సాక్షి ప్రతినిధి, కడప: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా శనివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా స్మృత్యంజలి ఘటించారు. ప్రత్యేకంగా అలంకరించిన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనుబంధాన్ని తలచుకున్నారు. ఈ సందర్భంగా దివంగత మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులందరితో పాస్టర్ నరేష్బాబు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైవీ స్వర్ణమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ సుగుణమ్మ, డాక్టర్ ఈసీ దినేష్రెడ్డిలతో కలిసి వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, పోతుల సునీత, రమేష్ యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, డాక్టర్ సు«ధా, ఎస్.రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లికార్జునరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి పాల్గొన్నారు.
సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీఐజీ సెం«థిల్‌కుమార్, జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, జేసీ గణేష్‌కుమార్ తదితర అధికారులు సీఎం వెంట ఉన్నారు. అనంతరం ఇడుపులపాయలో వైఎస్ కుటుంబీకుల ప్రార్థన మందిరం సమీపంలో సింహాద్రిపురం నేతలతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకు ముందు అనంతపురం జిల్లా నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకున్న సీఎంకు ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు స్వాగతం పలికారు.
వైఎస్సార్‌కు షర్మిల నివాళి
వేంపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం 8.10 గంటలకు వైఎస్సార్ సతీమణి విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణితో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment