jayanthi
-
తెలుగువారి బాహుబలి.. ఇనుప కండలు.. ఉక్కు నరాలు!
‘తిండి కలిగితె కండకలదోయ్.. కండకలవాడేనుమనిషోయ్’ అని చెప్పిన మహాకవి గురజాడ నడయాడిన ఉత్తరాంధ్ర నేలపైనే ప్రపంచం మెచ్చిన మల్లయోధుడు కోడిరామ్మూర్తి నాయుడు కూడా తిరుగాడారు. కలియుగ భీముడిగా, ఇండియన్ హెర్క్యులస్గా, మల్లమార్తాండగా ప్రపంచదేశాల్లో భారత కీర్తిప్రతిష్టలు చాటిచెప్పారు. తన భుజ బలంతో పాశ్చాత్యులను నోరెళ్లబెట్టేలా చేశారు. బండరాళ్లను గుండెపై పెట్టి పగలగొట్టించడం, ఒకటిన్నర టన్నుల బరువును గుండెలపై పెట్టించి మోయడం, ఏనుగును ఛాతీపై ఎక్కించుకోవడం వంటి వళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసిన రామ్మూర్తినాయుడు గురించి 20వ శతాబ్దం ఆరంభంలో ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసులను ఒంటిచేత్తో తెంచేసిన ఆయన బలానికి ఆంగ్లేయులు శభాష్ అన్నారు. ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం కోడి రామ్మూర్తి నాయుడు స్వస్థలం. నేడు ఈ మల్లయోధుడి 142వ జయంతివీరఘట్టం: కోడి రామ్మూర్తినాయుడు 1883 నవంబర్ 3వ తేదీన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు వీరఘట్టంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తల్లిలేని పిల్లాడు కావడంతో రామ్మూర్తిని తండ్రి వెంకన్ననాయుడు ఎంతో గారాబంగా చూసేవారు. ఈ గారబంతో రామ్మూర్తి నాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా డుమ్మాకొడుతూ వీరఘట్టంకు సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవాడు. కొడుకును చదివించాలనే దృష్టి ఉన్న వెంకన్న రామ్మూర్తిని విజయనగరంలో ఉన్న తన తమ్ముడు నారాయణ స్వామి ఇంటికి పంపించాడు. అక్కడికి వెళ్లినా రామ్మూర్తి చదువు కంటే వ్యాయామం వైపే మొగ్గు చూపుతుండటంతో పినతండ్రి రామ్మూర్తిని మద్రాస్ పంపి వ్యాయామ కళాశాలలో చేర్పించాడు. తర్వాత విజయనగరంలో తను చదివిన కళాశాలలోనే రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించారు. వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్యపై పట్టు సాధించారు. ఇలా వ్యాయామం, దేహదారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా ప్రదర్శించేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. కొన్నాళ్లకు విజయనగరంంలో రామ్మూర్తి ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఊపిరి బిగబట్టి.. ఉక్కు గొలుసులు తెంపి రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో మరింత కఠినమైన విన్యాసాలు చేసేవారు. రామ్మూర్తిని ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను ఎంతవేగంగా నడిపించినా అవి కదిలేవి కాదు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆహ్వానం మేరకు రామ్మూర్తినాయుడు పూణె వెళ్లి సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. రామ్మూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు.1920 సంవత్సరంలో కార్లను ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతున్న రామ్మూర్తి ప్రదర్శన చూసి బ్రిటిష్ వైశ్రాయ్ లార్డ్ మింటో ఆశ్చర్యపోయారు. రామ్మూర్తి బృందాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లి బకింగ్‌హాం ప్యాలెస్‌లో ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి ముందుప్రదర్శన ఇప్పించారు. రామ్మూర్తి నాయుడు ప్రదర్శనకు మెచ్చిన ఇంగ్లండ్ రాణి అతనికి ‘ఇండియన్ హెర్క్యులస్’ అనే బిరుదుతో సత్కరించారు. యూరప్‌లో పలు ప్రదర్శనలు ఇచ్చిన రామ్మూర్తినాయుడు అనంతరం జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా సర్కస్ ప్రదర్శనలు ఇచ్చారు. బర్మాలో హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలో స్థిరపడ్డారు. చేతికి ఎముకలేని దాత కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. శాఖాహారి, ఆంజనేయస్వామికి పరమ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేసారని, అప్పటినుంచి ఆయన దైవచింతనలో ఉండేవారని చెబుతారు.ఆ సాధువు నుంచే రామ్మూర్తి జలస్తంభన, వాయుస్తంభన విద్యలు నేర్చుకున్నాడు. సర్కస్ కంపెనీ ద్వారా అప్పట్లోనే లక్షల రూపాయలు సంపాదించిన రామ్మూర్తి భారీగా దానధర్మాలు, విరాళాలు అందించేవారు. భారత స్వాతంత్య్రోద్యమానికి సైతం తనవంతు సాయం అందించారు. జీవిత చరమాంకంలో రామ్మూర్తినాయుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని చుట్టుముట్టాయి. కొంతమంది శిష్యులతో కలిసి ఒడిశాలోని కలహండి సంస్థానాదీశుని పోషణలో ఉండగా 1942 జనవరి 16వ తేదీన రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. ‘కోడి’ బయోపిక్.. కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు రెండేళ్ల కిందట కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ నటుడు దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అనంతరం ఈ విషయంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి కోడి రామ్మూర్తినాయుడంటే అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన అటువంటి మహానుభావుని చరిత్రను భారత ప్రభుత్వం గుర్తించాలి. రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శం. – కోడి రాజశేఖర్, రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నార్త్ కరోలిన్, అమెరికాపాఠ్యాంశంగా చేర్చాలి 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పాఠ్యాంశం ఉండేది. కాలక్రమేణ సిలబస్ మారడంతో దాన్ని తొలగించారు. ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. – ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం -
Valmiki Jayanti 2024 ఆది స్మరణీయుడు
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు, మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షి చిరస్మరణీయుడు. శ్రీరాముని దివ్యచరితాన్ని కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి సదావందనీయుడు. ప్రతి ఒక్కరూ రామాయణ కావ్యం చదివి అందులోని నీతిని అవలోకనం చేసుకుని, అందులో కొంతయినా ఆచరించ గలిగితే ఆ మహాకవి ఋణం తీర్చుకున్నట్లే. -
అబ్దుల్ కలాం తరతరాలకు స్ఫూర్తి .. మాజీ రాష్ట్రపతికి వైఎస్ జగన్ నివాళి
-
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. గురజాడ అప్పారావుకి జగన్ నివాళి
-
గురజాడ అప్పారావుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.‘‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు. ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.“దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని, సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2024 ఇదీ చదవండి: -
కాంగ్రెస్ నేతలకు వైఎస్ జయంతి కానుక
సాక్షి, హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేషన్ చైర్మన్ల ఉత్తర్వులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి కానుకగా 34 మంది కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా అధికారికంగా నియమించారు. మరొకరిని వైస్‌చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట మార్చి 15వ తేదీతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా చైర్మన్లు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు మొత్తం 37 మంది కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పదవులు లభించాయి. వీరిలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జగదీశ్వరరావు తనకు నామినేటెడ్ పదవి వద్దనడంతో ఆయన పేరు అధికారిక జాబితాలో లేదని తెలుస్తోంది.ఆయన్ను ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించగా, తాజా జాబితాలో ఆ పోస్టును ఖమ్మం జిల్లాకు చెందిన మువ్వా విజయ్‌బాబుకు కేటాయించారు. ఆయనకు గతంలో కేటాయించిన విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివద్ధి సంస్థ (ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పేరు కూడా అధికార జాబితాలో లేదు. ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ల నియామకానికి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని, అందుకే ఆమె పేరు పెండింగ్‌లో పెట్టారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రకటించిన జాబితాలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కార్పొరేషన్‌ను మార్చారు. ఆయనకు గతంలో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించినా. ఆ పదవిని యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు కట్టబెట్టాలన్న ఆలోచనతో జ్ఞానేశ్వర్‌ను ముదిరాజ్ కార్పొరేషన్‌కు మార్చారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా గతంలో కోటా్నక్ నాగును నియమించగా, ఆయన స్థానంలో కోటా్నక్ తిరుపతిని ప్రకటించారు. ఇక, సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకు 12, కమ్మలకు 3, వెలమలకు 1, ముస్లింలకు మూడు, ఆర్యవైశ్య, బ్రాహ్మణులకు ఒక్కోటి చొప్పున పదవులు లభించాయి.బీసీల్లో గౌడ్లకు 4, ముదిరాజ్‌లకు 2, మున్నూరుకాపులకు రెండు, వడ్డెర, పద్మశాలి, లింగాయత్‌లకు ఒక్కో పదవి లభించింది. ఎస్సీలకు 1, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ప్రకటించారు. కాగా, కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు వచి్చన రోజే పలువురు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే చాలా కాలం వేచి ఉన్నామని, ఇక ఉత్తర్వులు వచి్చన తర్వాత ఇంకా వేచి ఉండడం ఎందుకంటూ హడావుడిగా వెళ్లి తమ తమ కార్యాలయాల్లోని సీట్లలో ఆసీనులు కావడం గమనార్హం. -
ఏపీలో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
-
సిడ్నీలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
వైఎస్సార్ జయంతి: జనహృదయ నేతకు వైఎస్ జగన్ నివాళి (ఫోటోలు)
-
మహేష్, రాజమౌళి మూవీ అప్డేట్ అప్పుడేనా ?
-
Jayanthi Chauhan: బాధ్యతను సవాల్‌గా తీసుకుంది
మహిళలు ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు. అంతకన్నా సమర్థతంగా తమ సత్తా ఏంటో నిరూపించగలరు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ తండ్రి అమ్మాలనుకున్న కంపెనీ బాధ్యతలను చేపట్టి కార్పొరేట్ దిగ్గజాలకు దీటుగా ఏడు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టిన మహిళ జయంతి చౌహాన్. ఎవరీమే..? అనేవారికి ఆమె ప్రతిభే ఆమెను పరిచయం చేస్తుంది. రెండేళ్ల క్రితం వరకు జయంతి చౌహాన్ తనకు నచ్చిన రంగమైన ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన ఓ అంతర్జాతీయ కంపెనీని విజయవంతంగా నడిపిస్తూ ఉండేది. ఆమె తండ్రి భారతీయ బహుళజాతి కంపెనీ అయిన బిస్లరీకి రమేష్ చౌహాన్ చైర్మన్. కూతురిని మొదట ఈ వ్యాపార రంగంలోకి రమ్మని అడిగాడు. కానీ, వ్యాపార రంగంలో ఆసక్తి లేక ఆమె నిరాకరించింది. రమేష్ చౌహాన్ వయసు పై బడుతుండటం, ఎవరి మద్దతూ లేక΄ోవడంతో కంపెనీని అమ్మాలని పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల యజమానులతో చర్చలు జరిపారు. 2022లో చేసిన చర్చలు సఫలం అయ్యాయి. కానీ, డీల్ అమలు కాలేదు. ఆ సమయంలో జయంతి చౌహాన్ తన తండ్రి కంపెనీకి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చింది. బిస్లరీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో పెద్ద మార్పు కనిపించింది.ఫ్యాషన్ ఐకాన్ఢిల్లీ, ముంబయ్ నగరాలలో జయంతి బాల్యం గడిచింది. ఆ తర్వాత ఫ్యాషన్ రంగం అంటే ఉన్న ఇష్టంతో ఆమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి స్టైలింగ్‌లో పట్టా ΄÷ందింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ స్టైలింగ్‌లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తనదైన స్టైల్ మార్క్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు ΄÷ందింది. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్‌లో బిఏ కూడా చేసింది.కొత్త పానీయాల పరిచయంబిస్లరీ కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన మార్క్‌ను చూపింది. వాటర్ కంపెనీ నుంచి కార్బొనేటెడ్ డ్రింక్స్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు సంస్థకు మరింత లాభదాయకంగా మారాయి. డిజిటల్, సోషల్ మీడియా ΄్లాట్ఫారమ్ల ద్వారా ప్రచారం కూడా ఉత్పత్తి వృద్ధిని పెంచింది. శీతల పానీయాల పరిశ్రమలోని దిగ్గజ కంపెనీలకు బిస్లరీ ప్రవేశం ఓ సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు భావించేంతగా కృషి జరిగింది. దీంతో టాటా గ్రూప్‌తో డీల్ కుదిరి, మినరల్ వాటర్ బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఇతర కార్పోరేట్ కంపెనీలతో జయంతి చౌహాన్‌కు చెందిన బిస్లరీ ఇంటర్నేషనల్ ΄ోటీపడుతోంది. జయంతి తన 42 ఏళ్ల వయసులో వైస్ చైర్పర్సన్ హోదాతో కంపెనీని దిగ్విజయంగా నడిపిస్తోంది. సేల్స్, మార్కెటింగ్ బృందానికి కూడా నాయకత్వం వహిస్తోంది. వ్యాపార రంగంలో తన నైపుణ్యాలను చూపలేనేమో అని సందేహించి తొలుత వెనకడుగు వేసినా, తండ్రి మీద ప్రేమతో తీసుకున్న బాధ్యతను మరింత దిగ్విజయంగా నడిపిస్తూ కార్పోరేట్ దిగ్గజాలకే ఔరా అనిపిస్తోంది. ‘సమస్య మనదే, సవాల్ కూడా మనదే’ అని నవ్వుతూ సమాధానమిచ్చే జయంతి లాంటి వ్యక్తులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. -
"మిస్ యూ నాన్న.."
-
రాతల్లో నిజాయితీ: రామేశంగారు మాకు..
రామేశంగారు మాకు దగ్గరగా ఉండే, దూరపు బంధువు! ఒకే వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారం! ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయపీచు చుట్టరికం ఉండేది. మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య, మావయ్య అని పిలిచేవారం! మా నాన్నగారు, ఆయన ఒకే డిపార్ట్మెంటులో పనిచేసేవారు. దానికితోడు ఇద్దరూ రచయితలే! ఇవన్నీ కలవడంతో, మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలావున్నా, స్నేహం ఎక్కువ కనబడేది!నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే.. మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం, రామేశంగారు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళిపోవడంతో, మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడి పోయింది. తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి, మూడు నాలుగు చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను. ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో, కౌంటర్ ఎదురుగా నిలబడి.. ‘నువ్వు చిట్డిబాబు కొడుకువి కదూ!’ అంటూ పలకరించారు. బుర్ర వంచి పని చేసుకుంటున్న నేను, ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను. రామేశం గారే!మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు. అందులో రామేశంగారు ఒకరు! ‘అవునండీ .. మీరు రామేశం మావయ్యగారు కదూ!’ అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది. ‘అవునయ్యా! ఇక్కడికి ఎప్పుడు వచ్చావూ.. మీ నాన్న ఆరోగ్యం ఎలావుంది.. ఇక్కడే ఉన్నారా? నువ్వు కూడా కథలు రాస్తావుట కదా.. మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు! రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను!’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అన్నిటికీ జవాబులిచ్చి.. ‘సాయంత్రం బ్యాంకు అవగానే మీ ఇంటికి వస్తాను!’ అంటూ అడ్రసు తీసుకుని ఆయన పనిచేసిపెట్టి పంపేశాను. అలా.. మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది! అయితే మా నాన్న కదల్లేని పరిస్థితులలో ఇంటిపట్టునే ఉండేవారు. మా అమ్మ ఏ పేరంటాలకో వెళ్తుండేది. నేను ఖాళీ దొరికినప్పుడో, కథల మీద సలహాలు తీసుకోడానికో, ఆయన పని మీదో వాళ్ళింటికి వెళ్తుండేవాడ్ని! రామేశంగారి భార్య భానుమతిగారు మా ఇంటికి తరచు వస్తుండేవారు. రామేశంగారు మాత్రం ఎవరింటికి వెళ్ళేవారు కాదు! వాళ్ళ పిల్లలు కూడా అంతే.. ఎవరినీ కలసేవారు కాదు. ఇప్పుడు ఆయన మా ఇంట్లోవాళ్లందరి కంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. అలాగే.. ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాడ్ని. మంచి శైలి, అభ్యుదయ భావాలతో ఆయన కథలు, ఆసాంతం చదివించేవి. ఆయన్ని కలసినప్పుడల్లా.. నాకు తెలియని చాలా విషయలు చెప్తూ ఉండేవారు.ఆయనతో బాగా చనువు ఎర్పడటంతో, నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాడ్ని! బావుండకపోతే.. మొహం మీదే చెప్పేవారు. ఆయన సూచనలు తీసుకుని మార్పులు, చేర్పులు చేసి, మళ్ళీ ఆయన ఓకే అన్న తర్వాతే, పత్రికలకు పంపేవాడ్ని! ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత, ఉన్నట్టుండి రామేశంగారికి మోకాలు నొప్పి వచ్చి, బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి.. ‘చేతి వేళ్లు కూడా పూర్తిగా పట్టు తప్పాయి! నీ అవసరం తరచు ఉంటుంది!’ అంటూ, బ్యాంకు పని ఏదో పురమాయించారు. బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో, వెంటనే వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశంగారిని చూడ్డానికి వెళ్ళాను. తలుపు తీస్తూ.. ‘రా నాయనా! ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు! కూర్చో కాఫీ ఇస్తా!’ అంటూ మా అత్తయ్య, నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది.‘మార్చి నెల కదా.. బ్యాంకులో చాలా బిజీగా ఉంది! ఇంటికి వెళ్ళేసరికే రాత్రి పది దాటిపోతున్నది!’ అంటూ రామేశంగారి మంచం దగ్గరకి కూర్చి లాక్కుని కూర్చున్నాను. అప్పుడు చూశాను.. మరో కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. ఆవిడ్ని నేనెప్పుడూ చూడలేదు.‘ఏంలేదోయ్.. మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్ళు కూడా నా మాట వినడం లేదు! మెదడు నాదే కదా.. ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది!’ అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య, రామేశంగారి మాటలకు అడ్డం పడుతూ.. ‘చోద్యం కాకపోతే.. డొంకతిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా!’ అంటూ, నాకు కాఫీ గ్లాసు అందించింది. ‘కథలలో వర్ణనలు, ఉపోద్ఘాతాలు, ఉపమానాలు లేకపోతే, నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది!’ ఆవిడతో అని..నావైపు చూపు మరలుస్తూ ‘ఏం లేదేయ్.. ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది. అందుకే.. నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను. ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో!’ అన్నారు రామేశంగారు.‘కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట!’ నవ్వుతూ అంటూ, కాస్సేపు మాట్లాడి వచ్చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ‘ఎక్కడైనా వంట మనిషినో, పని మనిషినో పెట్టుకుంటారు గాని, ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి!’ మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది.‘కదల్లేని కథల మనిషికి, నీలా కథలు చెప్పేవారు కాకుండా, కథలు రాసేవారు కావాలి కదోయ్!’ ఆయన కూడా నవ్వుతూ అనేవారు. ‘ఎప్పుడు చూసినా మన కొంపల్లో పదిమంది ఉండేవారు! ఇప్పుడేం వుంది.. లింగు లింగుమని ఇద్దరేసి ఉంటున్నారు! ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయనా!’ అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది.ఓ రోజు బ్యాంకులో పని చేసుకుంటుంటే, రామేశంగారి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అత్తయ్య చనిపోయింది, అర్జంటుగా నువ్వు రావాలి’ అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్డిశారు!ఒక్కసారిగా నిర్ఘాంత పోయాను. ‘ఆవిడ ఎప్పుడూ ముక్కు చీదిన సందర్భం కూడా లేదు.. అలాంటిది ఈ ఘోరం ఎలా జరిపోయిందో..’ అనుకుంటూ బ్రాంచి మేనేజరు దగ్గరికి వెళ్ళి, విషయం చెప్పి, సెలవు పెట్టి రామేశంగారింటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ పిల్లలు, బంధువులు వచ్చి, తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు. రామేశంగారు దిగులుగా ఓ పక్కన కూర్చుని ఉన్నారు. ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. దగ్గరకి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే, నా కళ్ళు చెమర్చాయి.‘నిన్న రాత్రి వరకు బానే ఉందయ్యా.. ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే, డాక్టరు రామ్మూర్తికి ఫోన్ చేశా. ‘మీరు రావొద్దు.. నేనే హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు, మీ ఇంటికి వచ్చి చూస్తానులెండి!’ అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు. ఆయన వచ్చేలోగా.. అదిగో ఆ దివాను మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది! హార్ట్ అటాక్ట. పాపం అది చెప్పడానికి రామ్మూర్తి వచ్చినట్టైంది! బీపీ, షుగరు, బెల్లం అన్నీ నాకున్నాయి గాని, మీ అత్తకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు! సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది!’ అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి, రామేశంగారు ఇంట్లో ఒంటరైపోయారు. ఆయన పక్కన మౌనంగా కాస్సేపు కూర్చున్నాను. ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది. ‘నాకు తప్పదులే.. పనేమైనా ఉంటే ఫోన్ చేస్తాను! అన్నట్టు.. మీ అమ్మా, నాన్నలకి ఈ విషయం అంత అర్జంటుగా చెప్పకు. మెల్లగా వీలు చూసుకుని చెప్పు’ అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు. జలజలరాలే నీటిబొట్లు ఆయన ఒళ్లో పడుతుండటం నేను మొదటిసారి చూశాను. కాలగర్భంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఆ రోజు లంచ్ టైములో.. ‘నీకీ విషయం తెలిసిందా!?’ అంటూ మా కొలిగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ.. తెలియదన్నట్టు తలూపాను. ఎడం చేత్తో సెల్ఫోన్లో ఓ ఫొటో చూపెట్టేడు. అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టైయింది. నా నోటంట మాట రాలేదు.‘నిజం కాదే’ అన్నట్టు అతని వైపు చూశాను. ‘ఓ వారం కిందట.. మా ఫ్రెండ్ అక్కడకి ఏదో పని మీద వెళ్తే, కనబడ్డారుట.. మీ మావయ్యగారు వీల్ చైర్లో ఉన్నారుట, పక్కన ఆవిడ ఉందిట!’ అంటూ ఆ విషయాన్ని మా కొలిగ్ కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే, నమ్మలేకుండా ఉండిపోయాను. లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పని చేసుకుంటున్నానే గాని, ఆలోచనలతో మనసంతా కకావికలమైంది!ఓ నాలుగు రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను. ఏం చేయాలో తోచలేదు. ‘అసలు ఏం చేయగలను?’ అనుకుంటూ సమాధాన పడిపోయాను.ఆ రోజు.. బ్యాంక్‌లో పని పూర్తిచేసి, టేబుల్ సర్దుకుంటుంటే సెల్‌ఫోన్ మోగింది. రామేశంగారి నుంచి.. ఉలిక్కిపడ్డాను! ఫోన్ ఆన్ చేశాను గాని, మాటలు వెతుక్కుంటూ, తడపడ్డాను!‘బ్యాంకులో ఉన్నావా.. అందరూ బావున్నారా?’ ఆయన మాటల్లో కాస్త వ్యంగం కనబడింది. కారణం.. ఈమధ్య కాలంలో నేను ఆయన్ని కలవలేదు, ఫోన్లో మాట్లాడిందీ లేదు! ‘అందరూ బావున్నారండీ! బ్యాంకులో చాలా బిజీగా ఉంది.. రాలేకపోయాను!’ పొడి పొడిగా వచ్చాయి నా మాటలు.‘ఏం లేదోయ్.. మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ మార్చాలి! ఆ ఫారం పట్టుకుని ఓసారి రా.. !’ ఎప్పటిలాగే.. హుకుం జారిచేసినట్టు అన్నారు. భార్య పోయిన తరువాత పెన్షన్ అకౌంట్‌కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు! అయితే ఆయన చాదస్తం తెలిసిన వాడ్ని కాబట్టి ‘రేపు వస్తాను!’ అంటూ ఫోన్ కట్ చేశాను.ఆయనింటికి వెళ్ళి, ఆయన్నెలా ఫేస్ చెయ్యాలో అర్థం కాలేదు! మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి, మధ్యలో ఆయనింటికి వెళ్ళాను.‘ఏమిటీ.. ఈ మధ్య మరీ నల్లపూసవై పోయావు..’ ఆ మాటలకి సమాధానం చెప్పకుండా.. ముభావంగా నా చేతిలో బ్యాంకు ఫారం ఆయనకి ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఆ ఫారం నింపుతూ.. ‘ఏంలేదోయ్.. పోయే వయసే కదా, తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు!’ అంటూ నా వైపు క్రీగంట చూస్తూ అన్నారు. వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి, నాకు అందించింది. ఆవిడలో మార్పు నాకు ఏం కనబడలేదు. ‘మా పిల్లలు బానే చూస్తారు, వాళ్ళ దగ్గరకి వచ్చేయమని అంటారు. కానీ, నాకీ కాగితాల్ని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు! ఆ మాట ఎలా ఉన్నా, ఓసారి చూసి.. అన్ని సరిపోయాయో లేదో చెప్పు!’ అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు. ఫారంలో ఆయన ఫించన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి, నుదురు చిట్లించి, ఆయన వైపు చూశాను.‘ఉన్న ఈ రెండిళ్లు, బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకి రాసేశాను. ఆ ఫించన్..’ అంటూ నా వైపు చూశారు. నా మొహంలో ఏం కనబడిందో.. మళ్ళీ ఆయనే అన్నారు.. ‘ఈ అమ్మాయి తెలుసుగా, ఆమెకి ఎవరూ లేరు. ఓ అనాథ! నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నీకేమిటి.. అందరికీ తెలుసులే, అదేం రహస్యం కాదు! ఇదిగో ఇలా ఈ వీల్ చైర్లోనే అక్కడికి వెళ్ళాను! ఎవరికీ నచ్చదు, కాని..’ అంటూ ఓ పుస్తకంలో ఉన్న, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ నాకందించారు. అయితే.. ఆయన దాన్ని మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది.మాట్లాడాలనిపించలేదు! ‘మీ అత్తయ్య వెళ్ళిపోయిందిగా, నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు! ఈ అమ్మాయికా.. పాపం ఎవరూ లేరు, జీవనాధారం కూడా లేదు! అందుకే.. అలా చేశాను! అంతే గాని, అందరూ అనుకుంటున్నట్టు కాదులే! ఈ సర్టిఫికెట్తో అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది! ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈ రోజే ఆర్జీ కూడా పంపిసాను! బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు!’ అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశారు.ఆ క్షణంలో.. ఆయనకి.. ఏం చెప్పడానికీ నాకు ధైర్యం సరిపోలేదు! ‘సరే.. వస్తాను!’ అంటూ బ్యాంకు దారి పట్టాను.బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు. కాని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, తిరిగి నా ఆలోచనలు ఆయన చేసిన పని చూట్టూరే తిరిగాయి!ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా.. ఏదో స్ఫురించి, సెల్‌ఫోన్ తీసుకున్నాను. ‘మావయ్యగారు నమస్కారం! నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు.. అలా అని చెప్పకుండా ఉండనూ లేను! అందుకే ఈ మెసేజ్! మీ మ్యారేజ్‌ని సమాజం కొందరు తప్పని అనొచ్చు.. లేదా వెనుకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు! కాని నిజానికి.. మీ ఆలోచనని అచరణలో పెట్టడానికి, మీకు పెళ్ళి తప్పనిసరైంది! అసలు మీ ఆలోచనే తప్పు! మీ ఆస్తిలో కొంత ఆవిడకి ఇచ్చుంటే హర్షించేవాడ్ని, కాని ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని, మీరు దుర్వినియోగం చేశారు! ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయాలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది. సమాజసేవ అంటూ మీలా అందరూ పెన్షన్లని ఎవరికో ఒకరికి రాసేస్తుంటే.. ఈ దుర్వినియోగనికి ఇంక అంతు ఉండదు! వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది!మీరు చేసిన పని చట్టసమ్మతం కావొచ్చు. కాని ఈ దేశ పౌరుడుగా నాకు సమ్మతం కాదు! మీ రాతల్లో కనబడే నిజాయితీ, చేతల్లో కనబడలేదు!క్షమించండి.. ఇది మూమ్మాటికీ తప్పే!’ మెసేజ్ టైపు చేసి, రామేశంగారికి పంపాను! తర్వాత.. నాకు నిద్ర పట్టడానికి అట్టే సమయం పట్టలేదు! – జయంతి ప్రకాశశర్మ -
