సర్ వాల్టర్ స్కాట్, అలెగ్జాండర్ డ్యూమాస్ అంటే ఇష్టం. గ్రహావో లోయ నుంచి సరాయేవోకు, తుజ్లా, బెల్గ్రేడ్లకు చదువు కోసం వచ్చాడు. అక్కడే బ్లాక్ హ్యాండ్, యంగ్ బోస్నియా సంస్థలలో చేరాడు. ఇవన్నీ సెర్బుల స్వేచ్ఛకోసం, విశాల సెర్బియా కోసం పోరాడుతున్న ఉగ్రవాద సంస్థలే. సెర్బుల ఆధునిక పోరాటంలో (1908 తరువాతి దశ) తొలి సమిధగా చెప్పే బోగ్డాన్ జెరాజెక్ అంటే గవ్రిలోకు వల్లమాలిన అభిమానం. బోస్నియా-హెర్జిగోవినాలు ఆస్ట్రియా అధీనంలోకి పోయిన తరువాత తొలిసారి 1911లో పార్లమెంటుకు ఎన్నికలు జరిపారు. కొత్త సభ కొలువైన తొలిరోజునే బోగ్డాన్ జెరాజెక్ (స్లోబోదా అనే విప్లవ సంస్థకు చెందినవాడు) అక్కడ ప్రసంగించడానికి వెళుతున్న ఆస్ట్రియా తరఫు గవర్నర్ జనరల్ వెరాసినన్ మీద కాల్పులు జరిపాడు. ఐదు బుల్లెట్లకు కూడా అతడు దొరకలేదు. ఆరో బులెట్‌తో తనను తను కాల్చుకు చనిపోయాడు బోగ్డాన్. గవ్రిలో ఇతడి సమాధి దగ్గరకు వెళ్లి బోగ్డాన్ ఆశయాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చాలా కష్టపడి ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్‌ను హత్య చేయడానికి బెల్గ్రేడ్ నుంచి సిద్ధం చేసిన ముగ్గురు సభ్యుల బృందంలో ఒకడయ్యాడు. సరాయేవోలో అక్కడి నాయకుడు డెనిలో ఇలిక్ మరో ముగ్గురుని తయారు చేశాడు. ఇలిక్ ఒక సెర్బు భాషా పత్రిక సంపాదకుడు. పూర్వాశ్రమంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో అధ్యాపకుడు. హత్య చేసే రోజుకు గవ్రిలో వయసు పందొమ్మిదేళ్లు. మిగిలిన సభ్యులు కూడా ఇరవై సంవత్సరాల లోపు వాళ్లే. నెడెల్కో కాబ్రినోవిక్ ఇందులో మొదటివాడు. టైప్ సెట్టర్‌గా (అచ్చుపనిలో అక్షరాలు కూర్చడం) పనిచేసేవాడు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఉండగా, ఇతడు పని చేస్తున్న ప్రెస్లోనే అనార్కిస్టు సాహిత్యం అచ్చయ్యేది. అది చదివి ఉగ్రవాదిగా మారాడు. ఒకసారి ఆ పుస్తకాలను బోస్నియాలో ఇంటికి తెస్తే తల్లి తగులబెట్టింది. ఎందుకంటే, ఇతడి తండ్రి ఆస్ట్రియా ప్రభుత్వం తరఫున బోస్నియాలో పని చేస్తున్న గూఢచారి. ట్రిఫ్కో గ్రాబెజ్ ఇంకొక సభ్యుడు. ఇతడి తండ్రి సెర్బ్ ఆర్థడాక్స్ చర్చి పురోహితుడు. ఇలిక్ రూపొందించిన మరో ముగ్గురు సభ్యుల బృందంలో మొదటివాడు మహమ్మద్ మహమ్మద్ బాసిక్. ఇతడికి మొదట బోస్నియా గవర్నర్ జనరల్ పొటియోరిక్ను చంపే బాధ్యతను అప్పగించారు. తరువాత యువరాజునే చంపాలన్న పథకంతో ఆ పనిని నిలిపేశారు. ఇతడు బోస్నియా వాడే. టర్కీ అధికారం కోల్పోయిన తరువాత వీధిన పడ్డ ముస్లిం జమిందారీ కుటుంబాలలో వీళ్లదీ ఒకటి. ఇతడు పెట్టెల సొరుగులు తయారు చేయడంలో