శ్రామికలోక శక్తిమంతులు
‘చీకటిని చూసి విచారించవద్దు. అదిగో చిరుదీపం’ అంటుంది ఆశావాదం. ‘ఏమీ లేదని బాధ పడవద్దు. నేనే నీ ఆయుధం, బలం’ అంటుంది ఆత్మవిశ్వాసం. ఆశావాదం వెల్లివిరిసే చోట ఆత్మవిశ్వాసం ఉంటుంది. జయంతి బురడ, రాణిమా దాస్, మలీషా ఖర్వాలకు ఘనమైన కుటుంబ నేపథ్యం లేదు. ‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించిన వీరు తమను తాము తీర్చిదిద్దుకుంటూ ‘హీరో’లుగా పేరు తెచ్చుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ సెల్ఫ్–మేడ్ ఉమెన్ 2024 (డబ్ల్యూ–పవర్ లీస్ట్)లో చోటు సాధించారు... గిరిజన గొంతుక గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసురావడానికి జర్నలిస్ట్ కావాలనుకుంది అడవి బిడ్డ జయంతి బురుడ. అయితే ఇంట్లో మాత్రం ‘చదివింది చాలు’ అనే మాట ఎప్పడూ వినిపించేది. దీంతో ఇంటిని విడిచిపెట్టి స్నేహితుల సహాయంతో ఒడిషా సెంట్రల్ యూనివర్శిటీలో జర్నలిజంలో డిగ్రీ చేసింది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని సెర్పల్లి ఆమె స్వగ్రామం. 2015లో భువనేశ్వర్‌లోని కళింగ టీవీ న్యూస్ చానల్ రిపోర్టర్‌గా చేరిన జయంతి బురుడ జర్నలిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన రిపోర్టింగ్ టూర్లలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాల లేమిపై దృష్టి పెట్టడమే కాదు వాటి పరిష్కారానికి కూడా కృషి చేసింది. ఆడపిల్లల చదువు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 2018లో ‘బడా దీదీ యూనియన్’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టింది. ‘బడా దీదీ యూనియన్’ ద్వారా గిరిజన మహిళల కోసం ఎన్నో అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించింది. తమను వేధిస్తున్న సమస్యలపై గిరిజన మహిళలు ధైర్యంగా గొంతు విప్పలేకపోవడాన్ని జయంతి గ్రహించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ధైర్యంగా గొంతు విప్పడానికి 2022లో ‘జంగిల్ రాణి’ పేరుతో వేదిక ప్రారంభించింది. ‘మన కథ– మన కోసం’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇది. మల్కన్‌గిరిలోని ఏడు బ్లాక్‌లకు చెందిన యాభై మంది గిరిజన మహిళలు ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. స్క్రిప్ట్‌లు రాయడం, వీడియోలు చిత్రీకరించడం, ఎడిటింగ్....మొదలైవాటిని వీరికి నేర్పించింది బురుడ. సంస్కృతి నుంచి తాము ఎదుర్కోంటున్న సమస్యల వరకు చేతిలోని సెల్‌ఫోన్‌తో వీడియో స్టోరీలు చేస్తున్నారు గిరిజన మహిళలు. ఈ స్టోరీలను ‘జంగిల్ రాణి’ ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేస్తారు. గిరిజన సమాజానికి, అడవులు, జీవనవైవిధ్యానికి ఉన్న సంబంధానికి అద్దం పట్టే సహజ కథనాలు ఇవి. ఎంతోమంది సాధారణ మహిళలలో అసాధారణ ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఎంతో కృషి చేసింది జయంతి బురుడ. ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ ‘ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్’గా పేరు సంపాదించిన మలీషా ఖర్వా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ 2024 జాబితాలో చోటు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మన్తో కలిసి నటించిన తరువాత మలీషా జీవితం మారిపోయింది. ముంబైలోని ధారవి మురికివాడలో ఒక గుడిసెలో నివసిస్తున్న మలీషా రాబర్ట్ హాఫ్మన్ దృష్టిలో పడింది. ఆ అమ్మాయిలోని వెలుగేదో రాబర్ట్‌ను ఆకట్టుకుంది. ‘ఈ మట్టిలో మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి’ అనుకున్నాడు. మోడల్, డ్యాన్సర్ కావాలన్న మలీషా కలను సాకారం చేసేందుకు తన వంతు సాయం అందించాడు. మలీషాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో 4,50,000 మంది ఫాలోవర్లు, 88,700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మలీషా లగ్జరీ ఇండియన్ కాస్మోటిక్స్ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పదహారు సంవత్సరాల మలీషా ఖర్వా మోడల్, కంటెట్ క్రియేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘కల నిజం చేసుకోవడానికి పేదరికం ఎంతమాత్రం అడ్డు కాదు’ అని నిరూపించిన మలీషా ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంగన్వాడీ అక్క దేశంలోని 23 లక్షల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధిగా రాణిమా దాస్‌ను ఫోర్బ్స్ ఇండియా ‘ఉమెన్ పవర్ లిస్ట్ 2024’లో చోటు కోసం ఆల్ ఇండియా అంగన్ వాడీ వర్కర్ ఫెడరేషన్ నామినేట్ చేసింది. అస్సాంలో పరఖోవా గ్రామానికి చెందిన రాణిమా దాస్ ఎవరికి ఏ సమస్య వచ్చినా ‘నేను ఉన్నాను’ అంటూ ముందుకు వచ్చేది. సమస్యల పరిష్కారంతో పాటు మహిళలకు ఆరోగ్యానికి సంబంధించిన నలహాలు ఇవ్వడంలో మంచి పేరు తెచ్చుకుంది. అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించే రాణిమాను ‘అక్కా’ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. గత పదిహేడేళ్లుగా పిల్లలను బడిలో చేర్పించడం, గర్భిణి స్త్రీలకు సూచనలు...మొదలైన ఎన్నో విషయాల్లో కృషి చేస్తోంది రాణిమా దాస్. సలహాలు, సహాయం విషయంలో ముందు ఉన్నట్లే పోరాట విషయంలో ముందుంటుంది. అస్సాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెండ్ అయిన రాణిమా దాస్ అంగన్వాడీ వర్కర్ల వేతన పెంపుదల కోసం పోరాటం చేసింది. అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడూ పోరాడతాం’ అంటున్న రాణిమా దాస్‌కు పోరాటం కొత్త కాదు. -
రాజ్యాధికారంలో వాటా దక్కితేనే బీసీలకు న్యాయం..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాధి కారంలో బీసీలకు తమవంతు వాటా దక్కినప్పుడే వారికి న్యాయం జరిగినట్లు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాను న్న ఎన్నికల్లో బీసీలే ప్రధాన పాత్ర వహించాలని చెప్పారు. గత తొమ్మిళ్లలో బీసీలను ఆదుకునేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాలను ఆదరించి మద్దతుగా నిలవాలని కోరారు. దేశంలోని కుల, చేతివృత్తుల బలోపేతానికి మోదీ– పీఎం విశ్వకర్మ యోజన వంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చారని చెప్పా రు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను వంచించి దగా చేశాయి. బీసీలకు రాజకీయంగా ఇవ్వాల్సిన 33 శాతం వాటాకు కోతపెట్టి.. ఇప్పుడు ఓబీసీ ఎజెండా ఎత్తుకుని ఓట్ల కోసం పాకులాడుతు న్నాయి’ అని మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాల యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రప టానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆధి పత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, కుల వృత్తులు, వ్యవసాయాధారిత పేద కుటుంబాలకు మద్దతుగా ఐలమ్మ పోరాటం చేశారని కొనియాడారు. -
రాజీవ్ కృషితోనే ఐటీ, టెలికాం అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడమేకాక, రాజ్యాంగ సవరణలతో పల్లెసీమలకు సర్వ హక్కులు కలి్పంచి, సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈనాటి యువతకు ఒక స్ఫూర్తి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాజీవ్ కృషితోనే దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆదివారం సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి టీపీసీసీ నేతలతో కలసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి అధికారాన్ని పేదల చేతిలో పెట్టిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను తన మిత్రుడికి దోచిపెడుతుంటే, తెలంగాణలో కేసీఆర్ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టిలకు బుద్ధిచెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు. గాందీభవన్‌లోనూ.. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాం«దీభవన్లోనూ ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీపీసీసీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ జీవిత చరిత్రను వివరిస్తూ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు దీపాదాస్ మున్షీ, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, శివసేనారెడ్డి, మెట్టుసాయికుమార్, రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ జయశంకర్‌కు సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్ః దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అసెంబ్లీహాల్లోని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పిం చారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్‌విప్ దాస్యం వినయ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు, పలువురు ఎమ్మెల్యేలు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిం చారు. శాసన మండలి ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, చీఫ్‌విప్ భానుప్రసాదరావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు నివాళులర్పిం చినవారిలో ఉన్నారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి కేటీ రామారావు అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్రను నేతలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. మంత్రుల నివాస సముదాయంలో జయశంకర్ జయంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. -
ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!
Who Is Jayanti Gupta?: మహేంద్ర సింగ్ ధోని.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియా స్టార్‌గా ఎదిగాడు. భారత్‌కు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి లెజెండరీ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. మరి క్రికెటర్‌గా ధోని ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో అతడికి నైతికంగా, ఆర్థికంగా అండగా ఉన్నది ఎవరో తెలుసా?! మధ్యతరగతి కష్టాలు రాంచిలో 1981, జూలై 7 పాన్ సింగ్- దేవకీ దేవి దంపతులకు మహేంద్ర సింగ్ ధోని జన్మించాడు. అతడికి అక్క జయంతి గుప్తా, అన్న నరేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ధోని తండ్రి చిన్నపాటి ప్రభుత్వోద్యోగి. మధ్యతరగతి కుటుంబానికి ఉండే కష్టాలన్నీ పడ్డారు. అయితే, టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించినప్పటికీ ధోనికి.. చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలని, దేశం కోసం ఆడాలనే కోరిక బలంగా ఉండేది. ఈ విషయం గురించి తండ్రికి చెప్తే.. ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలు కావని ఆయన కాస్త వెనుకడుగు వేశారట. నాన్నకు నచ్చజెప్పి ఆ సమయంలో తమ్ముడికి అండగా నిలబడింది జయంతి గుప్తా. తల్లిదండ్రులకు నచ్చజెప్పి.. క్రికెటర్ కావాలనుకుంటున్న తమ్ముడి ఆశయం గురించి వాళ్లకు అర్ధమయ్యేలా చేసింది. ధోనికి ఎలాంటి సాయం కావాలన్న ముందే ఉండేది. అలా ఇంట్లో వాళ్లను ఒప్పించి తన ప్రయాణం మొదలుపెట్టిన ఎంఎస్ ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వెయ్యి కోట్లకు అధిపతి! మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొంది అభిమానులతో జేజేలు కొట్టించుకున్నాడు. ఆటగాడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి దాదాపు వెయ్యి కోట్ల(DNA నివేదిక ప్రకారం)కు అధిపతి అయ్యాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మకుటం లేని మహారాజుగా కొనసాగుతూ ఏకంగా ఐదుసార్లు జట్టును విజేతగా నిలిపాడు. అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఏడాదికి దాదాపు 50 కోట్ల రూపాయలు(DNA రిపోర్టు ప్రకారం) వెనకేస్తున్నాడు. ఇటీవలే సినీ రంగంలోనూ ప్రవేశించాడు. ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు. అన్న, బావ, ధోని, అక్క మరి అక్క పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి క్రికెట్ లెజెండ్‌ను తొలినాళ్ల నుంచే ప్రోత్సహించిన అక్క జయంతి గుప్తా.. లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆమె రాంచిలోని పబ్లిక్ స్కూళ్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. బావ కూడా ధోని కోసం ఇక ధోనికి ప్రాణ స్నేహితుల్లో ఒకరైన గౌతం గుప్తా అనే వ్యక్తిని జయంతి పెళ్లి చేసుకుంది. ధోని దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో జయంతితో పాటు అతడు కూడా అండగా నిలబడినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా ధోని బయోపిక్‌లో జయంతి గుప్తా పాత్ర ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఎంఎస్ అన్న గురించి మాత్రం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కాగా ధోని సాక్షిని వివాహమాడగా.. వీరికి కూతురు జివా జన్మించింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
మహానేత వైఎస్సార్‌కు ఘనంగా స్మృత్యంజలి
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా శనివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా స్మృత్యంజలి ఘటించారు. ప్రత్యేకంగా అలంకరించిన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనుబంధాన్ని తలచుకున్నారు. ఈ సందర్భంగా దివంగత మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులందరితో పాస్టర్ నరేష్‌బాబు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైవీ స్వర్ణమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ సుగుణమ్మ, డాక్టర్ ఈసీ దినేష్రెడ్డిలతో కలిసి వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, పోతుల సునీత, రమేష్ యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, డాక్టర్ సు«ధా, ఎస్.రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లికార్జునరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి పాల్గొన్నారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీఐజీ సెం«థిల్కుమార్, జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, జేసీ గణేష్‌కుమార్ తదితర అధికారులు సీఎం వెంట ఉన్నారు. అనంతరం ఇడుపులపాయలో వైఎస్ కుటుంబీకుల ప్రార్థన మందిరం సమీపంలో సింహాద్రిపురం నేతలతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకు ముందు అనంతపురం జిల్లా నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్న సీఎంకు ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు స్వాగతం పలికారు. వైఎస్సార్‌కు షర్మిల నివాళి వేంపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం 8.10 గంటలకు వైఎస్సార్ సతీమణి విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణితో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు. -
వైఎస్సార్ అమర్‌రహే
సాక్షి, అమరావతి: పరిపాలనలో మానవత్వాన్ని జోడించి ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచి, పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్‌రహే’’ అంటూ వాడవాడనా నినదించారు. ప్రజలు మహానేత అందించిన పథకాలను గుర్తుచేసుకున్నారు. గ్రామగ్రామాన కేక్‌లు కట్ చేసి.. పేదలకు వస్త్ర, అన్నదానం చేశారు. భారీ ఎత్తున రక్తదానం చేసి మహానేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహా దేశంలో పలు రాష్ట్రాల్లో అభిమానులు, ప్రజలు మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. మీ పథకాలు మరువలేనివి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యేలు పూల మాల వేసి నివాళులర్పించారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో అభిమానులు కేక్ కట్ చేశారు. పెడన, గుడివాడ పట్టణాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు జోగి రమేశ్, విడదల రజిని పాల్గొన్నారు. ఏలూరు జిల్లా గుండుగొలనులోని మెగా జగనన్న హౌసింగ్ కాలనీ ద్వారం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, చీరాల, యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి జయంతి వేడుకలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. పల్నాడులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, బాపట్లలో మేరుగ నాగార్జున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఊరూరా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ,, రైతులకు ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి తమ మనసుల్లో వైఎస్సార్ గుర్తుండిపోయారని ప్రజలు, అభిమానులు కొనియాడారు. గుండెల్లో కొలువైన నేతకు జన నీరాజనం ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పలువురు ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీచేశారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో పండ్లు, రొట్టెలు పంపిణీచేశారు. తమ గుండెల్లో కొలువైన జననేత వైఎస్సార్ జయంతి వేడుకలను ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పార్వతీపురంలో వైఎస్సార్ విగ్రహానికి వేలాది మంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి పీడిక రాజన్నదొర సాలూరులో, విజయనగరంలో వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కోరుకొండలో రక్తదానశిబిరాన్ని నిర్వహించారు. కాకినాడ సిటీ బులుసు సాంబమూర్తి పాఠశాలలో పార్టీ, నాయకులు, కార్యకర్తలు, అన్న, వస్త్రదానం చేశారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాల్లో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు.. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఎన్నారైలు, ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర 17 దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు మహానేత వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రానికి, దేశానికి మహానేత వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సేవా మార్గంలో జయంతి వేడుకలు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్నదానం, రక్తదానం, వస్త్రదానం తదితర సేవామార్గాల్లో నిర్వహించారు. గంగాధరనెల్లూరు మండలం వెజు్జపల్లెలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో, నగరి మండలంలోని బుగ్గ అగ్రహారంలో మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు, పుంగనూరులో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్నూలు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, నంద్యాల, నందికొట్కూరు, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ జయంతి ఉత్సవాలు ఆయన సొంత జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కడపలో హెడ్ పోసా్టఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా క్షీరాభిషేకం చేశారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. -
వైఎస్సార్ జయంతి: చెదరని జ్ఞాపకం..చెరగని సంతకం..(ఫొటోలు)
-
మరపురాని మహానేత
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల మూడు నెలల కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. ఆయన మరణించి 13 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారు. జనం కోసం ఎందాకైనా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. మండుటెండలో 1,475 కి.మీల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కా>ంగ్రెస్‌కు ప్రాణం పోశారు. 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైఎస్సార్.. అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు తుడిచారు. ఐదేళ్లు సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించి.. 2009 ఎన్నికల సందర్భంగా గెలుపోటములకు తనదే బాధ్యత అని నిబ్బరంగా ప్రకటించారు. ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం ఆ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజారోగ్యానికి ఆరోగ్యశ్రీతో భరోసా 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. ఈ సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. రైతును రాజు చేసిన మారాజు సీఎంగా ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించి పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. మద్దతు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని దృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు. ఫీజుల పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు సైతం ఉన్నత చదువులను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. వైఎస్సార్ బాటలో పలు రాష్ట్రాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశాన్ని కూడా తాకినా, ఉమ్మడి రాష్ట్రంపై పడకుండా వైఎస్సార్ నివారించగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేపట్టి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. ఇది జంట నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేందుకు దోహదం చేసింది. -
అల్లూరి 125వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
నేను చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలంటే?
-
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య జయంత్యుత్సవం
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో శనివారం అన్నమయ్య 615వ జయంత్యుత్సవం వైభవంగా జరిగింది. గోవిందనామ సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మారుమోగింది. ఈ సందర్భగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకులు గరిమెళ్ళ అనీల్ కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాసన్, వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన గోష్టిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా చిత్ర కళాకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం ఆశ్చర్యానందాలను కలిగించింది. అనంతరం సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు చిత్రాకారుడు కూచిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సారాలుగా అన్నమయ్య ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చేసేందుకు సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరిలో వీణ విద్వాంసులు ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, వారి కుమార్తె పద్మిని పసుమర్తి తమ వీణా నాదాలతో ఆకట్టుకున్నారు. వీరికి కలైమామణి రమేష్ శ్రీనివాసన్ మృదంగ సహకారం అందించారు. తరువాత జయప్రద రామమూర్తి వాయులీన గానంతో అలరించారు. వారికి అనూరాధ శ్రీధర్ వయలిన్, శ్రీరామ్ బ్రహ్మానందం మృదంగ సహకారాన్ని అందించారు. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించారు. చివరిగా గరిమెళ్ళ అనీల కుమార్ గారి గాత్రంతో స్వామి వారికి పవళింపు సేవ నిర్వహించారు. అనంతరం అందరికీ భోజన ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు వంశీ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం, జయంతి కోట్ని, శాంతి కొండ, ఉష మాడభూషి, మమత కూచిభొట్ల, విజయసారథి మాడభూషి, యేడిది శర్మలకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలియజేశారు. -
యాంకర్ నుంచి నిర్మాత ఆ తరువాత సినిమాల్లోకి న ప్రయాణం ఎలా కొనసాగింది అంటే..!
-
ఎన్టీఆర్ శతజయంతి సభా ఫ్లాపే
సాక్షి, అమరావతి: చంద్రబాబు సభలకు జనం రావడంలేదని మరోసారి రుజువైంది. ఎన్టీఆర్ శతజయంతి పేరుతో కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం కూడా తుస్సుమంది. ఎన్టీఆర్ పేరు చెప్పి ఎంత హడావుడి చేసినా, చెన్నై నుంచి రజనీకాంత్‌ను తీసుకొచ్చి హంగామా చేసినా, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ రంగంలోకి దింపినా జనం నుంచి మాత్రం స్పందన రాలేదు. సభలో సగం కుర్చీలు కూడా నిండలేదు. తాడిగడప–ఎనికేపాడు రోడ్డులోని చిన్న గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఈ సభ నిర్వహించింది. టీడీపీ నేతకు చెందిన రెండున్నర ఎకరాల ఖాళీస్థలంలో భారీ సెట్టింగులు, హోర్డింగులు, డీజే, హైమాస్ట్ లైటింగులతో హడావుడి చేసినా జనం మాత్రం పట్టించుకోలేదు. ఈ చిన్న గ్రౌండ్‌ను నాలుగు భాగాలుగా విభజించి ఒకదాన్లో వేదిక, సెట్టింగులు వేయగా రెండో భాగాన్ని వీఐపీలు, ముఖ్యులకి, మూడు, నాలుగు భాగాలను జనానికి కేటాయించి బారికేడ్లు పెట్టి కుర్చిలు వేశారు. వీఐపీ గ్యాలరీ, ఆ తర్వాత ముఖ్యులకు కేటాయించిన గ్యాలరీల్లో ఓ మాదిరిగా జనం కనిపించారు. ప్రజల కోసం కేటాయించిన గ్యాలరీ మాత్రం వెలవెలబోయింది. ఈ గ్యాలరీలో ఎటుచూసినా ఖాళీ కుర్చిలే కనిపించాయి. భారీగా జనం వస్తారనే ఆశతో వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినా అవి తీసుకునేవారే కరువయ్యారు. వచ్చిన కొద్దిపాటి జనంలో సగంమందికిపైగా చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ రాకముందే సభను వీడి వెళ్లిపోయారు. వెళ్లిపోతున్న వారిని ఆపడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. మిగిలినవారిలో చాలామంది బాలకష్ణ, రజనీకాంత్, చంద్రబాబు మాట్లాడే సమయానికి వెళ్లిపోయారు. ముందుభాగంలో ఉన్న కొద్దిపాటి జనాన్నే టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో భారీగా వచ్చినట్లు చిత్రీకరించినా వెనుకభాగంలో ఖాళీ కుర్చిలు చూసిన ఆ పార్టీ నేతలు జనం ఎందుకు రావడంలేదని మాట్లాడుకోవడం కనిపించింది. తమకు బాగా పట్టుందని చెప్పుకొనే కృష్ణాజిల్లాలో నడి»ొడ్డున, అదీ అతి చిన్న గ్రౌండ్లో పెట్టిన సభకు జనం రాకపోవడంతో చంద్రబాబు డీలాపడ్డారు. టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు సైతం ఎంత ప్రయత్నించినా, ప్రలోభాలు పెట్టినా జనం రావడంలేదని వాపోతున్నారు. జనం రావడం లేదనే చిన్న గ్రౌండ్.. అయినా ఫలితం నిల్ తన సభలకు జనం రావడంలేదని తెలియడంతోనే భారీగా వచ్చినట్లు చూపించుకునేందుకు చంద్రబాబు చిన్న గ్రౌండ్లను ఎంచుకుంటున్నారు. రెండురోజుల కిందట పల్నాడు జిల్లా అమరావతి, సత్తెనపల్లి సభలను కూడా చిన్న గ్రౌండ్లలో పెట్టినా జనం రాలేదు. అంతకుముందు మచిలీపట్నం, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఆయన సభలను జనం పట్టించుకోలేదు. పల్నాడు జిల్లా నాయకులు ఎంత ప్రయత్నించినా, భారీగా తాయిలాలు పంచినా జనసమీకరణ చేయలేకపోయారు. దీంతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ పెట్టి వారికి క్లాసు పీకారు. జనాన్ని ఎందుకు తీసుకురావడంలేదని ప్రశ్నించి చిందులు తొక్కారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో తగిలిన షాక్‌తో కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో ఎన్టీఆర్ శతజయంతి సభకు భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. రజనీకాంత్‌ను తీసుకురావడం, ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ రంగంలోకి దింపడం ద్వారా హైప్ తీసుకురావడానికి ప్రయత్నించారు. అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇది కూడా ప్లాప్ అవడంతో టీడీపీ నేతలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. -
వీరేశలింగం పంతులు జయంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు’’ అని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2023 -
Jayanti Chauhan: ఆసక్తి లేని పని ఆమెకు వద్దట
వారసులు వారసత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహపడతారు. యువరాజులు కిరీటం కోసం వెంపర్లాడతారు. ఆసక్తి లేని పని చేయనక్కర్లేదని సామ్రాజ్యాలను వదలుకుంటారా ఎవరైనా? 32 ఏళ్ల జయంతి చౌహాన్. 7000 కోట్ల బిస్లరీ వాటర్ సామ్రాజ్యానికి ఏకైక యువరాణి. ‘నాకు ఆసక్తి లేదు’ అని చైర్ పర్సన్ పదవిని నిరాకరించింది. దీని వల్ల సంస్థను టాటా పరం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తృప్తినిచ్చే పని చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. కాని తృప్తినిచ్చే పనిలోనే ఆనందం ఉందని ఆమె సందేశం ఇస్తోంది. ఈ కాలపు యువత ఈ మాట ఆలకించాల్సిందే. ఇదంతా ఒక జానపద కథలాగే ఉంది. పూర్వం ఎవరో ఒక రాజు తన రాజ్యం మొత్తాన్ని ఏకైక కుమార్తె చేతిలో పెడదామనుకుంటే ‘నాకు వద్దు నాన్నా. నాకు హాయిగా సెలయేళ్ల మధ్య గడుపుతూ, చిత్రలేఖనం చేసుకుంటూ, పూ లతల మధ్య ఆడుకోవాలని ఉంది’ అని ఆ కూతురు అంటే రాజు ఏమంటాడు? రాజ్యం ఏమవుతుంది? ‘జల సామ్రాజ్యం’ లేదా ‘ఆక్వా కింగ్డమ్’గా అందరూ పిల్చుకునే ‘బిస్లరీ’ సంస్థకు ఇప్పుడు ఆ పరిస్థితే ఎదురైంది. దాని అధినేత రమేష్ చౌహాన్ తన సంస్థను అనివార్యంగా టాటాకు అప్పజెప్పనున్నాడు. రేపో మాపో ఇది జరగనుంది. 7000 కోట్లకు సంస్థ చేతులు మారుతుంది. పూర్తి మార్పుకు మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ సంస్థ భారాన్ని 82 ఏళ్ల రమేష్ చౌహాన్ మోయక తప్పదు. కారణం ఏమిటి? ‘నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కుమార్తె జయంతికి సంస్థ పగ్గాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు. సంస్థ అమ్మేయదల్చుకోవడం బాధాకరమే. కాని టాటా సంస్థకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అదైతే నా సంస్థను బాగా చూసుకుంటుందని భావిస్తున్నాను. వారి వైపే నా మనసు మొగ్గుతున్నది’ అని రమేష్ చౌహాన్ అన్నాడు. పార్లే బ్రదర్స్‌లో ఒకరైన రమేష్ చౌహాన్ 1993లో తన సొంత సాఫ్ట్డ్రింక్లైన థమ్సప్, సిట్రా, మాజా, గోల్డ్స్పాట్లను కోకాకోలాకు విక్రయించాడు. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన బిస్లరీని అమ్మేయబోతున్నాడు. కారణం కూతురు జయంతికి ఉన్న కళాత్మక ఆసక్తులే. మనకు ఏది ఇష్టం? జయంతి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏది మనసుకు బాగా నచ్చుతుందో ఆ పని చేయాలి. అందరికీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. కాని కుదిరే అవకాశం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది జీవితం గడిచిపోయాక ‘నేను ఇది కాదు చేయాలనుకున్నది. నాకు అవకాశం కూడా వచ్చింది. కాని వేరే దారిలో వెళ్లిపోయాను. చాలా అసంతృప్తిగా ఉంది’ అనడం వింటూ ఉంటాము. ఆ రియలైజేషన్ వచ్చేలోపు జీవితం గడిచిపోయి ఉంటుంది. అదే సమయంలో మన అభిరుచులు, ఆసక్తులు అన్ని వేళలా ఆర్థిక సమీకరణాలకు లొంగేలా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నప్పుడు సొంత మార్గం ఎంచుకోవడంలో తప్పు ఏముంది? ఐ.టి. ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేసేవారు, ఐ.పి.ఎస్. ఉద్యోగాన్ని వదిలి సంఘసేవ చేసేవారు ఉన్నారు. ఒక స్పష్టతతోనే జయంతి బిస్లరీని వద్దనుకుని ఉంటుంది. ఆ స్పష్టత ఉంటే ఎవరైనా తమకు ఇష్టమైన రంగంలో పని చేస్తూ ఆనందకరమైన జీవితం గడపవచ్చు. డబ్బు వల్ల మాత్రమే ఆనందం లభించదని జయంతి చెబుతోంది కదా. ఎవరు జయంతి? జయంతి చౌహాన్ (37) రమేష్ చౌహాన్‌కు ఒక్కగానొక్క కూతురు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత మొదట న్యూయార్క్‌లో, ఆ తర్వాత లండన్‌లో, ఆ పైన ఇటలీలో చదువుకుంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చదువుకుంది. దాంతోపాటు లండన్‌లో ‘స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ (లండన్ యూనివర్సిటీ) నుంచి అరబిక్ భాష నేర్చుకుంది. అరబిక్ భాష నేర్చుకోవడం ఒక భిన్న అభిరుచి అని చెప్పవచ్చు. ఆమెకు ఇదొక్కటే కాదు... ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రయాణాలు ఇష్టపడుతుంది. జంతు ప్రేమ ఉంది. అంత పెద్ద వ్యాపార సంస్థకు వారసురాలైనా చక్కగా ఒక ఆటో ఎక్కి రోడ్డు పక్కన బంతిపూలు కొనుక్కుంటూ కనిపిస్తుంది. ఆమెకు రంగులు అంటే ఇష్టం. మంచి బట్టలు ఇష్టం. భావు కత్వంతో జీవించడం ఇష్టం. అలా అని ఆమెకు వ్యాపార దక్షత లేదనుకుంటే పొరపాటు. చదువు పూర్తయిన వెంటనే 24 ఏళ్ల వయసులో సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పని చేయడం మొదలుపెట్టింది. మొదట ఢిల్లీ కార్యాలయంలో చేసి ఆ తర్వాత ముంబై ఆఫీస్‌కు హెడ్ అయ్యింది. జయంతి చేరాక హెచ్.ఆర్, మార్కెటింగ్, సేల్స్‌లో సమూలమైన మార్పులు తెచ్చింది. పోటీదారుల చొరబాటును ఎదుర్కొనడానికి ‘బ్లూ’ కలర్ నుంచి బిస్లరీ రంగును ‘ఆకుపచ్చ’కు మార్చింది. సంస్థలో ఆధునిక యాంత్రికీకరణలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇంత సాధించిన కుమార్తె సంస్థ పగ్గాలు చేపడుతుందని తండ్రి ఆశించడం సహజం. కాని జయంతి తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. బహుశా ఆమె మనసు ఇందులో లేదు. ఆమెకు తృప్తినిచ్చే పని ఇది కాకపోవచ్చు. అందుకే ఆమె ఇంత సామ్రాజ్య కిరీటాన్ని వద్దనుకుంది. -
ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్
అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్ అండ్ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. భరించలేని వెన్నునొప్పితో బాధ పడిన షాలిని తన పరిశోధనలో భాగంగా తెలుసుకున్న విషయం... హెంప్ మొక్కకు వెన్నునొప్పిని తగ్గించే శక్తి ఉంది అని. అది ప్రయోగాత్మకంగా నిరూపణ కావడంతో హెంప్ ఉత్పత్తుల విలువను ప్రపంచానికి పరిచయం చేయడానికి సోదరి జయంతి భట్టాచార్యతో కలిసి ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’కి శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది. షాలిని భట్టాచార్య నిలకడగా ఒకచోట ఉండే రకం కాదు. స్పెయిన్‌లో ఉంటున్న శాలినికి ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం అంటేనే ఎక్కువ ఇష్టం. అలాంటి షాలినికి కష్టం వచ్చిపడింది. భరించలేని వెన్నునొప్పి! బయట అడుగు వేయలేని పరిస్థితి. చిన్న బ్యాగ్‌ను ఇటు నుంచి అటు పెట్టాలన్నా వీలయ్యేది కాదు. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం మొదలైంది. ఏదో కాస్త తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉంటున్న సోదరి జయంతితో కలిసి తన సమస్యకు పరిష్కారాన్ని వెదకడానికి పరిశోధన మొదలుపెట్టింది. ఈ పరిశోధన క్రమంలో వారికి ఎప్పుడో విన్న హెంప్ (ఒక రకమైన కనబిస్ మొక్క) గుర్తుకు వచ్చింది. వేసవి సెలవులు వస్తే చాలు...కొండకోనల్లో తిరగడం తమ అలవాటు. అలా వెళ్లినప్పుడు అక్కడి మొక్కల గురించి స్థానికుల నుంచి ఆసక్తికరమైన వివరాలు తెలుసుకునేవారు. ఒకసారి హిమాలయాలో విస్తారంగా పెరిగే, విస్తృత ఔషధగుణాలు ఉన్న హెంప్ గురించి విని ఉన్నారు. ఆ జ్ఞాపకంతో హెంప్ గురించి లోతైన పరిశోధన ప్రారంభించారు. వెన్నునొప్పిని తగ్గించే సామర్థ్యం ఈ మొక్కకు ఉన్నట్లు ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. ఆ సమయంలోనే వారికి ఒక ఆలోచన వచ్చింది... అజ్ఞాతంగా ఉన్న హెంప్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి దాని ఔషధశక్తి ఏమిటో తెలియజేయాలని. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం ఇండియా హెంప్ అండ్ కంపెనీ. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ హెంప్ ట్రేల్ మిక్స్, హెంప్ హార్ట్, ప్రొటీన్ పౌడర్, హెంప్ ఆయిల్... మొదలైన న్యూట్రీషన్–ప్యాక్డ్ హెంప్ ప్రాడక్స్‌ను తీసుకువచ్చింది. ‘షార్క్ ఇండియా రియల్టీ షో’ నుంచి ఆహ్వానం అందడాన్ని ఔత్సాహిక వ్యాపారవేత్తలు గొప్పగా భావిస్తారు. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఒక విశాలవేదికగా షార్క్ ఇండియా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫండింగ్ విషయంలో మేలు జరుగుతుంది. ‘ఇండియా హెంప్ అండ్ కంపెనీ’ కో–ఫౌండర్‌గా జయంతి భట్టాచార్యకు షార్క్ ఇండియా నుంచి ఆహ్వానం లభించింది. అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న జయంతికి తమ ఉత్పత్తుల గురించి ఎలా ప్రచారం చేసుకోవాలో అనేది తెలియని విషయమేమీ కాదు. ఆమె ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది. రకరకాల దేశాల నుంచి ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. అయితే సరిౖయెన డీల్ కుదరకపోవడంతో వాటిని ఆమోదించలేదు. ఫండింగ్ మాట ఎలా ఉన్నా ‘షో’కు వచ్చిన ప్రముఖుల సూచనలతో బ్రాండింగ్ స్ట్రాటజీని మార్చుకున్నారు. ఆ తరువాత సరిౖయెన ఇన్వెస్టర్లు వచ్చారు. కంపెనీ విజయపథంలో దూసుకెళుతుంది. నిజానికి హెంప్ ఉత్పత్తులను మార్కెట్ లో సక్సెస్ చేయడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. మన దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెంప్ సాగు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట అనుమానం మిగిలే ఉంది. దీన్ని తీసివేయడానికి ప్రచార రూపంలో గట్టి ప్రయత్నాలు ప్రారంభించి విజయం సాధించారు ఈ డైనమిక్ సిస్టర్స్. ‘ప్లానెట్ ఫ్రెండ్లీ ప్లాంట్ అయిన హెంప్‌పై మాకు ఉన్న నమ్మకం వృథాపోలేదు. మా వ్యాపారం విజయవంతమైంది అనేదానికంటే, ఇండియా హెంప్ అండ్ కంపెనీ ద్వారా హెంప్‌లోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలుసుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటుంది షాలిని. -
కన్యాశుల్కం నాటకంతో సాంఘిక దురాచారాలను రూపుమాపారు: భూమన
-
ఈ తెలుగు మాట్లాడుతున్నామా?
అమ్మకు జ్వరంగా ఉంటుంది. స్కూల్లో అన్నం గంట కొట్టినప్పుడు ఇంటికెళితే బువ్వ ఉండదని ముందే తెలుసు. ఆ సంగతి ఎవరికీ చెప్పక నీళ్ల కుళాయి వైపు నడుస్తూ రెండు గుక్కలే ఈ పూటకు అనుకుంటున్నప్పుడు ఒక మిత్రుడు కనిపెట్టి– ‘రారా. నా టిపినీలో తిందువు’ అని పిలుస్తాడు. భలేవాడు వాడు. పక్క పాపిట దువ్వుకుని, స్లిప్పర్లు టపాటపాకొట్టి నడుస్తూ, ఊరికూరికే నవ్వుతూ, మన స్నేహాన్ని ఇష్టపడుతూ. ఆ పూట వాడి ముద్దల్లో మనకు వాటా. పొరుగూరిలోనే ఉంటాడు. ఏదో ఉద్యోగం చేస్తున్నాడని విని ఉంటాము. కలిసి చాలా ఏళ్లయివుంటుంది. ‘ఏరా... ఎలాగున్నావు’ అని ఫోన్ చేసి అడగడం మంచి తెలుగు వాక్యం. తియ్యటి తెలుగు వాక్యం. పలుకుతున్నామా? ఆ పిల్ల తూనీగే. పక్కింట్లో ఉంటుంది. అక్కా అని పిలిస్తే తప్ప పలకదు. ఆదివారం వస్తే ‘రావే అమ్మాయ్’ అని గోరింటాకు పెట్టేది. ఇంట్లో పూసే రోజాపువ్వు బడికి వెళుతున్నప్పుడు జడలో గుచ్చేది. సినిమా పత్రికలో ఉన్న హీరోయిన్ ఫొటో చూపించి ‘ఈ డ్రస్సు నీకు భలే ఉంటుంది’ అని చెప్పేది. ‘భయంగా ఉందక్కా’ అనంటే, ‘తొక్కు’ అని సైకిల్ నేర్పించింది. టీచరట. రిటైరైందట. అమెరికాలో పిల్లల దగ్గర ఉందట. వాట్సప్ కాల్ చేసి ‘అకా... నీ గుర్తుగా ఇంట్లో ఎర్రగులాబీ వేశా. చూడ్డానికి ఎప్పుడొస్తావు?’ అని అడగడం అలాంటిలాంటి తెలుగు కాదు. తేనె తెలుగు. మేనమామ ఒకడు ఆ రోజుల్లో హిప్పీ క్రాఫుతో ఇంటికొచ్చేవాడు. ‘సినిమాకెళ్దాం పదండి’ అని తీసుకెళ్లేవాడు. టక్ చేసి కాలేజీకెళితే హీరోలా చూస్తారట. ‘మావయ్యా’ అని పిలిస్తే చాలు హాజరయిపోయేవాడు. ఒకసారి నాన్నతో ఎవరో గొడవపడితే ‘ఖబడ్దార్’ అని చూపుడువేలు ఆడించి వచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఆర్థికంగా కూడా బాగలేడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. మనమేం శ్రీమంతులం కాము. కాని వెళ్లి, దగ్గర కూచుని, చేయి పట్టుకుని ‘మావయ్యా.... సాహసవంతుడు సినిమా చూపించిన సాహసవంతుడివి నువ్వు. ఏం కాదు. లేచి తిరుగుతావు. నీకేం కావాలో నేను చూస్తాను. అందాక ఇది ఉంచు. కాదంటే నామీదొట్టే’ అని పలికే తెలుగు ఉంది చూశారూ... దేవతలు ఆశీర్వదించే తెలుగు అది. అవునండీ... ఆఫీసులో కొలీగే. కలిసి క్యాంటీన్‌కు వెళ్లేవారు. కలిసి భోజనానికి వెళ్లేవారు. కలిసి పని పంచుకుని చేసవతల పడేసేవారు. ఏదో మాటా మాటా అనుకున్నారు. మాట్లాడ్డం మానుకున్నారు. కాని ఎన్నాళ్లు? రోజూ కనపడాలే. పక్కనే ఉండాలే. ముఖం చూడాలే. ఇక చూసి చూసి ఎవరో ఒకరు డెస్క్ దగ్గరికెళ్లి ‘క్షమించు గురూ. ఏదో పొరపాటైంది. ఇంతకు ముందులానే ఉందాం. నీతో మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉంది నాకు’ అన్నామనుకోండి... ఆ తెలుగు అతి సువాసనతో నిండిన తెలుగు. ‘అమ్మా... ఫోన్లు మాట్లాడేటట్టయితే స్పీకర్ పెట్టుకు మాట్లాడు. చెవికి ఇబ్బంది ఉండదు. అస్తమానం టీవీ చూడకు. మొన్నామధ్య నువ్వు చేసే పూర్ణాలు గుర్తుకొచ్చాయిగానీ అంత రుచితో ఇక్కడ ఎవరు చేయగలరనీ’. ‘నాన్నా... నా కోసమని కొత్తచొక్కా కొన్నాను. కాని బ్లూ కలర్ మీకే బాగుంటుందనిపించింది. పంపుతున్నా. వేసుకోండి’. ‘ఓ నా బంగారు చెల్లీ... ఈ అన్న పెళ్లయ్యాక మారిపోయాడని అనకు. చిన్నప్పుడు పార్కులో ఉయ్యాలూగుతూ కింద పడబోతుంటే పట్టుకున్నాను. ఇప్పుడూ అంతే, పక్కనే ఉంటాను’. ‘పెద్దొదినా... మీరిద్దరూ పిల్లలతో భోజనానికి ఎందుకు రారు మా ఇంటికి. పట్టింపులు పెట్టుకోకండి దయచేసి’... ‘ఏమే మూగమొద్దు. క్లాస్మేట్లందరం టూర్కెళ్దామంటే ఏ సంగతీ చెప్పవేమే’... ఎంతమంచి తెలుగు వాక్యాలో చూడండి ఇవి. పలకడం మరిచిపోతున్న వాక్యాలు. పలకక్కర లేదనుకుంటున్న వాక్యాలు. వ్యవహారంలో నుంచి తొలగిపోతున్న వాక్యాలు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వాక్యాలు. బంధం గట్టిగా ఉంటే బలగం గట్టిగా ఉంటుంది. బంధం పట్ల ఆపేక్ష ఉంటే నిలబెట్టుకోవాలన్న తలంపు ఉంటుంది. ‘అ’ ఒక్కటే లేదు. ‘ఆ’ పక్కనే ఉంది. ‘అచ్చులు’ మాత్రమే లేవు. ‘హల్లుల’ను తోడు చేసుకున్నాయి. ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జయంతి. వ్యవహారిక భాష కోసం ఆయన జీవితాన్ని ధారబోశాడు. ప్రతి తెలుగువాణ్ణి తెలుగు కోసం గుప్పెడు ఊపిరి ఇమ్మన్నాడు. కాని జీవన వ్యవహారాల పట్ల ఉండే అక్కరను బట్టే భాష పట్ల అక్కర కూడా ఉంటుంది. మన బంధాలతో ఎలా ఉన్నామో భాషతో కూడా అలాగే ఉంటాము. జన్మ సంబంధాలు, రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు, ఇరుగు పొరుగు సంబంధాలు, సాటి వర్గ కుల మత సంబంధాలు... వీటికి ఎంత ప్రేమ, గౌరవం ఇస్తామో భాష పట్ల కూడా అంతే గౌరవం ఇస్తాము. ఒకటి ఉండి ఒకటి లేదు అనేది ఉండదు. అన్నీ ఒక తానులో బట్టలే. ఇల్లంటే డోర్ కర్టెన్, బెడ్రూమ్, టాయిలెట్ అని మాత్రమే కాక ‘పుస్తకాల అర’ కూడా అనుకోనంత వరకు, కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే అని కాక అనేక అనుబంధాలు కూడా అని తలవనంత వరకు, బంధాలతో ఆత్మీయత భాషతో పాశంలోనే జీవన మాధుర్యం ఉంది అని ఇవి రెండూ ఎంతకూ చెల్లించలేని, ఎగవేతకు కుదరని రుణాలని చిత్తంతో నమ్మనంత వరకూ తెలుగువారి జీవితం, తెలుగుతో నిండిన జీవితం సంపూర్ణం అనిపించుకోదు. ఎవరైనా స్నేహితునికి ఫో¯Œ చేసి ‘మంచి తెలుగు పుస్తకం ఏదైనా కొనుక్కు వద్దామా’ అనండి. ఇవాళ్టికివాళ అంతకు మించిన పుణ్యప్రదమైన తెలుగు మరొకటి లేదు. అనుబంధాల తెలుగు వెలుగు గాక! -
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయన.. అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. చదవండి: నిరసనల సెగ.. వెనక్కి మళ్లిన ఎంపీ రఘురామ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. -
ఆటా సభల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు (ఫోటోలు)
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి
-
ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: మంచు విష్ణు
దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి నేడు. మే 4ను డైరెక్టర్స్ డేగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం(మే 4) ఆయన జయంతి సందర్భంగా దాసరిని గుర్తు చేసుకుంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. లెజెండరీ డైరెక్టర్, దర్శకరత్న దాసరి గారు, ది వన్ అండ్ ఓన్లీ గురువు గారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన్ను ఎంతగానో మిస్ అవుతున్నాం’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు. చదవండి: బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చిన కరణ్ జోహార్ Remembering the Man, the Legend, Sri Dasari garu. The one and only Guru garu. His place can never be replaced. Miss him a lot. pic.twitter.com/eHqt9cIrKh — Vishnu Manchu (@iVishnuManchu) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేంద్రమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
లక్నో: కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రికి ప్రమాదం తప్పింది. వేడుకల్లో వేదిక కూలిపోవడంతో ఫ్లడ్ లైట్లు వేదికపైనున్న నేతపై పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం... ఆగ్రాలో అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వేదికపైన ఎక్కువ మంది ఉండటంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో ఫ్లడ్ లైట్లు అక్కడున్న నేతలపైన పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. Organiser of the event also got injured. #Agra pic.twitter.com/nXpoI8MSpj — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) April 15, 2022 కాగా, ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది. స్ధానిక పోలీసులు, భద్రతా సిబ్బంది కిందపడిన ఆయనను పైకిలేపారు. ఆయనకు గాయాలేవీ కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, వేదికపైన ఎక్కువ మంది ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. Union minister of state for parliamentary affairs and culture Arjun Ram Meghwal had a narrow escape after a heavy light stand fell down following hail storm in #Agra. He was a chief guest to attend Dr Bheem Rao Ambedkar Jayanti. At least 6 people were #injured in the mishap. pic.twitter.com/spMx7ZaU6a — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) April 15, 2022 -
సిగ్గుమాలిన మనిషి.. ఈ వీడియో చూసి బాబు,వర్ల సిగ్గు తెచ్చుకోవాలి
-
సాంస్కృతిక పునరుజ్జీవన సారథి
కళా సాంస్కృతిక సారస్వత పిపాసిగా, ప్రజా తంత్రవాదిగా పేరొందిన పిఠాపురం మహారాజా రావువెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885–1965) తెలుగు నేల మీద సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవితాంతం తోడ్పడిన మహామనీషి. అణగారిన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించిన అరుదైన మానవతావాది. యావత్ దేశానికి తన సేవలు అందించిన అజరామర కృషీవలుడు. స్వయంగా కవి, రచయిత, రసజ్ఞుడు, తత్వవేత్త అయిన సూర్యారావు జీవితం నిజానికి ఒక మహా సముద్రం. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మొక్కపాటి సుబ్బారాయుడు మొదలగు ఉద్దండుల సార«థ్యంలో అనేక రంగాల్లో సూర్యారావు చేసిన సేవలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ విరాళాల కోసం ప్రపంచవ్యాప్తంగా పిలుపు ఇచ్చినపుడు పాతిక వేలు పంపిన రాజావారి పేరు ఆనాడే దేశవ్యాప్తంగా మారుమోగింది. రవీంద్రనాథ్ టాగోర్ శాంతినికేతన్, కలకత్తాలోని సిటీ కాలేజి మొదలు రాజ మండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు వరకూ ఆర్థికంగా ఆయన వితరణ పొందని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక సంఘ సంస్కరణోద్యమానికి గొప్ప తోడ్పాటు నిచ్చిన బ్రహ్మసమాజోద్యమ చరిత్రలో చెరగని ముద్ర సూర్యారావుది. దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమానికి ఎనలేని సేవచేసిన వ్యక్తి ఆయన. యావత్ దేశంలోనే తలమానికమనే విధంగా ఎంతో ఖర్చుపెట్టి కాకినాడలో బ్రహ్మసమాజ మందిరాన్ని నిర్మించి హేమచంద్ర సర్కార్ వంటి నేతని బెంగాల్ నుండి ముఖ్య అతిథిగా తీసుకు వచ్చిన రాజాగారు, వంగదేశ మేధావి పండిత శివనాథ శాస్త్రిగారు రచించిన ‘బ్రహ్మ సమాజ చరిత్ర’ అనే బృహత్తర గ్రంథాన్ని కాకుండా, 1933లో రాజారామ్మోహన్ రాయ్ శతవర్ధంతిని జరిపి ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ప్రచురించారు. ఆధ్యాత్మిక సమానత్వాన్ని ఇతోధికంగా ప్రచారం చేసిన సూర్యారావు నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బరోడా మహారాజు మినహా ఈ ఖ్యాతిని అందుకున్న ఏకైక భారతీయ మహారాజు ఈయన మాత్రమే. వైజ్ఞానిక ప్రగతిని మనçస్ఫూర్తిగా ఆహ్వానించి తూర్పు, పాశ్చాత్య దేశాల సమన్వయాన్ని ఆకాంక్షించారు. అసంఖ్యాక విశిష్ట గ్రంథాలను ప్రచురించడం, అనేకమంది బుద్ధి జీవులకు తోడ్పాటును అందించడం చేసిన సూర్యారావు ఆంధ్ర సాహిత్య పరిషత్తును మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వంటిది తెలుగులో కూడా తీసుకురావాలనే సంకల్పంతో సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి అనితరసాధ్యమైన మహత్కార్యాన్ని చేబట్టి సుసాధ్యం చేసారు. ఆర్థికత కంటే ఆత్మగౌరవమే ప్రధానమని నమ్మిన సూర్యారావు ఆఖరు క్షణం వరకూ అలానే బతికారు. అనాథల కోసం దక్షిణ భారతదేశం లోనే మొట్టమొదటి ఆశ్రమంగా ‘కరుణాలయం’ స్థాపించారు. బహుజనుల కోసం కంటి తుడుపు చర్యలు కాకుండా, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, బహుజనుల్ని పేరు చివర గాడు అని చేర్చి హీనంగా సంబోధించే సమాజంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతోమంది ఛాందస సాంప్రదాయవాదులు వ్యతిరేకించినప్పటికీ గ్రామాల్లో ‘గాడు’ అనే పదంతో ఉత్పత్తి కులాల వార్ని, ముఖ్యంగా దళిత బహుజనుల్ని పిలవడాన్ని నిషేధించాలనే బిల్లును ప్రవేశపెట్టి దుమారం రేపారు. భాష, సాహిత్యం, సంగీతం, చిత్రకళ, తర్కం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, క్రీడలు, రాజకీయాలు, సేవా రంగం, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా అనేకానేక అంశాల్లో కృషిచేసి ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎంతో కృషిచేసిన పిఠాపురం మహా రాజా సూర్యారావు కృషిని స్మరించుకోవడం సాంస్కృతిక పునర్వికాసాన్ని స్వాగతిస్తున్న ఆలోచనాపరులందరి కర్తవ్యం. (నేడు పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ జయంతి సందర్భంగా...) – గౌరవ్ -