దిట్ట. వాసో కుబ్రిలోవిక్, వెజ్కో పొపోవిక్లతో కలిసి బాసిక్ హత్య కుట్రలో పాల్గొన్నాడు. గవ్రిలో బక్కప్రాణి. అందుకే బాల్కన్ యుద్ధాల (1912-1913)లో సెర్బియా తరఫున యుద్ధం చేద్దామనుకున్నా అవకాశం రాలేదు. ఈ యుద్ధంతోనే తమ చిరకాల వాంఛ విశాల సెర్బియాకు, సెర్బుల విముక్తి లక్ష్యానికి ఎంతో దగ్గరగా వచ్చామని అనుకోవడానికి వీలైంది. ఈ యుద్ధంలో టర్కీ ఓడిపోయింది. అంటే పుణ్యభూమి కొసావో సెర్బుల చేతికి వచ్చింది. ఆ యుద్ధాలలో చాలామంది యంగ్ బోస్నియా సభ్యులు గెరిల్లా దళాలలో (కూమెటీ) పనిచేశారు. కానీ బలహీనుడన్న కారణంగా సెర్బియా పెద్దలు గవ్రిలోను ఎంపిక చేయలేదు. అలాంటివాడు ఆస్ట్రియా యువరాజును హత్య చేశాడు. సెర్బు యువకులలో ఆవేశం కనిపిస్తుంది. నిజమే! కానీ ఆలోచన లేనివారు మాత్రం కాదు. అంతా విద్యావంతులు. సాహిత్యవేత్తలు. వారి జాతీయవాదానికి ఇదే పునాది. సరాయేవో జంట హత్యలకు సంబంధించి జూలై 5 కల్లా 25 మందిని అరెస్టు చేశారు. గవ్రిలోకు 20 ఏళ్ల శిక్ష వేసి ప్రాగ్ నగరానికి ఉత్తరంగా ఉన్న, శిథిలమైన కోటలో ఉంచారు. ఇదే టెరిజిన్(థెరియసిన్స్టాడ్) కారాగారం. ఇక్కడ దారుణమైన పరిస్థితులు ఉండేవి. చీకటితో, చలిగాలితో, ఏమాత్రం ఎండరాని గదిలో అతడిని ఉంచారు. క్షయ వ్యాధి ముదిరిపోయింది. ఎముకలకు పాకి కుడి చేయి తొలగించవలసి వచ్చింది. బయట ప్రపంచ యుద్ధం మొదలయిపోయింది. ఫెర్డినాండ్ హత్య సెర్బియానీ, సెర్బులనూ ఎన్ని బాధలకు గురి చేస్తోంది... ఆస్ట్రియన్ జైలర్ ఒకరు గవ్రిలోకు చెప్పారు. అందుకు అతడు అన్నమాట- ‘సెర్బియాను ముట్టడించగలరేమోగానీ, జయించలేరు.’ మరో ఆరు మాసాలలో గ్రేట్ వార్ ముగుస్తుందనగా గవ్రిలో ఏప్రిల్ 28, 1918న ఆ జైల్లోనే చనిపోయాడు. సెర్బుల భూభాగాలను టర్కీ, తరువాత ఆస్ట్రియా కబళించిన మాట నిజం. సెర్బుల పోరాటమంతా ఈ అంశం మీదే. ఆ క్రమంలో ఆస్ట్రియా యువరాజు దంపతుల మీద గవ్రిలో తుపాకీ పేల్చాడు. అది ఆ రెండు దేశాలకూ సంబంధించిన సమస్య. కానీ, ‘ఎ ప్లేస్ ఆన్ ద సన్’ అంటూ రణకండూతితో వేగిపోతున్న జర్మనీకి గవ్రిలో తుపాకీ శబ్దం సేనలను ఉరికించే సంకేతంగా వినిపించింది. - డా.గోపరాజు నారాయణరావు ....రెండడుగుల దూరంలో తాతగారు నుంచుని ‘గుస్లే’వాద్యం మీద కొన్ని పాటలు ఆలపిస్తాడు. చివరిగా, వయోలిన్‌ను పోలి ఉండే ఆ తంత్రీ వాద్య పరికరాన్ని బాలుడి చేత ముద్దాడిస్తారు. అది తన జాతి పట్ల తనకున్న కర్తవ్యాన్ని నెరవేరుస్తాను అని ఆ పిల్లవాడు చేసే ప్రమాణం. -
బెయిల్ రావాలని విశాఖలో పూజలు
-
జగన్ కోసం కడప పెద్దదర్గాలో ముస్లీం సోదురుల ప్రార్ధనలు
-
జగన్ దీక్ష విజయవంతం కావాలని ప్రార్ధనలు