ట్రాక్ట్రర్పై బయటకు వచ్చిన కలెక్టర్ అనురాగ్ జయంతి
-
విశాఖలో ఘనంగా గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి
-
‘అభినయ శారదా’ జయంతి.. ఇందిరా గాంధీ ముద్దాడిన వేళ
నృత్యం ఆమెకున్న బలం. అయితే బొద్దు రూపం తన సినిమా కలకు అడ్డం పడింది. కానీ, ఏదో ఒకనాటికి నటిగా రాణిస్తానని తనకు తానుగా ఆమె చేసుకున్న శపథం.. నెరవేరడానికి ఎంతో టైం పట్టలేదు. అనుకోకుండా దక్కిన అవకాశం.. ఆ సినిమా అద్భుత విజయం ఆమెను బిజీ హీరోయిన్ను చేసింది. సంప్రదాయ హీరోయిన్ మార్క్‌ను చెరిపేసి కన్నడలో తొలి గ్లామర్ డాల్‌గా నిలిచింది జయంతి. మూడు దశాబ్దాలపాటు దక్షిణాది సినిమాల్లో అగ్ర కథనాయికగా హీరోయిన్గా.. ఆపై హుందా పాత్రలతో అలరించింది. ముఖ్యంగా సొంత గడ్డపై ‘అభినయ శార్దూలే’(నటనా శారదా-నటనా దేవత)గా పిల్చుకునే స్థాయికి చేరుకుందామె. అందుకే అభిమానులు.. ఆ దిగ్గజ నటి లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: జనవరి 6, 1945లో బళ్ళారిలో పుట్టింది కమలా కుమారి అలియాస్ జయంతి. తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఇంగ్లీష్ టీచర్. తల్లి సంతాన లక్ష్మి, కమలా కుమారితో పాటు ముగ్గురు అక్కాచెళ్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చిన్నప్పుడే భర్త నుంచి వేరుపడిన సంతాన లక్ష్మి.. పిల్లల్ని తీసుకుని మద్రాస్‌కు మకాం మార్చేసింది. చిన్నతనంలోనే క్లాసికల్ డ్యాన్సింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన కమల.. మనోరమ(సీనియర్ నటి)తో స్నేహం పెంచుకుంది. చిన్నతనంలోనే కమలకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. నటుడు నందమూరి తారక రామారావు(స్వర్గీయ)ను ఆమె ఆరాధించేది. ఆయన్ని చూసేందుకు బచ్చా గ్యాంగ్‌ను వెంటపెట్టుకుని స్టూడియోలకు సైతం వెళ్తుండేది. ఆ సమయంలో ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్గా చేస్తావా?’ అంటూ ముద్దాడి ఆటపట్టించేవారని జయంతి చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేవారామె. అనుకోకుండా అదృష్టం.. క్లాసికల్ డ్యాన్సర్‌గా రాణిస్తున్న టైంలోనే కమల.. కొన్ని సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ అవకాశాల కోసం ప్రయత్నించేది. అయితే బొద్దుగా ఉందని, డ్యాన్సులు చేయలేదేమోనన్న అనుమానంతో ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఛాలెంజింగ్‌గా తీసుకుందామె. కష్టపడి బరువు తగ్గే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉండగా కన్నడ దర్శకుడు వైఆర్ పుట్టస్వామి ఓ కొత్త సినిమా కోసం అడిషన్స్ నిర్వహిస్తున్నాడు. ఆ టైంలో డ్యాన్స్ రిహాల్స్ కోసం వెళ్లిన ఆమెను చూసి.. ఏకంగా లీడ్ రోల్ ఇచ్చేశాడాయన. అంతేకాదు కమలా కుమారి పేరును కాస్త.. ‘జయంతి’గా మార్చేశాడు. అలా ఆమె తొలిచిత్రం జెనుగూడు(1963)తో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఇక ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో.. జయంతి కాల్షీట్స్ కోసం డైరెక్టర్లు క్యూ కట్టారు. ఇందిర ముద్దాడిన వేళ జయంతి రెండో సినిమా ‘చందావల్లీ తోట’ సూపర్ హిట్. ఆ చిత్రానికి ప్రెసిడెంట్ మెడల్ కూడా దక్కింది. ఇక ఆమె కెరీర్‌ను తారాస్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘మిస్ లీలావతి’(1965). కన్నడనాట ఈ సినిమా ఓ సెన్సేషన్ హిట్.. ట్రెండ్ సెట్టర్ కూడా. కంప్లీట్ బోల్డ్ థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా శాండల్‌వుడ్‌కు గ్లామర్ సొగసులు అద్దింది జయంతి. వెస్స్ర్టన్ అటిరే.. టీషర్టులు, నైటీలు, అంతేకాదు కన్నడలో తొలిసారి స్విమ్ సూట్లో కనిపించిన నటిగా జయంతికి ఒక గుర్తింపు దక్కింది. నటనతోనూ దేశవ్యాప్తంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది. మిస్ లీలావతికి ఆమెకు ప్రెసిడెంట్ మెడల్ దక్కింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ మెడల్ అందించింది. అంతేకాదు జయంతిని ఆప్యాయంగా ముద్దాడి.. గుడ్ లక్ కూడా చెప్పింది ఇందిర. అది తన జీవితంలో మరిచిపోలేని క్షణంగా జయంతి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకునేవాళ్లు. కన్నడ టు తెలుగు.. వయా తమిళ్ 1962- 79 మధ్య సౌత్ సినిమాల్లో జయంతి హవా కొనసాగింది. కన్నడ, తమిళ్, తెలుగులో అగ్రహీరోల సరసన అవకాశాలే దక్కాయి ఆమెకు. ఆ స్టార్ డమ్‌తో హిందీ, మరాఠీ భాషల్లోనూ నటించింది. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, నాలుగు కన్నడ ఉత్తమ నటి స్టేట్ అవార్డులు(మరో రెండు సపోర్టింగ్ రోల్స్‌కు కూడా) దక్కించుకుంది. జయంతి అంటే.. ‘మోస్ట్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్’ హీరోయిన్ అనే పబ్లిసిటీ ఆమెకు నేషనల్ వైడ్‌గా ఫేమ్ తెచ్చిపెట్టింది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్లు అందుకుంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన జగదేక వీరుని కథ, కుల గౌరవం, కొండవీటి సింహాసనం, జస్టిస్ చౌదరిలో, కన్నడ దిగ్గజం డాక్టర్ రాజ్‌కుమార్ సరసన ఏకంగా 45 సినిమాల్లో నటించి రికార్డు నెలకొల్పింది. పుట్టన్నా కంగళ్, దొరై-భగవాన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్ లాంటి వాళ్లతో నటించి ఎన్నో కల్ట్ క్లాసిక్స్ అందించారు. అటుపై 80వ దశకంలో శ్రీనివాస మూర్తి, ప్రభాకర్ లాంటి వాళ్ల పక్కన భార్యామణి పాత్రలు దక్కించుకున్న ఆమె.. కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని తిరిగి సపోర్టింగ్ రోల్స్‌తో అలరించారు. దర్శకుడితో వివాహం.. విడాకులు నటుడు, తెలుగు దర్శకుడు పేకేటి శివరామ్‌ను జయంతి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరూ విడిపోయారు. లీడ్ రోల్స్ అవకాశాలు తగ్గుతున్న టైంలో.. తల్లి పాత్రలకు సైతం ఆమె ముందుకు రావడం విశేషం. 2005-06లో డాక్టర్ రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుందామె. ఎయిడ్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా తీసిన ఓ యానిమేటెడ్ ట్యూటోరియల్ కు ఆమె గాత్రం సైతం అందించడం విశేషం. కొడుకు కేకేతో జయంతి 2017లో పద్మభూషణ్ డాక్టర్ సరోజా దేవీ నేషనల్ అవార్డు ఆమెకు దక్కింది. 2018లో ఆమె అనారోగ్యం బారినపడగా.. చనిపోయిందంటూ పుకార్లు మీడియా హౌజ్‌ల ద్వారా వ్యాపించాయి. అయితే ఆమె బాగానే ఉందని కుటుంబం ప్రకటించింది. చివరికి అనారోగ్యంతో జులై 26, 2021న ఆమె తుదిశ్వాస విడిచినట్లు కొడుకు కుమార్(కేకే) ప్రకటించాడు. తెలుగు సినిమాపై నటి జయంతి ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకవైపు హీరోయిన్‌గానే కాకుండా.. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, దొంగ మొగుడు, తల్లిదండ్రులు, స్వాతి కిరణం, ఘరానా బుల్లోడు, పెద్దరాయుడు, రాముడొచ్చాడు, కంటే కూతుర్నే కను లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆమెకు మరింత దగ్గర చేశాయి. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ‘మెచ్యూర్డ్’ నటిగా ఆమె నటన ఇప్పటికీ ఆడియొన్స్ కళ్ల ముందు మెదలాడుతూనే ఉంటుంది. పెదరాయుడులో జయంతి -
ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత
-
విషాదం : ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి జయంతి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున బనశంకరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1963లో కన్నడలో 'జెనుగూడు' చిత్రంతో సినీ ప్రవేశం చేసిన జయంతి..తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీ రామచంద్రన్ వంటి ప్రముఖులతో నటించారు. మోహన్ బాబు నటించిన పెదరాయుడు చిత్రంలో నటనకు గాను తెలుగులోనూ జయంతికి మంచి గుర్తింపు వచ్చింది. వీటితో పాటు జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, శాంతి నివాసం వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించారు. జయంతి హఠాన్మరణంతో కన్నడ నాట విషాద ఛాయలు అలుముకున్నాయి. జయంతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ಪ್ರಖ್ಯಾತ ಹಿರಿಯ ಕಲಾವಿದೆ, ಅಭಿನಯ ಶಾರದೆ ಜಯಂತಿ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ಅತೀವ ದುಃಖ ತಂದಿದೆ. ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಅವರ ಕೊಡುಗೆ ಅಪಾರವಾಗಿದ್ದು, ಕನ್ನಡ ಕಲಾಲೋಕಕ್ಕೆ ತುಂಬಲಾರದ ನಷ್ಟವುಂಟಾಗಿದೆ. ದೇವರು ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಸದ್ಗತಿ ಕರುಣಿಸಲಿ, ಅವರ ಕುಟುಂಬ, ಅಪಾರ ಅಭಿಮಾನಿ ಬಳಗಕ್ಕೆ ನೋವನ್ನು ಭರಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. pic.twitter.com/JuGWeyX4Ce — B.S. Yediyurappa (@BSYBJP) July 26, 2021 Senior actress Jayanthi (76 years) passed away @NewIndianXpress @santwana99 pic.twitter.com/ryhwPpJlSa — Ashwini M Sripad/ಅಶ್ವಿನಿ ಎಂ ಶ್ರೀಪಾದ್ (@AshwiniMS_TNIE) July 26, 2021 -
చీటింగ్ కేసు: నాపై అన్యాయంగా కేసు నమోదు చేశారు
సాక్షి, హైదరాబాద్: రూ.100 కోట్ల విలువైన స్థలం అభివృద్ధి పేరుతో ఖాజాగూడ వాసి సింధూర రెడ్డిని నమ్మించి రూ.85 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో యాంకర్ శ్యామల భర్త లక్ష్మీ నర్సింహ్మారెడ్డితో పాటు అరెస్టు అయిన తిలక్‌నగర్ వాసి మట్ట జయంతి గౌడ్ గురువారం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేసింది. అందులో జయంతి మాట్లాడుతూ... ‘నా తప్పు ఏమీ లేదు. అనుకోని పరిస్థితుల్లో రెండు నెలల క్రితం నర్సింహ్మారెడ్డి నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు ఓ అమ్మాయి నాకు కాల్ చేసి వేధిస్తోంది అని చెప్తే మాములుగా ఆమెకు కాల్ చేశాను. అప్పుడు ఆ అమ్మాయే నన్ను వేధించిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నర్సింహ్మారెడ్డిని తీసుకువెళ్లి రాయదుర్గం పోలీసుస్టేషన్లో ఆ అమ్మాయిపై ఫిర్యాదు ఇప్పించా.. మా ఫిర్యాదును పక్కన పెట్టిన పోలీసులు అంతకు ముందు ఆ అమ్మాయి ఇతడిపై ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఆమె అనేక మంది నుంచి ఇలానే డబ్బులు తీసుకుంటోంది. నేను ఆమెకు రెండుసార్లు కాల్ చేస్తే ఆమె నాకు నాలుగు సార్లు కాల్ చేసింది. ఆమె బండారం బయటపడకుండా ఉండటానికి మాపై కేసు నమోదు చేయించింది. మాకు న్యాయం చేయకపోతే కమిషనర్‌ను కలుస్తానంటూ పోలీసుస్టేషన్లో చెప్పాను. దీంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. పోలీసులు ఆమె ఫిర్యాదులోని అంశాలపై దర్యాప్తు చేయకుండా నాపై చర్యలు తీసుకున్నారు’ అని ఆరోపించారు. అయితే జయంతి చేస్తున్న ఆరోపణలను రాయదుర్గం పోలీసులు ఖండిస్తున్నారు. సింధూర రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. చదవండి: దారుణం: రూ.15 వేల కోసం.. అమ్మకానికి కూతురు -
గుండెలో విజ్ఞానం–మనసులో సాహిత్యం
‘‘సాహిత్యమునకు, శాస్త్రమునకు గల అగాథాఖాతమును పూడ్వవలెను. సాహిత్య, శాస్త్రములను ద్వీపములకు వారధి కట్టవలెను. కవులకు, శాస్త్ర విధులకు మధ్యగల నిరవగాహన భిత్తిని పడగొట్టవలెను..’’ అని సర్దేశాయి తిరుమలరావు తన అమూల్య గ్రంథం ‘సాహిత్య తత్వము–శివభారతదర్శనము’లో ఢంకా భజాయించి చెబుతారు. 1928 నవంబర్ 28న కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా జోరాపురంలో జన్మించిన సర్దేశాయి తిరుమలరావు అనంతపురంలో బి.ఎస్సి. చదివి తెలుగు మీద అభిమానంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ (ఆనర్సు) చేయాలని–రెండో ఏడు ప్రవేశం కోరారు. అది సాధ్యపడలేదు, దాంతో రాజస్తాన్‌లోని పిలానీలో బిట్స్–పిలాని ద్వారా ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివారు. 1954లో అనంతపురంలోని ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో రీసెర్చి కెమిస్టుగా చేరి 1989లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. తిరుమల రావు వల్ల ఒకవైపు తెలుగు సాహిత్యం, మరోవైపు ఆయిల్ టెక్నాలజి గణనీయంగా లాభపడ్డాయి. సైన్సూ, సాహిత్యమే జీవితపు తోడుగా సాగిన ఆజన్మ బ్రహ్మచారి ఆయన. సంగీతం వినడం హాబీ. సరస చమత్కారం అలవాటు. లౌక్యం, మొహమాటం ఎరుగని జీవనతత్వం. 1994 మే 10న కనుమూసే దాకా అనంతపురం కమలానగర్లో చిన్న పెంకుటింటిలో అన్నతో కలసి ఉండేవారు. అన్నగారూ బ్రహ్మచారే! ఇంటినిండా పుస్తకాలు మాత్రమే! ఎలాంటి ఫర్నిచర్, టెలిఫోన్ లేకుండా నేల మీదనే అధ్యయనం సాగేది. ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా నేల మీదనే, చాపమీదనే కూర్చోవాలి. నూనెగింజలు విరివిగా రాయలసీమ ప్రాంతంలో పండుతుండటంతో 1949లో తైల సాంకేతిక పరిశోధనా సంస్థ దేశంలోనే తొలిసారి అనంతపురంలో ఏర్పడింది. ఆ సంస్థ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి సర్దేశాయి తిరుమలరావు. పూర్వీకులు మరాఠీవారు. ఆయనకు మాతృభాష కన్నడం. తెలుగు, ఇంగ్లి్లష్, కన్నడం, సంస్కృతం బాగా వచ్చు. అటు ఆయిల్ టెక్నాలజీలో సుమారు 500 పరిశోధనా పత్రాలు వెలువరించడమే కాక ‘కన్యాశుల్కము–నాటక కళ’, ‘శివభారతదర్శనము–సాహిత్య తత్వము’ వంటి అత్యంత విలువైన గ్రంథాలు సృజియించారు. బియ్యపు పొట్టు, కొబ్బరి, పట్టుపురుగు గుడ్డు, వాడిన కాఫీ పొడి, పత్తి విత్తనాలు, ఆముదాలు, వేరుశనగ గింజలు, పొగాకు విత్తనాలు, వేపగింజలు, మిరపగింజలు, సీతాఫలం గింజలు, అరటి తొక్క, టమోటా విత్తనాలు, దవనం, మరువం, పుదీనా, నువ్వులు, కుసుమలు – ఇలా స్థానికంగా విరివిగా లభించే వాటిపై పరిశోధనలు చేసి, చేయించి పేటెంట్లు పొంది దేశానికి విదేశీ మారకం సాధించారు. ఆంధ్రపత్రిక, భారతి, ది హిందూ, బ్లిట్జ్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ, సైన్స్ టు డే వంటి పత్రికలలో ఆయన వర్తమాన విషయాలు–గతుకుల రోడ్లు, అణుశక్తి, బిచ్చగాళ్ళు, అంతర్జాతీయ రాజకీయాలు, సాహిత్య విషయాలు, మేధో వివాదాలు – ఇలా ఎన్నో ఉత్తరాలలో చర్చించేవారు. ‘దేవాలయంపై బూతు బొమ్మలాంటివాడు గిరీశం’ అని తిరుమలరావు వ్యాఖ్యానించారు. 1952 సమయంలో తిరుమలరావు పిలానిలో చదువుకుంటుండగా ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహారదీక్షకు దిగిన పొట్టి శ్రీరాములును ఆ పనికి తగడని కొందరు విమర్శించేవారు. గాంధీ నిరాహారదీక్షకు సరిపోయినపుడు పొట్టి శ్రీరాములు ఎందుకు సరిపోడంటూ విద్యార్థిగా ‘హిందూస్తాన్ టైమ్స్’ పత్రికకు ఉత్తరం రాశారు తిరుమలరావు. గాంధీజీ నాలుగో కుమారుడు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ఎడిటర్‌గా ఆ ఉత్తరం ప్రచురించడం విశేషం. మతానికి మంగళం పాడిన పిదపనే సైన్స్ మొదలవుతుందని నమ్మినవాడు సర్దేశాయి తిరుమలరావు. ‘‘బ్రహ్మసూత్రాలను చెప్పిన బాదరాయణునే కాదు అతని శిష్యులను కూడా దేవుళ్ళుగా పూజిస్తారు. కానీ బాదరాయణునితో సాటి అయిన కణాదుని గురించి చాలామందికి తెలియదు. న్యూటన్ రూథర్ ఫర్డ్ పరిశోధనలు వచ్చేదాకా కణాదుని భావనలు చెల్లుబడి అయ్యాయి’’ అనేవారు తిరుమలరావు. (నేడు సర్దేశాయి తిరుమలరావు జయంతి) వ్యాసకర్త: డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్ : 94407 32392 -
భావితరాలకు స్ఫూర్తి ఆంధ్ర కేసరి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు భావి తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. చిత్తశుద్ది, విశ్వాసం, శౌర్యం, ధైర్యం, వారసత్వం టంగుటూరి సొంతం అని ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని, తరతరాలకు ఆయన స్పూర్తిదాయకమని ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ) అలాంటి దమ్మున్న నాయకుడు సీఎం జగన్ : విజయసాయిరెడ్డి ప్రకాంశం పంతులు జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళర్పించారు. ‘నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడే నాయకులు రాజకీయాల్లో చాలా అరుదు. అలాంటి దమ్మున్న తొలితరం నాయకుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారైతే, నేటి తరం నాయకుడు ముఖ్యమంత్రి జగన్ గారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. A man of integrity, conviction & valor, whose legacy & narratives of courage continue to inspire generations in Andhra Pradesh; my humble tributes to the great freedom fighter & the first CM of AP, Andhra Kesari Tanguturi Prakasam Panthulu on his 148th birth anniversary. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2020 భావి తరాలకు టంగుటూరి స్ఫూర్తి ప్రదాత ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. భావి తరాలకు టంగుటూరి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. రాజకీయాల్లో విలువల కోసం ప్రజాసేవలో తరించారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశంసించారు. -
మాజీ ప్రధాని రాజీవ్‌కి టీ పీసీసీ ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్ : స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.. ఉదయం సోమజిగూడా లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేశారు. అలాగే గాంధీభవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, దాసోజు శ్రవణ్, ఉజ్మా షకీర్, టి.కుమార్ రావ్, బొల్లు కిషన్, ప్రేమ్ లాల్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. -
కోలుకుంటున్న నటి జయంతి
కర్ణాటక, యశవంతపుర: సీనియర్ నటి జయంతి ఆరోగ్యం కొంతవరకు మెరుగు పడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడకపోవడం, ఆస్తమా సమస్యలతో మంగళవారం రాత్రి ఆమెను బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా వచ్చింది. నాలుగు నెలల క్రితం కూడా ఆమె అస్తమాతో బాధపడుతూ చికిత్సలు తీసుకున్నారు.(నటి జయంతికి అస్వస్థత) -
నటి జయంతికి అస్వస్థత
ప్రముఖ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మాతృభాష కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు పొందారామె. ‘భార్యా భర్తలు’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఆమె ‘జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరి, దొంగ మొగుడు, కొదమ సింహం, కలియుగ పాండవులు, ఘరానా బుల్లోడు, వంశానికొక్కడు, పెదరాయుడు’.. ఇలా.. దాదాపు 55 చిత్రాలకుపైగా నటించారు. కొద్ది సంవత్సరాల నుంచి ఆమె ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జయంతికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. కాగా జయంతి తనయుడు కృష్ణకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘అమ్మకి ప్రస్తుతం వైద్యం అందుతోంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒకటి రెండు రోజులు పరిశీలనలో ఉండాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమ్మని చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు. -
తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచే ఉంటారు
-
ఆస్పత్రిలో చేరిన నటి : వెంటిలేటర్‌పై చికిత్స
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటి జయంతి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మంగళవారం బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేగాక 24 గంటలపాటు పరిశీలనలో ఉంచనున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా జయంతి గత 35 సంవత్సరాల నుంచి అస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జయంతికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. (టీవీ నటుడు సుశీల్ ఆత్మహత్య) ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో నటిని చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని జయంతి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటుందని ఆమె కుమారుడు కృష్ణ కుమార్ తెలిపారు. ఇక కన్నడ సినిమా జెను గూడు(1963)తో తెరంగేట్రం చేసిన జయంతి అనేక హిందీ, మరాఠీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. కాగా తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటించారు. (ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా మనోజ్.. నిజమేనా!) -
ఆధునిక తత్వవేత్తలకు ఆద్యుడు
చిత్తూరు జిల్లా మదనపల్లెలోని జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు మే 12, 1895లో జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. 14ఏళ్ల వయసున్న కృష్ణమూర్తిని అడయార్ దివ్య జ్ఞాన సమాజంలో మొదటిసారి చూసిన లెట్ బీటర్ తమ సమాజ సభ్యులు ఎదురు చూస్తున్న జగత్ గురువు ఈ బాలుడిలోనే ఉన్నాడని ప్రకటించాడు. డాక్టర్ అనీబీసెంట్ వారిని సమాజంలో చేర్పించడంతోపాటు ఉన్నత విద్యకై ఇంగ్లండ్ పంపారు. ఇంతలో తమ్ముడికి జబ్బు చేయడంతో అమెరికా తీసుకువెళ్లారు. కానీ, తమ్ముడు నిత్యానంద మరణించారు. తమ్ముడి మరణం కృష్ణమూర్తిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద ఈస్ట్’ అనే ఒక అంతర్జాతీయ సంఘానికి అనీబీ సెంట్ ఆయనను అధ్యక్షుడిగా చేశారు. ప్రపంచంలో ఉన్నతమైన గౌరవం లభించినప్పటికీ దానికి విలువ ఇవ్వకుండా సాధారణ జీవి తాన్ని గడిపారు. తరువాత జగత్ గురువు పీఠాన్ని స్వీకరించడం ఇష్టంలేదని 1929లో హాలెండ్‌లో జరి గిన సమావేశంలో ఆ సంస్థను రద్దు చేశారు. నాటినుంచి కృష్ణమూర్తి స్వతంత్ర మానవుడిగా అవతరిం చారు. ఎవరి సహాయాన్ని ఆశించక జీవన శిల్పిగా రూపొందారు. భాషకందని భావం తన కళ్లలో, మాటల్లో కదలాడుతూండేది. అద్భుతమైన చైతన్యం ఆయనను ప్రపంచ దార్శనికునిగా నిలబెట్టింది. జీవన్మరణాలు నాణేనికి రెండు వైపులా ఉండే ముద్రలని ఆయన అన్నారు. జీవించడం ఒక అందమైన కళ. ఆ కళను చక్కగా అనుభవించాలని ఆయన చెప్పారు. మహా ప్రవాహంలాంటి జీవి తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. జీవి తమంటే సత్యమైనది, సుందరమైనది, శివమైనది అంటారు. ప్రపంచాన్ని మంచి మార్గంలో నడిపించడానికి యత్నించిన కృష్ణమూర్తి 17 ఫిబ్రవరి 1986న కన్నుమూశారు. (నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి) – పింగళి బాగ్యలక్ష్మి, గుంటూరు మొబైల్ : 97047 25609 -
హంపీలో చిక్కుకున్న నటి
కర్ణాటక ,హొసపేటె: కన్నడ సీనియర్ సినీ నటి జయంతి హంపీలో చిక్కుకుపోయారు. హంపీలో ఉంటున్న తన కుమారుడు కృష్ణకుమార్‌ను చూసేందుకు గత నెల 22న లాక్డౌన్ ప్రకటించడానికి రెండు రోజుల ముందు నటి జయంతి బెంగళూరునుంచి ఇక్కడకు విచ్చేశారు. ఉన్న ఫళంగా లాక్డౌన్ ప్రకటించడంతో బెంగళూరుకు వెళ్లలేకపోయారు. జయంతి మాట్లాడుతూ లాక్డౌన్ ఈ నెల 14న పూర్తి అవుతుందని భావించామన్నారు. తిరిగి లాక్డౌన్ వచ్చే నెల 3 వరకు పొడిగించడంతో హంపీ సమీపంలోని ఓ హోటల్లోనే ఉండి పోవాల్సి వచ్చిందన్నారు. హోటల్లో తమకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉందని పేర్కొన్నారు. -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై : దేశీయ మార్కెట్లకు నేడు సెలవు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ట్రేడింగ్ తిరిగి బుధవారం(15న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. బులియన్, మెటల్ తదితర హోల్‌సేల్ కమోడిటీ మార్కెట్లకూ సెలవు. ఫారెక్స్ మార్కెట్లు సైతం పనిచేయవు. కాగా సోమవారం సెన్సెక్స్ 470 పాయింట్లు పతనమై 30690 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 8994 వద్ద ముగిసింది. అటు డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా బలపడి 76.27 వద్ద ముగిసింది. -
అక్షరాలా ‘నడిచే’ విజ్ఞాన సర్వస్వం రాంభట్ల!
ప్రముఖ కవి, విమర్శకుడు, చిత్రకారుడు, పత్రికా రచయిత, సంపాదకుడు, తొలి తెలుగు కార్టూనిస్ట్ కవి (‘శశవిషాణం’), వేదాల గురించి సృజనాత్మకంగా ఆలోచించి విస్తృతంగా రాసిన పరిశోధకుడు, ‘కన్యాశుల్కం’ నిపుణుడు, మార్క్సిస్టు మేధావి, తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొట్టమొదటి ప్రధాన అధ్యాపకుడు, రాంభట్ల కృష్ణమూర్తి. ఆయన శతజయంతి సంవత్సరమిది. పుట్టింది ఎక్కడో తూర్పు తీరంలో అయినప్పటికీ, రాంభట్లగారు తన జీవితంలో అత్యధిక భాగం గడిపింది హైదరాబాద్‌లోనే. నిజానికి, రాంభట్ల ఒక స్వయంనిర్మిత సౌధం! హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం లాంటి గ్రంథాలయాల్లోనే ఆయన తెలుగుసంస్కృత సాహిత్య అధ్యయనం సాగింది. మాతృభాష తెలుగులోనూ, స్వయంకృషితో నేర్చుకున్న ఇంగ్లిష్‌లోనూ, కొద్దోగొప్పో పాఠశాలల్లో చదువుకున్న ఉర్దూలోనూ రాంభట్లగారు తర్వాతి కాలంలో పాండిత్యం సంపాదించడం విశేషం. తరుణ యవ్వనంలో రాంభట్ల ఆర్య సమాజ్ ప్రభావంలో వేదాల గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ‘అందరికీ విద్య జ్ఞానప్రాప్తి సత్యప్రకాశం’ అనే దయా నంద సరస్వతి ఆదర్శం రాంభట్లను ప్రభావితం చేసింది. చివరివరకూ ఆయన తన వృత్తి నాలుగు విషయాలు నేర్చుకోవడమూ ఆ నేర్చుకున్నదాన్ని నలుగురికి నేర్పడమేనని నమ్మి, దాన్నే ఆచరించారు. వాస్తవానికి రాంభట్ల జీవనం మేలిమలుపు తిరిగింది ఆ నవయవ్వన దశలోనే. ఆయన దయానంద సరస్వతి దగ్గరే వేద మంత్రాల ప్రతిపదార్థ తాత్పర్యాల దగ్గరే ఆగిపోలేదు! ఫ్రెడ్రిక్ రాసెన్, ఫ్రాంజ్ బాప్, రుడాల్ఫ్ ఫాన్ రాత్, ఫ్రెడ్రిక్ మ్యాక్స్ మ్యూలర్ల రచనలు చదవడానికి ఆయన పడరానిపాట్లు పడ్డారు. ఏమాత్రం తీరిక చిక్కినా మ్యాక్స్ మ్యూలర్ సంకలించిన ‘ద సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్’ చదువుతుండేవారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అచ్చువేసిన ఈ సంకలనం మొత్తం రాంభట్లగారికి నిత్యపారాయణీయం. కానీ, జర్మన్ ఇండాలజిస్టుల దగ్గరా ఆయన ఆగిపోలేదు. జవహర్లాల్ నెహ్రూ, శ్రీపద అమృత డాంగే, రాహుల్ సాంకృత్యాయన్ తదితరులు చూపిన బాటలో రుగ్వేద కాలపు గణసమాజాన్ని ఊహించే సాహసానికి ఆయన చిన్ననాటనే తెగించారు! తంత్ర సంస్కృతి గురించి సంపాదించిన పరిజ్ఞానం రాంభట్లని భౌతికవాదం వైపు నడిపించింది. ప్రాచీన ఆచారాల్లో నిబిడీకృతమయివున్న తాంత్రిక భావనలను వెతికే దిశగా అది దారితీసింది. సామెతలూ, ఊళ్ల పేర్ల వెనక దాగిన అర్థాలను విశ్లేషించడానికి ఈ భౌతికవాదమే తోవ చూపించింది. అదే ఆయన్ని తాపీ ధర్మారావు లాంటి బహుముఖ ప్రజ్ఞావంతుడికి చేరువ చేసింది. ఆ ఆలోచన క్రమమే రాంభట్లని మార్క్సిజం వైపు నడిపించింది. ఈ మేధోపరిణామమే ఆయన్ని గ్రంథస్థమయిన చరిత్ర రచనకు మించి ఆలోచించే సాహసిగా పదును పెట్టింది. అదే, తనను అరుదయిన మేధావిగా మార్చింది. 1940 దశకంలో వెలువడుతూ ఉండిన నిజాం అధికార పత్రిక ‘మీజాన్.’ ఇది, ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో వచ్చేది. తెలుగు పత్రికకు అడివి బాపిరాజు సంపాదకులు. ఆయన దగ్గర సహాయ సంపాదకులుగా చేసే శ్రీనివాస చక్రవర్తి సంస్కృత రూపకాల్లో దిట్ట. ఆయనకు ఆధునిక తెలుగు నాటకాల్లో ‘కన్యాశుల్కం’ అంటే తగని మక్కువ. రాంభట్లకయితే కన్యాశుల్కమంటే ప్రాణం! చక్రవర్తిగారు రాంభట్లకి ఆర్యసమాజ్ రోజులనుంచీ పరిచయస్తులు. ఆయన ద్వారానే అడివి బాపిరాజుతో రాంభట్లకు పరిచయమయింది. బాపిరాజు గారు రాంభట్లను ఎప్పుడూ ‘మైడియర్ యంగ్‌మ్యాన్!’ అని గిరీశం ఫక్కీలో పలకరించేవారట. (రాంభట్ల మమ్మల్నందర్నీ ‘ఏం ఫ్రెండూ!’ అనే పలకరించేవారు!) కన్యాశుల్కమే వారిని కట్టిపడేసింది. ఆ కన్యాశుల్కం నాటకమే రాంభట్లను అభ్యుదయ రచయితగా మార్చింది. దాని రచయిత గురజాడే సామాజిక, ప్రాంతీయ మాండలికాల పట్ల ఆయనలో ఆసక్తి కలిగించారు. గురజాడనుంచే, బాధితులపట్ల పక్షపాతం కలిగి వుండాలనే నీతిని రాంభట్ల నేర్చుకున్నారు. అదే అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళిక రచనలో ‘శ్రామికవర్గ పక్షపాతం’గా ప్రతిఫలించింది. ‘మృచ్ఛకటికం కన్యాశుల్కం’, ‘గిరీ శంశకారుడు’, ‘వసంతసేనమధురవాణి’ అనే అంశాలను తులనాత్మకంగా అధ్యయనం చెయ్యడం రాంభట్ల ప్రవృత్తిలోనే భాగంగా మారిపోయింది! ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ద్విశత జయంతి సంవత్సరంలో చెప్పుకోవలసిన ఓ విశేషం ఉంది ఎంగెల్స్ రచన ‘ఆరి జిన్ ఆఫ్ ఫ్యామిలీ’ని రాంభట్ల వారానికి ఒకసారయినా చదివేవారు! విభిన్న అధ్యయనరంగాల్లో విస్తృతమయిన పరిజ్ఞానం కలిగివుండి, ఏ ‘రెఫరెన్సూ’ లేకుండానే గళగ్రాహిగా మాట్లాడుతూవుండే వ్యక్తులను సంచార విజ్ఞాన సర్వస్వాలుగా పిలవడం కద్దు. అయితే, రాంభట్లని సంచార విజ్ఞాన సర్వస్వం అన డం కన్నా, నడిచే విజ్ఞాన సర్వస్వం అనడమే భావ్యమని నా నమ్మకం. ఎందుకంటే, ఆయన అక్షరాలా ‘నడిచే’ విజ్ఞాన సర్వస్వమే! 1970–80లలో, హైదరాబాద్ పురవీథుల్లో రాం భట్ల, చిన్నపాటి శిష్యబృందాన్ని వెంటపెట్టుకుని, కిలోమీటర్ల తరబడి నడుస్తూ కనిపించేవారు. వేదవేదాంగాలు మొదలుకుని ఫ్రాయిడియన్ సైకోఎనాలిసిస్ వరకూ ఫ్రీ సై్టల్ లెక్చర్ దంచుతూ రాంభట్లగారు నడుస్తూవుంటే, మేమందరం ఆయన వెంట అబ్బురపడుతూ నడిచిపోతూండేవాళ్లం. సరమఅపాల మొదలుకుని గిల్గ మేష్ఎంకిడు వరకూ ఎందరెందరి ప్రస్తావనో వస్తూవుండేది. కాస్త ఖాళీగా వుండే ఇరానీ రెస్టారెంట్ కనిపించే వరకూ ఈ వాకథాన్ సాగుతూ వుండేది. ఎక్కడయినా ‘అడ్డా బిఠాయించామంటే’ చర్చనీయాంశం ఓ కొలిక్కివచ్చే వరకూ ‘బైఠక్’ కొనసాగాల్సిందే! ఈ చర్చ ఎప్పుడూ వన్‌వే ట్రాఫిక్‌లా జరిగేదికాదు. నిజానికి రాంభట్లగారే అలా జరగనిచ్చేవారు కారు. ఒకవేళ అలా జరిగే ప్రమాదం కనబడితే, అప్పటిదాకా తాను చెప్తూవచ్చిన వాదాన్ని తానే ఖండించడం మొదలుపెట్టేవారాయన! ‘వాదానువాద సంవాద ప్రతివాదా’లనే తర్క ప్రక్రియల గురించి సహచరులకు వివరిస్తూ చర్చను మోడరేట్ చేసేవారాయన. ఆయన పాతకాలపు ‘చండామార్కుల మార్కు’ గురువు కారు. తన కన్నా పాతిక ముప్ఫైయేళ్లు చిన్నవారయిన శిష్యులందరినీ ప్రేమగా ‘ఫ్రెండూ!’ అని పిలిచే ఆధునిక గురువు. ఏథెన్స్ వీథుల్లో సోక్రటిస్ నిర్వహించాడని చెప్పే ‘ఎలింకస్’ తరహా సంచార చర్చాగోష్ఠులను రాంభట్ల ఏళ్ల తరబడి కొనసాగించారు. నాకు తెలిసి, తెలుగునాట ఇలాంటి కార్యక్రమం చేపట్టిన మరో వ్యక్తి లేరు! అదీ రాంభట్ల విశిష్టత. శతజయంతి వేళ మనం స్మరించుకోవలసిన ముఖ్యమైన అంశం ఇదే. రాంభట్లగారు రాసింది బహుతక్కువ. ఆ రాసిన పది పుస్తకాలూ కూడా మార్కెట్లో దొరకడం లేదు. ఈ శతజయంతి సందర్భంగానైనా తన లభ్య రచనల సర్వస్వం వెలువడితే బావుంటుంది. రాంభట్లగారి ‘ఫ్రెండ్స్’ వింటున్నారా? (ఫిబ్రవరి 22 ఉదయం విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి సభ సందర్భంగా..) వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు మందలపర్తి కిశోర్ -
28న సాహిత్యకారులకు పురస్కారాలు
సాక్షి, విజయవాడ: సాహిత్యకారులకు ‘గుర్రం జాషువా జయంతి’ పురస్కరించుకొని గతంలో ప్రభుత్వం రూ.50 వేలు నగదు అందించేదని.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1 లక్ష చేశారని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి ఆధ్యర్యంలో అధికార భాష సంఘం, భాషా సాంస్కృతిక శాఖలు బుధవారం సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న లక్ష్మీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. గుర్రం జాషువా 124వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 28న సాహిత్యకారులకు పురస్కారాలను ప్రదానం చేయనుందని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యకారులు డా. కత్తి పద్మారావు, బోయ్ ఐమావతమ్మ, డా. గుజర్లముడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావులకు రూ.1 లక్ష నగదు, జ్ఞాపికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరిస్తారని ఆయన ప్రకటించారు. -
పట్టించుకోనందుకే పక్కన పెట్టారు
సాక్షి, విజయవాడ : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణను యువత ఆదర్శంగా తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ యువకులకు సూచించారు. మంగళవారం సత్యనారాయణ 125వ జయంతిని పురస్కరించుకొని లెనిన్ సెంటర్లోని ఆయన విగ్రహానికి మంత్రి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విశ్వనాధ సత్యనారాయణ తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారని, ఆయన రచనలు మరువలేనివని తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సత్యనారాయణ నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం తెలుగు భాషను, కవులను పట్టించుకోలేదనీ, అందుకే ప్రజలు ఆయనను పక్కన పెట్టారని రచయిత జొన్నవిత్తుల చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. -
నేడు ఆర్థికరంగ నిపుణుడు డిఏ సోమయాజులు జయంతి
-
జీవించా..
మీలో చాలామంది నటి జయంతిని చూసి ఉండకపోవచ్చు. ఈ ఇంటర్వ్యూ చదివితే జయంతి మాత్రమే కాదు, చిన్ననాటి జయంతి గురించి కూడా మీకు తెలుస్తుంది!లైఫ్‌ని ఊరికే లాగించేస్తుంటారు మనుషులు.కానీ జయంతి, జీవితంలోని ప్రతి దశలోనూ జీవించారు!నటనలో జీవించడం నటులు చేసే పనే. జీవితంలో నటించకుండా ఉండటమే లైఫ్ అంటే.ఆ లైఫ్‌నే ‘జీవించా..’ అంటున్నారు జయంతి. నేడు ఆమె బర్త్ డే. ఆ సందర్భంగా.. సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు.. బర్త్‌డే (జనవరి 6) గురించి నాలుగు మాటలు? జయంతి: ధన్యవాదాలు. ‘సాక్షి’ని కలవడం నాకూ ఆనందంగా ఉంది. ఆ మధ్య నేను అనారోగ్యానికి గురయ్యానని వార్త వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. బెంగళూరులో ఉన్న నాకు ఇలాంటి అభిమానం దక్కడం మరచిపోలేను. నాకు బర్త్‌డేలంటే భలే ఇష్టం. నేను నటిగా ఉన్నప్పుడు గ్రాండ్‌గా చేసేవాళ్లు. మెల్లిగా ఎందుకిదంతా అనిపించింది. ఆ తర్వాత చాముండేశ్వరీ మాత దేవాలయానికి వెళ్లి ఇంటికి వచ్చేదాన్ని. ఇంట్లో అందరం కలసి భోజనం చేసేవాళ్లం. బర్త్‌డే నాడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలుస్తాం. ఈసారి బయటకు ఎక్కడికీ వెళ్లడంలేదు. ఇంట్లోనే. ఈ సందర్భంగా ఒక్కసారి మీ బాల్యంలోకి వెళదాం. ఎక్కడ పుట్టారు. ఎక్కడ పెరిగారు? బళ్లారిలో పుట్టాను. ఎక్కువ సంవత్సరాలు అక్కడే పెరిగాను. నాన్న బాలసుబ్రహ్మణ్యంగారు సెంట్ జోసెఫ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఉండేవారు. అమ్మగారు సంతాన లక్ష్మీ. నేను పెద్ద అమ్మాయి. నాకు ఇద్దరు తమ్ముళ్లు యోగేశ్బాబు, హరికృష్ణ. ఇది మా ఫ్యామిలీ. మేం బెంగళూరులో ఉండేవాళ్లం. అమ్మానాన్న ప్రేమగా ఉంటూనే స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్లు. స్కూల్ డేస్‌లో చురుకుగా ఉండేవారా? చాలా. స్కూల్ ఫంక్షన్స్‌లో స్టేజ్ మీద డ్యాన్స్ చేయాల్సిందే. ఓ ప్రోగ్రామ్ చూసి, మా అమ్మగారైతే ‘నా కూతురు పెద్ద డ్యాన్సర్ అయిపోతుంది’ అని మురిసిపోయి, నాన్నని ఒప్పించి మద్రాస్ తీసుకెళ్లి చంద్రకళ అనే డ్యాన్స్ మాస్టర్ దగ్గర చేర్పించారు. ఈవిడ డ్యాన్స్ స్కూల్ నడుపుతూ సినిమాల్లో డ్యాన్స్ చేసేవారు. ఆవిడ దగ్గర చేరినప్పుడు నటి మనోరమ నాకు సీనియర్. తనేం డ్యాన్స్ చేస్తుంది. చేయి ఊపుతుందా? నడుము ఊపుతుందా? అని సీనియర్స్ అంతా నన్ను ఏడిపించేవాళ్లు. నాకు బాగా ఏడుపొస్తే గోడకు కొట్టుకునేదాన్ని. ఓసారి అలా చేసినప్పుడు మనోరమ చూశారు. ‘కమలా.. ఎందుకలా చేస్తున్నావు?’ అని అడిగితే, ‘వీళ్లంతా నన్ను ఏడిపిస్తున్నారు. వచ్చింది కూడా నేర్చుకోలేకపోతున్నాను’ అన్నాను. ‘కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలి. సారీ చెప్పండి’ అని వాళ్లను దులిపేశారామె. మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆ రోజు మా టీచర్‌కి షూటింగ్ ఉంది. మేం కూడా వస్తామని వెళ్లాం. ఆ సమయంలో కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి ఒక కన్నడ సినిమా తీస్తున్నారు. అందులో ముగ్గురు హీరోయిన్స్ పండరీ బాయి, చంద్రకళ. ఈ చంద్రకళ మా డ్యాన్స్ టీచర్ కాదు. ఆవిడ నటి. మూడో హీరోయిన్గా ఒక చిన్నమ్మాయి కోసం వెతుకుతున్నారు. నేను ఆయన కళ్లలో పడ్డాను. ‘నీ పేరేంటి’ అని అడిగితే, కమలా అని వినపడీ వినపడనట్టు చెప్పాను. మా సినిమాలో యాక్ట్ చేస్తావా? అని అడిగారు. టీచర్ వైపు చూస్తే, ‘ఆ అమ్మాయికి తెలియదండీ.. వాళ్లింటికి తీసుకెళ్తాను’ అన్నారు. మరుసటిరోజు వచ్చారు. ‘మాకు సినిమాలంటే ఇష్టం లేదు’ అని మా అమ్మగారు అన్నారు. సినిమా అన్నా సినిమావాళ్లన్నా తక్కువ భావన ఉండేదట. మా అమ్మ వద్దని చెప్పి, పంపించేశారు. పాపం మూడుసార్లు వచ్చారు. ‘మీ అమ్మాయి అయితే బాగుంటుంది. నా బిడ్డలాగా చూసుకుంటాను. నా భార్యా పిల్లలు షూటింగ్‌కి వస్తారు. వాళ్ల పక్కనే కూర్చుంటుంది’ అని అమ్మని కన్విన్స్ చేశారు. ఓకే.. షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెబుతారా? అంతా చిత్రాతిచిత్రంగా అనిపించింది. మేకప్ పూస్తున్నారు.. పూస్తున్నారు.. పూస్తూనే ఉన్నారు. ఏంటి ఇదంతా పూస్తేనే బావుంటారా? అనుకున్నాను. ఆ తర్వాత ఒకతను తల దువ్వాడు. ఇంకొకతను బట్టలు తీసుకొచ్చారు. కొంపతీసి ఈ అబ్బాయి బట్టలు కడతాడా? అనుకున్నాను. బట్టలు కట్టరమ్మా ఇచ్చి వెళ్తారమ్మా అని చెప్పాడు. రెడీ అయ్యాక నన్ను కెమెరా ముందు నిలబెట్టారు. చుట్టూ జనం. నాకేం చేయాలో తెలియలేదు. దర్శకుడు వచ్చి, ‘చుట్టూ జనం ఉన్నారని మర్చిపో. నేను చెప్పింది చేస్తే చాలు’ అన్నారు. అలానే చేశా. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఆ సినిమా పేరు ‘జేను గూడు’ (‘తేనె తుట్టి’ అని అర్థం). ఆ తర్వాత మీ లైఫ్ తేనెలాగానే సాగిందా? హహ్హహ్హ... ఇంత తియ్యగా ఎవరూ ఈ మాట ఇప్పటివరకూ అనలేదు. (నవ్వుతూ). నిజంగానే దాదాపు తియ్యగానే సాగింది. ‘జేను గూడు’ డైరెక్టర్ వై.ఆర్. స్వామిగారు నాకు ‘గినిమరీ’ అని పేరు పెట్టారు. అంటే.. చిలక పిల్ల అని అర్థం. ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. పేరు చిన్నదిగా ఉంటే బాగుంటుందని స్వామిగారు అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురి పేర్లు కలిసొచ్చేట్లు ‘జయంతి’ అని పేరు పెట్టారు. ఒకసారి సావిత్రిగారు షూటింగ్ లొకేషన్లో మీపై ఆగ్రహం వ్యక్తపరిచారట. నిజమా? కొత్త భాషలు నేర్చుకోవాలనే పట్టుదల కలగడానికి సావిత్రిగారే కారణం. ఆ సినిమా పేరు గుర్తు లేదు. సావిత్రిగారి కాంబినేషన్లో ఓ సీన్ తీస్తున్నప్పుడు నేను డైలాగ్ చెప్పడానికి తడబడ్డాను. ఆవిడకు కోపం వచ్చి, భాష రానివాళ్లను తీసుకొచ్చి విసిగిస్తారా? ముందు సరిగ్గా నేర్పించండి అన్నారు. నిజానికి నాకు తమిళ్ రాదని, ఆ సినిమా చేయనంటే మేనేజ్ చేసుకుంటామని ప్రొడ్యూసర్ ఒప్పించారు. అందరి ముందు సావిత్రిగారు అనేసరికి దుఃఖం వచ్చేసింది. కో–డైరెక్టర్ సముదాయించడానికి ట్రై చేసినా ఇలా ఇన్సల్ట్ చేస్తే నా వల్ల కాదు, నా కోసం ఖర్చు పెట్టినదంతా తిరిగి ఇచ్చేస్తానని ఇంటికి వచ్చేశాను. సావిత్రిగారంటే నాకు ఇష్టం. ఆవిడతో నటించే చాన్స్ మిస్ అయిందని ఓ వైపు బాధ. మా అమ్మ విషయం తెలుసుకుని మంచి తమిళ ట్యూషన్ మాస్టారుని పెట్టించారు. నేనే వేరేవాళ్లకు డబ్బింగ్ చెప్పేంతగా నాకు తమిళ్ నేర్పించారు. ఆ తర్వాత ఓ కన్నడ పిక్చర్లో సావిత్రిగారు నాకు అత్తగారిగా చేశారు. షూటింగ్లో నేను ఆవిడ కాళ్లు పట్టుకున్నాను. ‘జయంతీ.. ఏంటమ్మా ఇది. కన్నడంలో నంబర్ వన్ హీరోయిన్‌వి. నా కాళ్ల మీద పడుతున్నావు?’ అనగానే ‘నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం మీరు. భాష నేర్చుకునేలా చేశారు’ అన్నాను. కెరీర్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో మీ నడక మగరాయుడిలా ఉండేదట.. ఎలా మార్చుకున్నారు? దానికి కారణం రామారావుగారు. డ్యాన్స్ నేర్చుకోవడానికి మద్రాస్ వెళ్లినప్పుడు రామారావుగారిని చూడ్డానికి ఆయన ఇంటికి వెళ్లాం. అప్పుడాయన ‘నాతో యాక్ట్ చేస్తావా?’ అని నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని అడిగితే, మా అమ్మను చూశాను. ‘ఏం తాగుతారు? మజ్జిగా? మంచినీళ్లా? వీరు మా హీరోయిన్’ అన్నారు రామారావుగారు. నిజంగానే ఆయన సరసన ఆ తర్వాత ‘జగదేకవీరుని కథ’లో నటించాను. ఆ షూటింగ్ అప్పుడు ‘షాట్ రెడీ’ అని నన్ను పిలిస్తే, విసావిసా నడుచుకుంటూ వెళ్లాను. అప్పుడు రామారావుగారు ‘మీరు అబ్బాయా? అమ్మాయా?’ అనడిగారు. నాకేం అర్థం కాలేదు. అమ్మాయి అయితే ఇలా అబ్బాయిలా నడుచుకుంటూ వస్తారా? అంటూ ఆయనే ఒక కాలు వంకరగా పెట్టి నిల్చోమన్నారు. ఎలా నడవాలో చూపించారు. అప్పటివరకూ నా నడక మగపిల్లల్లానే ఉండేది. అప్పటివరకూ ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌లో కనిపించిన మీరు ‘మిస్ లీలావతి’లో స్విమ్ సూట్ ధరించడం, కన్నడ స్క్రీన్‌కి మోడ్రన్ డ్రెస్సులు పరిచయం చేసిన తారగా పేరు తెచ్చుకోవడం, ‘గ్లామర్ దివా’ బిరుదు దక్కించుకోవడం గురించి? నాకు ఈ సినిమా రావడమే విచిత్రంగా జరిగింది. ఆ పాత్రకు షావుకారు జానకిగారిని, ఆమె స్నేహితురాలి పాత్రకు నన్ను సెలక్ట్ చేశారు. ఆ చిత్రదర్శకుడు యంఆర్. విఠల్ ‘అమ్మా.. ఇందులో మీరు స్విమ్మింగ్ షాట్స్ చేయాలి. స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి, సినిమాకు కీలక సన్నివేశాల్లో వస్తుంది’ అని జానకిగారితో అన్నారు. ‘ఆ సీన్స్ లేవంటే చేస్తాను’ అన్నారు. దాంతో నాకు ఆ పాత్ర గురించి చెప్పారు. స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి కదా. అందుకే నేను యస్ అన్నాను. అప్పటికి కన్నడ సినిమా లంగా, వోణీల వరకే ఆగింది. ఈ సినిమాతోనే స్కర్ట్స్, టీ షర్ట్స్, స్విమ్ సూట్ స్క్రీన్‌కి వచ్చాయి. తర్వాత ఇలాంటి కాస్ట్యూమ్స్ మామూలు అయిపోయింది. రాజ్‌కుమార్‌గారితో ఎక్కువ చిత్రాలు చేసిన రికార్డ్ మీదేనట? అవును. మేమిద్దరం చాలా సినిమాలు చేశాం. మాకు ‘రాజా జోడీ’ అనే పేరు కూడా ఉంది. మా కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ‘బహదూర్ గండూ’ ది బెస్ట్. మేం ఇద్దరం నువ్వా నేనా అన్నట్టు యాక్ట్ చేశాం. అందులో నేను రాజ్‌కుమార్‌ని, ఆయన కామన్ మ్యాన్. పిక్చర్ సూపర్ హిట్. ఇంగ్లీష్ మ్యాగజీన్స్ ‘జయంతి స్టీల్స్ ది షో’ అని రాశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ కాబట్టి ఆ కామెంట్‌కి రాజ్‌కుమార్‌గారికి కోపం వచ్చిందా? కోపమా? ఆయనతో నాకదే లాస్ట్ పిక్చర్ (నవ్వేస్తూ). ఆ తర్వాత మేమిద్దరం చేయలేదు. మరి వ్యక్తిగతంగా కూడా మీ రిలేషన్ చెడిపోయిందా? (జయంతి తనయుడు కృష్ణ అందుకుంటూ) సినిమాలు చేయకపోయినా ఆయన ఉన్నంత వరకూ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉన్నారు. ‘రాజ్’ అని పేరు పెట్టి కర్ణాటకలో రాజ్‌కుమార్‌గారిని పిలిచేంత చనువు అమ్మకే ఉంది. (జయంతి అందుకుంటూ) ఆ సంగతలా ఉంచితే.. రాజ్‌తో యాక్ట్ చేసిన ఓ సినిమాలో నా పాత్ర చనిపోతుంది. మంచం మీద అలా నిద్రపోయినట్టు ఉండమన్నారు. ఆయనకేమో భారీ డైలాగ్ ఇచ్చారు. ఆయనేమో ఒక పట్టాన సీన్‌ని వదలరు. ఆ ఎమోషన్లో నా కాళ్ల మీద దబ్బ్మని పడ్డారు. అంతే.. పోయాం అనుకున్నాను (నవ్వుతూ). ఫైనల్లీ.. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ‘సాక్షి’ కోరుకుంటోంది. థ్యాంక్యూ. మీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎస్వీ రంగారావుగారు ‘చిన్న రంగారావు’ అని పిలిచేవారట? రామారావుగారు, యస్వీ రంగారావుగారు, భానుమతిగారు.. వీళ్లతో ఒక్క సీన్లో అయినా యాక్ట్ చేయాలని ఉండేది. ఆ అదృష్టం నాకు దక్కింది. రామారావుగారితో చేశాను. రంగారావుగారి గురించి చెప్పాలంటే.. ఆయన ఎందుకో నాకు చిన్నపిల్లాడిలా అనిపించేవారు. అందుకే రంగా రంగా అని పిలిస్తే నవ్వుకునేవారు. ‘ఏంటీ ఈ అమ్మాయి అలా యాక్ట్ చేస్తోంది’ అని డైరెక్టర్ అంటే ‘ఆ అమ్మాయి చేసింది కరెక్టే. బాగా యాక్ట్ చేస్తోంది’ అని రంగారావుగారు అనేవారు. ఆయన నన్ను ‘చిన్న రంగారావు’ అని పిలిచేవారు. భానుమతిగారితో నాకో మరచిపోలేని ఇన్సిడెంట్ ఉంది. ఆవిడ ఏం ఆర్టిస్ట్ అండీ. ఆవిడ పాద ధూళికి కూడా సరిపోను. ఒక సినిమాలో మా ఇద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ పెట్టారు. నేను స్పెషల్ డ్రెస్ తెప్పించుకొని రెడీ అయ్యాను. భానుమతిగారు ఆవిడ స్టైల్లో రెడీ అయి వచ్చారు. నా పక్కన కూర్చుని నన్ను కిందకీ పైకీ చూస్తుండిపోయారు. నా పోర్షన్ రేపు షూట్ చేద్దాం అని వెళ్లిపోయారు. నేనెలా అయితే రెడీ అయ్యానో మరుసటి రోజు అదేలా రెడీ అయ్యి వచ్చారు. మా టైలర్ దగ్గర కనుక్కుని, ఆ హెయిర్ స్టైల్ నుంచి అన్నీ సేమ్ టు సేమ్ నాలానే రెడీ అయ్యారు. అంతే.. నేను ఖుష్ అయిపోయాను.జయంతికి ఒకే ఒక్క కుమారుడు. పేరు కృష్ణ. గతేడాది మార్చిలో జయంతి అస్వస్థతకు గురైనప్పుడు ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వార్త ప్రచారమైంది. అప్పుడు ‘సాక్షి’ కృష్ణను సంప్రదించగా, ‘అమ్మ బాగానే ఉన్నారు. ఆ వార్త నిజం కాదు’ అన్నారు. ఇప్పుడు బర్త్‌డే సందర్భంగా జయంతిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో కృష్ణతో గతేడాది మార్చి గురించి మాట్లాడితే ఆవిడ ఆరోగ్యం గురించి చెప్పారు. ‘జయంతి ఇక లేరు’ అనే వార్త ప్రచారమైనది తెలుసుకుని మీ అమ్మ ఎలా ఫీలయ్యారు? కృష్ణ: తన వరకూ ఆ వార్తను వెళ్లనివ్వలేదు. ఎందుకంటే హెల్త్ బాగా లేనప్పుడు అలాంటివి వింటే తనేదో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని అమ్మ భయపడుతుందని చెప్పలేదు. అసలు అప్పుడు ఏం జరిగింది? అమ్మకు ఆస్థమా అటాక్ అయింది. దానివల్ల ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్ వచ్చింది. హాస్పిటల్లో ఉంచి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం. ఆమె కోలుకునే నెలవరకూ కూడా జరిగిన రాంగ్ పబ్లిసిటీ గురించి అమ్మకు తెలియదు. ఆరోగ్యంగా ఇంటికి వచ్చాక అమ్మతో ‘అమ్మా.. మన దేశం మొత్తం నువ్వు అభిమానులను సంపాదించుకున్నావు. నీ గురించి ఎంతమంది ఫోన్లు చేశారో’ అన్నాను. అమ్మ ఆనందపడింది. నిజంగా అమ్మ అచీవ్మెంట్ అదే అనుకుంటాను. మార్చి నెల మొత్తం రాత్రీ పగలూ తేడా లేకుండా నా దగ్గరున్న మూడు ఫోన్లు రింగ్ అవుతానే ఉన్నాయి. మీ అమ్మగారు ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని అప్పుడే తెలిసిందా? అభిమానులు ఉన్న విషయం తెలియక కాదు. అయితే ఇంతమంది అభిమానం చూపిస్తారని ఊహించలేదు. ఒక సినిమా స్టార్‌కి ఉన్న గొప్ప అదృష్టం అది. మీరెందుకు సినిమాల్లోకి రాలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి అమ్మ ఆరోగ్యం సహకరిస్తుందా?ఓ.. (జయంతి) నూటికి నూట పది శాతం సపోర్ట్ చేస్తుంది. (నవ్వుతూ) -
సమీప నివాసమే ఉపవాసం
ప్రేమ, శాంతి, సహనం, సత్యం, సేవాతత్పరత వంటి అనేక మేలు గుణాలు కలగలసిన మహానుభావుడు భగవాన్ శ్రీసత్యసాయిబాబా. ఈ నెల 23, శుక్రవారం బాబా జయంతి సందర్భంగా ఆయన బోధామృతంలోని కొన్ని చినుకులు... ♦ పిల్లలు తమలోని దైవిక ప్రజ్ఞలను పెంపొందించుకోవడానికి తల్లిదండ్రులు అన్ని అవకాశాలూ కల్గించాలి. యజమాని తోటలో తోటమాలి మొలకల్ని పెంచిన రీతిగా తల్లిదండ్రులు తమ ఇంట్లో పుట్టిన చిన్నారులను పెంచడానికి భగవంతుడు తమను నియమించాడని భావించాలి. పురాణ పురుషులు, రుషులు, మునుల కథలను చెబుతూ చిన్నారులలో దాగి ఉన్న మంచితనాన్ని ప్రేరేపించాలి. ♦ కొందరు కార్తీక పౌర్ణమి, శివరాత్రి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలలో ఉపవాసం పేరిట అన్నపానాలు మాని చిరుతిండ్లు అధికంగా తింటూ ఉంటారు. ఇది ఉపవాసం కాదు. భగవంతునికి సమీప నివాసమే ఉపవాసం. ♦ భగవంతుని నామ సంకీర్తనంతో అఖండ భజనలతో హృదయాకాశాన్ని ప్రకాశింప చేయాలి. అప్పుడే అంతులేని ఆత్మానందం కలుగుతుంది. కనుక జీవితం ఉన్నంత వరకు నామ సంకీర్తనం చేయాలి. ♦ సాధన ద్వారా మనోచాంచల్యాన్ని నిరోధించి దైవోన్ముఖం చేయగలిగిన వానికి ఏ విధమైన వర్ణాశ్రమధర్మాలూ అవరోధం కాజాలవు. ♦ ముక్తికోసం మానవుడు అడవులకు, ఆలయాలకు, యాత్రలకు వెళ్లనవసరం లేదు. ముక్తిపొందటానికి కులగోత్రాలతోనూ, ఏకాంత దీక్షతోనూ, వనవాసంతోనూ ప్రమేయం లేదు. మానవునికి కర్మద్వారానే ముక్తి లభిస్తుంది. అదెలాగంటే, కర్మ చేసేటప్పుడు ఇంద్రియ ప్రభావాన్ని బుద్ధి నిలకడతో అణచివెయ్యాలి. అలా ఇంద్రియాల శక్తిని అరికట్టిన అంధుడైనా మోక్షం పొందుతాడు. భవబంధాలను దూరం చేసుకుని భగవంతుని యెడల ప్రగాఢ భక్తివిశ్వాసాలు పెంచుకొనటమొక్కటే మానవుని ముక్తికి కావలసిన అర్హతను ప్రసాదిస్తుంది. -
ఫలించిన ‘గిడుగు’ కల
నేడు తెలుగు ప్రజలు, విద్యార్థి లోకం సృజనాత్మక సాహిత్యాన్ని, వార్తా పత్రికలను, పాఠ్య పుస్తకాలను జీవకళలొలుకు జీవద్భాషలో హాయిగా చదువుకుం టున్నారంటే, విద్యార్థులు మాట్లాడే భాషలో పరీక్షలు సులభంగా రాస్తున్నారంటే.. దీనివెనుక గిడుగు రామమూర్తిగారి ఎన్నో ఏళ్ల కృషి, ఎంతో శ్రమ, పట్టు దల, తపన ఉన్నాయి. అందుకే గిడుగువారి పుట్టిన రోజు తెలుగు భాషా దినోత్సవమయింది. వ్యావహారిక భాషావాదం పుట్టి 118 ఏళ్లపైన అవుతోంది. ఇప్పుడు రచయితలందరూ సజీవ భాష లోనే రచనలు చేస్తున్నారు. మహా కావ్యాలకు సైతం వ్యాఖ్యానాలు వాడుక భాషలోనే వస్తున్నాయి. విశ్వ విద్యాలయాలలోని పరిశోధనా పత్రాలను జీవద్భాష లోనే రాస్తూ, డాక్టరేట్లు అవుతున్నారు. ‘కొమ్ములు తిరిగిన ఉద్దండ పండితులే నిర్దు ష్టంగా రాయలేని గ్రాంథిక భాషా శైలిలో బడిపిల్లలు, సామాన్యులు రాయాలనటం అశాస్త్రీయమనీ, అలా ఆదేశించటం అన్యాయమనీ గిడుగువారు పత్రికా ముఖంగా చెప్పారు. తెలుగు ప్రాంతాలన్నీ తిరిగి సభాముఖంగా, విజ్ఞప్తుల రూపంలో వాడుక భాషలో సౌలభ్యాన్ని ప్రచారం చేశారు. ఇంటాబైటా నూటికి 90 శాతం వ్యవహారంలో వాడే జీవద్భాషను వదిలి, పాఠ్యగ్రంథాలలో శైలిని బట్టీపట్టి కృతక శైలిలో పరీ క్షలు రాయాలని పిల్లలను నిర్బంధించటం సబబా అని ప్రశ్నించారు. గ్రాంథిక, వ్యావహారిక భాషోద్యమం ఒక చారి త్రక ఘటన. దేశభాషలు అభివృద్ధి చెందాలంటే, భాషలపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాస్త్ర విజ్ఞా నాన్ని దేశ భాషలలో బోధించటానికి తగిన పుస్తకా లను రాయటానికి రచయితలను ప్రోత్సహించాలని 1905లో విద్యాశాఖ భావించింది. ఉన్నత పాఠశాల, కళాశాల తరగతులలో మాతృభాషలో వ్యాస రచ నను నిర్బంధ పాఠ్యాంశంగా పెట్టాలని విద్యాశాఖ భావించింది. ఈ వ్యాస రచన, అనువాదాల శైలి విషయంలో వ్యావహారిక భాషా ప్రసక్తి వచ్చింది. ఆధునిక భావాలున్న విద్యావేత్తలు వ్యావహారిక భాష లోనే ఈ వ్యాస రచన, అనువాదం ఉండాలన్నారు. గ్రాంథిక భాషాభిమానులకు ఇది నచ్చలేదు. భాష విషయంలో రెండు వర్గాలేర్పడ్డాయి. 1906 సంవత్సరంలో అప్పటి గంజాం, విశాఖ, గోదావరి జిల్లాల స్కూళ్లు పరీక్షాధికారి ఉ.ఎ. ఏట్సు తెలుగులో గ్రంథశైలికి, మాట్లాడే భాషకు ఉన్న పెద్ద అంతరాన్ని గుర్తించి, ఆశ్చర్యపోయి, గురజాడ, గిడు గులతో చర్చించారు. ఆ తరువాత రెండేళ్లపాటు గిడు గువారు తెలుగు కావ్యాలను, వ్యాకరణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గ్రాంథిక, వ్యావహా రిక భాషల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించిన దగ్గర నుంచీ గిడుగు వారి దృష్టి అంతా ఈ విషయంపైనే. విషయ ప్రధానమైన గ్రంథాలన్నీ మన పూర్వులు వాడుక భాషలోనే రాశారనీ, మన సంప్రదాయం అదేనని నిదర్శనలు చూపిస్తూ పలు చోట్ల ఉపన్యసిం చారు. ఏట్సు కోరికపై ఉపాధ్యాయ వార్షిక సభలో తెలుగు భాషా పరిణామక్రమాన్ని, జీవద్భాషా ప్రాశ స్త్యాన్ని వివరించారు. పండితులు వీరిని వ్యతిరేకిం చారు. 1911లో మద్రాసు యూనివర్సిటీ వ్యాసర చన, అనువాదాల శైలి విషయంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ సంఘంలో గ్రాంథిక భాషా ప్రతినిధులుగా జయంతి రామయ్య, వేదం వేంకట రాయ శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు మొదలైన వారు.. వ్యావహారిక భాషా వాద ప్రతినిధులుగా గిడుగు, గురజాడ, బుర్రా శేష గిరిరావు, శ్రీనివాస య్యంగార్ వంటి వారున్నారు. వీరి మధ్య తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగి నాయి. వీటన్నిం టికీ నాటి ‘హిందూ’ పత్రిక వేదికయింది. అయిదారు పుష్కరాలపాటు ఈ భాషోద్యమం కొనసాగింది. చివ రికి వాడుక భాషకు విజయం లభించింది. గురజాడ సృజనాత్మక సాహిత్యం ద్వారా గిడుగు సిద్ధాంతా లకు దోహదం చేశారు. వ్యావహారిక భాషోద్యమం సాంఘిక ప్రయో జనాన్ని ఆశించి పుట్టింది. నూటికి 90 మంది విద్యా వంతులైనప్పుడు తప్ప సమాజానికి మేలు కలగదని, అది సాధించాలంటే శాస్త్ర విషయాలన్నీ వాడుక భాషలో రచించినప్పుడే అనుకున్న ప్రయోజనం సాధించగలమని గిడుగు చెప్పారు. ఇప్పటి సమా జంలో గ్రాంథిక భాష లేదు. అంతటా, అన్నిటా, జీవ ద్భాషే. రచయితలు తమదైన భాషలో చక్కగా భావ వ్యక్తీకరణ చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే గిడుగు వారి కల నెరవేరినట్లే. కానీ, నేడు విద్యా రంగంలో తెలుగు భాషకున్న పరిస్థితేమిటి? విద్యార్థులు తెలు గులో తమ భావాలను చక్కగా వ్యక్తం చేయలేకపోతు న్నారు. అక్షరదోషాలు లేకుండా నాలుగు వాక్యాలు గట్టిగా రాయలేకపోతున్నారు. గిడుగు వారి కృషి ఫలి తాన్ని మనం కలకాలం నిలుపుకోవాలంటే, ఇప్పుడు కూడా విద్యా రంగంలో తెలుగు ఉనికిని కాపాడుకోవ టానికి మరో ఉద్యమం రావలసి ఉంది. (నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా) చెంగల్వ రామలక్ష్మి, లెక్చరర్, విజయవాడ మొబైల్ : 94906 96950 -
మళ్లీ రిలీజ్ కానున్న నాటి సంచలనం
బొమ్మనహళ్లి: అలనాటి సూపర్ హిట్ సినిమా ‘నాగరహావు’ నేటి డిజిటల్ ధ్వని, కొంగొత్త హంగులతో ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో శోభన్‌బాబు, లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ చిత్రానికి మాతృక అయిన ఈ కన్నడ సినిమా సరిగ్గా 46 ఏళ్ల కిందట విడుదలై అనేక రికార్డులను తిరగ రాయడమే కాకుండా అవార్డుల పంట పండించింది. ఈ ఒక్క సినిమాతోనే హీరో విష్ణువర్ధన్ నటుడుగా భారీ బ్రేక్ సాధించి అగ్రనటుడు డాక్టర్ రాజ్ కుమార్ సరసన స్థానాన్ని సైతం సంపాదించాడు. చిత్ర నిర్మాత తనయుని తపనతో... ఈ చిత్ర నిర్మాత ఎన్.వీరాస్వామి కుమారుడు బాలాజీ ఆలోచనతో సినిమా మరోసారి రూపుదిద్దుకుంది. కొత్త టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తిరిగి రూపొందిస్తే ఎలాగుంటుందని తన సోదరుడైన నటుడు రవిచంద్రన్‌ను అడిగానని, ఆయన తనను ప్రోత్సహిస్తూ, వెంటనే పనిని ప్రారంభించమన్నారని బాలాజీ తెలిపారు. ఈ చిత్రానికి కొత్త హంగులను దిద్దాలనుకున్నప్పుడు ప్రింట్లు మాత్రమే దొరికాయని, చెప్పారు. వెతగ్గా వెతగ్గా చెన్నైలోని జెమిని ల్యాబ్స్‌లో నెగటివ్ లభ్యమైందని తెలిపారు. కొత్త హంగులను సమకూర్చడంలో 60 మంది సాంకేతిక నిపుణులు రెండేళ్ల పాటు శ్రమించారని చెప్పారు. మొత్తానికి ఈ నాగరహావు విభిన్న దృశ్య అనుభవాన్ని పంచుతుందని చెప్పారు. గత నెలలో యూట్యూబ్‌లో టీజర్‌ను విడుదల చేయగా ఇప్పటికి 11 లక్షల మందికి పైగా వీక్షించారు. అప్పట్లో నాగరహావును 35 ఎంఎంలో విడుదల చేయగా, ఇప్పుడు సినిమా స్కోప్‌లో విడుదల కానుంది. 1972లో సంచలనం 1972లో విడుదలైన ఈ చిత్రం విష్ణువర్ధన్‌కు సూపర్ స్టార్‌డమ్‌ను తెచ్చింది. అప్పటి వరకు రంగ స్థల, కళా చిత్రాల నటుడుగా మాత్రమే పరిచయమైన విష్ణువర్ధన్‌కు ఈ సినిమాలో హీరోగా అవకాశం లభించింది. ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు పుట్టన్న కనగాల్ అప్పట్లో కళా, వాణిజ్య చిత్రాల వారధిగా వ్యవహరిస్తున్నారు. విష్ణువర్ధన్నే కాదు ఈ చిత్రంలో ఆయన అంబరీశ్‌ను కూడా పరిచయం చేశారు. ఇక ఆ సినిమాలో చామయ్య మాస్టారుగా నటించిన కేఎస్. అశ్వత్ పేరు ప్రతి ఇంటా ప్రతి ధ్వనించేది. నటీమణులు ఆరతి, జయంతిలకు కూడా ఈ సినిమా ఎంతో పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలోని పాటలు ఈనాటికీ సూపర్ హిట్ అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఈ సినిమాను హిందీలో జహ్రీలా ఇన్సాన్, తమిళంలో రాజ నాగం పేరిట రీమేక్ చేశారు. అభిమానులకు పండుగే నాగరహావు చిత్రం ఓ కళా ఖండం. దీనిని పునః సృష్టించారు. విష్ణువర్ధన్ అభిమానులకు కచ్చితంగా ఇది పండుగ సీజనే. ఈ సినిమా రజతోత్సవాన్ని జరుపుకుంటుందనే విశ్వాసం నాకుంది. – భారతి, అలనాటి హీరోయిన్, విష్ణువర్ధన్ సతీమణి ఓబవ్వ పాత్రను సవాల్‌గా తీసుకున్నా ఈ సినిమాలో ఓబవ్వ పాత్రను తొలుత కల్పనకు ఇవ్వజూపారు. చిన్న పాత్ర అనే కారణంతో ఆమె తిరస్కరించింది. అనంతరం పుట్టన్న నన్ను అడిగారు. దీనినో సవాలుగా భావించి నేను ఒప్పుకున్నాను. శత్రు సేనలను తుదముట్టించే వీర నారిగా ఓబవ్వను వర్ణిస్తూ రాసిన పాట పుట్టన్న ఊహల్లోంచి పుట్టింది. ఈ పాటను విన్నప్పుడల్లా నాకు కొత్త గీతంగానే అనిపిస్తూ ఉంటుంది. – జయంతి, అలనాటి నటి, ఓబవ్వ పాత్రధారి -
నిత్యస్ఫూర్తి.. చెదరని కీర్తి
ఆయన మట్టిని ప్రేమించారు. మట్టిని నమ్ముకున్న మనుషుల్ని ప్రేమించారు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న శ్రమజీవులపై కరుణ కురిపించారు. రాజ్యాంగం సాక్షిగా చేసిన ప్రమాణాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తూ.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించారు. వారి కష్టాల్లో తోడై నిలిచారు. దిక్కు లేనివారికి ఆసరా ఇచ్చారు. ఎటువంటి వివక్షా చూపకుండా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు పంచడానికి అనుక్షణం పరితపించారు. అందుకే ఆయన అందరికీ నిత్యస్ఫూర్తి అయ్యారు. చెదరని కీర్తితో జనం గుండెల్లో మహానేతగా నిలిచారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాను బహుముఖంగా అభివృద్ధి చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. వ్యవసాయాధారితమైన జిల్లాలో ఆ రంగాన్నే నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు ఎంతో చేయూతనిచ్చారు. సాగునీటి వసతుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వివిధ సంక్షేమ పథకాలతో జిల్లావాసులగుండెల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. సాగునీటి రంగ అభివృద్ధికి.. జిల్లాలో సాగునీటి రంగ అభివృద్ధికి వైఎస్సార్ హయాంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. డెల్టాలో ఆయకట్టు స్థిరీకరణకు, వర్షాధారానికే పరిమితమైన ఏజెన్సీలో రెండు పంటలకు సాగునీరందించేందుకు ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆయన అంకురార్పణ చేశారు. రాష్ట్ర విభజనతో జాతీయ ప్రాజెక్టుగా మారిన పోలవరానికి ఎంతో సాహసం చేసి శ్రీకారం చుట్టింది ఆయనే. డెల్టా ఆధునికీకరణకు.. డెల్టా ఆధునికీకరణకు వైఎస్సార్ రూ.1,710 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,190 కోట్లు పంట కాలు వలకు, రూ.550 కోట్లు మురుగునీటి కాలువల ఆధునికీకరణకు కేటాయించారు. జిల్లాలో 4.80 లక్షల ఎకరాలకు డెల్టా వ్యవస్థ ద్వారా సాగునీరు అందుతోంది. వైఎస్ హయాంలో రూ.650 కోట్లు మంజూరు చేయగా, తర్వాత రూ.150 కోట్లు కలిపి మొత్తం రూ.800 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. వైఎస్ హయాంలో శరవేగంగా సాగిన ఆధునికీకరణ పనులు తర్వాత పడకేశాయి. ప్రాజెక్టుల రూపకర్తగా.. ♦ ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో రూ.138 కోట్ల అంచనాతో 2008 జూన్ 24న జీవో 569 విడుదల చేశారు. మూడు ప్యాకేజీలుగా దీనిని విడదీశారు. ఆయన హయాంలోనే పనులు మొదలు పెట్టారు. ♦ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా 2007లో భూపతిపాలెం ప్రాజెక్టు ఆరంభమైంది. దీని తొలి అంచనా రూ.47.23 కోట్లు కాగా, పూర్తయ్యేనాటికి రూ.160.63 కోట్లకు చేరింది. 21 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వైఎస్సార్ హయాంలోనే దాదాపు పనులు పూర్తయ్యాయి. ♦ ఏజెన్సీలో రెండు పంటలకు సాగునీరందించేందుకుగాను ముసురుమిల్లి ప్రాజెక్టును 2007లో వైఎస్సార్ హయాంలో చేపట్టారు. దీని తొలి అంచనా రూ.207 కోట్లు. 24 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఆయన హయాంలో పనులు శరవేగంగా జరిగాయి. ఆ తర్వాత మందకొడిగా సాగాయి. ఇప్పటివరకూ రూ.54 కోట్లు ఖర్చు పెట్టారు. దీనిలో రూ.50 కోట్లు వైఎస్సార్ హయాంలోనే ఖర్చు చేశారు. గడచిన నాలుగేళ్లలో దీనికి చంద్రబాబు రూ.4 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇంకా 15 శాతం పనులు చేయాల్సి ఉంది. ♦ జిల్లాను సస్యశామలం చేసే పోలవరం ప్రాజెక్టుకు మహానేత శ్రీకారం చుట్టారు. ఐదు జిల్లాల్లో 23 లక్షల ఎకరాల స్థిరీకరణ, కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు, 900 మెగావాట్ల విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో ఈ పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే 70 శాతం పైగా కుడి, ఎడమ కాలువల పనులు జరిగాయి. ♦ గోదావరి నీటిని మెట్ట ప్రాంతానికి తరలించే పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్ రూ.900 కోట్లు కేటాయించారు. 1.45 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పురుషోత్తపట్నం నుంచి తుని వరకూ కాలువ తవ్వారు. శరవేగంగా పనులు పూర్తి చేసి 2008లో అప్పటి యూపీఎ చైర్పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా ఆరంభించారు. వర్షాధారంగా పంటలు పండే ఈ భూముల్లో పుష్కర పుణ్యమా అని నీటి ఎద్దడి లేకుండా పంటలు పండుతున్నాయి. ♦ 16 గ్రామాలకు తాగు, సాగునీరందించే అన్నంపల్లి అక్విడెక్ట్ శిథిలావస్థకు చేరుకుంది. కొత్త అక్విడెక్టుకు మహానేత శంకుస్థాపన చేయడమే కాకుండా నిధులు మంజూరు చేశారు. ♦ 2006లో గోదావరి వరద ఉధృతికి అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం ఊడిమూడిలంకల వద్ద వద్ద ఏటిగట్లు తెగిపడి కోనసీమలో ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. దీనిపై చలించిన వైఎస్సార్ గోదావరి ఏటిగట్లను ఎత్తు, వెడల్పు చేసి, పటిష్టపరిచే పనులకు రూ.586.67 కోట్లు కేటాయించారు. అనంతరం దీనిని రూ.602.528 కోట్లకు పెంచారు. వైఎస్సార్ హయాంలో కీలకమైన పనులు జరిగాయి. రైతులకు అండగా.. ♦ 2008 డిసెంబర్లో రబీ సాగు ఆరంభంలో ఏర్పడిన నీటి ఎద్దడిని నివారించేందుకు మురుగునీటి కాలువపై క్రాస్బండ్లు వేయాలని, గోదావరిలో వృథా పోతున్న నీటిని కాలువలకు మళ్లించాలని, మోటార్లతో నీరు తోడుకున్న రైతులకు డీజిల్ ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం అప్పటికప్పుడు రూ.7 కోట్లు మంజూరు చేశారు. కిన్నెరసాని, సీలేరు నుంచి అదనంగా నీరు తెప్పించారు. ఫలితంగా డెల్టాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా రబీ పంట పండింది. రికార్డు స్థాయిలో ఎకరాకు 50 నుంచి 55 బస్తాల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ♦ కొబ్బరి ఉత్పత్తులపై 4 శాతం పన్ను ఉండేది. ఆ తర్వాత 2 శాతానికి తగ్గింది. కానీ కోనసీమ రైతుల కోరిక మేరకు ఆ 2 శాతం పన్నును కూడా వైఎస్సార్ రద్దు చేశారు. ♦ 2009లో రైతులకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.50 చొప్పున పెంచగా, ఇది చాలదని రైతులు డిమాండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్వింటాల్‌కు రూ.50 చొప్పున బోనస్ ఇచ్చారు. దీనివల్ల జిల్లా రైతులకు రూ.60 కోట్ల వరకూ ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా మహానేత హయాంలోనే వ్యవసాయ రుణాలు మాఫీ చేశారు. సకాలంలో చెల్లించిన, మాఫీ లబ్ధి పొందని రైతులకు రూ.5 వేల ప్రోత్సాహకం అందించారు. సొంతింటి కల నెరవేర్చిన బాంధవుడిగా.. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది. తన హయాంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ పథకాన్ని 2006 ఏప్రిల్ ఒకటో తేదీన కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రిక నుంచే ఆయన ప్రారంభించారు. మునుపెన్నడూ లేనివిధంగా సొంత స్థలాలు లేని పేదల కోసం కోట్ల రూపాయలతో జిల్లావ్యాప్తంగా వందలాది ఎకరాలు సేకరించారు. ఇందిరమ్మ మూడు దశల్లో భాగంగా స్థలాలు మెరక చేసి లబ్ధిదారులకు అప్పగించడంతో పాటు గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇందిరమ్మ మూడు దశల్లోనూ జిల్లావ్యాప్తంగా 2,14,205 ఇళ్లు మంజూరు చేశారు. వీటికోసం రూ.743.26 కోట్లు విడుదల చేశారు. వీటిలో సుమారు 1.96 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో పూర్తయ్యాయి. ప్రాణం పోసిన వైద్యుడిగా.. పేద ప్రజల ఆరోగ్యదాయిని ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో వెలుగు నింపారు. లక్షల కుటుంబాలు అప్పులపాలు కాకుండా అండగా నిలిచారు. 2,74,727 మందికి వైద్యం అందించారు. రూ.604 కోట్ల మేర ఖర్చు పెట్టి ప్రాణం పోశారు. పేదలకు కార్పొరేట్ చదువులందించిన నేతగా.. ధనవంతులే కాదు.. పేదలూ కార్పొరేట్ విద్య పొందాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షా 50 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఎంబీబీఎస్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సులను ఉచితంగా చదివారు. దాదాపు 40 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా ఎదిగారు. ప్రభుత్వ ఉద్యోగులుగా, అధ్యాపకులుగా స్థిరపడ్డారు. మరో 50 వేల మంది వరకూ స్వయం ఉపాధి బాటలో పయనించారు. -
జయంతికి కష్టమొచ్చింది
కాశీబుగ్గ: జిల్లాలో ఏనుగుల తరలింపునకు ఆపరేషన్ గజేంద్ర జరుగుతోంది. ఇందులో పాల్గొన్న శిక్షణ ఏనుగుల్లో ఒకటి జయంతికి కష్టమొచ్చింది. గత కొన్నిరోజులుగా 8 ఏనుగుల గుంపును దారి మళ్లించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు గణేష్(మగ ఏనుగు), జయంతి(ఆడ ఏనుగు) అనే శిక్షణ ఏనుగులను తీసుకొచ్చారు. ఇవి ఏనుగుల గుంపు తరలింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ తరుణంలో జయంతి ఏనుగు కాలికి రాయి గుచ్చుకోవడంతో తీవ్ర నొప్పితో ఇబ్బంది పడుతుంది. కాలు ఉబ్బిపోవడంతో నడవడానికి ఇబ్బందికరంగా మారింది. విశాఖపట్నం నుంచి ప్రత్యేక వైద్యులు వచ్చి వైద్యం అందించారు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం పలాస మండలంలో తర్లాకోట పంచాయతీలో ఆపరేషన్ గజేంద్రలో భాగంగా ఏనుగుల తరలింపు జరుగుతోంది. -
చంద్రబాబు తూట్లు పొడిచారు
ప్రొద్దుటూరు : చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం మైదుకూరు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ భారత జాతి యావత్తుకు ఈ రోజు నిజమైన పండుగ అని అన్నారు. అంబేడ్కర్ చూపిన మార్గంలోనే మనమందరం నడుస్తున్నామని, ఈ జాతికి దిశ, దశ నిర్మించింది ఆయనేనన్నారు. చక్కటి ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసిన ఘనత ఆ మహానుభావుడిదేనని తెలిపారు. మంచి ఆశయాలతో రూపకల్పన చేసిన రాజ్యాంగం నేడు కొన్ని ప్రభుత్వాలు, కొందరి నేతల వల్ల పలుమార్లు మరణిస్తోందన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో జరిగిన రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు అంబేడ్కర్ ఆత్మ ఎన్నో మార్లు ఘోషించి ఉంటుందన్నారు. స్వయంగా చంద్రబాబే ఎస్సీ, ఎస్టీ కులంలో జన్మించాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారంటే అది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మంత్రి ఆది దళితులు అపరిశుభ్రమైన మనుషులని, వారు మారరని మాట్లాడి దళిత జాతిని అవహేళన చేశారన్నారు.ఈ నాయకులకు దళిత ఓట్లు మాత్రం కావాల్సిందేనన్నారు. సింహాసనం ఎక్కడానికి, ఊగడానికి వారి అవసరం మాత్రం ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దళితులు సమాజంలో అభివృద్ధి చెందలేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి జీవితాలు పూర్తిగా మారకపోవడం పట్ల విచారం, బాధను వ్యక్తం చేస్తున్నానన్నారు. నేటికీ దళితులు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీ«ధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఆయిల్‌మిల్ ఖాజా, దాదాపీర్, జాఫర్, రఫి, సోములవారిపల్లె శేఖర్, ఎంపీటీసీ సభ్యుడు ఓబుళరెడ్డి, వెల్లాల భాస్కర్, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మల్లికార్జున ప్రసాద్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, జింకా విజయలక్ష్మి, రాచంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ శివకుమార్ యాదవ్ పాల్గొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తూ పరాయి పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బు పెట్టి కొనుగోలు చేయడంతోపాటు వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులకు అంబేడ్కర్ లాంటి గొప్ప నేతల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అర్హులకు దక్కాల్సి ఉందన్నారు. ఇది రాజ్యాంగ హక్కు అని తెలిపారు. అయితే చంద్రబాబు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి అర్హులను పక్కనపెట్టి అనర్హులకు లబ్ధి చేకూర్చుతున్నారని విమర్శించారు. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం రూ.కోట్లు ఖర్చు చేసి ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వరుసగా అనేక చోట్ల దళితులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జానకి పేట గ్రామంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలిచారని టీడీపీ నేతలు దళితులను చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. తాజాగా కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో పారిశుద్ధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడినా ప్రభుత్వం మాత్రం కేసులు నమోదు చేయలేదన్నారు. -
అంబేడ్కర్ స్ఫూర్తితో హోదా పోరాటం
గుంతకల్లు టౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ పోరాట స్పూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. ఏపీకి హో దాను కాంక్షిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారానికి 8వ రోజుకు చేరుకున్నాయి. మండలంలోని పాతకొత్తచెరువు, సంగాల, దోసలుడికి గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్యనాయకులు శివశంకర్, సంజప్ప, శివరామిరెడ్డి, సుధీర్, సుంకప్ప, కుమార్‌స్వామి, ఎంపిటీసీ మల్లికార్జున, రంగన్న, మోహన్, వై.నగేష్, కుబేంద్ర, సుధాకర్, బ్రహ్మయ్య, జనార్ధన్, రంగస్వామి, ఎ.మల్లికార్జున, లక్ష్మీనారాయణ, వై.నాగప్ప, సుంకన్న, లాల్‌రెడ్డి, నెట్టికంటయ్య, ఎర్రిస్వామి, శ్రీనివాసులు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వెంకటరామిరెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించండి
డోన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిందని వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి విన్నవించారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరి పోలీసుస్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్టీయూ రాష్ట్రమాజీ అధ్యక్షుడు షన్మూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష నాయకుల సమావేశం... ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని అఖిలపక్షపార్టీ నేతలు ప్రజలను కోరారు. స్థానిక ఎన్జీవోస్ హోంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రఫీ, శీను, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, కాంగ్రెస్ నేతలు ఓంప్రకాశ్, రవి, సీపీఐ నేతలు నక్కిశ్రీకాంత్, మోటారాముడు, శివప్రసాద్, సీపీఎం నాయకులు మద్దయ్య, రామాంజనేయులు, శివరాం, మహిళా సమాఖ్య నాయకురాల్లు సుగుణమ్మ, రహమ్మద్ బీ, మణి, జులేఖ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్‌సీపీతోనే హోదా సాధ్యం
మంత్రాలయం రూరల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని పార్టీ మండల అధ్యక్షుడు జి.భీమిరెడ్డి అన్నారు. హోదా సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజు శనివారం కొనసాగాయి. శనివారం నాటి దీక్షలో మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన దాసు, హనుమంతు, లక్ష్మయ్య, గోపీనాథ్, సత్తిరెడ్డి, మునెప్ప, నాగరాజు, వెంకోబా, సురేష్, వీరనాగుడు, అయ్పప్ప, రామాంజినేయులు, రామయ్య, తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజుతో పాటు మరి కొంత మంది కార్యకర్తలు కూర్చున్నారు. ముందుగా రాఘవేంద్రసర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాఘవేంద్రసర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శిబిరం చేరుకొని దీక్షపరులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనన్నారు. సాయంత్రం ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీఏ వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ టి.భీమయ్య, నాయకులు అశోక్‌రెడ్డి, జయరాము, ప్రహ్లాదయ్య శెట్టి, బద్రినాథ్‌శెట్టి, దామోదర్ శెట్టి, వెంకటేష్ శెట్టి, మారెప్ప ఉన్నారు. -
కోలుకున్న నటి జయంతి
సాక్షి, బెంగళూరు: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బహుభాష సీనియర్ నటి జయంతి శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం జయంతికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గతనెలలో శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ నటి జయంతి నగరంలోని విక్రమ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితి కాస్తా సీరియస్‌గా ఉండడంతో ఐసీయూలో ఉంచి వైద్యులు జయంతికి చికిత్సలు అందించారు. 12 రోజులుగా ఆమె విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్యుల చికిత్సకు జయంతి బాగా స్పందించి త్వరగా కోలుకున్నారు. దీంతో ఆమెను విక్రమ్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, విక్రమ్ ఆస్పత్రి వైద్యులు తనను చాలా చక్కగా చూసుకున్నారని చెప్పారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యంపై ఇతర భాషల్లో ఏవేవో అబద్ధ వార్తలు ప్రచురించారని, ప్రసారం చేశారని.. కానీ కన్నడ మీడియా మాత్రం సంయమనంతో పాటు జవాబుదారిగా వ్యవహరించి ఎలాంటి అవాస్తవాలను ప్రచారం, ప్రసారం చేయలేదని పేర్కొన్నారు. కన్నడ మీడియాకు తన ధన్యవాదాలని తెలిపారు. -
నటి జయంతికి సీఎం పరామర్శ
సాక్షి, బెంగళూరు:కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం సీనియర్ నటి జయంతిని పరామర్శించారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ కొద్ది రోజుల క్రితం నగరంలోని విక్రమ్ ఆస్పత్రిలో చేరిన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్పత్రికి చేరుకుని నటి జయంతిని పరామర్శించారు. ఆమెతో చాలాసేపు ముచ్చటించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను పరామర్శించిన అనంతరం సీఎం మైసూరు బయలుదేరారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు, త్వరలో వెంటిలేటర్‌కు తీసివేస్తామని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ కేఎస్ సతీష్ మీడియాకు తెలిపారు. -
నిలకడగా నటి జయంతి ఆరోగ్యం
యశవంతపుర (బెంగళూరు): బహుభాషా నటి జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు చికిత్స అందిస్తున్న విక్రం ఆస్పత్రి వైద్యులు సతీశ్, విజయ చెప్పారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. వారు బుధవారం జయంతి తనయుడు కృష్ణకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో వెంటిలేటర్ తొలగించి ఆమెను సాధారణ వార్డుకు బదిలీ చేస్తామని తెలిపారు. -
నటి జయంతి ఆరోగ్యంపై గందరగోళం
సాక్షి, బెంగళూరు : అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటి జయంతి క్రమంగా కోలుకుంటున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరూ నమ్మద్దని ఆమె కుమారుడు కృష్ణకుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జయంతి చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... సోషల్ మీడియాలో జయంతి మరణించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ వార్తలను ఎవరు నమ్మవద్దని అన్నారు. అయితే ఆమె మరణించినట్లు కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. వాటిని ఆయన తోసిపుచ్చారు. దీంతో ఆమె ఆరోగ్యంపై గందరగోళం నెలకొంది. 1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు. -
సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత
దశాబ్ధాల పాటు వెండితెర మీద ఎన్నో అద్భుతపాత్రల్లో నటించిన మెప్పించిన అలనాటి నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బెంగళూరులో ఉంటున్న ఆమె కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో బంధువులు బెంగళూరులోని సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పూర్తి చికిత్సకు తగిన ఏర్పాట్లు లేకపోవటంతో వైధ్యుల సూచన మేరకు విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం జయంతికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. 1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు. -
ప్రముఖ సినీ నటి జయంతికి తీవ్ర అస్వస్థత
-
మావోయిస్టుల అడ్డాలో మహిళా రిపోర్టర్!
అదొక మారుమూల గిరిజన ప్రాంతం. అరకొరా వసతులు ఉండే ఈ ప్రాంతంలో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. చదువు, పుస్తకాలు ఇవేమీ వారికి తెలియవు. కానీ బురుడ జయంతి మాత్రం ఇలాంటి అననుకూల పరిస్థితులన్నింటినీ అధిగమించింది.అతికష్టంమీద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. కేవలం గ్రాడ్యుయేషన్‌తోనే ఆగిపోలేదు. జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని, తనలాంటి తనలాగే మరో పది మంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. ఒడిశాలోని అత్యంత నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరి గిరిజన సమాజంలో తొలి మహిళా జర్నలిస్టుగా అందరి మన్ననలు పొందుతోంది. తన గిరిజన సమాజంలో మార్పు కోసం కలంతో పోరాటం చేస్తోంది. ఇంట్లో తొమ్మిదో అమ్మాయి! పది మంది అక్కాచెల్లెళ్లలో జయంతి తొమ్మిదో అమ్మాయి. గిరిజన కోయ తెగలో అసలు అక్షరాస్యతే తక్కువ. అమ్మాయిలు బడికి వెళ్లడమే అరుదు. ఇక చదువుకోవడానికి సదుపాయాలు సంగతి సరేసరి. కానీ జయంతి తండ్రి ఎన్నో కష్టాలకోర్చి పిల్లల్ని చదివించారు. జయంతి పట్టుదలగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ ఆమె లక్ష్యం కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం కాదు. జర్నలిస్టు కావాలని కలలు కంది. తద్వారా తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటూ, వెనకబడి వున్న తన గిరిజన సమాజంలో మార్పు తీసుకురావాలని భావించింది. పట్టు పట్టి కలం పట్టింది జర్నలిస్టు కావాలన్న తన కలను సాకారం చేసుకోవటానికి ఎన్నో కష్టాలు పడింది జయంతి. ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చింది కానీ, ఇంటికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీకి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న వ్యవహారం. హాస్టల్లో ఉండి చదువుకునే ఆర్థికస్తోమతా లేదు. ఆ సమయంలో, తన స్నేహితురాలు ఆమెకు అండగా నిలిచింది. తన బంధువు ఇంట్లో ఉండి చదువుకునేలా అవకాశం కల్పించింది. అలా జయంతి జర్నలిజం కోర్సు పూర్తి చేసింది. చదువు అయిపోగానే ఇంటర్న్‌షిప్ కోసం జయంతి భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు. ఆమె ప్రతిభను, ఉత్సాహాన్ని, తాపత్రయాన్ని గమనించిన సినీ నిర్మాత బిరేన్ దాస్, జయంతికి గైడెన్స్ ఇచ్చారు. జర్నలిజంలోనూ లింగ వివక్ష ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి, ప్రధాన మీడియాలోకి ప్రవేశించింది జయంతి. ప్రస్తుతం ‘కళింగ’ టీవీలో పనిచేస్తోంది. తన గిరిజన కమ్యూనిటీ మల్కన్‌గిరిలోనే రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జయంతి కల నెరవేరినప్పటికీ, నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరిలో కేవలం ఒకే ఒక్క మహిళ రిపోర్టింగ్ చేయడం ఆమెకు సవాల్‌గానే మారింది. అక్కడ కూడా లింగ వివక్ష ఎదురైంది. తన పురుష సహోద్యోగులు జయంతిని వెనక్కి లాగడానికి, భయపెట్టడానికి ఎన్నో పథకాలు వేసేవారు. ప్రతి అడుగును తను సవాల్‌గా తీసుకునేది. పురుష జర్నలిస్ట్‌లకు పోటీగా రాణించడం ప్రారంభించింది. పోలీసుల వేధింపులు వీటన్నింటికీ మించి ఆమెకెదురైన మరో పెద్ద సవాల్ పోలీసు వేధింపులు! ఒక కోయ తెగకు చెందిన అమ్మాయి విద్యాధికురాలిగా ఉండటం, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెపై మావోయిస్టు ముద్ర వేశారు. ఈ క్రమంలో పలురకాల వేధింపులు ఆమెకు తప్పలేదు.ఆ వేధింపులను కూడా జయంతి ధైర్యంగా ఎదుర్కొంది. ఎక్కడా కూడా తాను తలొగ్గలేదు. జయంతి సాహసానికి పోలీసులు సైతం వెనుకంజ వేయాల్సి వచ్చింది. జయంతి కేవలం జర్నలిస్టుగా మాత్రమే కాక, గిరిజన సమాజంలోని బాలికలు చదువుకునేందుకు ఒక ఎన్జీవో సైతం నిర్వహిస్తోంది. ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద అవకాశాలే ఆమె ముందు వచ్చి వాలినప్పటికీ, తాను మాత్రం తన గిరిజన కమ్యూనిటీలోనే సేవలందిస్తోంది. ఒకవేళ తను కనుక ఇక్కడ పనిచేయకపోతే, తన చదువుకు సార్థకమే లేదని అంటోంది జయంతి. – కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్ -
లక్ష్యాధికారులు
ప్రపంచంలో లక్షాధికారులు చాలామందే ఉంటారు. లక్షల సంపద పోగేసుకున్న వారు కాదు, చెక్కుచెదరని లక్ష్యశుద్ధి ఉన్నవారు మాత్రమే ప్రజలకు మార్గదర్శకులు కాగలరు. అలాంటి వారే లక్ష్యాధికారులు అవుతారు. ప్రజల మీద అపారమైన ప్రేమతో, పీడన నుంచి, దోపిడీ నుంచి ప్రజలను విముక్తం చేయాలనే ఉన్నత లక్ష్యంతో పోరాటం సాగించిన ధీరోదాత్తులు మాత్రమే చరిత్రలో వీరులుగా నిలిచిపోతారు. అలాంటి వీరులనే ప్రజలు మనస్ఫూర్తిగా మననం చేసుకుంటారు. ఛత్రపతి శివాజీ జయంతి (ఫిబ్రవరి 19) సందర్భంగా కొందరు వీరుల గురించి సంక్షిప్తంగా... ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ. శివాజీ తండ్రి షాహాజీ ఒక సేనాని. బీజాపూర్ రాజ్యంలోని కొన్ని జాగీర్లపై ఆయనకు ఆధిపత్యం ఉండేది. తల్లి జిజియాబాయి చిన్నప్పుడు శివాజీకి రామాయణ, మహాభారత కథలు, వీరుల గాథలు చెప్పేది. శివాజీపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. సుల్తానుల పాలన నుంచి మరాఠా ప్రజలను విముక్తం చేయాలనే లక్ష్యంతో పోరాటం సాగించి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరాఠాలను ఏకం చేసి బీజాపూర్ సుల్తాను అదిల్షాహీ సేనలతో పలుమార్లు యుద్ధాలు చేశాడు. బీజాపూర్ రాజ్యంలోని భూభాగాన్ని చాలావరకు కైవసం చేసుకుని, 1674లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరాఠా రాజ్యానికి మొఘల్‌ల నుంచి ముప్పు ఉండటంతో ఔరంగజేబు హయాంలోని మొఘల్ సేనలతో కడవరకు పోరాటం సాగిస్తూనే వచ్చాడు. మహారాణా ప్రతాప్ ఉత్తర భారతదేశంలోని చాలా భాగం బలమైన మొఘల్ సామ్రాజ్యం పరిధిలో ఉన్న కాలంలో మేవార్ రాజ్యాన్ని ఏలిన రాజపుత్రుడు మహారాణా ప్రతాప్. మొఘల్ చక్రవర్తి అక్బర్‌ను ఎదిరించిన ఏకైక వీరుడు. అప్పట్లో గుజరాత్ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యం పరిధిలో ఉండేది. మేవార్ మీదుగా గుజరాత్‌కు దగ్గరి రహదారిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి అక్బర్ చక్రవర్తి చాలా ప్రయత్నాలే చేశాడు. అక్బర్ సేనలు మేవార్ తూర్పు భూభాగాన్ని కొంతవరకు ఆక్రమించుకున్నా, దుర్గమారణ్యాలతో నిండిన పడమటి ప్రాంతాన్ని మాత్రం ఆక్రమించుకోలేకపోయాయి. రాణి దుర్గావతి సామ్రాజ్య విస్తరణ కాంక్షతో దురాక్రమణకు తెగబడ్డ మొఘల్ సేనలను తరిమికొట్టిన వీరవనిత రాణి దుర్గావతి. చందేల్ యువరాణి అయిన దుర్గావతి గోండు రాకుమారుడు దల్పత్షాను పెళ్లాడింది. కొంత కాలానికి వారికి కొడుకు వీర్ నారాయణ్ పుట్టాడు. తర్వాత ఐదేళ్లకే దల్పత్షా మరణించడంతో దుర్గావతి రాజ్యభారాన్ని స్వీకరించింది. మాల్వా రాజు బాజ్ బహదూర్ గోండు రాజ్యంపై యుద్ధానికి దిగి దుర్గావతి సేనల చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన రీతిలో బయటపడ్డాడు. ఆ తర్వాత మొఘల్ సేనలు బాజ్ బహదూర్‌ను ఓడించడంతో మాల్వా రాజ్యం మొఘల్ అధీనంలోకి వచ్చింది. మాల్వా సరిహద్దుల్లోనే ఉన్న గోండు రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు మొఘల్ సేనలు దండెత్తినప్పుడు రాణి దుర్గావతి యుద్ధరంగంలోకి దిగి, ఒక దశలో వారిని తరిమి కొట్టింది. మొక్కవోని ధైర్యంతో పోరాటం కొనసాగించింది. చివరకు ఓటమి అనివార్యమవడంతో యుద్ధరంగంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మాహుతి చేసుకుంది. రాణి చెన్నమ్మ సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారిని ఎదిరించిన వీర వనిత కిట్టూరు రాణి చెన్నమ్మ. తన సొంత రాజ్యానికి రాణి అయింది. దేశాయ్ వంశానికి చెందిన రాజా మల్లసర్జను పెళ్లాడింది. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల్లో శిక్షణ పొందింది. రాజా మల్లసర్జ, రాణి చెన్నమ్మ దంపతులకు ఒక కొడుకు పుట్టి చనిపోవడంతో శివలింగప్ప అనే బాలుడిని దత్తత తీసుకుని, అతడిని సింహాసనానికి వారసుడిగా ప్రకటించింది. శివలింగప్ప రాజ్యాధికారం చేపట్టడానికి వీల్లేదంటూ అప్పటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అభ్యంతరపెడుతూ జారీ చేసిన ఆదేశాలను చెన్నమ్మ పట్టించుకోలేదు. ఆగ్రహించిన బ్రిటిష్ బలగాలు కిట్టూరు ఖజానాను స్వాధీనం చేసుకోవడానికి దాడికి తెగబడ్డాయి. రాణి చెన్నమ్మ వీరోచితంగా బ్రిటిష్ సేనలను ఎదిరించింది. తొలి విడత పోరులో బ్రిటిష్ సేనలు భారీనష్టాన్ని చవిచూశాయి. యుద్ధంలో బ్రిటిష్ కలెక్టర్, రాజకీయ ప్రతినిధి సెయింట్ జాన్ థాకరే మరణించాడు.రెండో విడత పోరులో సబ్‌కలెక్టర్ మన్రో మరణించాడు. రాణి చెన్నమ్మ వీరోచిత పోరాటం సాగించినప్పటికీ, బ్రిటిష్ బలగాలు ఆమెను పట్టి బంధించి, కోటలోనే బందీ చేశాయి. ఆమె ఆ కోటలోనే ప్రాణాలు విడిచింది. రాణి లక్ష్మీబాయి 1857 నాటి మొదటి స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ సేనలను ఎదిరించిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆమె అసలు పేరు మణికర్ణిక. వారణాసిలో పుట్టింది. ఝాన్సీ రాజు గంగాధరరావును పెళ్లాడటంతో అప్పటి సంప్రదాయం ప్రకారం లక్ష్మీబాయిగా పేరు మార్చుకుంది. పెళ్లయిన పదకొండేళ్లకే భర్త మరణించడంతో రాజ్యభారం స్వీకరించింది. అప్పటికి దత్తపుత్రుడు ఇంకా పసివాడే. లక్ష్మీబాయి భర్త మరణం తర్వాత నాటి బ్రిటిష్ ప్రభుత్వం రాణి అధికారాన్ని గుర్తించ నిరాకరించింది. ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి సేనలను పంపింది. వీరోచిత పోరాటం సాగించిన లక్ష్మీబాయి దత్తపుత్రుడితో సహా కోటను వీడి రాణి మహల్‌కు చేరుకుంది. అక్కడకు వచ్చిన బ్రిటిష్ దూతతో ఝాన్సీని వదులుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. బ్రిటిష్ సేనలతో జరిగిన యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందింది. వేలు నాచియార్ బ్రిటిష్ వారిని యుద్ధరంగంలో ఎదిరించడమే కాదు, వారిపై విజయం కూడా సాధించిన తొలి వీరనారి వేలు నాచియార్. ఆమె రామ నాథపురం యువరాణి. శివగంగై రాజు ముత్తువడుగణతపెరియ ఉదయదేవర్ను పెళ్లాడింది. వారికి వెల్లాచ్చి అనే కుమార్తె కలిగింది. ఆర్కాట్ నవాబు సేనలు, బ్రిటిష్ సేనలతో జరిగిన యుద్ధంలో నాచియార్ భర్త ఉదయదేవర్ వీరమరణం చెందాడు. భర్త మరణంతో నాచియార్ తన కుమార్తెను తీసుకుని కోట వదిలి దిండిగల్ చేరుకుని, అక్కడే ఎనిమిదేళ్లు అజ్ఞాతంలో గడిపింది. అజ్ఞాతంలో ఉంటూనే సైనిక శక్తిని పోగు చేసుకుంది. దిండిగల్ పాలకుడు గోపాల నాయకర్, హైదర్ అలీల సైనిక సహకారంతో 1780లో బ్రిటిష్ వారిపై యుద్ధానికి దిగింది. వేలు నాచియార్‌కు విశ్వసనీయురాలైన కుయిలి బ్రిటిష్ ఆయుధాగారంపై ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో బ్రిటిష్ బలగాలు బెంబేలెత్తిపోయాయి. యుద్ధంలో గెలుపొందిన వేలు నాచియార్ తిరిగి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. నాచియార్ తర్వాత ఆమె కుమార్తె వెల్లాచ్చి శివగంగై రాజ్య బాధ్యతలు చేపట్టింది. కన్నెగంటి హనుమంతు ‘నీరు పెట్టావా, నారు వేశావా, కోత కోశావా, కుప్ప నూర్చావా... ఎందుకు కట్టాలిరా శిస్తు?’ అంటూ బ్రిటిష్ వారి దాష్టీకాలపై గర్జించిన తెలుగు వీరుడు కన్నెగంటి హనుమంతు. బ్రిటిష్ పాలకులు ప్రజల ముక్కుపిండి అన్యాయంగా పన్నులు వసూలు చేయడానికి వ్యతిరేకంగా తిరగబడ్డ కన్నెగంటి హనుమంతు పల్నాడు ప్రాంతంలోని మించాలపాడు గ్రామంలో పుట్టాడు. జనాన్ని కూడగట్టుకుని బ్రిటిష్ వారిపై తిరగబడ్డ హనుమంతు పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. హనుమంతు మరణంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహం పల్నాడు తిరుగుబాటుకు దారితీసింది. తిరోత్ సింగ్ బ్రిటిష్ వారిపై తొలి స్వాతంత్య్ర పోరాటానికి ముందే వారిని ఎదిరించిన గిరిజన నాయకుడు తిరోత్ సింగ్. బ్రహ్మపుత్ర లోయ ప్రాంతంలో ఖాసీ తెగకు చెందిన తిరోత్ సింగ్ తన ప్రాంత ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరు సాగించాడు. బ్రిటిష్ వారు తుపాకులు, ఫిరంగులతో యుద్ధానికి దిగితే, తిరోత్ సింగ్ నాయకత్వంలో ఖాసీలు సంప్రదాయ ఆయుధాలతోనే వారిని ఎదిరించారు. తూటా గాయాలకు గురైన తిరోత్ సింగ్ ఒక గుహలో తలదాచుకున్నాడు. ఒక నమ్మకద్రోహి కారణంగా బ్రిటిష్ వారికి బందీగా చిక్కాడు. అతడిని ఢాకాకు తరలించగా, అక్కడే 1835 జూలై 17న కన్నుమూశాడు. బిర్సా ముండా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గిరిజన యోధుడు బిర్సా ముండా. ‘అబువా రాజ్ సెతెర్ జానా, మహారాణి రాజ్ తుండు జానా’ (ఇప్పుడిక మన రాజ్యం రావాల్సిందే... మహారాణి రాజ్యం అంతం కావాల్సిందే) నినాదంతో గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చి, తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. చక్రధర్పూర్ సమీపంలోని అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటిష్ బలగాలు బిర్సా ముండాను నిర్బంధంలోకి తీసుకుని, రాంచీ జైలుకు తరలించాయి. అక్కడే అతడు 1900 జూన్ 9న అనుమానాస్పదంగా మరణించాడు. ఖుదీరామ్ బోస్ స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడు ఖుదీరామ్ బోస్. బెంగాల్ ప్రెసిడెన్సీ చీఫ్ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ను హతమార్చడానికి ముజఫర్‌పూర్‌లో చేసిన ప్రయత్నం కూడా విఫలం కావడంతో కాలిబాటన తప్పించుకుని పారిపోతూ వైని స్టేషన్ వద్ద పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద రెండు రివాల్వర్లు, తూటాలు బయటపడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం అతడికి ఉరిశిక్ష విధించింది. అప్పటికి అతడి వయసు పద్దెనిమిదేళ్లు మాత్రమే. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. స్వాతంత్య్రం సాధించడానికి సాయుధ పోరాటమే మార్గమని నమ్మి, కడవరకు పోరాటం సాగించాడు. గిరిజనులను ఏకం చేసి, వారిని పోరుబాట పట్టించాడు. అప్పటి స్పెషల్ కమిషనర్ రూథర్‌ఫర్డ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ బలగాలు సీతారామరాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలు పెట్టారు. చివరకు ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టి ఆయనను నిర్బంధించారు. తర్వాత ఎలాంటి విచారణ లేకుండా చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. బేగమ్ హజ్రత్ మహల్ సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరనారీమణులలో ఒకరు బేగమ్ హజ్రత్ మహల్. బ్రిటిష్ సేనలు 1856లో అవ«ద్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడంతో రాజు వజీద్ అలీ షా కలకత్తాకు చేరుకుని, అక్కడ ప్రవాస జీవితం గడపసాగాడు. అయితే, రాణి హజ్రత్ మహల్ రాజ్యభారాన్ని తన చేతుల్లోకి తీసుకుని, బ్రిటిష్ బలగాలను తిప్పికొట్టి, తన కొడుకు బిర్జిస్ ఖద్రాను అవ«ద్ పాలకుడిగా ప్రకటించింది. కొంతకాలానికి బ్రిటిష్ సేనలు మరిన్ని బలగాలతో విరుచుకుపడి అవ«ద్‌ను ఆక్రమించుకోవడంతో హజ్రత్ మహల్ నేపాల్‌లో ఆశ్రయం పొంది, శేషజీవితాన్ని అక్కడే ముగించింది. తిరుపూర్ కుమరన్ అహింసా మార్గంలో బ్రిటిష్ వారిపై స్వాతంత్య్ర ఉద్యమాన్ని సాగించి ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు తిరుపూర్ కుమరన్. మద్రాసు ప్రెసిడెన్సీలోని చెన్నిమలైకి చెందిన కుమరన్ దేశబంధు యువజన సంఘాన్ని స్థాపించి యువకులందరినీ ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించాడు. ఒకసారి తిరుపూర్‌లోని నొయ్యల్ నదీ తీరంలో జాతీయ జెండాను చేత పట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తుండగా, బ్రిటిష్ పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాలతో కుమరన్ చేతిలో జెండాను పట్టుకునే ప్రాణాలు విడిచాడు. చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. పోలీసులు కోర్టులో హాజరుపరచినప్పుడు పేరేంటని అడిగిన జడ్జికి తన పేరు ‘ఆజాద్’ అని బదులివ్వడంతో చంద్రశేఖర్ ఆజాద్‌గా ప్రసిద్ధి పొందాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ 1922లో అర్ధంతరంగా నిలిపివేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆజాద్, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి సాయుధ మార్గంలో పోరు సాగించాడు. అలహాబాద్‌లోని ఒక పార్కులో ఉండగా, పోలీసులు చుటుముట్టి కాల్పులు జరిపారు. ఆజాద్ వారిని తన తుపాకితో ఎదిరించి, ముగ్గురు పోలీసులను మట్టుబెట్టాడు. గాయపడిన ఆజాద్, పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. భగత్ సింగ్ సాయుధ మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించి, ధైర్యంగా ఉరిశిక్షను ఎదుర్కొన్న ధీరుడు భగత్ సింగ్. లాలా లజపత్‌రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను అంతం చేయాలనుకున్నాడు. తన సహచరుడు శివరామ్ రాజగురుతో కలసి పొరపాటున జేమ్స్ స్కాట్ అనుకుని జేమ్స్ సాండర్స్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిపై కాల్పులు జరిపాడు. బ్రిటిష్ చట్టాలకు నిరసనగా సెంట్రల్ అసెంబ్లీ సమావేశం కొనసాగుతుండగా, బటుకేశ్వర్ దత్ అనే సహచరుడితో కలసి అసెంబ్లీ హాలులోకి రెండు బాంబులు విసిరాడు. పోలీసులు అక్కడే వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఉరిశిక్ష పడింది. కొమరం భీమ్ బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతంలో ఒకవైపు స్వాతంత్రోద్యమం కొనసాగుతున్న కాలంలో తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరు సాగించిన గిరిజన వీరుడు కొమరం భీమ్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పరిసరాల్లోని గిరిజనులను ఏకం చేసి, గెరిల్లా పద్ధతుల్లో నిజాం సైనికులను ఎదిరించాడు. భీమ్ తండ్రి ఆదివాసీల హక్కులపై ప్రశ్నించిన పాపానికి అతన్ని నిజాం అటవీ అధికారులు హతమార్చారు. ఆ సంఘటన భీమ్‌పై బాగా ప్రభావం చూపింది. యువకుడిగా ఎదిగిన తర్వాత ‘జల్, జంగిల్, జమీన్’ నినాదంతో గిరిజనులను ఏకం చేశాడు. తాలూక్దార్ అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో పోలీసులు తుపాకులతో కాల్పులు జరిపినప్పుడు భీమ్ నాయకత్వంలోని గోండులు విల్లంబులతో వారిని ఎదిరించారు. ఆ పోరాటంలోనే కొమరం భీమ్ అమరుడయ్యాడు. 1857 నాటి వీరులు... వివిధ కాలాల్లో, వివిధ సందర్భాల్లో ప్రజలకు అండగా ఉంటూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరుబాటలో ముందుకు సాగిన వారు చాలామందే ఉన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగినప్పుడు ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో మంగల్ పాండే, బహదూర్ షా, బఖ్త్ ఖాన్, నానా సాహెబ్, తాంతియా తోపే, సురేంద్ర సాయి, మౌల్వీ అహ్మదుల్లా, మౌల్వీ లియాఖత్ అలీ, తుఫ్జల్ హసన్ ఖాన్, మహమ్మద్ ఖాన్, అబ్దుల్ అలీ ఖాన్, ఖాన్ బహదూర్ ఖాన్, ఫిరోజ్ షా, కందర్పేశ్వర సింగ్, రాజా ప్రతాప్ సింగ్, జయ్దయాల్ సింగ్, హర్దయాల్ సింగ్, గజాధర్ సింగ్, కదమ్ సింగ్, కున్వర్ సింగ్, అమర్ సింగ్ వంటి వీరులు ఉన్నారు. వీరందరూ శాయశక్తులా సాయుధ మార్గంలోనే బ్రిటిష్ బలగాలను ఎదిరించారు. పోరుబాటలో సాగిన వారిలో కొందరు యుద్ధక్షేత్రంలో ప్రాణాలు కోల్పోతే, మరికొందరు బ్రిటిష్ సేనలకు చిక్కి మరణశిక్షలకు, జైలు శిక్షలకు గురయ్యారు. ఆధునిక ఆయుధ సంపత్తి, భారీ సైనిక బలగాల సాయంతో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సిపాయిల తిరుగుబాటును, ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన పోరాటాలను అణచివేసింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరికం భారత భూభాగంపై ఆధిపత్యాన్ని కైవసం చేసుకుంది. మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత... మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాతి కాలంలో పూణేలో ఐక్యవర్ధినీ సభను స్థాపించిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే దక్కన్ ప్రాంతంలో విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. ఒక నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల బ్రిటిష్ పోలీసులకు పట్టుబడి జైలు పాలైనా, జైలు నుంచి పారిపోయాడు. అయితే, మళ్లీ పట్టుబడి జైలు పాలయ్యాడు. జైలులోనే ఆమరణ నిరాహారదీక్ష సాగిస్తూ 1883 ఫిబ్రవరి 17న ప్రాణాలు విడిచాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమం అప్పటి ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపింది. అదేకాలంలో బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టడానికి సాయుధ మార్గమే సరైనదని తలచి, విప్లవ సంస్థలను ఏర్పరచి పోరు కొనసాగించిన యోధులు చాలామంది ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం 1905లో బెంగాల్ విభజనకు తెగబడటంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టాలనే ఉద్దేశంతో తూర్పు బెంగాల్లో ప్రమథనాథ్ మిత్రా ‘అనుశీలన్ సమితి’ అనే విప్లవ సంస్థను స్థాపించాడు. అదేకాలంలో కొందరు సాయుధ మార్గంలో ‘గదర్ పార్టీ’ని నెలకొల్పారు. అరబిందొ ఘోష్, ఆయన సోదరుడు బరిన్ ఘోష్ విప్లవమార్గం పట్టారు. బరిన్ ఘోష్ నేతృత్వంలో ‘జుగాంతర్’ సంస్థను స్థాపించిన విప్లవకారులు మొదటి ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి విఫలయత్నాలు చేశారు. చిట్టగాంగ్‌లో విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన సూర్యసేన్ బ్రిటిష్ బలగాలను తిప్పికొట్టి, కొద్దికాలం స్థానిక ప్రభుత్వాన్ని నడిపాడు. తర్వాత పోలీసులకు చిక్కి, ఉరిశిక్షకు బలైపోయాడు. కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాక సుభాష్‌చంద్ర బోస్ ఆజాద్ హిందు ఫౌజ్ స్థాపించి నాటి యువతరంలో పోరాట స్ఫూర్తి రగిల్చారు. ఇలాంటి వీరులు ఎందరెందరో ఉన్నారు. చరిత్రకెక్కిన వారు కొందరైతే, చరిత్రపుటల్లో మరుగునపడిన వారు ఇంకెందరో... -
కలంతోనే కలల పోరాటం
అదొక మారుమూల గిరిజన ప్రాంతం. పట్టణాల ఊసే తెలియదు. అరకొరా వసతులు ఉండే ఈ ప్రాంతంలో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. చదువు, పుస్తకాలు ఇవేమీ వారికి తెలియవు. కానీ జయంతి మాత్రం ఇలాంటి అననుకూల పరిస్థితులన్నింటినీ అధిగమించింది. అతికష్టంమీద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. కేవలం గ్రాడ్యుయేషన్‌తోనే ఆగిపోలేదు.. .తనలాగే మరో పది మంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుంది. ఒడిశాలోని అత్యంత నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి గిరిజన సమాజంలో తొలి మహిళ జర్నలిస్టుగా అందరి మన్ననలు పొందుతోంది. తన గిరిజన సమాజంలో మార్పు కోసం కలంతో పోరాటం చేస్తోంది. పది మంది అక్కాచెల్లెళ్లలో జయంతి ఒకరు. ఆమె నెంబర్ తొమ్మిది. అంటే తొమ్మిదో అమ్మాయి అన్నమాట. గిరిజన కోయ తెగలో అసలు అక్షరాస్యతే తక్కువ. అమ్మాయిలు బడికి వెళ్లడమే అరుదు. ఇక చదువుకోవడానికి సదుపాయాలు సంగతి సరేసరి. కానీ జయంతి తండ్రి అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించారు. తన ఆడబిడ్డలు చదువుకోవాలని నిర్ణయించారు. అందుకే తన సంతానంలో ఐదుగురిని ఎన్నో కష్టాలకోర్చి బడిబాట పట్టించారు. తండ్రి ఇచ్చిన సహకారాన్ని, ప్రోత్సహాన్ని అందిపుచ్చుకున్న జయంతి పట్టుదలగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ ఆమె లక్ష్యం కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం కాదు. జర్నలిస్టు కావాలని కలలు కంది. తద్వారా తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటూ, వెనకడి వున్న తన గిరిజన సమాజంలో మార్పు తీసుకురావాలని భావించింది. అయితే అనుకున్న కలను సాకారం చేసుకోవటానికి ఎన్నో కష్టాలు పడింది. ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చింది కానీ తన ఇంటికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్శిటీకి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న వ్యవహారం. హాస్టల్ లో ఉండి చదువుకునే ఆర్థిక స్థోమతా లేదు. హాస్టల్లో ఉండి ఎలా చదువుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో, తన స్నేహితురాలు ఆమెకు అండగా నిలిచింది. తన బంధువు ఇంట్లో ఉండి చదువుకునేలా అవకాశం కల్పించింది. అలా జయంతి జర్నలిజం కోర్సు పూర్తి చేసింది. అనంతరం చదువు అయిపోగానే తన ఇంటర్న్‌షిప్ కోసం భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చింది. కానీ మళ్లీ ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చాయి. ఆమె ప్రతిభను, ఉత్సాహాన్ని, తాపత్రయాన్ని గమనించిన సినీ నిర్మాత బిరేన్ దాస్, జయంతికి గైడెన్స్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోనే జయంతి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి, ప్రధాన మీడియాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కళింగ టీవీలో ఆమె పనిచేస్తోంది. తన గిరిజన కమ్యూనిటీ మల్కాన్గిరీలోనే రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జయంతి కల నెరవేరినప్పటికీ, నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కాన్గిరీలో కేవలం ఒకే ఒక్క మహిళ రిపోర్టింగ్ చేయడం ఆమెకు సవాల్‌గానే మారింది. అక్కడ కూడా లింగ వివక్ష ఎదురైంది. తన పురుష కొలీగ్స్ జయంతిని వెనక్కి లాగడానికి, భయపెట్టడానికి ఎన్నో ప్లాన్స్ వేసేవారు. ప్రతి అడుగును తను సవాల్‌గా తీసుకునేది. పురుష జర్నలిస్ట్‌లకు పోటీగా రాణించడం ప్రారంభించింది. వీటిన్నింటికి మించి ఆమెకెదురైన మరో పెద్ద సవాల్ పోలీసు వేధింపులు. ఒక కోయ తెగకు చెందిన అమ్మాయి విద్యాధికురాలిగాఉండటం,ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెపై మావోయిస్టు ముద్ర వేశారు. ఈ క్రమంలో పలురకాలు వేధింపులు ఆమెకు తప్పలేదు. ఆ వేధింపులను కూడా జయంతి ధైర్యంగా ఎదుర్కొంది. ఎక్కడా కూడా తాను తలొగ్గలేదు. జయంతి సాహాసానికి పోలీసులు సైతం వెనుకంజ వేయాల్సి వచ్చింది. జయంతి కేవలం జర్నలిస్టుగా మాత్రమే కాక, గిరిజన సమాజంలోని బాలికలు చదువుకునేందుకు ఒక ఎన్జీవోను సైతం నిర్వహిస్తోంది. ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద అవకాశాలే ఆమె ముందు వచ్చి వాలినప్పటికీ, తాను మాత్రం తన గిరిజన కమ్యూనిటీలోనే తొలి మహిళా జర్నలిస్టుగా సేవలందిస్తోంది. ఒకవేళ తను కనుక ఇక్కడ పనిచేయకపోతే, తన చదువుకు సార్థకమే లేదని అంటోంది జయంతి. - కె. శ్రావణి రెడ్డి -
పట్టు ఉండాలి
పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వడం అంటే వారి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను నుంచి మనం తప్పించుకోవడమే. మనిషికి దేవుడు ఏదైనా కఠిన పరీక్ష పెట్టాడూ అంటే, అది పిల్లల విషయంలోనే అయి ఉంటుంది. ఈ ఉద్యోగాలు, లోకంతో నెగ్గుకు రావడం.. ఇవన్నీ కూడా పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నాలతో పోల్చి చూస్తే చాలా చిన్నవిగా అనిపిస్తాయి. పిల్లల ఆరోగ్యం, చదువులు, వారి అభివృద్థి, భవిష్యత్తు.. ఈ ఆలోచనలతోనే మనిషి జీవితం గడిచిపోతుంది. అరిజోనాలోని ఆర్మే స్కూల్ నుంచి ఒక రోజు రొనాల్డ్ రీగన్కు కంప్లైంట్ వచ్చింది. మీ అమ్మాయి స్మోక్ చేస్తోందనీ, స్కూల్ రూల్స్ ఫాలో అవడం లేదనీ! అలాంటి ఫిర్యాదే పిల్లల్లో ఆఖరివాడి గురించి కూడా ఆ తర్వాత కొన్నేళ్లకు వచ్చింది. ‘మీ అబ్బాయికి ఫ్రెంచిలో సి గ్రేడ్, ఆల్జీబ్రాలో డి గ్రేడు వచ్చింది. మాతో పాటు మీరు కూడా కేర్ తీసుకోవాలి’ అని. రీగన్ కన్ఫ్యూజన్లో పడిపోయాడు. అప్పటికింకా ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి రాలేదు. రెండు సందర్భాల్లోనూ పిల్లల్ని దగ్గర కూర్చొబెట్టుకుని మాట్లాడాడు. కానీ అతడికి అపనమ్మకం.. తన మాట వింటారా అని. అలాగే చాలాసార్లు ఆయన డైలమాలో పడేవారు. ‘‘పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకు తెలిసిన పద్ధతులు... చెయ్యిపట్టి నడిపించడం లేదా నీ దారి నువ్వు వెతుక్కొమ్మని చెయ్యి వదిలేయడం! చెయ్యిపట్టి ఎక్కడికి నడిపిస్తాం? మనం వచ్చిన దారిలో, మనకు తెలిసిన దారిలోనే కదా. ఈ ‘స్టేజ్ డైరెక్షన్’లో పిల్లలకు కనీసం ఉండవలసిన స్వేచ్ఛ ఎక్కడో జారిపోతుంది. ఇక.. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వడం అంటే వారి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యతను నుంచి మనం తప్పించుకోవడమే. జారిపోయిన పిల్లల స్వేచ్ఛకు, తప్పించుకున్న పెద్దల బాధ్యతకు జీవితం ఎక్కడో ఒక చోట నిలబెట్టి మరీ మూల్యం అడుగుతుంది. నిర్లక్ష్యం, మూల్యం అన్నవి పిల్లల వయసుకు అర్థం కానివి! అర్థమయ్యేలా చెప్పకపోతే వారిని జీవితాంతం బాధపెట్టేవి!! మరెలా?’’ అని రీగన్ తన భార్యతో దీర్ఘ సంభాషణ చేసేవారు. ఆయన భార్య నాన్సీ మాత్రం.. పిల్లల్ని పట్టుకునే నడిపించాలి అనేవారు. ఆమె మాటే నిజం అనిపిస్తుంటుంది. (నేడు రొనాల్డ్ రీగన్ జయంతి) -
పటేల్ జయంతిని ఘనంగా జరపండి: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని ఈ నెల 31న ఘనంగా నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆ రోజున రాజధాని ఢిల్లీలో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ‘ఐక్యతా పరుగు’ను ఆయన ప్రారంభిస్తారని ఓ అధికారి వెల్లడించారు. ‘సర్దార్ పటేల్ జయంతి రోజున ప్రతిజ్ఞ చేయించి, ఐక్యతా పరుగును నిర్వహించాల్సిందిగా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులకు లేఖలు రాశారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు పరుగులో పాల్గొనేలా చూడాలని రాజ్‌నాథ్ లేఖలో కోరారు’ అని ఆ అధికారి చెప్పారు. ఢిల్లీలో 1.5 కి.మీ. సాగే ఈ పరుగులో పీవీ సింధు, మిథాలీరాజ్ తదితర క్రీడా ప్రముఖులు పాల్గొననున్నారు.